ఇరాక్

ఇరాక్ (ఆంగ్లం : Iraq), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ (అరబ్బీ : جمهورية العراق ), జమ్-హూరియత్ అల్-ఇరాక్, పశ్చిమ ఆసియా లోని ఒక సార్వభౌమ దేశం.

దీని రాజధాని బాగ్దాదు. దేశం ఉత్తర సరిహద్దులో, టర్కీ తూర్పు సరిహద్దులో ఇరాన్ (కుర్దిస్తాన్ ప్రాంతం), ఆగ్నేయ సరిహద్దులో కువైట్, దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా, వాయవ్య సరిహద్దులో జోర్డాన్ పశ్చిమ సరిహద్దులో సిరియా దేశం ఉన్నాయి. ఇరాక్ దక్షిణ ప్రప్రాంతం అరేబియన్ ద్వీపకల్పంలో ఉంది. అతిపెద్ద నగరం, దేశరాజధాని అయిన బాగ్దాదు నగరం దేశం మద్యభాగంలో ఉంటుంది. ఇరాక్‌లో అధికంగా అరేబియన్లు, కుర్దీ ప్రజలు ఉన్నారు. తరువాత స్థానాలలో అస్సిరియన్, ఇరాకీ తుర్క్మెనీయులు, షబకీయులు, యజిదీలు, ఇరాకీ ఆర్మేనియన్లు, ఇరాకీ సిర్కాసియన్లు, కవ్లియాలు ఉన్నారు. ఇరాక్ లోని 36 మిలియన్ ప్రజలలో 95% సున్నీ ముస్లిములు ఉన్నారు.వీరుకాక దేశంలో క్రైస్తవం, యార్సన్, యజిదీయిజం, మండీనిజం కూడా ఆచరణలో ఉంది. ఇరాక్‌లో 58 km (36 mi) పొడవైన సన్నని సముద్రతీర ప్రాంతం (పర్షియన్ గల్ఫ్ ఉత్తరంలో) ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన టిగ్రిస్-యూఫ్రేట్స్ నదీ మైదానం ఉంది. ఇది జగ్రోస్ పర్వతశ్రేణికి వాయవ్యంలో సిరియన్ ఎడారికి తూర్పు భాగంలో ఉంది. ఇరాక్‌లోని రెండు ప్రధాన నదులైన టిగ్రిస్, యూఫ్రేట్స్ నదులు దక్షిణంగా ప్రవహించి షాట్ అల్ అరబ్ వైపు ప్రవహించి పర్షియన్ గల్ఫ్‌లో సంగమిస్తాయి. ఈ నదులు ఇరాక్‌కు సారవంతమైన వ్యవసాయ భూమిని అందిస్తున్నాయి. టిగ్రిస్-యూఫ్రేట్స్ నదీప్రాంతాలకు మెసపటోమియా అని చారిత్రక నామం ఉంది. ఇక్కడ ఇది తరచుగా మానవ నాగరికతా సోపానంగా వర్ణించబడుతుంది.మానవనాగరికతలో వ్రాయడం, చదవడం, చట్టం రూపకల్పన చక్కగా నిర్వహించబడిన ప్రభుత్వం పాలనలో నగరనిర్మాణం చేసి ప్రజలు నివసించారు.క్రీ.పూ 6 వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో పలు నాగరికతలు నిరంతర మ్ఘాఆ విజయవంతంగా విలసిల్లాయి. ఇరాక్ అకాడియన్, నియో - సుమేరియన్ సామ్రాజ్యం, నియో అస్సిరియన్, నియో - బాబిలోనియన్ సామ్రాజ్యాలు విలసిలాయి. ఇరాక్ మెడియన్ సామ్రాజ్యం, అచమనిద్ అస్సిరియన్, సెల్యూసిడ్ సామ్రాజ్యం, అర్ససిద్ సామ్రాజ్యం, సస్సనిద్ సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, రషిదున్ సామ్రాజ్యం, సఫావిద్ సామ్రాజ్యం, అఫ్షరిద్ రాజవంశ పాలన, ఓట్టమన్ సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. అలాగే యునైటెడ్ కింగ్డం ఆధీనంలో కొంతకాలం ఉంది. 1920లో ఓట్టమన్ సామ్రాజ్యం విభజన తరువాత ఇరాక్ సరిహద్దులు సరికొత్తగా నిర్ణయించబడ్డాయి. 1921లో కింగ్డం ఆఫ్ ఇరాక్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1932లో యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం లభించింది. 1958లో ఇరాక్ సామ్రాజ్యం విచ్ఛిన్నమై ఇరాక్ రిపబ్లిక్ స్థాపించబడింది. 1968 నుండి 2003 వరకు బాత్ పార్టీ ఇరాక్‌ను పాలించింది.2003 లో యునైటెడ్ స్టేట్స్ ఇరాక్‌ మీద దాడి చేసింది. సదాం హుస్సేన్ ప్రభుత్వం తొలగించబడి ఇరాక్‌లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 2011 నుండి ఇరాక్‌ నుండి అమెరికన్ దళాలు వైదొలగాయి. 2011-2013 వరకు ఇరాక్ విప్లవం కొనసాగింది. సిరియన్ అంతర్యుద్ధం ప్రభావం ఇరాక్ వరకు వ్యాపించింది..

جمهورية العراق
జమ్-హూరియత్ అల్-ఇరాక్
كۆماری عێراق
Komarê Iraq
ఇరాక్ గణతంత్రం
Flag of ఇరాక్ ఇరాక్ యొక్క చిహ్నం
నినాదం
الله أكبر   (అరబ్బీ)
"అల్లాహు అక్బర్"  (transliteration)
"అల్లాహ్ గొప్పవాడు"
జాతీయగీతం
Mawtini  (new)
Ardh Alforatain  (previous)1

ఇరాక్ యొక్క స్థానం
ఇరాక్ యొక్క స్థానం
రాజధానిబాగ్దాదు2
33°20′N 44°26′E / 33.333°N 44.433°E / 33.333; 44.433
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అరబ్బీ భాష, కుర్దిష్
ప్రజానామము ఇరాకీ
ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న పార్లమెంటరీ గణతంత్రం
 -  అధ్యక్షుడు జలాల్ తలబాని
 -  ప్రధాన మంత్రి నూరి అల్ మాలికి
స్వతంత్రం
 -  from the ఉస్మానియా సామ్రాజ్యము
అక్టోబరు 1 1919 
 -  from the యునైటెడ్ కింగ్ డం
అక్టోబరు 3 1932 
 -  జలాలు (%) 1.1
జనాభా
 -  2007 అంచనా 29,267,0004 (39వది)
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $89.8 బిలియన్లు (61వది)
 -  తలసరి $2,900 (130th)
కరెన్సీ ఇరాకీ దీనార్ (IQD)
కాలాంశం GMT+3 (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .iq
కాలింగ్ కోడ్ +964
1 The Kurds use Ey Reqîb as the anthem.
2 ఇరాకీ కుర్దిస్తాన్ రాజధాని అర్‌బీల్.
3 Arabic and Kurdish are the official languages of the Iraqi government. According to Article 4, Section 4 of the ఇరాక్ రాజ్యాంగం, Assyrian (Syriac) (a dialect of Aramaic) and Iraqi Turkmen (a dialect of Southern Azerbaijani) languages are official in areas where the respective populations they constitute density of population.
4 CIA World Factbook

పేరువెనుక చరిత్ర

6 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతానికి అరబిక్ పేరు العراق al-ʿIrāq వరకు వాడుకలో ఉండేది. ఈ పేరు వెనుక పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సుమేరియన్ నగరాలలో ఒకటైన ఉరుక్ (బైబిల్ పేరు ఎర్చ్) పేరుతో ఈప్రాంతం గుర్తించబడిందని భావిస్తున్నారు. అరబిక్ జానపద వాడుకలో లోతుగా పాతుకున్న, చక్కగా జలసమృద్ధి కలిగిన, సారవంతమైన అని కూడా ఇరాక్ పదానికి అర్ధం అని భావించబడుతుంది. మద్యయుగకాలంలో దిగువ మెసపటోమియా ప్రాంతం ఇరాకియన్ అరబి, పర్షియన్ ఇరాక్ (విదేశీ ఇరాక్) అని పిలువబడింది. ప్రారంభ ఇస్లామిక్ వాడుకలో సారవంతమైన భూమిని (టిగ్రిస్, యూఫ్రేట్స్ సారవంతమైన భూమిని ) సవాద్ అంటారు. అరబిక్ పదం عراق అంటే అంచు, తీరం, కొన అని అర్ధం. గ్రామీణ భాషలో ఏటవాలు ప్రాంతం అని అర్ధం. అల్- జజిరా (మెసపటోమియా) మైదానం అల్- ఇరాక్ అరబి ఉత్తర పశ్చిమ తీరంలో ఉంది.

చరిత్ర

చరిత్రకు ముందు కాలం

షనిదార్ గుహలలో లభించిన పురాతత్వ అవశేషాల ఆధారంగా క్రీ.పూ 65,000, క్రీ.పూ 35,000 ఉత్తర ఇరాక్ ప్రాంతం నీండర్తా నాగరికతకు నిలయంగా ఉండేదని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో నియోలిథిక్ పూర్వపు సమాధులు కూడా (దాదాపు క్రీ.పూ 11,000 కాలం) కనుగొనబడ్డాయి. క్రీ.పూ 10,000 కాలంలో ఇరాక్ కౌకాసియాద్ నియోలిథిక్ (ప్రి పాటరీ నియోలిథిక్ ఎ) నాగరికతకు కేంద్రంగా ఉండేది. ప్రపంచంలో పశువుల పెంపకం, వ్యవసాయం ఆరంభం అయిన ప్రాతం ఇదని విశ్వసించబడుతుంది. తరువాత నియోలిథిక్ కాలంలో దీర్ఘచతురస్తాకారపు నివాసగృహాల నిర్మాణం జరిగింది. ప్రి పాటరీ నియోలిథిక్ ఎ కాలంలో ప్రజలు రాతిపాత్రలు, జిప్సం, కాల్చిన సున్నాన్ని వాడేవారు. ఈ ప్రాంతంలో లభించిన లావా రాళ్ళతో తయారుచేయబడిన ఉపకరణాలు ఆరంభకాల వ్యాపార సంబంధాలలు నిదర్శనంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మానవనివాసిత ప్రాంతాలలో జర్మో (సిర్కా క్రీ.పూ 7,100) హలాఫ్ నాగరికత, ఉబైద్ కాలం (క్రీ.పూ 6,500, క్రీ.పూ 3,800) ప్రధానమైనవి. ఈ కాలంలో వ్యవసాయంలో అభివృద్ధి, ఉపకరణాల తయారీ, నిర్మాణరంగ అభివృద్ధి జరిగాయి.

పురాతన ఇరాక్

ఇరాక్ 
Cylinder Seal, Old Babylonian Period, c.1800 BCE, hematite. The king makes an animal offering to Shamash. This seal was probably made in a workshop at Sippar.

ఇరాక్ చరిత్ర ఉరుక్ కాలం (క్రీ.పూ 4,000 నుండి 3,100) నుండి ఆరంభం అయింది. సుమేరియన్ నగరాలు కనుగొనబడడం, చిత్రసంకేతాలు, సిలిండర్స్ సీల్స్ పురాతన చరిత్రకు ఆధారులుగా ఉన్నాయి. ఆధునిక ఇరాక్ ప్రాంతం" ది క్రేడిల్ ఆఫ్ సివిలిజేషన్ "గా తరచుగా వర్ణించబడుతుంది. ఇరాక్ ఆరంభకాల నాగరికతకు నిలయం అని విశ్వసించబడుతుంది. ఇరాక్ దక్షిణప్రాంతంలో టిగ్రిస్-యూఫ్రేట్స్ నదీ మైదానాలలో విలసిల్లిన సుమేరియన్ నాగరికత (ఉబైద్ కాలం) ఇరాక్ ఆరంభకాలనాగరికతగా భావించబడుతుంది.

లిపి రూపకల్పన , నగర నిర్మాణం

క్రీ.పూ 4 వ సహస్రాబ్ధంలో మొదటి వ్రాతవిధానం (చిత్రసంకేతాలు) , నమోదైన చరిత్ర ఆరంభం అయింది. సుమేరియన్లు మొదటి చక్రం జీను , నగర రాజ్యాంగం కనిపెట్టారు. వారు వ్రాతలద్వారా గణితం, ఖగోళరశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, లిఖితం చేయబడిన చట్టం, వైద్యం , వ్యవస్థీకృత మతం నమోదుచేసారు. సుమేరియన్లు వారికే ప్రత్యేకమైన మాట్లాడేవారు. ఈ భాష సెమిటిక్, ఇండో- యురేపియన్, అఫ్రో ఆసియాటిక్ మొదలైన భాషలకంటే ప్రత్యేకమైనది ఏ ఇతర భాషలతో సంబంధం లేనిదై ఉంటుంది. సుమేరియన్ నగరాలలో ఎరిదు, బాద్ - తిబిరియా, లర్సా, సిప్పర్, షురుప్పక్, ఉరుక్, కిష్ (సుమర్), ఉర్, నిప్పూర్, లగాష్, గిర్సు, ఉమ్మ, హమాజి, అదాబ్, మరి (సిరియా), ఇస్ని, కుథ, డర్ , అషక్ ప్రధానమైనవి. అసుర్, అర్బెలా (ఆధునిక ఇర్బిల్) , అర్రప్క్గ (ఆధునిక కిర్కుక్) ప్రాంతాలు క్రీ.పూ 25 వ శతాబ్దం నుండి అస్సిరియన్ ప్రాంతంలో భాగంగా ఉండేవి. ఆరంభకాలంలో ఇవి కూడా సుమేరియన్ నిర్వహణలో ఉండేవి.

ఇరాక్ 
Victory stele of Naram-Sin of Akkad.

