జొరాస్ట్రియన్ మతం

జొరాస్ట్రియన్ (ఆంగ్లం : Zoroastrianism) ఇరాన్ (పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ప్రాచీన మతం.

ఈ మతాన్ని "మజ్దాయిజం" అనికూడా అంటారు. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈ మతంలో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతం ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.

జొరాస్ట్రియన్ మతం
ఫరావహర్, జొరాస్ట్రియన్ మతస్థుల మతపరమైన చిహ్నం
దస్త్రం:An Image from Zarathustra.jpg
జొరాస్త్రమతం

జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే వారిని జొరాస్ట్రియన్లు అని అంటారు. ఈ మతం క్రైస్తవ మతాలకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్ట్రియన్ల మత గ్రంథమైన అవెస్తా (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

చరిత్ర

జొరాస్ట్రియన్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్టర్ (Zoroaster) అను ప్రవక్త. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .

యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడు ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజు చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులు కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు .

పర్యావలోకనం

అథ్యాత్మిక సిద్ధాంతం

జొరాస్ట్రియన్లు విశ్వవ్యాప్త, అతీతమైన, సర్వజన సౌఖ్యం, ఎవరూ సృష్టించని అత్యున్నత సృష్టికర్త దేవత అహురా మాజ్డా ("వైజు లార్డు") ఉన్నాడని విశ్వసిస్తారు. (అహురా అంటే "లార్డు", మాజ్డా అంటే అవెస్టానులో "వివేకం"). జోరాస్టరు రెండు లక్షణాలను రెండు వేర్వేరు భావనలుగా వేరుచేస్తుంది. అయినప్పటికీ కొన్ని సార్లు వాటిని ఒక రూపంలో మిళితం చేస్తుంది. అహురా మాజ్డా సర్వజ్ఞుడు కాని సర్వశక్తిమంతుడు కాదని జోరాస్టరు పేర్కొన్నారు. గాథలలో అహురా మాజ్డా అమేషా స్పెంటా అని పిలువబడే "ఇతర అహురాల" సహాయంతో పనిచేస్తున్నట్లు గుర్తించబడింది. వీరిలో స్రోషా మాత్రమే తరువాతి వర్గానికి చెందిన వాడిగా స్పష్టంగా పేరు పెట్టబడింది.

పండితులు, వేదాంతవేత్తలు జొరాస్ట్రియనిజం, స్వభావం గురించి చాలాకాలంగా చర్చించారు. ద్వంద్వవాదం, ఏకధర్మవాదం, బహుదేవత అనేది మతానికి వర్తించే ప్రధాన పదాలు. కొంతమంది పండితులు జొరాస్ట్రియనిజం దైవత్వం భావన జీవిని, మనస్సును అప్రధానమైన అస్తిత్వాలుగా కప్పిపుచ్చుకుంటుందని, జొరాస్ట్రియనిజాన్ని స్పృహతో ఒక అనంతమైన స్వీయ-సృష్టి విశ్వం చేసిన మీద నమ్మకం ఉందని దాని ప్రత్యేక లక్షణంగా అభివర్ణిస్తుంది. తద్వారా జొరాస్ట్రియనిజం దాని మూలాన్ని భారతీయ బ్రాహ్మణిజంతో పంచుకుంటుంది. అయినప్పటికీ అహురా మాజ్డా నుండి వచ్చిన ప్రధాన ఆధ్యాత్మిక శక్తి అయిన ఆశా, విశ్వ క్రమం, ఇది గందరగోళానికి విరుద్ధం, ఇది డ్రూజుకు సాక్ష్యంగా కనిపిస్తుంది.ఫలితంగా ఏర్పడే విశ్వ వివాదం సృష్టి, మానసిక, ఆధ్యాత్మిక పదార్థాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఇందులో మానవత్వం దాని ప్రధాన భాగంగా ఉంటుంది. ఇది సంఘర్షణలో చురుకైన పాత్ర పోషిస్తుంది.

