లైచెన్‌స్టెయిన్: ఐరోపాలో ఒక దేశం

లీచ్టెన్‌స్టీన్ (జర్మన్: ఫ్యూర్స్‌టెంటం లీచ్టెన్‌స్టీన్) అధికారికంగా ప్రిన్సిపాలిటీ ఆఫ్ లీచ్టెన్‌స్టీన్ మద్య ఐరోపా‌లో రెండో క్లుప్తంగా ఉన్న జర్మన్-మాట్లాడే చిన్న భూపరివేష్టిత దేశం.

ప్రిన్సిపల్ ఆఫ్ లీచ్టెన్‌స్టీన్ నేతృత్వంలో రాచరిక రాజ్యాంగ రాజ్యం.

Principality of Liechtenstein

Fürstentum Liechtenstein  (German)
Flag of Liechtenstein
జండా
Coat of arms of Liechtenstein
Coat of arms
నినాదం: "Für Gott, Fürst und Vaterland"
"For God, Prince, and Fatherland"
గీతం: 
Oben am jungen Rhein
(English: "High on the Young Rhine")
Location of  లైచెన్‌స్టెయిన్  (green) on the European continent  (dark grey)  —  [Legend]
Location of  లైచెన్‌స్టెయిన్  (green)

on the European continent  (dark grey)  —  [Legend]

రాజధానిVaduz
అతిపెద్ద municipalitySchaan
47°10′00″N 9°30′35″E / 47.16667°N 9.50972°E / 47.16667; 9.50972
అధికార భాషలుGerman
మతం
Roman Catholicism
పిలుచువిధంLiechtensteiner
ప్రభుత్వంMonarchy
• Monarch
Hans-Adam II
• Regent
Alois
• Prime Minister
Adrian Hasler
శాసనవ్యవస్థLandtag
Independence as principality
• Treaty of Pressburg
12 July 1806
• Separation from
German Confederation
1866
విస్తీర్ణం
• మొత్తం
160 km2 (62 sq mi) (190th)
• నీరు (%)
2.7
జనాభా
• 2014 estimate
37,340 (193rd)
• జనసాంద్రత
227/km2 (587.9/sq mi) (57th)
GDP (PPP)2013 estimate
• Total
$5.3 billion (149th)
• Per capita
$98,432 (2nd)
GDP (nominal)2010 estimate
• Total
$5.155 billion (147th)
• Per capita
$143,151 (2nd)
హెచ్‌డిఐ (2015)Increase 0.912
very high · 15th
ద్రవ్యంSwiss franc (CHF)
కాల విభాగంUTC+1 (CET)
• Summer (DST)
UTC+2 (CEST)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+423
ISO 3166 codeLI
Internet TLD.li

లీచ్టెన్‌స్టీన్ పశ్చిమసరిహద్దులో, దక్షిణసరిహద్దులో స్విట్జర్లాండ్, తూర్పుసరిహద్దు, ఉత్తరసరిహద్దులో ఆస్ట్రియా ఉన్నాయి.దేశవైశాల్యం కేవలం 160 చదరపు కిలోమీటర్ల (62 చదరపు మైళ్ళు). వైశాల్యపరంగా లీచ్టెన్‌స్టీన్ ఐరోపాలో నాల్గవ అతి చిన్నదేశంగా పరిగణించబడుతుంది.దేశ జనసంఖ్య 37,000. దేశం 11 మునిసిపాలిటీలుగా విభజించబడింది. దేశ రాజధాని వాడుజ్, అతిపెద్ద మునిసిపాలిటీ స్చాన్.

ఆర్ధికపరంగా లీచ్టెన్‌స్టీన్ అధిక కొనుగోలుదారుల కొనుగోలుశక్తి, అత్యధిక స్థూల దేశీయ ఉత్పత్తి కలిగిన దేశంగా ఉంది.

నిరుద్యోగ రేటు 1.5% (ప్రపంచంలో అతి తక్కువగా) ఉంది. గతంలో లీచ్టెన్‌స్టీన్ ఒక బిలియనీర్ పన్ను స్వర్గంగా ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ ఇది ఏకాభిప్రాయ పన్ను వసూలు లేని దేశాల్లోని నల్లజాతి జాబితాలో లేదు (పన్నుల విభాగం చూడండి).

భౌగోళికంగా ఆల్పైన్ దేశం లీచ్టెన్స్టీన్ ప్రధానంగా పర్వత ప్రాంతం. ఇది శీతాకాలపు క్రీడల గమ్యస్థానంగా మారుతుంది. అనేక సాగునీటి వ్యవసాయక్షేత్రాలను, చిన్న తోటలను దక్షిణ (ఓబెర్లాండ్ ఎగువ భూమి), ఉత్తర (అన్టర్లాండ్ దిగువ భూమి) రెండింటిలోనూ కనుగొనబడ్డాయి. వాడుజ్ బలమైన ఆర్థిక రంగం కేంద్రీకృతమై ఉంది. లీచ్టెన్స్టీన్ ఐక్యరాజ్యసమితి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్, కౌంసిల్ ఆఫ్ ఐరోపా సభ్యదేశంగా ఉంది.దేశం స్విడ్జర్లాండ్‌తో కలిసి కస్టంస్ యూనియన్, మానిటరీ యూనియన్ నిర్వహిస్తుంది.

చరిత్ర

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Gutenberg Castle, Balzers, Liechtenstein.
లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Vaduz Castle, overlooking the capital, is home to the Prince of Liechtenstein
లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Johann I Joseph, Prince of Liechtenstein from 1805 to 1806 and 1814 to 1836.

ఆరంభకాల చరిత్ర

లిచెన్‌స్టెయిన్ మానవ ఉనికి అతి పురాతన జాడల మధ్య పాలియోలితిక్ కాలం నాటివని భావిస్తున్నారు. నియోలితిక్ వ్యవసాయ స్థావరాలు మొదట్లో క్రీ.పూ 5300 లో లోయలలో స్థాపించబడ్డాయి.

సుమారు క్రీ.పూ 450 నుండి చివరి ఇనుప యుగంలో హల్స్టాట్, లా టెనె సంస్కృతులు వృద్ధి చెందాయి. బహుశా గ్రీకు, ఎట్రుస్కాన్ నాగరికతల కొంత ప్రభావం ఉందని భావిస్తున్నారు. ఆల్పైన్ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన గిరిజన సమూహాలలో హెల్వీటి ఒకటి.క్రీ.పూ. 58 లో బైబ్రాక్ట్ యుద్ధంలో జూలియస్ సీజర్ అల్పైన్ తెగలను ఓడించాడు. అందుచేత ఈ ప్రాంతం రోమన్ సామ్రాజ్యం నియంత్రణలో ఉంది. క్రీ.పూ. 15 నాటికి టైబ్రియస్-రోమన్ చక్రవర్తి-తన సహోదరుడు డ్రూసస్‌తో ఆల్పైన్ ప్రాంతాన్ని జయించాడు. లిచెన్‌స్టెయిన్ తర్వాత రోథా రాజ్యంలోని రైట్యాలో చేర్చబడింది. ఈ ప్రాంతాన్ని రోమన్ సైన్యం నిర్వహిస్తుంది. వీరు కాన్స్టాన్స్ లేక్ సమీపంలోని బ్రిగాంటియమ్ (ఆస్ట్రియా), మాజియా (స్విస్) ​​వద్ద పెద్ద సైనిక దళాలను కూడా నిర్వహించారు. భూభాగం గుండా ప్రయాణించిన రోమన్ రహదారి ఈ సమూహాలచే సృష్టించబడింది, నిర్వహించబడుతుంది. అలేమానియన్లు 259/60 లో బ్రిగేంటియాన్ని నాశనం చేసారు. సుమారు క్రీ.పూ. 450 ప్రాంతంలో ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు.5 వ శతాబ్దంలో ప్రారంభ మధ్య యుగాలలో అలేమానీ తూర్పు స్విస్ పీఠభూమిలో, 8 వ శతాబ్దం చివరికి ఆల్ప్స్ లోయలు స్థిరపడింది. లిచెన్‌స్టెయిన్ అలేమానియా తూర్పు అంచు వద్ద ఉంది. 6 వ శతాబ్దంలో మొత్తం ప్రాంతం 504 లో టోల్బాయిక్‌లో అలేమానిపై మొదటి క్లోవిస్ విజయం సాధించిన తరువాత ఈప్రాంతం ఫ్రాంక్ సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత లిచెన్‌స్టెయిన్ ప్రాంతం చార్లెమాగ్నే మరణం తరువాత సా.శ. 843 లో వెర్డున్ ఒప్పందం ద్వారా సామ్రాజ్యం విభజించబడే వరకు ఫ్రాంకిష్ హెగోమీని (మెరౌవియన్, కారోలింగియన్ రాజవంశాలు)ఆధ్వర్యంలో ఉంది. తరువాత లిచెన్‌స్టెయిన్ భూభాగం తూర్పు ఫ్రాన్సియా స్వాధీనంలో ఉంది. తరువాత సుమారు సా.శ. 1000 పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మధ్య ఫ్రాంకియాతో తిరిగి విలీనం చేయబడింది. సుమారుగా 1100 వరకు ఈ ప్రాంతం ప్రబలమైన భాష రోమీచ్ అయినా ఆ తరువాత జర్మనీ ఈ భూభాగాన్ని ఆక్రమించడం ప్రారంభించింది. 1300 లో అలేమానిక్ జనాభా-వాలిస్‌ పూర్వీకత కలిగిన వల్సర్స్-ఈ ప్రాంతంలోకి ప్రవేశించి స్థిరపడ్డారు. ట్రీస్బెర్గ్ పర్వత గ్రామం ఇప్పటికీ వాల్సర్ మాండలికాన్ని సంరక్షిస్తుంది.

