గినియా: ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం

గినియా అధికారికంగా గినియా రిపబ్లిక్ పశ్చిమ ఆఫ్రికాలో పశ్చిమ-తీర దేశం.

ఫ్రెంచ్ గునియా ఆధునిక దేశము కొన్నిసార్లు ఇతర దేశాల నుండి వేరుపర్చడానికి ( గినియా " గినియా-బిస్సా, ఈక్వటోరియల్ గ్వినియా ) ఇది కొన్నిసార్లు గినియా-కానక్రీ అని పిలువబడుతుంది. గినియా జనసంఖ్య 12.4 మిలియన్లు. దేశ వైశాల్యం 2,45,860 చదరపు కిలో మీటర్లు (94,927 చదరపు మైళ్ళు).

Republic of Guinea

République de Guinée (French)
Flag of Guinea
జండా
Coat of arms of Guinea
Coat of arms
నినాదం: "Travail, Justice, Solidarité" (French)
"Work, Justice, Solidarity"
గీతం: Liberté  (French)
Freedom
Location of  గినియా  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  గినియా  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

Location of Guinea
రాజధానిConakry
9°31′N 13°42′W / 9.517°N 13.700°W / 9.517; -13.700
అధికార భాషలుFrench
Vernacular
languages
  • Fula
  • Mandinka
  • Susu
జాతులు
  • 40.0% Fula
  • 25.6% Mandinka
  • 17.8% Susu
  • 4.0% Kissi
  • 5.2% Kpelle
  • 7.4% others
పిలుచువిధంGuinean
ప్రభుత్వంUnitary presidential republic
• President
Alpha Condé
• Prime Minister
Ibrahima Kassory Fofana
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from France
2 October 1958
విస్తీర్ణం
• మొత్తం
245,836 km2 (94,918 sq mi) (77th)
• నీరు (%)
negligible
జనాభా
• 2016 estimate
12,395,924 (81st)
• 2014 census
11,628,972
• జనసాంద్రత
40.9/km2 (105.9/sq mi) (164th)
GDP (PPP)2017 estimate
• Total
$26.451 billion
• Per capita
$2,039
GDP (nominal)2017 estimate
• Total
$9.183 billion
• Per capita
$707
జినీ (2012)33.7
medium
హెచ్‌డిఐ (2017)Increase 0.459
low · 175th
ద్రవ్యంGuinean franc (GNF)
కాల విభాగంUTC+0 (GMT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+224
ISO 3166 codeGN
Internet TLD.gn

సార్వభౌమ రాజ్యం గినియా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన అధ్యక్షపాలిత దేశం. దేశాధ్యక్షుడు ప్రభుత్వ అధిపతి, దేశానికి నాయకత్వం వహిస్తూ పాలించే గణతంత్రం గినియా. గినియా నేషనల్ అసెంబ్లీ, దేశం శాసన మండలిగా ఉంటుంది. అసెంబ్లీ సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. న్యాయ శాఖకు గినియా సుప్రీం కోర్టు నాయకత్వం వహిస్తుంది. ఇది దేశంలో ఉన్నత, ఆఖరి అప్పీలు కోర్టుగా ఉంటుంది. గినియా ప్రాంతం పేరు దేశం పేరుగా నిర్ణయించబడింది. గినియా గల్ఫ్ వెంబడి ఉన్న ఆఫ్రికా ప్రాంతంకి గినియా అనేది ఒక సాంప్రదాయిక పేరు ఉంటుంది. ఇది అటవీప్రాంతాల ద్వారా ఉత్తరాన వ్యాపించి సహెల్ వద్ద ముగుస్తుంది. ఆంగ్ల పదం గినియా పదానికి పోర్చుగీసు పదమైన గ్వినే మూలంగా ఉంది. ఇది 15 వ శతాబ్దం మధ్యకాలంలో సెనెగల్ నదీ ప్రాంతంలో ఉన్న నల్లజాతి ఆఫ్రికన్ ప్రజలను సాధారణంగా గైనస్ నివాసి అనేవారు. ఇది 'టావనీ' జెనాగా బెర్బెర్సు ప్రజలకు వైవిధ్యంగా ఉంటుంది. వీరిని వారు అజెనీగ్స్ లేదా మూర్స్ అని పిలిచారు.

గినియా ప్రధానంగా ఇస్లామిక్ దేశంగా ఉంది. జనాభాలో 85% మంది ముస్లింలు ఉన్నారు. గినియా ప్రజలు ఇరవై నాలుగు సంప్రదాయ జాతికి చెందినవారు. గినియా అధికారిక భాష ఫ్రెంచి పాఠశాలల్లో, ప్రభుత్వ పరిపాలనలో, ప్రసార మాధ్యమంలో ప్రధాన భాషగా ఉంది. అయితే ఇరవై నాలుగు కంటే ఎక్కువ దేశీయ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.

గినియా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం, ఖనిజ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బాక్సైట్ల నిర్మాతగా ఉంది. దేశంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. 2014 ఎబోలా వ్యాప్తికి ఎబోలా వ్యాధికి దేశం ప్రధాన కేంద్రంగా ఉంది. గినియాలో మానవ హక్కులు వివాదాస్పద సమస్యగానే ఉన్నాయి. 2011 లో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం భద్రతా దళాలు, స్త్రీలు, పిల్లల హక్కులు దుర్వినియోగం మానవ హక్కుల ఉల్లంఘనలని జరిగాయని పేర్కొంది.

చరిత్ర

1890 వ దశకంలో ఫ్రాన్సు వలసవచ్చే వరకు ప్రస్తుత గినియా ద్వీపం ఆఫ్రికన్ సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో భాగంగా ఉంది. 1958 అక్టోబరు 2 న గినియా ఫ్రాన్సు నుండి స్వతంత్రం ప్రకటించింది. స్వాతంత్ర్యం నుండి 2010 అధ్యక్ష ఎన్నిక వరకు, అనేక మంది నియంతృత్వ పాలకులు గినియాను పాలించారు.

పశ్చిమాఫ్రికా సాంరాజ్యాలు , గినియాలో రాజ్యాలు

ప్రధాన పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యాల సరిహద్దుల్లో ప్రస్తుత గినియా ప్రాంతం ఉండేది. మొట్టమొదటి ఘనా సామ్రాజ్యం వాణిజ్యంలో అభివృద్ధి సాధించినప్పటికీ చివరికి ఆల్మోరోవిడుల దాడుల పునరావృతమయిన కారణంగా వాణిజ్యం క్షీణించింది. ఉత్తర ఆఫ్రికా వ్యాపారులుగా ఈ ప్రాంతంలో ముస్లిములు మొదటిసారి వచ్చారు.

సోసో రాజ్యం (12 నుండి 13 వ శతాబ్దాల వరకు) కొంతకాలం పాలించింది. 1235 లో అయితే సిసో పాలకుడు సౌమాంగౌయు కాంటేను కిరినా యుద్ధంలో ఓడించిన తరువాత ఈ ప్రాంతం మాలి సామ్రాజ్యం ఆధిక్యతలోకి చేరింది. మాలి సామ్రాజ్యం మెంసా (చక్రవర్తులు) రాజవంశీయులు పాలించారు. 1324 లో కంకౌ మొంసా మక్కాకు హజ్ యాత్ర చేసిన అత్యంత ప్రసిద్ధి చెందింది. అతని పాలన ముగిసిన కొద్దికాలం తర్వాత మాలి సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభమైంది. 15 వ శతాబ్దం సామంత రాజ్యాలచే పాలన భర్తీ చేయబడింది.

వీటిలో అత్యంత విజయవంతమైనది థాంగ్ సామ్రాజ్యం. ఇది 1460 నుండి దాని శక్తిని విస్తరించింది. చివరకు భూభాగం, సంపదలో మాలి సామ్రాజ్యాన్ని అధిగమించింది. 1582 లో ఆస్కియా దావుదు పాలనలో తలెత్తిన ఒక పౌర యుద్ధం వరకు సంపన్నంగా ఉంది. బలహీనం అయిన సామ్రాజ్యం కేవలం మూడు సంవత్సరాల తరువాత మొరాకోలు సాగించిన టొంటీబీ యుద్ధం తరువాత పతనం అయింది. మొరాకోలు రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించలేక పోయారు. ఫలితంగా ఇది అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది.

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
వస్సౌలౌ సామ్రాజ్యాధినేత సావోరి టౌర్ 1882 నుండి 1898 లో పట్టుబడే వరకు పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెంచ్ వలసరాజ్య పాలనను వ్యతిరేకించాడు

ప్రధాన పశ్చిమ ఆఫ్రికన్ సామ్రాజ్యాలు పతనం తరువాత వివిధ రాజ్యాలు ప్రస్తుత గినియాను పాలించాయి. ఫుల్నీ ముస్లింలు సెంట్రల్ గినియాలోని ఫూటా జల్లన్కు వలస వచ్చి 1735 నుండి 1898 వరకు ఒక ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి లిఖిత రాజ్యాంగం రూపొందించారు. వస్సౌలౌ (వస్సులు) ఈప్రాంతాన్ని సామ్రాజ్యం స్వల్ప కాలం (1878-1898) పాలించింది. తరువాత వారు ఫ్రెంచి చేతిలో ఓడిపోయి ఐవరీ కోస్టుకు తరలి వెళ్ళారు.

కాలనియల్ యుగం

16 వ శతాబ్దంలో ఐరోపా వ్యాపారులు బానిస వాణిజ్యం కొరకు గినియా తీర ప్రాంతానికి చేరుకున్నారు. త్రికోణాకార వాణిజ్యంలో పనిచేయడానికి బానిసలను ఎగుమతి చేశారు.

19 వ శతాబ్దం మధ్యకాలంలో ఫ్రెంచి సైనిక ప్రవేశంతో గినియా వలస పాలన మొదలైంది. 1898 లో ఫ్రెంచి సైన్యం సావోరి టూరేను ఓడించడంతో ఫ్రెంచి ఆధిపత్యం మొదలైంది. మాలిన్కే సంతతికి చెందిన నాయకుడు ఒయాసౌలౌ మన్సా ( చక్రవర్తి) గైనీ, సమీపప్రాంతాల మీద ఫ్రాన్సుకు నియంత్రణను ఇచ్చాడు.

