బార్బడోస్

బార్బడోస్ (ఆంగ్లం: Barbados), కరీబియన్ సముద్రానికి తూర్పున గలదు.

ఇది ఒక ఖండపు ద్వీపం. అట్లాంటిక్ మహాసముద్రంలో గలదు. కరీబియన్ సముద్రంలోని ఉత్తర అమెరికా ఖండంలోని లెసర్ అంటిల్లెస్‌లో బార్బడోస్ ఒక ద్వీపదేశం. ఈ ద్వీపం పొడవు 34 కి.మీ. వెడల్పు 23 కి.మీ ఉంటుంది.వైశాల్యం 432చ.కి.మీ. ఇది ఉత్తర అట్లాంటిక్ పశ్చిమ తీరంలో విండ్వర్డ్ ద్వీపాలు, కరీబియన్ సముద్రానికి తూర్పున 100కి.మీ దూరంలో సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్కు తూర్పుగా 168కి.మీ దూరంలో! ట్రినిడాడ్, టొబాగో ఈశాన్యంలో 400కి.మీ దూరంలో ఉంది.బార్బొడస్ అట్లాంటిక్ హరికేన్ బెల్ట్‌కు వెలుపల ఉంది.బార్బొడస్ రాజధాని నగరం, అతిపెద్ద నగరం బ్రిడ్జ్‌టౌన్;బార్బడోస్. ఈద్వీపంలో 13వ దశాబ్ధం వరకు ఐలాండ్ కరీబియన్లు (కలింగొ ప్రజలు) నివసించారు. అంతకు పూర్వం అమెరిండియన్లు నివసించారు. 15వ శతాబ్దంలో స్పెయిన్ నావికులు బార్బడోస్ దీవిని సందర్శించి ఈదీవిని స్పెయిన్ సామ్రాజ్యం కొరకు స్వాధీనం చేసుకున్నారు. 1511లో ఇది మొదటిసారిగాస్పెయిన్ మ్యాప్‌లో చిత్రీకరించబడింది. 1536 లో పోర్చుగీసు ప్రజలు ఈ దీవిని సందర్శించి దీనిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించకుండా దీవిని వదిలి వెళ్ళారు. పోర్చుగీసువారు ద్వీపవాసులకు అడవిపందుల మాసభక్షణ చేయడం పరిచయం చేసారు. 1625లో " ఆలివ్ బ్లోసం " అనే ఆంగ్లేయనౌక బార్బడోస్ ద్వీపానికి చేరుకుని నౌకద్వారా వచ్చిన సైనిక బృందం ఈద్విపాన్ని " మొదటి జేంస్ రాజు " తరఫున స్వాధీనం చేసుకున్నది. 1627లో ఇంగ్లాండు నుండి వచ్చిన బృందం బార్బడోస్‌లో మొదటి సెటిల్మెంటు స్థాపించింది. అది ముందుగా ఆగ్లేయ సెటిల్మెంటుగా ఉండి తరువాత బ్రిటిష్ కాలనీగా మారింది. షుగర్ కాలనీగా ఈదీవి 1807లో బానిసవ్యాపారం రద్దుచేసే వరకు ఆగ్లేయుల ఆఫ్రికన్ బానిసవ్యాపార కేంద్రంగా మారింది. 1966లో బార్బడోస్ స్వతంత్ర దేశంగా మారింది. అయినప్పటికీ రెండవ ఎలిజబెత్ పాలనలో బ్రిటిష్ సామ్రాజ్యంలోని కామంవెల్త్ రాజ్యాలలో ఒకటిగా కొనసాగింది. ఈద్వీపం జసంఖ్య 2,80,121. వీరిలో ఆఫ్రికన్లు అధికసంఖ్యలో ఉన్నారు. అట్లాంటిక్ ద్వీపదేశంగా వర్గీకరించబడినప్పటికీ బార్బడోస్ కరీబియన్‌లో భాగంగా భావించబడుతుంది. ఇది ప్రధాన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది.40% మంది పర్యాటకులు యు.కె. నుండి వస్తుంటారు, యు.ఎస్., కెనడా పర్యాటకులు సంఖ్యాపరంగా ద్వితీయస్థానంలో ఉన్నారు.2014లో " ట్రాంస్పరెంసీ ఇంటర్నేషనల్ " కరప్షన్ పర్సెప్షంస్ ఇండెక్స్ వర్గీకరణలో బార్బొడోస్ అమెరికా ఖండాలలో యు.ఎస్.తో కలిసి సంయుక్తంగా ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కెనడా ఉంది. అలాగే అంతర్జాతీయంగా సంయుక్తంగా 17వ స్థానంలో (యు.ఎస్., హాంగ్‌కాంగ్, ఐర్లాండు దేశాలకు సమానంగా)జపాన్, బెల్జియం తరువాత స్థానంలో ఉంది.

బార్బడోస్
Flag of బార్బడోస్ బార్బడోస్ యొక్క చిహ్నం
నినాదం
"Pride and Industry"
బార్బడోస్ యొక్క స్థానం
బార్బడోస్ యొక్క స్థానం
రాజధానిబ్రిడ్జ్‌టౌన్
13°0′N 59°32′W / 13.000°N 59.533°W / 13.000; -59.533
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు ఆంగ్లం
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Bajan
హిందీ/భోజ్‌పురి
జాతులు  90% Afro-Bajan,6% (Igbo, Yoruba,Akan, others),4% Asian and Multiracial (Mulatto), European (English, Irish, other)
ప్రభుత్వం Parliamentary democracy and Constitutional monarchy
 -  Monarch Elizabeth II
 -  Governor-General Clifford Husbands
 -  Prime Minister David Thompson
Independence From the యునైటెడ్ కిం డం 
 -  Date 30 నవంబరు 1966 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  జూలై 2006 అంచనా 279,000 (175వది)
 -  జన సాంద్రత 647 /కి.మీ² (15వది)
1,663 /చ.మై
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $5.100 billion (149వది)
 -  తలసరి $18,558 (39వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $3.409 billion 
 -  తలసరి $12,404 
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Decrease 0.889 (high) (37th)
కరెన్సీ Barbadian dollar ($) (BBD)
కాలాంశం Eastern Caribbean (UTC-4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bb
కాలింగ్ కోడ్ ++1 (246)