రాజవంశాల స్థాపన

1200 నాటికి ఆల్పైన్ పీఠభూమి అంతటా ఆక్రమణల కారణంగా పీఠభూమి హౌస్ ఆఫ్ సావోయ్, జాహింగర్, హాబ్స్బర్గ్, కైబర్గ్చే నియంత్రణలోకి మారింది. ఇతర ప్రాంతాలు ఇంపీరియల్‌కు వెనువెంటనే ఇవ్వబడ్డాయి. పర్వత మార్గాలపై సామ్రాజ్యం ప్రత్యక్ష నియంత్రణను మంజూరు చేసింది. 1264 లో కైబర్గ్ రాజవంశం పతనమైనప్పుడు కింగ్ మొదటి రుడోల్ఫ్ (హోలీ రోమన్ చక్రవర్తి 1273) ఆధ్వర్యంలో హబ్స్బర్గర్లు లైచెన్‌స్టెయిన్ భూభాగం ఉన్న తూర్పు ఆల్పైన్ పీఠభూమికి వరకు తమ భూభాగాన్ని విస్తరించారు. 1699 లో లైచెన్‌స్టెయిన్ రాజవంశం రూపొందే వరకు ఈ ప్రాంతం కౌంట్స్ ఆఫ్ హోహెనెమ్స్ కు స్వాధీనంలో ఉంది.1396 లో వాడుజ్ ( లైచెన్‌స్టెయిన్ దక్షిణ ప్రాంతం)కి "ఇంపీరియల్ ఇమ్మీడియాసీ " హోదా ఇవ్వబడి పవిత్ర రోమన్ చక్రవర్తికి అంకితం చేయబడింది. రాజ్యం దాని పేరునుండి తీసుకోబడింది. వాస్తవానికి ఈ పేరుకు దిగువ ఆస్ట్రియాలోని లైచెన్‌స్టెయిన్ కాసిల్ మూలంగా ఉంది. వారు కనీసం 1140 నుండి 13 వ శతాబ్దం వరకు (, మళ్లీ 1807 నుండి) ఈ పేరును కలిగి ఉన్నారు. లైచెన్‌స్టెయిన్ మొరావియా, లోయర్ ఆస్ట్రియా, సిలేషియా, స్టైరియాలలో భూమిని స్వాధీనం చేసుకున్నారు.ఈ భూభాగాలు అన్ని సీనియర్ ఫ్యూడల్ లార్డ్స్ ముఖ్యంగా హబ్సర్గర్ల వివిధ విభాగాలుగా ఉన్నాయి.లైచెన్‌స్టెయిన్ రాజవంశం ఇంపీరియల్ డైట్ (పార్లమెంట్) ఏర్పాటు చేయడానికి అర్హత పొందటానికి అవసరమైన ప్రాథమిక భూభాగాన్ని పొందలేదు. చాలామంది లైచెన్‌స్టెయిన్ రాకుమారులు అనేక హబ్స్బర్గ్ పాలకులు దగ్గరగా సలహాదారులగా పనిచేశారు. ఇంపీరియల్ సింహాసనం నుండి నేరుగా ఏ ప్రాంతాలూ పొందకుండా వారు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో కొంత అధికారాలను కలిగి ఉన్నారు.

రాజుల పాలన

1718 జనవరి 23 న భూములు కొనుగోలు చేయబడిన తరువాత పవిత్ర రోమన్ చక్రవర్తి వాడుజ్, షెల్లెన్బర్గ్ సంయుక్తంగా నూతనంగా ఏర్పడిన భూభాగం ఫ్యూర్స్‌టెంటాన్ని తన నిజమైన సేవకుడు పేరుతో లైచెన్‌స్టెయిన్ రాకుమారుడు అంటోన్ ఫ్లోరియన్‌ను గౌరవించడానికి పవిత్ర రోమన్ సామ్రాజ్యం సార్వభౌమాధికార సభ్య దేశంగా లైచెన్‌స్టీన్ రూపొందించడానికి అనుమతించాడు. లైచెన్‌స్టీన్ రాజులు దాదాపు 100 ఏళ్ళుగా తమ కొత్త రాజ్యమును సందర్శించలేరనే నిబంధన విధించబడింది.

1805 లో ఆస్టెర్‌లిట్జ్ యుద్ధంలో నెపోలియన్ చేతిలో ఓటమి పాలైనతరువాత ఐరోపాలో నెపోలియన్ యుద్ధాల ఫలితంగా 19 వ శతాబ్దం ప్రారంభంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం శక్తివంతమైన ఫ్రాన్స్ నియంత్రణలోకి వచ్చింది. 1805 లో చక్రవర్తి ఫ్రాన్సిస్ అధికారం నుండి తొలగించబడడంతో 960 సంవత్సరాల కంటే అధికమైన భూస్వామ్య ప్రభుత్వం ముగింపుకు వచ్చింది. నెపోలియన్ సామ్రాజ్యాన్ని రైన్ కాన్ఫెడరేషన్లో పునర్వ్యవస్థీకరించారు. ఈ రాజకీయ పునర్నిర్మాణంలో లైచెన్‌స్టెయిన్ విస్తృత మార్పులకు లోనైంది. చారిత్రక సామ్రాజ్య, చట్టపరమైన, రాజకీయ సంస్థలు రద్దు చేయబడ్డాయి. రాష్ట్ర సరిహద్దుల విషయంలో ఫ్యూడల్ లార్డులు బాధ్యత వదులుకున్నారు. 1818 లో ప్రిన్స్ మొదటి జోహన్ భూభాగానికి పరిమిత రాజ్యాంగాన్ని మంజూరు చేసాడు. అదే సంవత్సరంలో లైచెన్‌స్టెయిన్ ప్రిన్స్ అలైస్ ప్రింసిపాలిటీలో అడుగుపెట్టడానికి హౌస్ ఆఫ్ లైచెన్‌స్టెయిన్ మొదటి సభ్యుడయ్యాడు.అయినప్పటికీ నిబంధన అనుసరించి తదుపరి సందర్శన 1842 వరకు సంభవించదు.

కొద్దికాలం తర్వాత లైచెన్‌స్టెయిన్ ఆస్ట్రియా చక్రవర్తి అధ్యక్షత వహించిన జర్మన్ సమాఖ్యలో చేరాడు (1815 జూన్ 20 - 1866 ఆగస్టు 24).