మొదటి సామ్రాజ్యం

క్రీ.పూ 26వ శతాబ్దంలో లగాష్‌కు చెందిన ఎన్నతం స్థాపించిన సంరాజ్యం ప్రపంచంలో మొదటిదని విశ్వసిస్తున్నారు. ఇది కొంతకాలం మాత్రమే కొనసాగింది. తరువాత ఉమ్మ పురోహిత రాజు లుగాల్ - జగె- సి మొదటి లగాష్ సాంరాజ్యాన్ని త్రోసివేసి ఈ ప్రాంతాన్ని జయించి ఉరుక్ నగరాన్ని రాజధానిగా చేసి పాలించాడు. తరువాత సాంరాజ్యాన్ని మధ్యధారా ప్రాంతంలోని పర్షియా సముద్రం వరకు విస్తరించాడు. ఈ కాలంలో ఆవిర్భవించిన " గిల్గమేష్ " కావ్యంలో " ది గ్రేట్ ఫ్లడ్ " (మహా వరద) గాథ చోటుచేసుకుంది. క్రీ.పూ. 3000 సెమెటిక్ ప్రజలు పశ్చిమప్రాంతం నుండి ఇరాక్‌లో ప్రవేశించి సుమేరియన్ల మద్య స్థిరపడ్డారు. ఈ ప్రజలకు తూర్పు సెమెటిక్ భాష వాడుకభాషగా ఉండేది. తరువాత ఈ భాషను అకాడియన్ భాషగా గుర్తించబడింది. క్రీ.పూ 29 వ శతాబ్దం నుండి అకాడియన్, సెమెటిక్ పదాలు వివిధ నగరపాలిత రాజులజాబితాలో చేరాయి.

సుమేరియన్ - అకాడియన్ నాగరికత

క్రీ.పూ. 3 వ సహస్రాబ్ధంలో సుమేరియన్, అకాడియన్ ప్రజల మద్య సుముఖమాన సహజీవనం ఏర్పడింది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో ద్విభాషా సంప్రదాయం కూడా అభివృద్ధి చెందింది. సుమేరియన్లు, అకాడియన్ల ప్రభావంతో నిఘంటు రూపకల్పన, వాక్యనిర్మాణ, పదనిర్మాణ, వర్ణ నిర్మాణ సమన్వయ భాషారూపం రూపొందించబడింది. ఈ ప్రధాన ప్రభావం పరిశోధకులకు క్రీ.పూ 3 వ సహస్రాబ్ధ పరిశోధనలపట్ల ఆసక్తిని కలిగించింది. ఈ కాలం నుండి ఇరాక్ ప్రాంతంలో సుమేరియన్- అకాడియన్ నాగరికత ప్రారంభకాలం మొదలైంది.

ఇరాక్ 
Bill of sale of a male slave and a building in Shuruppak, Sumerian tablet, circa 2600 BCE.

క్రీ.పూ 29, 24 శతాబ్ధాల మద్య ఇరాక్ ప్రాంతంలో అకాడియన్ వాడుక భాష కలిగిన రాజమంశాలు పలు రాజ్యాలు, నగరాలు స్థాపించరు.వీటిలో అస్సిరియా, ఎకల్లాటం, ఇసిన్, లార్సా రాజ్యాలు ప్రధానమైనవి.

అకాడియన్ సామ్రాజ్యం

అకాడియన్ సామ్రాజ్యం (క్రీ.పూ 2335-2135) స్థాపించే వరకు సుమేరియన్లు ఈ ప్రాంతం మీద ఆధిక్యత కలిగి ఉన్నారు. ఇరాక్ కేంద్రప్రాంతంలో అకాడియన్లు అకాడ్ నగర నిర్మాణం చేసి దానిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగించారు. అకాడ్ సరగాన్ వాస్తవానికి రాబ్షకే సుమేరియన్ రాజు సామ్రాజ్యస్థాపన చేసి అస్సిరియన్‌కు చెందిన మద్యప్రాంతం, దక్షిణప్రాంతంలోని నగరాలు, రాజ్యాలన్నింటిని స్వాధీనం చేసుకుని సుమేరియన్లను, అకాడియన్లను ఒకే రాజ్యపాలనలోకి చేర్చాడు. తరువాత రాబ్షకే సామ్రాజ్య విస్తరణలో భాగంగా పురాతన ఇరాన్ లోని గుటియుం, ఎలాం, సిస్సియా (ఏరియా), తురుక్కు ప్రాంతాలను, పురాతన సిరియాలోని హుర్రియన్, లూవియన్, హట్టియన్ (అనటోలియా), ఎల్బా, అమోరిటెస్ ప్రాంతాలను జయించి సామ్రాజ్యంలో విలీనం చేసాడు.

అకాడియంసామ్రాజ్య పతనం

క్రీ.పూ 22 వ శతాబ్దంలో అకాడియన్ సామ్రాజ్యం పతనం తరువాత దక్షిణ ప్రాంతాన్ని కొన్ని దశాబ్ధాల కాలం గుటియన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రాంతంలో అస్సిరియన్లు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తరువాత సుమేరియన్లు తిరిగి కూడదీసుకుని నియో - సుమేరియన్ సామ్రాజ్యం స్థాపించారు. సుమేరియన్లు రాజా షుల్గి నాయకత్వంలో ఉత్తర అస్సిరియన్ ప్రాంతాలను మినహా ఇరాక్ ప్రాంతం అంతటినీ ఆక్రమిచుకున్నారు.

క్రీ.పూ 2004 లో ఎలామిటియన్లు దాడి తరువాత సుమేరియన్ల పాలన ముగింపుకు వచ్చింది. క్రీ.పూ 21 వ శతాబ్దం మద్యకాలం నాటికి ఉత్తర ఇరాక్ ప్రాంతంలో అకాడియన్ వాడుక భాషగా కలిగిన అస్సిరియన్ రాజ్యం స్థాపించబడింది. అది క్రమంగా విస్తరించబడి ఈశాన్యభూభాగం, మద్య ఇరాక్, తూర్పు అనటోలియా చేర్చి పురాతన అస్సిరియన్ రాజ్యం (సిర్కా క్రీ.పూ. 2035-1750)స్థాపించబడింది. మొదటి పుజూర్- అషుర్, సర్గాన్, ఇలుషుమా, మొదటి ఎరిషుం రాజులు రాజ్యాంగ చట్టాలను వ్రాతబద్ధం చేసారు. దక్షిణ ప్రాంతంలో అకాడియన్ వాడుక భాషగా ఇసిన్, లర్సా, ఎషున్నా రాజ్యాలు పాలించాయి.

క్రీ.పూ 20 వ శతాబ్దంలో కన్నైటే భాషను వాడుక భాషగా కలిగిన వాయవ్యసెమెటిక్ అంరోటీస్ దక్షిణ మెసపటోమీయాకు వలసపోవడం ఆరంభించారు. తరువాత వారు దక్షిణ భూభాగంలో చిన్న చిన్న రాజ్యాలు స్థాపించారు. అలాగే ఇసిన్, లార్సా, ఎషున్నా నగరరాజ్యాలను ఆక్రమించుకున్నారు.

చిన్న రాజ్యాలు

ఇరాక్ 
Hammurabi, depicted as receiving his royal insignia from Shamash. Relief on the upper part of the stele of Hammurabi's code of laws.

క్రీ.పూ 1840లో స్థాపించబడిన ఈ చిన్నరాజ్యాలలోని ఒక రాజ్యంలో బాబిలోనియా పట్టణం ఉంది. క్రీ.పూ. 1792 లో అమోరైట్ పాలకుడు హమ్మురబి ఈ రాజ్యనికి రాజయ్యాడు. ఆయన బాబిలోనియాను పెద్ద నగరంగా విస్తరించి దానికి తనను రాజుగా ప్రకటించుకున్నాడు. హమ్మురబీ ఇరాక్ దక్షిణ, మద్య ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. అలాగే తూర్పున ఉన్న ఏలం, పశ్చిమంలోని మారి వరకు రాజ్యవిస్తరణ చేసాడు. తరువాత అస్సిరియన్ రాజు ఇష్మె- డాగన్ మీద యుద్ధం ప్రకటించాడు. తరువాత బాబిలోనియన్ సామ్రాజ్య స్థాపన చేసాడు.

బాబిలోనియా

హమ్మురబీ కాలం నుండి దక్షిణ ఇరాక్ బాబిలోనియాగా గుర్తించబడింది. ఉత్తర భాగంలో వందలాది సంవత్సరాల నుండి అస్సిరియన్ పాలన ఆరంభం అయింది. హమ్మురబీ పాలన ఆయన మరణం తరువాత త్వరితగతిలో ముగింపుకు వచ్చింది. అస్సిరియన్, దక్షిణ ఇరాక్ తిరిగి అకాడియన్ల హస్థగతం అయింది. బలహీనపడిన బాబిలోనియా ప్రాంతం విదేశీ అమోరిటీల ఆధీనంలో ఉండిపోయింది. తరువాత ఇండో - యురేపియన్ వాడుకభాషగా ఉన్న హిట్టే సామ్రాజ్యం (క్రీ.పూ 1595) బాబిలోనియాను స్వాధీనం చేసుకున్నది. తరువాత పురాతన ఇరాక్‌ లోని జాగ్రోస్ పర్వతప్రాంతానికి చెందిన కస్సిటీ ప్రజలు బాబిలోనియాను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారు బాబిలోనియాను 6 శతాబ్ధాల కాలం పాలించి దీర్ఘకాలం బాబిలోనియాను పాలించిన వారుగా ప్రత్యేకత సాధించారు.

తరువాత ఇరాక్ మూడు రాజ్యాలుగా విభజించబడింది : ఉత్తరంలో అస్సిరియా, దక్షిణం, మద్యప్రాంతానికి చెందిన బాబిలోనియాను కస్సిటే పాలకులు, సీ లాండ్ డైనాసిటీ దూర దక్షిణప్రాంతాన్ని పాలించారు.

అస్సిరియన్ సామ్రాజ్యం

" ది మిడిల్ అస్సిరియన్ ఎంపైర్ " (క్రీ.పూ. 1365-1020) కాలంలో అస్సిరియా ప్రపంచంలో శక్తివంతమైన సామ్రాజ్యంగా గుర్తించబడింది. మొదటి అషుర్ - ఉబాలిత్‌ కొనసాగించిన యుద్ధాల కారణంగా అస్సిరియా శత్రువైన హుర్రియన్ - మతాన్నీ సామ్రాజ్యాలను ఓడించి మూడవదిగా హిట్టితే సమ్రాజ్యాన్ని విలీనం చేసుకుంది. కస్సిటేల నుండి బాబిలోనియాను స్వాధీనం చేసుకుంది. ఈజిప్షియన్ల మీద వత్తిడిచేసి ఎలమిటేస్, ఫ్రిగియన్, కనానిటే, ఫియోనీషియన్, సిల్లియన్, గుటియన్, దిల్మునిటీ, అరామీన్ ప్రంతాలను స్వాధీనం చేసుకుంది. మిడిల్ అస్సిరియన్ సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్న కాలంలో కౌకాసస్, దిల్మున్ (ఆధునిక బహ్రయిన్), మధ్యధరా సముద్రతీరం మద్యప్రాంతం నుండి ఇరాన్ లోని జాగ్రోస్ పర్వతం వరకు ఆధిక్యత సాధించింది. క్రీ.పూ 1235 అస్సిరియా రాజు మొదటి తుకుల్టి - నినుర్తా బాబిలోన్ సింహాసనం అధిష్టించాడు.

సెమెటిక్ వలస ప్రజలు

ఇరాక్ 
Jehu, king of Israel, bows before Shalmaneser III of Assyria, 825 BC.

కాంశ్యయుగం చివరిదశలో (క్రీ.పూ.1200-900) బాబిలోనియాలో ఆందోళన నెలకొన్నది. దీర్ఘకాలం అస్సిరియన్ ఆధిక్యతలో ఉన్న బాలోనియాను కస్సిటేలు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ తూర్పు సెమిటిక్ అకాడియన్ రాజులు పశ్చిమ సెమిటిక్ ప్రజలు దక్షిణ ఇరాక్‌లో ప్రవేశించడాన్ని అడ్డగించడానికి అశక్తులు అయ్యారు. క్రీ.పూ. 11 వ శతాబ్దంలో అరామీన్లు, సుటీన్లు బాబిలోనియాలో ప్రవేశించారు. క్రీ.పూ. 10 - 9 వ శతాబ్ధాలలో అరామీన్లకు సమీప సంబంధం ఉన్న చల్డీ ప్రజలు బాబిలోనియాలో ప్రవేశించారు.

నియో అస్సిరియన్

అస్సిరియా క్షీణదశ ఆరంభం అయిన తరువాత నియో అస్సిరియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 935-605) విస్తరణ ఆరంభం అయింది. ఇది ప్రపంచంలో అత్యంత బృహత్తరమైనది, శక్తివంతమైనదిగా భావించబడుతుంది. రెండవ అదాద్ - నిరారి, అషుర్నసిర్పల్,మూడవ షల్మనేసర్, సెమిరమిస్, మూడవ తిగ్లత్- పిలెసర్, రెండవ సరగాన్, సెన్నచెరిబ్, ఎసర్హద్దాన్, అషుర్బనిపల్ మొదలైన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. తూర్పున పర్షియా, పార్థియా, ఎలాం పడమరలోని సైప్రస్, అంటియోచ్, ఉత్తరంలో కౌకాసియా, దక్షిణంలో ఈజిప్ట్, నుబియా, అరాబియా వరకు విస్తరించిన సామ్రాజ్యానికి ఇరాక్ కేంద్రంగా ఉండేది.

క్రీ.పూ. 850లో మొదటిసారిగా చరిత్రలో అరేబియన్ ప్రజల ప్రస్తావన చేయబడింది. మూడవ షల్మనెసర్ కాలంలో అరేబియన్ ద్వీపకల్పంలో అరబ్ ప్రజలు నివసించారని సూచించబడింది. ఈ కాలంలోనే చల్డియన్ల ప్రస్తావన కూడా మొదటిసారిగా చరిత్రలో చోటు చేసుకుంది.