పేరువెనుక చరిత్ర

బారడోస్ అనే పేరుకు పోర్చుగీసు పదం ఓ బారబ్డొస్ లేక స్పెయిన్ పదం లాస్ బార్బడొస్ మూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. రెండింటికి " గడ్డం ఉన్న " అని అరధం. ఒకప్పుడు ఇక్కడ నిచసించిన స్థానిక ఐలాండ్ కరీబియన్లు గడ్డంతో ఉండేవారని లేక సముద్రపు తీరంలో ఉన్న శిలలపై పడుతున్న సముద్రపు నురగ గడ్డంలా కనిపించడం కారణంగా ఈద్వీకి ఈపేరు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 1519లో జెనోయా మ్యాప్ మేకర్ " విస్కాంటే మగియోలో " బార్బొడస్ ఖచ్ఛితమైన ఉపస్థితిని సూచిస్తూ ద్వీపాన్ని బార్బొడస్ అని పేర్కొన్నాడు. అదనంగా లీవార్డ్ ఐలాండ్స్ లోని బార్బుడా ద్వీపంపేరును ఇది పోలి ఉంది.ఒకప్పుడు స్పానిషులు ఈదీవికి లాస్ బార్బుడాస్ అని నామకరణం చేసారు.బార్బడోస్ చేరిన మొదటి యురేపియన్ ఎవరు అన్నది స్పష్టంగా లేదు.కొంతమంది మాత్రమే గుర్తించిన ఆధారాలు స్పానిషులు ఈదీవిని మొదటిసారి సందర్శించి ఉండవచ్చు అని తెలియజేస్తుంది. ఇతరులు పోర్చుగీసు చరిత్రను విశ్వసిస్తున్నారు. బ్రెజిల్ నుండి వచ్చిన యురేపియన్ అని కొంతమంది భావిస్తున్నారు. కొంబియన్ పూర్వ శకంలో బార్బొడియా " ఇచిరౌగానియం " అని పిలువబడింది.ఇతర ప్రాంతాలలో నివసించిన స్థానిక అరవాకన్ మాట్లాడే ప్రజల నుండి ఈపదం వచ్చిందని " తెల్లని దంతాలు కలిగిన ఎర్రని భూమి " అని దీనికి అర్ధం అని భావిస్తున్నారు. "ఎత్తు దంతాలు కలిగిన ఎర్రరాళ్ళ ద్వీపం " అని కూడా కొందరు భావిస్తున్నారు. లేక " దంతాలు " అని భావిస్తున్నారు. బార్బాడియన్లు వారి స్వదేశాన్ని బిం అంటారు. అలాగే బార్బడోస్‌కు సంబంధించిన బిమ్‌షైర్ అంటారు. దీనికి మూలం స్పష్టంగా లేనప్పటికీ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బార్బడోస్ " నేషనల్ కల్చరల్ ఫౌండేషన్ " బిం అనే పదం సాధారణంగా బానిసలు ఉపయోగిస్తారని ఇది ఇగ్బొ భాష నుండి వచ్చిందని తెలియజేస్తుంది. బెం పదం బే ము నుండి వచ్చిందని అంటే నా ఇల్లు, దయతో, కరుణ, నేను " అని అర్ధాలు ఉన్నాయని భావిస్తున్నారు. బానిసలలో పెద్ద సంఖ్యలో ఇగ్బొ ప్రజలున్నారు.18వ శతాబ్ధంలో వీరు ఆధునిక నైజీరియా ఆగ్నేయప్రాంతం నుండి తీసుకుని రాబడ్డారు.ఇగ్బొ నుండి బిం వచ్చిందని కొందరి భావన. ఆక్సఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ , చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీలలో బిం , బింషైర్ నమోదుచేయబడ్డాయి.అదనంగా 1868 ఏప్రెల్ 25న " అగ్రికల్చరల్ రిపోర్టర్ " లో బిం పదం పేర్కొనబడింది. చివరిగా 1652లో " డైలీ అర్గొసీ " బిం అనే పదానికి బైం మూలమని పేర్కొన్నది.బింస్ అనే పదం బార్బడోస్ అందరినీ సూచిస్తుంది.

చరిత్ర

బార్బడోస్ 
బార్బడోస్ కాలనీ బ్లూ ఎన్సైన్ జెండా, 1870 నుండి 1966 వరకు ఉపయోగించబడింది.
బార్బడోస్ 
బుస్సా విగ్రహం, బ్రిడ్జ్‌టౌన్. బర్బాడియన్ చరిత్రలో అతిపెద్ద బానిస తిరుగుబాటుకు బుస్సా నాయకత్వం వహించాడు.

సా.శ.4 నుండి సా.శ. 7వ శతాబ్దం వరకు అమెరిండియన్లు ఇక్కడ సెటిల్మెంట్లు స్థాపించుకుని నివసించారని భావిస్తున్నారు. వీరిని సలడాయిడ్-బారంకాయిడ్ అని పేర్కొన్నారు. సా.శ.800లో అరవాకన్ ప్రజలు ఈప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. అరవాకన్ల ఆధిక్యత సా.శ. 1200 వరకు కొనసాగింది. 13వ శతాబ్దంలో దక్షిణ అమెరికా నుండి కలినాగో (ఐలాండ్ కరీబియన్లు) ఈప్రాంతానికి చేరుకున్నారు.16వ 17వ శతాబ్ధాలలో స్పెయిన్, పోర్చుగీస్ కొంతకాలం బార్బడోస్ ద్వీపం మీద ఆధిక్యత కలిగి ఉన్నారు. అరవాకన్ ప్రజలు పొరుగున ఉన్న ద్వీపాలకు పారిపోయారని విశ్వసించబడింది. కరీబియన్లను స్పానియన్లు, పోర్చుగీసుప్రజలు దీవినుండి వెలుపలకు పంపారు. తరువాత కొంతకాలానికి దీవిని నిర్మానుష్యంగా చేసి స్పెయిన్ ప్రజలు, పోర్చుగీసు ప్రజలు ద్వీపం విడిచి పోయారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ గయానా (గయానా) నుండి కొంతమంది అరవాకన్ ప్రజలు వలసగా ఇక్కడకు చేరుకుని బార్బడోస్‌లో నివసించడం కొనసాగించారు. 1620-1640 మద్యకాలంలో శ్రామికులను అధికంగా యురేపియన్లు ఒప్పంద విధానంలో తీసుకువచ్చారు.ప్రధానంగా ఆగ్లేయప్రజలు, ఐరిష్ ప్రజలు, స్కాటిష్ ప్రజలు ఉన్నారు. వీరితో ఆఫ్రికన్ బానిసలు, అమెరిండియన్ బానిసలు కొంత శ్రామికశక్తిని అందించారు. క్రొంవెలియన్ శకంలో (1650)లో యుద్ధఖైదీలు, దిమ్మరులు, అక్రమంగా ఈద్వీపానికి తీసుకురాబడి సేవకులుగా విక్రయించబడిన ప్రజలు తమ శ్రమశక్తిని అందించారు. చివరి బృందాలలో ఐరిష్ ప్రజలను ఆంగ్లేయ వ్యాపారులు సేవకులుగా బార్బొడాస్, ఇతర కరీబియన్ దీవులలో విక్రయించారు.

ఆరంభకాలంలో ప్రత్తి, పొగాకు,అల్లం, ఇండిగొ పంటలు పండించబడ్డాయి. 1640లో యురేపియన్లు ఒప్పంద విధానంలో కూలీలను తీసుకువచ్చి చెరకు తోటలను అభివృద్ధిచేసారు. అదేసమయంలో బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్లను దిగుమతి చేసుకున్నారు. మతమార్పిడి చేయబడిన స్పానిష్, పోర్చుగల్ యూదులు బార్బోడస్‌లో స్థిరపడ్డారు. ఆగ్లేయ సెటిల్మెంట్లు, బార్బొడస్ ఆర్థికాభివృద్ధి బార్బొడస్ ముందుగా ప్రొప్రైటరీ కాలనీగా తరువాత క్రౌన్ కాలనీగా అంతర్గత స్వయంప్రతిపత్తిని అనుభవించింది.1639లో బార్బొడస్ హౌస్ ఆఫ్ అసెంబ్లీ ఆరంభించబడింది.1854లో సంభవించిన గ్రేట్ హరికేన్ కారణంగా 4,000 ప్రజలు మరణించారు.కలరా కారణంగా 20,000 మంది మరణించారు. 1833 లో బానిసత్వం నిర్మూలించబడిన తరువాత బానిసల సంఖ్య 83,000లకు చేరింది. 1946 నుండి 1980 బార్బొడస్ జసంఖ్య క్షీణించింది.ప్రజలలో మూడవ భాగం బ్రిటన్‌కు వలసపోయారు.

