జర్మన్ భాష: ఒక ప్రపంచ భాష

జర్మన్ భాష ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష.

ఈ భాష డచ్, ఆంగ్ల భాషలతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష ఐరోపా సమాఖ్యలోని 23 అధికార భాషలలో ఒకటి. ఐరోపా సమాఖ్యలోని అత్యధికుల మాతృభాష కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష ఆంగ్ల భాష తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). జర్మనీలో 95% మంది, ఆస్ట్రియాలో 89% మంది, స్విట్జర్లాండ్లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.

జర్మన్
డాయచ్ (Deutsch)
మాట్లాడే దేశాలు: క్రింది ప్రపంచ పటములో చూపబడినది 
ప్రాంతం: ప్రధానంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మున్నగు ఐరోపా దేశాలు
మాట్లాడేవారి సంఖ్య: 18.5 కోట్ల మంది
భాషా కుటుంబము:
 జర్మన్
భాషా సంజ్ఞలు
ISO 639-1: de
ISO 639-2: ger (B)  deu (T)
ISO 639-3: — 
జర్మన్ భాష: ఒక ప్రపంచ భాష
జర్మన్ భాష: ఒక ప్రపంచ భాష
జర్మను భాష మాట్లాడు ప్రదేశాల చిత్రపటము.

Information:

  జర్మను అధికార భాషగా గుర్తించబడినది.
  జర్మను జనబాహుళ్యంలో ప్రచారమై ఉన్నది.
  జర్మను ప్రాంతీయ లేక అల్పసంఖ్యాక భాష.

జర్మన్ ఆల్ఫాబెట్లు

ఆంగ్లములో ఉన్న 26 అక్షరాలతో బాటు అదనంగా వాటిలోనే మూడు అక్షరాలకి ఉమ్లావ్ట్ (umlauts, తెలుగులో ఒత్తులకి వలె) గలవు. ఉమ్లావ్ట్ అనగా అక్షరం పై వచ్చే రెండు చుక్కలు, ఇవి A/a, O/o, U/u లకి Ä/ä, Ö/ö, Ü/üలుగా వస్తాయి. S, T మధ్యన ఎస్జెట్ట్ (ß) అనబడు మరొక అక్షరము గలదు. ఇది రెండు S లతో సమానము (ss).

  • A: ఆ
  • Ä: ఏ
  • B: బే
  • C: ట్సే
  • D: డే
  • E: ఏ
  • F: ఎఫ్
  • G: గే
  • H: హా
  • I: ఈ
  • J: యోట్
  • K: కా
  • L: ఎల్
  • M: ఎమ్
  • N: ఎన్
  • O: ఓ
  • Ö:
  • P: పే
  • Q: కూ, (ఆస్ట్రియాలో క్వే)
  • R: ఎర్
  • S: ఎస్
  • ß: ఎస్జెట్
  • T: టే
  • U: ఊ
  • Ü:
  • V: ఫౌ
  • W: వే
  • X: ఇక్స్
  • Y: ఎప్సిలన్
  • Z: ట్సెట్

లింగాలు

జర్మను భాషలో లింగం వాడుక ఎక్కువ. ప్రతి వస్తువు, జీవికి తప్పని సరిగా లింగం వాడతారు. పదాన్ని బట్టి లింగనిర్ధారణ కాకుండా ప్రత్యేకించి లింగాన్ని వాడతారు.

  • పుంలింగం - డెర్ (der)

ఉదా: der Mann - the man (ఆ పురుషుడు)

  • స్త్రీలింగం - డీ (die)

ఉదా: die Frau - the woman (ఆ స్త్రీ)

  • నపుంసక లింగం - డస్ (das)

ఉదా: das Auto - the car (ఆ కారు)

వాడుక భాష

  • Guten Morgen= శుభోదయం
  • Guten Abend = శుభ సంధ్య
  • Gute Nacht = శుభ రాత్రి
  • Hallo = నమస్కారం (ఆంగ్ల hello)
  • Wie geht es Ihnen? = ఎలా ఉన్నారు?
  • Wie geht es dir? = ఎలా ఉన్నావు?
  • Auf Weidersehen = ఇక సెలవు

Tags:

అధికార భాషఆంగ్ల భాషఆస్ట్రియాఐరోపా సమాఖ్యజర్మనీమాతృభాషస్విట్జర్లాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకుండలేశ్వరస్వామి దేవాలయంభోపాల్ దుర్ఘటనశ్రవణ నక్షత్రమురోజా సెల్వమణిరాహువు జ్యోతిషంక్షత్రియులుసీతారామ కళ్యాణంభద్రాచలంఆరూరి రమేష్రష్మి గౌతమ్కన్యారాశిదివ్యాంకా త్రిపాఠిఏప్రిల్ 18సిద్ధార్థ్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమిథిలదశదిశలుకర్ర పెండలంభాగ్యశ్రీ బోర్సేరేవతి నక్షత్రంఅయోధ్యకాండఉమ్మెత్తమానవ శరీరముఉష్ణోగ్రతత్రేతాయుగంనాగులపల్లి ధనలక్ష్మిమామిడిపాలపిట్టశాసనసభ సభ్యుడుచాట్‌జిపిటివాలినాస్తికత్వంజూనియర్ ఎన్.టి.ఆర్వినాయకుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377గైనకాలజీజోస్ బట్లర్భీమా (2024 సినిమా)ఇన్‌స్టాగ్రామ్కర్కాటకరాశిపురాణాలుఒడ్డెరఅరణ్యకాండచిరంజీవిపులివెందుల శాసనసభ నియోజకవర్గంభారతీయుడు (సినిమా)కాట ఆమ్రపాలిసోనియా గాంధీభారతీయ శిక్షాస్మృతిప్రకటనతిరుమలఇస్లాం మతందానంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసోంపుగోవిందుడు అందరివాడేలేడీజే టిల్లులలితా సహస్ర నామములు- 1-100భారత రాష్ట్రపతివ్యవసాయంనవధాన్యాలునరసింహావతారంయేసుచార్మినార్పెళ్ళిధనూరాశిసామెతలుగుమ్మలూరి శాస్త్రినవీన్ పట్నాయక్ఏలకులుYతెలుగు సినిమాలు 2024కుంభరాశిపునర్వసు నక్షత్రముభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంయవలు🡆 More