19 వ శతాబ్దం చివరిలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటీషువారితో సిరియా లియోన్, పోర్చుగీసు వారితో గినియా కాలనీ (ప్రస్తుత గునియా-బిసావు), లైబీరియాతో గునియా ప్రస్తుత సరిహద్దుల గురించి ఫ్రాన్సు చర్చించింది. పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెంచి గినియా భూభాగాన్ని ఏర్పాటు చేసింది, ఇది డాకర్లో ఒక గవర్నర్ జనరల్ నివాసిచే నిర్వహించబడుతుంది. లెనినెంట్ గవర్నర్లు గినియాతో సహా వ్యక్తిగత కాలనీలను నిర్వహించారు.

స్వతంత్రం , కాలానీ పాలన తరువాత (1958–2008)

1958 లో " ఫ్రెంచి నాలుగో గణతంత్రం " రాజకీయ స్థిరత్వం, కాలనీలతో సంబంధాలు వైఫల్యం అయినందుకు (ముఖ్యంగా ఇండోచైనా, అల్జీరియాతో) కారణంగా కూలిపోయింది. ఫ్రెంచి అధ్యక్షుడు చార్లెస్ డి గల్లే 1958 ఆగస్టు 8 న ఫ్రాన్సు కాలనీల స్వయంప్రతిపత్తి గురించి ప్రజాభిప్రాయసేకరణ జరగాలని ఆదేశించాడు. 1958 సెప్టెంబరు 28 న నిర్వహించిన ఫ్రెంచి కమ్యూనిటీ స్వతంత్ర ప్రజాభిప్రాయ సేకరణలో ఫ్రెంచ్ ప్రజలు ఐదవ రిపబ్లిక్ స్థాపనకు మద్దతు ఇచ్చారు. ఇతర కాలనీలు గైనీ -1957 ఎన్నికలలో 60 సీట్లలో 56 సీట్లను గెలుచుకున్న అహ్మదు సికౌ టూరు నాయకత్వంలో గినియా- స్వాతంత్ర్యం కావాలని తీవ్రంగా ఓటు వేసింది. ఫ్రెంచి త్వరగా ఉపసంహరించుకుంది. 1958 అక్టోబరు 2 అహ్మదు సికౌ టూరు అధ్యక్షతలో గ్వినియా సార్వభౌమ స్వతంత్ర రిపబ్లిక్కును ప్రకటించింది.

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
President Ahmed Sékou Touré was supported by the Communist bloc states and in 1961 visited Yugoslavia.

ప్రెసిడెంట్ అహ్మద్ సేకా టూరో కమ్యూనిస్ట్ బ్లాక్స్ రాష్ట్రాలచే మద్దతు ఇవ్వబడింది 1961 లో యుగోస్లేవియా సందర్శించారు. ఫ్రాన్సు ఉపసంహరణ ఫలితంగా ఆర్థిక నిర్బంధాలకు దారితీసింది. అంతేకాకుండా ఫ్రెంచి సాయం మొత్తం ఉపసంహరించి పెట్టుబడులకు ముగింపు పలికింది. ఫలితంగా గినియా సోషలిజాన్ని స్వీకరించి సోవియట్ యూనియనుతో మిత్రత్వం ఏర్పరుచుకుంది. మిత్రత్వం స్వల్పకాలంలో ముగింపుకు వచ్చింది. గినియా చైనా నమూనా సోషలిజాన్ని స్వీకరించింది. అయినప్పటికీ గినియాకు యునైటెడ్ స్టేట్ వంటి పెట్టుబడిదారు దేశాల సహాయం కొనసాగింది.

1960 నాటికి టూర్ పి.డి.జి.ను దేశం ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా ప్రకటించింది. తదుపరి 24 సంవత్సరాలు పి.డి.జి. ప్రభుత్వం మాత్రమే కొనసాగింది. ఎన్నికలలో ఏడు సంవత్సరాల పదవీకాలానికి 4 మార్లు టూర్ అధ్యక్షుడిగా పోటీలేకుండా ఎంపిక చేయబడ్డాడు. జాతీయ అసెంబ్లీకి పిడిజి అభ్యర్థుల జాబితాను ప్రతి ఐదేళ్లకు ఒకమారు ఓటింగు నిర్వహణ ద్వారా నియమించబడ్డారు. దేశీయంగా ఈ ప్రభుత్వం " హైబ్రీడు ఆఫ్రికన్ సోషలిజం " గానూ అంతర్జాతీయంగా " పాన్-ఆఫ్రికనిజం " గానూ గుర్తించబడింది. టూర్ త్వరగా నియంతృత్వ నాయకుడిగా అవతరించాడు. అతని ప్రభుత్వం అసమ్మతి వర్గాలపట్ల అసహనం ప్రదర్శిస్తూ వేలాది మందిని నిర్బంధించింది. అలాగే పత్రికా యంత్రాంగం అణిచివేయబడింది.

1960 వ దశకంనాటికి గినియా ప్రభుత్వం భూములను జాతీయం చేసింది. ఫ్రెంచి-నియమించిన సాంప్రదాయిక అధికారులను తొలగించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం, ఫ్రెంచి కంపెనీలతో సంబంధాలు దెబ్బతిన్నాయి. టూర్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు సోవియట్ యూనియన్ చైనా సహాయం మీద ఆధారపడింది. అయితే ఇది ఉపయోగపడింది. అయితే వీటిలో ఎక్కువ భాగం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడినప్పటికీ (రాజకీయ ర్యాలీలను నిర్వహించేందుకు పెద్ద స్టేడియంల నిర్మాణం వంటివి) ఆర్థికప్రయోజనాలకు ఉపయోగించబడలేదు. దేశం రహదారులు, రైల్వేలు, ఇతర మౌలికనిర్మాణాలు దురవస్థకు గురైంది, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి స్తంభించింది.


1970 నవంబరు 22 న పొరుగున ఉన్న పోర్చుగీసు గినియా నుండి పోర్చుగీసు దళాలు " ఆపరేషన్ గ్రీన్ సీ "ని ఏర్పాటు చేశాయి. బహిష్కరింపబడిన అనేక వందల గినియా వ్యతిరేక దళాలతో కొనాక్రీ మీద దాడి జరిపాయి. గినియాను వేదికాగా చేసుకుని స్వతంత్రం కొరకు తిరుగుబాటు దళాలు పోర్చుగీసు గినియా మీద దాడి చేసిన కారణంగా పోర్చుగీసు సైన్యం సెగౌ టౌర్ను పట్టుకోవడం లేక చంపడం లక్ష్యంగా దాడి చేసింది. తీవ్ర పోరాటం తరువాత, పోర్చుగీస్-దళాలు వెనుకబడి టూర్ను తొలగించకుండా వెనుదిరిగి పోయాయి. ఈ దాడి జరిగిన కొన్ని సంవత్సరాలలో, టూర్ ప్రభుత్వం భారీ ప్రక్షాళనలు నిర్వహించింది. కనీసం 50,000 మంది ప్రజలు (గినియా మొత్తం జనాభాలో 1%) చంపబడ్డారు. అనేకమంది ఖైదు చేయబడ్డారు. విదేశీయుల హింసలు ఎదుర్కొంటున్న కారణంగా దేశం విడిచి వెళ్ళారు (కొన్నిసార్లు వారి గినియాన్ భార్యను అరెస్టు చేసి వారి పిల్లలను ప్రభుత్వ నిర్బంధంలోకి తీసుకున్నారు).

తిరోగమన ఆర్థిక వ్యవస్థ, మూకుమ్మడి హత్యలు, బలహీనమైన రాజకీయ వాతావరణం, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలన్నింటి మీద నిషేధం ఫలితంగా 1977 లో కానక్రీ మదినా మార్కెట్లో పనిచేసే మహిళల "మార్కెట్ మహిళల తిరుగుబాటు" పేరుతో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. ఫలితంగా టూర్ పెద్ద సంస్కరణలను చేశాడు. యునైటెడ్ స్టేట్సుకు మద్దతు ఇవ్వడానికి సోవియట్ యూనియన్ మద్దతు ఉపసంహరించుకున్నాడు. 1970 ల చివర 1980 ల ప్రారంభంలో కొన్ని ఆర్థిక సంస్కరణలు జరిగాయి. కటూర్ కేంద్రీకృత ప్రభుత్వ నియంత్రణ కొనసాగింది. ఫ్రాంసుతో సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఫ్రెంచి అధ్యక్షుడిగా వాలెరీ గిస్కార్డు డి ఎస్టాయింగ్ ఎన్నిక తరువాత వాణిజ్యం అధికరించింది. రెండు దేశాలు దౌత్య సందర్శనలను నిర్వహించాయి.

యునైటెడ్ స్టేట్సులో గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత 1984 మార్చి 26 న సెకా టూర్ మరణించాడు. ప్రధాన మంత్రి లూయిస్ లాన్సానా అధ్యక్షపదవి వహించాడు. కొత్త ఎన్నికలు పెండింగులో ఉన్నందున ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1984 ఏప్రిల్ 3 న కొత్త పి.డి.జి. నాయకుడిని ఎన్నుకొన్నది. అయినప్పటికీ ఆ సమావేశానికి కొద్ది గంటల ముందు కల్నల్ లున్సాన కాంటే, డయరా ట్రారరేలు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంటే అధ్యక్షుడి పాత్రను పోషించగా ట్రోరే డిసెంబరు వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించాడు.

