ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం.
మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.
జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:
నక్షత్రం | నక్షత్రాధిపతి | అధిదేవత | గణము | జాతి | జంతువు | పక్షి | వృక్షము | రత్నం | నాడి | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|---|
అశ్విని | కేతువు | అశ్వినీదేవతలు | దేవగణము | పురుష | గుర్రము | గరుడము | అడ్డసరం,విషముష్టి,జీడిమామిడి | వైడూర్యం | ఆదినాడి | 4మేషము |
భరణి | శుక్రుడు | యముడు | మానవగణము | స్త్రీ | ఏనుగు | పింగళ | దేవదారు,ఉసిరిక | వజ్రము | మధ్యనాడి | 4మేషరాశి |
కృత్తిక | సూర్యుడు | అగ్ని | రాక్షసగణము | పురుష | మేక | కాకము | బెదంబర,అత్తి | కెంపు | అంత్యనాడి | 1మేషము-2-4వృషభం |
రోహిణి | చంద్రుడు | బ్రహ్మ | మానవగణము | పురుష | సర్పం | కుకుటము | జంబు, (నేరేడు ) | ముత్యం | అంత్యనాడి | 4వృషభం |
మృగశిర | కుజుడు | చంద్రుడు | దేవగణం | ఉభయ | సర్పం | మయూరము | చండ్ర,మారేడు | పగడం | మధ్యనాడి | 2వృషభం2మిధునం |
ఆరుద్ర | రాహువు | రుద్రుడు | మానవగణం | పురుష | శునకం | గరుడము | రేల,చింత | గోమేధికం | ఆదినాడి | 4మిధునం |
పునర్వసు | గురువు | అధితి | దేవగణం | పురుష | మార్జాలం (పిల్లి) | పింగళ | వెదురు,గన్నేరు | కనక పుష్యరాగం | ఆదినాడి | 1-3మిధునం4కర్కాటకం |
పుష్యమి | శనిగ్రహం | బృహస్పతి | దేవగణం | పురుష | మేక | కాకము | పిప్పిలి | నీలం | మధ్యనాడి | 4కర్కాటకం |
ఆశ్లేష | బుధుడు జ్యోతిషం | సర్పము | రాక్షసగణం | స్త్రీ | మార్జాలం | కుకుటము | నాగకేసరి,సంపంగి,చంపక | పచ్చ | అంత్యనాడి | 4కర్కాటకం |
మఖ | కేతువు | పితృదేవతలు | రాక్షసగణం | పురుష | మూషికం | మయూరము | మర్రి | వైడూర్యం | అంత్యనాడి | 4సింహరాశి |
పూర్వఫల్గుణి | శుక్రుడు | భర్గుడు | మానవసగణం | స్త్రీ | మూషికం | గరుడము | మోదుగ | వజ్రం | మధ్యనాడి | 4సింహం |
ఉత్తర | సూర్యుడు | ఆర్యముడు | మానవగణము | స్త్రీ | గోవు | పింగళ | జువ్వి | కెంపు | ఆదినాడి | 1సింహం3-4కన్య |
హస్త | చంద్రుడు | సూర్యుడు | దేవగణం | పురుష | మహిషము | కాకము | కుంకుడు,జాజి | ముత్యం | ఆదినాడి | 4కన్య |
చిత్త | కుజుడు | త్వష్ట్ర విశ్వకర్మ | రాక్షసగణం | వ్యాఘ్రం (పులి) | కుకుటము | తాటిచెట్టు,మారేడు | పగడం | మధ్యనాడి | 2కన్య2తుల | |
స్వాతి | రాహువు | వాయు దేవుడు | దేవగణం | మహిషి | మయూరము | మద్ది | గోమేధికం | అంత్యనాడి | 4తుల | |
విశాఖ | గురువు | ఇంద్రుడు,అగ్ని | రాక్షసగణం | స్త్రీ | వ్యాఘ్రము (పులి) | గరుడము | నాగకేసరి,వెలగ,మొగలి | కనక పుష్యరాగం | అంత్యనాడి | 1-3తుల4వృశ్చికం |
అనూరాధ | శని | సూర్యుడు | దేవగణం | పురుష | జింక | పింగళ | పొగడ | నీలం | మధ్యనాడి | 4వృశ్చికం |
జ్యేష్ట | బుధుడు | ఇంద్రుడు | రాక్షసగణం | ... | లేడి | కాకము | విష్టి | పచ్చ | ఆదినాడి | 4వృశ్చికం |
మూల | కేతువు | నిరుతి | రాక్షసగణం | ఉభయ | శునకం | కుకుటము | వేగిస | వైడూర్యం | ఆదినాడి | 4ధనస్సు |
పూర్వాఆషాఢ | శుక్రుడు | గంగ | మానవగణం | స్త్రీ | వానరం | మయూరము | నిమ్మ,అశోక | వజ్రం | మధ్యనాడి | 4ధనస్సు |
ఉత్తరాషాఢ | సూర్యుడు | విశ్వేదేవతలు | మానవగణం | స్త్రీ | ముంగిస | గరుడము | పనస | కెంపు | అంత్యనాడి | 1ధనస్సు2-4మకరం |
శ్రవణము | చంద్రుడు | మహావిష్ణువు | దేవగణం | పురుష | వానరం | పింగళ | జిల్లేడు | ముత్యం | అంత్యనాడి | 4మకరం |
ధనిష్ఠ | కుజుడు | అష్టవసుడు | రాక్షసగణం | స్త్రీ | సింహము | కాకము | జమ్మి | పగడం | మధ్యనాడి | 2మకరం2కుంభం |
శతభిష | రాహువు జ్యోతిషం | వరుణుడు | రాక్షసగణం | ఉభయ | అశ్వం (గుర్రం)Kకుకుటము | అరటి,కడిమి | గోమేధికం | ఆదినాడి | 4కుంభం | |
పూర్వాభద్ర | గురువు | అజైకపాదుడు | మానవగణం | పురుష | సింహం | మయూరము | మామిడి | కనక పుష్యరాగం | ఆదినాడి | 3కుంభం1మీనం |
ఉత్తరాభద్ర | శని | అహిర్పద్యువుడు | మానవగణం | పురుష | గోవు | మయూరము | వేప | నీలం | మధ్యనాడి | 4మీనం |
రేవతి | బుధుడు | పూషణుడు | దేవగణం | స్త్రీ | ఏనుగు | మయూరము | విప్ప | పచ్చ | అంత్యనాడి | 4మీనం |
నామం | 1 పాదం | 2 పాదం | 3 పాదం | 4 పాదం |
---|---|---|---|---|
అశ్విని | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
భరణి | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
కృత్రిక | గురువు | శని | శని | గురువు |
