సైప్రస్

Karoulla-Vrikki D (2009).

"Greek in Cyprus: Identity Oscillations and Language Planning". In Alexandra G, Silk MS (eds.). Standard languages and language standards: Greek, past and present. Ashgate Publishing. p. 188. ISBN 0-7546-6437-6.{{cite book}}: CS1 maint: extra punctuation (link) సైప్రస్ అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ " అని పిలువబడుతుంది. ఇది తూర్పు మధ్యధరా సముద్రంలో ఉంది. Cyprus (/ˈsprəs/; Greek: Κύπρος మూస:IPA-el; మూస:Lang-tr మూస:IPA-tr), officially the Republic of Cyprus (Greek: Κυπριακή Δημοκρατία; మూస:Lang-tr), is an island country in the Eastern Mediterranean Sea, off the coasts of Syria and Turkey. మధ్యధరా సముద్రంలోని జనసాంధ్రత అధికంగా కలిగిన ద్వీపాలలో సైప్రస్ మూడవ స్థానంలో ఉంది. సైప్రస్ యురేపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉంది. సైప్రస్ టర్కీ దేశానికి దక్షిణంలో, సిరియా, లెబనాన్ దేశాలకు పశ్చిమంలో, ఇజ్రాయిల్ దేశానికి వాయవ్యంలో, ఈజిప్ట్ దేశానికి ఉత్తరంలో, గ్రీకు దేశానికి తూర్పు దిశలో ఉంది. చరిత్రకాలానికి ముందు సైప్రస్ ప్రాంతంలో క్రీ.పూ 10 వ శతాబ్దంలో మానవుల నివాసం ఆరంభం అయింది. ఈ కాలానికి చెందిన చక్కగా భద్రపరచబడిన నియోలిథిక్ ఆర్కియాలజీ అవశేషాలు ఖిరొకితియా గ్రామంలో లభించాయి. అత్యంత పురాతనమైన నీటి బావులకు సైప్రస్ నిలయం.

క్రీ.పూ 2 వ సహస్రాబ్ధిలో సైప్రస్ ప్రాంతంలో మైసెనయీన్ గ్రీకుప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. మధ్యధరా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న సైప్రస్ పలు సామ్రాజ్యాల దాడికి గురైంది. వీటిలో నియో అస్సిరియన్, పురాతన ఈజిప్ట్, అచమనిద్ సామ్రాజ్యాలు ప్రధానమైనవి. క్రీ.పూ 333 లో మహావీరుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత టోలెమిక్ ఈజిప్ట్, రోమన్ సామ్రాజ్యం, బైజాన్‌టిన్ సామ్రాజ్యాలు, అరబ్ సంస్థానాధీశులు కొతకాలం ఈప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మూడు శతాబ్ధాల (1571-1878)ఒట్టోమన్ పాలన తరువాత సైప్రస్‌లో ఫ్రెంచ్ ల్యూసింగ్నన్ సామ్రాజ్యం, వెనిస్ రిపబ్లిక్ పరిపాలన కొనసాగింది. 1878 నుండి సైప్రస్ బ్రిటిష్ ఆధీనంలోకి మారింది 1914 లో చట్టబద్ధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. 1950లో సైప్రస్ దేశంలో 18% మాత్రమే ఉన్న టర్కిష్ సైప్రియాట్ నాయకులు సైప్రస్‌ను టర్కీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అధికసంఖ్యలో ఉన్న గ్రీక్ సైప్రియాట్ ప్రజలు, సైప్రియాట్ ఆర్థడాక్స్ చర్చి గ్రీకు దేశంతో విలీనం చేయాలని ప్రతిపాదించారు. 1950 లో జరిగిన నేషనలిస్ట్ వయలెంస్ తరువాత సైప్రస్ స్వతంత్ర దేశం అయింది. 1963లో 11 సంవత్సరాలపాటు సాగిన టర్కిష్ - గ్రీక్ జాతికలవరాల కారణంగా 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత 1963లో టర్కిష్ సైప్రియాట్‌లకు సైప్రస్ రిపబ్లిక్ ప్రాతినిథ్యం కలిగించిన తరువాత కలవరం ముగింపుకు వచ్చింది. 1974 జూలై 15న గ్రీక్ సైప్రియాట్ నేషనలిస్టులు " సైప్రియాట్ తిరుగుబాటు 1974 " లేవనెత్తారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఈ ద్వీపం సమీప సముద్రజలాల మీద సార్వభౌమత్వం కలిగి ఉంది. బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం ఇందుకు మినహాయింపుగా ఉంది. అయినప్పటికీ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. 59% భూభాగానికి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ పూర్తి అధికారం కలిగి ఉంది. ఉత్తర భాగం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తన్ సైప్రస్‌గా ప్రకటించుకుంది. అయినప్పటికీ దానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ భూభాగాన్ని ఆక్రమిత టర్కీ ప్రాంతంగా మాత్రమే గుర్తిస్తుంది. అంతర్జాతీయ చట్టాలు ఆక్రమణను చట్టవిరుద్ధమైనదిగా భావిస్తున్నాయి. సైప్రస్ యురేపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందిన తరువాత ఇది ఆక్రమిత యురేపియన్ భూభాగంగా యురేపియన్ యూనియన్ భావిస్తుంది. మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ గొప్ప పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశం. అత్యున్నత మానవాభివృద్ధి, ఉన్నత ఆదాయం కలిగిన సమాజం కలిగిన సైప్రస్ 1961 నుండి " కామన్వెల్త్ దేశాల " సభ్యత్వం కలిగి ఉంది.2004 మే 1న యురేపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందే వరకు అలీన ఉద్యమానికి నిధిని సమకూరుస్తున్న దేశాలలో ఒకటిగా ఉంది. 2008 జనవరి 1న సైప్రస్ రిపబ్లిక్ యూరో జోన్‌లో చేరింది.

పేరువెనుక చరిత్ర

సైప్రస్ 
A copper mine on Cyprus. In antiquity, Cyprus was a major source of copper.

క్రీ.పూ 15 వ శతాబ్దం నుండి సైప్రస్ పేరు సంబంధిత ఆధారాలు లభించాయి. సైప్రికాట్ గ్రీకు భాషలో లిఖించబడింది. ఈ మాటకు సంప్రదాయ గ్రీకు రూపం [Κύπρος (Kýpros)] Error: {{Lang}}: text has italic markup (help). పేరుకు సరైన అర్ధం లభించలేదు.

కొన్ని కథనాలు:

  • కుప్రెసెస్ (మెడిటరేనియన్ సైప్రస్ చెట్టు)
  • గోరింటాకు చెట్టుకు గ్రీకు భాషలో లౌసోనియా అల్బా అంటారు.
  • ఎటియోసైప్రికాట్ అంటే రాగి అని అర్ధం. సుమేరియన్ భాషలో రాగి అంటే జుబార్ అంటారు. కంచు అనే పదానికి కుబార్ అని అంటారు అని జార్జెస్ డోసిన్ వివరిస్తున్నాడు. ఈ ద్వీపంలో రాగి నిల్వలు అధిక మొత్తంలో లభించినందున దీనికి సైప్రియాస్ అని పేరు వచ్చి ఉండవచ్చని కొందరి భావన.
  • దేశాంతర వ్యాపారంలో ఈ ద్వీపం ఏస్ సైప్రియం, మెటల్ ఆఫ్ సైప్రస్ అని పిలువబడి కాలక్రమంలో కుప్రం అయిందని మరి కొందరి భావన.

చరిత్ర

పుర్వీకత

సైప్రస్ 
Archeologic site of Choirokoitia with early remains of human habitation during Aceramic Neolithic period (reconstruction)

సైప్రస ప్రాంతంలో ఆరంభకాల మానవనిసాల ఆధారాలు ఆగ్నేయ సముద్రతీరంలో ఉన్న ఎయిటోక్రెమాంస్‌లో లభ్యం ఔతున్నాయి. క్రీ.పూ 10 వ శతాబ్దంలో వేటసమూహానికి చెందిన ప్రజలు ఇక్కడ నివసించారని భావిస్తున్నారు. క్రీ.పూ 8,200 ఈ ప్రాంతంలో ప్రజలు గ్రామాలు నిర్మించుకుని నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడకు ప్రవేశించిన మానవులు సైప్రస్ డ్వార్ఫ్ నీటిగుర్రాలు, సైప్రస్ డ్వార్ఫ్ ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. పురాతత్వపరిశోధకులు పశ్చిమ సైప్రస్‌లో ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నీటిబావులను కనుగొన్నారు. ఈ నీటి బావులు 9,000 - 10,500 సంవత్సరాల పూర్వం నాటివని భావిస్తున్నారు. నియోలిథిక్ ప్రాంతంలో ఒక మానవ దేహంతో సమాధిచేయబడిన 8 మాసాల పిల్లి అవశేషాలు లభించాయి. ఈ సమాధి 9,500 (క్రీ.పూ 7,500) పూర్వం నాటిదని భావిస్తున్నారు. ఇది పురాతన ఈజిప్ట్ నాగరికతకు చెందినదని, ఫెలైన్ - మానవులకు సంబంధించినదని భావిస్తున్నారు. చక్కగా భద్రపరచబడిన నియోలిథిక్ ఖిరోకితియా గ్రామం యునెస్కో " వరల్డ్ హెరిటేగ్ సైట్ "గా గుర్తించింది. ఈ గ్రామం క్రీ.పూ 6,800 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు.