కాంటే వెంటనే మునుపటి పాలన మానవ హక్కుల ఉల్లంఘనను ఖండించాడు. 250 రాజకీయ ఖైదీలను విడుదల చేసి బహిష్కరణ నుండి తిరిగి రావాలని సుమారు 2,00,000 ప్రజలను ప్రోత్సహించాడు. అతను సోషలిజం నుండి మలుపు తిరుగుతూనే ఉన్నాడు. ఇది పేదరికాన్ని తగ్గించడానికి చాలా స్వల్పంగా కృషి చేసింది. దేశం ప్రజాస్వామ్యానికి దిశగా మారడానికి తక్షణ సంకేతాలు చూపలేదు

1992 లో కాంటే పౌర పాలనను తిరిగి ప్రకటించాడు. 1993 లో అధ్యక్ష ఎన్నికలతో 1995 లో పార్లమెంటు ఎన్నికలతో (దీనిలో అతని పార్టీ-యునిటి పార్టీ, ప్రోగ్రెస్-141 స్థానాలలో 71 సీట్లు గెలుచుకుంది) ప్రజాస్వామ్య నిబద్ధత ఉన్నప్పటికీ, కాంటేకు అధికారం మీద పట్టు ఉండిపోయింది. 2001 సెప్టెంబరులో ప్రతిపక్ష నేత ఆల్ఫా కాండే ఖైదు చేయబడి 8 నెలల తరువాత క్షమాభిక్ష విడుదల చేయబడ్డాడు. తరువాత ఆయన శేషజీవితాన్ని ఫ్రాంసులో గడిపాడు.

2001 లో కాంటే నిర్వహించిన ప్రజాభిప్రాయం అధ్యక్ష పదవిని పొడిగించేందుకు మద్దతు ఇచ్చింది. 2003 లో ఎన్నికల తరువాత మూడవసారి ప్రారంభం అయిన కాంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 2005 జనవరిలో రాజధాని కానాక్రీలో అరుదైన బహిరంగ ప్రజల ముందుగా హాజరైనప్పుడు కెంటే మీద జరిగిన హత్యా ప్రయత్నం నుండి ఆయన తప్పించుకున్నాడు. అతని ప్రత్యర్థులు అతను "అలసిపోయిన నియంత" అని, ఆయనను పదవి నుండి తొలగించడం అనివార్యమని పేర్కొన్నారు. అయితే ఆయన మద్దతుదారులు ఆయన తిరుగుబాటుదారులతో పోరాడి విజయం సాధిస్తాడని విశ్వసించారు. గినియా ఇప్పటికీ చాలా నిజమైన సమస్యలను ఎదుర్కొంటోంది. విదేశాంగ విధానం ప్రకారం విఫలమైన దేశంగా భావించబడుతుంది.

2000 లో గినియా అస్థిరత్వంలో చిక్కుకుంది. తిరుగుబాటుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లైబీరియా, సియెర్రా లియోన్ సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశించారు. దేశంలో అంతర్యుద్ధ సమయం ఆసన్నమైనది అనడానికి ఇది సూచనగా ఉందని భావించబడింది. గినియా సహజ వనరుల మీద ఆశతో చేసారని పొరుగున దేశ నాయకులను నిందించారు. అయితే ఈ వాదనలు తీవ్రంగా తిరస్కరించబడ్డాయి. 2003 లో తిరుగుబాటుదారులను అధిగమించడానికి ఆమె పొరుగువారితో ప్రణాళికలు చేయడానికి గినియా అంగీకరించింది. 2007 లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలు జరిగాయి. ఫలితంగా దేశానికి కొత్త ప్రధాన మంత్రి నియమించబడ్డారు.

సమీపకాల చరిత్ర

కాంటే 2008 డిసెంబరు 23 డిసెంబరు 23 వరకు అధికారంలో కొనసాగాడు. ఆయన మరణం తరువాత చాలా గంటలు వరకు అధికారంలో కొనసాగారు. మౌసా దాదిస్ కమారా తిరుగుబాటు ద్వారా అధికారం స్వాధీనం చేసుకుని తనను సైనిక సైనిక అధికారిగా ప్రకటించాడు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 2009 సెప్టెంబరు 28 న సైనికాధ్యక్షుడిగా కామరా చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వ్యక్తులపై దాడిచేయాలని తన సైనికులను ఆదేశించిన తరువాత దాడిలో 157 మంది మరణించారు. సైనికదాడులు మానభంగం, వినాశనం, హత్యల వంటి హింసాత్మక చర్యలకు దారితీసాయి. అనేక విదేశీ ప్రభుత్వాలు నూతన పాలనకు తమ మద్దతును ఉపసంహరించుకునేందుకు కారణమైంది. 2009 డిసెంబరు 3 న సెప్టెంబరులో వినాశనంపై వివాదం జరుగుతున్న సమయంలో ఆయన సహాయకుడు కామరాను కాల్చారు. కమారా వైద్య సంరక్షణ కొరకు మొరాకోకు వెళ్లాడు. కమారా లేకపోవటంతో దేశాన్ని నడపడానికి లెబనాన్లో ఉన్న ఉపాధ్యక్షుడు (, రక్షణ మంత్రి) సెకాబా కొనాటే లెబనాన్ నుండి వెళ్లాడు. 2010 లో జనవరి 13 - 14 లో ఓగగాడుగోలో సమావేశం తరువాత కమారా, కొనాటే, బుర్కినా ఫాసో అధ్యక్షుడైన బ్లైజ్ కాంపొరే వెలువరించిన పన్నెండు సూత్రాల అధికారిక ప్రకటనలో ఆరునెలల్లో గినియాలో పౌర పాలన తిరిగి తీసుకురాబడుతుందని హామీ ఇచ్చారు. 27 జూన్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. నవంబరు 7 న రెండవ ఎన్నికలు జరిగాయి. ఓటరు ఓటు అధికమైంది. ఎన్నికలు సజావుగా సాగాయి. ప్రతిపక్ష పార్టీ "ర్యాలీ ఆఫ్ గైనిన్ పీపుల్ " నాయకుడైన ఆల్ఫా కాండే భద్రతా రంగాన్ని సంస్కరించేందుకు, మైనింగ్ కాంట్రాక్టులను సమీక్షించడానికి హామీనిచ్చారు.

2013 ఫిబ్రవరి చివరిలో ఎన్నికల పారదర్శకతపై తమ ఆందోళనలను వినిపించేందుకు నిరసనకారులు వీధుల్లోకి దిగడంతో గినియాలో రాజకీయ హింస విస్ఫోటనం అయింది. ఎన్నికల సన్నాహాల్లో పారదర్శకత లేదని ప్రతిపక్ష సంకీర్ణం ఎన్నికల ప్రక్రియ నుండి విరమించుకోవాలనే నిర్ణయంతో ప్రదర్శనలు నిర్వహించింది. నిరసన సమయంలో తొమ్మిది మంది మృతి చెందారు, 220 మంది గాయపడ్డారు. నిరసనకారులపై భద్రతా దళాలు ప్రత్యక్షంగా మందుగుండు సామగ్రిని ఉపయోగించిన కారణంగా మరణాలు, గాయాలు సంభవించాయి.

రాజకీయ హింస ఫూలా, మలింక్ల మధ్య జాతి ఘర్షణలకు దారితీసింది. ఇది అధ్యక్షుడు కొండేకు మద్దతు ఇచ్చింది. రైతులు ప్రధానంగా వ్యతిరేకత మద్దతు.

2013 మార్చిన మే 12 న జరగబోయే ఎన్నికల గురించిన చర్చల నుండి ప్రతిపక్షాలు ఉపసంహరించుకున్నాయి. ప్రభుత్వం వారిని గౌరవించలేదని, వారు అంగీకరించిన ఏ వాగ్దానాలను కొనసాగించలేదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

2014 మార్చి 25 న ప్రపంచ ఆరోగ్య సంస్థ గినియా ఆరోగ్యమంత్రిత్వశాఖ గినియాలో ఎబోలా వైరస్ వ్యాధుల వ్యాప్తి గురించి నివేదించిందని తెలిపింది. ఈ ప్రారంభ వ్యాప్తిలో మొత్తం 86 కేసులు ఉన్నాయి. వాటిలో 59 మరణాలు ఉన్నాయి. మే 28 నాటికి, 181 మరణాలతో 281 కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు మెలిఒండౌ గ్రామంలో నివసిస్తున్న 2 ఏళ్ల బాలుడైన ఎమిలే ఓవావానో అని భావిస్తున్నారు. 2013 డిసెంబరు 2 న అతను అనారోగ్యానికి గురై డిసెంబరు 6 న మరణించాడు. 2014 సెప్టెంబరు 18 న వోమీ పట్టణంలోని ఎబోలా విద్య ఆరోగ్య సంరక్షణ బృందంలో ఎనిమిది మంది సభ్యులను గ్రామస్థులు హత్య చేశారు. 2015 నవంబరు 1 నాటికి గినియాలో 3,810 కేసులు, 2,536 మరణాలు ఉన్నాయి.

భౌగోళికం

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
గినియా నగరాలు, పరిపాలక విభాగాలను చూపే పటం
గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
కొప్పెన్ వాతావరణ వర్గీకరణ గినియా పటం

ఉత్తరసరిహద్దులో సెనెగల్, ఈశాన్య సరిహద్దులో మాలి, తూర్పు సరిహద్దులో ఐవరీ కోస్ట్, దక్షిణ సరిహద్ధులో లైబీరియా - సియెర్రా లియోన్ ఉన్నాయి. గినియా పర్వతభూములలో నైజర్ నది, గాంబియా నది, సెనెగల్ నది మూలాలు ఉన్నాయి.

గినియా వైశాల్యం 2,45,857 చ.కి.మీ 2 (94,926 చ.మై). సముద్ర తీరం 320 కిమీ (200 మైళ్ళు) ఉంది. మొత్తం భూసరిహద్దు 3,400 కి.మీ (2,100 మై) మొత్తం భూ సరిహద్దు ఉన్నాయి. ఇది 7 ° - 13 ° ఉత్తర అక్షాంశం, 7 ° - 15 ° పశ్చిమ రేఖాంశంలో (చిన్న ప్రాంతం 15 ° పశ్చిమం) ఉంటుంది.

