కిలోగ్రాము

కిలోగ్రాము (Kilogram:గుర్తు kg) అనేది 1000 గ్రాముల బరువుకి సమానం.

ఇది మెట్రిక్ పద్ధతిలో బరువు (భారాన్ని) కొలవడానికి వాడే కొలమానం.

  • మొదట్లో, కిలోగ్రాము అంటే ఒక లీటరు నీటి యొక్క బరువు (మంచు ద్రవీభవన స్థానం వద్ద) అని అనుకునేవారు.
  • సా. శ. 1799 నుండి, పేరిస్ లో దాచిన ఒక ప్లేటినం స్థూపం బరువుని కిలోగ్రాముకి ప్రమాణంగా వాడేవారు.
  • తరువాత, 20 మే 2019 నుండి కిలోగ్రాముని ప్రాధమిక స్థిరాంకాల (fundamental physical constants) ద్వారా - ప్రత్యేకించి ప్లాంక్ స్థిరాంకం ఉపయోగించి - నిర్వచించేరు.
Kilogram
CGKilogram.jpg
A computer-generated image of the international prototype kilogram (the inch ruler is for scale). The prototype is manufactured from a platinumiridium alloy and is 39.17 mm in both diameter and height, its edges have a four-angle (22.5°, 45°, 67.5° and 79°) chamfer to minimize wear
ప్రమాణం యొక్క సమాచారం
ప్రమాణ వ్యవస్థSI base unit
ఏ బౌతికరాశికి ప్రమాణంmass
గుర్తుkg 
ప్రమాణాల మధ్య సంబంధాలు
1 kg in ...... is equal to ...
   Avoirdupois   ≈ 2.205 pounds
   British Gravitational   ≈ 0.0685 slugs 

బరువు, గరిమ (లేదా ద్రవ్యరాసి)

భౌతిక శాస్త్రంలో బరువు లేదా భారము (weight), గరిమ లేదా ద్రవ్యరాసి (mass) అనే రెండు సంబంధిత భావాలు ఉన్నాయి. పదార్థం ఎంత ఉందో చెప్పేది గరిమ. గరిమ అనేది పదార్థం యొక్క జడత్వ లక్షణాన్ని (inertial property) చెబుతుంది. జడత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉన్నప్పుడు కదలడానికి సుముఖత చూపకపోవడం, కదులుతూన్నప్పుడు ఆగడానికి సుముఖత చూపకపోవడం. దీనినే స్థావరజంగమాత్మక లక్షణం అని కూడా అంటారు. బరువు (weight) అనేది స్థానికంగా ఉన్న గురుత్వాకర్షక బలం (gravitational force) మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వస్తువు ఎక్కువ గురుత్వాకర్షక బలం ఉన్న క్షేత్రంలో ఎక్కువ బరువు తూగుతుంది; అదే వస్తువు తక్కువ గురుత్వాకర్షజక బలం ఉన్న క్షేత్రంలో తక్కువ బరువు తూగుతుంది. రెండు సందర్భాలలో గరిమ (ద్రవ్యరాసి) ఒక్కటే కాని బరువులో తేడా! ఈ తేడాని సుబోధకం చెయ్యడానికి నిత్యజీవితంలో తారసపడే రెండు పరికరాలని చూద్దాం. మొదటి బొమ్మలో స్ప్రింగు ఉన్న భారమాపకం (బొమ్మ చూడండి) లోని తొట్టెలో పెట్టిన వస్తువు బరువు (weight) ని బట్టి స్ప్రింగు పొడుగు తగ్గుతుంది. రెండవ బొమ్మ త్రాసులో రెండు తక్కెడలు ఉన్నాయి కదా. రెండింటి మీద ప్రసరించే భూమ్యాకర్షక బలం రద్దు అయిపోయింది కనుక మనం తూచే వస్తువ యొక్క గరిమ తెలుస్తుంది.