గ్రీకు వలసలు

సైప్రస్ 
Sanctuary of Apollo Hylates, Kourion

కాంశ్యయుగం కాలంలో గ్రీకులు రెండు దఫాలుగా పెద్ద ఎత్తున ఈ ద్వీపంలో ప్రవేశించారు. మొదటి వలసల అల " మైసెనయీన్ గ్రీక్ " వ్యాపారులు సైప్రస్‌కు క్రీ.పూ 1400 సంవత్సరంలో ఈ ప్రాంతానికి చేరడం ఆరంభం అయింది. ఈ ద్వీపాలలో తిరిగి కాశ్యయుగం ముగింపులో క్రీ.పూ 1100 - 1050 మద్యకాలంలో మరొకసారి పెద్ద ఎత్తున గ్రీకుల వలసలు సంభవించాయి. సైప్రస్ ఆక్రమణలు " గ్రీకు పురాణాలలో " ప్రధానపాత్ర వహించాయి. ఈ ప్రాంతంలో అఫ్రోడైట్, అదోనిస్ జన్మభూమి అని భావిస్తున్నారు. సినిరాస్ రాజు, త్యూసర్, పిగ్మలియాన్ లకు ఇది స్వస్థలమని భావిస్తున్నారు. సైప్రస్ దక్షిణ సముద్రతీరంలో క్రీ.పూ 8 వ శతాబ్దం ఆరంభ కాలంనాటి పురాతనమైన ఫోనిసియన్ (ప్రస్తుత లర్నక, సలమిస్ (సైప్రస్)) కాలనీలు కనిపెట్టబడ్డాయి.

అస్సిరియన్

సైప్రస్ మధ్యధరా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. క్రీ.పూ 780 నుండి ఒక శతాబ్దం కాలం సైప్రస్ ప్రాంతం అస్సిరియన్ సామ్రాజ్యపాలనలో ఉంది. తరువాత స్వల్పకాలం ఈజిప్ట్ పాలనలో ఉండి తరువాత క్రీ.పూ 545 నాటికి పర్షియన్ పాలనలోకి మారింది. క్రీ.పూ 499లో అచమనిద్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సైప్రియాట్ ప్రజలు సలామీ రాజు ఒనెసిలస్ నాయకత్వంలో గ్రీకులతో కలిసి చేసిన తిరుగుబాటు ఓటమిపాలయ్యింది. తిరుగుబాటు అణిచివేయబడినప్పటికీ సైప్రస్ ప్రజలు దాదాపు స్వయంపాలనాధికారం సాధించుకున్నారు. అలాగే గ్రీకుతో సత్సబంధాలు ఏర్పరచుకున్నారు. క్రీ.పూ 333 లో సైప్రస్‌ను మహావీరుడు అలెగ్జాండర్ ఆక్రమించాడు. మహావీరుడు అలెగ్జాండర్ మరణించిన తరువాత బాబిలోనియన్ సామ్రాజ్యం విభజించబడింది. అలెగ్జాండర్ మర ణించిన తరువాత వారసుల మద్య యుద్ధాలు కొనసాగాయి. పర్యవసానంగా సైప్రస్ హెలెనిస్టిక్ సామ్రాజ్యంలో (ప్టోలెమిస్టిక్ కింగ్డం) భాగం అయింది. ఈసమయంలో ద్వీపం పూర్తిగా హెలెనిస్టిక్ నాగరికతకు మార్చబడింది. క్రీ.పూ 58 నాటికి సైప్రస్‌ను రోమన్ రిపబ్లిక్ విలీనం చేసుకుంది.

మద్యయుగం

సైప్రస్ 
The Venetian walls of Nicosia were built by the Venetians to defend the city in case of an Ottoman attack
సైప్రస్ 
Kyrenia Castle was originally built by the Byzantines and enlarged by the Venetians

395లో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పడమరులుగా విభజించబడిన తరువాత సైప్రస్ తూర్పురోమన్‌లో (బైజాంట్సిన్ సామ్రాజ్యం)లో భాగంగా మారింది. 800 సంవత్సరాల తరువాత క్రుసేడర్లు దాడి వరకు సైప్రస్ తూర్పు రోమ్సామ్రాజ్యంలో భాగం అయింది. హెలెనిక్ - క్రైస్తవ ప్రాంతంగా ఉన్న సైప్రస్ ప్రాతంలో బైజాంటిన్ పాలనలో కూడా గ్రీక్ పురాతన నాగరికత, క్రైస్తవ ప్రాధాన్యత కొనసాగింది. 649 లో ఆరంభంలో సైప్రస్ ప్రాంతం అరబ్ దాడులకు గురైంది. 300 సంవత్సరాల కాలం సైప్రస్ ప్రాంతంలో అరబ్ దాడులు కొనసాగాయి. వీటిలో పలుదాడిలు కొతభూభాగం మీద మాత్రం జరిగాయి. ఈ సమయంలో సైప్రస్ పాలనలో నిర్మించబడిన చర్చీలు మొత్తం విధ్వంసం చేయబడ్డాయి. వేలాది మంది మరణించారు. అలాగే సలామిస్ వంటి నగరాలు ధ్వంసం చేయబడ్డాయి. అవి తిరిగి నిర్మించబడలేదు. 965లో చక్రవర్తి రెండవ నికెఫొరస్ వ్యూహాత్మకంగా భూమార్గం, సముద్రమార్గం ద్వారా దాడిచేసిన తరువాత బైజాంటిన్ పాలన తిరిగి స్థాపించబడింది. 1191 లో మూడ క్రుసేడ్, మొదటి రిచర్డ్ (ఇంగ్లండ్) ఈ ద్వీపాన్ని ఇసాక్ కొమెనోస్ నుండి స్వాధీనం చేసుకున్నాడు. సురక్షితమైన ఈద్విపాన్ని రిచర్డ్ సరఫరా కేంద్రంగా వాడుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత రిచర్డ్ ఈ ద్వీపాన్ని " నైట్ టెంప్లర్ "కు విక్రయించాడు. నైట్ టెంప్లర్ ఈద్వీపాన్ని గే ఆఫ్ ల్యూసింగ్నన్‌కు విక్రయించాడు. తరువాత రోమన్ చక్రవర్తి " నాలుగవ హెంరీ (రోమ చక్రవర్త్) ల్యూసింగ్నన్‌ సోదరుడు అయిన రెండవ అంరలిక్ (అమల్రిక్ ఆఫ్ జెరుసలేం సైప్రస్)ను సైప్రస్ రాజుగా గుర్తించాడు. 1473లో రెండవ జేమ్స్ మరణించిన తరువాత మరణించిన రాజు భార్య " రాణి కొర్నారో " పాలనలో ల్యూసిగ్నన్ రాజు ఈ ద్వీపం మీద ఆధిపత్యం సాధించాడు. వెనెటియన్లు నికోసియాలో కోటను నిర్మించి సురక్షితం చేసి దీనిని వ్యాపారకూడలిగా మార్చారు. వెనెటియన్ పాలనలో ఓట్టమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతం మీద పలుమార్లు దాడులు సాగించారు. 1539 లో ఓట్టమన్ లిమాసోల్‌ను ధ్వంసం చేసారు. వెనెటియన్లు ఫామాగుస్టా, కిరెనియాలలో కోటలు నిర్మించారు. 4 సంవత్సరాల లాటిన్ పాలనలో సైప్రస్‌లో రెండు సొసైటీలు సజీవంగా నిలిచాయి. వీటిలో ఒకటి ఫ్రాంకిష్ ప్రముఖులు, ఇటాలియన్ వ్యాపారులు, వారి కుటాబాలు. రెండవ సొసైటీలో గ్రీక్ సైప్రియాటులు వారి సేవకులు, శ్రామికులు ఉన్నారు.