గినియాను నాలుగు ప్రధాన ప్రాంతాలుగా విభజించారు: సుసి జాతి సమూహం ప్రధానంగా నివసించిన దిగువ గినియా లేదా బాస్సే-కాటే మారిటైమ్ గినియా అంటారు. మౌంటెన్ జల్లాన్ అని పిలువబడుతున్న శీతలపర్వతప్రాంతం దేశంలో ఉత్తర, దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఫులా ప్రజలు నివసిస్తుంటారు. సహెలియన్ హ్యుటే గినియా అనిపిలువబడుతున్న ప్రాంతంలో మలింకే ప్రజలు నివసిస్తున్నారు. వాయవ్యంలో ఉన్న అటవీ ప్రాంతంలో పలు స్థానిక జాతి ప్రజలు నివసిస్తున్నారు. గినియా పర్వతాలు నైగర్, గాంబియా, సెనెగల్ నదులకు మూలంగా ఉన్నాయి. ఈ నదులు సియెర్రా లియోన్, ఐవరీ కోస్టు పశ్చిమాన ఉన్న సముద్రంలోకి ప్రవహిస్తుంటాయి.

1,752 మి (5,748 అ) ఎత్తున్న మౌంట్ నింబ గినియాలోని ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడుతుంది. గినియా, ఇవోరియన్ వైపు ఉన్న నింబ మాసిఫ్ యునెస్కో నేచర్ రిజర్వు (గినియాన్ బ్యాక్బోన్ అని పిలవబడుతుంది) లైబీరియాలో కొనసాగుతుంది. ఇక్కడ అది దశాబ్దాలుగా తవ్వబడింది.జెరెకొరే ప్రాంతంలో ఈ నష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రాంతాలు

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
ప్రాంతాలు

వెస్ట్ ఆఫ్రికాలో భూమధ్యరేఖకు 10 డిగ్రీలు ఉత్తరంగా గినియా రిపబ్లిక్కు 2,45,857 చదరపు కిలో మీటర్ల (94,926 చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది. విభిన్న మానవ, భౌగోళిక, వాతావరణ లక్షణాలు కలిగిన గినియాను నాలుగు సహజ ప్రాంతాలుగా విభజించారు:

  • మారిటైమ్ గినియా (లా గుయిన్లీ మారిటైం) దేశం 18% వర్తిస్తుంది.
  • మధ్య గినియా (లా మొయిన్నే-గుయిన్) దేశంలో 20% వర్తిస్తుంది.
  • అప్పర్ గినియా (లా హూట్-గ్వినీ) దేశం 38% వర్తిస్తుంది.
  • ఫారెస్టు గినియా (గినియా ఫరెస్టియరె) దేశంలో 23% వర్తిస్తుంది. అటవీ, పర్వత రెండు ఉంది.

గినియాను ఎనిమిది పరిపాలనా ప్రాంతాలుగా, ముప్పై-మూడు మున్సిపాలిటీలుగా ఉపవిభజన చేయబడింది. కానరీ గినియా రాజధాని, అతిపెద్ద నగరం, ఆర్థిక కేంద్రంగా ఉంది. దక్షిణ గినియాలోని గ్విని అడ్రియరీ ప్రాంతంలో ఉన్న నఫెరెకోరే రెండవ అతిపెద్ద నగరంగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కంకన్, కిండియా, లాబెల్, గుక్కెడౌ, బోక్, మమౌ, కిసిడౌగౌ 100,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న నగరాలుగా ప్రత్యేకత కలిగి ఉన్నాయి.

  • రాజధాని కానరీ 1,667,864 జనసంఖ్యతో ప్రత్యేక జోన్గా ఉంది.
ప్రాంతం రాజధాని జనసంఖ్య
(2014 గణాంకాలు)
కొనాక్రీ ప్రాంతం కొనాక్రీ 1,667,864
నజెరెకోరే నజెరెకోరే 1,663,582
కంకన్ ప్రాంతం కంకన్ 1,986,329
కిండియా ప్రాంతం కిండియా 1,559,185
బొకే ప్రాంతం బొకే 1,081,445
[లాబే ప్రాంతం [ప్లాబె 995,717
ఫరనాహ్ ప్రాంతం ఫరనాహ్ 942,733
మమౌ ప్రాంతం మమౌ 732,117

వన్యజీవితం

The wildlife of Guinea is very diverse due to the wide variety of different habitats. The southern part of the country lies within Guinean Forests of West Africa Biodiversity Hotspot, while the north-east is characterized by dry savanna woodlands. Unfortunately, declining populations of large animals are restricted to uninhabited distant parts of parks and reserves.

జంతుజాలం

Species found in Guinea include the following:

  • Amphibians : Hemisus guineensis, Phrynobatrachus guineensis
  • Reptiles : Acanthodactylus guineensis, Mochlus guineensis
  • Arachnids: Malloneta guineensis, Dictyna guineensis
  • Insects : Zorotypus guineensis, Euchromia guineensis
  • Birds: Melaniparus guineensis

ఆర్ధికం

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
A proportional depiction of Guinea's export products
గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
Malinke fisher women on the Niger River, Niandankoro, Kankan Region, in eastern Guinea
గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
Kissidougou market

సహజ వనరులు

గినియాలో ప్రపంచంలోని బాక్సైటు నిల్వలలో 25% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అదనంగా గినియాలో వజ్రాలు, బంగారం ఇతర లోహాలు ఉన్నాయి. దేశం బృహత్తరమైన జలవిద్యుత్తు శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం బాక్సైటు, అల్యూమినా ప్రధాన ఎగుమతులు. ఇతర పరిశ్రమలలో బీరు, పండ్లరసాలు, శీతల పానీయాలు, పొగాకు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. దేశం కార్మిక శక్తిలో 80% వ్యవసాయం నుండి ఉపాధి పొందుతోంది. ఫ్రెంచి పాలనలో, స్వాతంత్ర్యం ప్రారంభంలో గినియా అరటి, అనాస, కాఫీ, వేరుశెనగ, పామాయిలు ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. గినియా మత్స్య, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేల, నీరు, వాతావరణ పరిస్థితులు, పెద్ద ఎత్తున లభిస్తున్న సాగునీరు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు అవకాశాలను అందిస్తాయి.

గనులు

గినియాలో 25 బిలియన్ టన్నులు (మెట్రిక్ టన్నులు) బాక్సైటు నులువలు ఉన్నాయి. అదనంగా గినియా ఖనిజ సంపదలో 4-బిలియన్ టన్నుల ఇనుము ధాతువు, గణనీయమైన వజ్రం, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. యురేనియం పరిమాణాలు నిర్ణయించబడలేదు. ఈ ప్రాంతాలలో పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ గినియాలో మైళిక సదుపాయాలు పేలవంగా ఉన్నాందున, అవినీతి ప్రబలంగా ఉండడం పెట్టుబడి ప్రాజెక్టులకు పెద్ద అడ్డంకులు ఉన్నాయి.

వాయువ్య గినియాలో జాయింట్ వెంచర్ బాక్సైటు మైనింగు, అల్యూమినా కార్యకలాపాలు 80% గినియా విదేశీ మారకాన్ని అందిస్తాయి. బాక్సైటు అల్యూమినాలో శుద్ధి చేయబడుతుంది. తరువాత ఇది అల్యూమినియంలోకి కరిగించబడుతుంది. ఇది ఏటా 14 మిలియన్ టన్నుల ఉన్నత-స్థాయి బాక్సైటును ఎగుమతి చేస్తూ బాక్సైటు పరిశ్రమలో ప్రధాన ఉత్పత్తిదారు దేశంగా ఉంది. సిబిజి జాయింట్ వెంచరులో 49% గినియాన్ ప్రభుత్వం, 51% హాల్కో మైనింగ్ ఇంకు సంస్థకు భాగస్వామ్యం ఉంది. 2038 నాటికి ఉత్తర-పశ్చిమ గినియాలోని బాక్సైటు నిల్వలు, వనరుల మీద సి.బి.జి. ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. గినియా, ఆర్.యు.ఎస్.ఎ.ఎల్. ప్రభుత్వం మధ్య ఒక ఉమ్మడి వ్యాపారం అయిన " కాంపాజిన్ డెస్ బాక్సిట్ డీ కిండియా " సంవత్సరానికి సుమారు 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుంది. ఇది అత్యధికంగా రష్యా, తూర్పు ఐరోపాకు ఎగుమతి చేయబడుతుంది. గినియన్, ఉక్రేనియన్ జాయింటు వెంచరు బాక్సైటుకు చెందిన డియాన్ డియాన్, సంవత్సరానికి 10,00,000 టన్నుల ఉత్పత్తిని అంచనా వేసినప్పటికీ అనేక సంవత్సరాలపాటు ఇది క్రియారూపం చెందలేదు. మునుపటి ఫ్రైగియా కన్సార్టియాన్ని తీసుకున్న " అల్యూనానా కంపాజిన్ డి గియానీ 2004 లో 2.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఇది అల్యూమినా రిఫైనరీకి ముడి పదార్థంగా ఉంది. రిఫైనరీ ఎగుమతులు సుమారు 7,50,000 టన్నుల అల్యూమినా ఎగుమతి చేస్తుంది. గ్లోబల్ అల్యూమినా, అల్కోవా-ఆల్కన్ రెండు సంవత్సరానికి 4 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన అల్యూమినా రిఫైనరీలను నిర్మించడానికి గినియా ప్రభుత్వంతో సమావేశమై సంతకాలు చేసాయి.

