చతుర్భుజి

యూక్లిడ్ రేఖాగణితం లో, చతుర్భుజం లేదా చతుర్భుజి (Quadrilateral), నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత పటం బహుభుజి.

చతుర్భుజం
చతుర్భుజి
కుటుంబం బహుభుజులు
రకం చతుర్భుజం
భుజాలు AB, BC, CD, DA
శీర్షాలు A, B, C, D
కోణాల మొత్తం 360 డిగ్రీలు
వైశాల్యం ½ d (h1 + h2) చదరపు ప్రమాణాలు

చతుర్భుజమును ఆంగ్లంలో "quadrilateral" అంటారు. ఈ పదం quadri (అనగా నాలుగు), latus (అనగా భుజం) అనే లాటిన్ పదములతో యేర్పడింది.

చతుర్భుజములు సామాన్యంగా రెండురకాలు. అవి సాధారణ (భుజములు ఖండించుకొనని) లేదా సంశ్లిష్ట (భుజములు అంతరంగా ఖండించుకొన్నవి) . వాటిలో సాధారణ చతుర్భుజాలు కుంభాకార బహుభుజి లేదా పుటాకార బహుభుజి అనే రెండు రకాలుగా ఉంటాయి.

ఒక సాధారణ చతుర్భుజం యొక్క అంతర కోణముల మొత్తం 360 డిగ్రీలు, లేదా నాలుగు లంబ కోణాలు.

ఒక ప్రత్యేక సందర్భంలో n భుజములు కలిగిన బహుభుజి యొక్క అంతర కోణముల మొత్తమునకు సూత్రము (n - 2) × 180°. ఖండించుకొనే చతుర్భుజంలో ఒకవైపు గల అంతరకోణములమొత్తం 720° వరకు ఉంటుంది. అన్ని కుంభాకార చతుర్భుజముల భుజముల మధ్య బిందువులను కలిపినపుడు పునరావృతమవుతాయి.

లక్షణాలు

  • ఇది నాలుగు శీర్షాలు కలిగి ఉండును.
  • ఇది రెండు కర్ణాలు కలిగి ఉంటుంది.
  • ఒక కర్ణం చతుర్భుజాన్ని రెండు త్రిభుజములుగా విడదీయును.
  • ఇందులో నాలుగు అంతర కోణాలు ఉండును.
  • నాలుగు కోణాల మొత్తం 3600 లేదా 2π రేడియన్లు లేదా నాలుగు లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది.
  • చతుర్భుజాన్ని నిర్మించుటకు అయిదు స్వతంత్ర కొలతలు కావాలి. అవి
    • నాలుగు భుజాలు, ఒక కర్ణం
    • మూడుభుజాలు, రెండుకోణాలు
    • రెండు భుజాలు, మూడు కోణాలు
    • ఒక భుజం, రెండు కర్ణాలు, రెండు కోణాలు
    • రెండు భుజాలు, ఒక కర్ణం, రెండు కోణాలు
  • చతుర్భుజం చుట్టు కొలత నాలుగు భుజాల మొత్తము కొలత అవుతుంది.
  • ఇది సమతలాన్ని అంతరం, బాహ్యం, చతుర్భుజం అనే మూడు భాగాలుగా విభజిస్తుంది.

వివిధ చతుర్భుజాలు

కుంభాకార చతుర్భుజాలు

చతుర్భుజి 
చతుర్భుజముల లోని రకములను తెలియజేసే ఆయిలర్ చిత్రము.

ఎదురెదురుగా ఉన్న ఒక జత భుజాలు సమాంతరంగా ఉన్న ఆకారం. దీన్ని అమెరికాలో 'ట్రెపిజోయిడ్' (trapezoid) అంటారు. ఇందులో తిర్యక్ రేఖకు ఒకవైపు ఉండే అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం.

ఎదురెదురుగా ఉన్న భుజాలు రెండూ ఒకే కొలత కలిగి ఉండటమే కాకుండా ఆ భుజాలు సమాంతరంగా ఉన్న ఆకారం. ట్రెపీజియంలో ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజంలో రెండు జతల ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇందులో ఏ రెండు ఎదురు కోణాలైనా లేదా ఎదురు భుజాలైనా సమానంగా ఉంటాయి. ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానంగా ఉంటాయి. కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకొంటాయి. కర్ణాల పొడవు సమానం కాదు.

    దీర్ఘ చతురస్రం (rectangle)

ఒక చతుర్భుజంలో నాలుగు కోణాలూ లంబ కోణాలు అయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి, సమానమైన పొడుగు ఉన్న ఆకారం. కర్ణాలు సమానం, పరస్పర సమద్విఖండన చేసుకొంటాయి. దీర్ఘ చతురస్రం నిర్మించడానికి రెండు స్వతంత్ర కొలతలు కావాలి.