జొరాస్ట్రియా సాంప్రదాయంలో డ్రూజు ఆంగ్రా మెయిన్యు (తరువాతి గ్రంథాలలో "అహ్రిమాను" అని కూడా పిలుస్తారు). విధ్వంసక ఆత్మ( మనస్తత్వం) నుండి వచ్చింది. అయితే ఈ సంఘర్షణలో ఆశా ప్రధాన ప్రతినిధి సృజనాత్మక ఆత్మ (మనస్తత్వం) అయిన స్పెంటా మెయిన్యు. అహురా మాజ్డా అపారమైన మానవత్వానికి చిహ్నంగా ఉంటుంది. సృష్టిలోని వివిధ కోణాల ప్రతినిధులు, సంరక్షకులు, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన అమేషా స్పెంటా, పవిత్ర అమరత్వం అని పిలువబడుతూ సృష్టితో సంకర్షణ చెందుతుంది. అహురా మాజ్డా ఈ అమేషా స్పెంటా ద్వారా, యాజటాసు అని పిలువబడే అసంఖ్యాక దైవాలు సహాయం చేస్తాయి. దీని అర్థం "ఆరాధనకు అర్హమైనది, ప్రతి ఒక్కటి సాధారణంగా సృష్టి నైతిక లేదా భౌతిక కోణం హైపోస్టాసిసు. జొరాస్ట్రియను కాస్మోలజీ ఆధారంగా అహునా వైర్యాను వ్యక్తీకరించడంలో అహురా మాజ్డా అంగ్రా మెయిన్యుకు వ్యతిరేకంగా అంతిమ విజయాన్ని సాధించింది. మంచిని రక్షించే అహురా మాజ్డా చివరికి చెడు అయిన అంగ్రా మెయిన్యు మీద విజయం సాధిస్తాడు. ఈ సమయంలో రియాలిటీ ఫ్రషోకెరెటి అని పిలువబడే విశ్వ పునర్నిర్మాణానికి లోనవుతుంది. అంతిమ పునర్నిర్మాణం, సృష్టి అంతా-ముందు బహిష్కరించబడిన "చీకటి" లోకి దిగడానికి ఎంచుకున్న చనిపోయినవారి ఆత్మలు కూడా-క్షత్ర వైర్య (అంటే "ఉత్తమ ఆధిపత్యం") లో అహురా మాజ్డాతో తిరిగి కలుస్తాయి. అమరత్వానికి పునరుత్థానం చేయబడింది. మధ్య పర్షియా సాహిత్యంలో ప్రముఖ విశ్వాసం ఏమిటంటే సమయం ముగిసే సమయానికి సాష్యాంటు (ఫ్రాషోకెరెట్టి రక్షకుడిని)ను తీసుకువస్తాడు. అయితే గాతికు గ్రంథాలలో మజ్దయస్నా విశ్వాసులందరినీ సూచించడానికి సాష్యంతు ("ప్రయోజనాన్ని తెచ్చేవాడు" అని అర్ధం)అనే పదం ఉపయోగించబడుతుంది. కాని తరువాత రచనలలో మెస్సియానికు భావనగా మార్చబడింది.

జొరాస్ట్రియా వేదాంతశాస్త్రంలో మంచి ఆలోచనలు, మంచి పదాలు, మంచి పనుల చుట్టూ తిరిగే ఆశాను అనుసరించే ప్రాముఖ్యత ఉంది. దాతృత్వం ద్వారా సంతోషాన్ని వ్యాపింపజేయడాని కూడా అధిక ప్రాధాన్యత, స్త్రీపుషుల ఆధ్యాత్మిక సమానత్వం, విధిని గౌరవించడానికి ప్రాధాన్యత ఉంది. ప్రకృతి, దాని అంశాల రక్షణ, పూజలను జొరాస్ట్రియనిజం నొక్కిచెప్పడం కొంతమంది దీనిని "ప్రపంచంలోని మొదటి పర్యావరణ ప్రతిపాదకుడు" గా ప్రకటించటానికి దారితీసింది. అవెస్టా, ఇతర గ్రంథాలు నీరు, భూమి, అగ్ని, గాలిని రక్షించమని పిలుపుపునిస్తాయి. దీని ఫలితంగా, పర్యావరణ మతం: "మాజ్డాయిజం ... మొదటి పర్యావరణ మతం అని పిలువబడటం ఆశ్చర్యం కలిగించదు. యజతాలకు గౌరవం (దైవ ఆత్మలు) ప్రకృతి సంరక్షణను నొక్కి చెబుతున్నాయి (అవెస్టా: యస్నాలు 1.19, 3.4, 16.9; యష్టులు 6.3–4, 10.13). ప్రారంభ జొరాస్ట్రియన్లు "చెడు" జాతులను నిర్మూలించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ఆధునిక జొరాస్ట్రియనిజంలో ఈ విధానం త్రీసివేయబడడంతో ఈ వాదనను బలహీనంపడింది.