వజ్రాలు, బంగారం కూడా భారీ స్థాయిలో త్రవ్వకాలూ ఎగుమతి చేయబడతాయి. వజ్రాలలో అధిక భాగం నిపుణులచేత తవ్వి తీయబడ్డాయి. గినియాలో అతిపెద్ద బంగారు మైనింగు కార్యకలాపాలు ప్రభుత్వం, ఘనా అషాంటి గోల్డు ఫీల్డుల మధ్య జాయింటు వెంచరుగా జరుగుతున్నాయని భావించవచ్చు. గినియా ప్రభుత్వం (50%), ఆస్ట్రేలియన్, బ్రిటీషు, స్విసు కన్సార్టియం మధ్య జాయింటు వజ్రాల-మైనింగ్ వెంచరు 1984 లో ఉత్పత్తి ప్రారంభం చేస్తుంది. 90% నాణ్యమైన వజ్రాలు తవ్వబడింది. కెనడాలోని ఫస్ట్ సిటీ మైనింగ్ కన్సార్టియం అంతర్జాతీయ భాగాన్ని కొనుగోలు చేసిన తరువాత ఉత్పత్తి 1993 నుండి 1996 వరకు నిలిపివేయబడింది. " సొసైటీ మినియేర్ డి దిన్డురాయే " కూడా మాలియన్ సరిహద్దు దగ్గర ఉన్న లిరోలో ఒక పెద్ద బంగారు మైనింగ్ సదుపాయం కలిగి ఉంది.

చమురు

2006 లో " కార్పొరేష ఆఫ్ హైపర్డినామిక్స్ హ్యూస్టన్ " ఒక పెద్ద " ఒక పెద్ద ఆఫ్ షోర్ ట్రాక్టు " అన్వేషించడానికి గినియాతో ఒక భాగస్వామ్య ఒప్పందం మీద సంతకం చేసింది. ఇటీవల డానా పెట్రోలియం పి.ఎల్.సి.(అబెర్డీన్, యునైటెడ్ కింగ్డమ్) తో భాగస్వామ్యం పొందింది. ప్రారంభ బావి సబు -1, సుమారు 700 మీటర్ల నీటిలో అక్టోబర్ 2011 లో డ్రిల్లింగ్ ప్రారంభించాలని నిర్ణయించబడింది.

2012 లో అన్వేషణ డ్రిల్లింగ్ పూర్తయిన తరువాత సాబు -1 బాగా వ్యాపారపరంగా ఎదురు చూసినంతగా విజయవంతం కాలేదు. నవంబర్ 2012 నవంబరులో హైపర్డినామిక్స్ అనుబంధ ఎస్.సి.ఎస్, తులౌ ఆయిలుకు 40% రాయితీలను విక్రయాలకు విక్రయించి గినియాకు 37% హైపర్ డైనమిక్సు, 40% టుల్లో ఆయిలు, 23% డానా పెట్రోలియంలకు యాజమాన్య వాటాలను తీసుకువచ్చింది. 2016 సెప్టెంబరులో హైపర్ డైనమిక్సు సమీపకాల ఒప్పందం ఆధారంగా ఎన్నుకున్న తరువాతి ప్రాంతం ఫటాలా టర్బిడైట్ " ప్రాస్పెక్టులో డ్రిల్లింగు ప్రారంభించింది.

వ్యవసాయం

గిరిజనులలో అధికభాగం వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. దేశంలోని సుమారు 75% మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. సెలఏరులు, నదుల మధ్య ప్రవహించే జలప్రవాహిత ప్రాంతాలలో వరి సాగు చేయబడుతుంది. స్థానికంగా పండించే ఆహారపదార్థం దేశం అవసరాలకు సరిపోదు కనుక ఆసియా నుంచి దిగుమతి చేయబడుతుంది. గినియా వ్యవసాయ రంగం కాఫీ బీన్సు, అనాస, పీచెస్, తేనె, మామిడి, నారింజ, అరటిపండ్లు, బంగాళాదుంపలు, టమోటాలు, దోసకాయలు, మిరియాలు, అనేక రకాల ఇతర ఉత్పత్తులను అందిస్తుంది. గినియా ఆపిల్సు, బేరి ప్రాంతీయ నిర్మాతలలో ఒకటిగా అభివేద్ధి చెందుతుంది. గినియాలో అనేక ద్రాక్ష, దానిమ్మ తోటలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో హైడ్రోపోనిక్ వ్యవస్థ ఆధారంగా స్ట్రాబెర్రీ తోటల అభివృద్ధి సాధ్యం అయింది.

పర్యాటకం

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
Le "Voile" de la mariée à Kindia

గినియా విభిన్న భూగోళ శాస్త్రం కారణంగా కొన్ని ఆసక్తికరమైన పర్యాటక స్థలాలను అందిస్తుంది. బెస్సే గునీ (దిగువ గినియా), మోయెన్నే గిని (మధ్య గినియా) ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే జలపాతాలలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంది. కుంబడాగ, కిండియాలో ఉన్న మౌంట్ కకోలెమాలో సౌంబా శిఖరం, డబ్రేకాలో ఉన్న వూలే డి లా మేరీ (వధువు వీల్), పిట అధికారంలో ఉన్న కోకోలా నదిపై 80 మీటర్ల ఎత్తులో ఉన్న కింకిన్ శిఖరం, వర్షాకాలంలో 100 మీ. ఎత్తైన కంబడాగా జలపాతాలు, దలాబా డిటిన్ & మిట్టీ జలపాతాలు, ఫెటోరే జలపాతాలు, లాబెల్ ప్రాంతంలో ఉన్న రాతి వంతెన బాగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి.

సమస్యలు , సంస్కరణలు

2002 లో గినియా ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనది అని పేర్కొంటూ ఐఎంఎఫ్ గినియా లోని " పావర్టీ రిడక్షన్ అండ్ గ్రోత్ ఫెసిలిటీ "ని రద్దు చేసింది. పి.ఆర్.జి.ఎఫ్. సామాజిక ప్రాధాన్యతా రంగాలను అభివృద్ధి చేయడానికి వ్యయం చేయడంలో గినియా తన లక్ష్యాన్ని చేరుకున్నదని పేర్కొంది. ఇతర రంగాలలో వ్యయం చేయడం రక్షణ వంటి ఇతర ప్రధాన రంగాలలో ద్రవ్య లోటుకు దారి తీసింది అని భావించబడింది. దోహదపడింది. [ఆధారం చూపాలి] ఐ.ఎం.ఎఫ్. నిధుల నష్టాన్ని సెంట్రల్ బ్యాంకు నుండి రుణాలను పొందడం ద్వారా భర్తీ చేసింది. అసమర్ధ ఆర్థిక విధానాలకు ఏర్పడిన అసమానతలు సరిదిద్దటానికి వూలుకానంతగా కఠినంగా మారాయి.

అప్పటి ప్రధానమంత్రి డయాల్లో ప్రభుత్వం 2004 డిసెంబరులో కఠినమైన సంస్కరణ ఎజెండాను ప్రారంభించింది. ఇది ఐ.ఎం.ఎఫ్. గినియాకు తిరిగి ఒక పి.ఆర్.జి.ఎఫ్. ఇవ్వడానికి రూపొందించబడింది. ఎక్సేంజి రేట్లు సరళీకృతం చేయబడ్డాయి. గ్యాసోలిన్ ధర నియంత్రణలు తగ్గిపోయాయి. పన్ను సేకరణ మెరుగుపరచబడి ప్రభుత్వ ఖర్చు తగ్గించబడింది. ఈ సంస్కరణలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించలేదు. 2004 లో 27% నుండి 2005 లో 30%కి అధికరించింది. కరెన్సీ తరుగుదల కూడా ఒక ఆందోళనకరంగా మారింది. గినియా ఫ్రాంకు 2005లో డాలరుకు 2550 ట్రేడింగు జరిగింది. అక్టోబరు 2006 అక్టోబరు నాటికి డాలరుకు 5554 కు చేరుకుంది. 2016 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 9089 కు చేరుకుంది.

2005 లో గినియా, మాలి లను కలిపే ఒక కొత్త రహదారి ప్రారంభమైనప్పటికీ ప్రధాన రహదారులకు చాలా తక్కువ స్థాయిలో మరమ్మత్తు జరుగుతుంటాయి కనుక స్థానిక మార్కెట్లకు వస్తువుల పంపిణీకి ఇవి ఆటంకంగా మారాయి. తరచుగా విద్యుత్తు నీటి కొరత జరుగుతూ ఉన్నాయి. అనేక వ్యాపారాలు ఖరీదైన విద్యుత్తు జనరేటర్లు, ఇంధనంగా ఉపయోగించవలసిన అగత్యం ఏర్పడుతూ ఉంటుంది.

గినియా ఆర్థికవ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కొందరు విదేశీ పెట్టుబడిదారులు గినియాకు రావటానికి ఇష్టపడాతారు. గ్లోబల్ అల్యుమినా ప్రతిపాదిత అల్యూమినా రిఫైనరీ విలువ 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అల్కా అండ్ అల్కాన్ కొద్దిగా చిన్న రిఫైనరీ విలువను 1.5 బిలియన్ డాలర్ల వరకు ప్రతిపాదిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చాద్-కామెరూన్ చమురు పైపులైన్ నుండి ఉప-సహారా ఆఫ్రికాలో అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడుదారులుగా గుర్తించబడుతున్నారు. అలాగే అమెరికన్ చమురు సంస్థ అయిన హైపర్డినామిక్స్ కార్పొరేషన్, 2006 లో 31,000 చదరపు మైళ్ళు (80,000 k మీ 2) రాయితీలో గినియా సెనెగల్ బేసిన్ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

2009 అక్టోబరు 13 న, చైనా ఇంటర్నేషనల్ ఫండ్ మౌలిక సదుపాయాలలో $ 7bn (£ 4.5bn) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు గినియాన్ మైన్స్ మంత్రి మహ్మౌద్ థియం ప్రకటించాడు. దీనికి బదులుగా ఖనిజ సంపన్న దేశంలో అన్ని మైనింగ్ ప్రాజెక్టులలో సంస్థ "వ్యూహాత్మక భాగస్వామి"గా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంస్థ, పోర్ట్సు, రైల్వే లైన్లు, పవర్ ప్లాంట్సు, తక్కువ ధర గృహ నిర్మాణం, రాజధాని కనాక్రిలో ఒక నూతన పరిపాలనా కేంద్రంగా నిర్మించటానికి కూడా సహాయం చేస్తుంది అని తెలిపారు. 2010 ఎన్నికల తరువాత 2011 సెప్టెంబరులో మైనింగ్ మంత్రి మొహమెద్ లామినో ఫఫోనా మాట్లాడుతూ ప్రభుత్వం మాజీ సైనిక ఒప్పందాన్ని తిరస్కరించిందని ప్రకటించాడు.