ఈ కాలంలోనే తూర్పు అరామియాక్ ప్రాంతం నుండి తమ సామ్రాజ్యం అంతటా అస్సిరియన్లు అకాడియన్ భాషను పరిచయం చేసారు.అలాగే మెసపటోమియా అరామియాక్ ప్రాంతంలో అకాడియన్ వాడుకభాషగా మారింది. ఆధునిక కాలంలో కూడా అస్సిరియన్ సంతతిలో అకాడియన్ భాష జీవించి ఉంది.

అంతర్యుద్ధాలు

ఇరాక్ 
Relief showing a lion hunt, from the north palace of Nineveh, 645-635 BC.

క్రీ.పూ 7 వ శతాబ్దంలో అస్సిరియన్ సామ్రాజ్యం క్రూరమైన అంతర్యుద్ధాల కారణంగా ముక్కలైంది. బాబిలోనియన్లు, చల్డియన్లు, మెడేలు, పర్షియన్ ప్రజలు, పార్థియన్లు, సిథియన్లు, సిమ్మరియన్ల దాడి కారణంగా క్రీ.పూ 650 నాటికి అస్సిరియన్ సామ్రాజ్యం క్షీణావస్థకు చేరుకుంది. అస్సిరియా తరువాత కొంతకాలం మాత్రమే కొనసాగిన నియో- బాబిలోనియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 620-539) ఈ ప్రాంతాన్ని పాలించింది. నియో- బాబిలోనియన్ సామ్రాజ్యం వైశాల్యపరంగా, శక్తిపరంగా, దిఒర్ఘకాలం కొనసాగడం విషయంలో ముందున్న అస్సిరియన్ సాధించిన విజయం సాధించడంలో విఫలం అయింది. అయినప్పటికీ నియో- బాబిలోనియన్ సామ్రాజ్యం ది లెవంత్, కనాన్, అరేబియా, ఇజ్రాయిల్ రాజ్యం (సమరియా), జుడాహ్ రాజ్యల మీద ఆధిక్యత సాధించింది. అంతేకాక ఈజిప్ట్ను జయించింది. ఆరంభం నుండి బాబిలోనియాను విదేశీ రాజవంశాలు పాలించాయి. వీరిలో క్రీ.పూ. 10-9 శతాబ్ధాలలో ఇక్కడకు వలసవచ్చి స్థిరపడిన చల్డియన్లు ఉన్నారు.

అచమనిద్

క్రీ.పూ. 6 వ శతాబ్దంలో పొరున ఉన్న అచమనిద్ రాజైన సైరస్ ఓపిస్ యుద్ధంలో నియోబాబిలోనియన్ సామ్రాజ్యాన్ని ఓడించి ఇరాక్ ప్రాంతాన్ని అచమనిద్ సామ్రాజ్యంలో విలీనం చేసాడు. దాదాపు 2 శతాబ్ధాల కాలం ఈ ప్రాంతంలో అచమనిద్ పాలన కొనసాగింది. అచమనిద్‌లు బాబిలోనియన్‌ను తమ ప్రధాన రాజధానిని చేసుకున్నారు. చల్డియన్లు, చల్డియా ఈ కాలంలో రూపుమాసిపోయాయి. బాబిలోనియన్లు, అస్సిరియన్లు అచననిద్ పాలనను భరించి అభివృద్ధిచెందారు.

ఇరాక్ 
The Greek-ruled Seleucid Empire (in yellow) with capital in Seleucia on the Tigris, north of Babylon.

క్రీ.పూ.4 వ శతాబ్దంలో మహావీరుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత ఈ ప్రాంతంలో రెండు శతాబ్ధాలకాలం హెలెనిస్టిక్ నాగరికత సెల్యూసిడ్ సామ్రాజ్య పాలన కొనసాగింది. సెల్యూసిడ్లు ఈ ప్రాంతంలో ఇండో- అనటోలియన్, గ్రీక్ భాషను ప్రవేశపెట్టి ఈ ప్రాంతానికి సిరియా అని నామకరణం చేసారు. ఈ పేరు ఇండో- యురేపియన్లలో పలు శతాబ్ధాల కాలం సజీవంగా ఉంది. సెల్యులాసిడ్లు అరామియా, ది లెవంత్ ప్రాంతాలకు ఇరాక్ అస్సిరియా అని నామకరణం చేసారు.

పార్థియన్ సామ్రాజ్యం

పర్షియాకు చెందిన పార్థియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 247 - సా.శ 224) ఈ ప్రాంతాన్ని జయించింది. సా.శ 1-3 శతాబ్ధాలలో రోమన్లు పార్థియన్లతో యుద్ధం చేసి అస్సిరియా - ప్రొవింషియాను స్థాపించారు. ఇరాక్‌లోని అస్సిరియా ప్రాంతంలో క్రైస్తవం ప్రవేశించింది. తరువాత అస్సిరియా " సిరియాక్ క్రైస్తవం " నికి కేంద్రం అయింది.మెసపటోమియాకు చెందిన అనేక మంది అస్సిరియన్లు రోమన్ సైన్యంలో చేరారు.

సస్సనింద్

సా.శ 240లో పర్షియాకు చెందిన స్సనిద్ సామ్రాజ్యం నుండి మొదటి అర్దషిర్ పార్థియన్‌ సామ్రాజ్యాన్ని పడగొట్టి ఈ ప్రాంతాన్ని జయించాడు. సా.శ 250 లో సస్సనిదులు క్రమంగా చిన్న నియో అస్సిరియన్ రాజ్యాలను జయించారు. ఈ ప్రాంతం 4 శతాబ్ధాల కాలం సస్సనిద్ పాలనలో కొనసాగింది. అలాగే సస్సనిద్, బైజాంటైన్ సంరాజ్యాల మద్య సరిహద్దు, యుద్ధభూమిగా మారింది. రెండు సామ్రాజ్యాలు ఒకదానిని ఒకటి బలహీనం చేస్తూ 7 వ శతాబ్దం నాటికి పర్షియాకు చెందిన అరబ్- ముస్లిముల ఆక్రమణకు మార్గం సుగమం చేసాయి.

మద్యయుగం

ఇరాక్ 
Abbasid-era coin, Baghdad, 1244.
ఇరాక్ 
The capital city of the Abbasid Caliphate was Baghdad, c. 755.

7 వ శతాబ్దం మద్యకాలానికి అరబ్ ఇస్లామిక్ విజయంతో ఇరాక్‌ప్రాంతంలో ఇస్లాం సామ్రాజ్యం స్థాపించబడింది. ఫలితంగా ఇరాక్‌ ప్రాంతానికి అరేబియన్లు ప్రవాహంలా వచ్చి చేరారు. రషిదున్ కాల్ఫేట్ పాలనాకాలంలో ప్రవక్త ముహమ్మద్ కజిన్, అల్లుడు, అలి (4 వ కలిఫాగా అయిన తరువాత) తన రాజధానిని కుఫాకు మార్చుకున్నాడు. 7వ శతాబ్దంలో ఇరాక్ ప్రమ్ంతాన్ని ఉమయ్యద్ కలిఫేట్ పాలించాడు.

8వ శతాబ్దంలో అబ్బాసిద్ కలిఫేట్ బాగ్దాద్ నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిని చేసుకున్నాడు. తరువాత బాగ్దాద్ 5 శతాబ్ధాలకాలం ముస్లిం, అరబ్ ప్రపంచంలో ప్రముఖ మహానగరంగా విలసిల్లింది. మద్య యుగంలో బాగ్దాద్ నగరం బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలకు నిలయంగా మారింది. నగర జనాభా 1 మిలియన్ దాటింది. ఇస్లామిక్ స్వర్ణయుగానికి బాగ్దాద్ కేంద్రంగా మారింది. 13వ శతాబ్దంలో బాగ్దాద్ మీద మంగోలియన్లు దాడిచేసిన సమయంలో మంగోలియన్లు నగరాన్ని చాలావరకు ధ్వంసం చేసారు.

ఇరాక్ 
The sack of Baghdad by the Mongols.

1257 లో హులగు ఖాన్ బృహత్తరమైన సైన్యాన్ని సమీకరించి మంగోల్ సామ్రాజ్యపు సేనలను నదిపించి బాగ్దాద్ మీద దండెత్తాడు. వారు ముస్లిం రాజధానిని చేరుకున్న తరువాత హులుగుఖాన్ లొంగిపొమ్మని నిర్బంధించాడు. అయినప్పటికీ అబ్బాసిద్ కలీఫా " అల్- ముస్తాసిం " అందుకు నిరాకరించాడు. ఇది హులగును ఆగ్రహానికి గురిచేసి బాగ్దాద్ మీద తీవ్రంగా దాడిచేసి బాగ్దాద్‌ను స్వాధీనం (1258) చేసుకుని నిర్వాసితులను పెద్ద ఎత్తున ముకుమ్మడి హత్యలు చేయించాడు. Estimates of the number of dead range from 200,000 to a million. మంగోలీలు అబ్బాసిద్ కలిఫేట్, బాగాద్ " హౌస్ ఆఫ్ విషడం " లను (ఇందులో విస్తారమైన చారిత్రక ప్రధానమైన విలువైన దస్తావేజులు ఉన్నాయి) ధ్వంసం చేసారు. తరువాత బాగ్దాద్ నగరం తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోలేదు. కొంతమంది చరిత్రకారులు మంగోలియన్లు మెసపటోమియాను ఒక సహస్రాబ్ధం కంటే అధికంగా సుసంపన్నం చేసిన నీటిపారుదల నిర్మాణాలను చాలావరకు ధ్వంసం చేసారని భావిస్తున్నారు. మిగిలిన చరిత్రకారులు నేలలో లవణీయత అధికరించిన కారణంగా వ్యవసాయం క్షీణించిందని భావిస్తున్నారు. 14వ శతాబ్దంలో " బ్లాక్ డెత్ " ఇస్లామిక్ ప్రంపంచాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దాడి కారణంగా దాదాపు ప్రజలలో మూడవ వంతు మరణించారని భావిస్తున్నారు. 1041లో మంగోలియన్ యుద్ధవీరుడు తమర్లనే (తిమూర్ లెంక్) ఇరాక్ మీద దాడి చేసాడు. బాగ్దాద్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత దాదాపు 20,000 మంది హత్యచేయబడ్డారు. తిమూర్ ప్రతిసైనికుడు తప్పక కనీసం రెండు శిరసులను ఖండించి తీసుకువచ్చి తనకు చూపాలని ఆదేశించాడు. పలు సైనికులు తిమూర్ ఆదేశాలకు భయపడి ముందుగా ఖైదుచేయబడిన ఖైదీల తలలను తీసుకువచ్చారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తిమూర్ అస్సిరియన్ ప్రజలు, క్రైస్తవులు, లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడి హత్యలను సాగించాడు. ఈ కాలంలోనే పురాతనమైన అస్సిరియన్ నగరం అసుర్ దాదాపు నిర్మానుష్యం అయింది.

ఓట్టమన్ ఇరాక్

ఇరాక్ 
1803 Cedid Atlas, showing the area today known as Iraq divided between "Al Jazira" (pink), "Kurdistan" (blue), "Iraq" (green), and "Al Sham" (yellow).

14-15 శతాబ్ధాలలో ఇరాక్ ప్రాంతం బ్లాక్ షీప్ తుర్క్మెన్ పాలనలో ఉండేది. 1466 లో వైట్ షీప్ తుర్క్మెన్ బ్లాక్ షీప్ తుర్క్మెన్‌లను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1508లో వైట్ షీప్ తుర్క్మెన్ ప్రాంతమంతటినీ ఇరాన్కు చెందిన సఫావిద్‌లు ఆక్రమించుకున్నారు. తుర్కో - ఇరానియన్ శతృత్వం (సఫావిద్, ఓట్టమిన్ తుర్కులు) కరణంగా రెండు సాంరాజాల మద్య వందసంవత్సరాల కంటే అధిక కాలంలో జరిగిన వరుస యుద్ధాలకు ఇరాక్ వేదిక అయింది. జుహాద్ ఒప్పందం ఫలితంగా ఇరాక్ ప్రాంతం లోని అధికభాగం ఓట్టమిన్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.

17వ శతాబ్దం నాటికి సఫావిదులతో తరచుగా సంభవించిన కలహాల కారణంగా ఓట్టమిన్ సామ్రాజ్యం బలహీన పడింది. అందువలన సామ్రాజ్యంలోని భూభాగాల నిర్వహణ బలహీనపడింది.అరేబియా ద్వీపకల్పం లోని నజ్ద్ ప్రాంతం నుండి నోమాడిక్ ప్రజలు అధిక సంఖ్యలో బెడూయిన్ ప్రాంతానికి తరలి వచ్చారు. వలసప్రాంతాల మీద బెడూయిన్ ప్రజలు దాడులు నియత్రించడం కష్టమైంది.

ఇరాక్ 
English archaeologist Austen Henry Layard in the ancient Assyrian city of Nineveh, 1852.