అభ్యాసాలు

జొరాస్ట్రియన్ మతం 
8 వ శతాబ్ధానికి చెందిన చైనా క్లేతో చేయబడిన తాంగు రాజవంశానికి చెందిన సాగ్డియా మానవుడు. ధరించిన తలపాగా, ముసుగు ఈయన ఒంటె మీద స్వరీచేసే వీరుడు కానీ, ఆలయంలో అగ్నికార్యం నిర్వహిస్తున్న జోరాష్ట్రియను పురోహితుడు కాని అయి ఉండవచ్చు అని భావిస్తున్నారు. నోటి నుండి స్రవించే లాలాజలం కారణంగా అగ్ని అపవిత్రం కాకుండా ఉండడానికి ముసుగు ధరిస్తారు. ఇది ఇటలీలోని " మ్యూజియం ఆఫ్ ఓరియంటలు ఆర్టు (టురిను)

మంచి ఆలోచనలు, మంచి పదాలు, మంచి పనుల ద్వారా, నైతికంగా జీవించడం ఆనందాన్ని అధికరించి గందరగోళం నివారించడం అవసరం అని మతం పేర్కొంది. జోరాస్టరు స్వేచ్ఛా సంకల్పం, జొరాస్ట్రియనిజం భావనలో ఈ క్రియాశీల ప్రక్రియలో పాల్గొనడం ఒక ప్రధాన అంశం. ఇది సన్యాసం యొక్క తీవ్ర రూపాలను తిరస్కరిస్తూ చారిత్రాత్మకంగా ఈ భావనల మితమైన వ్యక్తీకరణలకు అనుమతించింది.

జొరాస్ట్రియా సాంప్రదాయంలో జీవితం ఒక తాత్కాలిక స్థితి దీనిలో ఆశా, డ్రూజు మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఒక మానవుడు చురుకుగా పాల్గొంటాడు. పుట్టడానికి ముందు ఒక వ్యక్తి ఉర్వాను (ఆత్మ) పుట్టిన తరువాత కూడా దాని ఫ్రావాషి (ఉన్నత ఆత్మ) తో ఐక్యంగా ఉంటుంది. ఇది అహురా మాజ్డా విశ్వాన్ని సృష్టించినప్పటి నుండి ఉనికిలో ఉంది. ఉర్వాను విడిపోవడానికి ముందు ఉన్న ఫ్రావాషి అహురా మాజ్డాతో సృష్టి నిర్వహణకు సహాయంగా పనిచేస్తుంది. జీవితకాలంలో ఫ్రావాషి ఆకాంక్షాత్మక భావనలు, ఆధ్యాత్మిక రక్షకులు, రక్తసంబంధమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పూర్వీకులు, వీరుల ఫ్రావాషిని పూజిస్తూ అవసరమైన సమయాలలో సహాయం కోసం పిలుస్తారు. మరణం తరువాత నాల్గవ రోజున ఉర్వాను దాని ఫ్రావాషితో తిరిగి కలుస్తుంది. దీనిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో నిరంతర యుద్ధం కోసం భౌతిక ప్రపంచంలో జీవిత అనుభవాలు సేకరించబడతాయి. చాలా వరకు జొరాస్ట్రియనిజానికి పునర్జన్మ అనే భావన లేదు. భారతదేశంలో ఇల్ము-ఎ-క్ష్నూం అనుచరులు పునర్జన్మ, శాకాహారాన్ని ఆచరిస్తున్నారు. అయినప్పటికీ జొరాస్ట్రియనిజం చరిత్రలో శాఖాహారానికి మద్దతు ఇచ్చే వివిధ వేదాంత ప్రకటనలతో జోరాస్టరు శాఖాహారం అని పేర్కొన్నారు.