1627-1639

ఆరభకాల ఇంగ్లీష్ సెటిల్మెంట్

ఇంగ్లీష్ సెటిల్మెంట్ " ప్రిప్రైటరీ కాలనీ "గా స్థాపించబడింది. దీనికి లండన్ వ్యాపారి సర్ విలియం కొర్టెన్ నిధిసహాయం అందించాడు. 1625 మే 14న కేప్టన్ జాన్ పౌల్ నాయకత్వంలో మొదటి ఇంగ్లీష్ నౌక ఈద్వీనికి చేరింది. 1627 ఫిబ్రవరి 17న మొదటి సెటిల్మెంట్ జేంస్ టౌన్‌లో (ప్రస్తుత హొలెటౌన్) స్థాపించబడింది. ఈసెటిల్మెంట్ స్థాపించడానికి జాన్ పౌల్ తమ్ముడు హెంరీ నాయకత్వం వహించాడు. ఈసెటిల్మెంటులో 80 మంది సెటిలర్లు 10 మంది ఇంగ్లీష్ శ్రామికులు నివసించారు. తరువాత బానిసలుగా మార్చబడిన ఒప్పద కూలీలు ఉన్నారు.[ఆధారం చూపాలి]కొర్టెన్ టటిల్‌ను (గ్రేట్ బార్బడొస్ రాబరీ)" కార్లిస్లె రాజప్రతినిధి జేంస్ హే " అందించాడు. తరువాత కార్లిస్లే " హెంరీ హాలే "ను గవర్నరుగా నియమించాడు. హెంరీ హాలే తన నియామకాన్ని వ్యతిరేకిస్తున్న తోటయమానులను శాంతింపజేసే ప్రయత్నంలో 1639లో " హౌస్ ఆఫ్ అసెంబ్లీ " స్థాపించాడు.1640-60 మద్యకాలంలో వెస్టిండీస్ అమెరికాలోని ఇంగ్లీష్ వలసప్రజలలో మూడింట రెండువంతుల మందిని వెస్టిండీస్ ఆకర్షించింది. 1650 నాటికి వెస్టిండీస్‌లో మొత్తం 44,000 మంది సెటిలర్లు స్థిరపడ్డారు. అదేసమయంలో చెసాపీక్ సెటిలర్ల సంఖ్య 12,000, న్యూ ఇంగ్లాండు సెటిలర్ల సంఖ్య 23,000 మంది ఉన్నారు. అంగ్లేయులలో చాలామంది ఒప్పద కూలీలు ఉన్నారు. ఐదు సంవత్సరాలు సేవలందించిన తరువాత వారు విముక్తులు ఔతారు. 1630కి ముందు వారికి 5 నుండి 10 ఎకరాల వ్యవసాయక్షేత్రం ఇవ్వబడుతుండేది. తరువాత ద్వీపంలో ఇవ్వడానికి వ్యవసాయక్షేత్రాలు లేని పరిస్థితి ఎదురైంది. క్రోంవెల్ సమయంలో తిరుగుబాటుదారులు, నేరస్థులు ఇక్కడకు తరలించబడ్డారు. వార్విక్‌షైరుకు చెందిన తిమోతీ మీడ్స్ గతంలో తిరుగుబాటుదారుడుగా ఉండి బార్బడోస్‌కు పంపబడ్డాడు. తరువాత 1666లో తిమోతి తనసేవలకు పరిహారంగా నార్త్ కరోలినాలో 1,000 ఎకరాల భూమిని పరిహారంగా అందుకున్నాడు. 1650 పారిష్ నమోదుచేసిన దస్తావేజులు శ్వేతజాతీయుల వివాహాలు, మరణాల వివరాలు ఉన్నాయి.మరణాల శాతం అత్యధికంగా ఉండేది.అంతకు ముందు " మినిస్టరీ ఆఫ్ ది ఇంఫాంటరీ కాలనీస్ " పొగాకు ఎగుమతి చేస్తూ ఉండేది.చెస్పీక్ ఉత్పత్తి అధికరించిన కారణంగా 1630 నాటికి పొగాకువెలలు పతనం అయ్యాయి.

1640-1790

ఇంగ్లాండ్ అంతర్యుద్ధం

అదేసమయంలో " వార్ ఆఫ్ ది త్రీ కింగ్డంస్ ", ఇంటరెగ్నం బార్బడొస్, బార్బొడస్ జలాల వరకు విస్తరించింది. మొదటి చార్లెస్ మరణం వరకు బార్బొడాస్ యుద్ధంలో జోక్యం చేసుకోలేదు. ద్వీపం ప్రభుత్వం రాజకుటుంబం ఆధీనంలోకి మారింది. 1650 అక్టోబరు 3న ఇంగ్లాండ్, బార్బొడాస్ మద్య వాణిజ్యం నిలిపివేయబడింది.అందువలన బార్బొడస్ నెదర్లాండ్ మద్య వాణిజ్యం అభివృద్ధి చేయబడింది. ఇంగ్లీష్ నావికులు డచ్చికాలనీలతో వాణిజ్యం అభివృద్ధిచేసారు.

చెరకు

1640లో డచ్చి, బ్రెజిల్ నుండి ప్రవేశపెట్టబడిన చెరకు తోటల అభివృద్ధి దేశ సాంఘిక, ఆర్థిక రూపురేఖలను మార్చింది. చివరికి బార్బొడస్ ప్రపంచంలోని అతిపెద్ద చెరకు ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఇదులో ఆరంభకాలంలో సెఫర్ది జ్యూలు విజయం సాధించారు.వీరు ఇబరియన్ ద్వీపకల్పం నుండి తరిమివేయబడ్డారు. చెరకు తోటల అభివృద్ధి స్థానిక ప్రజలు పొరుగు ద్వీపాలకు తరలివెళ్ళడానికి కారణంగా మారింది.చెరకుతోటల అభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున పెట్టుబడి, శ్రామికులు అవసరమయ్యారు.ఆరంభకాలంలో డచ్చి ఉపకరణాలు, ధనసహాయం, ఆఫ్రికన్ బానిసలను అందజేసారు. అదనంగా ఉత్పత్తి చేయబడిన చెరకు ఐరోపా‌కు తరలించబడింది.1644 లో బార్బొడస్ జనసంఖ్య 30,000 మంది ఉండగా వీరిలో ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు 800 ఉన్నారు.మిగిలిన వారు అఫ్హికంగా ఆగ్లేయసంతతికి చెందినవారు ఉన్నారు.క్రమంగా చిన్నతరహా చెరకుతోటల యజమానులు కనుమరుగై ఆఫ్రికన్ బానిసల సాయంతో అభివృద్ధి చేయబడిన చెరకు తోటలు విస్తరించాయి.1660 నాటికి నల్లజాతీయుల సంఖ్య 27,000, శ్వేతజాతీయుల సంఖ్య 26,000కు చేరింది.1666 నాటికి 12,000 శ్వేతజాతీయులు చెరకువ్యవసాయం విడిచిపెట్టారు.వీరు మరణించడం లేక ద్వీపాన్ని వదిలి వెళ్ళడం సంభవించింది.మిగిలిన శ్వేతజాతీయులు బీదవారిగా మారారు.1680 నాటికి ఒప్పంద కూలీలు, ఆఫ్రికన్ బానిసల నిష్పత్తి 17:1కి చేరింది.1700 నాటికి 15,000 మంది స్వేచ్ఛాయుతమైన శ్వేతజాతీయులు, 50,000 మంది బానిసలైన నల్లజాతీయులు ఉన్నారు.

బార్బొడస్ స్లేవ్ కోడ్ రూపొందించి అమలుచేసిన తరువాత శ్వేతజాతీయులు, ఆఫ్రికన్లు, ఆధిక్యత కలిగిన తోటయజమానుల మద్య వివక్ష అధికరించింది.పేద శ్వేతజాతీయులకు ద్వీపం అనాకర్షణీయంగా మారింది. నజాతీయుల బానిస విధానాలు 1661,1676, 1682, 1688 లలో రూపొందించబడ్డాయి.ఈ స్లేవ్ కోడ్ కారణంగా పలుమార్లు బానిసలు తిరగబడాడానికి ప్రయత్నించడం, ప్రణాళికవేయడం సంభవించాయి.అయితే ఏవీ విజయవంతం కాలేదు.బీద శ్వేతజాతీయులు ద్వీపం విడిచి వెళ్ళారు.తోటలయజమానులు చెరకు తోటలలో పనిచేయడానికి బానిసలను దిగుమతి చేసుకున్నారు."

భౌగోళికం

బార్బడోస్ 
బార్బడోస్ మ్యాప్

బార్బొడస్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. బార్బొడస్ పశ్చిమంలో వెస్ట్ ఇండీస్ ద్వీపాలు. బార్బొడస్ లెసర్ అంటిల్లెస్ తూర్పుతీరంలో ఉంది.పశ్చిమంలో ఉన్న విండ్వర్డ్ ద్వీపాలకంటే ఈద్వీపం చదునుగా ఉంటుంది. ద్వీపంలో స్కాట్ లాండ్ డిస్ట్రిక్‌లోని మౌంట్ హిల్బే (సముద్రమట్టానికి 340మీ) ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. పారిష్‌లో ఉన్న సెయింట్ మిచీల్ బార్బడోస్ రాజధాని, ప్రధాన నగరం బ్రిడ్జ్‌టౌన్‌లో ఉంది. ఇతర ప్రధాన నగరాలు ద్వీపంతటా అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. వీటిలో హోటెల్ టౌన్, పారిష్‌ ఆఫ్ సెయింట్ జేంస్, ఒస్టింస్, పారిష్ ఆఫ్ క్రైస్ట్ చర్చి మరయు స్పైట్స్ టౌన్ ప్రధానమైనవి.