యూత్ నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. పట్టణ యువకుల ఆందోళనలను పరిష్కరించేందుకు గినియాకు తగిన విధానాలు అవసరమవుతాయి. ఉద్యోగాలను దొరకని యువతకు ధనిక దేశాల ఆర్థిక శక్తి, వినియోగదారుల వాడకం వారిని మరింత నిరాశపరిచేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది.

గనులు , వివాదాలు

గినియాలో ఉక్కు తయారీ ముడి పదార్థం అయిన ఇనుప ఖనిజం నిల్వలు భారీగా ఉన్నాయి. " రియో టింటో గ్రూప్ " ఇనుప గని 6 బిలియన్ డాలర్ల సీమండౌ ఇనుము ధాతువు ప్రాజెక్టులో అధిక భాగాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలో అత్యుపయోగం చేయని అత్యుత్తమ వనరుగా గుర్తించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పిబిరారా మాదిరిగానే ఉంటుంది.

2017 లో ఓచ్-జిఫ్ కాపిటల్ మేనేజ్మెంట్ గ్రూప్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ విచారణ యునైటెడ్ స్టేటులో విచారణలో బహుళ-సంవత్సరాల లంచం పథకం వేసినందుకు దోషిగా నిరూపించబడి $ 412 మిలియన్ జరిమానా విధించబడింది. దీని తరువాత ఎస్.ఇ.సి. కూడా ఒక లంచం పథకంలో తన పాత్ర వహించాడని ఓచ్-జిఫ్ కు వ్యతిరేకంగా యు.ఎస్.లో దావా వేసింది.

2009 లో గినియా ప్రభుత్వం సిమండౌ ఉత్తర భాగం బి.ఎస్.జి.ఆర్. ఈ ప్రాజెక్టుకు $ 165 మిలియన్ల పెట్టుబడి పెట్టింది. రైల్వేలో 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేయడానికి హామీ ఇచ్చింది. రియో ​​టింటో తగినంతగా వేగంగా ఉత్పత్తి చేయలేదు. బి.ఎస్.జి.ఆర్. రాయితీని పొందటానికి అధ్యక్షుడి భార్యకు లంచాలు ఇచ్చినట్లు చేసిన ఆరోపణలను US న్యాయ శాఖ దర్యాప్తు చేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి గినియా అధ్యక్షుడు ఆల్ఫా కాండే ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలను విచారించింది.

2014 ఏప్రెలులో సిమాన్డోలో గినీన్ ప్రభుత్వం కంపెనీ మైనింగ్ హక్కులను రద్దు చేసింది. బి.ఎస్.జి.ఆర్. ఆరోపణలను నిరాకరించింది. 2014 మేలో మైనింగ్ హక్కుల రద్దు చేసిన గినియా నిర్ణయం ప్రభుత్వంపై మద్యవర్తిత్వం చేయాలని కోరింది.

2010 లో రియో ​​టింటో అల్యూమినియం కార్పోరేషన్ ఆఫ్ చైనా లిమిటెడుతో ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. ఒప్పందం ఆధారంగా సిమ్దాయు ఇనుము ధాతువు ప్రాజెక్ట్ కోసం ఒక ఉమ్మడి వెంచర్ను ఏర్పాటు చేసింది. 2016 నవంబరులో రియో ​​టింటో సింధూలో హక్కులను పొందటానికి ప్రెసిడెంట్ ఆల్ఫా కాండేకు దగ్గరి సలహాదారునికి 10.5 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ఒప్పుకున్నాడు. ఆయన లంచం గురించి తనకు ఏమీ తెలియదని తను ఏ తప్పు చేయలేదని ఖండించారు. ఏదేమైనా, ఫ్రాంసు 24 ద్వారా పొందిన రికార్డుల ప్రకారం, గినియా అధికారులు సిమండౌ బ్రైబెరీస్ గురించి తెలుసుకున్నారు.

2017 జూలైలో యు.కె.- ఆధారిత " యాంటీ ఫ్రాడు రెగ్యులేటరు ", " సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ " ఆస్ట్రియన్ ఫెడరల్ పోలీసు గినియాలో రియో ​​టింటో వ్యాపార పద్ధతులపై విచారణ ప్రారంభించింది.

2016 నవంబరులో మాజీ గనుల మంత్రి మహ్మౌద్ థియం రియో ​​టింటో గినియా ఆపరేషన్ విభాగానికి అధిపతి 2010 లో రియో ​​టింటో ఆపరేషన్ (అభివృద్ధి చేయబడని సిగ్మౌండు ప్రాజెక్టు) తిరిగి పొందేందుకు తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు.

2011 సెప్టెంబరులో గినియా ఒక కొత్త మైనింగ్ కోడ్ను స్వీకరించింది. 2008 లో నియంతృత్వాన్ని ముగించటం, కొండే అధికారంలోకి రావడం మధ్య అస్తవ్యస్తమైన రోజులలో ప్రభుత్వ ఒప్పందాలు సమీక్షించటానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది.

2015 సెప్టెంబరులో ఫ్రెంచి ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అధ్యక్షుడు ఆల్ఫా కాండే కుమారుడు మొహమేడు ఆల్ఫా కాండే మీద విచారణ ప్రారంభించింది. ఆయన ప్రజా నిధులను అపహరించటం, గినియా మైనింగ్ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఫ్రెంచ్ కంపెనీల నుండి ఆర్థిక, ఇతర ప్రయోజనాలను పొందాడని నిర్ధారించబడింది.

2016 ఆగస్టులో ఓచ్- జిఫ్ ఆఫ్రికా మేనేజ్మెంట్ లిమిటెడులో పనిచేసిన గినియా మాజీ ప్రధాన మంత్రి కుమారుడు గినియా, చాద్, నైజర్ అధికారులకు లంచం ఇచ్చాడన్న ఆరోపణతో యు.ఎస్.లో ఖైదుచేయబడ్డాడు. తరువాత విశ్వసనియమైన ఆధారాలు సేకరించడానికి పూనుకున్నది. అధ్యక్షుడు కాండే పాలనలో ఆయన గినియా గనుల చట్టాన్ని మార్పులతో తిరిగి రూపొందించాడు. 2016 డిసెంబరులో " ప్రధాన మంత్రి కుమారుడు యు.ఎస్. డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ " ఆఫ్రికా అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అంగీకరించాడాని ప్రకటించాడు.

ఒక గ్లోబల్ సాక్షుల నివేదిక ఆధారంగా " సేబుల్ మైనింగ్ " నింబా పర్వతాలలో ఇనుప ఖనిజాల వెలికితీత హక్కులు పొందడానికి 2010 నాటి ఎన్నికలకు అధ్యక్ష పదవి ప్రచారం కొరకు ఆయన కుమారుడు లంచం ఇచ్చిందని భావించారు. ఈ ఆరోపణలు ఇంకా ధ్రువీకరించబడనప్పటికీ 2016 మార్చిలో గునియా అధికారులు ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించారు.

కాండే ప్రభుత్వం రెండు ఇతర ఒప్పందాలను కూడా దర్యాప్తు చేసింది. గినియా ఆఫ్షోర్ లీజు కేటాయింపుల్లో మూడోవంతులతో హైపర్డినామినాకు విడిచిపెట్టడం, అలాగే రియుసల్ ఫ్రైగియా అల్యూమినియం రిఫైనరీని కొనుగోలు చేయడానికి చాలా తక్కువ రూసల్ చెల్లించిందని పేర్కొంది.

అల్పసంఖ్యాక ప్రజలు , మహిళా హక్కులు

గినియాలో హోమోసెక్సువాలిటీ నేరంగా పరిగణించబడుతుంది. స్వలింగ సంపర్కానికి బలమైన నిషేధం ఉంది.

ప్రయాణ సౌకర్యాలు , మౌలిక సౌకర్యాలు

1980 ల మధ్యకాలంలో కానరీ నుండి కంకాన్ వరకు రైల్వే పనిచేయడం నిలిపివేయబడింది. దేశీయ విమాన సేవలలో అంతరాయం ఉంటాయి. గినియాలో ఎక్కువ వాహనాలు 20+ సంవత్సరాల కంటే ముందు తయారు చేయబడినవి. స్థానికులు వారి సొంత వాహనాలు లేకుండా దాదాపు పూర్తిగా ఈ టాక్సీలు (సీటుకు చార్జ్ చేస్తారు), చిన్న బస్సులు పట్టణం అంతటా అలాగే దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి సహకరిస్తుంటారు. నైగర్, మిలో నదులలో కొన్ని పడవలు రవాణా సౌకర్యాలు అందిస్తూ ఉంటాయి. నిర్మాణ వస్తువులు రవాణా చేయడానికి బండ్లు లాగడానికి ప్రధానంగా గుర్రాలు, గాడిదలు ఉపయోగించబడుతుంటాయి.

2015 చివరలో సియాండౌలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రియో టింటో లిమిటెడు ఇనుపఖనిజం రవాణాచేయడానికి, ఎగుమతి చేయడానికి మాటాకాంగ్ సమీపంలో 650 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సిమండౌ ఇనుము ధాతువు అధింగా ఉక్కు ఉత్పత్తి చేయడానికి చైనాకు రవాణా చేయబడుతుంది. కనాక్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం, ఆఫ్రికాలోని ఇతర నగరాలకు, ఐరోపాకు విమానాల సేవలు అందిస్తుంది.