  • 19 వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడినవి:
  • 1836, మొదటి కర్మాగారం, సెరామిక్స్ తయారీకి తెరవబడింది.
  • 1861 నాటికి, సేవింగ్స్, లోన్స్ బ్యాంకు మొదటి పత్తి-నేత మిల్లుతో పాటు స్థాపించబడింది.
  • 1868, ఆర్థిక కారణాల వలన లైచెన్‌స్టెయిన్ సైన్యం రద్దు చేయబడింది.
  • 1872, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా-హంగేరియన్ సామ్రాజ్యం మధ్య లైచెన్‌స్టెయిన్ మీదుగా రైల్వే లైన్ నిర్మించబడింది.
  • 1886, రైన్పై స్విట్జర్లాండ్ మద్య రెండు వంతెనలు నిర్మించబడ్డాయి.

20 వ శతాబ్ధం

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేవరకు లైచెన్‌స్టెయిన్‌ ముందుగా ఆస్ట్రియా సామ్రాజ్యానికి, తరువాత ఆస్ట్రియా-హంగేరికి దగ్గరగా ఉండేది.పాలన కొనసాగిస్తున్న రాకుమారులు హబ్స్‌బర్గ్ భూభాగాల్లో ఉన్న ఎస్టేట్ల నుండి వారి సంపదను అధికంగా గ్రహించసాగారు. వారు వియన్నాలోని వారి రెండు రాజప్రాసాల్లో తమ సమయాన్ని అధికంగా గడిపారు. యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక వినాశనం దేశం దాని ఇతర పొరుగు స్విట్జర్లాండ్ కస్టమ్స్, ద్రవ్య యూనియన్ ఏర్పరచుకునేలా వత్తిడి చేసింది.

ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం రద్దు సమయంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం లైచెన్‌స్టెయిన్‌ ఇకపై స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రియాలో ఉండదని అది పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటుందని వాదించింది. పాక్షికంగా విరుద్ధమైన భావంతో లైచెన్‌స్టెయిన్‌ అవగాహనతో తొలగించబడిన ఆస్ట్రో-హంగేరియన్ చక్రవర్తి పవిత్ర రోమన్ సామ్రాజ్యం వారసత్వాన్ని ఇప్పటికీ నిర్వహిస్తుంది.


1929 లో 75 ఏళ్ల ప్రిన్స్ మొదటి ఫ్రాంజ్ సింహాసనంపై విజయం సాధించాడు. ఫ్రాంజ్ వియన్నా లోని మోరవియా నుండి తండ్రి యూదు వ్యాపారవేత్త అయిన ఒక సంపన్న మహిళ ఎలిసబెత్ వాన్ గుట్మన్‌ను వివాహం చేసుకున్నాడు.అతని నుండి ఒక . లైచెన్‌స్టెయిన్‌కు అధికారిక నాజీ పార్టీ లేనప్పటికీ, జాతీయ యూనియన్ పార్టీలో నాజీ సానుభూతి ఉద్యమం దాని తలెత్తింది. స్థానిక లైచెన్‌స్టెయిన్‌ నాజీలకు ఎలిసబెత్ యూదు "సమస్య"గా మారింది. మార్జి 1938 లో ఆస్ట్రియాను నాజి జర్మనీ విలీనం చేసుకున్న తర్వాత ప్రిన్స్ ఫ్రాంజ్ 31 ఏళ్ల ఫస్ట్ కజిన్ స్థానంలో రెండుమార్లు రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. ఆ సంవత్సరం జూలైలో ఫ్రాంజ్ మరణించాడు, ఫ్రాంజ్ జోసెఫ్ సింహాసనాన్ని అధిష్టించాడు.ఆస్ట్రియా విలీనం చేయబడిన కొన్ని రోజుల తరువాత ఫ్రాంజ్ రెండవ జోసెఫ్ మొదటిసారిగా 1938 లో లైచెన్‌స్టెయిన్‌ చేరుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లైచెన్‌స్టెయిన్‌ అధికారికంగా తటస్థంగా ఉండేది. సహాయం, మార్గదర్శకత్వం కోసం పొరుగున ఉన్న స్విట్జర్లాండ్ వైపు చూస్తూ బోహేమియా, మొరవియా, సిలేసియా లలో వంశపారంపర్యమైన భూములు, స్వాధీనములు కలిగిన కుటుంబ సంపదలను భద్రపర్చడానికి లైచెన్‌స్టెయిన్‌ తీసుకువెళ్ళారు. వివాదానికి సమీపంలో చెకోస్లోవేకియా, పోలాండ్, జర్మనీ స్వాధీనాలుగా భావించిన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవడంతో ఆ మూడు ప్రాంతాల్లోని లైచెన్‌స్టెయిన్‌ రాజవంశం వారసత్వ సంపదను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అటవీ వ్యవసాయ, అటవీ భూములలో (ముఖ్యంగా యునెస్కొ వారసత్వ సంపదలో ఒకటైన లిడెన్నిస్-వాల్టిస్ సాంస్కృతిక ప్రకృతి దృశ్యం), అనేక కుటుంబ కోటలు, రాజభవనాలు ఉన్నాయి.2005 లో ఎస్.ఎస్. అందించిన స్త్రాస్హోఫ్ కాన్సంట్రేషన్ శిబిరంలో ఉన్న యూదు కార్మికులు ఆస్ట్రియాలో లైచెన్‌స్టెయిన్‌ ప్రిన్సిలే హౌస్ యాజమాన్యంలోని ఎస్టేట్స్లో పనిచేశారని వెల్లడైంది." కోల్డ్ వార్ " ప్రచ్ఛన్న యుద్ధంలో చెకొస్లోవేకియాలోకి ప్రవేశించడానికి లైచెన్‌స్టెయిన్ పౌరులు నిషేధించబడ్డారు. ఇటీవల వివాదాస్పద యుద్ధానంతర బెనెస్ శాసనాల చుట్టూ తిరుగుతున్న దౌత్య వివాదం లైచెన్‌స్టెయిన్ చెక్ రిపబ్లిక్ లేదా స్లొవేకియాతో అంతర్జాతీయ సంబంధాలను పంచుకోవడం లేదు.2009 జూలై 13 న లైచెన్‌స్టెయిన్, చెక్ రిపబ్లిక్ మద్య , స్లొవేకియాతో 2009 డిసెంబరు 9 న దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.

and with Slovakia on 9 December 2009.

ఆర్ధిక కేంద్రం

ఐరోపా‌లో యుద్ధం ముగిసిన తరువాత లైచెన్‌స్టైన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. లైచెన్‌స్టైన్ రాజవంశం తరచూ కుటుంబం కళాత్మక సంపదలను విక్రయించింది. వీటిలో లియోనార్డో డా విన్సీ చిత్రీకరించిన పోర్ట్రెయిట్ "గైనర్వే డె 'బెన్సి" చిత్రం 1967 లో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 5 మిలియన్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

అయితే 1970 ల చివరినాటికి దేశంలోకి అనేక కంపెనీలను ఆకర్షించేందుకు చాలా తక్కువ కంపెనీల పన్నుశాతం విధానం ఉపయోగించింది. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా మారింది.లైచెన్‌స్టైన్ ప్రిన్స్ 5 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో ప్రపంచంలోని ఆరవ ధనవంతుడైన రాజుగా గుర్తించబడుతున్నాడు. దేశం ప్రజలు ప్రపంచంలోని అత్యధిక జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారు.

భౌగోళికం

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
The Rhine: border between Liechtenstein and Switzerland (view towards the Swiss Alps).

లైచెన్‌స్టెయిన్ యూరోపియన్ ఆల్ప్స్ ఎగువ రైన్ లోయలో ఉంది. తూర్పున సరిహద్దులో ఆస్ట్రియా ఉంది. దక్షిణ, పశ్చిమసరిహద్దులో స్విట్జర్లాండ్ ఉంది. లైచెన్‌స్టెయిన్ మొత్తం పశ్చిమ సరిహద్దు రైన్‌లోయ ఆక్రమిస్తూ ఉంది. ఉత్తరం నుండి దక్షిణంవరకు 24 కిమీ (15 మైళ్ళు) పొడవు ఉంది. 2,599 మీ (8,527 అడుగులు) గ్రాస్సైట్జ్ దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. ఆల్పైన్ పర్వతశ్రేణి దక్షిణపు గాలులను అడ్డగిస్తూ ఉన్నందున లైచెన్‌స్టెయిన్ వాతావరణం తేలికపాటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పర్వత వాలు ప్రాంతాలు శీతాకాలపు క్రీడలకు బాగా సరిపోతాయి.