బైసర్గికం

బార్బొడస్ దక్షిణ అమెరికన్ ప్లేట్ సరిహద్దు, కరీబియన్ ప్లేట్‌లో ఉంది. ద్వీపం ఈశాన్యంలో స్కాట్లాండ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న లైంస్టోన్ నీటిలో కరిగిన కారణంగా ఏర్పడిన గుహలు, గుల్లీస్‌లలో కొన్ని ప్రఖ్యాత పర్యాటక గమ్యాలుగా ఉన్నాయి. వీటిలో హరిసంస్ గుహలు, వెల్చ్మెన్ హాల్ గుల్లి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ద్వీపం తూర్పుతీరంలో అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న కోస్టల్ లాండ్ ఫార్మ్‌స్ ఈప్రాంతంలో లైంస్టోన్ ఏర్పడిన సమయంలో ఏర్పడ్డాయి. ద్వీపంలోని రాకీ కేప్ (పికొ టెనెరిఫ్ఫీ) గుర్తించతగిన ప్రాంతంగా ఉంది.

వాతావరణం

బార్బడోస్ 
ద్వీపం తూర్పు తీరంలో బత్షెబా.

దేశంలో వాతావరణపరంగా రెండు సెషంస్ కొనసాగుతుంటాయి.వెట్ సెషన్‌లో అత్యధిక వర్షపాతం. ఇది జూన్ నుండి నవంబరు వరకు కొనసాగుతుంది. డ్రై సెషన్‌ డిసెంబరు నుండి మే వరకు కొనసాగుతుంది.సరాసరి వార్షిక వర్షపాతం 40-90మిమీ. డిసెంబరు నుండి మే వరకు సరాసరి ఉష్ణోగ్రత 21-31 డిగ్రీల సెల్షియస్. జూన్ నుండి నవంబరు వరకు సరాసరి ఉష్ణోగ్రత 23-31 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. కోప్పెన్ వాతావరణ వర్గీకరణలో బార్బడోస్ ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. అయినప్పటికీ 12-16 కి.మీ వేగంతో సంవత్సరమంతటా వీస్తుండే వాయులు బార్బడోస్ వాతావరణాన్ని ఆహ్లాదపరిస్తూ ఉంటుంది.ద్వీపంలో భూకంపాలు, భూపతనం, తుఫానులు తరచుగా సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో బార్బడోస్ ఉష్ణమండల తుఫానులు, హరికేన్ల ప్రభావానికి లోనౌతూ ఉంటుంది.కరీబియన్ ఈశాన్యతీరంలో ఉన్నందున ద్వీపం ప్రధాన హరికేన్ స్ట్రైక్స్ జోన్ వెలుపల ఉంది.అయినప్పటికీ ద్వీపాన్ని సరాసరి 26 సంవత్సరాలకు ఒకసారి ప్రధాన హరికేన్ కారణంగా బాధపడుతూ ఉంది.1955లో జానెట్ హరికేన్ బార్బడోస్ ద్వీపానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. 2010 లో ద్వీపాన్ని తోమస్ హరికేన్ ధ్వంసం చేసింది. ఇది ద్వీపానికి స్వల్పమైన నష్టాన్ని మాత్రమే కలిగించింది.

పర్యావరణ వివాదాలు

బార్బడోస్ 
బార్బడోస్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి కనిపిస్తుంది.

బార్బడోస్ ద్వీపానికి పర్యావరణ సంబంధిత వత్తిడులు ఉన్నాయి. బార్బడోస్ ప్రంపంచంలో అత్యంత జనసాంధ్రత కలిగిన ద్వీపాలలో ఒకటి. 1999లో ప్రభుత్వం కాలుష్యం నుండి పగడపు దిబ్బలను రక్షించడానికి " సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ " అభివృద్ధి చేసింది. 21వ శతాబ్దం మొదటి దశాబ్ధంలో అధికగా జనసాంధ్రత కలిగిన పశ్చిమసముద్రతీరంలో రెండవ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రతిపాదించబడింది. అండర్ గ్రౌండ్ జలజీవులను సంరక్షించడానికి బార్బడోస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అప్పుడప్పుడూ చట్టవిరుద్ధంగా చోటుచేసుకుంటున్న గుడిసెలను పరిశుభ్రతను పరిరక్షించడానికి, ద్వీపానికి మంచినీటి వనరులను అందిస్తున్న భూగర్భ జలాలను రక్షించడానికి ప్రభుత్వం తొలగిస్తూ ఉంటుంది. పగడపు దిబ్బలను సంరక్షించడానికి, పర్యావరణ పరిరక్షణ కొరకు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం బృహత్తర ప్రయత్నాలు చేస్తుంది. బార్బడోస్‌లో 90కి.మీ పొడవైన పగడపుదిబ్బలు, పశ్చిమ సముద్రతీరంలో స్థాపించబడిన రెండు సంరక్షిత మారైన్ పార్కులు ఉన్నాయి. బార్బడోస్ ఎదుర్కొంటున్న సమస్యలలో ఓవర్ ఫిషింగ్ ఒకటి. ఒకటి. సముద్రతీరంలో వాహనాలు నడపడం గుడ్లు పొదగబడుతున్న తాబేళ్ళ్కు హాని కలిగిస్తుందన్న కారణంగా నెస్టింగ్ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిషేధించబడింది.

వన్యజీవితం

బార్బొడస్ నాలుగు జాతుల తాబేళ్ళు గుడ్లు పెట్టి పొదగడానికి ఆశ్రయం ఇస్తుంది; గ్రీన్ టర్టిల్, లాగర్‌హెడ్స్, హాక్స్‌బిల్ టర్టిల్, లెథర్‌బ్యాక్.కరీబియన్ ప్రాంతంలో హాక్స్‌బిల్ తాబేళ్ళు గుడ్లు పొదగడంలో సంఖ్యాపరంగా బార్బొడస్ ద్వితీయస్థానంలో ఉంది.బార్బొడస్ గ్రీన్ మంకీలకు ఆశ్రయం ఇస్తుంది. గ్రీన్ మంకీలు పశ్చిమ ఆఫ్రికాలో సెనగల్ నుండి వోల్టా నది వరకు కలిపిస్తుంటాయి.

ఆర్ధికం

బార్బడోస్ 
జాతీయ ఎగుమతుల దామాషా ప్రాతినిధ్యం.