ఓట్టమన్ సాంరాజ్యం

1570లో 60,000 మంది సైనికులతో ఓట్టామన్ సామ్రాజ్యం సైప్రస్ మీద దాడి చేసి ఆక్రమించుకున్నారు. నికోసియా, ఫమగుస్తా ప్రజలు ఈ దాడిని తీవ్రగా ఎదిరించినా ఓటమి అనివార్యమైంది. ఓట్టమన్ సైకులు సైప్రస్‌ను ఆక్రమించుకుని పలువురు గ్రీకు, ఆర్మేనియన్ క్రైస్తవులను మూకుమ్మడిగా హత్యచేసారు. మునుపటి లాటిన్ ప్రజలు పెద్దసంఖ్యలో ప్రాణాలుకోల్పోయారు. కొత్తగా ముస్లిం ప్రజల సంఖ్య పెద్ద మొత్తంలో అధికరించింది. ఈ సంఘటనను చారిత్రకంగా గణనీయమైన పురాతన గణాంకాల మార్పిడిగా భావిస్తున్నారు. ఈ యుద్ధంలో పోరాడిన సైనికులు సైప్రస్ ద్వీపంలో స్థిరపడ్డారు. తరువాత ఈ ద్వీపానికి అనటోలియా నుండి టర్కీ రైతులను, వృత్తి పనివారిని తీసుకువచ్చారు. కొత్త సమూహంలో అనటోలియా నుండి బహిస్కరించబడిన గిరిజనతెగలు కూడా వచ్చి చేరారు.

సైప్రస్ 
Historical map of Cyprus by Piri Reis

ఓట్టమన్ సైప్రస్‌లో భూస్వామ్య వ్యవస్థను రద్దుచేసి మిల్లెట్ విధానం ప్రవేశపెట్టింది. ముస్లిమేతరులకు వారి స్వంత మతసంస్థలు నాయకత్వం వహించాయి. లాటిన్ పాలనకు వ్యతిరేకంగా సైప్రస్ చర్చి అధ్యక్షుడు గ్రీకు సైప్రికాట్ ప్రజలకు నాయకుడై క్రైస్తవ గ్రీకు సైప్రికాట్, ఓట్టమన్ అధికారిల మద్య మద్యవర్తిగా పనిచేసాడు. ఈచర్య నిరంతరాయంగా సాగిన రోమన్ కాథలిక్ చర్చీల ఆక్రమణకు ముగింపు పలికింది. ఓట్టమన్ పాలన సుల్తానుల, అధికారుల మనస్తత్వాలను అనుసరించి వైవిధ్యంగా ఉండేది. 250 సంవత్సరాల కాలం సాగిన ఓట్టమన్ పాలనలో ద్వీపం ఆర్థికంవ్యవస్థ క్షీణించింది. ఓట్టమిన్ పాలనా కాలమంతా ఓట్టమన్ ఆధిక్యత కారణంగా క్రైస్తవుల, ముస్లిముల సంఖ్యలో హెచ్చుతగ్గులు సంభవించాయి. 1777-78 లో ద్వీపంలో ముస్లిముల సంఖ్య 47,000 క్రైస్తవుల సంఖ్య 37,000 ఉంది. 1872 నాటికి మొత్తం ప్రజల సంఖ్య 1,44,000 వీరిలో క్రైస్తవులు 1,00,000, ముస్లిములు 44,000 ఉన్నారు.1821లో గ్రీకు స్వతంత్రసమరం ఆరంభం అయిన తరువాత పలువురు గ్రీక్ కాప్రియాటులు గ్రీకు సైన్యంలో చేరడానికి సైప్రస్ వదిలి గ్రీకు చేరుకున్నారు. ఫలితంగా ఓట్టమన్ గ్రీకు గవర్నర్ ఖైదుచేయబడ్డాడు. 486 గ్రీకు ప్రముఖులు (సైప్రస్ ఆర్చి బిషప్‌, సైప్రస్ కిర్పియాన్, 4 బిషప్పులతో చేర్చి) ఉరితీయబడ్డారు. 1828లో ఆధునిక గ్రీకు మొదటి అధ్యక్షుడు " లోయానిస్ కపోడిస్ట్రియంస్) సైప్రస్ గ్రీకుతో మైత్రికి పిలుపు ఇచ్చాడు. తరువాత పలు తిరుగుబాట్లు తలెత్తాయి. ఓట్టమన్ పాలనలో అవకతవకలు గ్రీకు, టర్కిష్ తిరుగుబాట్లు తలెత్తడానికి కారణం అయింది. అవిఏవీ విజయవంతం కాలేదు.

బ్రిటిష్ పాలన

సైప్రస్ 
Hoisting the British flag at Nicosia

" రుస్సో - టర్కిష్ యుద్ధం (1877-1878) " తరువాత బెర్లిన్ కాంగ్రెస్, సైప్రస్ బ్రిటిష్ సాంరాజ్యానికి లీజుకు ఇవ్వబడ్డాయి. ద్వీపసమూహాలు 1974]] నవంబర్ 5 వరకు బ్రిటిష్ సాంరాజ్యనిర్వహణలో కొనసాగినప్పటికీ చట్టపరంగా సైప్రస్ ఈజిప్ట్, సుడాన్ ప్రాంతాలు ఓట్టమన్ భూభాగాలుగా భావించబడ్డాయి. in exchange for guarantees that Britain would use the island as a base to protect the Ottoman Empire against possible Russian aggression.

సైప్రస్ 
Greek Cypriot demonstrations for Enosis (union with Greece) in 1930

ద్వీపం బ్రిటిష్ ప్రభుత్వానికి కాలనీ మార్గంలో సైనిక స్థావరంగా ఉపకరించింది. 1906 నాటికి ఫమగుస్టా నౌకాశ్రయం నిర్మాణం పూర్తి అయిన తరువాత సైప్రస్ వ్యూహాత్మక నౌకాకేంద్రంగా మారింది. బ్రిటిష్ ఆక్రమిత దేశాలలో ప్రధానమైన భారతదేశానికి చేరడానికి ఇది ఒక కూడాలి నౌకాశ్రయంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం అయిన తరువాత ఓట్టమన్ సాంరాజ్యం " సెంట్రల్ పవర్స్ " తో చేరింది. బ్రిటిష్ సైప్రస్‌ను విలీనం చేసుకుంది.1915 లో బ్రిటన్ గ్రీకు తమ తరఫున యుద్ధంలో పాల్గొంటే సైప్రస్‌ను గ్రీకు సామంత రాజ్యంగా చేస్తామని చేసిన ప్రతిపాదనను గ్రీకు త్రోదిపుచ్చింది. 1923 లో " ల్యుసన్నే ఒప్పందం " తరువాత టర్కీ సైప్రస్ మీద అధికారం వదులుకున్నది.1925 లో బ్రిటిష్ ప్రభుత్వం సైప్రస్‌ను తమ కాలనీగా ప్రకటించింది. బ్రిటిష్ సైన్యంతో చేరి పలువురు గ్రీకు, సైప్రియాటస్ ప్రపంచ యుద్ధాలలో పాల్గొన్నారు.[ఆధారం యివ్వలేదు] రెండవ ప్రపంచయుద్ధంలో అనేకమంది సైప్రస్ రెజిమెంటులో నమోదు అయ్యారు. గ్రీకు సైప్రియాట్స్ సైప్రస్ చారిత్రకంగా గ్రీకు దేశానికి చెందినదని విశ్వసించారు. అందుకని వారు సైప్రస్‌ను వారి మాతృభూమితో కలపాలనుకున్నారు.

సైప్రస్ 
British soldiers fighting against a street riot by EOKA in Nicosia, 1956.

ఆరంభం నుండి టర్కిష్ సైప్రియాట్స్ బ్రిటిష్ పాలనకు అనుకూలంగా ఉన్నారు. టర్కిష్ సైప్రియాట్స్ తాము ప్రత్యేకమైన సంప్రదాయానికి వారసులమని గ్రీకు సైప్రియాటులకు అతీతంగా తమ నిర్ణయం తాము స్వయంగా తీసుకునే అధికారం తమకు ఉందని భావించారు. 1952 లో టర్కీ నాయకుడు " అద్నాన్ మెండరెష్ " సైప్రస్ అంటోలియాలో భాగమని భావించి సైప్రస్‌ను సంప్రదాయంగా విడదీయడాన్ని వ్యతిరేకిస్తూ ద్వీపం అంతటినీ టర్కీలో విలీనంచేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ద్వీపంలో టర్కిష్ సైప్రికాట్స్ 20% మాత్రమే ఉన్న కారంగా టర్కీతో విలీనం చేయడం సాధ్యపడలేదు.సైప్రస్ విభజన విషయంలో జాతీయవిధానంలో మార్పులు సంభవించాయి. టర్కిష్ సైప్రియాట్స్ ప్రారంభించిన విభజన ఉద్యమం 1950లో ఆరంభమై 1960 వరకు కొనసాగింది. జ్యూరిచ్, లండన్ సమావేశాల తరువాత టర్కీ సైప్రస్ దేశం ప్రత్యేకతను అంగీకరించింది.1950 జనవరిలో సైప్రస్ చర్చి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో టర్కిష్ సైప్రియాట్స్ బహిష్కరించారు.

