కొరటాల సత్యనారాయణ

కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జూలై 1, 2006) ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు.

భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడు.

కొరటాల సత్యనారాయణ
కొరటాల సత్యనారాయణ
2005లో ఢిల్లీలో జరిగిన 18వ పార్టీ సమావేశంలో సత్యనారాయణ
జననంకొరటాల సత్యనారాయణ
సెప్టెంబరు 24, 1923
గుంటూరు జిల్లా , అమృతలూరు మండలం, ప్యాపర్రు
మరణంజూలై 1, 2006
ప్రసిద్ధిఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు.
పదవి పేరుపాలిట్‌బ్యూరో సభ్యుడు
రాజకీయ పార్టీభారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం)
తండ్రిపిచ్చయ్య
తల్లిశేషమ్మ

బాల్యము

సత్యనారాయణ గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో 1924 సెప్టెంబరు 24న పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు. కర్షక పరివారములో పుట్టి, జీవితాన్ని బడుగుల ఉద్ధరణకై ధార పోసి, గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునాదులు వేశాడు.

రాజకీయ పంథా

తెలుగు నాట సామ్యవాద ఉద్యమానికి ఆద్యులలో ఒకడు సత్యనారాయణ. పాఠశాల దశలోనే న్యాయ పోరాటమునకు తొలి అడుగులు వేశాడు. 1938-39 తురుమెళ్ళ పాఠశాలలో పరీక్షా విధాన పద్ధతిని వ్యతిరేకించి 11 రోజులు ఉద్యమము చేశాడు. ప్రధానోపాధ్యాయుడు మొండికేసిన ఆ సందర్భములో గుంటూరులో ఉన్న విద్యార్థినాయకుడు మాకినేని బసవపున్నయ్యను కలవడం తటస్థించింది. అదే సత్యనారాయణ లోని కమ్యూనిస్ట్ భావాలకు నాంది. బావమరిది పాతూరి సుబ్బయ్య ఆ సమయములో స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొంటున్నాడు.

బసవపున్నయ్య జోక్యముతో ప్రధానోపాధ్యాయుడు దిగి వచ్చాడు. దాంతో సత్యనారాయణ సమ్మె విరమించాడు. ఆ సమయములో ఒక పాఠశాల పత్రిక నడిపాడు. వామవాద భావాలున్న పాఠశాల డ్రిల్ ఉపాధ్యాయుడు, ఆతని బావమరిఫది మోటూరు హనుమంతరావు ప్రభావముతో సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడయాడు.

ప్రధానోపాధ్యాయుని హఠాన్మరణముతో ఆతని కుటుంబము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనగా, తోటి విద్యార్థులతో బాటు పల్లెలు తిరిగి 5,000 రూపాయలు సేకరించి వారిని ఆదుకున్నాడు. పిమ్మట రేపల్లెలో విద్య కొనసాగించిన సమయములో మరొక కమ్యూనిస్ట్ నాయకుడు లావు బాలగంగాధరరావు పరిచయము కలిగింది. 1942లో గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరాడు. విద్యార్థినాయకుడుగా ఎదిగాడు. క్విట్ ఇండియా ఉద్యమము, గుంటూరులో పోలీసు కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1943లో జిల్లా విద్యార్థిసంఘ సభ్యుడయ్యాడు.

ఎన్నికలు

మరణము

సత్యనారాయణ జీవిత చరమాంకములో కాన్సర్ తో పోరాడి 2006 జూలై 1 న హైదరాబాదులో మరణించాడు. సత్యనారాయణకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

మూలాలు

Tags:

కొరటాల సత్యనారాయణ బాల్యముకొరటాల సత్యనారాయణ రాజకీయ పంథాకొరటాల సత్యనారాయణ ఎన్నికలుకొరటాల సత్యనారాయణ మరణముకొరటాల సత్యనారాయణ మూలాలుకొరటాల సత్యనారాయణ19232006జూలై 1సెప్టెంబరు 24

🔥 Trending searches on Wiki తెలుగు:

Lరామదాసుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుగౌడఆవుశ్రవణ నక్షత్రముమృగశిర నక్షత్రముఆతుకూరి మొల్లమంగళవారం (2023 సినిమా)ప్రియురాలు పిలిచిందితెలుగు సినిమాభారతదేశంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుబమ్మెర పోతనతెనాలి రామకృష్ణుడునిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 201-300వై. ఎస్. విజయమ్మజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లగ్నంరామసహాయం సురేందర్ రెడ్డితల్లి తండ్రులు (1970 సినిమా)మామిడినారా లోకేశ్శ్రీఆంజనేయంవెబ్‌సైటుబి.ఆర్. అంబేద్కర్కుంభరాశికొంపెల్ల మాధవీలతమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవినాయకుడుమర్రికొణతాల రామకృష్ణయానిమల్ (2023 సినిమా)కస్తూరి రంగ రంగా (పాట)భార్యహస్త నక్షత్రమునారా బ్రహ్మణిదశరథుడుమలబద్దకంరమ్యకృష్ణఅల్లు అర్జున్వెలిచాల జగపతి రావుఉష్ణోగ్రతసంస్కృతంఆరోగ్యంమతీషా పతిరనాకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅష్ట దిక్కులుజ్యోతిషంపులివెందుల శాసనసభ నియోజకవర్గంవై.యస్.అవినాష్‌రెడ్డిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపాల్కురికి సోమనాథుడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంతీన్మార్ సావిత్రి (జ్యోతి)రాహుల్ గాంధీకృపాచార్యుడుపొట్టి శ్రీరాములుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలునితీశ్ కుమార్ రెడ్డికలబందభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)సెక్యులరిజంనీటి కాలుష్యంఉపనయనమురక్త పింజరివెలమనామనక్షత్రముజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఘిల్లివృషభరాశిపాండవులుతెలుగుదేశం పార్టీనందమూరి తారక రామారావుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం🡆 More