2006 లో దేశ సరిహద్దుల కచ్చితమైన కొలతలను ఉపయోగించి నిర్వహించిన కొత్త సర్వేలు 77.9 కి.మీ (48.4 మీ) సరిహద్దులతో 160 చ.కి.మీ. (61.776 చ.కి.మీ) వద్ద దాని ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా 2006 లో లైచెన్‌స్టెయిన్ సరిహద్దులు 1.9 కి.మీ. (1.2 మైళ్ళు) అంతకు మునుపు అనుకున్నదాని కంటే ఎక్కువగా ఉన్నాయి.

ప్రపంచంలోని రెండు రెట్టింపైన భూభంధిత దేశాల్లో లైచెన్‌స్టెయిన్ ఒకటి. పూర్తిగా భూభంధిత దేశాల మధ్య బంధితమై ఉన్న మరొక దేశం ఉజ్బెకిస్తాన్ పరిసర ప్రాంతం. లైచెన్‌స్టెయిన్ భూభాగం ద్వారా ప్రపంచంలోని ఆరవ అతిచిన్న స్వతంత్ర దేశం.

లైచెన్‌స్టెయిన్ రాజ్యం 11 జెమిండెన్స్ (ఏకవచనం గెమేండు) అని పిలువబడే కమ్యూన్లుగా (భూభాగాలు) విభజించబడింది. గెమేండెన్‌లో ఒకే పట్టణం లేదా గ్రామం మాత్రమే ఉంటాయి.వీటిలో ఓబెర్లాండ్ (ఎగువ కౌంటీలోని బెర్జర్స్, ప్లాంకెన్, స్కయాన్, ట్రోసెన్, ట్రైసేన్బెర్గ్, వాడుజ్) ఎన్నికల జిల్లాగా అన్టర్ల్యాండ్ (దిగువ కౌంటీ), మిగిలిన వాటిలో (ఎస్చెన్, గెర్రిన్, మౌరెన్, రగ్గెల్, షెల్లెన్బెర్గ్)ఉన్నాయి.

ఆర్ధికరంగం

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Looking southward at Vaduz city centre

పరిమితమైన సహజ వనరులు ఉన్నప్పటికీ పౌరుల కంటే ఎక్కువ నమోదైన సంస్థలున్న ప్రపంచంలోని కొన్ని దేశాలలో లిచెన్‌స్టెయిన్ ఒకటి; ఇది సంపన్నమైన, అత్యధిక పారిశ్రామిక స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆర్థిక సేవా రంగంతో పాటు లిచెన్‌స్టెయిన్ అతిపెద్ద యూరోపియన్ పొరుగు పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా ఉండే జీవన ప్రమాణాన్ని కలిగి ఉంది.

లిచెన్‌స్టెయిన్ స్విట్జర్లాండ్తో ఒక కస్టమ్స్ యూనియన్‌లో పాల్గొంటుంది, స్విస్ ఫ్రాంక్ను జాతీయ కరెన్సీగా నియమించింది. దేశంలో 85% దాని శక్తిని దిగుమతి చేస్తుంది. లిచెన్‌స్టెయిన్ యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఇ.ఎఫ్.టి.ఎ.), యూరోపియన్ యూనియన్ మధ్య వంతెనగా పనిచేసే ఒక సంస్థలో సభ్యదేశంగా ఉంది. 1995 మే నుండి ప్రభుత్వం తన ఆర్థిక విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నది. 2008 లో నిరుద్యోగ రేటు 1.5% వద్ద ఉంది. ప్రస్తుతం వాడుజ్‌లోని లిచెన్‌స్టెయిన్ ల్యాండెస్పిటల్లో లిచెన్‌స్టెయిన్ ఒక ఆసుపత్రి ఉంది. 2014 నాటికి సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ కొనుగోలు స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి.) కొనుగోలు శక్తి తుల్యత ఆధారంగా 4.978 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 2009 నాటికి తలసరి ఆదాయం $ 1,39,100 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది ప్రపంచ జాబితాలో ఉన్నత స్థానంలో ఉంది.

పరిశ్రమలలో ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, సున్నితమైన వాయిద్యాలు, మెటల్ తయారీ, విద్యుత్ ఉపకరణాలు, యాంకర్ బోట్స్, కాలిక్యులేటర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. అత్యంత గుర్తించదగిన అంతర్జాతీయ సంస్థ, అతిపెద్ద యజమాని హిల్టీ, డైరెక్ట్ ఫాస్టెనింగ్ సిస్టంస్, హై-ఎండ్ పవర్ టూల్స్ తయారుచేస్తుంది. లిచెన్‌స్టెయిన్ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, పాల ఉత్పత్తులు, పశువుల, వైన్లను ఉత్పత్తి చేస్తుంది. దేశం ఆర్థికవ్యవస్థలో పర్యాటకరంగం అత్యధికంగా భాగస్వామ్యం వహిస్తుంది.

పన్నువిధింపు

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Since 1923, there has been no border control between Liechtenstein and Switzerland.

లిచెన్‌స్టెయిన్ ప్రభుత్వం వ్యక్తిగత వ్యాపార ఆదాయం, ప్రధాన (సంపద) పన్నును విధిస్తుంది. వ్యక్తిగత ఆదాయం పన్ను రేటు 1.2%. కమ్యూన్లు విధించిన అదనపు ఆదాయ పన్నుతో కలిపి ఉన్నప్పుడు మిశ్రమ ఆదాయం పన్ను రేటు 17.82%. 4.3% అదనపు ఆదాయం పన్ను దేశం సామాజిక భద్రతా కార్యక్రమంలో ఉన్న ఉద్యోగులందరి మీద విధించబడుతుంది. గరిష్ఠ ఆదాయం పన్ను రేటు11% నుండి 29%గా ఉంది. గరిష్ఠంగా స్వయం ఉపాధికి పన్నుశాతం ఎక్కువగా ఉంటుంది. సంపదపై ప్రాథమిక పన్ను రేటు సంవత్సరానికి 0.06%. మిశ్రమ మొత్తం రేటు 0.89%. కార్పొరేట్ లాభాలపై పన్ను రేటు 12.5%. లీచెన్‌స్టెయిన్ బహుమతి, ఎస్టేట్ పన్నులు గ్రహీతకు ఇచ్చేవారికి, వారసత్వ మొత్తానికి సంబంధించి బట్టి మారుతూ ఉంటుంది. పన్నులు 0.5%, 0.75% మధ్య జీవిత భాగస్వాములు, పిల్లలకు, 18% నుండి 27% కాని సంబంధిత స్వీకరణ కర్తలకు విధించబడుతుంది. ఎస్టేట్ పన్ను ప్రగతిశీలమైంది.

లీచెన్‌స్టెయిన్ గతంలో స్టీఫున్జెన్ ("సంస్థలు") నుండి గణనీయమైన ఆదాయం పొందాయి.. ఆర్థిక సంస్థల అసలైన విదేశీ యజమానుల ఆర్థిక వివరణలను దాచడానికి ఈ స్వదేశీ ఆర్థిక సంస్థలు సృష్టించబడ్డాయి. ఒక లీచెన్‌స్టెయిన్ పౌరుల పేరులో నమోదు చేయబడిన సంస్థలు (తరచూ న్యాయవాది పేరుతో సృష్టించబడ్డాయి). లీచెన్‌స్టెయిన్ వారి స్వంత దేశాల్లో పన్నులను నివారించడానికి లేదా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్న చాలా సంపన్న వ్యక్తులు, వ్యాపారాల కోసం ఒక ప్రముఖ పన్ను స్వర్గంగా చేయడానికి ఈ చట్టాలు ఉపయోగించబడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో లిచెన్‌స్టెయిన్ అంతర్జాతీయ మనీ-లాండేర్లను ప్రాసిక్యూట్ చేయటానికి బలమైన నిర్ణయాత్మక విధానాన్ని ప్రదర్శిస్తుంది.దేశం ఇమేజ్‌ను చట్టబద్దమైన ఆర్థిక కేంద్రంగా ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. 2008 ఫిబ్రవరిలో జర్మనీలో పన్ను-మోసం కుంభకోణంలో దేశం ఎల్.జి.టి. బ్యాంక్ చిక్కుకుంది. ఇది జర్మనీ ప్రభుత్వఅధికార కుటుంబ సంబంధాన్ని దెబ్బతీసింది. క్రౌన్ ప్రిన్స్ అలోయిస్ జర్మన్ ప్రభుత్వం వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపించారు. ఎల్.జి.టి.గ్రూప్ ఒక మాజీ ఉద్యోగి ఇచ్చిన ప్రైవేటు బ్యాంకింగ్ సమాచారాన్ని $ 7.3 మిలియన్ల అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సూచించారు. ఏదేమైనా పన్ను స్వర్గంగా ఉన్న బ్యాంకులపై యునైటెడ్ స్టేట్స్ సెనేట్ సబ్‌కమిటీ మాట్లాడుతూ రాచరిక కుటుంబాల యాజమాన్యంలో ఉన్న ఎల్.జి.టి. బ్యాంకు, బోర్డులో సేవచేసేవారు.

