ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్.
ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు, దాదాపు 354 దినాలు గలవు.
|
"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.
1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)
2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)
3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول
4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني
5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول
6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني
7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)
8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)
9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)
10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)
11. జుల్-ఖాదా: ذو القعدة
12. జుల్-హిజ్జా: ذو الحجة
ఇస్లామీయ వారము తెలుగువారములానేవుంటుంది. వారములోని మొదటిదినము ఆదివారము 'ఇత్వార్' తో ప్రారంభము అవుతుంది. ముస్లింలకు పవిత్రదినం శుక్రవారము. శుక్రవారము ముస్లింలు 'జుమా' ప్రార్థనలకు హాజరవుతారు. "يوم" (యౌమ్) అనగా దినము.
తెలుగు లిప్యాంతరీకరణ | అరబ్బీ పేరు | తెలుగు పేరు | ఉర్దూ పేరు | పర్షియన్ పేరు |
---|---|---|---|---|
యౌమ్ అల్-అహద్ | يوم الأحد | (మొదటి దినము - ఆదివారము) | ఇత్వార్ اتوار | ఎక్-షుంబా یکشنبه |
యౌమ్ అల్-ఇస్నైన్ | يوم الإثنين | (రెండవ దినము - సోమవారము) | పీర్ پير | దో-షుంబా, دوشنبه |
యౌమ్ అల్-సలాస | يوم الثُّلَاثاء | (మూడవ దినము - మంగళవారము) | మంగల్ منگل | సెహ్-షుంబా, سه شنبه |
యౌమ్ అల్-అర్బియా | يوم الأَرْبِعاء | (నాలుగవ దినము - బుధవారము) | బుధ్ بدھ | చహార్-షుంబా, چهارشنبه |
యౌమ్ అల్-ఖమిస్ | يوم الخَمِيس | (ఐదవ దినము - గురువారము) | జుమేరాత్ جمعرات | పంజ్-షుంబా, پنجشنبه |
యౌమ్ అల్-జుమా | يوم الجُمُعَة | (ఆరవదినము - శుక్రవారము) | జుమా جمعہ | జుమా, جمعه లేదా ఆదీన آدينه |
యౌమ్ అల్-సబ్త్ (సబత్) | يوم السَّبْت | (ఏడవ దినము - శనివారము) | హఫ్తా ہفتہ | షుంబా లేక షంబా, شنبه |
This article uses material from the Wikipedia తెలుగు article ఇస్లామీయ కేలండర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.