1747-1831 మద్యకాలంలో ఇరాక్‌ను మమ్లక్ రాజవంశం (జార్జియన్ ప్రజలు) పాలించింది. వీరు ఓట్టమిన్ సామ్రాజ్యం బలహీన పడిన తరువాత స్వయంప్రతిపత్తి సాధించారు. 1831లో ఓఓట్టమిన్ మమ్లక్ ప్రజలను త్రోసివేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని పాలన సాగించారు. సా.శ. 800 నాటికి ఇరాక్ జనసంఖ్య 30 మిలియన్లకు చేరుకుంది. 20వ శతాబ్ధపు ఆరభకాలానికి జనసంఖ్య 5 మిలియన్లు మాత్రమే ఉంది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఓట్టమిన్ జర్మనీ, సెంట్రల్ పవర్ వైపు నిలిచింది. మెసపొటోమియన్ యుద్ధంలో సెంట్రల్ పవర్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్డం సైన్యం ఈ ప్రాంతం మీద దాడి చేసింది. ఆరంభంలో టర్కీ సైన్యం యునైటెడ్ కింగ్డాన్ని ఓడించింది. అయినప్పటికీ బ్రిటిష్ ప్రాంతీయంగా ఉన్న అస్సిరియన్, అరబ్బుల సహకారంతో తిరిగి శక్తిని కూడాదీసుకున్నది. 1916 లో " స్కై పైకాట్ " ఒప్పందం ఆధారంగా పశ్చిమ ఆసియాలో " పోస్ట్- వార్ డివిషన్ " ఏర్పాటు చేసింది. 1917 లో బ్రిటిష్ సరికొత్త కూటమితో బాగ్దాద్‌ను స్వాధీనం చేసుకుని ఓట్టామిన్ సామ్రాజ్యాన్ని ఓడించింది. 1918లో యుద్ధవిరమణ సంతకాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో ఓట్టామిన్ ఓటమిపాలై ఇరాక్ ప్రాంతంలో అత్యధిక భాగం బ్రిటన్ వశం అయింది. బ్రిటిష్ మెసపటోమియా యుద్ధంలో 92,000 మంది సైనికులను కోల్పోయింది. ఓట్టామిన్ నష్టం గణించబ డనప్పటికీ 45,000 సైనికులను బ్రిటన్ యుద్ధఖైదీలుగా చేసింది. 1918 లో ఈ ప్రాంతంలో 4,10,000 మందిని నియమించింది. వీరిలో 1,12,000 మంది సైనిక బృదాలలో నియమించబడ్డారు. [ఆధారం చూపాలి]

బ్రిటిష్ పాలన , స్వతంత్ర రాజ్యం

ఇరాక్ 
British troops in Baghdad, June 1941.

1920 నవంబరు 11 న ఇరాక్ బ్రిటిన్ నియంత్రణలో " లీగ్ ఆఫ్ నేషంస్ మేండేట్ "లో భాగం (బ్రిటిష్ మేండేట్ ఆఫ్ మెసపొటోమియా) అయింది. బ్రిటిష్ హాషెమైట్‌ను ఇరాక్ రాజుగా నియమించింది. తరువాత బ్రిటన్ సున్నీ అరబ్ మేధావులను ఈప్రాంతానికి ప్రభుత్వాధికారులుగా , మంత్రులుగా నియమించింది. [specify][page needed] 1920 లో బానిస వ్యాపారం తొలగించబడింది. 1932 లో బ్రిటిష్ " కింగ్డం ఆఫ్ ఇరాక్ "కు స్వతంత్రం మంజూరు చేసింది. ఫైసల్ అభ్యర్ధన మీద బ్రిటన్ మిలటరీ బేసులను తన ఆధీనంలో ఉంచుకుంది. అస్సిరియన్ లెవీస్ పేరిట సైనికదళం , సైనికదళం రవాణా కూడా బ్రిటిష్ ఆధీనంలో ఉంది. 1933 లో మొదటి ఫైసల్ మరణించిన తరువాత ఘాజీ నామమాత్రపు రాజుగా పాలనా బాధ్యత నిర్వహించాడు. 1939లో ఘాజీ మరణించిన తరువాత ఆయన కుమారుడు రెండవ ఫైసల్ చిన్నవయసులోనే పాలనా బాధ్యతలు వహించాడు. ఫైసల్ మైనారిటీ తీరేవరకు అబ్ద్ - అల్- లాహ్ రాజప్రతినిధిగా బాధ్యత వహించాడు.

1941 ఏప్రెల్ 1 న రషీద్ - అలి అల్ - గయ్లని , గోల్డెన్ స్క్వైర్ సభ్యులు ఇరాకీ తిరుగుబాటును లేవదీసి అబ్ద్- అల్- లాహ్‌ ప్రభుత్వాన్ని తొలగించారు. తరువాత సంభవించిన ఆంగ్లో - ఇరాకీ యుద్ధం సమయంలో యునైటెడ్ కింగ్డం (బ్రిటిష్ అప్పటికీ ఇరాక్‌లో ఎయిర్ బేసులను స్వాధీనంలో ఉంచుకుంది) ఇరాక్ మీద దాడి చేసింది. రషీద్ - అలి ప్రభుత్వం ఆయిల్ సరఫరాను నిలిపివేస్తుందని భయపడడమే దాడికి కారణం. మే 2 వ తారీఖున ఆరంభం అయిన యుద్ధంలో బ్రిటన్‌కు అస్సిరియన్ లెవీ దళం సహకరించింది. యుగ్ఘంలో ఐ- గేలానీ సైన్యం ఓటమి తరువాత యుద్ధవిరమణ ప్రకటించబడింది. హషెమైట్ రాజ్యం పునరుద్ధరించిన తరువాత సైన్యం ఇరాక్‌ను స్వాధీనం చేసుకుంది. 1947 అక్టోబర్ 26 న ఆక్రమణ ముగింపుకు వచ్చింది. 1954 వరకు బ్రిటన్ ఇరాక్ బేసులపై అధీనత కలిగి ఉంది.

రిపబ్లిక్

ఇరాక్ 
The 14 July Revolution in 1958.

1958 లో 14 జూలై తిరుగుబాటు పేరుతో మొదలైన తిరుగుబాటు రాజరిక వ్యవస్థను ముగింపుకు తీసుకువచ్చింది. " బ్రిగేడియర్ జనరల్ అబ్ద్- కరీమ్- క్వాసిం " అధికారం పదవిని చేపట్టినా 1963 ఫిబ్రవరి ఇరాకి తిరుగుబాటుతో ఆయనను తొలగించి కల్నల్ అబ్దుల్ సలాం అరిఫ్ అధికారపీఠం అధిష్టించాడు. 1966 లో కల్నల్ అబ్దుల్ సలాం అరిఫ్ మరణించిన తరువాత ఆయన సోదరుడు అబ్దుల్ రహమాన్ అరిఫ్ అధికారం చేపట్టాడు. 1968 లో అబ్దుల్ రహమాన్ అరిఫ్‌ను అధికారం నుండి తొలగించి బాత్ పార్టీ అధికారబాధ్యతలు స్వీకరించింది. అహ్మద్ హాసన్ అల్ బక్ర్ మొదటి బాత్ ఇరాక్ అధ్యక్షుడయ్యాడు. అయినప్పటికీ ఉద్యమం క్రమంగా జనరల్ సదాం హుస్సేన్ నియంత్రణలోకి మారిన తరువాత సదాం హుస్సేన్ అధ్యక్షపదవిని వహించి ఇరాకి రివల్యూషనరీ కమాండ్ కౌంసిల్ నియంత్రణ తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

1979 ఇరానియన్ తిరుగుబాటు విజయవంతంగా ముగిసిన తరువాత సదాం హుస్సేన్ ఇరాన్లో సంభవించిన మార్పులను స్వాగతిస్తూ అయొతుల్లాహ్ ఖొమేనితో సత్స్ంబంధాలు మెరుగుపరచాడు. అయినప్పటికీ ఖొమేని ఇరాక్‌లో ఇస్లాం విప్లవానికి బహిరంగ పిలుపును ఇస్తూ షియా ముస్లిముల ఆయుధీకరణ శక్తివంతం చేసి సదాం హుస్సేన్ పాలనకు వ్యతిరేకంగా కుర్దిష్ తిరుగుబాటును ప్రోత్సహించాడు. ఇరాకి పై అధికారులను కాల్చివేయమని కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. తరువాత మాసాలలో రెండు దేశాల మద్య సరిహద్దు ఘర్షణలు అధికం అయ్యాయి. 1980లో సదాణ్ హుస్సేన్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాడు. 1982లో ఇరాక్ ఇరాన్ నుండి వైదొలగింది. తరువాత 6 సంవత్సరాలకాలం ఇరాన్ ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది.1988లో యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం కారణంగా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 1981లో ఇజ్రాయిల్ ఒసిరక్ వద్ద ఉన్న ఇరాకీ న్యూక్లియర్ మెటీరియల్ టెస్టింగ్ రియాక్టర్ మీద బాంబులు వేసారు. ఇరాక్ ఇరాన్‌కు వ్యతిరేకంగా రసాయన ఆయుధాల తయారీ చేపట్టింది. ఇరాన్- ఇరాక్ యుద్ధం చివరిదశలో బాత్ ఇరాకీ పాలన జాతిహత్యలకు వేదికగా మారింది. యుద్ధంలో ఇరాకీ కుర్దీలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ కొనసాగింది. యుద్ధంలో 50,000 - 1,00,000 మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు.1990 ఆగస్టులో ఇరాక్ పొరుగున ఉన్న కువైట్ మీద దాడి చేసింది. యునైటెడ్ స్టేట్స్ జోక్యంతో ఇది చివరకు గల్ఫ్ యుద్ధంగా పరిణమించింది. సంకీర్ణ దళాలు ఇరాకీ మిలటిరీని లక్ష్యంగా చేసుకుని బాంబులదాడి చేసారు. తరువాత సంకీర్ణ దళాలు ఇరాకీ సైనిక దళాలకు వ్యతిరేకంగా 100 గంటల భూమార్గ దాడి చేసి కువైట్‌ను విడిపించారు. షియా, కుర్దిష్ ఇరాకీలు 1991లో సదాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. ఇరాకీ సెక్యూరిటీ దళాలు, రసాయన ఆయుధాలప్రయోగంతో తిరుగుబాటును విజయవంతంగా అణిచివేసారు. ఈ సంఘర్షణలో పౌరులతో సహా 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటు సమయంలో యు.ఎస్., యు.కె., ఫ్రాన్స్, టర్కీ అఖ్యరాజ్యదమితి అంగీకారంతో షియా, కుర్దిష్‌లను కాపాడడానికి " ఇరాకీ- నో- ఫ్లై జోంస్ " అధికారం సాధించారు.

ఐక్యరాజ్యసమితి రసాయన, బయోలాజికల్ ఆయుధలను ధ్వంసం చేయాలని ఇరాక్‌ను ఆదేశించింది.1990లో అఖ్యరాజ్యసమితి ఇరాక్ మీద నిర్భంధాలను సడలించినప్పటికీ ఇరాక్ నో- ఫ్లై జోంస్ లోని యు.ఎస్. ఎయిర్ క్రాఫ్ట్ మీద బాంబు దాడి చేయడం " యు.ఎస్. బాంబింగ్ ఆఫ్ ఇరాక్ ఇన్ డిసెంబర్ (1998) " సంఘర్షణకు దారితీసింది. 9/11 తీచ్రవాదుల దాడి తరువాత యు.ఎస్. అధ్యక్షుడు జార్జ్ డబల్యూ బుష్ సదాం హుస్సేన్ ప్రభుత్వం పడగొట్టడానికి ప్రణాళిక వేసాడు. 2002 అక్టోబరు యు.ఎస్ కాంగ్రెస్ ఇరాక్‌కు వ్యతిరేకంగా సైనికదళాలను నడిపించ డానికి అనుమతించింది. 2002 నవంబరు ఐక్యరాజ్యసమితి ఇరాక్ మీద దాడికి అంగీకారం తెలిపింది. 2003 లో సంకీర్ణదళాలు ఇరాక్ మీద దాడి చేసాయి.

2003–2007

ఇరాక్ 
The April 2003 toppling of Saddam Hussein's statue in Firdos Square in Baghdad shortly after the Iraq War invasion.

2003 మార్చి 20న యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంకీర్ణదళాలు ఇరాక్ మీద దాడి చేసాయి. మాస్ డిస్ట్రక్షన్ వెపంస్ తొలగించడంలో విఫలం అయిందన్న కారణంతో యుద్ధం ప్రకటించబడింది. తరువాత ప్రకటించబడిన డ్యూల్ఫర్ నివేదికను ఎవరూ విశ్వసించలేదు. దాడి తరువాత యునైటెడ్ నేషంస్ ఇరాక్‌ను పాలించడానికి " కోయిలేషన్ ప్రొవిషనల్ అథారిటీని " నియమించింది. తరువాత సున్నీ ఇరాకీ సైన్యం రద్దుచేయబడింది. మునుపటి ప్రభుత్వ అధికారులు తిరిగి ప్రభుత్వపాలనా విధులలో నియమించబడ్డారు. 40,000 మంది ఉపాద్యాయులు తమ ఉద్యోగాలు నిలబెట్టడానికి బాత్ పార్టీలో చేరారు. యుద్ధానంతర పరిస్థితులు చక్కబెట్టడానికి ఈ చర్యలు తీసుకొనబడ్డాయి. యు.ఎస్ సంకీర్ణదళాలకు వ్యతిరేకంగా సాగించిన ఇరాకీ విప్లవం (2003 - 2006) 2003 వేసవిలో మొదలైంది. మునుపటి రహస్య పోలిస్, సైనికదళాలు గొరిల్లా బృందాలుగా యుద్ధంలో పాల్గొన్నాయి. వీరు జీహాద్ సైనికబృందాలుగా సంకీర్ణదళాలను లక్ష్యంగా చేసుకుని ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ విప్లవంలో సున్నీ ముస్లిములకు, షియా ముస్లిములకు మద్య సంఘర్షణలు చెలరేగాయి.

ఇరాక్ 
US Marines patrol the streets of Al Faw, October 2003.