2008 లీచ్టెన్‌స్టెయిన్ పన్ను వ్యవహారం అనేక దేశాలలో పన్ను పరిశోధనలకు మూలంగా ఉంది. పౌరులు కొందరు లీచెన్‌స్టెయిన్ బ్యాంకులు, ట్రస్టులను ఉపయోగించడం ద్వారా పన్ను విధించే బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారని అనుమానించారు; జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్‌లో పన్ను ఎగవేత కోసం ఎన్నడూ జరగని పరిశోధనలు అతిపెద్ద సంక్లిష్టతతో ఈ వ్యవహారం జరిగింది. 2007 లో ప్యారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ చేత గుర్తించబడినట్లు అడార్రా, మొనాకోలతో పాటు లిచెన్‌స్టెయిన్ ఒత్తిడి తెచ్చేప్రయత్నం చేసింది. 2009 మే 27 న ఇ.ఇ.సి.డి. లిచెన్‌స్టెయిన్ అనధికారిక దేశాల బ్లాక్‌లిస్ట్ జాబితా నుండి తొలగించింది.

2009 ఆగస్టులో బ్రిటీష్ ప్రభుత్వ విభాగం హెచ్.ఎం. రెవెన్యూ & కస్టమ్స్ లీచెన్‌స్టెయిన్ సమాచారాన్ని మార్పిడి చేయటానికి అంగీకరించింది. 5,000 బ్రిటీష్ పెట్టుబడిదారులకు దేశంలో ఖాతాల, ట్రస్ట్ లలో సుమారుగా 3 బిలియన్ డాలర్లు డిపాజిట్ చేశారని విశ్వసించబడుతుంది.

2015 అక్టోబరులో యూరోపియన్ యూనియన్, లీచెన్‌స్టెయిన్ పన్ను వివాదాల విషయంలో ఆర్థిక సమాచారం ఆటోమేటిక్ ఎక్చేంజ్ను నిర్ధారించడానికి ఒక పన్ను ఒప్పందంపై సంతకం చేసింది. డేటా సేకరణ 2016 లో మొదలయ్యింది, ప్రైవేటు వ్యక్తులు, కార్పోరేట్ ఆస్తుల పన్నుల విషయంలో ఇతర యూరోపియన్ దేశాలతో సమానంగా దేశాన్ని తీసుకురావటానికి మరొక చర్యగా ఇది ఉంది.

గణాంకాలు

జనసంఖ్యా పరంగా లైచెన్‌స్టైయిన్ ఐరోపాలో నాలుగో అతిచిన్న దేశంగా ఉంది.ఇది ప్రపంచంలో అతి తక్కువ జసంఖ్య కలిగిన దేశాలలో వాటికన్ సిటీ, సాన్‌మారినో, మొనాకో తరువాత స్థానంలో ఉంది.దేశ జనసంఖ్యలో మూడోవంతు విదేశాలలో జన్మించారు. ప్రధానంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. జర్మన్ మాట్లాడేవారు, స్విస్, ఇటలీ, తుర్కులతో దేశ జనాభా ప్రధానంగా అలేమానినిక్ మాట్లాడుతుంది. దేశం శ్రామికశక్తిలో మూడింట రెండు వంతుల మంది విదేశీ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. లైచెన్‌స్టెయిన్ ప్రజల ఆయుఃప్రమాణం 80.31 సంవత్సరాలు.పురుషుల ఆయుఃప్రమాణం 76.86 సంవత్సరాలు, మహిళ ఆయుఃప్రమాణం 83.77 సంవత్సరాలు (2011 అంచనా). ఇటీవలి అంచనాల ప్రకారం శిశు మరణాల రేటు 1,000 జననాలకు 4.64 మరణాలు.

భాషలు

అధికారిక భాష జర్మన్; చాలా మంది ప్రామాణిక జర్మనీకి చెందిన ఒక అలేమానిక్ మాండలికాన్ని మాట్లాడతారు. కానీ స్విట్జర్లాండ్, వోరార్ల్బర్గ్, ఆస్ట్రియా వంటి పొరుగు ప్రాంతాల్లో మాట్లాడే ఆ మాండలికాలకు దగ్గరి సంబంధం ఉంది. టిరిన్బెర్గ్‌లో మునిసిపాలిటీచే ప్రోత్సహించబడిన ఒక మాండలికం వాడుక భాషగా ఉంది. అయితే స్విస్ ప్రామాణిక జర్మన్ దేశంలో చాలా మంది ప్రజలు అర్థంచేసుకుని మాట్లాడకలిగి ఉంటారు.

మతం

Religion in Liechtenstein in 2010

  Roman Catholic (75.9%)
  Protestant (8.5%)
  Other Christian (1.4%)
  Muslim (5.4%)
  Other religion (0.8%)
  Undeclared (2.6%)
  Irreligion (5.4%)

లైచెన్‌స్టెయిన్ రాజ్యాంగం ప్రకారం లీచెన్‌స్టెయిన్ అధికారిక మతంగా రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది:

కాథలిక్ చర్చ్ ప్రభుత్వ చర్చి, ప్రభుత్వం పూర్తి రక్షణను ఆస్వాదిస్తుంది.

లైచెన్‌స్టెయిన్ అన్ని మత విశ్వాసాలకు అనుగుణంగా రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన "ప్రజల మతపరమైన విశ్వాసం"గా పరిగణిస్తుంది. లైచెన్‌స్టెయిన్ పాఠశాలలలో మినహాయింపులు ఉన్నప్పటికీ, రోమన్ కాథలిక్కులు లేదా ప్రొటెస్టంట్ల మతపరమైన విద్య (రిఫార్మ్డ్ లేదా లూథరన్ లేదా రెండూ) చట్టపరంగా తప్పనిసరి. మతపరమైన సంస్థలకు పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది. " ప్యూ రీసెర్చ్ సెంటర్ " ఆధారంగా మతపరమైన ఘర్షణల వలన ఏర్పడిన సాంఘిక వివాదాలు లైచెన్‌స్టెయిన్‌లో తక్కువగా ఉంది. మతం ఆచరణలో ప్రభుత్వం పరిమితి కూడా ఉంది.

2010 జనాభా లెక్కల ఆధారంగా మొత్తం జనాభాలో 85.8% క్రిస్టియన్లు ఉన్నారు. వీరిలో 75.9% రోమన్ క్యాథలిక్ విశ్వాసానికి కట్టుబడి ఉండగా వడోజ్ మినహాయింపు అయిన రోమన్ కాథలిక్ ఆర్చిడియోసెన్ ఏర్పరుచుకుని 9.6% మంది ప్రొటెస్టంట్‌గా ఉన్నారు. ప్రధానంగా క్రిస్టియన్-ఆర్థోడాక్స్ చర్చిలో ప్రధానంగా లైచెన్‌స్టెయిన్ ఎవాంజెలికల్ చర్చి ఒక " (యునైటెడ్ చర్చి, లూథరన్ & రిఫార్మ్డ్), లైచెన్‌స్టెయిన్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, లేదా ఆర్థోడాక్స్ నిర్వహించబడుతున్నాయి. అతిపెద్ద మైనారిటీ మతంగా ఇస్లాం (మొత్తం జనాభాలో 5.4%) ఉంది. ప్రజల ప్రధాన మతం అవలంభిస్తూన్న రోమన్ కాథలిక్కులు లైచెన్‌స్టెయిన్ పౌరసత్వం (87.0%) కలిగి ఉన్నారు.