జొరాస్ట్రియనిజంలో నీరు (అబాను), అగ్ని (అటారు) కర్మ స్వచ్ఛతకు ప్రతినిధులు. అనుబంధ శుద్దీకరణ వేడుకలు కర్మ జీవితానికి ఆధారంగా ఉంటాయి. జొరాస్ట్రియా కాస్మోగోనీలో, నీరు, అగ్ని వరుసగా సృష్టించబడిన రెండవ, చివరి ఆదిమ అంశాలుగా ఉంటాయి నీరు తనలో అగ్ని దాని మూలాన్ని కలిగి ఉందని గ్రంథం భావిస్తుంది. నీరు, అగ్ని రెండూ జీవనాధారంగా పరిగణించబడతాయి. నీరు, అగ్ని రెండూ అగ్ని ఆలయం పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తాయి. జొరాస్ట్రియన్లు సాధారణంగా ఏదో ఒక రకమైన అగ్ని సమక్షంలో ప్రార్థిస్తారు (ఇది ఏ కాంతి వనరులోనైనా స్పష్టంగా పరిగణించవచ్చు). ప్రధాన ఆరాధన ముగింపు కర్మ "జలాల బలోపేతం" గా ఉంటుంది. అగ్నిని ఒక మాధ్యమంగా పరిగణిస్తారు. దీని ద్వారా ఆధ్యాత్మిక అంతర్దృష్టి, జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానానికి మూలంగా నీరు పరిగణించబడుతుంది. అగ్ని, నీరు రెండూ కూడా యజతాసు అటారు, అనాహితగా హైపోస్టాసైజు చేయబడ్డాయి. ఇవి శ్లోకాలు, వాటికి అంకితం చేసిన ప్రార్థనలను ఆరాధిస్తాయి.

ఒక శవాన్ని క్షయం కోసం హోస్టు (అనగా డ్రూజు) పరిగణిస్తారు. పర్యవసానంగా శవం మంచి సృష్టిని కలుషితం చేయని విధంగా చనిపోయినవారిని సురక్షితంగా పారవేయాలని గ్రంథం నిర్దేశిస్తుంది. ఈ నిషేధాలు కర్మ సాంప్రదాయిక అభ్యాసానికి, సిద్ధాంతపరమైన ఆధారం, సాధారణంగా " టవర్సు ఆఫ్ సైలెంసు " గా గుర్తించబడతాయి. దీని కోసం గ్రంథం, సంప్రదాయంలో ప్రామాణిక సాంకేతిక పదం లేదు. ప్రస్తుతం ప్రధానంగా భారత ఉపఖండంలోని జొరాస్ట్రియను వర్గాలు దీనిని ఆచరిస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధం కాని ప్రదేశాలలో, డిక్లోఫెనాకు విషం స్కావెంజర్ పక్షుల వాస్తవ విలుప్తానికి దారితీయలేదు. ఇతర జొరాస్ట్రియన్ సమాజాలు వారి చనిపోయినవారిని దహనం చేస్తాయి, లేదా వాటిని సున్నపు మిశ్రమంతో కప్పబడిన సమాధులలో పాతిపెడతాయి. అయినప్పటికీ జొరాస్ట్రియన్లు తమ చనిపోయినవారిని సాధ్యమైనంత పర్యావరణపరమైన పారిశుద్య మార్గంలో పారవేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

19 వ శతాబ్దం నుండి భారతదేశంలో పార్సీలు సాంప్రదాయకంగా మతమార్పిడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అపరాధి బహిష్కరణకు గురయ్యే నేరమని కూడా భావించారు. ఇరానియను జొరాస్ట్రియన్లు మతమార్పిడిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అభ్యాసం చేయడాన్ని టెహ్రాను మొబెడ్సు కౌన్సిలు ఆమోదించింది. ఇరాను అధికారులు మతమార్పిడి చేయడానికి ఇరాను అధికారులు అనుమతించనందున ప్రవాసంలో ఉన్న ఇరానియను జొరాస్ట్రియన్లు మిషనరీ కార్యకలాపాలను చురుకుగా ప్రోత్సహించారు. లాస్ ఏంజిల్స్‌లోని జరాష్ట్రియను అసెంబ్లీ, పారిసులోని అంతర్జాతీయ జొరాస్ట్రియను సెంటరు రెండు ప్రముఖ సంస్థలుగా ఫెడరేషను ఆఫ్ జొరాస్ట్రియను అసోసియేషన్సు ఆఫ్ నార్త్ అమెరికా మార్పిడి అనుకూలంగా ప్రోత్సహిస్తూ మతమార్పిడులకు స్వాగతం పలికారు. సాంప్రదాయకంగా పర్షియా, పర్షియ-కాని జాతుల మతమార్పిడులు అంతర్జాతీయ కార్యక్రమాలలో కూడా స్వాగతించబడ్డాయి. ప్రపంచ జొరాస్ట్రియా కాంగ్రెసు, ప్రపంచ జొరాస్ట్రియను యూత్ కాంగ్రెసు వంటి కార్యక్రమాలకు హాజరై మాట్లాడతారు. జొరాస్ట్రియన్లు ఒకే విశ్వాసం ఉన్న ఇతరులను వివాహం చేసుకోవాలని ప్రోత్సహిస్తారు. అయినప్పటికీ విశ్వాసం వెలుపల వివాహం చేసుకునే స్త్రీలకు సంబంధించి ఇది ఖచ్చితంగా అమలు చేయబడుతుంది, కాని పురుషులుకు వర్తించదు.