స్వతంత్రం

సైప్రస్ 
The first president of Cyprus, Makarios III

1960 ఆగస్ట్ 16న జ్యూరిచ్, లండన్ ఒప్పందం తరువాత సైప్రస్‌కు స్వతంత్రం లభించింది. సైప్రస్ జనసంఖ్య 5,73,566 వీరిలో 4,42,138 (77.1%) గ్రీకు ప్రజలు, 1,04,320 (18.2%) టర్కీ ప్రజలు, 27,108 (4.7%) ఇతరులు ఉన్నారు. యునైటెడ్ కింగ్డం అక్రోటిరి, ధెకెలియా ఎయిర్ బేస్‌ల అధికారం తమ వద్ద ఉంచుకొంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వకార్యాలయాలు సంప్రదాయ స్థానిక ప్రజలకు కేటాయించబడ్డాయి. అల్పసంఖ్యాక టర్కిష్ ప్రజలకు 30% పార్లమెంటు స్థానాలు, ప్రభుత్వ నిర్వహణాధికారం ఇవ్వబడింది. టర్కిష్‌ప్రజలకు మూడు దేశాల మాతృదేశ హక్కులు మంజూరు చేయబడ్డాయి. అయినప్పటికీ దీనిని టర్కిష్ సైప్రియాట్స్ వ్యతిరేకించారు.

విభజన తరువాత

సైప్రస్ 
A map showing the division of Cyprus

రాజ్యాంగాన్ని పునరుద్ధరించి 1974 డిసెంబర్‌లో ఆర్చి బిషప్ మూడవ మకతియాస్ తిరిగి వచ్చిన తరువాత టర్కిష్ సైనికులు సైప్రస్ ఈశాన్య భూభాగాన్ని ఆక్రమించారు. 1983 లో టర్కిష్ సైప్రియాట్ నాయకుడు " టర్కిష్ రిపబ్లిక్ నార్తెన్ సైప్రస్ " ప్రకటన చేసాడు. అయినప్పటికీ దీనిని టర్కీ కాక మరేదేశం అంగీకరించలేదు.

1974 సంఘటనలు సైప్రస్ రాజకీయాలను, గ్రీకు- టర్కిష్ సంబంధాలను ప్రభావితం చేసాయి. 1,50,000 మంది టర్కీ వలస ప్రజలు సైప్రస్ ఉత్తర భూభాగంలో నివాసం ఏర్పరుచుకున్నారు. టర్కీ దాడి, ఉత్తర భూభాగ ఆక్రమణ తరువాత సైప్రస్ ప్రభుత్వం ఉత్తర నౌకాశ్రయ ప్రవేశం మూతవేస్తున్నామని (వారి ఆధీనంలేనప్పటికీ) ప్రకటించింది. [ఆధారం చూపాలి]

సైప్రస్ 
Foreign Ministers of the European Union countries in Limassol during Cyprus Presidency of the EU in 2012

టర్కిష్ దాడి, ఉత్తర భూభాగ ఆక్రమణ, స్వతంత్రప్రకటనను ఐఖ్యరాజ్యసమితి ఖండించింది. ఇది సెక్యూరిటీ కౌంసిల్ ప్రతిసంవత్సరం నొక్కిచెప్తూ ఉంది.

భౌగోళికం

సైప్రస్ 
Topographic map of Cyprus - Troodos Mountains in the southwest, Mesaoria plain in the middle, Kyrenia Mountains in the north
సైప్రస్ 
Mount Olympus.

మద్యధరా సముద్రంలోని ద్వీపాలలో సైప్రస్ వైశాల్యపరంగా మూడవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇటలీ లోని సిసిలీ, సర్దినియా (వైశాల్యం, జనసంఖ్యా పరంగా) ఉన్నాయి. ప్రంపంచ ద్వీపాలలో వైశాల్యపరంగా 81 వ స్థానంలోనూ, జనసంఖ్యా పరంగా 51 వ స్థానంలోనూ ఉంది. ద్వీపం పొడవు 240 కి.మీ. వెడల్పు 100 కి.మీ. ద్వీపానికి ఉత్తర సముద్రతీరంలో 75కి.మీ దూరంలో టర్కీ ఉంది. సైప్రస్ 34-36 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 32-35 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

సైప్రస్ 
Petra tou Romiou ("Rock of the Greek").

తూర్పు సముద్రతీరంలో 105 కి.మీ దూరంలో సిరియా, 108 కి.మీ దూరంలో లెబనాన్, ఆగ్నేయ సముద్రతీరంలో 200 కి.మీ దూరంలో ఇజ్రాయిల్ దక్షిణ సముద్రతీరంలో 380 కి.మీ దూరంలో ఈజిప్ట్, వాయవ్య సముద్రతీరంలో 280 కి.మీ దూరంలో ఉన్నాయి.

ద్వీపంలో ట్రూడోస్ పర్వతశ్రేణి, కిరెనియా పర్వతశ్రేణి మద్యలో మెసోరియా మైదానం ఉన్నాయి. మెసొరియా మైదానానికి అవసరమైన జలాలను పెడియోస్ నది (ద్వీపంలో పొడవైన నది ఇదే) అందిస్తుంది. ట్రూడోస్ పర్వతశ్రేణి ద్వీపంలోని దక్షిణ, పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్నాయి. ఇవి దాదాపు ద్వీపంలోని సగం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ద్వీపంలోని ఎత్తైన భూభాగం 1952 మీ ఎత్తైన ఒలింపిస్ శిఖరం ద్వీపంలో అత్యంత ఎత్తైన భూభాగంగా భావిస్తున్నారు. ఇది ట్రూడోస్ పర్వతశ్రేణి మద్యభాగంలో ఉంది. ఉత్తర సముద్రతీరంలో కిరెనియా పర్వతశ్రేణి ఉంది. ఈ పర్వతశ్రేణిలో ఎత్తైన భూభాగం 1024 మీ. ఉంటుంది.

భౌగోళికంగా సైప్రస్ ద్వీపం నాలుగు ప్రధానభూభాగాలుగా విభజించబడింది. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ద్వీపంలోని దక్షిణ ప్రాంతాన్ని (59,74%) ఆక్రమించి ఉంది. ఉత్తరభూభాగంలోని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తెన్ సైప్రస్ " 34.85% భూభాగం ఆక్రమించి ఉంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన గ్రీన్ లైన్ 2.67 % భూభాగాన్ని ఆక్రమించి ఉంది. స్వతంత్రం లభించే ముందుగా ఒప్పందం ఆధారంగా బ్రిటిష్ ఆధీనంలో ఉన్న భూభాగం 2.74% ఉంది.

వాతావరణం

సైప్రస్ 
The sandy beaches are often used as habitats for green turtles. In the photo Nissi beach

సైప్రస్ ఉప ఉష్ణమండల వాతావరణం, మెడిటరేనియన్ వాతావరణం, అర్ధ శుష్క వాతావారణం కలిగి ఉంది. సైప్రస్ ద్వీపంలో చలి స్వల్పంగా ఉండే శీతాకాలంలో, వెచ్చదనం, వేడి వాతావరణంతో కూడిన వేసవి ఉంటుంది. ట్రూడోస్ పర్వతశిఖరాలలో (ద్వీపం మద్యభాగంలో) హిమపాతం స్వల్పంగా ఉంటుంది. శీతాకాలంలో వర్షపాతం ఉంటుంది. వేసవిలో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది.

యురేపియన్ యూనియన్‌లోని మెడిటరేనియన్ భూభాగంలో వెచ్చని వాతావరణం కలిగిన ప్రాంతాలలో సైప్రస్ ఒకటి. [ఆధారం చూపాలి] సముద్రతీరంలో పగటి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్షియస్ 24 °C (75 °F), రాత్రి ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్షియస్ 14 °C (57 °F) ఉంటుంది. సాధారణంగా వేసవి 8 మాసాలు ఉంటుంది.

సైప్రస్ 
The Troodos Mountains experience heavy snowfall in winter

సైప్రస్ ద్వీపంలో సూర్యుడు ప్రకాశించే రోజులు 3,200. సరాసరి దినసరి సూర్యప్రకాశం డిసెంబరు మాసంలో 5-6 గంటలు, జూలైలో 12-13 గంటలు ఉంటుంది. ఉత్తర ఐరోపా కంటే ఇది రెండు రెట్లు ఉంటుంది. లండన్ వార్షికంగా 1,461 గంటల సూర్యరశ్మి అందుకుంటూ ఉంటుంది. డిసెంబరు మాసంలో లండన్ 37 గంటల సూర్యరశ్మిని మాత్రమే అందుకుంటుంది.