ప్రధాన రహదారులు

గినియా ప్రధాన రహదారుల జాబితా :

  • ఎన్ 1 కనాక్రీ, కాయః, కిండియా, మమౌ, డాబోలా, కౌరౌస్సా, కంకనులను అనుసంధానిస్తుంది.
  • ఎన్ 2 మమౌ, ఫరనాహ్, కిస్సిడౌగౌ, గ్యుకేడౌ, మసెంటా, జెరెకోరె, లోలాను అనుసంధానిస్తుంది.
  • ఎన్ 4 కోయాహ్, ఫోర్కరియాహ్, ఫర్మొరెయా కలుపుతుంది.
  • ఎన్ 5 మమౌ, డాలాబా, పిట, లబెలను అనుసంధానిస్తుంది.
  • ఎన్ 6 కిసిడౌగౌ, కంకన్, సిగురిలను అనుసంధానిస్తుంది.
  • ఎన్ 20 కమ్సర్, కోలబోవి, బొకేలను అనుసంధానిస్తుంది.

గణాంకాలు

Population in Guinea
Year Million
1950 3.0
2000 8.8
2016 12.4

గినియా జనసంఖ్య 12.4 మిలియన్. కొనాక్రీ రాజధాని నగరంగానూ అతిపెద్ద నగరంగానూ ఉంది. గినియా ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యం, విద్య, సంస్కృతికి ఇది కేంద్రంగా ఉంది. 2014 లో గినియా మొత్తం సంతానోత్పత్తి రేటు 4.93 గా అంచనా వేయబడింది.

భాషలు

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
Guinean women

గినియా అధికార భాష ఫ్రెంచి. ఇతర భాషలలో పుల్లర్ (ఫుల్ఫెల్డ్ లేదా ఫులని), మనిన్కా (మలింక్), సుసు, కిస్యి, కేపెల్లె, లోమా వాడుక భాషలుగా ఉన్నాయి.

సంప్రదాయ సమూహాలు

24 జాతుల సమూహాలు ఉన్నాయి. మిండిన్గో (మాలిన్కే) అని కూడా పిలవబడే మండిన్కా ప్రజలు 29.8% ఉన్నారు. కలిగివుంది, ఇవి అధికంగా తూర్పు గినియాలో కంకన్, కిసిడౌగౌ జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నారు. ఫులస్ లేదా ఫులని, జనాభాలో 32.1% వీరు అధికంగా ఫుటా జల్లోన్ ప్రాంతంలో ఉన్నారు. సుసోసు 19.8% మంది ఉన్నారు. వీరు అధికంగా రాజధాని కొనాక్రి, ఫోర్కెరియా, కైన్యా చుట్టూ పశ్చిమ ప్రాంతాలలో ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రజలు అందరూ కలిసి 18.3% ఉన్నారు. కలిగి ఉన్నాయి. వీరిలో కేపెల్లే, కిస్యి, జియోలో, టోమ, ఇతరులు ఉన్నారు. గినియాలో ఆఫ్రికన్లు కానివారు ప్రధానంగా లెబనీస్, ఫ్రెంచి, ఇతర యూరోపియన్లు దాదాపు 10,000 మంది నివసిస్తున్నారు.

మతం

Guinea religious sects
Religion Percent
Islam
  
85%
Christianity
  
8%
Traditional African religion
  
7%
దస్త్రం:Conakrymosque.jpg
The Conakry Grand Mosque in Guinea, one of the largest mosques in West Africa

గినియా జనాభా 85% ముస్లింలు, 8% క్రైస్తవులు, 7% స్థానిక మత విశ్వాసులు ఉన్నారు. ముస్లిలు, క్రైస్తవులలో అధికంగా స్థానిక మత విశ్వాసాలను కూడా ఆచరిస్తున్నారు.

గినియా ముస్లింలలో చాలామంది సున్ని సాంప్రదాయంతో ప్రభావితమయ్యారు. అనేకమంది అహ్మదియాలుగా ఉన్నారు. గినియాలో షియా ముస్లిములు చాలా తక్కువగా ఉన్నారు.

క్రైస్తవులలో రోమన్ కాథలిక్కులు, ఆంగ్లికన్లు, బాప్టిస్టులు, ఏడవ రోజు అడ్వెంటిస్టులు, ఎవాంజెలికల్ సమూహాలకు చెందిన ప్రజలు ఉన్నారు. దేశంలోని యెహోవాసాక్షులు క్రియాశీలకంగా ఉండి ప్రభుత్వంగా గుర్తించబడ్డారు. అల్పసంఖ్యాక బహాయి సంఘం ఉంది. హిందువులు, బౌద్ధులు, చైనీస్ మత సమూహాలు ఉన్నాయి.

2013 జూలైలో నెజర్కేర్ నగరంలో మూడు రోజులు మత పోరాటాలు జరిగాయి. కొపెల్లే (క్రైస్తవులు, నాస్థికులు), ముస్లిములు (మాలింకే జాతిప్రజలు) మద్య జరిగిన పోరాటంలో దాదాపు 54 మంది మరణించారు. చనిపోయిన వారిలో చాలామంది సజీవ దహనం చేయబడం, కత్తులతో నరకబడడం ద్వారా హతులయ్యారు. గినియాలో కర్ఫ్యూ విధించడంతో ఈ హింస ముగింపుకు వచ్చింది.

విద్య

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
Schoolgirls in Conakry, Guinea

గినియా అక్షరాస్యత శాతం ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది. 2010 లో వయోజనులలో 41% అక్షరాస్యులు (పురుషులు 52%, స్త్రీలు 30% ) మాత్రమే అంచనా వేశారు. ప్రాథమిక విద్య 6 సంవత్సరాల నిర్బంధవిద్య అమలులో ఉంది. కానీ చాలా మంది పిల్లలు చాలా కాలం పాటు అయినప్పటికీ విద్యార్థులు అధికంగా చాలాకాలం పాఠశాలకు హాజరు కాలేదు. 1999 లో ప్రాథమిక పాఠశాల హాజరు 40% ఉంది. బాలికలు అధికంగా ఇంటిపనులలో సహాయం చేయడానికి లేదా స్వంత వ్యవసాయక్షేత్రాలలో పనిచేయడానికి పోతుంటారు. అలాగే బాల్య వివాహం చేసుకోవడం కారణంగా పాఠశాలకు దూరంగా ఉంటారు.

ఆరోగ్యం

ఎబోలా

2014 లో గినియాలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రతిస్పందనగా ఆరోగ్యం మంత్రిత్వ శాఖ గ్యాస్ అమ్మకం, వినియోగం నిషేధించింది. అవి వ్యాధి వాహకాలుగా భావించబడడమే అందుకు కారణం. అయినప్పటికీ వాస్తవానికి ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాల నుండి కానక్రీకి వ్యాపించింది. 2014 జూన్ చివరినాటికి పొరుగు దేశాలలైన సియెర్రా లియోన్, లైబీరియాలలో వ్యాపించింది. 2014 ఆగస్టులో గినియా సియెర్రా లియోన్, లిబెరియాల సరిహద్దును మూసివేసింది. ఎందుకంటే వ్యాధికి సంబంధించిన కొత్త కేసులు గినియా కంటే ఆ దేశాలలో అధికంగా నమోదయ్యాయి.

డిసెంబరు ఆరంభంలో ఆగ్నేయ గినియాలోని మెలియనౌ అనే గ్రామంలో ఈ వ్యాధి వ్యాప్తి మొదలైంది. లైబీరియా, సియెర్రా లియోన్ల సరిహద్దులకు ఇది సమీపంలో ఉంది. డిసెంబరు 6 న మొదటి కేసుగా 2 సంవత్సరాల బిడ్డ జ్వరం, వాంతులు, నల్లటి ముత్రం విసర్జించిన తరువాత మరణించింది. ఒక వారం తరువాత బిడ్డతల్లి కూడా మరణించింది. ఆ తరువాత ఒక సోదరి, ఒక అమ్మమ్మ, జ్వరం, వాంతులు, అతిసారంతో మరణించారు. తరువాత బంధువుల సందర్శనల ద్వారా లేదా అంత్యక్రియలలో హాజరు ద్వారా ఈ వ్యాప్తి ఇతర గ్రామాలకు వ్యాపించింది.

అసురక్షిత సమాధులు వ్యాధి ప్రసారం ప్రధాన కారణాలలో ఒకటిగా మిగిలిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థానిక సంఘాలతో స్థానిక సమాజాల ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించకపోవడం కారణంగా వ్యాధి మూలాలను, జాతుల జాడను గుర్తించడంలో ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాన్ని అడ్డుకుంది.

2016 మార్చి 29 న ప్రపంచ ఆరోగ్యసంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC) ను రద్దు చేసింది. 30 మార్చిలో విడుదల చేసిన ఎబోలా సిట్యువేషన్ రిపోర్ట్ గడిచిన రెండు వారాలలో 5 కేసులను ధ్రువీకరించింది.

అంటువ్యాధి గినియాలో ఇతర వ్యాధుల చికిత్నుస కూడా ప్రభావితం చేసింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సోకిన అపనమ్మకం కారణంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ సందర్శనల క్షీణత, ఎబోలా వ్యాప్తి కారణంగా సాధారణ ఆరోగ్య సంరక్షణ, ఎయిడ్స్ చికిత్సలను అందించే వ్యవస్థ సామర్ధ్యం తగ్గడానికి కారణం అయింది.

మాతాశిశు సంక్షేమం

2010 నాటికి గినియాలో 1,00,000 జననాలలో 680 మంది ప్రసవం కారణంగా మరణించగా 1990 లో 964.7, 2008 లో 859.9 మరణాలు సంభవించాయి. 5 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారిలో 1000 మందిలో 146 మరణాలు సంభవించాయి. వీరిలో నాలుగు మాసాల పోపున్న శిశువులలో 29 మరణాలు సంభవించాయి. గినియాలో 1,000 మందికి మంత్రసానుల సంఖ్య 1 ఉండగా గర్భిణీ స్త్రీలకు మరణం 26 లో 1 సంభవిస్తుంది.