2003 లో ముక్వతదా అల్- సద్ర్ మహ్ది సైనికదళం పేరుతో షియా సైనికదళాన్ని రూపొందించాడు.—began to fight Coalition forces in April 2004. 2004 లో షియా ముస్లిములు సున్నీ ముస్లిములు పరస్పరం కలహించుకున్నారు. 2004 లో ఇరాకీ మద్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. సంకీర్ణ దళాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ మాసంలో మొదటి ఫల్లుజా యుద్ధం, నవంబరు మాసంలో రెండవ ఫల్లుజా యుద్ధం జరిగింది. సున్నీ ముస్లిముల సైన్యం " జమాత్ 2004 అక్టోబర్‌లో అల్- తవిద్ వల్ - జిహాద్ " ఇరాక్‌లో " అల్ - క్వదా ఇరాక్ "గా రూపుమార్చుకుని సంకీర్ణదళాలను , పౌరులను లక్ష్యంగా చేసుకుని (ప్రధానంగా షియా ముస్లిములకు వ్యతిరేకంగా) పోరాటం సాగించింది.2005 జనవరిలో ఇరాకీ మొదటి పార్లమెంటు ఎన్నికల తరువాత కూడా దాడులు కొనసాగాయి. అక్టోబర్ మాసంలో ఇరాక్ రాజ్యంగం అనుమతి పొందిన తరువాత డిసెంబర్‌లో తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2004 లో 26,496 మరణాలు 2005 నాటికి 34,131కి చేరుకుంది. 2006 నాటికి యుద్ధం తీవ్రరూపం దాల్చింది. హదితా మరణాలు అధికసంఖ్యలో వెలుగులోకి వాచాయి. యు.ఎస్. సైనిక దళం అల్- క్వదా నాయకుడు అబు ముసాద్ అల్ జార్క్వా చంపింది. మునుపటి ఇరాక్ నియంత సదాం హుస్సేన్‌కు మరణశిక్ష విధించి ఉరశిక్ష నెరవేర్చబడింది. 2006 యు.ఎస్ ప్రభుత్వం ఇరాకీ స్టడీ గ్రూప్ ఇరాకీ సైనికదళానికి శిక్షణ ఇవ్వాలని సిఫారసు చేసాయి. 2007 లో జార్జి డాఅబల్యూ బుష్ ఆదేశంతో ఇరాక్‌లో యు.ఎస్. సైన్యం మొహరిచబడింది. 2007 మే మాసంలో ఇరాక్ పార్లమెంటు యు.ఎస్. దళాలను, సంకీర్ణ దళాలను వెనుకకు తీసుకొమ్మని పిలుపు ఇచ్చాయి.యు.కె. , డెన్మార్క్ దేశాలు తమదళాలను వెనుకకు తీసుకున్నాయి. ఇరాక్ యుద్ధంలో 1,51,000 మంది ఇరాకీలు మరణించారు.

2008–ఆధునిక కాలం

2008లో కూడా యుద్ధం కొనసాగింది. తీవ్రవాదులకు వ్యతిరేకంగా కొత్తగా శిక్షణ పొందిన ఇరాక్ సైనికులు నియమించబడ్డారు. ఇరాక్ ప్రభుత్వం " యు.ఎస్.- ఇరాక్ స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ ఒప్పందం మీద సంతకం చేసింది. ఒప్పందం కారణంగా 2009 జూన్ 30 నుండి 2011 డిసెంబరు 31 నాటికి యు.ఎస్. దళాలు ఇరాక్‌ను వదిలి వెళ్ళాలని వత్తిడి తీసుకురాబడింది. 2009 లో యు.ఎస్. సైనికదళం రక్షణ బాధ్యతను ఇరాక్ సైనిక దళాలకు అప్పగించి ఇరాకీ దళాలతో కలిసి పనిచేయసాగారు. 2011 డిసెంబరు 18 న ఉదయం యు.ఎస్. దళాలు పూర్తిగా ఇరాక్‌ను వదిలి వెళ్ళాయి. తరువాత నేరాలు, హింస అధికం అయ్యాయి. 2011లో యు.ఎస్. దళాలు తొలగిన తరువాత తిరుగుబాటు కొనసాగింది. ఇరాక్ రాజకీయ అస్థిరతతో బాధపడింది. 2011లో అరబ్ స్ప్రిగ్ నిరసనలు ఇరాక్ అంతటా వ్యాపించాయి. అయినప్పటికీ నిరసనలు ఇరాక్ ప్రభుత్వాన్ని పడగొట్టలేక పోయాయి.

ఇరాక్ 
Current military situation, :
  Controlled by Iraqi government
  Controlled by the Islamic State in Iraq and the Levant (ISIL)
  Controlled by Iraqi Kurds

2012 - 2013 హింసాత్మక చర్యలు అధికం అయ్యాయి. సిరియన్ అంతర్యుద్ధప్రభావం ఇరాక్ అంతర్గతంగా ప్రభావితం చేసింది. సున్నీ ముస్లిములు, షియా ముస్లిములు సరిహద్దు దాటి సిరియా పోరాటంలో పాల్గొన్నారు. 2012 డిసెంబరులో సున్నీ అరబ్బులు నిరసనలు (2012-13) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 2013 సున్నీ తీవ్రవాద దళాలు నౌరీ అల్ - మాలిక్ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటిస్తూ ఇరాక్ షియా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించారు. సున్నీ విప్లవకారులు (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, ది లెవత్ బృందం) తిక్రిత్, ఫలూజాహ్, మొసు మొదలైన ప్రధాననగరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పోరాటం కారణంగా వేలాది మంది ప్రజలు నివాసాల నుండి తరలించబడ్డారు. 2014 అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తరువాత " నౌరి అల్ - మాలిక్ " కేర్ టేకర్ ప్రధానమత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆగస్టు 11 న మల్కీ ప్రధాన మంత్రిగా కొనసాగడానికి హైయ్యస్ట్ కోర్టు అనుమతి మంజూరు చేసింది.. ఆగస్టు 13న ఇరాకీ అధ్యక్షుడు " హైదర్ అల్ అబ్దాది " ప్రభుత్వం రూపొందించడానికి ప్రయత్నించాడు. యునైటెడ్ నేషంస్, ది యునైటెడ్ స్టేట్స్, యురేపియన్ యూనియన్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాకీ రాజకీయవాదులు ఇరాకీ నాయకత్వం మారాలని కోరుకున్నారు. ఆగస్టు 14 న మాలిక్ ప్రధానమంత్రిత్వ బాధ్యత స్వీకరించాడు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ఈ మార్పుకు స్వాగతం పలికారు. 2014 సెప్టెంబరు 9న హైదర్ అల్ అబాది కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాను ప్రధానమంత్రిగా బాధ్యత వహించాడు. [ఆధారం చూపాలి] సున్నీ, షియా, కుర్దిష్ ముస్లిముల మద్య అంతర్గత కలహాలు ఇరాక్ మూడు ప్రాంతాలుగా విభజించబడడానికి దారి తీసాయి. ఈశాన్యంలో కుర్దిస్థాన్, పశ్చిమంలో సున్నీస్థాన్, ఆగ్నేయంలో షియాస్థాన్ ఏర్పాటు చేయబడ్డాయి.

భౌగోళికం

ఇరాక్ 
Satellite map of Iraq.

ఇరాక్ 29° - 38° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 39° - 49° డిగ్రీల తూర్పు రేఖాంలో ఉంది. ఇరాక్ వైశాల్యం 437072 చ.కి.మి. వైశాల్యపరంగా ఇరాక్ ప్రపంచంలో 58 వ స్థానంలో ఉంది. ఇరాక్ వైశాల్యపరంగా యునైటెడ్ స్టేట్‌లోని కలిఫోర్నియా రాష్ట్రంతో సమానం.

ఇరాక్‌ ప్రధానంగా ఎడారి ప్రాంతం. అయినా యూఫ్రటీసు, టిగ్రిస్ నదుల ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయభూములు ఉన్నాయి. 60,000,000 m3 (78,477,037 cu yd) జలం లభిస్తుంది. దేశం ఉత్తర ప్రాంతంలో పర్వతశ్రేణులు ఉన్నాయి. వీటిలో ఎత్తైనశిఖరం ఎత్తు 3,611 m (11,847 ft) ఉంటుంది. ప్రాంతీయంగా దీనిని " చీకా డార్ " (బ్లాక్ టెంట్) అంటారు. ఇరాక్‌లో పర్షియన్ గల్ఫ్ సముద్రం వెంట స్వల్పమైన సముద్రతీరం ఉంది. 58 km (36 mi)

వాతావరణం

ఇరాక్ లోని అధికంగా ఉపౌష్ణమండల ప్రభావితమైన వేడి పొడి వాతావరణం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత సరాసరిగా 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటిగ్రేడ్ చేరుకుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత 15-19 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. రాత్రివేళ 2-5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇరాక్‌లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. వార్షిక వర్షపాతం 250 మి.మీ ఉంటుంది. వర్షపాతం శీతలమాసాలలో అధికంగా ఉంటుంది. వేసవిలో వర్షపాతం అరుదుగా (ఉత్తర ప్రాంతంలో మాత్రమే) ఉంటుంది. ఉత్తర పర్వతప్రాంతాలు శీతలంగా ఉండి అప్పుడప్పుడూ హిమపాతం ఉంటుంది. ఒక్కోసారి ఉత్తర ప్రాంతం వరదలకు కారణం ఔతూ ఉంటుంది.

ప్రభుత్వం , రాజకీయాలు

ఇరాక్ 
Baghdad Convention Center, the current meeting place of the Council of Representatives of Iraq.

ఇరాక్ ఫెడరల్ గవర్నమెంటు ఇరాక్ రాజ్యాంగ అనుసరించి ప్రజాస్వామ్యవిధానంలో " ఫెడరల్ పార్లమెంటరీ ఇస్లామిక్ రిపబ్లిక్ "గా గుర్తించబడుతుంది. ఫెడరల్ ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్ , జ్యుడీషియల్ బ్రాంచ్ అలాగే పలు స్వతంత్ర కమీషన్లు ఉన్నాయి. ఫెడరల్ గవర్నమెంటు కాక ప్రాంతీయ ప్రభుత్వాలు, గవర్నరేట్లు , జిల్లాలు ఉన్నాయి. ప్రధాన షియా పార్లమెంటరీ బ్లాక్‌గా నేషనల్ అలయంస్ స్థాపించబడింది. " ఇరాకీ నేషనల్ మూవ్మెంట్ "కు ఇయాద్ అలాది నాయకత్వంలో పనిచేస్తుంది. దీనికి సున్నీ ముస్లిములు మద్దతు పలికారు. కుర్దిష్ సంబంధిత " కుర్దిష్ డెమొక్రటిక్ పార్టీ"కి మసూద్ బర్జానీ నాయకత్వం వహిస్తున్నాడు అలాగే " పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్థాన్ "కి జలాల్ తలబాని నాయకత్వం వహిస్తున్నాడు. లౌకిక పార్టీలైన రెండు పశ్చిమదేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. 2010 గణాంకాలను అనుసరించి రాజకీయ అస్థిరత కలిగిన దేశాలలో ఇరాక్ 7 వ స్థానంలో ఉందని తెలుస్తుంది. ప్రధానమంత్రి నౌరీ - అల్ - మలికి వద్ద కేంద్రీకృతమైన అధికారం ఇరాకీ రాజకీయ రక్షణ గురించిన ఆందోళన కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకత అధికం అయింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పులు సంభవించి 2013 నాటికి 11 వ స్థానానికి చేరుకుంది. 2014 ఆగస్ట్‌లో అల్- మాలికి పాలన ముగింపుకు వచ్చింది. " హైదర్ అల్ అబాద్ " అధికార బాధ్యత చేపట్టాడు. ఇరాకీ నో ఫ్లైజోన్ స్థాపించబడి అలాగే 1990-1991 గల్ఫ్ యుద్ధం తరువాత కుర్దిష్ ప్రజలు ప్రత్యేకంగా వారి స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని స్థాపించుకున్నారు.

చట్టం

2005 అక్టోబర్‌లో " కొత్త ఇరాక్ రాజ్యాంగం 78% ప్రజాభిప్రాయబలంతో అంగీకరించబడుతుంది. అయినప్పటికీ ప్రాంతాల వారిగా వ్యత్యాంగా ఉన్నాయి. కొత్త రాజ్యాంగానికి షియా, కుర్దిష్ ప్రజలు మద్దతుగా ఉన్నారు. దీనిని అరబ్ సున్నీ ముస్లిములు నిరాకరించారు. రాజ్యాంగ విధులను అనుసరించి 2005 డిసెంబరు 15న ఇరాకీ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మూడు ప్రధాన సంప్రదాయ ప్రజలు, అస్సిరియన్, టర్కోమాన్ అల్పసంఖ్యాకులు ఎన్నికలలో పాల్గొన్నారు. 1959లో రూపొందించబడిన 188 చట్టం (పర్సనల్ స్టేట్స్ లా) బహుభార్యత్వ సంప్రదాయాన్ని కష్టతరం చేసింది. డైవర్స్ చేసినట్లైతే పిల్లల బాధ్యత తల్లికి అప్పగించాలి. 16 సంవత్సరాల కంటే ముందు వివాహం నిషేధించబడింది. ఇరాక్‌లో షరియా కోర్టులు లేవు. సివిల్ కోర్టులు షరియా ఆధారంగా వ్యక్తిగతమైన వివాహ, విడాకుల వివాదాలు పరిషరస్తున్నాయి. 1995లో కొన్ని ప్రత్యేకమైన నేరాలకు ఇరాక్ షరియా శిక్షలను ప్రవేశపెట్టింది. ఫ్రెంచ్ సివిల్ లా ఆధారితమైన షరియా చట్టం సున్నీ, జఫారీ వివరణలు ఉంటాయి.2005 నాటికి యునైటెడ్ నేషంస్ రాజ్యాంగ ప్రతిషంభన సరిదిద్దడానికి షరియా చట్టం ఉపయోగాన్ని నిలిపివేసింది.

సైన్యం

ఇరాక్ 
Iraqi Army BMP-1 on the move.

