ఉభయచరము

ఉభయచరాలు (ఆంగ్లం Amphibians) జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు.

భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్పడిన మొదటి చతుష్పాదులు. వీటి పూర్వ జీవులు ఆస్టియోలెపిడ్ చేపలు.

ఉభయచరాలు
కాల విస్తరణ: Late Devonian - Recent
ఉభయచరము
Western Spadefoot Toad, Spea hammondii
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
ఏంఫీబియా

Subclasses and Orders

   Order Temnospondyli - extinct
Subclass Lepospondyli - extinct
Subclass లిస్సేంఫోబియా
   Order అనూర
   Order కాడేటా
   Order అపోడా

సామాన్య లక్షణాలు

  • ఇవి శీతల రక్త లేదా అస్థిరోష్ణ జీవులు.
  • ఇవి ద్వంద్వ జీవితాన్ని గడుపుతాయి. ఇవి మంచినీటిలో ప్రజననం జరిపి అక్కడే అభివృద్ధి చెందుతాయి. ప్రౌఢజీవులు చాలా వరకు భౌమ జీవితానికనుకూలంగా పుపుస శ్వాసక్రియ జరిపితే, కొన్ని మాత్రం పాక్షికంగా జలచరజీవనానికి మొప్పలు కూడా కలిగి ఉంటాయి.
  • చర్మం మృదువుగా గానీ గరుకుగా గానీ ఉండి, శ్లేష్మగ్రంధులను లేదా పెరోటిడ్ గ్రంధులను కలిగి ఉంటుంది. బాహ్యాస్థిపంజరం లేదు. కానీ ఎపొడా జీవులలో మాత్రం చర్మం క్రింది మధ్యత్వచ పొలుసులు కనిపిస్తాయి. చర్మవర్ణానికి కారణం క్రొమెటోఫోర్లు.
  • పుర్రెలో రెండు అనుకపాల కందాలుంటాయి. అందువల్ల దాన్ని 'డైకాండైలిక్ పుర్రె' అంటారు. ఇది శీర్షదరం తో సంధించబడి ఉంటుంది.
  • పైదవడ లేదా రెండు దవడలూ చిన్నవిగా ఉండి సమదంతాలను కలిగి ఉంటాయి. నాలుక కొన్నింటిలో బహిస్సారి.
  • శ్వాసక్రియ ఊపిరితిత్తుల వల్ల జరుగుతుంది. ఆస్య కుహరం కూడా ప్రౌఢజీవులలో దీనికి తోడ్పడతాయి. డింబకాలలో మాత్రం మొప్పలు ఉంటాయి. జలచరజీవులలో మొప్పలు ప్రౌఢ దశలో కూడా ఉంటాయి.
  • రెందు కర్ణికలు, ఒక జఠరిక కలిగిన మూడు గదుల హృదయం ఉంటుంది. దీని ద్వారా మిశ్రమ రక్తం మాత్రమే ప్రవహిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన వృక్క, కాలేయ నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి.
  • వృక్కాలు మధ్యవృక్కాలు, మూత్రశయం బాగా పెద్దది. ఇవి యూరియోటిలిక్ జీవులు.
  • కపాలనాడులు 10 జతలు. పది నాశికా రంధ్రాలు ఆస్యకుహరంలోకి తెరచుకుంటాయి. మధ్యచెవి మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది. దీనితో పాటు కర్ణభేరి, శ్రోత్రరంధ్రాలు కూడా ఏర్పడతాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ డింబక దశలకు, కొన్ని జలచర జీవులకు మాత్రమే పరిమితమవుతుంది.
  • లింగ విభేదన ఉంటుంది. పురుష జీవులకు సంపర్కావయవం లేదు. బాహ్య ఫలదీకరణ. అండాలు తగిన మాత్రం సొనకలిగిన 'మీసో లెసిథల్ అండాలు'. ఉభయచరాలలో జలచర జీవనం గడిపే డింభకం ఉంటుంది. రూపవిక్రియ ద్వారా ఇది ప్రౌఢదశను చేరుకొంటుంది.

వర్గీకరణ

  • ఉపవిభాగం I: స్టీగోసిఫాలియా (Stegocephalia) : వీటి చర్మం పొలుసులతోను అస్థిపలకాలతోను కప్పబడి ఉంటుంది. దీనిలో 5 క్రమములు ఉంటాయి. అనీ విలుప్తజీవులే.
    • క్రమం 1: లాబిరింతోడాన్ షియా
    • క్రమం 2: ఫిల్లోస్పాండిలి
    • క్రమం 3: లెపోస్పాండిలి
  • ఉపవిభాగం II: లిస్సేంఫిబియా (Lissamphibia) : దీనిలో బాహ్యాస్థిపంజరం లేని జీవించియున్న ఉభయచరాలు ఉంటాయి. దీనిలో 3 క్రమములు ఉంటాయి.
    • క్రమం 1: జిమ్నోఫియానా లేదా అపోడా (Gymnophiona or Apoda): ఉ. ఇక్తియోఫిస్, యూరియోటిప్లస్
    • క్రమం 2: యూరోడీలా లేదా కాడేటా (Caudata): ఉ. సాలమండర్, న్యూట్లు, మెగలోబెట్రాకస్, ఆంఫియామా, ఎంబ్లైస్టోమా, సైరన్.
    • క్రమం 3: సేలింటియా లేదా అనూర (Anura): ఉ. కప్పలు.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రవణ నక్షత్రముత్రిష కృష్ణన్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుచిరంజీవులుప్రధాన సంఖ్యలోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రభాస్రఘుపతి రాఘవ రాజారామ్ఆలివ్ నూనెశుక్రాచార్యుడుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రితెలంగాణవేమన శతకమునందమూరి హరికృష్ణసమాచార హక్కుఏప్రిల్ 23బైబిల్భారత ఎన్నికల కమిషనువంతెనభీష్ముడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంచైత్ర పూర్ణిమభారత స్వాతంత్ర్యోద్యమంఎఱ్రాప్రగడశివుడుప్రకటనసచిన్ టెండుల్కర్తెలుగుమధుమేహంఅర్జా జనార్ధనరావుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావేంకటేశ్వరుడుతెలుగు కులాలుసామజవరగమనదీపక్ పరంబోల్తులారాశిముహమ్మద్ ప్రవక్తభద్రాచలంపాడ్కాస్ట్భారత సైనిక దళంతెలుగు సినిమాలు డ, ఢతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.వృషభరాశిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపెరిక క్షత్రియులుగ్యాస్ ట్రబుల్రవీంద్రనాథ్ ఠాగూర్ఓం భీమ్ బుష్పరిసరాల పరిశుభ్రతప్లాస్టిక్ తో ప్రమాదాలువిష్ణుకుండినులుఆలీ (నటుడు)గరుడ పురాణంఆవర్తన పట్టికకేతువు జ్యోతిషంశుక్రుడుబౌద్ధ మతంనవలా సాహిత్యముఐక్యరాజ్య సమితిగుంటూరుగర్భంఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఅమ్మల గన్నయమ్మ (పద్యం)అంగుళంనారా లోకేశ్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్ర విశ్వవిద్యాలయంరష్మికా మందన్నచరాస్తిరుతురాజ్ గైక్వాడ్మూలా నక్షత్రంభారతీయ తపాలా వ్యవస్థఆవారాపక్షము🡆 More