జ్వరం

శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం (ఆంగ్లం: Fever) అంటారు.

దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ (జ్వరమాపకం) ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్‌ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీస్‌ ఫారిన్‌ హీట్‌ దాటితే మన శరీరంలో ఇన్‌ఫెక్షన్‌తో అంతర్యుద్ధం కొనసాగుతున్నదన్నమాట.

Fever
జ్వరం
An analog medical thermometer showing a temperature of 38.7 °C or 101.7 °F
ICD-10R50
ICD-9780.6
DiseasesDB18924
eMedicinemed/785
MeSHD005334

జ్వరం రావడానికి కారణాలు

జబ్బు చేస్తే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే వ్యాధితో పోరాడటానికి శరీరంలో హెచ్చు ఉష్ణోగ్రత మేలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు శరీరంలో విడుదలయ్యే హార్మోనులు, ఎంజైములు లాంటి రసాయనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధితో పోరాటానికి పనికి వస్తాయి. అలాగే రక్త కణాలు అధికంగా విడుదలవుతాయి. వ్యాధి క్రిములను నాశనం చేయడానికి ఇవి అవసరం. రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఊపిరి వేగం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు (టాక్సీన్లు) తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. కానీ శరీరం ఎక్కువసేపు వేడిగా ఉంటే మనకు బలాన్ని ఇచ్చే మాంస కృతులు (ప్రొటీన్లు) నాశనం అవుతాయి. అందువల్ల మనిషి నీరసిస్తాడు. జ్వరానికి విశ్రాంతి అవసరం.

  1. జలుబూ, రొంప, పడిశెం లేదా ఫ్లూ (అల్లము రసము, తెనె, పిప్పులు రసము)
  2. చెవిపోటు
  3. బ్రాంఖైటిస్‌
  4. నోటిపూత
  5. మూత్రకోశానికీ, మూత్రనాళాల వ్యాధులు.
  6. మానసిక ఒత్తిడి, ఆవేదన, శోకం వంటివి
  7. నూలుదుస్తులు ధరించేవాళ్లు, పండక్కి కొత్తపాలిస్టర్ బట్టలు కట్టుకున్నా
  8. రుతుక్రమం సమయంలో, వ్యాయామాలు అతిగా చేసినా, కొన్ని మందులు మోతాదుకు మించి వాడినా

రకాలు

చికిత్స

జ్వరం 101 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ కన్నా తక్కువగా వుంటే, ప్రత్యేకమైన వైద్యం అవసరం లేదు. పుష్కలంగా పానీయాలు సేవిస్తే చాలు. జ్వరాన్ని అదుపు చెయ్యడానికి 'అస్పిరిన్‌' ఎసిటామినో ఫెన్‌, ఐబూప్రొఫేన్‌ వంటివి తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో స్నానం చేసినా శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. జ్వరం 103 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ దాటి, 2 గంటల కంటే ఎక్కువసేపు ఉన్నా, వచ్చి 2 రోజులు దాటినా, టెంపరేచర్‌ 105 డిగ్రీస్‌ ఫారిన్‌హీట్‌ దాటినా, వైద్యుడిని సంప్రదించాలి.

సాధారణంగా జ్వరానికి చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జలుబు లేదా 'సర్ది' తో జ్వరం వస్తే పాలల్లో మిరియాలు మరిగించి తాగి విశ్రాంతి తీసుకొమ్మని చిట్కా ఇస్తారు.

మూలాలు

Tags:

జ్వరం రావడానికి కారణాలుజ్వరం రకాలుజ్వరం చికిత్సజ్వరం మూలాలుజ్వరంఆంగ్లంఉష్ణమాపకంఉష్ణోగ్రతజ్వరమాపకంథర్మామీటర్

🔥 Trending searches on Wiki తెలుగు:

లోకేష్ కనగరాజ్త్రిష కృష్ణన్ఖమ్మంఉత్తరాషాఢ నక్షత్రముకార్తీక్ ఘట్టమనేనితెలంగాణ గవర్నర్ల జాబితాపల్నాడు జిల్లాపిత్తాశయముశతభిష నక్షత్రమునగరినయన తారకాటసాని రాంభూపాల్ రెడ్డిమాదిగశాంతిస్వరూప్కొమురం భీమ్అరవింద్ కేజ్రివాల్అమరావతిమానవ శరీరముగోత్రాలువంగా గీతమాధ్యమిక విద్యప్రకటనభీమసేనుడుతెలుగు కథశివ కార్తీకేయన్కాశీఈనాడుసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)మశూచిబెల్లంజీలకర్రపి.వెంక‌ట్రామి రెడ్డిసాక్షి (దినపత్రిక)వినోద్ కాంబ్లీ2024సౌందర్యఋగ్వేదంకేరళబ్రాహ్మణులుసుప్రభాతం (1998 సినిమా)కాళోజీ నారాయణరావుఅర్జునుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితాభామాకలాపం (1988 సినిమా)అష్ట దిక్కులుపాములపర్తి వెంకట నరసింహారావుఅన్నమయ్యయశ్షిర్డీ సాయిబాబాడొక్కా సీతమ్మకొణతాల రామకృష్ణఛందస్సుమాధవీ లతసత్య సాయి బాబాఆదిత్య హృదయంచంద్రుడుఇండియన్ ప్రీమియర్ లీగ్మోదుగకనకదుర్గ ఆలయంమీనరాశిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థదర్శి శాసనసభ నియోజకవర్గంసుడిగాలి సుధీర్తమిళనాడుగోవిందుడు అందరివాడేలేనువ్వు లేక నేను లేనురైతుతెలుగుదేశం పార్టీస్వామి వివేకానందతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఅంగస్తంభన వైఫల్యంకలియుగంఆర్తీ అగర్వాల్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాబేతా సుధాకర్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More