మతం! 2010 2000 1990
కాథలిక్కులు 75.9% 78.4% 84.9%
ప్రొటెస్టెంట్లు 8.5% 8.3% 9.2%
క్రిస్టియన్ - ఆర్థడాక్స్ 1.1% 1.1% 0.7%
ఇతర క్రిస్టియన్ చర్చీలు 0.3% 0.1% 0.2%
ముస్లిములు 5.4% 4.8% 2.4%
ఇతర మతస్థులు 0.8% 0.3% 0.2%
ఏ మతాన్ని అంగీకరించని వారు 5.4% 2.8% 1.5%
మతాన్ని ప్రకటించని వారు 2.6% 4.1% 0.9%

విద్య

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
University of Liechtenstein

లైచెన్‌స్టెయిన్ అక్షరాస్యత రేటు 100%. 2006 లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కో ఆర్డినేట్ చేసిన ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ రిపోర్టు ప్రోగ్రాం ఆధారంగా లైచెన్‌స్టెయిన్ విద్యను ప్రపంచంలో 10 వ స్థానంలో ఉన్నట్లు గుర్తించింది. 2012 లో లైచెన్‌స్టెయిన్ ఐరోపా దేశాలలో అత్యధిక పి.ఐ.ఎస్.ఎ- స్కోర్లను కలిగి ఉంది.

లైచెన్‌స్టెయిన్ లిక్టెన్స్టీన్లో, ఉన్నత విద్యకు నాలుగు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి:

  • లైచెన్‌స్టెయిన్ విశ్వవిద్యాలయం
  • లైచెన్‌స్టెయిన్ ప్రిన్సిపాలిటీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయం
  • లైచెన్‌స్టెయిన్ ఇన్స్టిట్యూట్

దేశంలో తొమ్మిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటితొ పాటు:

  • వాడుజ్లోని లైచెన్‌స్టెయిన్ జిమ్నాసియం.
  • వాడుజ్లో షుల్జెంత్రం ముహులౌల్జ్ II, రియల్ స్కూల్ వాడుజ్, ఒబ్సు స్కూల్ వాడుజ్

44]

  • స్కాయన్, స్పోర్టు స్కూల్ లైచెన్‌స్టెయిన్ లో ( స్కయాన్ )

రవాణా

లైచెన్‌స్టెయిన్‌లో 155 మైళ్ళ రహదారి మార్గాలలో 90 కిలోమీటర్ల (56 మైళ్ళు)పొడవైన సైకిల్ మార్గాలు ఉన్నాయి.

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
బాల్జర్స్ హెలిపోర్ట్

9.5 కి.మీ. (5.9 మై) రైల్వే లైచెన్‌స్టెయిన్‌ ద్వారా ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లను కలుపుతుంది. ఫెల్డ్కిర్చ్, ఆస్ట్రియా, బుచ్స్, స్విట్జర్లాండ్ మధ్య మార్గంలో భాగంగా ఆస్ట్రియా ఫెడరల్ రైల్వేస్ నిర్వహించబడుతున్నాయి. లైచెన్‌స్టెయిన్‌ ఆస్ట్రియన్ వేర్కెస్వర్బుండ్ వోరార్ల్బర్గ్ టారిఫ్ ప్రాంతంలో ఉంది.

ఆస్ట్రియన్ ఫెడరల్ రైల్వేస్ ఫెల్డ్కిర్చ్, బుచ్స్ మధ్య క్రమరహితంగా ఆపే స్కయాన్-వాడుజ్, ఫోర్స్ట్ హిల్టి, నెండెల్న్, స్కన్వాల్డు నాలుగు స్టేషన్లతో రైలుసేవలు అందిస్తుంది. యూరోసిటి, ఇతర దూరప్రాంత రైళ్ళు కూడా మార్గం వెంట ప్రయాణించేవి. వారు సాధారణంగా లైచెన్‌స్టెయిన్‌ సరిహద్దులలో ఉన్న స్టేషన్లలో కాల్ చేయరు.

లైచెన్‌స్టెయిన్‌ బస్ స్విస్ పోస్ట్బస్ వ్యవస్థకు అనుబంధంగా ఉంది. కానీ విడిగా నడుస్తుంది. బుష్స్, సర్గాన్స్ వద్ద స్విస్ బస్ నెట్వర్కును కలుపుతుంది. బస్సులు కూడా ఆస్ట్రియా పట్టణమైన ఫెల్డ్కిర్చ్ వరకు నడుస్తాయి.

లైచెన్‌స్టెయిన్‌లో విమానాశ్రయం లేదు. స్విట్జర్లాండులోని జ్యూరిచ్ సమీపంలోని " జూరిచ్ ఎయిర్పోర్ట్ " (130 కి.మీ / 80 మై రోడ్డు) సమీపంలోని పెద్ద విమానాశ్రయంగా ఉంది. సమీపంలోని చిన్న విమానాశ్రయం సెయింట్ గాలెన్ ఎయిర్పోర్ట్ (50 కి.మీ/ 30 మై). ఫ్రెడ్రిచ్షఫెన్ విమానాశ్రయం కూడా 85 కిలోమీటర్ల దూరంలో లైచెన్‌స్టెయినీయులకు అందుబాటులో ఉంది. బెర్జర్స్ హెలిపోర్ట్ చార్టర్డ్ హెలికాప్టర్ విమానాలకు అందుబాటులో ఉంది.

మాధ్యమం

లైచెన్‌స్టెయిన్ లోని షాయాన్లో ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ టెలికాం లైచెన్‌స్టెయిన్ ఉన్నాయి. దేశంలో ఒక టెలివిజన్ ఛానల్ మాత్రమే ఉంది. 2008 లో ప్రైవేట్ ఛానల్ ఐ.ఎఫ్.ఎల్.టి.వి. సృష్టించబడింది. ప్రస్తుతానికి ఐ.ఎఫ్.ఎల్.టి.వి. యూరోపియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్లో సభ్యత్వం లేదు. 2004 లో స్థాపించబడిన ఎల్- రేడియో, లైచెన్‌స్టెయిన్ రేడియో స్టేషన్గా పనిచేస్తుంది. ఇది ట్రైసేన్ కేంద్రంగా ఉంది. ఎల్- రేడియోకు 50,000 మంది శ్రోతలు ఉన్నారు. 1938 అక్టోబరు 15 న "ఎయిర్ రేడియో లైచెన్‌స్టెయిన్ " ప్రారంభమైంది. లైచెన్‌స్టెయిన్‌లో రెండు ప్రధాన వార్తాపత్రికలు కూడా ఉన్నాయి; లైచెన్‌స్టెయిన్ వోల్క్‌బ్లాట్, లైచెన్‌స్టెయినర్ వోటర్ల్యాండ్. వాడజ్లో ఉన్న మానామీడియా లైచెన్‌స్టెయిన్‌లో ఉన్న ప్రాథమిక మల్టీమీడియా సంస్థగా ఉంది.

కొందరు జాతీయులు, సందర్శకులకు ఔత్సాహిక రేడియో ఒక అభిరుచిగా ఉంది. ఇతర సార్వభౌమ దేశాలకు ఉన్నట్లు లైచెన్‌స్టెయిన్‌కు స్వంత ఐ.టి.యు. లేదు. ఇది స్విట్జర్లాండ్ కాంటిన్డ్ పూర్వపదాలను (సాధారణంగా "హెచ్.బి."), తరువాత సున్నాతో ఉపయోగిస్తుంది.

సంస్కృతి

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
City-centre with Kunstmuseum (Liechtenstein Art Museum)
లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Liechtenstein National Museum

లైచెంస్టెయిన్ సంస్కృతి మీద జర్మన్ మాట్లాడే యూరోప్ దక్షిణ ప్రాంతాలైన ఆస్ట్రియా, బాడెన్-వుర్టెంబర్గ్, బవేరియా, స్విట్జర్లాండ్, ప్రత్యేకించి జర్మన్ టిరోల్, వోరార్లెబర్గు దేశాల వెలుపలి దేశాల సాంస్కృతిక ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయి. "హిస్టారికల్ సొసైటీ ఆఫ్ ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ లైచెన్‌స్టెయిన్" దేశ సంస్కృతి, చరిత్రను కాపాడడంలో పాత్రను పోషిస్తుంది.