ఎయిడ్సు

2004 చివరి నాటికి ఎయిడ్స్ 1,70,000 మంది పెద్దలు, పిల్లలకు సంక్రమించినట్లు అంచనా. 2001 - 2002 లో నిర్వహించిన నిఘా సర్వేలు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో హెచ్ఐవి అధిక శాతం ఉన్నట్లు భావిస్తున్నారు. కోనక్రీ (5%), కోట్ డి ఐవోరే, లైబీరియా, సియెర్రా లియోన్ సరిహద్దున ఉన్న గినియా ఆటవీ ప్రాంతం (7%) నగరాల్లో ప్రాబల్యం ఎక్కువగా ఉంది.

బహుళ భాగస్వాములతో సంపర్కము ద్వారా ఎయిడ్స్ ప్రధానంగా వ్యాప్తి చెందుతుంది. 15 నుండి 24 మద్య వయస్సు గల యువతలో ఎయిడ్స్ సోకగల ప్రమాదం అధికంగా ఉంది. 2001-2002 మధ్యకాలంలో నిఘా గణాంకాలు సెక్స్ కార్మికులు (42%), సైనిక సిబ్బంది (6.6%), ట్రక్కు డ్రైవర్లు, బుష్ టాక్సీ డ్రైవర్లు (7.3%), మైనర్లు (4.7%), క్షయవ్యాధి కలిగిన పెద్దలు (8.6% ) ఎయిడ్స్ వ్యాధి ఉంది.

గినియాలో ఎయిడ్స్ అంటువ్యాధి వ్యాప్తి చెందడానికి అనేక కారణాలు ఇంధనంగా మారాయి. వీటిలో అసురక్షిత లైంగిక, బహుళ లైంగిక భాగస్వాములు, నిరక్షరాస్యత, స్థానికవర్గాలలో పేదరికం, అస్థిర సరిహద్దులు, శరణార్ధుల వలసలు, బాధ్యతరహిత పౌరులు, అరుదైన వైద్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు వంటి ప్రధానకారణాలు ఉన్నాయి.

పోషకాహారలోపం

గినియా కోసం పోషకాహార లోపం ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. 2012 అధ్యయనంలో దీర్ఘకాలంగా పోషకాహారలోపం ఉన్నట్లు నివేదించాయి. ప్రాంతాలవారిగా 34% నుండి 40% వరకు ఉంది. అలాగే గినియా ఎగువ మైనింగ్ మండలాల్లో 10% పైన తీవ్రమైన పోషకాహార లోపం ఉంది. సర్వేలో 1,39,200 మంది తీవ్ర పోషకాహార లోపం, 6,09,696 దీర్ఘకాలిక పోషకాహారలోపం, 15,92,892 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. సంరక్షణ సాధనలను తగ్గించడం, వైద్య సేవలకు పరిమిత ప్రాప్తి, సరిపోని పరిశుభ్రత విధానాలు, ఆహార వైవిధ్యం లేకపోవటం ఇందుకు కారణంగా వివరించాయి.

మలేరియా

మలేరియా సంవత్సరం పొడవునా వ్యాప్తి చెందుతున్నప్పటికీ జూలై నుండి అక్టోబరు వరకు శిఖరాగ్రస్థాయికి చేరుకుంటుంది. గినియాలో మలేరియా వైకల్యం ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది.

Culture

గినియా: చరిత్ర, భౌగోళికం, వన్యజీవితం 
A market stall selling vegetables in Dinguiraye Prefecture, Guinea

Sports

గినియా దేశంలో ఫుట్ బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. దీనిని గినియా ఫుట్ బాల్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఈ సంఘం జాతీయ ఫుట్బాల్ జట్టుతోపాటు జాతీయ లీగ్ను నిర్వహిస్తుంది. ఇది 1960 లో స్థాపించబడింది. 1962 నుండి ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.తో అనుసంధానించబడింది. 1963 నుండి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాలుతో అనుబంధంగా ఉంది. గినియా " నేషనల్ ఫుట్ బాల్ టీం " (నేషనల్ ఎలిఫెంట్స్) 1962 నుండి అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడలలో పాల్గొంటుంది. వారు మొదటిసారిగా జర్మనీకి వ్యతిరేకంగా క్రీడలో పాల్గొన్నారు. 1976లో మొరాకోలో వరల్డ్ కప్ ఫైనల్సులో పాల్గొని రన్నర్ల స్థాయికి చేరుకున్నారు.

గినియా చాంపియనాత్ నేషనల్ గినియా ఫుట్ బాల్ అత్యున్నత డివిషనుగా ఉంది. 1965 లో అది స్థాపించబడినప్పటి నుండి " గినియా కపె నేషనలె "లో మూడు టీంలు ఆధిక్యత ప్రదర్శించాయి.

హోరోయా ఎ.సి. 16 టైటిల్సుతో ఆధిక్యతతో ప్రస్తుత (2017-2018) విజేతగా ఉంది. హాఫియా ఎఫ్.సి. 1960 - 70 లలో 15 టైటిల్సుతో రెండవ స్థానంలో ఉంది. ఎ.ఎస్. కలోం స్టార్ 13 టైటిల్సుతో మూడవ స్థానంలో ఉంది (1960 లలో కానక్రీ I గా పిలువబడింది). ఈ మూడు బృందాలు రాజధాని కొనాక్రిలో ఉన్నాయి.ఇతర జట్టులలో ఏదీ అయిదు కంటే ఎక్కువ టైటిల్సు సాధించలేదు.

1970 లు గినియాన్ ఫుట్బాలుకు స్వర్ణయుగంగా ఉంది. హాఫియా ఎఫ్. సి 1972, 1975, 1977 సంవత్సరాల్లో మూడుమార్లు " ఆఫ్రికన్ కప్ ఛాంపియన్స్ క్లబ్బు" గెలుచుకుంది. అయితే హార్రోయా ఎ.సి. 1978 ఆఫ్రికన్ కప్ విన్నర్స్ కప్పును గెలుచుకుంది.

బహుభార్యావిధానం

గినియాలో బహుభార్యత్వం నిషేధించబడినప్పటికీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. యునెసెఫ్ నివేదికలో 15-49 మద్య వయసున్న గినియన్ మహిళలలు 54.4% బహుభార్యత్వంతో సంబంధితులై ఉన్నారని ఉంది.

సంగీతం

పశ్చిమాసియా దేశాలలో ఉన్నట్లు గినియాలో సుసంపన్నమైన సంగీత సంప్రదాయం ఉంది. 1960 లో గినియా స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి " బెంబియా జాజ్ " సంగీతానికి ప్రజాదరణ అధికరించింది.

ఆహారం

గినియన్ ఆహారవిధానం ప్రాంతాలవారిగా వైవిధ్యం ఉంటుంది. బియ్యంతో తయారు చేయబడుతున్న అన్నం ప్రధాన ఆహారంగా ఉంది. కరేపెండెలం కూడా దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఆఫ్రికన్ ఆహారసంస్కృతిలో భాగంగా గినియాలో జోలాఫ్ బియ్యం, మాఫె, తలపా బ్రెడ్డు ఉన్నాయి. గ్రామీణప్రాంతంలో నివాసాలకు వెలుపల పెద్ద మొత్తంలో ఆహారం చేతితో తీసుకుని తింటుంటారు.

వెలుపలి లింకులు

మూలాలు

Tags:

గినియా చరిత్రగినియా భౌగోళికంగినియా వన్యజీవితంగినియా ఆర్ధికంగినియా సమస్యలు , సంస్కరణలుగినియా ప్రయాణ సౌకర్యాలు , మౌలిక సౌకర్యాలుగినియా గణాంకాలుగినియా విద్యగినియా ఆరోగ్యంగినియా Cultureగినియా వెలుపలి లింకులుగినియా మూలాలుగినియాఈక్వటోరియల్ గ్వినియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కడియం కావ్యబైబిల్గ్రామ పంచాయతీఊరు పేరు భైరవకోనఅశోకుడువై.యస్.అవినాష్‌రెడ్డిహను మాన్సాయిపల్లవిఓటుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)భారతీయ సంస్కృతినాయట్టువిజయనగర సామ్రాజ్యంఖండంఏప్రిల్ఆంధ్రజ్యోతిమృగశిర నక్షత్రముచైత్ర పూర్ణిమతెలంగాణ జిల్లాల జాబితాశోభన్ బాబుశ్రీకాంత్ (నటుడు)ఈనాడుయవలుసింధు లోయ నాగరికతతాటి ముంజలుమదన్ మోహన్ మాలవ్యాఅమర్ సింగ్ చంకీలాప్రకృతి - వికృతిసోంపువిశ్వబ్రాహ్మణతెలంగాణ గవర్నర్ల జాబితాపి.వెంక‌ట్రామి రెడ్డిశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుధన్‌రాజ్జనసేన పార్టీరుక్మిణీ కళ్యాణంనరేంద్ర మోదీమహేంద్రసింగ్ ధోనితెలుగు భాష చరిత్రగొట్టిపాటి నరసయ్యవాట్స్‌యాప్సామెతల జాబితాపరశురాముడువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)పిత్తాశయముసుగ్రీవుడుయమున (నటి)దగ్గుబాటి పురంధేశ్వరిగుంటకలగరఅయోధ్య రామమందిరంపూర్వ ఫల్గుణి నక్షత్రముమహామృత్యుంజయ మంత్రంభారత సైనిక దళంమూలా నక్షత్రంభారత జాతీయగీతం2019 భారత సార్వత్రిక ఎన్నికలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఅరుణాచలంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంశివ కార్తీకేయన్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువంకాయనందమూరి తారక రామారావుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్కేతిక శర్మరౌద్రం రణం రుధిరంఉండి శాసనసభ నియోజకవర్గంకాశీశ్రీఆంజనేయంయూట్యూబ్స్వాతి నక్షత్రముభామావిజయంH (అక్షరం)పూర్వాభాద్ర నక్షత్రము🡆 More