ఇరాకీ సెక్యూరిటీ దళం హోం మిస్టరీ, రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయినప్పటికీ ఇరాకీ కౌంటర్ టెర్రరిజం బ్యూరో నివేదికలను నేరుగా ఇరాక్ ప్రధానమంత్రికి సమర్పిస్తుంది. వీటిని " ఇరాకీ స్పెషల్ ఫోర్సెస్ " పరిశీలిస్తుంది. ఇరాకీ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇరాకీ ఆర్మీ, ఇరాకీ ఎయిర్ ఫోర్స్, ఇరాకీ నౌకాదళం పనిచేస్తాయి. పెష్మెర్గా అనే ప్రత్యేక దళం కుర్దిస్థాన్ రీజనల్ గవర్నమెంటు కొరకు పనిచేస్తుంది. ఇది బాగ్దాద్ అధారిటీలో పనిచేయడానికి రీజనల్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అనిగీకరించదు. ఇరాకీ ఆర్మీలో " అబ్జెక్టివ్ కౌంటర్- ఇంసర్జెంసీ ఫోర్స్ "లో 14 విభాగాలు ఉన్నాయి. ఒక్కొక విభాగంలో 4 బ్రిగేడ్లు ఉన్నాయి. కౌటర్ - ఇంసర్జెసీకి వ్యతిరేకంగా పోరాడడంలో ఇది సహకరిస్తుంది. లైట్ ఇంఫాంటరీ బ్రిగేడులలో తక్కువస్థాయిలో ఆయుధాలు, మెషిన్ గన్లు, ఆర్.పి.జిలు, బాడీ ఆర్మౌర్ , లైట్ ఆర్మౌర్డ్ వాహనాలు ఉంటాయి. మెషనైజ్డ్ ఇంఫాంటరీ బ్రిగేడ్లు టి-54/55 ప్రధాన యుద్ధ ట్యాంకర్లు , బి.ఎం.పి-1 ఇంఫాంటరీ వాహనాలు కలిగి ఉంటుంది. 2008 మద్య కాలానికి ఆర్మీ నిర్వహణ , సరఫరా సమస్యలను ఎదుర్కొన్నది. ఇరాకీ ఎయిర్ ఫోర్స్ నిఘా , బృందాలను తరలించే పనులతో గ్రౌండ్ ఫోర్స్‌కు సహకారం అందించేలా రూపొందించబడింది. లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో రెండు నిఘా స్క్వాడులు ఉన్నాయి. బృందాలను తరలించడానికి మూడు హెలికాఫ్టర్ స్క్వాడ్స్ ఉపకరిస్తున్నాయి. ఒక ట్రాంపొరేషన్ స్క్వార్డెన్ బృందాలను తరలించడానికి, ఉపకరణాలను తరలించడానికి , సరఫరాలను చేరవేయడానికి " సి- 130 ట్రాంస్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ "ను ఉపయోగిస్తుంది.ప్రస్తుతం ఇందులో 3,000 మంది పనిచేస్తున్నారు. ఇది 2018 నాటికి 18,000 సిబ్బంది , 550 ఎయిర్ క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని ప్రణాళిక వేస్తుంది. ఇరాకీ నౌకాదళంలో 1,500 నావికులు , అధికారులు (800 మంది మేరిన్ నౌకాదళం) పనిచేస్తుంటారు. దేశాంతర జలాశయాలు , సముద్రతీర రక్షణ కొరకు రూపొందించబడింది. ఇరాకీ నౌకాదళం ఆఫ్ షోర్ ఆయిల్ ప్లాట్ఫాంస్ రక్షణ బాధ్యతను కూడా వహిస్తుంది. నౌకా దళంలో కోస్టల్ పెట్రోల్ స్క్వార్డ్స్, అసల్ట్ బోట్ స్క్వార్డ్స్ , మేరిన్ బెటాలియన్ ఉంటుంది. 2010 గణాంకాలను అనుసరించి నౌకాదళంలో 2,000 నుండి 2,500 మంది నావికులు ఉన్నారని తెలుస్తుంది.

విదేశీ సంబంధాలు

ఇరాక్ 
US President Barack Obama speaking with Iraqi President Jalal Talabani in 2009.

2008 నవంబర్ 17న యు.ఎస్. , ఇరాక్ " స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ అగ్రిమెంట్ " ఒప్పందం మీద సంతకం చేసాయి. 2005 నుండి ఇరాన్, ఇరాక్ సంబంధాలు మెరుగుపడి పరస్పరం పలుమార్లు రెండుదేశాల మద్య అధికార పర్యటనలు జరిగాయి: ఇరాకీ ప్రధానమంత్రి ఇరుదేశాల మద్య సహకారం పెంపొందించడానికి ఇరాన్‌లో పలుమార్లు పర్యటించాడు. మూస:CN 2009 డిసెంబరులో ఇరాక్ సరిహద్దులోని ఆయిల్ బావులను ఇరాన్ స్వాధీనం చేసుకుందని ఆరోపించిన తరువాత ఇరుదేశాల మద్య సంఘర్షణలు తలెత్తాయి. కుర్దిష్ రీజనల్ గవర్నమెంట్ రూపొందించిన తరువాత ఇరాకీ - టర్కీ సంబంధాలలో ఉద్రిక్తత నెలకొంది. టర్కీ, కుర్దిస్థాన్ శ్రామికుల మద్య సంఘర్షణలు కొనసాగాయి.

మానవ హక్కులు

ఇరాకీ, కుర్దిష్ ప్రజల మద్య సమీపకాలంలో సంబంధాలు క్షీణిస్తున్నాయి. అల్- అంఫల్ యుద్ధం (1980 కుర్దిష్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగించిన జాతి హత్యలు)తరువాత ఇరు వర్గాల మద్య సంబంధాలు క్షీణించాయి. 1991 తిరుగుబాటు సమయంలో పలువురు కుర్దిష్ ప్రజలు తమ స్వస్థాలలాకు, నో ఫ్లై జోంస్‌కు పారిపోయారు. 2005లో మొదటిసారిగా ఇరాక్ కుర్దిష్ అధ్యక్షుని ఎన్నిక తరువాత పరిస్థితిలో కొంత మెరుగైన స్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇరాక్‌లో అరబిక్ భాషతో కుర్దిష్ భాష కూడా అధికార భాషగా చేయబడింది.

నిర్వహణా విభాగాలు

ఇరాక్ 

ఇరాక్‌లో 9 ప్రభుత్వ ప్రాంతాలు ఉన్నాయి. (అరబిక్: ముహఫదత్. ఎకవచనం: ముహఫదా); కుర్దిష్: پارێزگا; కుర్దిష్: పరిజ్గహ్). గవర్నరేట్లు జిల్లాలుగా (క్వదాస్) విభజించబడ్డాయి. ఇరాకి కుర్దిస్థాన్: ఎర్బిల్ గవర్నరేట్, దొహుక్ గవర్నరేట్, అస్ సులేమానియాహ్ గవర్నరేట్, హలబజ గవర్నరేట్ ఉన్నాయి.

2

ఆర్ధికం

ఇరాక్ 
GNP per capita in Iraq from 1950 to 2008.
ఇరాక్ 
Global distribution of Iraqi exports in 2006.

ఇరాక్ ఆర్థికరగానికి ఆయిల్ నిల్వలు అధికంగా సహకరిస్తున్నాయి. ఆయిల్ ఎగుమతుల ద్వారా దేశానికి 95% విదేశీమారకం లభించింది. ఇతరరంగాలలో అభివృద్ధి లోపం కారణంగా నిరుద్యోగ సమస్య 18%- 30%కి చేరుకుంది.2011 గణాంకాలను అనుసరించి పబ్లిక్ రంగం 60% మందికి పూర్తి స్థాయి ఉపాధి కల్పిస్తుంది. ఆయిల్ ఎగుమతి పరిశ్రమ ఇరాక్ ఆర్థికరంగం మీద ఆధిక్యత వహిస్తుంది. ఇది స్వల్పంగా మాత్రమే ఉపాధి కల్పిస్తుంది. సమీపకాలంగా గణనీయమైన శాతం స్త్రీలు (22%) శ్రామికరంగంలో పనిచేస్తున్నారు. యు.ఎస్ ఆక్రమించడానికి ముందు ఇరాక్ " సెంట్రల్లీ ప్లాండ్ ఆర్ధిక " వ్యవస్థను కలిగి ఉంది. ఇరాక్ విదేశీ భాగస్వామ్య సంస్థలను బహిష్కరించింది. బృహత్తర వ్యవస్థలలో అధికశాతం ప్రభుత్వరంగానికి చెందినవై ఉన్నాయి. 2003 ఇరాక్ దాడి తరువాత సంకీర్ణదళాల అథారిటీ త్వరితగతిలో పలు ప్రైవేటైజేషన్ చేస్తూ విదేశీపెట్టుబడులకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇరాక్ 
Agriculture is the main occupation of the people.

2004 నవంబరు 20న పారిస్ క్లబ్ ఆఫ్ క్రెడిటెడ్ నేషంస్ ఇరాకీ ఋణంలో 80% క్లబ్ సభ్యులకు ఇవ్వడానికి అంగీకరిస్తూ సంతకం చేసాయి. 2003 దాడికి ముందు ఇరాక్ మొత్తం విదేశీ ఋణం 120 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండేది. 2004 నాటికి ఋణం 5 బిలియన్లు అధికం అయింది.2011లో ఫిబ్రవరిలో సిటి గ్రూప్ ఇరాక్‌ను 3జి దేశాలలో ఒకటిగా చేసింది. ఇరాక్ అధికారిక కరెంసీ " ఇరాక్ దినార్ " అంటారు. కోయిలేషన్ అథారిటీ సరికొత్త దినార్ నాణ్యాలను, నోట్లను జారీ చేసింది. ఫోర్జరీ చేయడం నియంత్రించే విధంగా ఇవి జారీ చేయబడ్డాయి. దాడి తరువాత 5 సంవత్సరాల తరువాత 2.4 మిలియన్ల ప్రజలు స్థానమార్పు చేయబడ్డారు. ఇరాక్ వెలుపలి నుండి 2 మిలియన్ల ఆశ్రితులు ఇరాక్ చేరుకున్నారు. 4 మిలియన్ల ఇరాకీ ప్రజలు ఆహార బధ్రత కొరతను ఎదుర్కొన్నారు. దేశంలోని పిల్లలలో 4వ వంతు పోషాకరలోపంతో బాధపడుతున్నారు. ఇరాకీ పిల్లలలో మూడవ వంతు పిల్లలకు రక్షిత నీరు లభించడం లేదు. మొదటి 5 సంవత్సరాలలో సహాయం అందించే అంతర్జాతీయ ఎన్.జి.ఒ.లను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగాయి. 94 సహాయ ఉద్యోగులు మరణించారు, 248 మంది గాయపడ్డారు, 24 మంది ఖైదు చేయబడ్డారు, 89 మంది కిడ్నాప్ చేయబడడం లేక నిర్బంధించబడ్డారు.

ఆయిల్ , విద్యుత్తు

ఇరాక్ 
Tankers at the Basra Oil Terminal.

ఆయిల్ నిలువలలో ఇరాక్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో " సౌదీ అరేబియా " ఉంది. 2012 డిసెంబరు నాటికి ఆయిల్ ఉత్పత్తి 3.4 మిలియన్ల బ్యారెల్స్‌కు చేరుకుంది. 2014 నాటికి ఇరాక్ ఆయిల్ ఉత్పత్తి 5 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుకుంది. ఇరాక్‌లో 2,000 ఆయిల్ బావులు త్రవ్వబడ్డాయి. టెక్సాస్‌లో మాత్రమే 1 మిలియన్ బావులు ఉన్నాయి. ఒ.పి.ఇ.సి.కి నిధులను అందిస్తున్న దేశాలలో ఇరాక్ ఒకటి.2010 నాటికి రక్షణ అధికరించిన కారణంగా ఆయిల్ ద్వారా బిలియన్లకొద్దీ ఆదాయం లభించింది.

నీటిపారుదల

ఇరాక్‌లో నీటిసరఫరా, పారిశుధ్యం హీనస్థాయిలో ఉంది. నీటినాణ్యత, సరఫరా హీనస్థాయిలో ఉన్నాయి. మూడుదశాబ్ధాల కాలం కొనసాగిన యుద్ధం కారణంగా పర్యావరణ రక్షణ అశ్రద్ధ చేయబడింది. నీటి పారిశుధ్యచర్యలలో అజాగ్రత్త కారణంగా నీటి కాలుష్యం అధికం అయింది. త్రాగునీటి సరఫరా ప్రాంతాలవారిగా, నగరాంతాలు, గ్రామీణ ప్రాంతాల వారిగా వేరుపడుతూ ఉంటుంది. దేశమంతటా 91% ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాలలో 77% మాత్రమే అందుబాటులో ఉంది. నగర ప్రాంతాలలో 98% త్రాగునీరు అందుబాటులో ఉంది. అయినప్పటికీ అధిక మొత్తంలో నీరు వ్యర్ధం చేయబడుతూ ఉంది.

మౌళిక వసతుల నిర్మాణం

ఇరాక్ 
Mosul Dam.

ఇరాక్‌లో పలు మౌలిక వసతుల నిర్మాణం జరుగుతున్నా ఇరాక్‌లో నివాసగృహాల కొరత ఉంది. యుద్ధబాధిత దేశంగా 2.5 మిలియన్ల నివాసగృహాల అవసరం ఉండగా కేవలం 5% మాత్రమే నిర్మాణం మాత్రమే జరిగింది.

  • 2009లో ఐ.బి.బి.సి. స్థాపించబడింది. (Iraq Britain Business Council). కౌంసిల్‌ను " బారోనెస్ నికోల్సన్(వింటర్‌బౌర్నె)" చేత స్థాపించబడింది.
  • 2009 ఆగస్టులో రెండు అమెరికన్ సంస్థలు బస్రా స్పోర్ట్ సిటీ నిర్మించడానికి ఇరాక్ చేరుకుంది. బస్రా స్పోర్ట్స్ సిటీ 2014 గల్ఫ్ కప్ ఆఫ్ నేషంస్‌కు వేదికగా ఉంది.
  • 2012 అక్టోబరులో ఎమిరాతీ ప్రాపర్టీ ఫాం, ఎమార్ ప్రాపర్టీస్ నివాసగృహాలు, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఇరాక్ చేరుకున్నాయి.
  • 2013 జనవరిలో ఎమిరతీ ప్రాపర్టీ ఫాం, నఖీల్ ప్రాపర్టీస్ " అల్ నఖీల్ సిటీ " నిర్మించడానికి ఒప్పందం మీద సంతకం చేసింది.

