కనెటికట్

కనెటికట్ అమెరికా లోని రాష్ట్రం.

ఈ రాష్ట్రం ఈశాన్య అమెరికా లోని న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో ఉంది. 1614 లో డచ్ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ 1636 వ సంవత్సరానికి కనెటికట్ బ్రిటిషువారి ఏలుబడి లోనికి వచ్చింది. అమెరికా స్వతంత్ర పోరాటంలో బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసిన పదమూడు కాలనీలలో కనెటికట్ కూడా ఒకటి. కనెటికట్ వాసులను నట్ మెగ్గర్లు అని కానీ, యాంకీలు అనిగానీ పిలుస్తారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం కనెటికట్ అమెరికాలోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. దీని రాజధాని హార్ట్‌ఫోర్డ్.

కనెటికట్
అమెరికా పటంలో కనెటికట్ రాష్ట్రం

దీనికి తూర్పున రోడ్ ఐలండ్, ఉత్తరాన మస్సాచుసెట్స్, పశ్చిమాన న్యూయార్కు, దక్షిణాన లాంగ్ ఐలండ్ సౌండ్ ఉన్నాయి. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ ప్రవహించే కనెటికట్ నది పేరు మీదుగా రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది.

విస్తీర్ణం పరంగా కనెటికట్, అమెరికా లోని మూడవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా 29 వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాల్లో నాలుగవది. రాజ్యాంగ రాష్ట్రం అని, నట్ మెగ్ రాష్ట్రం అనీ, ప్రొవిజన్స్ రాష్ట్రం అనీ, స్థిరమైన అలవాట్లు గల రాష్ట్రం అనీ ఈ రాష్ట్రానికి పేర్లున్నాయి. అమెరికా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను రూపొందించడంలో కనెటికట్ పాత్ర ప్రముఖమైనది.

కనెటికట్‌లో తొలి వలసలను స్థాపించిన ఐరోపావాసులు డచ్చి వారు. రాష్ట్రంలోని సగం డచ్చి వారి వలస, న్యూ నెదర్లాండ్‌లో భాగంగా ఉండేది. 1630 ల్లో ఇంగ్లీషు వారు తమ తొలి వలసను స్థాపించారు.

2019 జూలై 1 నాటికి కనెటికట్ జనాభా 35,65,287. 2010 నుండి ఇది 0.25% తగ్గింది.

రాష్ట్రం లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని చాలాభాగం న్యూయార్కు నగరంతో ముడిపడి ఉంది. అత్యధికంగా సంపద పోగుపడీన ప్రదేశం. ఆస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం. 2019 సంవత్సరానికి కనెటికట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి $289 బిలియన్లు. 2018 లో ఇది $277.9 బిలియన్లు ఉండేది. 2019 లో రాష్ట్ర తలసరి ఆదాయం $79,087. అమెరికాలోనే ఇది అత్యధికం. అయితే వివిధ వర్గాల ప్రజల ఆదాయంలో చాలా పెద్ద అంతరం ఉన్న రాష్ట్రం ఇది. ఆర్థిక సేవల రంగానికి ఈ రాష్ట్రం పేరుపొందింది. హార్ట్‌ఫోర్డ్ లో ఇన్స్యూరెన్సు కంపెనీలు, ఫెయిర్‌ఫీల్డ్ కౌంటీలో హెడ్జి ఫండ్లూ విస్తరించాయి.

మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలున్యూ ఇంగ్లండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫ్లిప్‌కార్ట్ధర్మో రక్షతి రక్షితఃశ్రవణ కుమారుడుసుభాష్ చంద్రబోస్హనుమంతుడుసంక్రాంతిసాయిపల్లవివాల్మీకిపులిశర్వానంద్నయన తారభారతదేశంYఅంగుళంశాతవాహనులురామాయణం (సినిమా)స్వలింగ సంపర్కంభారత పార్లమెంట్ద్వారకా తిరుమలనారా లోకేశ్మిథాలి రాజ్కల్వకుంట్ల కవితచిరంజీవి నటించిన సినిమాల జాబితాఅక్కినేని నాగార్జునబండారు సత్యనారాయణ మూర్తిపొడుపు కథలుకాజల్ అగర్వాల్పెళ్ళిప్రీతీ జింటాఆశ్లేష నక్షత్రముఅభిరామిబాలగంగాధర తిలక్భారతీయ జనతా పార్టీమండల ప్రజాపరిషత్కృష్ణ జననంప్రభాస్నక్షత్రం (జ్యోతిషం)అయ్యప్పజాతీయ ఆదాయంభారత రాష్ట్రపతిచంద్రుడు జ్యోతిషంచెప్పవే చిరుగాలిసప్త చిరంజీవులుత్రినాథ వ్రతకల్పంగూగుల్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఘట్టమనేని కృష్ణఅధిక ఉమ్మనీరునరసింహావతారంశివ కార్తీకేయన్శ్రీరామరాజ్యం (సినిమా)శివ ధనుస్సుయోగాసనాలుఅమ్మలక్ష్మణుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఅశ్వని నక్షత్రముపుష్యమి నక్షత్రముభారతదేశంలో సెక్యులరిజంవికీపీడియాసత్యనారాయణ వ్రతంచిలుకశ్రీరామదాసు (సినిమా)శ్రీకాళహస్తిఅయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠపిత్తాశయముమడమ నొప్పిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఛత్రపతి శివాజీభాగ్యశ్రీ బోర్సేసమాసంసెక్యులరిజంవల్లభనేని బాలశౌరికోదండ రామాలయం, తిరుపతిసర్వేపల్లి రాధాకృష్ణన్ఋగ్వేదంఓంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి🡆 More