ఒపెరా

ఒపెరా అనేది సంగీతభరితమైన నాటక కళ.

కానీ పూర్తి స్థాయి సంగీత నాటకం కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. గాయకులది ఇందులో ప్రధాన పాత్ర. ఈ ప్రదర్శనలు సాధారణంగా ఒపెరా హౌస్ అనే ప్రదర్శనశాలల్లో జరుగుతుంటాయి. పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో ఒపెరా ఒక ముఖ్యభాగం. 16 వ శతాబ్దం చివరి భాగంలో ఇటలీలో ప్రారంభమైన ఈ కళ నెమ్మదిగా యూరోపు మొత్తం విస్తరించింది. జర్మనీకి చెందిన హెన్రిక్ స్కూట్జ్, ఫ్రాన్సులో జీన్ బాప్టిస్ట్ లల్లీ, ఇంగ్లండులో హెన్రీ పర్సెల్ 17వ శతాబ్దంలో తమ దేశాల్లో ప్రత్యేకమైన ఒపెరా శైలిని సృష్టించడానికి దోహద పడ్డారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఒక్క ఫ్రాన్సులో తప్ప మిగతా యూరప్ అంతా ఇటాలియన్ ఒపెరా ప్రాబల్యం కొనసాగింది. ఒపెరా సీరియా ఇటాలియన్ ఒపెరా యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రూపంగా ఉండేది. 1760లో క్రిస్టోఫ్ విల్లిబాల్డ్ గ్లక్ ఈ శైలిలోని కృత్రిమత్వాన్ని మార్చి తనదైన శైలిని ప్రవేశపెట్టాడు. 18 వ శతాబ్దం చివర్లో మోజార్ట్ ఒపెరాలో మంచి పేరు సాధించాడు. అతను మొదట ఒపెరా సీరియాతో ప్రారంభించినా కానీ ఇటాలియన్ కామిక్ ఒపెరా లతో ప్రసిద్ధి పొందాడు.

ఒపెరా
మిలన్ లో లా స్కలా అనబడే ఒపెరా ప్రదర్శనశాల

నాటకంలో అక్కడక్కడ పాటలు కాకుండా నాటకమంతా ఒక పాటలా ఉంటుంది ఒపెరా. కాలక్రమేణా ఒపెరా మ్యూజికల్ డ్రామా, సింగ్ స్పీల్, ఒపెరా కామిక్ లాంటి అనేక శైలిలు తనలో ఇముడ్చుకుంది. సాంప్రదాయ నంబర్ ఒపెరాలో గాయకులు రెండు రకాలైన సంగీతం పాడతారు. ఒకటి మాటల్లాగా ధ్వనించే రిసైటేటివ్ స్టైల్, ఇంకొకటి అరియాస్. 19వ శతాబ్దంలో ఎడతెరిపి లేకుండా సాగే మ్యూజిక్ డ్రామా బాగా ప్రాచుర్యం పొందింది.

మూలాలు

Tags:

ఇటలీఐరోపామోజార్ట్

🔥 Trending searches on Wiki తెలుగు:

ధనూరాశిశ్రీ గౌరి ప్రియఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్వ్యవసాయంనందమూరి బాలకృష్ణనవలా సాహిత్యముజాంబవంతుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతిలక్ వర్మరాశి (నటి)జొన్నతెలంగాణ జిల్లాల జాబితాపరీక్షిత్తుగుణింతంరాజస్తాన్ రాయల్స్కృత్తిక నక్షత్రముదేవదాసిపాములపర్తి వెంకట నరసింహారావువంగవీటి రంగానారా లోకేశ్తిరుమలఅల్లూరి సీతారామరాజుచదరంగం (ఆట)బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంకార్తెబాజిరెడ్డి గోవర్దన్అంగచూషణరాజనీతి శాస్త్రముచేతబడిశ్రీశైల క్షేత్రంబౌద్ధ మతంH (అక్షరం)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకేంద్రపాలిత ప్రాంతంపాఠశాలశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పేరుసీతాదేవివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలక్ష్మిబెంగళూరుడొక్కా సీతమ్మఆరుద్ర నక్షత్రముశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమువిజయవాడవిరాట పర్వము ప్రథమాశ్వాసముషష్టిపూర్తిఇండియన్ ప్రీమియర్ లీగ్జై శ్రీరామ్ (2013 సినిమా)చిలుకూరు బాలాజీ దేవాలయంచరవాణి (సెల్ ఫోన్)పద్మశాలీలుకల్వకుంట్ల కవితశ్రీకాళహస్తివై.యస్.రాజారెడ్డినాగ్ అశ్విన్వై.యస్.అవినాష్‌రెడ్డివినోద్ కాంబ్లీపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఘట్టమనేని కృష్ణఖుషిపూజా హెగ్డేబైబిల్ఆశ్లేష నక్షత్రముచోళ సామ్రాజ్యంచాకలిసత్యనారాయణ వ్రతంవాసిరెడ్డి పద్మరాష్ట్రంబాల కార్మికులునీతి ఆయోగ్Aమురుడేశ్వర ఆలయం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు కవులు - బిరుదులుయాదవభారత జాతీయ క్రికెట్ జట్టుఖమ్మం🡆 More