చీలికలు

జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి.

అవెస్త

జొరాస్ట్రియన్లు చదివే అవెస్తా గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్తా గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్తా (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది. ఈ గ్రంథం గ్రీకు వీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్తా చాలా వరకూ నాశనమైయ్యింది . నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది. కన్నడ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉన్నట్టు అవెస్తలో ఉపయోగించిన భాష కూడా సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.

దేవాలయాలు

జొరాస్ట్రియన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్ట్రియన్ ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రీయన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశం లోను మిగిలియున్నాయి.

నమ్మకాలు

  • జొరాస్ట్రిరియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.
  • ప్రపంచం మంచికి చెడుకి మధ్య యున్న యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనుష్యుడు దుష్టత్వం నుండి దూరంగా ఉండుట ద్వారా తన ఉనికిని కాపాడుకొని, మత ఆచారాల ద్వారా పరిశుద్ధపరచుకోవాలి.
  • జొరాస్ట్రిరియన్ల నమ్మకం ప్రకారం దేవుడు తన నుండి దృశ్యమైన ప్రపంచాన్ని, అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కనుక సృష్టిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత.
  • దేవుడు ఆత్మ స్వారూప్యాలను మొదటగా సృష్టించాడు. అగ్ని, నీరు, గాలి, మట్టి, మొక్కలు, జంతువులు, మనుష్యులు కలిగియున్న ప్రపంచము దేవుని శరీరమువలే యున్నది. అయితే ఆయన ఆత్మ ఎల్లప్పుడూ సృష్టిని సంరక్షించుకొనుచున్నది. ఆది మానవుడినుండి సంరక్షణా దూతలను, మష్యె (Mashye), మష్యానె ( Mashyane) అను మొదటి స్త్రీ పురుషులను సృష్టించాడు దేవుడు. ఈ స్త్రీ పురుషుల నుండియే సమస్త మానవ జాతి ఆవిర్భవించింది.
  • దేవుని సులక్షణాలను ప్రతిబంబించే, భౌతిక ప్రపంచంలో దుష్టుడితో పోరాడటంలో దేవునికి సాయపడే దైవ స్వరూపాలు ఉంటాయి. వీటిలో గొప్పవైన ఆరు అమరమైన స్వరూపాలు లేక అమేష స్పెంతాస్. ఇంకా దేవ దూతలు వగైరా ఉంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్పణలతో కూడిన యజ్ఞాలు, ప్రార్థనలు చేస్తారు.
  • మనిషి సహజంగా దైవ స్వరూపం కలిగి దైవ లక్షణాలు కలిగియుంటాడు. మనుష్యులకు రెండు అవకాశాలుంటాయి - ఒకటి నీతిగా ఉండి దేవుడి బోధనలు పాటించడం, రెండవది దుష్టత్వాన్ని పాటించి నాశనమవ్వడం. మనిషి ఎంచుకొన్న మార్గాన్ని బట్టి దేవుడు ఆ మనుష్యుని ఖర్మను నిర్ణయిస్తాడు. పాప ప్రాయిశ్చిత్తం చేసుకొనే విధానం గురించి, సత్ప్రవర్తన గురించి దేవుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. కాని తనను ఆరాధించేవారు చేసిన పాపాలను మోయడు.
