ఏనుగు: తొండము, దంతాలు కలిగిన పెద్ద క్షీరదం

ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు.

ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి.

ఏనుగు: భాషా విశేషాలు, ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు
ఆప్రికాకు చెందిన ఏనుగు

భాషా విశేషాలు

ఆఫ్రికా ఏనుగు

ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.

  1. సంఖ్యా జాబితా అంశం

ఆసియా ఏనుగు

ఏనుగు: భాషా విశేషాలు, ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు 
నడుస్తున్న ఏనుగు

ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.

  • శ్రీలంక ఏనుగు (Elephas maximus maximus) ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.
  • భారతదేశపు ఏనుగు (Elephas maximus indicus) ఆసియా ఏనుగులన్నింటిలో సంఖ్యలో ఎక్కువగా, అంటే 36,000 వరకు ఉన్నాయని అంచనా. ఇవి భారతదేశం నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇంచుమించు 5,000 కి.గ్రా. బరువు ఉంటాయి.
  • సుమత్రా ఏనుగు (Elephas maximus sumatranus) ఇవి అన్నిటికన్నా చిన్న పరిణామంలో ఉంటాయి.

సుమత్రాన్ ఏనుగు

సుమత్రాన్ ఏనుగు అనేది ఆసియాలో గుర్తించబడిన మూడు ఉపజాతులలో ఒకటి. ఇవి ఇండోనేషియాలోని సుమత్రాన్ ద్వీపానికి చెందినవి. సాధారణంగా ఆసియా ఏనుగులు ఆఫ్రికన్ ఏనుగుల కంటే చిన్నవి. ఆడ ఏనుగులు సాధారణంగా మగవాటి కంటే చిన్నవిగా, పొట్టిగా ఉంటాయి. దంతాలు కలిగి ఉండవు. సుమత్రాన్ ఏనుగులు 2 నుంచి 3.2 మీటర్ల ఎత్తు ఉంటాయి. 4,400 నుంచి 8,800 పౌండ్ల మధ్య బరువు కలిగి ఉంటాయి. ఇండోనేసియాలో ఏనుగుల సహజ ఆవాసాలైన బోర్నియో, సుమత్రాన్ దీవుల్లో అటవీ నిర్మూలన వేగంగా జరుగుతోంది. అందువల్ల వేగంగా అంతరించిపోతోన్న జాతిగా వీటిని పరిగణిస్తున్నారు.  అలాగే ఈ జాతికి చెందిన మగ ఏనుగుల దంతాలకు అధిక విలువ పలుకుతుండటంతో వేటగాళ్ల నుంచి వీటికి అధిక ముప్పు పొంచి ఉంది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని సగం తొండాన్ని కోల్పోయిన ఏడాది వయస్సున్న గున్న ఏనుగు చికిత్స పొదుతూ నవంబరు 16, 2021న మృతి చెందింది. దీంతో గత తొమ్మిదేళ్లలో తూర్పు అచే జిల్లాలో వేటగాళ్లు పన్నిన వలలకు మరణించిన ఏనుగుల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్రాన్ లో ఏనుగుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. 2014లో 1300 ఉండగా ఇప్పుడు ఏనుగులు సంఖ్య 693కి పడిపోయిందని ఇండోనేషియా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెప్తున్నాయి.

మానవులతో సంబంధం

ఏనుగు: భాషా విశేషాలు, ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు 
తిరుగుబాటు చేసిన ఖాన్ జహాన్ను బహదూర్ ఖాన్ తో మొఘలులు యుధ్ధసమయంలో ఉదయ్ అనే ఏనుగుతో పోరాడుతున్న చిత్రానంద్ అనే ఏనుగు- అక్బనామా నుండి ఒక దృశ్యం.
  • ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు.
  • యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.
  • మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
  • ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో, సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
  • గజారోహణం, గండపెండేరం లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.