ప్రపంచంలోని సంపన్న దేశాలలో (తలసరి జి.డి.పి) బార్బడోస్ 53వ స్థానంలో ఉంది. బార్బడోస్ చక్కగా అభివృద్ధి చేయబడిన మిశ్రిత ఆర్థికవ్యవస్థ, తగినంత ఉన్నత జీవనస్థాయి కలిగి ఉంది. వరల్డ్ బ్యాంక్ బర్బడోస్‌ను ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన దేశాలలో 66వ స్థానంలో ఉందని వర్గీకరించింది. 2012 " కరీబియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ " 20% బార్బడోస్ ప్రజలు బీదరికం అనుభవిస్తున్నారని, 10% ప్రజలకు దినసరి ఆహారం కూడా లభించడం లేదని తెలియజేస్తుంది. చారిత్రకంగా బార్బడోస్ ఆర్థికరంగం చెరకు ఉత్పత్తి, సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంది. 1970 నుండి 1980 ఆరంభం వరకు దేశ ఆర్థికరంగం పర్యాటకం, తయారీ రంగం వైపు మరలించబడింది. ఫైనాస్, సమాచార సేవారంగాలకు ముఖ్యత్వం ఇవ్వబడింది. దేశంలో ఆరోగ్యవంతమైన స్వల్పమైన తయారీరంగం అభివృద్ధిచెంది ఉంది.1990 వరకు సెయింట్ లూసియా వ్యాపార అనుకూలంగా ఆర్థికంగా బలమైన దేశంగా ఉంది.[ఆధారం చూపాలి] సెయింట్ లూసియాలో ఆరంభమైన నిర్మాణరంగంలో విప్లవాత్మక అభివృద్ధిలో భాగంగా హోటెల్స్, కార్యాలయ సమూహాలు, నివాసగృహాలు నిర్మించబడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభంలో నిర్మాణరంగంలో ఆభివృద్ధి నెమ్మదించింది. ప్రభుత్వాధికారులు సమీపకాలం నుండి నిరోద్యం తగ్గించడానికి నిరంతర కృషి చేస్తుంది.ప్రత్యక్ష విదేశీ పెడ్డుబడులను ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రోత్సహిస్తుంది. 2003 నాటికి నిరుద్యోగం 10.7% తగ్గింది. 2015 నాటికి ఇది తిరిగి 11.9%నికి అధికరించింది. 2001, 2002 మద్య పర్యాటరంగంలో, సెప్టెంబరు 11 అటాక్‌ల కారణంగా కొనుగోలుశక్తిలో ఏర్పడిన తరుగుదల కారణంగా సంభవించిన ఆర్థికసంక్షోభం 2003 తరువాత తగ్గుముఖం పట్టింది. 2004 నుండి ఆర్థికాభివృద్ధి మొదలైంది. కెనడా, కరీబియన్ కమ్యూనిటీ (ప్రత్యేకంగా ట్రినిడాడ్, టొబాగొ), యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్ మొదలైన దేశాలతో వ్యాపారసంబంధాలు కొనసాగాయి. 2003లో కెనడా నుండి 25 బిలియన్ల కెనడియన్లు పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా కెనడియన్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులున్న మొదటి ఐదు దేశాలలో బార్బడోస్ ఒకటి. బార్బడోస్‌లో 2006 లో అత్యధికంగా నిర్మాణాలు చేపట్టబడ్డాయి. బార్బడోస్ వాణిజ్య, ఫైనాంస్ సేవల అభివృద్ధి కొరకు రూపొందించిన 10 మిలియన్ల ప్రణాళికకు యురేపియన్ యూనియన్ మార్గదర్శకం వహిస్తుంది.

గణాంకాలు

బార్బడోస్ 
బార్బడోస్‌లోని ఒక బస్ స్టాప్.
బార్బడోస్ 
రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లో షాపింగ్ చేస్తూ ప్రజలు

2010 గణాంకాల ఆధారంగా బార్బడోస్ జనసంఖ్య 2,77,821. వీరిలో 1.33.018 మంది పురుషులు, 1,44,803 మంది స్త్రీలు ఉన్నారు.

సంప్రదాయ సమూహాలు

బార్బడియన్ల (బజన్)90% ప్రజలు ఆఫ్రో కరీబియన్ సంతతికి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఆఫ్రో బజన్లు, మిశ్రిత సంతతికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారిలో యురేపియన్లు ఆంగ్లో బజన్లు లేక యూరోబజన్లు ఉన్నారు. వీరు ప్రధానంగా యునైటెడ్ కింగ్డం, ఐర్లాండ్ దేశాలకు చెందిన వారున్నారు. తరూవాత ఆసియన్లలో చైనీయులు, భారతీయులు (హిందువులు, ముస్లిములు) ఉన్నారు.బార్బడోస్‌లోని ఇతర సమూహాలలో యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాల నుండి వచ్చిన వారు అధికంగా ఉన్నారు.కొన్ని సంవత్సరాల తరువాత యునైటెడ్ స్టేట్స్ నుండి బార్బడోస్ తిరిగి వచ్చిన ప్రజలలో వారికి యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టిన పిల్లలను " బజన్ యంకీస్ " అంటారు. ఇది అమర్యాదకరమైనదిగా భావించబడుతుంది. సాధారణంగా బజన్లు ద్వీపానికి చెందిన పిల్లలను మాత్రమే బజన్లుగా గుర్తించి, అంగీకరిస్తారు.

ఇతరులు :-

  • ఇండో - గయానీస్ : భాగస్వామ్య దేశం గయానా నుండి వలస వచ్చిన ప్రజలు.1990 లో గయానాకు చెందిన ప్రజలు, భారతీయులు బార్బడోస్ ద్వీపానికి రావడం ఆరంభం అయింది.ప్రధానంగా దక్షిణ భారతదేశానికి చెందిన హిందువుల రాక అధికమైంది. అయినా ట్రినిడాడ్, గాయానా కంటే తక్కువగా ఉన్నారు.
  1. యూరో - బజన్లు (4%) 17వ శతాబ్దంలో బార్బడోస్‌లో స్థిరపడ్డారు.వీరు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్ లాండ్ దేశాలకు చెందిన వారు.

1963లో బార్బడోస్‌లో 86% యూరో - బజన్లు (37,200) ఉన్నారు. వీరిని " వైట్ బజన్లు " అంటారు. యూరో - బజన్లు ఫోల్క్ మ్యూజిక్ (ఐరిష్ మ్యూజిక్, హైలాండ్ మ్యూజిక్) పరిచయం చేసారు. వీరిలో చాలామంది నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో స్థిరపడ్డారు.

  • చైఇనీస్ బార్బడియన్లు తక్కువ సంఖ్యలో ఉన్నారు.చైనీయులలో అధికంగా చిన్, చియన్ లేక లీ అనే సర్ నేం ఉంటుంది.బజన్ దైనందిక సంస్కృతిలో చైనీయుల ఆహారం భాగంగా మారింది.
  • లెబనీస్, సిరియన్లు అరబ్ - బార్బడోస్ అని భావించబడుతున్నారు. వీరిలో క్రైస్తవ అరేబియన్లు అధికంగా ఉన్నారు. అరబ్ ముస్లిం బర్బడియన్లు సంఖ్యాపరంగా తాక్కువగా ఉన్నారు.సిరియా, లెబనీయులు వ్యాపార అవకాశల కొరకు ద్వీపానికి చేరుకున్నారు. ఇతరదేశాలకు వలసలు పోతున్న కారణంగా వీరి సంఖ్య క్షీణిస్తూ ఉంది.
  • యూదులు బార్బడోస్‌కు 1627లో మొదటి సెటిలర్లు స్థిరపడిన తరువాత వచ్చి చేరారు.
  • బార్బడోస్ లోని ముస్లిములు భారతదేశంలోని గుజరాత్‌కు చెందిన వారై ఉన్నారు. బార్బడోస్ లోని పలు చిన్న వ్యాపారాలను ముస్లిం - ఇండియన్లు నిర్వహిస్తున్నారు.

భాషలు

బార్బడోస్ అధికారిక భాష ఇంగ్లీష్. ఇది ద్వీపమంతటా ఒకరితో ఒకరు సంభాషించడానికి, ప్రభుత్వసేవలకు ఉపయోగించబడుతుంది. ఇంగ్లీష్ ఆధారిత క్రియోల్ (బజన్ క్రియోల్) బర్బడియన్లు దైనందిక జీవితంలో వాడుక భాషగా ఉంది.

మతం

బార్బడోస్ 
సెయింట్ మైకేల్స్ కేథడ్రల్, బ్రిడ్జ్‌టౌన్.

Religion in Barbados (2000)

  Anglican (28.28%)
  Pentecostal (18.69%)
  No religion (atheism, agnosticism, etc) (17.30%)
  Other (7.36%)
  Seventh Day Adventist (5.49%)
  Methodist (5.07%)
  Baptist (4.79%)
  Roman Catholic (4.18%)
  Not Stated (3.28%)
  Church of God (1.99%)
  Jehovah's witnesses (1.96%)
  Moravian (1.34%)
  Rastafarian (1.14%)
  Muslim (0.66%)
  Brethren (0.64%)
  Salvation Army (0.42%)
  Hindu (0.34%)
  Baha'i (0.04%)

బర్బడోస్‌లో 95% ఆఫ్రికన్, యురేపియన్ సంతతికి చెందిన క్రైస్తవులు ఉన్నారు. వీరిలో ఆగ్లికన్లు 40% ఉన్నారు. మిగిలిన క్రైస్తవులలో కాథలిక్కులు, రోమన్ కాథలిక్కులు, పెంటెకోస్టల్స్, జెహోవాస్ విట్నెస్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, స్పిరిచ్యుయల్ బాప్టిస్టులు ఉన్నారు. ఇతర మతస్థులలో హిందువులు, ముస్లిములు, బహై మతస్థులు జ్యూడిస్టులు, విక్క మతస్థులు ఉన్నారు.

