భారత స్వాతంత్ర్య దినోత్సవం:

ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది.

1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.🇮🇳

The national flag of India hoisted on a wall adorned with domes and minarets.
ఆగస్టు పదిహేను న ఎర్రకోటపై ఎగురుతున్న త్రివర్ణ పతాకం

చరిత్ర

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.జై భారత్.

తేదీ ప్రాధాన్యత

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు బాటన్.

వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:
అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

ఇవికూడా చూడండి

మూలాలు

Tags:

భారత స్వాతంత్ర్య దినోత్సవం చరిత్రభారత స్వాతంత్ర్య దినోత్సవం తేదీ ప్రాధాన్యతభారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలుభారత స్వాతంత్ర్య దినోత్సవం ఇవికూడా చూడండిభారత స్వాతంత్ర్య దినోత్సవం మూలాలుభారత స్వాతంత్ర్య దినోత్సవంజాతీయ శెలవుస్వాతంత్ర్య దినోత్సవం

🔥 Trending searches on Wiki తెలుగు:

బౌద్ధ మతంఇండియన్ ప్రీమియర్ లీగ్ఇద్దరు మొనగాళ్లునరేంద్ర మోదీఓం నమో వేంకటేశాయగ్రామ పంచాయతీహనుమాన్ చాలీసాఉత్తర ఫల్గుణి నక్షత్రముమనుస్మృతిగోవిందుడు అందరివాడేలేతొలిప్రేమపొడుపు కథలుజాతీయ పౌర సేవల దినోత్సవంజిల్లా కలెక్టర్కందుకూరి వీరేశలింగం పంతులుమెదడు వాపువర్షంభీష్ముడుపంజాబ్ కింగ్స్సజ్జల రామకృష్ణా రెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిమిథునరాశినోటాతెలుగు సినిమాల జాబితాహెబియస్ కార్పస్తేలుశ్రీ కృష్ణదేవ రాయలుఆల్ఫోన్సో మామిడిశుభ్‌మ‌న్ గిల్ఉపాధ్యాయుడుకీర్తి సురేష్గజేంద్ర మోక్షంపిన‌ర‌యి విజ‌య‌న్ప్రజాస్వామ్యంరక్త ప్రసరణ వ్యవస్థభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువందేమాతరంఅయోధ్య రామమందిరంప్లాస్టిక్ తో ప్రమాదాలుబలి చక్రవర్తిపాములపర్తి వెంకట నరసింహారావుభోపాల్ దుర్ఘటనకాలేయంచాట్‌జిపిటిశ్రీ గౌరి ప్రియశ్రీముఖిఊపిరితిత్తులుభారత రాజ్యాంగ సవరణల జాబితాభరణి నక్షత్రముపసుపు గణపతి పూజవందే భారత్ ఎక్స్‌ప్రెస్హనుమజ్జయంతిమహాసముద్రంసలేశ్వరంఅన్నప్రాశనకొంపెల్ల మాధవీలతజాతీయములులోక్‌సభనువ్వు నాకు నచ్చావ్మూలా నక్షత్రంకృత్తిక నక్షత్రమురాశి (నటి)రామాయణంప్రధాన సంఖ్యగుణింతంవిడాకులుఓటుసుమతీ శతకములలితా సహస్రనామ స్తోత్రంపంచారామాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుసిద్ధు జొన్నలగడ్డపరకాల ప్రభాకర్నవధాన్యాలువిజయ నరేష్విద్యార్థికార్తీక్ ఘట్టమనేనికొండా వెంకటప్పయ్య🡆 More