రోహిణి | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
మృగశిర | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
ఆరుద్ర | గురువు | శని | శని | గురువు |
పునర్వసు | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
పుష్యమి | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
ఆశ్లేష | గురువు | శని | శని | గురువు |
మఖ | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
పూర్వఫల్గుణి | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
ఉత్తరఫల్గుణి | గురువు | శని | శని | గురువు |
హస్త | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
చిత్త | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
స్వాతి | గురువు | శని | శని | గురువు |
విశాఖ | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
అనూరాధ | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
జ్యేష్ఠ | గురువు | శని | శని | గురువు |
మూల | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
పూర్వాషాఢ | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
ఉత్తరాషాఢ | గురువు | శని | శని | గురువు |
శ్రవణం | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
ధనిష్ఠ | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
శతభిష | గురువు | శని | శని | గురువు |
పూర్వాభద్ర | కుజుడు | శుక్రుడు | బుధుడు | చంద్రుడు |
ఉత్తరాభద్ర | రవి | బుధుడు | శుక్రుడు | కుజుడు |
రేవతి | గురువు | శని | బుధుడు | గురువు |
నక్షత్రములు | 1వ పాదం | 2వ పాదం | 3వ పాదం | 4వ పాదం |
---|---|---|---|---|
అశ్వని | శిశువునకు,తండ్రికి | దోషంలేదు | దోషంలేదు | సామాన్యదోషం |
భరణి | సామాన్యదోషం | దోషంలేదు | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | శిశువునకు |
కృత్తిక | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | తల్లికి |
రోహిణి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తల్లికి | మేనమామకు,తండ్రికి |
మృగశిర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
ఆరుద్ర | మంచిది | మంచిది | మంచిది | తల్లికి |
పునర్వసు | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
పుష్యమి | సామాన్యదోషం | పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి | పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి | సామాన్యదోషం |
ఆశ్లేష | దోషంలేదు | శిశువునకు,ధనమునకు | తల్లికి | తండ్రికి |
మఖ | శిశువుకు,తండ్రికి | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
పూర్వఫల్గుణి | మంచిది | మంచిది | మంచిది | తల్లికి |
ఉత్తరఫల్గుణి | మగ-తండ్రికి | మంచిది | మంచిది | మగ-తండ్రికి |
హస్త | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
చిత్త | మగ-తండ్రికి | తండ్రికి | తండ్రికి | సామాన్యదోషం |
స్వాతి | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
విశాఖ | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-బావమరది,ఆడ-మరదలు | మగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు |
అనూరాధ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
జ్యేష్ట | సౌఖ్యహాని,తల్లికి | సోదరులకు,మేనమామకు | శిశువుకు,తల్లికి,పెదతండ్రికి | తండ్రికి,అన్నకు |
మూల | తండ్రికి | తల్లికి | ధనమునకు | మంచిది |
పూర్వాషాఢ | మంచిది | మంచిది | మగ-తండ్రికి,ఆడ-తల్లికి | మంచిది |
ఉత్తరాషాఢ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
శ్రవణం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
ధనిష్ఠ | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
శతభిషం | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
పూర్వాభద్ర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
ఉత్తరాభద్ర | మంచిది | మంచిది | మంచిది | మంచిది |
రేవతి | మంచిది | మంచిది | మంచిది | తండ్రికిదోషం |
వివాహాది శుభకార్యాల నిమిత్తం వేళ్ళేటప్పుడు. కొన్ని ముఖ్యమైన కార్యాలు చేసే సమయంలో ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తారాబలం చూస్తారు. తొమ్మిది రకాల ఫలితాలు ఉంటాయి. వీటిని వరుసగా తొమ్మిది రోజులకు అన్వయించి చూసుకుంటారు. ఒక్కొక విభాగంలో తొమ్మిది నక్షత్రాల లెక్కన మూడు విభాలు ఉంటాయి.నక్షత్రాలు వాటి ఫలితాలు వరుసగా ! ఈక్రింది పట్టికలో చూడ వచ్చు.
