జీడి

జీడి (Anacardium occidentale) ఉష్ణమండల ప్రాంతాలలో వుండే చెట్టు.

దీని నుండి జీడిపండు, జీడిపప్పు లభ్యమవుతాయి.

జీడి
జీడిసొన వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
జీడి
జీడి
పండిన జీడిపండు
Conservation status
జీడి
Least Concern  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: Angiosperms
Clade: Eudicots
Clade: Rosids
Order: Sapindales
Family: Anacardiaceae
Genus: Anacardium
Species:
A. occidentale
Binomial name
Anacardium occidentale

జీడిపండుతో మద్యం

గోవాలో జీడి పండుని (సహాయక ఫలం) నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. తద్ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతం మత్వరలో జీడి పండుని (స్వహిలి భాషలో బిబో ) ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి, బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో. మొజాంబిక్లో జీడిపప్పు వ్యవసాయదారులు సాధారణంగా ఘాటైన మద్యాన్ని జీడి పండుతో తయారు చేస్తారు. దీనిని "యగవ అర్దంట్" (మండే జలం) అంటారు.

జీడిపప్పు

జీడి 
జీడిపప్పు అల్పాహారం

జీడిపండుకు జతపరిచివుండే విత్తనమే జీడిపప్పు. ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (కోనసీమ జిల్లా) గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతిదారులు, భారతదేశానికి, విలువైన విదేశీమారక ద్రవ్యం సంపాదించి పెడుతున్నారు.

పోషక పదార్థాలు

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

  • శక్తి ---------------580 kcal 2310 kJ
  • పిండిపదార్థాలు ---------- 30.19 g
  • చక్కెరలు----------- 5.91 g
  • పీచుపదార్థాలు--------- 3.3 g
  • కొవ్వు పదార్థాలు---------- 43.85 g
  • మాంసకృత్తులు---------- 18.22 g
  • థయామిన్ (విట. బి1) ---- .42 mg 32%
  • రైబోఫ్లేవిన్ (విట. బి2) ----- .06 mg 4%
  • నియాసిన్ (విట. బి3) ----- 1.06 mg 7%
  • పాంటోథీనిక్ ఆమ్లం (B5) ----- .86 mg 17%
  • విటమిన్ బి6----------- .42 mg 32%
  • ఫోలేట్ (Vit. B9) ----- 25 μg 6%
  • విటమిన్ సి------------- .5 mg 1%
  • కాల్షియమ్------------ 37 mg 4%
  • ఇనుము------------- 6.68 mg 53%
  • మెగ్నీషియమ్----------- 292 mg 79%
  • భాస్వరం------------- 593 mg 85%
  • పొటాషియం------------ 660 mg 14%
  • జింకు-------------- 5.78 mg 58%

ఆధారం: USDA పోషక విలువల డేటాబేసు

  • జీడిపప్పు పప్పులో క్రొవ్వు, నూనె పదార్థాలు 54%
  • మోనో అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:1),18%
  • పోలి అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:2),
  • సేచ్యురేటెడ్ కొవ్వు-16%
  • పల్మిటిక్ ఆమ్లం (16:0),9, %
  • స్టేరిక్ ఆమ్లం (18:O) ఉంటాయి.7%

ఉపయోగాలు

వైద్యం, పరిశ్రమలు

జీడి పిక్క ద్రవంలో (CNSL), జీడిపప్పు తయారీ పద్ధతిలో మిగిలే ద్రవంలో చాలా మటుకు అనకర్దిక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు దంత సమస్యల పైన ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది హాని కారక బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది వివిధ రకాల హాని కారక బ్యాక్టీరియల పైన కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు వివిధ భాగాలని పటమొన, గయాన వాసులు వైద్యంలో వాడతారు. చెట్టు బెరడు తీసి రాత్రంతా నానబెట్టి లేదా ఉడకబెట్టి విరోచనాలకి మందుగా వాడతారు. విత్తనాల్ని పిండి చేసి పాము కాట్లకు విరుగుడు మందుగా వాడతారు. పిక్క నూనెను అరికాలి పగుళ్ల పైన పూతగా శైవలాల నిరోధకంగా వాడతారు.అనకర్డిక్ ఆమ్లాన్ని రసాయన పరిశ్రమల్లో కర్డనల్ అనే పదార్థం ఉత్పత్తి చేయడానికి వాడతారు.