ఆరోగ్యం

2011 గణాంకాల ఆధారంగా బార్బడోస్ ప్రజల ఆయుఃప్రమాణం 74 సంవత్సరాలు. 2005 గణాంకాల ఆధారంగా పురుషుల ఆయుఃప్రమాణం 72, స్త్రీల ఆయుఃప్రమాణం 77 సంవత్సరాలు. బార్బడోస్, జపాన్ శతాధికవృద్ధులు అధికంగా ఉన్న దేశాలలో ప్రథమస్థానంలో ఉన్నాయి. జననాల నిష్పత్తి 1000:12.23. మరణాల నిష్పత్తి 1000:8.39. బార్బడియన్లు అందరికీ " నేషన్ల్ హెల్త్‌కేర్ " ద్వారా ఆరోగ్యరక్షణ లభిస్తుంది.బార్బడోస్‌లో 20 పాలిటెక్నిక్స్ ఉన్నాయి.బ్రిడ్జ్‌టౌన్‌లో " క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ " (జనరల్ హాస్పిటల్)ఉంది. 2011 లో బార్బడోస్ ప్రభుత్వం " మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ " మీద సంతకం చేయడంద్వారా 22 ఎకరాల జోసెఫ్ హాస్పిటల్ ప్రాంతాన్ని " అమెరికా వరల్డ్ క్లినిక్స్ " (డెంవర్‌,కొలరాడో) లీజుకు ఇచ్చింది.ఈ ఒప్పందం ఆధారంగా వీరు ఈప్రాంతాన్ని మెడికల్ పర్యాటకం ప్రధాన గమ్యంగా అభివృద్ధి చేయబడింది. బర్బడోస్ ప్రభుత్వం 900 మిలియన్ల అమెరికన్ డలర్ల వ్యయంతో " స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్ " నిమినచబడుతుందని ప్రకటించింది.

విద్య

బార్బడోస్ 
సెయింట్ ఫిలిప్ పాఠశాల పిల్లలు - బార్బడోస్‌

బార్బడోస్ అక్షరాస్యతా శాతం దాదాపు 100% ఉంటుంది. బార్బడోస్ విద్యావిధానం బ్రిటిష్ విధానాన్ని అనుసరించి ఉంటుంది.2008 గణాంకాల ఆధారంగా బార్బడోస్ విద్యరంగం కొరకు జి.డి.పి.లో 6.7% వ్యయం చేస్తుంది. బార్బడోస్‌లో 16 సంవత్సరాల వరకు నిర్భంధ విద్య అమలులో ఉంది. బార్బడోస్ 70 కంటే అధికమైన ప్రాథమిక పాఠశాలలు, 20 కంటే అధికంగా మాద్యమిక పాఠశాలలు ఉన్నాయి. దేశంలో పలు ప్రైవేట్ స్కూల్స్ (మాంటెస్సోరీ, ఇంటర్నేషనల్ బకలౌరియేట్)ఉన్నాయి. మొత్తం విద్యార్థులలో 5% విద్యార్థులు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుంటారు.

బార్బడోస్‌లో డిగ్రీ స్థాయి విద్యను " బార్బడోస్ కమ్యూనిటీ కాలేజ్ ", ది సామ్యుయేల్ జాక్మన్ ప్రిస్కాడ్ పాలిటెక్నిక్, ది కేవ్‌బిల్, సెయింట్ మైకేల్; బార్బడోస్, ఓపెన్ కాంపస్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్ అందిస్తున్నాయి. బార్బడోస్‌లో అదనంగా అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ సైంసెస్, స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి.

ఎజ్యుకేషనల్ టెస్టింగ్

బార్బడోస్ సెకండరీ స్కూల్ ప్రవేశపరీక్షలు: 11-12 సంవత్సరాల లోపు పిల్లలకు సెప్టెంబరు 1 న నిర్వహించబడుతుంటాయి. మాద్యమిక పాఠశాలలో ప్రవేశించడానికి ఈ ప్రవేశపరీక్షలు నిర్వహించబడుతుంటాయి.కరీబియన్ సెకండరీ ఎజ్యుకేషన్ సర్టిఫికేట్: విద్యార్థులు 5 సంవత్సరాల మాద్యమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఈ సర్టిఫికేట్ అందించబడుతుంది. విద్యార్థులు మాద్యమిక విద్యను పూర్తిచేసిన తరువాత కరీబియన్ అడ్వాంస్డ్ ప్రొఫీషియంసీ ఎక్జామినేషంస్ నిర్వహించబడతాయి. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు యూనివర్శిటీ విద్యకు అర్హత సాధిస్తారు.

సంస్కృతి

బార్బడోస్ సంస్కృతి ఆఫ్రికన్, క్రియోల్, ఇండియన్, బ్రిటిష్ సంస్కృతుల మిశ్రమంగా ఉంటుంది. ప్రజలను అధికారికంగా బార్బడియన్లు అని పేర్కొనబడుతుంటారు. వీరిని బేజున్ అని బార్ బజన్ అని కూడా అంటారు.

సాస్కృతిక కార్యక్రమాలలో అతిపెద్ద కార్యక్రమం కార్నివల్. ద్వీపంలో దీనిని నిర్వహించే సమయానికి పంటలు ఇంటికి చేరుకుంటాయి. పలు ఇతర కరీబియన్, లాటిన్ అమెరికన్ దేశాలలో ఉన్నట్లు ద్వీపంలోని ప్రజలు పంటల తరువాత జరుపుకునే ఈఉత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాది పర్యాటకులు ఈ ద్వీపానికి చేరుకుంటారు. ఈ ఉత్సవంలో సంగీత పోటీలు, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలలో అత్యధికంగా చెరకు పండించిన స్త్రీ పురుషులు రాజు రాణి ధరించినట్లు కిరీటం ధరిస్తుంటారు. పంటల కోత జూలైలో మొదలై ఆగస్టు మొదటి సోమవారం (కడూమెంట్ డే) తో ముగుస్తుంది.

ఆహారం

బార్బడోస్ 
మౌంట్ గే రమ్ సందర్శకుల కేంద్రం

బేజున్ ఆహారం ఆఫ్రికన్, ఇండియన్, ఐర్లాండ్, క్రియోల్, బ్రిటిష్ ఆహారాలతో ప్రభావితమై ఉంటుంది. పూర్తి భోజనంలో మాంసం లేక చేపలు భాగంగా ఉంటాయి. వీటిని మూలికలు, మసాలాలతో ఊరబెట్టి తయారు చేస్తారు. అలాగే వేడి సైడ్ డిషులు, సలాడులు కూడా భోజనంలో ఉంటాయి. భోజనం సాధారణంగా ఒకటి లేక రెండు సాసులతో చేర్చి వడ్డించబడుతుంది. బార్బడోస్ జాతీయ వంటకం కౌ- కౌ, ఫ్లైయింగ్ ఫిష్ స్పైసీ గ్రేవీ. ఇతర సంప్రదాయ వంటకాలలో " పుడ్డింగ్ , సాస్ " ఒకటి.ఊరబెట్టిన పందిని మసాలాలు చేర్చిన చిలగడదుంపలతో వడ్డిస్తారు. విస్తారమైన సీ ఫుడ్స్ (సముద్ర ఆహారాలు), మాసం కూడా లభిస్తాయి.

బార్బడోస్ లోని ది మౌంట్ గే రం సందర్శకుల కేంద్రం ప్రపంచంలోని అతి పురాతన రం తయారీ కేంద్రంగా గుర్తించబడుతుంది. 1703 నుండి పనిచేస్తుందని అంచనా. కాక్స్పర్ రం, మలిబు కూడా ద్వీపంలో తయారు చేయబడుతున్నాయి. బార్బడోస్‌లో " బాంక్ బార్బడోస్ బ్ర్యూవరీ " స్థాపించబడింది. ఇక్కడ బాంక్ బీర్, పాలే ఇయాగర్, అంబర్ అలే తయారుచేయబడుతుంది. బాంక్ నుండి టైగర్ మాల్ట్, నాన్ - ఆల్కహాలిక్ మాల్టా బివరేజ్ తయారు చేయబడుతుంటాయి. బార్బడోస్ లోని స్పైట్ టౌన్, సెయింట్ పీటర్ ప్రాంతాలలో 10 సెయింట్ బీరు " ను తయారు చేస్తుంది.