అతిపెద్ద మ్యూజియం కంస్టుమ్యూజియం లైచెన్‌స్టెయిన్ ముఖ్యమైన అంతర్జాతీయ కళాఖండాల సేకరణతో ఆధునిక, సమకాలీన కళాఖండాలను సంరక్షిస్తున్న అంతర్జాతీయ మ్యూజియంగా గుర్తించబడుతుంది. స్విస్ వాస్తుశిల్పులైన మోర్గార్, డెజెలో, కేరేజ్ల రూపకల్పనలో రూపొందించబడిన ఈ భవనం వాడుజ్లో ఒక మైలురాయిగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇది 2000 నవంబరులో నిర్మాణం పూర్తచేసుకుంది. లేతరంగు కాంక్రీటు, నల్ల బసాల్ట్ రాయి "బ్లాక్ బాక్స్" నిర్మినచబడ్డాయి. మ్యూజియంలో సేకరణ లైచెన్‌స్టెయిన్ జాతీయ కళాఖండాల సేకరణ కూడా ఉంది.

ఇతర ముఖ్యమైన మ్యూజియం లైచెన్‌స్టెయిన్ నేషనల్ మ్యూజియం (లైచెన్‌స్టెయిన్ ల్యాండ్ మ్యూజియం) సాంస్కృతిక, సహజ చరిత్రపై శాశ్వత ప్రదర్శనకు ప్రాధాన్యత ఈస్తుంది. స్టాంప్ మ్యూజియం, స్కై మ్యూజియం, 500 ఏళ్ల గ్రామీణ జీవనశైలి మ్యూజియం కూడా ఉన్నాయి.

దేశంలోని అన్ని పుస్తకాలకు చట్టబద్దమైన డిపాజిట్ చేయడానికి అర్హత కలిగిన లైబ్రరీగా " లైచెన్‌స్టెయిన్ స్టేట్ లైబ్రరి " పనిచేస్తుంది.

వదుజ్ కాజిల్, గుటెన్బర్గ్ కాజిల్, రెడ్ హౌస్, షెల్లెన్‌బర్గు శిథిలాలు అత్యంత ప్రాబల్యత కలిగిన చారిత్రకప్రాంతాలుగా ఉన్నాయి.

లైచెన్‌స్టెయిన్ ప్రిన్స్ ప్రైవేట్ ఆర్ట్ కలెక్షన్, ప్రపంచంలోని ప్రముఖ ప్రైవేట్ కళా సేకరణలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇవి వియన్నాలోని లైచెన్‌స్టెయిన్ మ్యూజియంలో ఉన్నాయి.

దేశం జాతీయ సెలవుదినంపై అన్ని విషయాలను రాష్ట్ర రాజధాని కోటలో నిర్ణయించబడుతుంటాయి. జాతీయ ఉత్సవంలో ప్రసంగాలను నిర్వహిస్తున్న కోటలో జనాభాలో గణనీయమైన భాగం హాజరవుతుంది. ఇక్కడ ఉచితకానుకగా బీరు అందించబడుతుంది.

సంగీతం, థియేటర్ సంస్కృతి దేశసంస్కృతిలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. దేశంలో లైచెన్‌స్టెయిన్ మ్యూజికాల్ కంపెనీ, యాన్యుయల్ గిటార్ డేస్, ఇంటర్నేషనల్ జోసెఫ్ గాబ్రియేల్ రీంస్‌బర్గెర్ సొసైటీ వంటి అనేక సంగీత సంస్థలు ఉన్నాయి. ఇవి రెండు ప్రధాన థియేటర్లలో ప్రదర్శిస్తుంటారు.

క్రీడలు

లైచెన్‌స్టెయిన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Marco Büchel, the first Liechtensteiner alpine skier to compete at six Winter Olympics

లైచెన్‌స్టెయిన్ ఫుట్ బాల్ జట్లు స్విస్ ఫుట్బాల్ లీగులో పాల్గొంటాయి. లైచెన్‌స్టెయిన్ ఫుట్ బాల్ కప్ ప్రతి సంవత్సరం యు.ఇ.ఎఫ్.ఎ. యూరోపా లీగులో పాల్గొనడాంకి లైచెన్‌స్టెయిన్ జట్టును పంపుతుంది; స్విస్ ఫుట్‌బాల్‌ రెండో విభాగానికి చెందిన స్విస్ ఛాలెంజ్ లీగులో లైచెన్‌స్టెయిన్ ఎఫ్.సి. వాడుజ్ జట్టు (అత్యంత విజయవంతమైన జట్టు) పాల్గొంటుంది. 1996 లో యూరోపియన్ కప్ విన్నర్స్ కప్పులో ఇది మరొకసారి విజయాన్ని సాధించింది.

లైచెన్‌స్టెయిన్ జాతీయ ఫుట్బాల్ జట్టుకు వ్యతిరేకంగా ఆడే ఏ జట్టుకైనా లైచెన్‌స్టెయిన్ సులభమైన లక్ష్యంగా భావించబడుతుంది; బ్రిటీష్ రచయిత చార్లీ కాన్నేల్లీ 2002 నాటి ప్రపంచ కప్పు కొరకు లైచెన్‌స్టెయిన్ అర్హతసాధించడంలో విఫలమైన విషయం గురించి ఒక పుస్తకం రచించాడు. శరదృతువు 2004 లో ఆశ్చర్యకరంగా ఈ బృందం పోర్చుగల్ జట్టుకు వ్యతిరేకంగా ఆడి 2-2 తో డ్రాగా ముగింపజేసింది. కొన్ని నెలల క్రితం యూరోపియన్ చాంపియన్షిప్పులో ఓడిపోయి ఫైనలిస్టులుగా మాత్రమే ఉన్నారు. నాలుగు రోజుల తరువాత లైచెన్‌స్టెయిన్ బృందం లక్సెంబర్గుకు వెళ్లారు. అక్కడ వారు 2006 ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులో 4-0తో సొంత ఈ జట్టును ఓడించారు. 2008 యూరోపియన్ ఛాంపియన్షిప్పులో అర్హత దశలో, లైచెన్‌స్టెయిన్ లాట్వియాను 1-0తో ఓడించింది. ఇది లాట్వియన్ కోచ్ రాజీనామా చేయడానికి ప్రేరేరణ కలిగించింది. 2007 అక్టోబరు 17 న ఐస్లాండును 3-0 తో ఓడించారు. ఇది ఐస్ల్యాండు జాతీయ ఫుట్బాల్ జట్టులో అత్యంత నాటకీయ నష్టాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 2010 సెప్టెంబరు 7 న స్కాట్లాండు లోని గ్లాస్గోలో జరిగిన క్రీడలలో స్కాట్లాండుకు వ్యతిరేకంగా 1-1 స్కోరుతో ఆటను డ్రా చేసారు. ఇందులో 97 వ నిమిషంలో లైచెన్‌స్టెయిన్ క్రీడాకారుడు స్టీఫెన్ మెక్మానస్ గోల్ చేశాడు. 2011 జూన్ 3 న లైచెన్‌స్టెయిన్ లిథువేనియాను 2-0 తో ఓడించింది. 2014 నవంబరు 15 న చిసినావులో జరిగిన క్రీడలో లైచెన్‌స్టెయిన్ మోల్డోవాను ఫ్రాంజ్ బుర్గ్మీర్ ఫ్రీ కిక్ 0-1 గోల్ తో ఓడించాడు.