గణాంకాలు

మిలియన్లలో చారిత్రక జనసంఖ్య
సంవత్సరంజనాభా±%
1878 2—    
1947 4.8+140.0%
1957 6.3+31.2%
1977 12+90.5%
1987 16.3+35.8%
1997 22+35.0%
2009 31.6+43.6%
2015 37+17.1%
Source:

2009 గణాంకాలను అనుసరించి ఇరాక్ మొత్తం జనసంఖ్య 3,12,34,000. 1878 నాటికి ఇరాక్ జనసంఖ్య 2 మిలియన్లు. ఇరాక్ జనసంఖ్య యుధానంతర జనసంఖ్య 35 మిలియన్లకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. సెంట్రల్ ఇంటెల్జెంస్ ఏజెంసీ గణాంకాల ఆధారంగా ప్రజలలో 75%- 80% అరబ్బులు 15% కుర్దిష్ ప్రజలు ఉన్నారని అంచనా. అస్సిరియన్లు, ఇరాకీ తుర్క్మెన్, మిగిలిన 5%-10% ప్రజలలో మాండియన్లు, ఆర్మేనియన్లు, సిర్కాసియన్లు, ఇరానియన్లు, షబక్స్, యజిదీలు, కవ్లియాలు మొదలైన ఇతర అల్పసంఖ్యాకులు ఉన్నారు. ఇరాక్‌లో మార్ష్ అరబ్బులు 20,000 మంది ఉన్నారు. ఇరాక్‌లో చెచెన్ ప్రజలు 2,500 మంది ఉన్నారు. దక్షిణ ఇరాక్‌లో ఆఫ్రో ఇరాకీ సమూహాలు ఉన్నాయి. 9వ శతాబ్దంలో ఇస్లామిక్ కలీఫతేలో బానిస వ్యాపారానికి అనుమతి ఉండం ఇరాక్‌లో ఆఫ్రికన్ సంతతి ప్రజల ఉనికికి కారణంగా మారింది.

మతం

ఇరాక్‌లో మతం (est. 2010).

  ఇరాక్‌లో ఇస్లాం (99%)
  ఇరాక్‌లో క్రైస్తవం (1%)
ఇరాక్ 
Imam Ali Mosque in Najaf.

ఇరాక్ ముస్లిం ప్రజలు అత్యధికంగా కలిగిన దేశం. ఇస్లాం ప్రజలు 95%, అస్సిరియన్ క్రైస్తవులు 5% ఉన్నారు. ముస్లిములలో షియా, సున్నీ సంప్రదాయానికి చెందిన వారు ఉన్నారు. సి.ఐ.ఎ. ఫాక్ట్ బుక్ అంచనా అనుసరించి షియా ముస్లిములు 65%, సున్నీ ముస్లిములు 35% ఉన్నారు. 2011 ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా అనుసరించి షియా ముస్లిములు 51%, 42% సున్నీ ముస్లిములు ఉన్నారని భావిస్తున్నారు. 5% మంది తమను ముస్లిములుగా మాత్రమే నమోదుచేసుకున్నారు. సున్నీ ప్రజలు ఇరాక్ ప్రభుత్వం తమపట్ల వివక్ష చూపుతుందని భావిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి నౌరీ అల్ - మలికి నిరాకరిస్తున్నాడు. . ఇరాకీ క్రైస్తవులు 2,000 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. వీరు అధికంగా అరేబియన్లకంటే పూర్వపు మెసపొటేమియా - అస్సిరియన్ సంతతికి చెందిన వారు. క్రైస్తవుల సంఖ్య 1987లో 1.4 మిలియన్లు (8%) ఉన్నారు. 1947 లో 5,50,000 (12%) ఉన్నారు. స్థానిక నియో అరామాటిక్ మాట్లాడే ప్రజలు అధికంగా చల్డియన్ చర్చి, అస్సిరియన్ చర్చ్ ఆఫ్ ఈస్ట్, సిరియాక్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన వారై ఉన్నారు. క్రైస్తవుల శాతం 8% నుండి 12% వరకు క్షీణించిందని అంచనా వేస్తున్నారు. 2008 నాటికి ఇది 5% నికి చేరుకుంది. యుద్ధం మొదలైన నాటి నుండి ఇరాకీ క్రైస్తవులలో సగం కంటే అధికంగా పొరుగుదేశాలకు పారిపోయారు. వీరిలో చాలా మంది తిరిగి రాలేదు. తిరిగివచ్చిన వారిలో అధికంగా కుర్దిష్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం లోని అస్సిరియన్ ప్రాంతానికి చేరుకున్నారు. మాండియనిజం, షబాక్, యర్సన్, యజ్దీ సంప్రదాయాలకు చెందిన అల్పసంఖ్యాక ప్రజలుకూడా ఇరాక్‌లో నివసిస్తున్నారు. ఇరాక్ ప్రపంచ అతిపవిత్రమైన షియా ఇస్లాం ప్రదేశాలు (నజాఫ్, కర్బలా) ఉన్నాయి.

భాష

ఇరాక్ 
Kurdish children in Sulaymaniyah.

ఇరాక్‌లో అత్యధికమైన ప్రజలకు అరబిక్ భాష వాడుక భాషగా ఉంది. క్ర్దిష్ భాష 10-15% ప్రజలకు వాడుక భాషగా ఉంది. అజర్‌బైజనీ భాష కూడా ఇరాక్‌లో వాడుక భాషగా ఉంది. నియో అరామిక్ భాషను అస్సిరియన్లు, ఇతరులకు (5%) వాడుక భాషగా ఉంది.ఇతర అల్పసఖ్యాక ప్రజలలో మాండియాక్, ఎజ్దిక్, షబకి, ఆర్మేనియన్, సిర్కాసియన్, పర్షియన్ భాషలు వాడుకగా ఉన్నాయి. నియో అరామిక్ భాషలు (సిరియా లిపి ఆధారంగా), ఆర్మేనియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. 2003కు ముందు అరబిక్ భాష ఒక్కటే అధికారభాషగా ఉండేది. 2004 లో సరికొత్త ఇరాక్ రాజ్యాంగం ఏర్పడిన తరువాత అరబిక్, కుర్దిష్ భాషలు వాడుక భాషలుగా ఉన్నాయి. అస్సిరియన్ నియో- అరామిక్, తుర్క్మెన్ భాషలు వరుసగా సిరియా, తుర్క్మెన్ ప్రజల భాషలుగా ఉన్నాయి. ఇవి ప్రాంతీయ భాషలుగా భావించబడుతున్నాయి. అదనంగా ప్రాంతాల వారిగా ప్రజల ఆధిక్యతను అనుసరించి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇతర భాషలను అధికార భాషలుగా ప్రకటించాయి. ఇరాకీ రాజ్యాంగం అనుసరించి " అరబిక్ భాష , కుర్దిష్ భాష ఇరాక్ అధికార భాషల అంతస్థు కలిగి ఉన్నాయి. ఇరాకీయులకు వారి మాతృభాషలో విద్యను అభ్యసించే హక్కు ఉంది.

విదేశాల ఉద్యోగులు , ఆశ్రితులు

ఇరాక్ 
Iraqi refugees in Damascus, Syria.

2003 లో సంకీర్ణదళాలు ఇరాక్ మీద దాడి చేసిన తరువాత ఇరాక్ నుండి 2 మిలియన్ల మంది ఇరాక్‌ను వదిలి పారిపోయారని " యు.ఎన్. హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ " నివేదిక తెలియజేస్తుంది. వీరు అధికంగా సిరియా , జోర్డాన్ దేశాలకు వలస పోయారు. " ఇంటర్నల్ దిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ " అంచనా అనుసరించి 1.9 మిలియన్ దేశంలోపల స్థలమార్పిడి చేయబడ్డారు.2007 లో యు.ఎన్. 40% ఇరాకీ మద్యతరగతి ప్రజలు ఇరాక్‌ను వదిలి పోయారని భావిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడ జరుగుతున్న హింసాత్మక చర్యల కారణంగా వెనుకకు రావడానికి అయిష్టత కలిగి ఉన్నారు. ఆశ్రితులు అధికంగా పేదరికంలో మగ్గుతున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన దేశాలు వారికి ఉపాధి కల్పించడంలో విఫలం ఔతున్నాయి. సమీపకాలంలో 2007 నుండి ఇరాక్‌లో రక్షణ వ్యవస్థ బలపడిన కారణంగా ఆశ్రితులు తిరిగి స్వస్థానాలకు చేరుకుంటున్నారని దాదాపు 46,000 మంది తిరిగి వచ్చారని ఇరాక్ ప్రభుత్వం తెలియజేస్తుంది. 2011 గణాంకాలను అనుసరించి 3 మిలియన్ల ఇరాకీలు స్థలమార్పిడి చేబడ్డారని వీరిలో 1.3 మిలియన్లు ఇరాక్ నుండి , 1.6 మిలియన్లు పొరుగు దేశాలనుండి (సిరియా , జోర్డాన్) తరలించబడ్డారు. 2003లో సంకీర్ణ దళాల దాడి తరువాత ఇరాకీ క్రైస్తవులలో సగం కంటే అధికమైన ప్రజలు ఇరాక్ వదిలి పారిపోయారు. 2011 మే 25 నాటికి నాటికి " యునైటెడ్ స్టేట్స్ సిటిజంషిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ " గణాంకాలు అనుసరించి 58,811 ఇరాకీలకు " రెఫ్యూజీ - స్టేటస్ సిటిజంషిప్ " మజూరు చేయబడిందని తెలియజేస్తున్నాయి. 2012 లో సిరియా అంతర్యుద్ధం కారణంగా 1,60,000 మంది సిరియన్ ప్రజలు శరణార్ధులుగా ఇరాక్ చేరారని అంచనా.సిరియా అంతర్యుద్ధం తీవ్రరూపందాల్చిన కారణంగా సిరియాలోని ఇరాకీ ప్రజలు సిరియాను వదిలి స్వస్థలానికి చేరుకుంటున్నారు.

సంస్కృతి

ఇరాక్ ప్రభుత్వ శలవుదినాలలో " రిపబిక్ డే " (జూలై 14) , ది నేషనల్ డే (అక్టోబర్ 3).

సంగీతం

ఇరాక్ 
Iraqi maqam performer Muhammad al-Qubbanchi.

ఇరాక్ ప్రధానంగా సుసంపన్నమైన " అరేబియన్ మాక్వం " వారసత్వానికి గుర్తింపు పొందింది. మాక్వం గురువుల నుండి ఇది గురుశిష్యసంప్రదాయంగా వాచికంగా ఒకరి నుండి మరొకరికి అందించబడుతూ నిరంతరంగా కొనసాగుతుంది. మాక్వం అల్ - ఇరాకీ చాలా ఉన్నతమైన , ఖచ్చితమైన మాక్వం రూపంగా భావించబడుతుంది. అల్- మాక్వం అల్- ఇరాకీ అనేవి పద్యసంకలనాలు. ఈ కళారూపాన్ని యునెస్కో " వర్ణిపశక్యం కాని మానవత్వ వారసత్వంగా " గుర్తించింది. 20 వ శతాబ్దం ఆరంభంలో ఇరాక్‌లోని పలు ప్రముఖ సంగీతకారుల యూదులు అధికంగా ఉన్నారు. 1936 లో యూదుకు ఇరాక్ రేడియోను స్థాపించబడింది. 1930-1940 మద్యకాలంలో " జ్యూ సలీమా పాషా " ప్రముఖ గాయకుడుగా ఖ్యాతిగడించాడు. ఆ సమయంలో పాషాకు లభించిన ఆరాధన , గౌరవం అసాధారణమైనది. ఆసమయంలో స్త్రీలు సంగీత కచేరీ చేయడం అవమానకరంగా భావించేవారు. స్త్రీగాయకులగా దేవదాసీలను నియమించేవారు. ఆరంభకాల సంగీతదర్శకులలో ఎజ్రా అహ్రాన్, సంగీతవాద్య కళాకారులలో ఔద్ వాద్యకారులు సాలే , దావూద్ అల్- కువైతీ ప్రముఖులు. [ఆధారం చూపాలి]

కళలు , నిర్మాణ కళ

ఇరాక్ 
The Great Ziggurat of Ur near Nasiriyah.

ఇరాక్ రాజధానిలో ఉన్న ప్రధాన చల్చరల్ ఇంస్టిట్యూషన్ " ఇరాకి నేషనల్ సింఫోనీ ఆర్కెస్ట్రా " రిహార్సల్ , ప్రదర్శనలు ఇరాకీ దాడి సమయంలో (2003-2011) అడ్డగించబడినప్పటికీ తరువాత తిరిగి యదాస్థితికి చేరుకుంది. 2003 దాడి సమయంలో నేషనల్ దియేటర్ ఆఫ్ ఇరాక్ దీపిడీకి గురైంది. ప్రస్తుతం పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాగ్దాదులో అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లో, ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ ఆఫ్ బ్యాలెట్ స్కూల్(బాగ్దాద్) మొదలైన సంస్థలు కళాకారులకు శిక్షణ ఇస్తున్నాయి. బాగ్దాదులో " నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాక్" లో ఇందులో పురాతన ఇరాక్ కళాఖండాలు, అవశేషాలు విస్తారంగా ఉన్నాయి. ఇరాక్ దాడి సమయంలో వీటిలో కొన్ని దోచుకొనబడ్డాయి.

మాధ్యమం

2003 తరువాత ఇరాక్ మీడియా ప్రసారాలలో అభివృద్ధి ఆరంభం అయింది. తరువాత శాటిలైట్ డిషెస్ మీద నిషేధం విధించబడింది. బి.బి.సి నివేదిక అనుసరించి ఇరాక్‌లో 20 రేడియో స్టేషన్లు, 17 టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయని అంచనా. ఇరాక్‌లో 200 వార్తాపత్రికలు ఉన్నాయి.

ఆహారసంస్కృతి

ఇరాక్ 
Masgouf.