నీటిసరఫరా

సైప్రస్ 
The Kaledonia Falls in the Troodos Mountains
సైప్రస్ 
Kouris Dam overflow in April 2012

సైప్రస్ నీటికొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గృహావసరాలకు సైప్రస్ అధికంగా వర్షపునీటి మీద ఆధారపడుతుంది. గత 30 సంవత్సరాలుగా వార్షిక వర్షపాతం క్షీణిస్తూ ఉంది. 2001 - 2004 భారీవర్షపాతం భూగర్భజలాలు మట్టం అధికరించింది. అయినప్పటికీ ద్వీపంలో నీటి అవసరం కూడా అధికరించినందున 2005 నాటికి నీటికొరత అధికస్థాయికి చేరింది. అధికరించిన నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సైప్రస్ ప్రభుత్వం ద్వీపం జనసఖ్యను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. జనసంఖ్యాభివృద్ధి, విదేశీయుల రాక, అధికమౌతున్న పర్యాటకుల సంఖ్య నీటికొరతను అధికం చేస్తూనే ఉంది. ఫలితంగా సైప్రస్ తరచుగా కరువును ఎదుర్కొంటున్నది.. ఆనకట్టలు గృహావసరాలకు, వ్యవవసాయభూములకు ప్రధాన నీటివనరులుగా సహకరిస్తున్నాయి. సైప్రస్‌లో 107 ఆనకట్టలు, రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నీటివనరులు కలిసి 330,000,000 m3 (1.2×1010 cu ft).నీటిని నిలువజేస్తున్నాయి. సమీప కాలంలో దీర్ఘకాలం కొనసాగుతున్న కరువు ఫలితంగా సైప్రస్ ప్రభుత్వం క్రమంగా " వాటర్ డిసాలినేషన్ " ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. వాటర్ డిసాలినేషన్ " ప్లాంట్ల కొరకు ప్రభుత్వం అత్యధికంగా వ్యయం చేస్తుంది. 2001 లో గృహావసరాలకు అవసరమైన నీరు వాటర్ డిసాలినేషన్ " ప్లాంట్ల నుండి లభించింది. నీటి పొదుపు అవసరం గురించి వివరిస్తూ ప్రభుత్వం పేజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టింది. ద్వీపం ఉత్తర భూభాగానికి నీటిని అందించడానికి టర్కీ ప్రభుత్వం అనమూర్ నుండి మధ్యధరా సముద్రం క్రింద నుండి పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది.

రాజకీయాలు

సైప్రస్ 
The Presidential Palace in Nicosia
సైప్రస్ 
Nicos Anastasiades, President of Cyprus since 2013.

సైప్రస్ " ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ ". రాజ్యాధిపతి అయిన అధ్యక్షుడు సారస్వతిక ఓటింగ్ విధానంలో 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నిక చేయబడతాడు. పార్లమెంటు సభ్యుల తీర్మానంతో ప్రభుత్వం నిర్వహించబడుతుంది. న్యాయవ్యవస్థ స్వంతంత్రంగా వ్యవరించే అధికారం ఉంటుంది.

1960 సైప్రస్ రాజ్యాంగం స్వతంత్ర నిర్వహణాధికారి సహకారంతో పాలన నిర్వహించే అధ్యక్షపాలనా విధానం ప్రవేశపెట్టింది. గ్రీకు సైప్రియాట్ నిర్వహణాధికారి సహాయంతో పాలనా విధులు నిర్వహించడం, పార్లమెంటు సభ్యుల ఎన్నికతో ఉపాధ్యక్షుడు ఎన్నిక చేయమడం ద్వారా గ్రీకు సైప్రియాట్, టర్కీ సైప్రియాట్ మద్య అధికార విభజన చేయబడింది.

1965 నుండి రెండు కమ్యూనిటీల మద్య జరిగిన సంఘర్షణ తరువాత పార్లమెంటు హౌసులో టర్కిష్ సైప్రియాట్ సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. 1974లో టర్కీ సైన్యం ఉత్తర సైప్రస్‌ను ఆక్రమిచిన తరువాత సైప్రస్ " డి ఫాక్టో " రూపొందించబడింది. 1983లో టర్కిష్ సైప్రియట్ (టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తెన్ సైప్రస్) స్వతంత్రం ప్రకటించింది. 1985 టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తెన్ సైప్రస్ రాజ్యంగ స్థాపన చేసి మొదటిసారి ఎన్నికలు నిర్వహించింది.ఐక్యరాజ్యసమితి టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తెన్ సైప్రస్‌ను గుర్తించక ద్వీపం అంతటి మీద అధికారం " సైప్రస్ రిపబ్లిక్ "కు మాత్రమే ఉంటుందని ప్రకటించింది.

ప్రస్తుత పార్లమెంటులో 59 మంది ఎన్నిక చేయబడిన సభ్యులు, 3 మంది పర్యవేక్షణ సభ్యులు (ఆర్మేనియన్, రోమన్ కాథలిక్, మార్ ఓనై ట్) ఉన్నారు. టర్కిష్ సైప్రియాటులకు ప్రత్యేకించిన 24 స్థానాలు 1964 నుండి ఖాళీగా ఉన్నాయి. " ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ వర్కింగ్ పీపుల్స్ " పార్టీ, ది లిబరల్ కంసర్వేటివ్ డెమొక్రటిక్ ర్యాలీ, ది సెం ట్రిస్ట్ రాజకీయాలలో ఆధిక్యత కలిగి ఉన్నాయి. అదనంగా సైప్రస్‌లో డెమొక్రటిక్ పార్టీ, ది సోషల్ డెమొక్రసీ, మూవ్మెంట్ ఫర్ సోషల్ డెమొక్రసీ, ది సెంట్రిస్ట్ యురేపియన్ పార్టీలు ఉన్నాయి.

నిర్వహణా విభాగాలు

సైప్రస్ రిపబ్లిక్ 6 జిల్లాలుగా విభజించబడింది: నికోసియా, ఫమగుస్టా, కిరెనియా, లర్నకా, లిమసోల్, పఫోస్.

జిల్లా రాజధాని జనసంఖ్య
ఇంగ్లీష్ గ్రీక్ టర్కిష్
నికోసియా జిల్లా Λευκωσία లెఫ్కొసా నికోసియా 326,980
లిమసోల్ జిల్లా Λεμεσός లిమసోల్ లిమసోల్ 235,330
లర్నకా జిల్లా Λάρνακα లర్నకా లర్నకా 143,192
పఫోస్ జిల్లా Πάφος బాఫ్ పఫోస్ 88,276
ఫమగుస్టా జిల్లా Αμμόχωστος గజిమగుసా ఫమగుస్టా 46,629
కిరెనియా జిల్లా Κερύvεια గిమే కిరెనియా

ఎక్స్‌క్లేవ్స్, ఎన్‌క్లేవ్స్

సైప్రస్ 
Dhekelia Power Station

సైప్రస్‌లో 4 ఎక్స్‌క్లేవ్స్ ఉన్నాయి: అన్ని బ్రిటిష్ ఆధీనంలోని అక్రోటి, ధెకెలియా భూభాగంలో ఉన్నాయి. వీటిలో ఒర్మిథియా, క్సిలోంవౌ అనే రెండుగ్రామాలు ఉన్నాయి. మూడవది ధెకెలియా పవర్ స్టేషన్. దీనిని బ్రిటిష్ రోడ్డు రెండు భాగాలుగా విభజిస్తుంది.

విదేశీసంబంధాలు

సైప్రస్ ఆస్ట్రేలియా గ్రూప్, కామంవెల్త్ ఆఫ్ నేషంస్, కౌంసిల్ ఆఫ్ ఐరోపా, సి.ఎఫ్.ఎస్.పి, ఇ.బి.ఆర్.డి, యురోపియన్ ఇంవెస్ట్మెంట్ బ్యాంక్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, ఐ.టి.యు, ఎం.ఐ.జి.ఎ, నాన్- అలైండ్ మూవ్మెంట్, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్, ఒ.పి.సి.డబల్యూ, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ కంఫిడరేషన్ ఆఫ్ లేబర్, వరల్డ్ కస్టంస్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, డబల్యూ, హెచ్.ఓ, డబల్యూ.ఐ.పి.ఓ, డబల్యూ.ఎం.ఓ, డబల్యూ టూ ఓ. మొదలైన అంతర్జాతీయ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది.

మానవహక్కులు

సైప్రస్ 
Supreme Court of Cyprus.

