జొన్న: తృణ ధాన్యము

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న (ఆంగ్లం: Sorghum).

శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్యంగా తీసుకొని జీవిస్తున్నారు. సింధునాగరికతకు సమాంతరంగా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలలో జొన్నల్నీ బాగానే పండించారు. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జింకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకుండా శక్తినిస్తాయి. గోధుమలలో ఉండే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామందికి సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది. ఒకవైపున జొన్నలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా గిరాకీ పెరుగుతుంటే, మనవాళ్ళు పండించటం తగ్గించేస్తున్నారు. భారతదేశంలో గడచిన రెండు దశాబ్దాల కాలంలో 12 మెట్రిక్ టన్నుల నుంచి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయిందని ఇక్రిశాట్ నివేదిక చెప్తోంది. జొన్నలు ఇప్పుడు బియ్యం కన్నా ఎక్కువ ధర పలుకుతున్నాయి. ధర పెరగటానికి పంట తగ్గిపోవటం, గిరాకి పెరగటం కారణాలు. రంగు, రుచి, వాసనా లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి, జొన్నపిండి ఏ ఇతర వంటకంలో నయినా కలుపుకోవటానికి వీలుపడుతుంది.

జొన్న
జొన్న: పోషక పదార్థాలు, ఉపయోగాలు, ఇతర ఉపయోగాలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Poales
Family:
Genus:
సోర్ఘమ్

జాతులు

About 30 species, see text

జొన్న: పోషక పదార్థాలు, ఉపయోగాలు, ఇతర ఉపయోగాలు
జొన్న రొట్టెలు

పోషక పదార్థాలు

జొన్న: పోషక పదార్థాలు, ఉపయోగాలు, ఇతర ఉపయోగాలు 
తెల్ల జొన్నలు

ఉపయోగాలు

జొన్న ఆహారం

జొన్న: పోషక పదార్థాలు, ఉపయోగాలు, ఇతర ఉపయోగాలు 
జొన్నచేను
  1. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
  2. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
  3. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
  4. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
  5. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

ఇతర ఉపయోగాలు

  1. జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన మద్యం (ఆల్కహాల్) సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడతాయి.
  2. జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.

జొన్న రొట్టెలు తయారీ

  • జొన్నలను గిర్నికి (పండి మర) తిసుకొని పోయి పిండి చేయాలి.
  • పిండిని వేడి నీళ్ళతో కలిపి ముద్ద చేయాలి.
  • ముద్దతో చపాతీల మాదిరిగా చేతితో చరుస్తూపలుచగా చేసి పెనం పై రొట్టె చేయాలి.

Tags:

జొన్న పోషక పదార్థాలుజొన్న ఉపయోగాలుజొన్న ఇతర ఉపయోగాలుజొన్న రొట్టెలు తయారీజొన్న

🔥 Trending searches on Wiki తెలుగు:

రోహిణి నక్షత్రంభారతదేశ చరిత్రమత్తేభ విక్రీడితముయూట్యూబ్పులిజూదంహిందూధర్మంవేపస్నేహంఆర్టికల్ 370కల్వకుంట్ల తారక రామారావుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకస్తూరి రంగ రంగా (పాట)నీరుసింహంనాగార్జునసాగర్గోరుచుట్టుగుద మైథునంకొణతాల రామకృష్ణభారతీయ స్టేట్ బ్యాంకుఅశ్వని నక్షత్రముమహాభాగవతంసెక్యులరిజంభగత్ సింగ్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంశని (జ్యోతిషం)త్రిష కృష్ణన్జటాయువురాహుల్ గాంధీరామ్ పోతినేనిబమ్మెర పోతనఇంటి పేర్లుబలగంవినాయక చవితిభారత రాజ్యాంగ పరిషత్తీన్మార్ మల్లన్నభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులునవగ్రహాలుమహాభారతంభూమిజాంబవంతుడురామదాసుగౌడభారత ఆర్ధిక వ్యవస్థప్రకృతి - వికృతిదినేష్ కార్తీక్అష్టలక్ష్ములుజయలలిత (నటి)మదర్ థెరీసాఇస్లాం మతంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపుష్పరెండవ ప్రపంచ యుద్ధంఎటెల్ అద్నాన్భారత రాజ్యాంగ సవరణల జాబితాహనుమజ్జయంతిఅంబటి రాంబాబుఅక్కుమ్ బక్కుమ్జలియన్ వాలాబాగ్ దురంతంరావణుడుభారత జాతీయగీతంతేలునన్నయ్యబంగారు బుల్లోడురైతుబంధు పథకంలేపాక్షిఉత్తర ఫల్గుణి నక్షత్రముత్రీసమ్రాశిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఈనాడుఫ్యామిలీ స్టార్క్రిక్‌బజ్మహానందికల్వకుంట్ల చంద్రశేఖరరావుఅయోధ్యనువ్వులుమాల (కులం)చతుర్యుగాలు🡆 More