  • దేవుడు భౌతిక ప్రపంచం సృష్టించక ముందే ఆత్మీయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆత్మీయ ప్రపంచం దుష్టశక్తికి అతీతమైనది. భౌతిక ప్రపంచం ఎప్పుడూ దుష్టుడి ఆక్రమణకి గురవ్వుతూవుంటుంది ఎందుకనగా దుష్టుడు అక్కడ నివాసమేర్పరచుకొన్నాడు. కనుక మనుష్యులు తమకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలి. వాటివైపు వెళ్ళకూడదు. అగ్ని, నీరు, భూమి, గాలి - వీటిని దుష్ట స్వరూపాలు లోపలికి వెళ్ళి కాలుష్యం చేయకుండా కాపాడాలి. మృత దేహాలను ఖననం చేయకూడదు, పాతిబెట్టకూడదు, నీటిలో పడవేయకూడదు. రాబందులకు, ఇతర పక్షులకు ఆహారంగా వేయాలి.
  • జొరాస్ట్రియన్ ప్రవక్త అయిన జొరాస్తర్ బోధనలపై ఆధారపడియున్నది. ఒక కథ ప్రకారం దేవుడే స్వయంగా జరాతుస్త్రకు దర్శనమిచ్చి సృష్టి రహస్యాలను, సన్మార్గంలో పయనించడానికి మానవులు పాటించవలసిన నియమాలను తెలిపాడు. జొరాస్తర్ బోధనలు జెండ్ అవెస్తా (Zend Avesta) లో దొరకుతాయి. జొరాస్ట్రియన్లు జరతుస్త్ర పుట్టుక 3000 సంవత్సరాల పాటూ సాగే సృష్టి చక్రం ఆరంభాన్ని తెలియజెప్పిందని నమ్ముతారు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. జొరాస్తర్ కుమారుడైన షోశ్యాంత్ (మూడవ ప్రవక్త) తీర్పు దినాన్ని, భౌతిక ప్రపంచంలో దుష్ట శక్తుల సంహారం గురించి ప్రవచిస్తాడు.
  • జొరాస్ట్రియన్ల నమ్మకం ప్రకారం మరణము అనేది ఆత్మ శరీరంలోంచి బయటకు వెళిపోవడం వల్ల సంభవిస్తుంది, ఆపై శరీరం అపవిత్రమైపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెడలిన తరువాత 3 రోజులవరకూ ఆ శరీరం వద్ద తిరుగుతూ తరువాత దేనా అనే ఆత్మ సాయంతో ఆత్మీయ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడున్న దేవ దూత విచ్చేసిన ఆత్మ అంతిమతీర్పు దినానికి ముందు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. జొరాస్ట్రియన్ల నమ్మకం ప్రకారం అంతిమ తీర్పు దినములో దేవుడు మరణించిన ఆత్మలను లేపి రెండవసారి విచారణకు సిద్ధం చేస్తాడు. అన్ని మంచి ఆత్మలు స్వర్గంలో శాశ్వత స్థానాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నిత్య జీవం పొందేవరకూ తాత్కాలికంగా శిక్షలు పొందుతాయి. కొంతమంది జొరాస్ట్రియన్లు దైవ నిర్ణయం ప్రకారం ఆత్మలు పొరపాట్లను అధికమించి, సిద్దిత్వం పొందాలని భూమ్మీదే జన్మిస్తాయని, కనుక ఆత్మలు తమ వ్యక్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడానికి, వెలుగుమయం చేసుకోవడానికి ఆత్మలకు భూమ్మీద జీవనం ఒక అవకాశమని నమ్ముతారు. జొరాస్ట్రియన్ పుస్తకాలు స్వర్గాన్ని సంపూర్ణ సంతోషకరమైన ప్రదేశమని, దేవుని వెలుగుతో అలంకరించబడినదని; నరకాన్ని పాపపు అత్మలు శిక్షలు పొందే శీతలమైన, చీకటియన ప్రదేశంగా చెబుతాయి.
  • దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం ప్రమాదంతో కూడియున్నదని జొరాస్ట్రియన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు వ్యభిచారము, దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై వస్త్రం ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు వివాహం చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.
  • ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.
  • జొరాష్ట్రియన్లు కూడా హిందువులవలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అంటారు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్ట్రియన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే ఉపనయన తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.