" ఫ్రీడం ఇన్ ది వరల్డ్ 2011 " ఫ్రీడం హౌస్ సైప్రస్ స్వతంత్రదేశం అని వర్గీకరించింది. 2014 శరణార్ధుల బృందం, యురేపియన్ పార్లమెంటేరియన్ టర్కీ జెనివా ఒప్పందాన్ని అతిక్రమించిందని అంతర్జాతీయ కోర్టులో కేసు ఫైల్ చేసాడు. ఫిర్యాదులో టర్కీ నేరుగా, పరోక్షంగా పౌరులను ఆక్రమిత సైప్రస్ భూభాగంలోకి పంపుతూ ఉందని పేర్కొన్నది. ఒక దశాబ్ధకాలంగా టర్కీ ఆక్రమిత సైప్రస్ భూభాగంలోకి పంపినవారి సంఖ్య అధికరిస్తూనే ఉందని అమెరికన్ దూత అభిప్రాయపడ్డాడు. . టర్కీ జెనీవా అతిక్రమణలలో గ్రీక్, క్రైస్తవ ఆర్కియాలజీ స్మారకాల విధ్వంసం కూడా భాగాంగా ఉంది. సాంస్కృతిక నిధులను దోచుకోవడం, చర్చీలను విధ్వంసం చేయడం, కళాఖండాలను నిర్లక్ష్యం చేయడం, చరిత్రాత్మక ప్రదేశాల పేర్లను మార్పిడి చేయడం వంటి చర్యలను " ఇంటర్నేషనల్ కౌంసిల్ ఆఫ్ మోన్యుమెంట్ అండ్ సైట్స్ " ఖండించింది. టర్కీ విధానాల కారణంగా ఉత్తర సైప్రస్‌లో గ్రీకు ప్రజలను తుడిచిపెట్టలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చోటు చేసుకున్నాయని హద్జిసవాస్ ఉద్ఘాటించింది. సంప్రదాయ ప్రజలను తుడిచిపెట్టి ఉత్తర భూభాగంలో వ్యక్తిగతంగా ఆర్థికప్రయోజనాలను మొత్తంగా పొందాలని టర్కీ భావించిందని గ్రీకుప్రజలు అభిప్రాయపడ్డారు.

సైనికదళం

సైప్రస్ 
Soldiers of the Cypriot National Guard marching in Rome.

సైప్రస్ రిపబ్లిక్ సంస్థ " సైప్రికాట్ నేషనల్ గార్డ్ ". ఇందులో కాల్బలం, వాయు దళం, నౌకాదళం ఉన్నాయి. సైప్రస్ పౌరులలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకులు అందరూ 24 మాసాలు సైనికదళంలో పనిచేయాలి.

  • సైప్రికాట్ కాల్బలంలో ఈ క్రింది విభాగాలు ఉన్నాయి.
  • ఫస్ట్ ఇంఫాంటరీ డివిషన్
  • సెకండ్ ఇంఫాంటరీ డివిషన్
  • ఫోర్త్ ఇంఫాంటరీ బ్రిగేడ్
  • ట్వెల్త్ ఆర్మ్డ్ బ్రిగేడ్
  • తర్డ్ సపోర్ట్ బ్రిగేడ్
  • ఇంగ్లీష్ సపోర్ట్ బ్రిగేడ్
  • ఎయిర్ ఫోర్స్‌లో 449 హెలికాఫ్ట్ గంషిప్ స్క్వార్డెన్: ఎయిరో స్పాటియేల్ గజెల్లే - ఎస్.ఎ. 342 ఎల్, బెల్ 206 ఆపరేట్ చేయబడుతున్నాయి.
  • 450 హెలికాఫ్ట్ గంషిప్ స్క్వార్డెన్: ఎం.ఐ - 24, బ్రిటన్ - నార్మన్ ఐలాండర్-2బి, పి.సి - 9,

ఆర్ధికం

సైప్రస్ 
Central Bank of Cyprus

21 వ శతాబ్దం ఆరంభంలో సైప్రస్ ఆర్థికరంగం వివిధ మార్గాలకు విస్తరించబడింది. 2012 లో యురేపియన్ ఆర్థిక సంక్షోభం సైప్రస్ ఆర్థికరంగం మీద ప్రభావం చూపింది. సైప్రస్ ప్రభుత్వం సైప్రస్ పాపులర్ బ్యాంక్‌ను బలపరచడానికి 1.8 బిలియన్ల యూరోలు అవసరమని ప్రకటించింది. తరువాత ఫిట్చ్ గ్రూప్ పతనావస్థ ఆరంభం అయింది.

సైప్రస్ 
Cyprus is part of a monetary union, the eurozone (dark blue) and of the EU single market.
సైప్రస్ 
Limassol General Hospital

సమీప కాల " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " అంచనాలు అనుసరించి సరాసరి జి.డి.పి, కొనుగోలు శక్తి 30,769 అమెరికన్ డాలర్లు ఉంటుదని భావిస్తున్నారు. సైప్రస్ పన్నుల శాతం తగ్గించి విదేశీ వాణిజ్యానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఆర్థికరంగానికి పర్యాటకరంగం, ఆర్థికసేవలు, షిప్పింగ్ గణీయమైన సహకారం అందిస్తున్నాయి. సైప్రస్ ఆర్థిక విధానం యురేపియన్ యూనియన్ ఆధారితంగా రూపొందించబడి ఉంది. 2008 జనవరి 1 నుండి సైప్రస్ యురేపియన్ కరెంసీని దత్తత తీసుకుంది. సమీప కాలంలో సైప్రస్ అధికారపరిమితికి వెలుపలి ప్రాంతలో కనిపెట్టబడిన సహజవాయువుల నిక్షేపాలు లభించడం దేశం ఆర్థికంగా బలపడడానికి సహకరిస్తుంది. అయినప్పటికీ 2013 నుండి గ్యాస్, ఆయిల్ వనరులను టర్కిష్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. సైప్రస్, ఈజిప్ట్ మద్య సముద్రసరిహద్దు 2003, లెబనాన్ సరిహద్దు 2007 లో రూపొందించబడ్డాయి. సైప్రస్, ఇజ్రాయిల్ సముద్రతీర సరిహద్దు 2010లో రూపొందించబడింది. 2011 యు.ఎస్ సంస్థ" నోబుల్ ఎనర్జీ " సైప్రికాట్ టర్కీతో భాస్వామ్యంతో వాణిజ్య ఒప్పదం చేసుకుంది. తరువాత సంస్థ నావికా దళం సైప్రస్ చేరుకుని డ్రిల్లింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సైప్రస్ డ్రిల్లింగ్ ప్రయత్నాలకు యు.ఎస్, యూరప్, యునైటెడ్ కింగ్డం మద్దతు ఇచ్చింది. 2011 సెప్టెంబర్ 19 నుండి డ్రిల్లింగ్ మొదలైంది. విదేశీ పెట్టుబడి దారులు, పర్యా టకులు అధికంగా వస్తున్న కారణంగా సైప్రస్ ఆస్తి, అద్దె మార్కెట్ అభివృద్ధిదశలో పయనిస్తుంది. .[ఎప్పుడు?] 2013 లో సైప్రస్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు వరుస ప్రణాళికులు ప్రకటించింది. తరువాత సైప్రస్‌లో పెట్టుబడులు పెడుతున్న విదేశీయులకు ఇమ్మిగ్రేషన్ అనుమతులు మంజూరు చేయబడ్డాయి.

ప్రయాణసౌకర్యాలు

సైప్రస్‌లో రహదారి మార్గం, సముద్ర మార్గం, వాయు మార్గాలలో ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. 1998 నాటికి సైప్రస్ రిపబ్లిక్‌లో 10663 కి.మీ 10,663 km (6,626 mi) పొడవైన రోడ్లు ఉన్నాయి. వీటిలో పొడవైన రహదార్లు 6,249 km (3,883 mi) పేవ్ చేయబడ్డాయి. , పొడవైన రహదార్లు 4,414 km (2,743 mi) పేవ్ చేయబడనివి. 1966 లో ఆక్రమిత టర్కిష్ ప్రాంతంలో దాదౌ.ఇదే నిష్పత్తిలో పేవ్ చేసిన, పేవ్ చేయబడని రహదార్లు ఉన్నాయి(1,370 km (850 mi) పేవ్ చేసిన రహదార్లు, 980 km (610 mi) పేవ్చేయబడని రహదార్లు). [ఆధారం చూపాలి] బ్రిటిష్ విధానంలో వాహనాలను నడుపుతున్న 4 యూరప్ దేశాలలో సైప్రస్ ఒకటి. మిగిలిన 3 దేశాలలో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, మాల్టా, యునైటెడ్ కింగ్డం. రహదార్లు, మోటర్ మార్గాలు దేశంలోని తూర్పు సముద్రతీరంలోని పఫోస్ నుండి అయియా నపా వరకు ఉన్నాయి. అంతేకాక దేశం నుండి నికోసియా వరకు రెండు మోటర్ మార్గాలు ఉన్నాయి(లిమాసోల్, లర్నక). సరాసరి కార్ల యనమాన్యంలో సైప్రస్ ప్రంపంచదేశాలలో 29వ స్థానంలో ఉంది.2006 గణాంకాల ఆధారంగా సైప్రస్‌లోని నమోదు చేయబడిన 517,000 వాహనాలలో 344,000 ప్రైవేట్ యాజమాన్యం కలిగి ఉన్నాయి. 2006 లో సైప్రస్ అంతటా బసు, ఇతర రవాణా సౌకర్యాలను " యురేపియన్ యూనియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ సహాయంతో మెరుగుపరచే ప్రయత్నాలు ఆరంభించారు. 2010 నుండి సరికొత్తగా బసుసర్వీసులు ఆరంభించబడ్డాయి. సైప్రస్‌లో పలు హెలీకాఫ్టర్, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. లామాకా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, పాఫోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నాయి. టర్కిష్ సైప్రియాట్ ప్రాంతంలో మూడవదిగా " ఎర్కాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి టర్కీకి విమానాలు నడుపబడుతున్నాయి. 1974 నుండి " నికోసా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " మూసివేయబడి ఉంది. లింసోల్ పోర్ట్, లర్నకా నౌకాశ్రయాలు కార్గో, పాసింజర్ సేవలు అందిస్తున్నాయి.