తారలు | జన్మతార | సంపత్తార | విపత్తార | క్షేమతార | ప్రత్యక్ తార | సాధన తార | నైధన తార | మిత్ర తార | పరమ మిత్ర తార | దినాధిపతి | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అశ్విని మఖ మూల | అశ్విని మఖ మూల | భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్త ధనిష్ఠ | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష జ్యేష్ట రేవతి | శని | శారీరక శ్రమ |
భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్త ధనిష్ఠ | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష జ్యేష్ట రేవతి | అశ్విని మఖ మూల | గురువు | ధనలాభం |
కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్త ధనిష్ఠ | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష జ్యేష్ట రేవతి | అశ్విని మఖ మూల | భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కుజుడు | కార్యహాని |
రోహిణి హస్త శ్రవణం | రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్త ధనిష్ఠ | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష- జ్యేష్ట- రేవతి | అశ్విని-మఖ-మూల | భరణి- పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రవి | క్షేమం |
మృగశిర చిత్త ధనిష్ఠ | మృగశిర చిత్త ధనిష్ఠ | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష జ్యేష్ట రేవతి | అశ్విని మఖ మూల | భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రోహిణి హస్త శ్రవణం | రాహువు | ప్రయత్న భంగం |
ఆర్ద్ర స్వాతి శతభిష | ఆర్ద్ర స్వాతి శతభిష | పునర్వసు విశాఖ పూర్వాభద్ర | పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర | ఆశ్లేష జ్యేష్ట రేవతి | అశ్విని మఖ మూల | భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ | కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ | రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్త ధనిష్ఠ | శుక్రుడు | కార్య సాధన |
పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర | పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర | పుష్యమి-అనూరాధ- ఉత్తరాభద్ర | ఆశ్లేష- జ్యేష్ట- రేవతి | అశ్విని- మఖ- మూల | భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ | కృత్తిక- ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ | రోహిణి- హస్త- శ్రవణం | మృగశిర- చిత్త- ధనిష్ఠ | ఆర్ద్ర- స్వాతి- శతభిష | కేతువు | బంధనం |
పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర | పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర | ఆశ్లేష- జ్యేష్ట- రేవతి | అశ్విని- మఖ- మూల | భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ | కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ | రోహిణి- హస్త- శ్రవణం | మృగశిర- చిత్త- ధనిష్ఠ | ఆర్ద్ర- స్వాతి- శతభిష | పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర | చంద్రుడు | సుఖం |
ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి | ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి | అశ్విని- మఖ- మూల | భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ | కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ | రోహిణి- హస్త- శ్రవణం | మృగశిర- చిత్త- ధనిష్ఠ | ఆర్ద్ర- స్వాతి- శతభిష | పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర | పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర | బుధుడు | సుఖం, లాభం |
తారలు | తార నామం | దినాధిపతి | ఫలితం |
---|---|---|---|
1వ తార | జన్మ తార | శని | శరీర శ్రమ |
2వ తార | సంపత్తార | గురువు | ధనలాభం |
3వ తార | విపత్తార | కుజుడు | కార్యహాని |
4వ తార | క్షేమ తార | సూర్యుడు | క్షేమం |
5వ తార | ప్రత్యక్ తార | రాహువు | ప్రయత్న భంగం |
6వ తార | సాధన తార | శుక్రుడు | కార్యసిద్ధి, శుభం |
7వ తార | నైత్య తార | కేతువు | బంధనం |
8వ తార | మిత్ర తార | చంద్రుడు | సుఖం |
9వ తార | అతి మిత్ర తార | బుధుడు | సుఖం, లాభం |
This article uses material from the Wikipedia తెలుగు article నక్షత్రం (జ్యోతిషం), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.