ఒక చతుర్భుజంలో అన్ని భుజాలూ సమానమైన పొడుగు ఉన్న ఆకారం. ఇందులో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకొంటాయి. కర్ణాల పొడవు సమానం కాదు. రాంబస్‌ను రెండు సర్వసమాన సమబాహుత్రిభుజాలుగా ఆ రాంబస్ కర్ణం విభజిస్తుంది. రాంబస్ నిర్మించడానికి రెండు స్వతంత్ర కొలతలు కావాలి.

ఒక చతుర్భుజంలో నాలుగు కోణాలూ లంబ కోణాలు అయి, అన్ని భుజాలు సమానమైన పొడుగు ఉన్న ఆకారం. రాంబస్‌లో ఒక కోణం లంబకోణం అయితే అది చతురస్రమౌతుంది. ఇందులో కర్ణాల పొడవులు సమానం. చతురస్రాన్ని నిర్మించడానికి ఒక్క సమాన కొలత చాలును.

నాలుగు సరళ భుజాలు (straight sides) కల రేఖాచిత్రం. పై నియమాలేవీ లేని చతుర్భుజం.

    కైట్ (kite)

ఇది ఈ మధ్యనే కనుగొనబడింది.ఇది కూడా చతుర్భుజాలలో ఒకటి. దీనిలో రెండు జతల ఆసన్న భుజాలలో ఒక జత ఆసన్న భుజాలు ఒక కొలతలోనూ గానూ మరొక జత ఆసన్న భుజాలు మరొక కొలతలోనూ ఉంటాయి. (ఇది గాలిపటం ఆకారంలో ఉంటుంది)

చతుర్భుజి 

చతుర్భుజి 

మూలాలు

  • ఈనాడు - ప్రతిభ - 2009 జనవరి 4 - జి. మహేశ్వర్ రెడ్డి వ్యాసం

బయటి లింకులు


రేఖా గణితం - బహుభుజిలు
త్రిభుజంచతుర్భుజిపంచభుజిషడ్భుజిసప్తభుజి • అష్టభుజి • నవభుజి • దశభుజి • ఏకాదశభుజి • Dodecagon • Triskaidecagon • Pentadecagon • Hexadecagon • Heptadecagon • Enneadecagon • Icosagon • Chiliagon • Myriagon

Tags:

చతుర్భుజి లక్షణాలుచతుర్భుజి వివిధ చతుర్భుజాలుచతుర్భుజి మూలాలుచతుర్భుజి బయటి లింకులుచతుర్భుజి

🔥 Trending searches on Wiki తెలుగు:

తిరుపతిరాజస్తాన్ రాయల్స్బుధుడు (జ్యోతిషం)దినేష్ కార్తీక్నవలా సాహిత్యముగుత్తా సుఖేందర్ రెడ్డినువ్వు లేక నేను లేనురజినీకాంత్న్యుమోనియాసౌందర్యఛత్రపతి శివాజీమోత్కుపల్లి నర్సింహులుతిథిగ్రామ పంచాయతీతేలుపక్షిఅరుంధతితెలుగు అక్షరాలుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాతంతిరంరెండవ ప్రపంచ యుద్ధంకేదార్‌నాథ్ ఆలయంఅమరావతిరఘురామ కృష్ణంరాజుసమంతఉత్పలమాలభలే మంచి రోజుచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంసంఖ్యఉమ్మెత్తకొండా వెంకటప్పయ్యఎనుముల రేవంత్ రెడ్డికోమటిరెడ్డి వెంకటరెడ్డిపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)ఛందస్సుపటిక బెల్లంబసవ రామ తారకంభీమా (2024 సినిమా)పండుఅణాపాకిస్తాన్నందమూరి తారకరత్నవెంకటేశ్ అయ్యర్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఅనురాధ శ్రీరామ్పచ్చకామెర్లుసచిన్ టెండుల్కర్శ్రీ గౌరి ప్రియగుణింతంభారతీయుడు (సినిమా)తెలంగాణ జిల్లాల జాబితాసూర్యుడు (జ్యోతిషం)వసంత వెంకట కృష్ణ ప్రసాద్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిముఖేష్ అంబానీశ్రేయాస్ అయ్యర్అమర్ సింగ్ చంకీలాచంద్రముఖిఅతడు (సినిమా)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅష్టదిగ్గజములుదశావతారములుఓం నమో వేంకటేశాయఅచ్చులుసంవత్సరంహస్తప్రయోగంశని (జ్యోతిషం)సుడిగాలి సుధీర్మహాత్మా గాంధీబలి చక్రవర్తిఆప్రికాట్క్రికెట్యేసుశతభిష నక్షత్రముతెలంగాణ ఉద్యమంశ్రీ కృష్ణదేవ రాయలుపమేలా సత్పతిప్రియమణిఅడవి🡆 More