ఆర్థిక శాస్త్రం

సాంఘిక శాస్త్రాలలో ఆర్థిక శాస్త్రం లేదా అర్ధ శాస్త్రం (Economics) ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది.

అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రం అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యంను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం ద్రవ్యంను మాత్రమే కాకుండా ద్రవ్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి అర్థ శాస్త్రం వివరిస్తుంది.

ఆర్థిక శాస్త్రం
భారతదేశానికి చెందిన ఆర్థిక నిపుణుడు చాణక్య

ఆర్థిక శాస్త్రము - పరిచయం

ఆర్థిక శాస్త్రానికి సమానార్థమైన ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదాలైన ఓకియో, నోమస్ అనే పదాల వల్ల ఏర్పడింది. గ్రీకు భాషలో ఒకియో అనగా గృహము, నోమస్ అనగా చట్టం లేదా శాసనం. ప్రారంభంలో దీనిని గృహ నిర్వహణ శాస్త్రం గానే పిలిచేవారు. కాని రాను రాను ఈ శాస్త్రం పరిధి విస్తృతంగా పెరిగిపోయింది.

ఆర్థిక శాస్త్రం - ప్రగతి

ప్రాచీన కాలంలో అర్థ శాస్త్రం

ప్రాచీన కాలం నుంచి ఆర్థిక సమస్యలు మానవ మేధస్సులో కల్గుతున్నాయి. ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్లు సంపద, వర్తకం లాంటి విషయాలను తమ గ్రంథాలలో వివరించారు. కాని ఒక శాస్త్రంగా మాత్రం ఇది 1776లో స్కాంట్లాండ్ ఆర్థిక వేత్త ఆడంస్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ ది వెల్త్ ఆప్ నేషన్స్ ప్రచురణతో అభివృద్ధి చెందింది.

ఆర్థిక శాస్త్రం - విభాగాలు

సూక్ష్మ అర్థ శాస్త్రం

దీనికి ధరల సిద్ధాంతం అని కూడా పేరు. ఇది ముఖ్యంగా సరఫరా, గిరాకీ ల వల్ల ధర ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల ఎంపిక విధానం, తనకున్న పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి చెందే ఎంపిక పద్దతి, వివిధ మార్కెట్లలో వినియోగదారుల, ఉత్పత్తి దారుల ప్రవర్తన, ఉత్పత్తి పద్దతులు, ఉత్పత్తి కారకాలు మొదలగు విషయాలను వివరిస్తుంది.

స్థూల అర్థ శాస్త్రం

ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా జాతీయాదాయం, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా ద్రవ్య విధానం, కోశ విధానం లాంటి జాతీయ విధానాలను కూడా చర్చిస్తుంది. బ్రిటీష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ గ్రంథం వల్ల స్థూల శాస్త్రము ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి జాన్ మేనార్డ్ కీన్స్ను స్థూల ఆర్థిక శాస్త్రపు పితామహుడుగా పిలవవచ్చు.

ఆర్థిక శాస్త్రం - నిర్వచనాలు

'అర్ధ శాస్త్రం' లేదా 'ఆర్ధిక శాస్త్రం'ను అనేక విధాలుగా నిర్వచించారు. అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు భావించారు. స్థూలంగా ఆర్థిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.

  1. 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం - ఆడమ్ స్మిత్, అతని మార్గీయులది - సంపదను గూర్చిన విధానాల అధ్యయనం ఆర్ధిక శాస్త్రం
  2. 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా నిర్వచనం - ఆల్ఫ్రెడ్ మార్షల్, అతని మార్గీయులది - అర్ధశాస్త్రం మానవుని దైనిక జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం
  3. 'కొరత' (Scarcity) ఆధారంగా నిర్వచనం - రాబిన్స్ విధానం - మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

ఆర్థిక శాస్త్రం 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రము - పరిచయంఆర్థిక శాస్త్రం - ప్రగతిఆర్థిక శాస్త్రం - విభాగాలుఆర్థిక శాస్త్రం - నిర్వచనాలుఆర్థిక శాస్త్రం ఇవి కూడా చూడండిఆర్థిక శాస్త్రం మూలాలుఆర్థిక శాస్త్రం వెలుపలి లంకెలుఆర్థిక శాస్త్రంద్రవ్యంమానవులుయుగంసంపద

🔥 Trending searches on Wiki తెలుగు:

కొదమ సింహంఅరటిప్రధాన సంఖ్యగంజాయి మొక్కమనుస్మృతిచిరంజీవి నటించిన సినిమాల జాబితాజవాహర్ లాల్ నెహ్రూశుక్రుడు జ్యోతిషంశివ సహస్రనామాలువ్యాసుడుపునర్వసు నక్షత్రముశుభాకాంక్షలు (సినిమా)జ్యోతీరావ్ ఫులేనారా లోకేశ్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపునుగు పిల్లిలింగములురామాయణంకనకదుర్గ ఆలయంఆరుద్ర నక్షత్రముబి.ఆర్. అంబేద్కర్అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుఅనుపమ పరమేశ్వరన్షర్మిలారెడ్డికర్కాటకరాశిఅక్బర్గర్భాశయమురామానుజాచార్యుడుతెలుగుదేశం పార్టీజార్జ్ రెడ్డిమడమ నొప్పిభారతీయ జనతా పార్టీభరణి నక్షత్రమురాష్ట్రంపాలపిట్టషిర్డీ సాయిబాబాహోళీచిట్టెం పర్ణికారెడ్డిచతుర్యుగాలుకల్లుసవర్ణదీర్ఘ సంధిజాతిరత్నాలు (2021 సినిమా)చాకలి ఐలమ్మఅనుష్క శర్మటి.రాజయ్యప్రియదర్శి పులికొండనందమూరి బాలకృష్ణపులస చేపరెజీనాశ్రీ కృష్ణదేవ రాయలువేముగంటి నరసింహాచార్యులుహస్త నక్షత్రమురక్త పింజరిఘట్టమనేని మహేశ్ ‌బాబుభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377సురేఖా వాణివిజయ్ (నటుడు)వజ్రాయుధంపొడుపు కథలుగుడిమల్లం పరశురామేశ్వరాలయంమారేడురచ్చ రవిమహాత్మా గాంధీసీతాదేవివడదెబ్బఅనుష్క శెట్టిశాంతిస్వరూప్చంద్ర గ్రహణంసంఘం చెక్కిన శిల్పాలుసంతోషం (2002 సినిమా)ఓటుకుండలేశ్వరస్వామి దేవాలయంమాధవీ లతతెలుగు సంవత్సరాలుద్వాదశ జ్యోతిర్లింగాలుపల్లెల్లో కులవృత్తులుగర్భంకర్ర పెండలం🡆 More