సమాచారరంగం

సైప్రస్‌లో ప్రభుత్వ సంస్థ సిటా ఆధ్వర్యంలో పలు సమాచారాసంస్థలు, అంతర్జాలసంస్థలు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ఎం.టి.ఎన్, గ్రూప్, కేబుల్ నెట్, ఓ.టి.ఇ నెట్ టెలికాం, ఒమృగా టెలికాం, ప్రైం టెల్ మొదలైన ప్రైవేట్ సంస్థలు కూడా దేశంలో సమాచారసేవలు అందిస్తున్నాయి. టర్కీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో టర్కిక్ సెల్, కె.కె.టి.సి టెల్సిం, టర్క్ టెలికాం సంస్థలు ఉన్నాయి.

గణాంకాలు

సైప్రస్ 
Population growth (numbers for the entire island, excluding Turkish settlers residing in Northern Cyprus).
సైప్రస్ 
Population structure

2001లో సి.ఐ.ఎ. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ నివేదిక అనుసరించి సైప్రస్ ప్రజలలో 77% గ్రీకు సైప్రికాట్లు, టర్కిష్ సైప్రికా ట్లు 18%, ఇతరులు 5% ఉన్నారని అంచనా. 2011 సైప్రస్ ప్రభుత్వ గణాంకాలను అనుసరించి సైప్రస్‌లో రష్యన్ స్థానికత కలిగిన ప్రజలు 10,520 మంది నివసిస్తున్నారని అంచనా. స్వతంత్రం లభించిన తరువాత 1960లో మొదటిసారిగా నిర్వహించిన గణాంకాల ఆధారంగా సైప్రస్ జనసంఖ్య ప్రజలలో రష్యన్లు 10,520, మొత్తం ద్వీపంలోని ప్రజలసంఖ్య 5,73,566. వీరిలో 442,138 (77.1%) గ్రీకుప్రజలు, 104,320 (18.2%) టర్కిష్ ప్రజలు, 27,108 (4.7%) ఇతరులు ఉన్నారు. 1963-1974 మద్య తలెత్తిన జాతి సంఘర్షణల కారణంగా ద్వీపం మొత్తం గణాంకాల నిర్వహణ సాధ్యం కాలేదు. అయినప్పటికి 1973లో గ్రీక్ సైప్రికాటులు టర్కిష్ సైప్రికాటులను మినహాయిస్తూ గణాంకాలు నిర్వహించింది. గణాంకాలను అనుసరించి గ్రీకు సైప్రికాటుల సంఖ్య 482,000. సైప్రికాట్ ప్రభుత్వగణాంకాల ఆధారంగా సైప్రస్ ప్రజల సంఖ్య 641,000. వీరిలో 506,000 (78.9%) గ్రీకులు, 118,000 (18.4%)టర్కిష్ ప్రజలు ఉన్నారు. 1974 ద్వీపం విభజన తరువాత గ్రీకు సైప్రికాటులు 4 గణాంకాలు నిర్వహించారు (1976,1982,1992, 2001). అదనంగా ద్వీపం ఉత్తర భాగంలో టర్కిష్ సైప్రియాటులు ఉన్నారు.2005లో సైప్రస్ రిపబ్లిక్ గణాంకాల ఆధారంగా సైప్రికాట్ ప్రజల సంఖ్య 8,71,036. అదనంగా సైప్రస్‌లో 1,10,200 మంది ఫారిన్ పర్మనెంట్ రెసిడెంట్లు నివసిస్తున్నారు. అంతేకాక సైప్రస్‌లో 10,000 - 30,000 మంది చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని అంచనా.

Largest groups of foreign residents
దేశం జనసంఖ్య (2011)
గ్రీకు 29,321
యునైటెడ్ కింగ్డం 24,046
రొమానియా 23,706
బల్గేరియా 18,536
ఫిలిప్పైన్స్ 9,413
రష్యా 8,164
శ్రీలంక 7,269
వియత్నాం 7,028
సిరియా 3,054
ఇండియా 2,933

2006 నార్తెన్ సైప్రస్ గణాంకాలను అనుసరించి నార్తెన్ సైప్రస్ ప్రజల సంఖ్య 256,644. వీరిలో 178,031 సైప్రస్ పౌరసత్వం కలిగిన వారున్నారు. వీరిలో 147,405 మందికి జజ్మస్థానం సైప్రస్. (1,12,534 మంది ఉత్తర సైప్రస్‌లో జన్మించగా 32,538 మంది దక్షిణ సైప్రస్‌లో జమ్నించార్. 371 వారి జన్మస్థానం వివరించలేదు), 27,333 మంది టర్కీ, 2,482 మంది యు.కె, 913 మంది బల్గేరియాలో జన్మించారు. 120,031మంది తల్లితండ్రులు ఇద్దరూ సైప్రసులో జన్మించినవారు. 16,824 మంది ప్రజలు తల్లితండ్రులు ఇద్దరూ టర్కీలో జన్మించినవారు. 10,361 మందికి తల్లితండ్రులలో ఒకరు టర్కీలో మరొకరు సైప్రస్‌లో జన్మినవారున్నారు. 2010 లో ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ సైప్రస్ మొత్తం జనసంఖ్య 1.1 అని అంచనావేసింది. వారి అంచనా ఆధారంగా ఉత్తర సైప్రస్‌లో నివసిస్తున్న 3,00,000 మందిలో సగం టర్కీలో జన్మించడం కాని లేక వారి వారసులు కాని ఉన్నారని భావిస్తున్నారు. మరొక వనరు ఆధారంగా జనసంఖ్య 5,00,000 చేరుకున్నదని భావిస్తున్నారు. వీరిలో 50% టర్కీ వలస ప్రజలని భావిస్తున్నారు. పొటామియా గ్రామాలు (నికోసియా జిల్లా) పిలా లర్నకా జిల్లాల ప్రాంతాలు మాత్రమే సైప్రియాస్ లోని వలసప్రజల నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. మిగిలిన ప్రాంతమంతా గ్రీకు, టర్కీలకు చెందిన ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. [ఆధారం చూపాలి]

గ్రీకు- టర్కీలకు చెందిన సైప్రస్ ప్రజలు యునైటెడ్ కింగ్డం, కెనడా, యునైటెడ్ స్టేట్స్, గ్రీస్, టర్కీలలో నివసిస్తున్నారు.

మతం

Religion in Cyprus (Pew Research)
religion percent
Eastern Orthodoxy
  
78%
Islam
  
20%
Other
  
1%
None
  
1%

గ్రీకు సైప్రియాట్ ప్రజలలో అధికంగా గ్రీక్ ఆర్థడాక్స్ మతానికి చెందినవారున్నారు. టర్కీ సైప్రియాటులలో అధికంగా సున్నీ ముస్లిములు ఉన్నారు. యూరో బారోమీటర్ ఆధారంగా యురేపియన్ యూనియన్‌లో సైప్రస్ అత్యంత మతప్రాధాన్యత కలిగిన రెండవ దేశంగా గుర్తించబడుతూ ఉంది (2005 వరకు రోమానియా యురేపియన్ యూనియన్‌లో చేర్చబడ లేదు). మొదటి స్థానంలో మాల్టా ఉంది. ప్రస్తుతం రోమానియా యురేపియన్ యూనియన్‌లో అత్యధిక మతప్రాధాన్యత కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. సైప్రస్ మొదటి అధ్యక్షుడు మూడవ మెకరోయిస్ ఒక ఆర్చిబిషప్. ప్రస్తుత గ్రీక్ ఆథడాక్స్ చర్చికి రెండవ క్రిస్టోమస్ ఆర్చిబిషప్‌గా నియమించబడ్డాడు. లర్నా సాల్ట్ లేక్ సమీప ంలో ఉన్న హాలా సుల్తాన్ టెక్కే సున్నీ ముస్లిముల మూడవ పవిత్ర ప్రదేశంగా భావిస్తున్నారు. ఇది ముస్లిములకు, క్రైస్తవులకు పవిత్ర యాత్రాప్రదేశంగా ఉంది. 2001 ప్రభుత్వ నియంత్రిత ప్రాంతం గణాంకాలను అనుసరించి సైప్రస్‌ రిపబ్లిక్‌లో 94.8% ప్రజలు ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చికి చెందినవారు, 0.9% ఆర్మేనియన్, మారోనైట్ చర్చికి మతానికి చెందిన వారు, 1.5% రోమన్ కాథలిక్కులు, 1.0% ఇంగ్లాండ్ చర్చికి చెందిన వారు, 0.6% ముస్లిములు ఉన్నారు. సైప్రస్‌లో యూదులు కూడా నివసిస్తున్నారు. 1.3% ఇతరమతాలకు చెందినవారు ఉన్నారు.