ఆల్పైన్ కంట్రీ ప్రాంతం లైచెన్‌స్టెయినర్లకు గొప్ప క్రీడలకు అవకాశం కల్పిస్తుంది. శీతాకాలపు క్రీడలలో డౌన్‌హిల్ స్కీయింగ్: మల్బన్ ప్రాంతం దేశంలో సింగిల్ స్కీ ప్రాంతంగా ఉంది. 1980 వింటర్ ఒలంపిక్సులో హన్నివెంజెల్ రెండు బంగారు పతకాలను ఒక వెండి పతకాన్ని గెలిచింది. (1976 లో కాంస్య పతకాన్ని గెలిచింది). ఆమె సోదరుడు ఆండ్రియాస్ 1980 లో ఒక వెండి పతకాన్ని, 1984 లో జెయింట్ సాల్మన్ ఈవెంటులో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె కుమార్తె టీనా వీరదర్ సూపర్-జిలో 2018 లో కాంస్య పతకం గెలిచింది. మొత్తము పది పతకాలతో (ఆల్పైన్ స్కీయింగ్ లో), లైచెన్‌స్టెయిన్ ఇతర దేశాల కంటే అధిక తలసరి ఒలింపిక్ పతకాలను గెలుచుకుంది. వింటర్ లేదా సమ్మర్ ఒలింపిక్సులో అధిక పతకాలను సాధించిన అతిచిన్నదేశంగా లైచెన్‌స్టెయిన్ ప్రత్యేకత సాధించింది. లైచెన్‌స్టెయిన్ నుండి ఇతర స్కీయర్లు మార్కో బుచెల్, విల్లీ ఫ్రోమెట్ట్, పాల్ ఫ్రోమెట్ట్, ఉర్సుల కొంజెట్ ప్రాముఖ్యత సాధించారు. లైచెన్‌స్టెయిన్ స్టెఫానీ వోగ్ట్ అనే ప్రొఫెషనల్ మహిళల టెన్నిస్ క్రీడాకారిణిని కలిగి ఉంది.

Youth

Liechtenstein competes in the Switzerland U16 Cup Tournament, which offers young players an opportunity to play against top football clubs.

సెక్యూరిటీ, దేశరక్షణ

దేశంలో శాంతిబధ్రతలను రక్షించడానికి లైచెన్‌స్టెయిన్ నేషనల్ పోలీస్ బాధ్యత వహిస్తుంది. ఇందులో 87 మంది ఉద్యోగులు, 38 పౌర సిబ్బంది, మొత్తం 125 మంది ఉద్యోగులు ఉన్నారు. అధికారులందరూ చిన్న ఆయుధాలను కలిగి ఉంటారు. ప్రపంచంలోని అతి తక్కువ నేర శాతం కలిగిన దేశంలో ఇది ఒకటి. లైచెన్‌స్టెయిన్ జైలులో ఖైదీల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వీరు రెండు సంవత్సరములు శిక్ష అనుభవిస్తున్నవారు ఆస్ట్రియా అధికార పరిధికి బదిలీ చేయబడతారు. లైచెన్‌స్టెయిన్ నేషనల్ పోలీస్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లతో మూడు దేశాల పోలీసు దళాల మధ్య సరిహద్దు-సరిహద్దు సహకారాన్ని అందించే ఒక త్రిమితీయ ఒప్పందాన్ని నిర్వహిస్తుంది.

లైచెన్‌స్టెయినియులు ఒక తటస్థతకు విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచంలోని సైన్యాన్ని నిర్వహించని దేశాలలో ఇది ఒకటి. 1866 నాటి ఆస్ట్రో-ప్రుస్సియన్ యుద్ధం తర్వాత సైన్యం రద్దు చేయబడింది. దీనిలో లైచెన్‌స్టెయిన్ 80 మంది సైనికులను నియమించినప్పటికీ వారు ఏ పోరాటంలోనూ పాల్గొనలేదు. ఆ యుద్ధంలో జర్మనీ కాన్ఫెడరేషన్ రద్దుకావడంతో లైచెన్‌స్టెయిన్ తన అంతర్జాతీయ బాధ్యత నుంచి విముక్తి పొందింది. పార్లమెంటు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సైన్యానికి నిధులు అందించడానికి నిరాకరించింది. ఫలితంగా దేశానికి రక్షణ లేకుండా పోయి రాజకుమారుడు బంధించబడినప్పటికీ కానీ 1868 ఫిబ్రవరి 12 న విడుదల చేయబడి అధికారం తొలగించబడింది. లైచెన్‌స్టెయిన్ ఆధ్వర్యంలో పనిచేసే చివరి సైనికుడు 1939 లో 95 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

1980 లలో స్విస్ సైన్యం ఒక వ్యాయామం సమయంలో షెల్లను తొలగించింది. లైచెన్‌స్టెయిన్ లోపల అటవీ దళాన్ని తప్పుగా కాల్చివేసింది. ఈ సంఘటన "వైట్ వైన్ విషయంలో" పరిష్కరించబడింది.

2007 మార్చిలో 170 మంది స్విస్ ఇన్ఫాంట్రీ యూనిట్ శిక్షణా సమయంలో అనుకోకుండా 1.5 కిమీ (0.9 మైళ్ళు) లైచెన్‌స్టెయిన్ సరిహద్దు దాటిన యూనిట్ వారి పొరపాటును గ్రహించి, వెనక్కి మారింది. స్విస్ సైన్యం తరువాత 2007లో లైచెన్‌స్టెయిన్ ప్రభుత్వానికి జరిగిన పొరపాటు తెలియజేసి అధికారిక క్షమాపణలను అందించింది. దీనికి అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి " ఏమి ఫరవాలేదు " అని స్పందించారు.

మూలాలు

Tags:

లైచెన్‌స్టెయిన్ చరిత్రలైచెన్‌స్టెయిన్ భౌగోళికంలైచెన్‌స్టెయిన్ ఆర్ధికరంగంలైచెన్‌స్టెయిన్ గణాంకాలులైచెన్‌స్టెయిన్ విద్యలైచెన్‌స్టెయిన్ రవాణాలైచెన్‌స్టెయిన్ మాధ్యమంలైచెన్‌స్టెయిన్ సంస్కృతిలైచెన్‌స్టెయిన్ క్రీడలులైచెన్‌స్టెయిన్ సెక్యూరిటీ, దేశరక్షణలైచెన్‌స్టెయిన్ మూలాలులైచెన్‌స్టెయిన్భూపరివేష్టిత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచభూతలింగ క్షేత్రాలుసుగ్రీవుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరూప మాగంటియానిమల్ (2023 సినిమా)పిఠాపురంపెరిక క్షత్రియులుఋగ్వేదంతిక్కనబండారు సత్యనారాయణ మూర్తిపర్యాయపదంపచ్చకామెర్లుచదరంగం (ఆట)సాయిపల్లవిహలం (నటి)తీన్మార్ మల్లన్నభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశ్రీరామనవమిరఘుపతి రాఘవ రాజారామ్సంస్కృతంప్రియా వడ్లమానిశివసాగర్ (కవి)కాలేయంజి.కిషన్ రెడ్డివందేమాతరంద్రౌపది ముర్ముఅశ్వని నక్షత్రముభారతదేశంలో సెక్యులరిజంకమ్మగోదావరికరక్కాయఅంజలీదేవితెలుగు సినిమాల జాబితాసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్మహేంద్రసింగ్ ధోనిమురుడేశ్వర ఆలయంచేతబడిశ్రీనాథుడుఒంటిమిట్టకౌరవులుహార్దిక్ పాండ్యారుతుపవనంవిద్యకోల్‌కతా నైట్‌రైడర్స్సమాచార హక్కుఅయేషా ఖాన్మొదటి ప్రపంచ యుద్ధంహనుమంతుడువిజయ్ (నటుడు)యాత్ర 2ఔరంగజేబు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురౌద్రం రణం రుధిరందగ్గుబాటి వెంకటేష్దివ్యభారతిబర్రెలక్కగజేంద్ర మోక్షంసురేఖా వాణికోదండ రామాలయం, తిరుపతితెలుగు భాష చరిత్రవిశాఖ నక్షత్రమువినాయకుడుదివ్యాంకా త్రిపాఠిసంజు శాంసన్చిలుకూరు బాలాజీ దేవాలయంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుతెలుగు సినిమాలు డ, ఢతెలంగాణా బీసీ కులాల జాబితాదిల్ రాజురోహిణి నక్షత్రంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసంగీత వాద్యపరికరాల జాబితాచరవాణి (సెల్ ఫోన్)ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసోంపుకోదండ రామాలయం, ఒంటిమిట్టఅర్జునుడుమహాభారతం🡆 More