ఇరాకీ ఆహారం సంస్కృతికి 10,000 సంవత్సరాల దీర్ఘకాల చరిత్ర ఉంది. సుమేరియన్లు, అకాడియన్లు, బాబిలోనియన్లు, అస్సిరియన్లు, అచమనిదులు (పురాతన పర్షియన్లు) ఆహారసంస్కృతి సమ్మిశ్రితమై ఇరాన్ ఆహారసంకృతిగా రూపుదిద్దుకుంది. " క్లే టబ్లెట్" లలో లభించిన ఆధారాలు ఆరాధనామందిరాలలో తయారుచేయబడిన ఆహారతయారీ విధానాలు లభించాయి. వీటిని ప్రపంచంలోని మొదటి వంట పుస్తకాలుగా భావిస్తున్నారు. పురాతన ఇరాక్ లేక మెసపయోమియా పలు అధునాతన, అన్నిరంగాలకు చెందిన అత్యున్నత విలువైన నాగరికతకు నిలయంగా ఉండేది. ఆహారతయారీ కళకూడా అందులో భాగంగా ఉంది. ఇస్లామిక్ స్వర్ణయుగంలో బాగ్దాద్ రాజధానిగా పాలించిన అబాసిద్ కలిఫేట్ కాలంలో ఇరాకీ పాకశాల శిఖరాగ్రానికి చేరుకుంది. ప్రస్తుతం ఇరాక్ ఆహారసంస్కృతి సుసంపన్నమైన వారసత్వ సంపద కలిగి ఉంది. అలాగే పొరుగున ఉన్న టర్కీ, ఇరాన్, గ్రేటర్ సిరియా అహార సంస్కృతుల ప్రభావం కూడా ఇరాక్ అహార సంస్కృతి మీద ఉంది. ఇరాక్ ఆహారంలో. ఉపయోగించబడుతున్న వంటదినుసులలో ఔబర్జిన్, టమేటా, బెండకాయ, ఎర్రగడ్డలు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, తెల్లగడ్డలు, మిరపకాయలు, కాప్సికం కూరగాయలు ప్రధానమైనవి. ప్రధాన ఆహారధాన్యాలలో బియ్యం, గోధుమనూక, గోధుమ,బార్లీ ప్రధానమైనవి. కాయధాన్యాలలో పప్పులు, శనగ, వైట్ బీంస్, చిక్కుడు ప్రధానమైనవి. శుష్కఫలాలలో ఖర్జూరం, ఎండుద్రాక్ష ప్రధానమైనవి తాజా పండ్లలో అప్రికాట్, అత్తికాయ, పుచ్చ,దానిమ్మ ప్రధానమైనవి. పుల్లని పండ్లలో నిమ్మ, దబ్బకాయ ప్రధానమైనవి. పశ్చిమాసియాకు చెందిన ఇతర దేశలలో ఉన్నవిధంగా కోడి మాంసం, గొర్రె మాంసం అభిమాన మాంసాహారాలుగా ఉన్నాయి. ఆహారతయారీలో బాసుమతి బియ్యాన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. బాసుమతి బియ్యం దక్షిణ ప్రాంతంలో ఉన్న చిత్తడినేలలలో పండించబడుతుంది. గోధుమనూక పలు ఆహారాలలో వాడుతుంటారు. అస్సిరియన్ కాలం నుండి గోధుమనూక ప్రధాన ఆహారంగా ఉంది.

క్రీడలు

అసోసియేషన్ ఫుట్‌బాల్ ప్రజాదరణ పొందింది. దేశంలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం, అశాంతికరమైన పరిస్థితులలో ఫుట్ బాల్ క్రీడ ప్రజలలలో సమైక్యతా భావం కలగడానికి సహకరిస్తుందని భావిస్తున్నారు.ఇరాక్‌లో బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్, బాడీ లిఫ్టింగ్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, టెన్నిస్ ప్రజాదరణ క్రీడలుగా ఉన్నాయి. ఇరాక్ ఫుట్ బాల్ టీం " ఇరాకీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరాకీ నేషనల్ ఫుట్‌బాల్ టీం , ఇరాకీ ప్రీమియర్ లీగ్ (ద్వారీ అల్ నొక్బ) పనిచేస్తున్నాయి. ఈది 1948లో స్థాపించబడింది. 1950 నుండి ఇది ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. సభ్యత్వం కలిగి ఉంది. అలాగే 1971 నుండి ఆసియన్ ఫుట్‌బాల్ కాంఫిడరేషన్ సభ్యత్వం కలిగి ఉంది. ఇరాకీ ఫుట్ బాల్ టీం 2007 ఎ.ఎఫ్.సి. ఆసియన్ కప్ చాంపియంషిప్ సాధించింది. ఇది 1986లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. పోటీలు , 2009 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. కాంఫిడరేషన్ కప్ పోటీలలో పాల్గొన్నది.

సాంకేతికం

మొబైల్ ఫోన్

1995 నుండి మిడిల్ ఈస్ట్‌లో మొబైల్ ఫోన్లు వాడుకలో ఉన్నా ఇరాక్‌లో మాత్రం 2003 నుండి మొబైల్ ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. సద్దాం హుస్సేన్ పాలనలో ఇరాక్‌లో మొబైల్ ఫోన్లు నిషేధించబడ్డాయి. ప్రస్తుతం ఇరాక్‌లో 78% మంది మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారు.

ఉపగ్రహం

ఇరాకీ సమాచార మంత్రత్వశాఖ " మల్టీ పర్పస్ స్ట్రాజిక్ శాటిలైట్ " నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కొరకు ఆస్ట్రియం , అరియన్నెస్పేస్ సంస్థలతో 600 మిలియన్ల విలువైన ఒప్పందం చేయబడింది.

అండర్ సీ కేబుల్

2012 జనవరి 18న ఇరాక్ మొదటిసారిగా సముద్రాంతర్భాగం నుండి కమ్యూనికేషన్ నెట్వర్క్ అనుసంధానం చేసింది. ఇది ఇరాక్‌లో వేగవంతమైన, అందుబాటు , ఉపయోగం అంతర్జాలసౌకర్యం కలిగించడానికి ఉపకరించింది. 2013 అక్టోబరు 2 న ఇరాకీ సమాచార మంత్రి అంతర్జాల ధరలను మూడవ వంతుకు తగ్గించమని ఆదేశించాడు. ఇది అంతర్జాల ఉపయోగాన్ని అత్యంతవేగంగా అభివృద్ధిచేయడానికి , దేశంలో ఇంటర్నెట్ ఇంఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా అభివృద్ధి చెందడానికి సహకరించింది.

ఆరోగ్యం

2010లో ఇరాక్ జి.డి.పి.లో 6.8% ఆరోగ్యసంరక్షణ కొరకు వ్యయం చేయబడింది. 2009 గణాంకాలు 10,000 మందికి 6.96 ఫిజీషియన్లు 13.92 ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. 2010 గణాంకాలు ఆయుఃప్రమాణం 68.49. ఇందులో పురుషులు ఆయుఃప్రమాణం 65.13 , స్త్రీల ఆయుఃప్రమాణం 72.01. 1996 లో సరాసరి 71.31 ఆయిఃప్రమాణం ఉండేది. 1970 లో ఇరాక్ " కేంద్రీకృత ఉచిత ఆరోగ్యసంరక్షణ " అభివృద్ధి చేసింది. ఇరాక్ పెద్ద ఎత్తున మెడికల్ ఉపకరణాలు , ఔషధాల కొరకు దిగుమతి మీద ఆధారపడవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నది. నర్సులను కూడా విదేశాల నుండి రప్పించవలసిన పరిస్థితి ఉంది. బీద దేశాలు ఆరంభకాల మెడికల్ ప్రాక్టిషనర్లను ఆరోగ్యసంరక్షణ కొరకు నియమిస్తుంటారు. ఇరాక్ పాశ్చాత్య శైలిలో అధునాతన వైద్యశాలలు, స్పెషలిస్టు ఫిజీషియన్లు ఏర్పాటు చేస్తుంది. యునెస్కో నివేదిక అనుసరించి 1990 లో 97% నగరవాసులు , 71% గ్రామీణప్రజలు ఉచిత ప్రాథమిక ఆరీగ్యసంరక్షణ సదుపాయం అందుకుంటున్నారు.

విద్య

ఇరాక్ 
Students at the college of medicine of the University of Basrah, 2010.

సి.ఐ.ఎ ప్రపంచ ఫ్యాక్ట్‌బుక్ ఎస్టిమేట్స్ 2000 గణాంకాలు అనుసరించి అక్షరాస్యత 84% ఉందని వీరిలో పురుషుల అక్షరాస్యత పురుషుల శాతం 84% , స్త్రీల అక్షరాస్యత 64% ఉంది. యు.ఎన్. గణాంకాలు అనుసరించి 2000 , 2008 లో 15-24 వయస్కులలో 84.8% నుండి 82.4% ఉందని తెలియజేస్తుంది. " కోయిలేషన్ ప్రొవిషనల్ అథారిటీ " పూర్తిస్థాయి ఇరాకీ విద్యావిధానం సంస్కరణల బాధ్యత వహించింది: బాథిస్ట్ భావజాలం సిలబస్ నుండి తీసివేయబడింది. ఉపాధ్యాయుల వేతనాలు గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. శిక్షణా కార్యక్రమాలు అధికం చేయబడ్డాయి. (సదాం హుస్సేన్ పాలనలో ఇవి నిర్లక్ష్యం చేయబడ్డాయి) .[ఆధారం చూపాలి] 2003లో ఒక అంచనా ఆధారంగా ఇరాకీ లోని 15,000 పాఠశాలలలో 80% భవనాలు పునర్నిర్మించాలని , అత్యవసరమైన శానిటరీ సౌకర్యం కల్పించాలని అలాగే పాఠశాలలలో గ్రంథాలయం , ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలన్న వివరాలు వెలువడ్డాయి. [ఆధారం చూపాలి]6వ గ్రేడు వరకు నిర్భంధ విద్య అమలులో ఉంది. జాతీయ పరీక్షలలో ఉత్తీర్ణత పైతరగతుల ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. [ఆధారం చూపాలి] అయినప్పటికీ ఒకేషనల్ ద్వారా విద్యను కొనసాగించవచ్చు. నాణ్యతా లోపం కారణంగా కొంతమంది విద్యార్థులు మాత్రమే ఒకేషనల్ విద్యను ఎంచుకుంటున్నారు. .[ఆధారం చూపాలి] 7వ గ్రేడు నుండి బాలురు , బాలికలు సాధారణంగా ప్రత్యేక పాఠశాలలకు హాజరు ఔతుంటారు. [ఆధారం చూపాలి] 2005 లో పలుప్రాంతాలలో రక్షణాలోపం, సెంట్రలైజ్డ్ సిస్టం ఉపాధ్యాయుల మరుయు నిర్వహణాధికారుల బాధ్యతను తగ్గించడం మొదలైన కారణాలు విద్యావిధానంలో సంస్కరణలు తీసుకురావడానికి ఆటంకాలుగా ఉన్నాయి.[ఆధారం చూపాలి] ఇరాక్‌లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. .[ఆధారం చూపాలి] దాడికి ముందు 2,40,000 వ్యక్తులు ఉన్నత విద్యకు ప్రవేశార్హత పొందారు. [ఆధారం చూపాలి] " వెబోమెట్రిక్స్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీస్ " వర్గీకరణలో యూనివర్శిటీ ఆఫ్ దోహక్ ప్రపంచస్థాయిలో 1717 వ స్థానంలోనూ, యూనివర్శిటీ ఆఫ్ బాగ్దాదు 3160వ స్థానంలోనూ, బాబిలోనియన్ యూనివర్శిటీ 3946వ స్థానంలోనూ ఉన్నాయి.

ఇవీ చూడండి

మూలాలు/ఆధారాలు

Tags:

ఇరాక్ పేరువెనుక చరిత్రఇరాక్ చరిత్రఇరాక్ భౌగోళికంఇరాక్ ప్రభుత్వం , రాజకీయాలుఇరాక్ ఆర్ధికంఇరాక్ గణాంకాలుఇరాక్ సంస్కృతిఇరాక్ సాంకేతికంఇరాక్ ఆరోగ్యంఇరాక్ విద్యఇరాక్ ఇవీ చూడండిఇరాక్ మూలాలుఆధారాలుఇరాక్అరబ్బీ భాషఆంగ్లంఇరాన్కువైట్జోర్డాన్టర్కీబాగ్దాదుసిరియాసౌదీ అరేబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

భగత్ సింగ్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఅధిక ఉమ్మనీరుYపూజా హెగ్డేబ్రిక్స్సిల్క్ స్మిత2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబోయసారపప్పుకందంకాపు, తెలగ, బలిజమౌర్య సామ్రాజ్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువిష్ణుకుండినులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుత్రినాథ వ్రతకల్పంవిజయ్ (నటుడు)వీర్యంతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గంకల్వకుంట్ల కవితవాట్స్‌యాప్ఈథేన్సంధ్యావందనంసత్యనారాయణ వ్రతందశదిశలుకామశాస్త్రంఉత్తర ఫల్గుణి నక్షత్రముస్టాక్ మార్కెట్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావ్యతిరేక పదాల జాబితాచిట్టెం పర్ణికారెడ్డితెలుగు సంవత్సరాలుపెళ్ళి (సినిమా)సర్వాయి పాపన్నజ్యేష్ట నక్షత్రంయాదవసావిత్రి (నటి)కోట శ్రీనివాసరావుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంమేషరాశిహైదరాబాదుగీతాంజలి (1989 సినిమా)శ్రీముఖిబ్రహ్మంగారి కాలజ్ఞానంఉత్పలమాలభోపాల్ దుర్ఘటనరైతుబంధు పథకంఅల్లూరి సీతారామరాజుహయగ్రీవ స్వామిఅయేషా ఖాన్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాటి.రాజయ్యశుభమస్తు (సినిమా)వై.యస్.రాజారెడ్డిభారత పార్లమెంట్ప్రియా వడ్లమానివామనావతారముమదర్ థెరీసాహరే కృష్ణ (మంత్రం)మూర్ఛలు (ఫిట్స్)పనసఅంగుళంతెలుగు నాటకరంగంఅటల్ బిహారీ వాజపేయిపాముకానుగఆంధ్రప్రదేశ్ చరిత్రగామిసూర్య నమస్కారాలుకోన వెంకట్మహిషాసుర మర్ధిని స్తోత్రంభారతీయ తపాలా వ్యవస్థమఖ నక్షత్రముసామెతల జాబితాబమ్మెర పోతనపెద్దక్కయ్య (సినిమా)వై.ఎస్.వివేకానందరెడ్డివిరాట్ కోహ్లి🡆 More