కాన్‌స్టాంటిన్ ద గ్రేట్

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ (సా.శ.

272 ఫిబ్రవరి 27 నుంచి 337 మే 337) సా.శ. 306 నుంచి 337 వరకూ పరిపాలించిన రోమన్ చక్రవర్తి. ఇతన్ని మొదటి కాన్‌స్టాంటిన్ అని కూడా పిలుస్తారు. డాసియా మెడిటెరానియాలోని నైసస్‌లో (నేటి సెర్బియాలోని, నీష్ నగరం) జన్మించాడు. కాన్‌స్టాంటిన్ తండ్రి ఫ్లావియస్ కాన్‌స్టాంటియస్ ఇలిరియన్ ప్రాంతానికి చెందిన సైన్యాధికారిగా జీవితం ప్రారంభించి రోమన్ సామ్రాజ్యపు టెట్రార్కీ విధానంలో నలుగురు చక్రవర్తుల్లో ఒకడయ్యాడు. అతని తల్లి హెలెనా గ్రీకు జాతీయురాలు, సామాన్య కుటుంబంలో జన్మించింది. డియోక్లెటైన్, గాలెరియస్ చక్రవర్తులు ఇద్దరి నాయకత్వంలోనూ కాన్‌స్టాంటైన్ సేనా నాయకునిగా విశిష్టమైన సేవలందించాడు. ఇందులో భాగంగా తూర్పు ప్రావిన్సుల్లో బార్బేరియన్లు, పర్షియన్లపై పోరాడాడు. సా.శ. 305లో అతని తండ్రి అధీనంలో బ్రిటన్‌లో పోరాడడానికి వెనక్కి పిలిచేదాకా తూర్పు ప్రావిన్సుల్లో సేనా నాయకునిగా పనిచేశాడు. 306లో ఇతని తండ్రి మరణించాకా ఎబోరాకం (ఈనాడు ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరం) సైన్యం కాన్‌స్టాంటిన్‌ను చక్రవర్తిగా ప్రకటించింది. ఇతర చక్రవర్తులైన మాక్సెంటియస్, లిసినియస్‌లపై అంతర్యుద్ధాల్లో పోరాడి 324 నాటికల్లా రోమన్ సామ్రాజ్యపు ఏకైక పరిపాలకుడిగా నిలిచాడు.

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్
ఇంగ్లాండు లోని యార్క్ వద్ద కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ ఇత్తడి విగ్రహం

కాన్‌స్టాన్‌టిన్ చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సైనిక రంగాల్లో సంస్కరణలను అమలు చేశాడు. పౌర, సైనిక అధికారులను వేరుచేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్నిర్మించాడు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి అతను కొత్త బంగారు నాణెం అయిన సాలిడస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది బైజాంటైన్, యూరోపియన్ కరెన్సీలకు వెయ్యి సంవత్సరాలకు పైగా ప్రామాణికంగా నిలిచింది. కామిటాటెన్స్‌లు అన్న పేరుతో సంచార యూనిట్లు, లిమిటానై అన్న పేరుతో కోటలో నిలిచివుండే స్థిరమైన యూనిట్ల కింద సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. తద్వారా అంతర్గత ప్రమాదాలను, బార్బేరియన్ల దండయాత్రలను కూడా ఎదుర్కోగలిగేలా ఈ యూనిట్లు ఉపయోపడ్డాయి. రోమన్ సరిహద్దుల్లోని ఫ్రాంకులు, అలమాన్ని, గోథ్‌లు, సర్మాటియాన్లు వంటి జాతులపై విజయవంతంగా దండయాత్రలు చేశాడు. అతను ఆక్రమించిన భూభాగాల్లో రోమన్ సామ్రాజ్యం మూడవ శతాబ్దపు సంక్షోభం ఎదుర్కొంటుండగా తన పూర్వ చక్రవర్తులు వదిలిపెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

గమనికలు

Tags:

ఇంగ్లాండురోమన్ సామ్రాజ్యంసెర్బియా

🔥 Trending searches on Wiki తెలుగు:

నిర్మలా సీతారామన్ప్లీహముఅటల్ బిహారీ వాజపేయిబోండా ఉమామహేశ్వర రావుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఘట్టమనేని మహేశ్ ‌బాబుజవాహర్ లాల్ నెహ్రూఉగాదితెలుగు కథఆవుతీన్మార్ మల్లన్నకర్కాటకరాశిసుభాష్ చంద్రబోస్అష్టకష్టాలుతెలంగాణా బీసీ కులాల జాబితాపరిటాల రవినిఘంటువుశ్రీశ్రీహనుమాన్ చాలీసాకల్వకుంట్ల కవితరెండవ ప్రపంచ యుద్ధంలలితా సహస్ర నామములు- 901-1000మెదక్ లోక్‌సభ నియోజకవర్గంఓటుకె. అన్నామలైభారతదేశంలో బ్రిటిషు పాలనశ్రీ గౌరి ప్రియసురేఖా వాణిపిన‌ర‌యి విజ‌య‌న్గర్భంసుమతీ శతకమువాల్మీకికన్యారాశిశ్రవణ నక్షత్రముకజకస్తాన్అమ్మాయి కోసంజ్యేష్ట నక్షత్రంమంగళసూత్రంకల్క్యావతారమురావణుడువిరాట్ కోహ్లికనకదుర్గ ఆలయంశకుంతలా దేవినువ్వులురమణ మహర్షిమంచి మనసులు (1962 సినిమా)అణావంగా గీతనందిగం సురేష్ బాబుతెలుగుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమృణాల్ ఠాకూర్మమితా బైజువక్కహనుమజ్జయంతిప్రకటనసంభోగంసింగిరెడ్డి నారాయణరెడ్డివాతావరణంఇంద్రజదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోతామర వ్యాధిభారత రాజ్యాంగ పీఠికగురువు (జ్యోతిషం)కర్ణ్ శర్మధరిత్రి దినోత్సవంక్వినోవాపది ఆజ్ఞలుశ్రీవిష్ణు (నటుడు)అక్కినేని నాగేశ్వరరావుబ్రహ్మంగారి కాలజ్ఞానంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఅల్లూరి సీతారామరాజుభారతీయ శిక్షాస్మృతిశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఓం నమో వేంకటేశాయదశదిశలు🡆 More