వంటలలో వాడకం

జీడిపప్పు ప్రఖ్యాత ఫలహారం, దీని ఘనమైన రుచివల్ల పచ్చిగా కూడా తినవచ్చు, కొద్దిగా ఉప్పు లేదా చెక్కర కలుపుకుని ఆరగించవచ్చు. జీడిపప్పుని చాకొలేట్ పూతతో అమ్ముతారు, కానీ ఇది వేరు సెనగ, బాదం పప్పు కన్నా ఖరీదు ఎక్కువ, వాడకం తక్కువ. థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పు భాగం ఉంది, వీరు పూర్తి పిక్కను వాడతారు, అయితే భారతీయ వంటల్లో ముద్ద చేసి షాహీ కుర్మా లాంటి వాటిలో వాడతారు, అంతే కాకుండా పిండి వంటల్లో అలంకరణకు వాడతారు. అంతగా తెలియకపోయినా రుచికరంగా ఉండే జీడిపప్పు అది లేతగా ఉండి, దాని తోలు ఇంకా గట్టిపడకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని పిక్క మెత్తగా ఉన్నప్పుడు, దానిని కత్తితో రెండు భాగాలుగా చీలుస్తారు. పప్పుని తీసి (అది ఇంకా క్షారతని కోల్పోదు, అందు వల్ల చేతి తొడుగులు అవసరం) పసుపు కలిపిన నీటిలో నానబెడతారు. దీని వల్ల క్షారత కోల్పోతుంది. ఈ విధమైన వాడుక కేరళ వంటకాలలో ముఖ్యంగా అవియల్ తయారీలో కనిపిస్తుంది, ఇందులో రకరకాలైన కూరగాయలు, కొబ్బరి కోరు, పసుపు, పచ్చి మిరపకాయలు వాడతారు. మలేషియాలో లేత ఆకులని పచ్చిగా సలాడ్ లాగా లేదా సంబల్ బెలకన్ (మిర్చి, నిమ్మరసం కలిపిన రొయ్యల ముద్ద) కలిపి తింటారు. బ్రెజిల్లో జీడిపండు రసం దేశం మొత్తం ప్రఖ్యాతి గాంచింది. ఫోర్ట్లేజా వంటి ఈశాన్య ప్రాంత సందర్శకులు తరచుగా అమ్మకందారులు జీడిపప్పు పప్పుని తక్కువ ధరకి అమ్మటాన్ని చూడవచ్చును. కొన్న పిమ్మట ఉప్పువేసి ప్లాస్టిక్ సంచులలో ఇస్తారు. ఫిలిపిన్స్లో జీడిపప్పు అంటిపోలో ప్రఖ్యాతి గాంచిన పంటగా ప్రసిద్ధి, సుమన్ తో కలిపి ఆరగిస్తారు. పంపంగాలో ఒక మిఠాయి అయిన టురోన్స్ డి కసుయ్ కూడా జీడిపప్పు పప్పుతో తాయారు అవుతుంది. జీడిపప్పు మార్జిపాన్ ను తెల్లని కాగితంలో చుడతారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

జీడి పండుతో మద్యంజీడి పప్పుజీడి మూలాలుజీడి వెలుపలి లంకెలుజీడి

🔥 Trending searches on Wiki తెలుగు:

మేషరాశిశని (జ్యోతిషం)అవకాడోకౌరవులుఝాన్సీ లక్ష్మీబాయిరష్మి గౌతమ్చరవాణి (సెల్ ఫోన్)పవనస్థితిప్రకటనమోక్షగుండం విశ్వేశ్వరయ్య2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునువ్వొస్తానంటే నేనొద్దంటానాకంప్యూటరుఉద్దమ్ సింగ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినానార్థాలుమాదిగఆశ్లేష నక్షత్రముకృత్తిక నక్షత్రముఉండేలుతమిళనాడుభారత పార్లమెంట్గౌతమ బుద్ధుడుకందుకూరి వీరేశలింగం పంతులుఉపనిషత్తుపి.గన్నవరం శాసనసభ నియోజకవర్గంసింహరాశిఎన్.జి.రంగారిషబ్ పంత్అంతస్తులుభారతరత్నభారత రాజ్యాంగంజోల పాటలుసమాచార హక్కుఇన్‌స్టాగ్రామ్మియా ఖలీఫాపత్తివై.ఎస్.వివేకానందరెడ్డిరాజమండ్రివ్యాసుడునాయీ బ్రాహ్మణులునువ్వు నేనుచదరంగం (ఆట)జలియన్ వాలాబాగ్కామసూత్ర (సినిమా)దాశరథి రంగాచార్యసంతోష్ యాదవ్కృష్ణా నదిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పూర్వాభాద్ర నక్షత్రముక్రిక్‌బజ్భీమా (2024 సినిమా)వినుకొండమృణాల్ ఠాకూర్ఆంధ్ర విశ్వవిద్యాలయంరెండవ ప్రపంచ యుద్ధందావీదుసవితా అంబేద్కర్దేవదాసిమారేడురాకేష్ మాస్టర్బారసాలరాహువు జ్యోతిషంశ్రీకాళహస్తినవగ్రహాలు జ్యోతిషంకుక్కకర్ణుడుభారతదేశ ప్రధానమంత్రిగాయత్రీ మంత్రంప్రకృతి - వికృతివిశాల్ కృష్ణభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకల్వకుంట్ల తారక రామారావుసంభోగంభగత్ సింగ్ముంగిసఅశోకుడుతామర వ్యాధిదూదేకుల🡆 More