కాన్‌స్టాంటిన్ ద గ్రేట్

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ (సా.శ.

272 ఫిబ్రవరి 27 నుంచి 337 మే 337) సా.శ. 306 నుంచి 337 వరకూ పరిపాలించిన రోమన్ చక్రవర్తి. ఇతన్ని మొదటి కాన్‌స్టాంటిన్ అని కూడా పిలుస్తారు. డాసియా మెడిటెరానియాలోని నైసస్‌లో (నేటి సెర్బియాలోని, నీష్ నగరం) జన్మించాడు. కాన్‌స్టాంటిన్ తండ్రి ఫ్లావియస్ కాన్‌స్టాంటియస్ ఇలిరియన్ ప్రాంతానికి చెందిన సైన్యాధికారిగా జీవితం ప్రారంభించి రోమన్ సామ్రాజ్యపు టెట్రార్కీ విధానంలో నలుగురు చక్రవర్తుల్లో ఒకడయ్యాడు. అతని తల్లి హెలెనా గ్రీకు జాతీయురాలు, సామాన్య కుటుంబంలో జన్మించింది. డియోక్లెటైన్, గాలెరియస్ చక్రవర్తులు ఇద్దరి నాయకత్వంలోనూ కాన్‌స్టాంటైన్ సేనా నాయకునిగా విశిష్టమైన సేవలందించాడు. ఇందులో భాగంగా తూర్పు ప్రావిన్సుల్లో బార్బేరియన్లు, పర్షియన్లపై పోరాడాడు. సా.శ. 305లో అతని తండ్రి అధీనంలో బ్రిటన్‌లో పోరాడడానికి వెనక్కి పిలిచేదాకా తూర్పు ప్రావిన్సుల్లో సేనా నాయకునిగా పనిచేశాడు. 306లో ఇతని తండ్రి మరణించాకా ఎబోరాకం (ఈనాడు ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరం) సైన్యం కాన్‌స్టాంటిన్‌ను చక్రవర్తిగా ప్రకటించింది. ఇతర చక్రవర్తులైన మాక్సెంటియస్, లిసినియస్‌లపై అంతర్యుద్ధాల్లో పోరాడి 324 నాటికల్లా రోమన్ సామ్రాజ్యపు ఏకైక పరిపాలకుడిగా నిలిచాడు.

కాన్‌స్టాంటిన్ ద గ్రేట్
ఇంగ్లాండు లోని యార్క్ వద్ద కాన్‌స్టాంటిన్ ద గ్రేట్ ఇత్తడి విగ్రహం

కాన్‌స్టాన్‌టిన్ చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సైనిక రంగాల్లో సంస్కరణలను అమలు చేశాడు. పౌర, సైనిక అధికారులను వేరుచేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్నిర్మించాడు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి అతను కొత్త బంగారు నాణెం అయిన సాలిడస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది బైజాంటైన్, యూరోపియన్ కరెన్సీలకు వెయ్యి సంవత్సరాలకు పైగా ప్రామాణికంగా నిలిచింది. కామిటాటెన్స్‌లు అన్న పేరుతో సంచార యూనిట్లు, లిమిటానై అన్న పేరుతో కోటలో నిలిచివుండే స్థిరమైన యూనిట్ల కింద సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. తద్వారా అంతర్గత ప్రమాదాలను, బార్బేరియన్ల దండయాత్రలను కూడా ఎదుర్కోగలిగేలా ఈ యూనిట్లు ఉపయోపడ్డాయి. రోమన్ సరిహద్దుల్లోని ఫ్రాంకులు, అలమాన్ని, గోథ్‌లు, సర్మాటియాన్లు వంటి జాతులపై విజయవంతంగా దండయాత్రలు చేశాడు. అతను ఆక్రమించిన భూభాగాల్లో రోమన్ సామ్రాజ్యం మూడవ శతాబ్దపు సంక్షోభం ఎదుర్కొంటుండగా తన పూర్వ చక్రవర్తులు వదిలిపెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

గమనికలు

Tags:

ఇంగ్లాండురోమన్ సామ్రాజ్యంసెర్బియా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ఎన్నికల కమిషనుశుభ్‌మ‌న్ గిల్రమ్యకృష్ణతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకృష్ణా నదిసెల్యులార్ జైల్భారతీయ రిజర్వ్ బ్యాంక్విద్యా హక్కు చట్టం - 2009ముదిరాజ్ (కులం)టిల్లు స్క్వేర్ఖోరాన్తేలుత్రిష కృష్ణన్ఆంధ్రప్రదేశ్నీరుకందుకూరి వీరేశలింగం పంతులుప్రేమ పల్లకిభారతదేశంలో ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలునర్మదా నదిఅండమాన్ నికోబార్ దీవులుగోవిందుడు అందరివాడేలేఆంధ్ర విశ్వవిద్యాలయంరమణ మహర్షిముహమ్మద్ ప్రవక్తజోర్దార్ సుజాతగుణింతంఅమరావతిసమంతబోనాలుసావిత్రి (నటి)ఎస్. వి. కృష్ణారెడ్డిరాశి (నటి)సాయి సుదర్శన్పద్మశాలీలురావుల శ్రీధర్ రెడ్డిదినేష్ కార్తీక్తెలుగు నెలలువేంకటేశ్వరుడుచంద్రుడు జ్యోతిషంతెలంగాణ ప్రభుత్వ పథకాలుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్యజుర్వేదంవందేమాతరంబ్రహ్మంగారి కాలజ్ఞానంబరాక్ ఒబామావిశ్వక్ సేన్నిజాంఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌దేవుడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఆయాసంభారత రాజ్యాంగంకల్వకుంట్ల తారక రామారావుచిరుధాన్యంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఎన్నికలురాజకుమారుడుతోట త్రిమూర్తులుపెళ్ళిరాధ (నటి)మిథునరాశిఇతర వెనుకబడిన తరగతుల జాబితాజనాభాతెలంగాణ ఉద్యమంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారాబర్ట్ ఓపెన్‌హైమర్తంత్ర దర్శనముపంచతంత్రంశతభిష నక్షత్రమువినాయకుడుఉండవల్లి శ్రీదేవిబుడి ముత్యాల నాయుడుపన్ను (ఆర్థిక వ్యవస్థ)భారత జాతీయగీతంమడమ నొప్పి🡆 More