సంగీతం

బార్బడోస్ 
అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్నా బార్బడోస్‌కు చెందిన వ్యక్తి.

బార్బడోస్‌లోని సెయింట్ మైకేల్ ప్రాంతంలో జన్మించిన " రోబిన్ రిహన్నా ఫెంటి " 8 మార్లు గ్రామీ అవార్డులను సాధించింది.ఆమె బార్బడోస్‌లో అత్యంత గుర్తింపు పొందిన కాళాకారిణిగా గుర్తించబడుతుంది. ఆమె " బెస్ట్ సెల్లింగ్ మ్యూసిక్ ఆర్టిస్టు " గా కూడా గుర్తించబడుతుంది. ఆమె గానంతో రూపొందించబడిన రికార్డులు 200 మిలియన్ల కంటే అధికంగా విక్రయించబడ్డాయి.గతించిన బార్బడోస్ ప్రధాన మంత్రి " డేవిడ్ థాంప్సన్ " 2009లో ఆమెను బార్బడోస్ " హానరరీ అంబాసిడర్ ఆఫ్ యూత్ అండ్ కల్చర్ " గా నియమితురాలై ఉంది. పాటల రచయిత , గాయకుడు షాంటెల్లె, బ్యాండ్ " కవర్ డ్రైవ్ " , సంగీతకారుడు రూపీ , మార్క్ మొరిషన్, రిటర్న్ ఆఫ్ ది మెక్ బార్బడోస్‌కు చెందినవారు.1958లో బ్రిడ్జ్ టౌన్‌లో జోసెఫ్ సాడ్లర్‌కు జన్మించిన గ్రాండ్ మాస్ట్ ఫ్లాష్ బార్బడోస్ సంగీతప్రపంచాన్ని ప్రభావితం చేసాడు. 1960 నుండి 2010 వరకు ప్రదర్శనలు అందిస్తున్న కలిప్సొ బ్యాండ్ బార్బడోస్‌లో ప్రారంభించబడింది.

శలవులు

తారీఖు ఆంగ్లనామం రిమార్కులు
1 జనవరి న్యూ ఇయర్స్ డే
21 జనవరి ఎర్రోల్ బారొ డే ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎర్రోల్ బారొ స్మారక దినం.
మార్చి లేక ఏప్రిల్ గుడ్ ఫ్రైడే శుక్రవారం.
మార్చి లేక ఏప్రిల్ ఈస్టర్ మండే సోమవారం
28 ఏప్రిల్ జాతీయ నాయకుల రోజు బార్బడోస్ జాతీయ నాకలులను స్మరించుకునే రోజు.
1–7 మే లేబర్ డే మే మాసంలో మొదటి సోమవారం
మే లేక జూన్ వైట్ మండే సోమవారం
1 ఆగస్టు బానిసత్వం నిర్మూలించిన రోజు ద్వీపంలో బానిసత్వం నిర్మూలించబడిన రోజు
1–7 ఆగస్టు కడూమెంట్ డే ఆగస్టు మొదటి సోమవారణ్
30 November స్వతంత్రదినం బార్బడోస్ స్వతంత్రం పొందిన రోజు.
25 డిసెంబరు క్రిస్మస్ డే
26 డిసెంబరు. బాక్సింగ్ డే

క్రీడలు

బార్బడోస్ 
బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ 2007 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. బార్బడోస్‌లో అత్యధికంగా అనుసరించే ఆటలలో క్రికెట్ ఒకటి. కెన్సింగ్‌టన్ ఓవల్‌ని ఈ క్రీడకు ఇచ్చే ప్రాముఖ్యత కారణంగా "క్రికెట్‌లో మక్కా" అని పిలుస్తారు.

బ్రిటిష్ కాలనియల్ వారసత్వం కలిగిన ఇతర కరీబియన్ దేశాలలో ఉన్నట్లు బార్బడోస్ ద్వీపంలో క్రికెట్ అభిమానక్రీడగా ఉంది.

క్రికెట్

" ది వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం "లో పలువురు బర్బడియన్ క్రీడాకారులు ఉన్నారు. అదనంగా పలు వార్మప్ మ్యాచులు, ఆరు సూపర్ ఎయిట్ మ్యాచులు, 2007 క్రికెట్ వరల్డ్ కప్‌కు దేశణ్ ఆతిథ్యం ఇచ్చింది.బార్బడోస్ సర్ గర్ఫీల్డ్ సోబర్స్, సర్ ఫ్రాంక్ వారెల్, సర్ క్లేడే వాల్కాట్, సర్ ఎవర్టన్ వీక్స్, గార్డన్ గ్రీనిడ్జ్, వెస్ హాల్, చార్లీ గ్రిఫిత్, జోయెల్ గార్నర్, డెస్మండ్ హేనెస్, మాల్కొం మార్షల్ మొదలైన ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసింది.

ఇతరక్రీడలు

రగ్బీ ఫుట్‌బాల్ బార్బడోస్ అభిమాన క్రీడలలో ఒకటిగా ఉంది.బ్రిడ్జ్‌టౌన్ సమీపంలో ఉన్న " గరిషన్ సవన్నాహ్ రేస్‌ట్రాక్ "లో గుర్రపు పందాలు నిర్వహించబడుతున్నాయి.ప్రేక్షకులు రుసుము చెల్లించి చూడడానికి అవకాశం ఉంది.అలాగే మిగిలిన వారు పన్లిక్ రైల్ నుండి పందాలు సందర్శించవచ్చు. బార్బడోస్ స్ప్రింటర్ క్రీడాకారుడు " ఒబాడెలె థాంప్సన్ " ఒలింపిక్ క్రీడలలో 100మీ స్ప్రింట్‌లో కామ్శ్యపతకం (2000) సాధించాడు. హర్డిలర్ " ర్యాన్ బ్రాత్‌వైటె " బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలు (2008) లో పాల్గొని సెమీ ఫైల్స్‌కు చేరుకున్నాడు. అలాగే ఆయన బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ క్రీడలలో బార్బడోస్ కొరకు మొదటి పతకం సాధించాడు.అలాగే జర్మనీలో 2009 ఆగస్టు 20న జరిగిన క్రీడలలో 110 మీ హర్డిల్ టైటిల్ సాధించాడు.ఆయన 21సంవత్సరాల వయసులో 13.14 సెకండ్లలో ప్రపంచ రికార్డ్ సృష్టించి బంగారు పతకం సాధించాడు.స్కూల్, కాలేజి స్థాయి నుండి శిక్షణ ఇవ్వబడుతున్న బాస్కెట్ బాల్ క్రీడ కూడా బార్బడోస్ అభిమానక్రీడగా అభివృద్ధి చెందుతూ ఉంది. బార్బడోస్ నేషనల్ బాస్కెట్‌బాల్ టీం పలు పెద్ద దేశాల టీంలతో పోటీచేసి అనూహ్యమైన ఫలితాలు సాధించింది.ద్వీపంలోని సంపన్నుల మద్య పోలోక్రీడ అభిమానక్రీడగా ఉంది. ఎస్.టి. జేంస్ క్లబ్ వద్ద " హై - గోల్ ఏప్స్ హిల్ల్ టీం " ఏర్పాటుచేయబడింది. ఇది ప్రైవేట్ హోల్డర్స్ ఫెస్టివల్ గ్రౌండ్ వద్ద కూడా పోలోక్రీడలలో పాల్గొంటుంది. గోల్ఫ్ క్రీడలో " బార్బడోస్ ఓపెన్ " రాయల్ వెస్ట్‌మోర్‌లాండ్ గోల్ఫ్ క్లబ్ వద్ద నిర్వహించబడే క్రీడలలో పాల్గొంటున్నది.2000 నుండి 2009 వరకు " యురేపియన్ సీనియర్ టూర్స్ " క్రీడలలో వార్షికంగా పాల్గొంటున్నది.2006 లో " ది డబల్యూ.జి.సి.- వరల్డ్ కప్ " శాండీ లేన్ " రిసార్ట్ వద్ద క్రీడలు నిర్వహించబడ్డాయి. 18-హోల్ క్రీడను టాం ఫాజియొ రూపొందించాడు. ద్వీపంలో అదనంగా " ది బార్బడోస్ గోల్ఫ్ క్లబ్ " ఉంది. ఇక్కడ బార్భడోస్ ఓపెన్ క్రీడలు పలుమార్లు నిర్వహించబడ్డాయి. బార్బడోస్ అభిమాన క్రీడలలో వాలీబాల్ ఒకటి. వాలీబాల్ ప్రధానంగా ఇండోర్ స్టేడియంలో ఆడబడుతూ ఉంది.టెన్నిస్ బార్బడోస్‌లో అభిమానక్రీడగా మారుతూ ఉంది. డేరింగ్ కింగ్‌కు బార్బడోస్ స్వస్థలం. ఇది ప్రపంచంలో 270వ స్థానంలో ఉంది. కరీబియన్ దేశాలలో 2వ స్థానంలో ఉంది. బార్బడోస్‌లో ప్రతి వేసవిలో మోటర్ స్పోర్ట్స్ నిర్వహించబడుతుంటాయి." బుషీ పార్క్ సర్క్యూట్ " రేస్ ఆఫ్ చాంపియంస్, గ్లోబల్ ర్యాలీకోర్స్ చాంపియన్‌షిప్స్ (2014) కు ఆతిథ్యం ఇచ్చింది. " వేవ్ సెయిలింగ్ " (విండ్ సర్ఫింగ్) క్రీడలకు ద్వీపం దక్షిణ తీరంలో ఉన్న ట్రేడ్ విండ్స్ ప్రాంతం అనుకూలంగా ఉంది. నెట్‌బాల్ క్రీడ మహిళకు అభిమాంక్రీడగా మారుతూ ఉంది. బార్బడోస్ ఫ్లెయిన్ ఫిష్ టీం 2009 సెజ్‌వే పొలో వరల్డ్ చాంపియంస్ సాధించింది.