సూక్తులు

  • అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు, అబద్దమాడకుము
  • అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు, ప్రపంచపు నిధి ప్రీతికరముగా లేకుండునట్లు నీవు ఆశ కలిగియుండకుము.
  • ఆవేశపడకుము, ఎందుకనగా ఆవేశము వచ్చినప్పుడు బాధ్యతలు, మంచికార్యాలు మరుగున పడును, ప్రతి పాపము ఆలోచనలోకి వచ్చును.
  • ఆందోళన పడకుము, ఎందుకనగా ఆందోళన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అధికమించును.
  • హాని, పశ్చాతాపము నీ వద్దకు రాకుండునట్లు, మోహపడకుము.
  • చేవలసిన పని పూర్తి కాకుండా ఉండునట్లు సోమరితనమును చేరనీయకుము.
  • చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుము
  • కలిగియున్న సంపదను బట్టి గర్వించకుము, ఎందుకనగా ఆఖరిలో అన్నింటినీ వదిలేయాల్సిందే.

ప్రస్తుత స్థితి

2004 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్ట్రియన్ల సంఖ్య 1,45,000 నుండి 2,10,000 వరకూ ఉంది. . 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్ట్రియన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము (ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉంది. భారత దేశంలో జోరాస్త్ర మతానికి పార్శీ మతమనికూడా పేరు.

ప్రముఖ పార్శీలు

మూలాలు

ఇంకా చదవండి

బయటి లింకులు

Tags:

జొరాస్ట్రియన్ మతం చరిత్రజొరాస్ట్రియన్ మతం పర్యావలోకనంజొరాస్ట్రియన్ మతం చీలికలుజొరాస్ట్రియన్ మతం అవెస్తజొరాస్ట్రియన్ మతం దేవాలయాలుజొరాస్ట్రియన్ మతం నమ్మకాలుజొరాస్ట్రియన్ మతం సూక్తులుజొరాస్ట్రియన్ మతం ప్రస్తుత స్థితిజొరాస్ట్రియన్ మతం మూలాలుజొరాస్ట్రియన్ మతం ఇంకా చదవండిజొరాస్ట్రియన్ మతం బయటి లింకులుజొరాస్ట్రియన్ మతంఆంగ్లంఇరాన్జొరాస్ట్రియన్పర్షియాభారత దేశముమతముముంబాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

నాస్తికత్వంఉగాదిఉత్తర ఫల్గుణి నక్షత్రముసన్ రైజర్స్ హైదరాబాద్వాతావరణంఎయిడ్స్నల్ల మిరియాలుతూర్పు గోదావరి జిల్లాప్రధాన సంఖ్యపుచ్చశతభిష నక్షత్రమునవధాన్యాలుమాల (కులం)లక్ష్మణుడుపాండవులుసామెతలుసివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లంబసింగినవగ్రహాలు జ్యోతిషంమేషరాశిపసుపు గణపతి పూజమూలా నక్షత్రంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమగధీర (సినిమా)నాన్న (సినిమా)నరేంద్ర మోదీ స్టేడియంరెడ్డిఆవేశం (1994 సినిమా)త్రిఫల చూర్ణంగోదావరిపిత్తాశయమువిశ్వామిత్రుడుచాట్‌జిపిటిదృశ్యం 2రోహిత్ శర్మపూర్వాషాఢ నక్షత్రముఛందస్సుగర్భాశయముఇత్తడిప్రజాస్వామ్యంకాగిత వెంకట్రావుభద్రాచలంషడ్రుచులుతీన్మార్ సావిత్రి (జ్యోతి)ప్రకృతి - వికృతితమిళ అక్షరమాలవిభక్తిసలేశ్వరంకుక్కరాకేష్ మాస్టర్Yహస్తప్రయోగంకోమటిరెడ్డి వెంకటరెడ్డిమదర్ థెరీసాపేర్ని వెంకటరామయ్యజగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడేLకౌరవులుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డికౌసల్యగైనకాలజీమొదటి ప్రపంచ యుద్ధంఅరటివై.యస్.అవినాష్‌రెడ్డిమృగశిర నక్షత్రమునాగులపల్లి ధనలక్ష్మికృష్ణ జననంక్వినోవాNనవనీత్ కౌర్హైదరాబాదుశివపురాణంవేంకటేశ్వరుడుమడమ నొప్పితెలుగు సినిమాలు 2023జవహర్ నవోదయ విద్యాలయం🡆 More