అంతర్జాతీయ స్థాయీకరణ

బరువుని తూచడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక సుస్థిరమైన అవగాహన ఉండడం అవసరం అని చాల కాలం కిందటే గుర్తించేరు. ఈ సుస్థిరమైన ప్రమాణం భౌతికమైన పదార్థాల మీద కాకుండా సహజసిద్ధమైన స్థిరాంకాల మీద ఆధారపడితే బాగుంటుందని సర్వులూ ఒక ఆమోదానికి వచ్చేరు. అందుకని కిలోగ్రాము బరువుని ప్లేంక్ స్థిరాంకం (h) తో ముడి పెట్టేరు. ఈ ప్లేంక్ స్థిరాంకం (h) ఒక తేజాణువు (photon) యొక్క శక్తిని (energy, E), దాని తరచుదనాన్ని (frequency, f) సమీకరిస్తుంది: కిలోగ్రాము . ఈ ప్లేంక్ స్థిరాంకం విలువ సెకండు ఒక్కంటికి, చదరపు మీటరు ఒక్కంటికి 6.626069 x 10{-34} అని మనకి తెలుసు. ఇహ సెకండుని, మీటరుని ఖచ్చితంగా కొలవ గలిగితే కిలోగ్రాము విలువ కట్టవచ్చు.

సీజియం-133 అనే మూలకం ఒక నిర్ధేశించిన శక్తిని విడుదల చెయ్యడానికి పట్టే కాలం "సెకండు" (second) అనుకోమన్నారు. శూన్యంలో కాంతి ఒక సెకండు వ్యవధిలో ప్రయాణం చేసే దూరంలో (1/299,792,458) వ భాగం ఒక మీటరు అనుకోమన్నారు. సెకండు, మీటరు తెలిశాయి కనుక కిలోగ్రాము విలువ కట్టడం కష్టణం కాదు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పూర్వాభాద్ర నక్షత్రమురౌద్రం రణం రుధిరంశుక్రుడు జ్యోతిషందశావతారములుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసంజు శాంసన్భారతీయ తపాలా వ్యవస్థఅయోధ్యయమున (నటి)గుణింతంవై.యస్.భారతిఎన్నికలుడీజే టిల్లుకామసూత్రఏప్రిల్ 23అ ఆఅమితాబ్ బచ్చన్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంకౌరవులుతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.మహావీర్ జయంతియోనియేసుకింజరాపు అచ్చెన్నాయుడువృషభరాశిమదన్ మోహన్ మాలవ్యాఇన్‌స్టాగ్రామ్ఆశ్లేష నక్షత్రముLఅండమాన్ నికోబార్ దీవులుశ్రీలలిత (గాయని)పెమ్మసాని నాయకులుకాళోజీ నారాయణరావుజీలకర్రభారత రాష్ట్రపతుల జాబితాఅంగారకుడు (జ్యోతిషం)అశోకుడుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనువందేమాతరంకందుకూరి వీరేశలింగం పంతులుఉగాదిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాబుధుడు (జ్యోతిషం)షడ్రుచులుతెలుగు సాహిత్యంరమణ మహర్షికాజల్ అగర్వాల్కల్వకుంట్ల చంద్రశేఖరరావుఉల్లిపాయధన్‌రాజ్అల్లరి నరేష్వృశ్చిక రాశికీర్తి రెడ్డిరాయలసీమద్వాదశ జ్యోతిర్లింగాలుమూలా నక్షత్రంపరిపూర్ణానంద స్వామిజవాహర్ లాల్ నెహ్రూసోనియా గాంధీతోడికోడళ్ళు (1994 సినిమా)ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతిలక్ వర్మనవధాన్యాలునువ్వులుఅమరావతిఆరూరి రమేష్భరణి నక్షత్రముతాజ్ మహల్గంగా నదిరక్తపోటుయూనికోడ్సజ్జల రామకృష్ణా రెడ్డితెలుగు సినిమాలు 2024నువ్వుల నూనెసచిన్ టెండుల్కర్ఇంద్రుడు🡆 More