రవాణా

బార్బడోస్ 
ACME హినో మిడిబస్, స్పీట్స్‌టౌన్, బార్బడోస్‌

బార్బడోస్ ప్రయాణాలు సౌకర్యంగా చేయడానికి ద్వీపంలో జెడ్.ఆర్.ఎస్ (జెడార్స అని అంటారు) కాల్ టాక్సీలు ద్వీపంలోని పలు ప్రాంతాలకు చేరడానికి అందుబాటులో ఉన్నాయి. మినీ బసులు తరచుగా రద్దీగా ఉంటాయి. ప్రయాణీకులు తమగమ్యం చేరడానికి అధికంగా ప్రకృతి సౌనద్యంతో అలరారే మార్గాలను ఎంచుకుంటారు. జెడార్స్‌తో చేర్చి ద్వీపంలో మూడు బసు సిస్టంస్ దినసరి సేవలను అందిస్తూ ఉన్నాయి. వీటిని ఎల్లో మినిబసులు, బ్లూ మినీబసులు అంటారు. వీటిలో ప్రయాణించడానికి $ 2 బార్బడోస్ డాలర్లు రుసుము చెల్లించాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద బ్లూ బసులు విద్యార్థులు ప్రయాణించడానికి ఉచిత బసు పాసులు అందిస్తుంది.కొన్ని హోటల్స్ పర్యాటకులకు పర్యాటక కేంద్రాలకు షటిల్ సర్వీస్ సౌకర్యం అందిస్తుంది. బార్బడోస్‌లో ప్రైవేట్ యాజమాన్యం అందిస్తున్న ఇతర వాహనాలు ప్రయాణ సేవలు అందిస్తున్నాయి.

విమానాశ్రయం

బార్బడోస్‌లో ఉన్న " గ్రాంట్లీ ఆడంస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ప్రయాణీకులకు వీమానప్రయాణసౌకర్యం కలిగిస్తుంది. ఇక్కడ నుండి పలు ప్రంపంచంలోని ప్రధాన నగరాలకు దిననసరి సేవలను అందిస్తూ ఉంది.ఈ విమానాశ్రయం తూర్పు కరీబియన్ ప్రాంతానికి ప్రధానకేంద్రంగా ఉంది.21వ శతాబ్దం మొదటి దశాబ్ధంలో ఈ విమానాశ్రయం $ 100 మిలియన్ అమెరికా డాలర్లతో విస్తరించబడింది.ద్వీపంలో హెలీకాఫ్టర్ సర్వీసులు ద్వీపంలో పలుకేంద్రాలకు (ప్రధానంగా పశ్చిమతీరంలో ఉన్న పర్యాటక కేంద్రాలకు ) ఎయిర్ టాక్సీ సేవలు అందిస్తూ ఉంది.ఎయిర్, మారీటైం ట్రాఫిక్‌ను " బార్బడోస్ పోర్ట్ అథారిటీ " క్రమబద్ధీకరణ చేస్తుంది.

మూలాలు

బయటి లింకులు

Barbados గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

బార్బడోస్  నిఘంటువు విక్షనరీ నుండి
బార్బడోస్  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
బార్బడోస్  ఉదాహరణలు వికికోట్ నుండి
బార్బడోస్  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
బార్బడోస్  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
బార్బడోస్  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

13°10′N 59°33′W / 13.16°N 59.55°W / 13.16; -59.55

Tags:

బార్బడోస్ పేరువెనుక చరిత్రబార్బడోస్ చరిత్రబార్బడోస్ భౌగోళికంబార్బడోస్ ఆర్ధికంబార్బడోస్ ఆరోగ్యంబార్బడోస్ విద్యబార్బడోస్ సంస్కృతిబార్బడోస్ క్రీడలుబార్బడోస్ రవాణాబార్బడోస్ మూలాలుబార్బడోస్ బయటి లింకులుబార్బడోస్అట్లాంటిక్ మహాసముద్రంఆంగ్లంకెనడాజపాన్ట్రినిడాడ్, టొబాగోబెల్జియంసెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతల జాబితాశ్రీరంగనీతులు (సినిమా)సావిత్రిబాయి ఫూలేభారత రాజ్యాంగ పీఠికసంధిఆదిత్య హృదయంబుధుడు (జ్యోతిషం)అరణ్యకాండఅల్లు అర్జున్రుహానీ శర్మబైబిల్సివిల్ సర్వీస్మొదటి ప్రపంచ యుద్ధంతెలంగాణా బీసీ కులాల జాబితాసీతారామ దేవాలయం (గంభీరావుపేట్)కడప లోక్‌సభ నియోజకవర్గంరమ్య పసుపులేటినవగ్రహాలు జ్యోతిషంరామదాసుఇందిరా గాంధీమీనాక్షి అమ్మవారి ఆలయంమకరరాశిరామతీర్థం (నెల్లిమర్ల)శ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థంకుక్క20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలితెలుగు సినిమాలు డ, ఢరోహిత్ శర్మH (అక్షరం)ద్వాదశ జ్యోతిర్లింగాలుదశరథుడుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాతెలుగు అక్షరాలుఆంధ్రజ్యోతిరమణ మహర్షివై.యస్.రాజారెడ్డిభారతదేశంలో సెక్యులరిజంకుంభరాశిఅగ్నికులక్షత్రియులుషడ్రుచులునయన తారభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377షాజహాన్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపెడన శాసనసభ నియోజకవర్గందానంజీమెయిల్మరణానంతర కర్మలుహరిశ్చంద్రుడుపార్వతిదశదిశలుడీజే టిల్లుజొన్నఇస్లాం మతంశివుడుశివపురాణంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఅయేషా ఖాన్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికలబంద2024 భారత సార్వత్రిక ఎన్నికలుపులిశ్రవణ నక్షత్రముపాములపర్తి వెంకట నరసింహారావుఅమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంమృగశిర నక్షత్రముకస్తూరి రంగ రంగా (పాట)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రేమలుఏలకులుమధుమేహంహరి హర వీరమల్లుపరకాల ప్రభాకర్అంగారకుడు (జ్యోతిషం)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లికృష్ణా నది🡆 More