నందిని సత్పతీ

నందిని సత్పతీ (1931 జూన్ 9 – 2006 ఆగస్టు 4), భారతీయ రాజకీయ నాయకురాలు, రచయిత.

జూన్ 1972 నుంచి డిసెంబరు 1976 వరకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఆమె.

తొలినాళ్ళ జీవితం

1931 జూన్ 9న జన్మించిన నందిని, కటక్లోని పిఠాపుర్ లో పెరిగారు. కలిండి చరణ్ పాణిగ్రాహి పెద్ద కుమార్తె నందిని. ఆమె బాబాయ్ భగవతీ చరణ్ పాణిగ్రాహి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఒడిశా శాఖను స్థాపించారు.

రాజకీయ జీవితం

రావెన్షా కళాశాలలో ఒడియాలో ఆర్ట్స్ లో మాస్టర్స్ చదివేటప్పుడు, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి శాఖ  అయిన స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1951లో కళాశాల విద్యకు రుసుములు పెరిగిన నేపథ్యంలో ఒడిశాలో విద్యార్థులు నిరసన ఉద్యమం ప్రారంభించారు. ఆ తరువాత అది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమానికి నందిని నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమెపై లాఠీ చార్జి కూడా జరిగింది. మిగిలిన ఆందోళనకారులతో పాటు నందినిని కూడా జైలులో పెట్టారు. అక్కడే మరో విద్యార్థి నాయకుడు దేవేంద్ర సత్పతీని కలిశారు ఆమె. తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. దేవేంద్ర ధేన్కనల్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎంపిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.నందిని సత్పతి 1962 లో రాజ్యసభలో ప్రవేశించారు .1966 లో ఇందిరా గాంధీ ప్రధాని అయిన తరువాత, నందిని సత్పతిని కెంద్ర సమాచార, ప్రసార ఉప మంత్రిగా, తదుపరి మంత్రిగా నియమించింది.నందిని సత్పతిని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ యొక్క రాజకీయములొ కుడి భుజం గా భావిస్తారు. బిజు పట్నాయక్ మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించిన కారణంగా 1972 లో నందిని సత్పతిని ఒడిశాకు తిరిగి వచ్చి, ముఖ్యమంత్రి ( జూన్ 1972 నుండి 1976 డిసెంబర్వ) అయ్యారు ఆమె ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన రెండవ మహిళ. నందిని సత్పతిని ‘ఐరన్ లేడీ ఆఫ్ ఒడిశా’ అని పిలిచేవారు. నందిని సత్పతి రాజకీయాలే గాక ఒక రచయిత .ఆమె తస్లిమా నస్రీన్ నవల లజ్జాను ఒడియాలోకి అనువదించింది. ఇది ఆమె చేసిన ప్రధాన సాహిత్య రచన. నందిని సత్పతి సాహిత్య రచనలు ఇతర భాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఓడియా సాహిత్యానికి ఆమె చేసిన కృషికి, ఆమె కు 1998 లో సాహిత్య భారతి సమ్మన్ అవార్డును అందుకుంది

నందిని సత్పతి ముఖ్యమంత్రిగా ఒడిశా రాష్ట్ర అభివృద్ధి కి ఎంతో కృషిచేశారు . ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఆమె రాజకీయ జీవితంలో కష్టతరమైన సవాలు. రాజకీయ నాయకులు నబకృష్ణ చౌదరి, రామదేవి అరెస్టు చేయడంతో ఆమె విమర్శలు ఎదుర్కొంది. ఈ అల్లకల్లోల సమయంలో ఆమె చేసిన మితిమీరిన చర్యలకు ఆమె ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె చేసిన పనితీరు దాదాపు ప్రతి రంగంలోనూ వృద్ధిని సాధించింది. ముఖ్యంగా, మహిళల సాధికారత, గ్రామీణ వృద్ధి, కళ ,సంస్కృతి ,విద్య వంటి రంగాలలో, ఆమె విశేషమైన చర్యలు తీసుకుంది, ఇది నేటి వరకు ప్రజల జ్ఞాపకాలలో ఇప్పటి వరకు మరవలేనిది పరిశీకులు పేర్కొంటారు. రైతులు లేదా వ్యవసాయదారులు కాని భూములను తమ ఆధీనంలో ఉంచిన కొద్దిమంది వ్యక్తుల చేతుల నుండి భూములను విడిపించే ప్రత్యేకమైన భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావడం ఒక చరిత్ర గా ఒడిశా రాష్ట్ర ప్రజలలో మిగిలి పోతుంది. తన యాభై-ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో, ఆమె ఎన్నికలలో ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోలేదు. ఎన్నికలలో ఆమె నలుగురు మాజీ ముఖ్యమంత్రులతో పోరాడి వారందరినీ ఓడించింది

మూలాలు

Tags:

ఒడిశా

🔥 Trending searches on Wiki తెలుగు:

రక్తనాళాలుయూనికోడ్నామనక్షత్రములావు రత్తయ్యలలితా సహస్ర నామములు- 201-300ఆరోగ్యంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డినువ్వుల నూనెఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపుష్యమి నక్షత్రమునన్నయ్యరోహిణి నక్షత్రంభాషడోడెకేన్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంసీ.ఎం.రమేష్డి. కె. అరుణతెలుగు శాసనాలుఆంధ్రప్రదేశ్ మండలాలుతెలుగు నాటకరంగంవిష్ణు సహస్రనామ స్తోత్రముతెలుగులో అనువాద సాహిత్యంభారతదేశ చరిత్రఆశ్లేష నక్షత్రముబోయింగ్ 747జవహర్ నవోదయ విద్యాలయంకుప్పం శాసనసభ నియోజకవర్గంపార్శ్వపు తలనొప్పిరెడ్డిభారత రాజ్యాంగ ఆధికరణలువిశాఖపట్నందీపావళిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్కందుకూరి వీరేశలింగం పంతులుసునాముఖిభారత రాజ్యాంగ సవరణల జాబితావేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఇన్‌స్టాగ్రామ్కొణతాల రామకృష్ణపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రకృతి - వికృతిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగౌడఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారాశిపంచభూతలింగ క్షేత్రాలుకర్ణాటకయాదవశేఖర్ మాస్టర్సుందర కాండ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురేవతి నక్షత్రంతిరుమల చరిత్రశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణఇండియా గేట్రక్తపోటునామవాచకం (తెలుగు వ్యాకరణం)తిరుపతిమాధవీ లతఅలంకారంభగవద్గీతశాసనసభ సభ్యుడుపునర్వసు నక్షత్రముపల్లెల్లో కులవృత్తులుతోలుబొమ్మలాటవృషభరాశిపర్యాయపదంచైత్రమాసముశోభితా ధూళిపాళ్లసీతాదేవిజనసేన పార్టీచతుర్యుగాలురాబర్ట్ ఓపెన్‌హైమర్ధనిష్ఠ నక్షత్రముఉత్తర ఫల్గుణి నక్షత్రముతాటి ముంజలుచంపకమాల🡆 More