తెలంగాణలో ఏనుగు శిలాజాలు

తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీ-4 తవ్వకాల్లో సుమారు 5కోట్ల నుంచి 10కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పురాతనమైన ‘స్టెగోడాన్‌' జంతువు శిలాజాలు లభ్యమయ్యా యి. ఈ శిలాజాలు ఈ నెల 30 బయటపడ్డాయని, ఇవి ఏనుగు జాతి కంటే ముందు తరం జంతువు స్టెగోడాన్‌ వేనని జువాలాజికల్‌ సర్వే అధికారులు నిర్ధారించారని సింగరేణి సంస్థ పేర్కొంటున్నది. స్టెగోడాన్ ‌కు చెందిన దవడ ఎముకతోపాటు, దంతాలు సైతం లభ్యమయ్యాయి.

ఏనుగు: భాషా విశేషాలు, ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు 
ఏనుగు సవారి

దేవాలయాల్లో ఏనుగుల వాడుక

భారతదేశములోనే కాక పలు ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను వాడటం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షణ భారత దేశ ప్రధాన దేవస్థానములవారు స్వామి యొక్క అన్ని ఉత్సవములయందున తప్పక హస్తి యొక్క సేవలను తీసుకొంటారు. ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారముల వద్ద వీటిని అధికముగా వీక్షించవచ్చు.

హిందూ పురాణాలలో

ఇవి కూడా చూడండి

ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీని ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారు.

ఇతర పేర్లు

  1. కరి
  2. గజము
  3. దంతి
  4. హస్తి

బయటిలింకులు

మూలాలు

Tags:

ఏనుగు భాషా విశేషాలుఏనుగు ఆఫ్రికా ఏనుగు ఆసియా ఏనుగు సుమత్రాన్ ఏనుగు మానవులతో సంబంధంఏనుగు తెలంగాణలో శిలాజాలుఏనుగు దేవాలయాల్లో ల వాడుకఏనుగు హిందూ పురాణాలలోఏనుగు ఇవి కూడా చూడండిఏనుగు ప్రపంచ ల దినోత్సవంఏనుగు ఇతర పేర్లుఏనుగు బయటిలింకులుఏనుగు మూలాలుఏనుగుఆంగ్లంహిందువులు

🔥 Trending searches on Wiki తెలుగు:

అండాశయముఅక్కినేని నాగార్జుననామవాచకం (తెలుగు వ్యాకరణం)అలంకారంపాల కూరవిరాట్ కోహ్లిఅయ్యప్పఆంధ్రప్రదేశ్నువ్వొస్తానంటే నేనొద్దంటానానవగ్రహాలుకడప లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాద్ రేస్ క్లబ్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముబతుకమ్మ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలికల్లురామదాసుఛందస్సుమంతెన సత్యనారాయణ రాజుమిథునరాశిమమితా బైజువిడదల రజినిత్రినాథ వ్రతకల్పంఋతువులు (భారతీయ కాలం)జార్జ్ రెడ్డిసింధు లోయ నాగరికతడి వి మోహన కృష్ణచార్మినార్దశావతారములుమఖ నక్షత్రమురామప్ప దేవాలయంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్మహాసముద్రంనారా చంద్రబాబునాయుడుశ్రీవిష్ణు (నటుడు)ప్రేమలుఉత్పలమాలఇజ్రాయిల్సన్ రైజర్స్ హైదరాబాద్రాజీవ్ గాంధీఆలీ (నటుడు)ధర్మో రక్షతి రక్షితఃఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారత ఆర్ధిక వ్యవస్థవిజయసాయి రెడ్డిఉబ్బసమురామోజీరావుపాముతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిశివ కార్తీకేయన్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుబి.ఆర్. అంబేద్కర్గూగుల్గోత్రాలు జాబితాతెలుగు సినిమాల జాబితానాయుడుబలి చక్రవర్తిరేవతి నక్షత్రంరోణంకి గోపాలకృష్ణఎస్. ఎస్. రాజమౌళిసుద్దాల అశోక్ తేజపాండవులుశాంతిస్వరూప్శ్రీశ్రీఔరంగజేబుకుక్కపద్మశాలీలుఛత్రపతి శివాజీసికింద్రాబాద్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకస్తూరి రంగ రంగా (పాట)సావిత్రి (నటి)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునిర్మలా సీతారామన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్సెక్యులరిజంఅపోస్తలుల విశ్వాస ప్రమాణంనువ్వులు🡆 More