భాషలు

సైప్రస్ 
The Armenian Alphabet at the Melkonian Educational Institute. Armenian is recognised as a minority language in Cyprus.
సైప్రస్ 
Cyprus road signs in Greek and English. An estimate of 87% of the Cypriot population speaks English.

సైప్రస్‌లో గ్రీకు, టర్కిష్ భాషలు రెండూ అధికార భాషలు ఉన్నాయి. ఆర్మేనియన్ భాష, సైప్రస్ మేరోనైట్ అరబిక్ భాషలు అల్పసంఖ్యాక భాషలుగా ఉన్నాయి. అయినప్పటికీ అధికార హోదా లేకుండా ఇంగ్లీష్ దేశంమంతటా వాడుకలో ఉంది. ఇంగ్లీష్ రహదారి గుర్తులు, ప్రభుత్వ హెచ్చరికలు, ప్రకటనలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. 1960 వరకు బ్రిటిష్ కాలనీ పాలనలో ఇంగ్లీష్ అధికారభాషగా ఉంది. 1989 వరకు కోర్టులలో కూడా ఇంగ్లీష్ వాడుకలో ఉంది. పార్లమెంటులో 1961 వరకు వాడుకలో ఉంది. 80.4% సైప్రికాట్ ప్రజలు ఇంగ్లీష్‌ను ద్వితీయ భాషగా ఎంచుకుని ఆగ్లభాషా ప్రానీణ్యత కలిగి ఉన్నారు. సైప్రస్‌లో అల్పసంఖ్యాకులకు, పురాతన సోవియట్ దేశాల ప్రజలకు, పొనెటిక్ గ్రీకులకు రష్యన్ భాష వాడుక భాషగా ఉంది. రష్యన్, ఇంగ్లీష్, గ్రీకు భాషలు వాడుక భాషలుగా ఉన్నాయి. ఇవి లిమాసోల్, పాఫోస్ ప్రాంతాలలోని కొన్ని రెస్టారెంట్లు, షాపులలో వాడుకలో ఉన్నాయి. అదనంగా 12 % ప్రజలకు ఫ్రెంచ్, 5% మందికి జర్మన్ భాషలు వాడుక భాషలుగా ఉన్నాయి. గ్రీకు సైప్రియాట్ ప్రజలు దినసరి జీవితంలో సైప్రియాట్ గ్రీకు, టర్కిష్ సైప్రియాట్ ప్రజలకు సైప్రియాట్ టర్కిష్ వాడుక భాషగా ఉంది. వ్యవహార భాషలు రెండు వాటి స్థానికత కంటే వ్యత్యాసంగా ఉంటాయి.

విద్య

సైప్రస్ 
Faneromeni School is the oldest all-girl primary school in Cyprus.

సైప్రస్ రిపబ్లిక్‌లో అభివృద్ధి చెందిన ప్రాథమిక, మాద్యమిక విద్యా విధానం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు విద్యను అందజేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం జి.డి.పిలో 7% వ్యయంచేస్తుంది. ఐరోపా దేశాలలో విద్యకొరకు అత్యధిక వ్యయం చేస్తున్న దేశాలలో సైప్రస్ 3 స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో డెన్మార్క్, స్వీడన్ దేశాలు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలతో సమానమైన నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలలో చివరిస్థాయి నుండి 25% ఫలితాలు మాత్రమే పరిగణనకు తీసుకొనబడతాయి. మిగిలిన 75% మార్కులను సెమెస్టర్ పద్ధతిలో ఉపాద్యాయుల ద్వారా లభిస్తాయి. సైప్రికాట్ విశ్వవిద్యాలయాలు హైస్కూల్ గ్రేడ్‌కు ప్రధాన్యత కలిగించదు. విశ్వవిద్యాలయ ప్రవేశానికి హైస్కూల్ డిప్లొమా కలిగి ఉండడం తప్పనిసరి అయినా ప్రభుత్వం నిర్వహించే ప్రవేశపరీక్షల ఫలితాలను అనుసరించి విశ్వవిద్యాలయ ప్రవేశం నిర్ణయించబడుతుంది.

సైప్రికాటులు ఉన్నత విద్యను గ్రీకు, బ్రిటిష్, టర్కిష్, ఇతర యురేపియన్ విద్యాసంస్థలు, ఉత్తర అమెరికా విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. సైప్రస్ ఉద్యోగులలో 30% యురేపియన్ విద్యార్హత కలిగిఉన్నారు. 25-34 మద్య వయసున్న పౌరులలో 47% ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నారు. సైప్రికాట్ విద్యార్థులలో 78.7% విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేస్తున్నారు.

సంస్కృతి

సైప్రస్ 
Limassol Carnival Festival in 2014

గ్రీకు సైప్రియాటులు, టర్కిష్ సైప్రియాటులు పరస్పరం సంస్కృతిని ఒకరితోఒకరు పంచుకుంటున్నా కొన్ని భేదాలు ఉన్నాయి. పలు సంప్రదాయ ఆహారాలు (సౌవ్లా), హలౌమి, పానీయాలు ఒకేమాదిరిగా ఉంటాయి. అతిధులకు ఆహారాలు పానీయాలు ఇస్తూ అతిథి సత్కారాలు చేయడం రెండు సమాజాలలో ఒకటిగానే ఉంటాయి. రెండు సమాజాలలో సంగీతం, నృత్యం, కళలు సాంఘిక జీవితంలో భాగంగా ఉంటాయి. అయినప్పటికీ రెండు సమాజాలు రెండు వేరు వేరు మతవశ్వాసాలను, మతసంప్రదాయాలను ఆచరిస్తూ ఉన్నారు. గ్రీకు సైప్రియాట్లు " గ్రీకు ఆర్థడాక్స్ చర్చి, టర్కిష్ సైప్రికాట్లు సున్నీ ముస్లిం మతావలంబకులుగా ఉన్నారు. గ్రీకు సైప్రికాట్లు గ్రీకు, క్రైస్తం ప్రభావితులై ఉన్నారు. టర్కిష్ సైప్రియాట్లు టర్కీ, ఇస్లాం మత ప్రభావితులై ఉన్నారు. లిమాసోల్ కార్నివాల్ ఉత్సవం లిమాసోల్‌లో వార్షికంగా నిర్వహించబడుతుంది. 20వ శతాబ్దంలో ఆరంభించబడిన ఈ ఉత్సవం సైపేస్‌లో చాలాప్రాబల్యత సంతరించుకుంది.

కళలు

సైప్రస్ 
Typical Cypriot architecture in old part of Nicosia, Cyprus

సైప్రస్ కళలకు 10,000 సవత్సరాల పూర్వ చరిత్ర ఉంది. ఖొయిరోఖొయిటియా, లెంపా గ్రామాలలో సున్నపురాతి కాలానికి చెందిన చెక్కిన శిలారూపాలు కనుగొనబడ్డాయి. సైప్రస్ మద్యయిగానికి చెందిన ప్రముఖ మతసంబంధిత చిత్రాలకు నిలయం. అలాగే చర్చీలకు క్రైస్తవ మతప్రాధాన్యత కలిగిన చర్చీలకు కూడా సైప్రస్ నిలయంగా ఉంది. లాటిన్ ఆధిఖ్యత కాలానికి (1191-1958) ఇటాలియన్ ఆర్కిటెక్చురల్ అవశేషాలు కూడా సైప్రస్‌లో లభించాయి. ఆధునిక కాల కళాచరిత్ర వెనిస్‌లో ఫైన్ ఆర్ట్స్ అభ్యసించిన వసిలిస్ వ్రియోనిడీస్ (1883-1958) తో ఆరంభం అయింది. ఆధునిక సైప్రియాట్ కళలకు " లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన అడామంటియోస్ డియామంటిస్ (1900-1994), లండన్ లోని " సెయింట్ మార్టింస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ " లో అభ్యసించిన క్రిస్టోఫర్ సవా (1924-1968) ఆద్యులని భావిస్తున్నారు. పలుమార్గాలలో ఈ ఇద్దరు కళాకారులు తమ శైలి, నమూనాలతో సైప్రికాట్ కళలకు చిహ్నంగా ఉన్నారు. వారు అభ్యసించిన విద్యాసంస్థలు కూడా ప్రస్తుతరోజులలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. ప్రస్తుతం సైప్రికాట్ కళాకారులు పలువురు లండన్ విద్యాసంస్థలలో అభ్యసిస్తున్నారు. గ్రీకులో ఇతరులు కళలో శిక్షణ పొందుతూ ఉన్నారు. అలాగే సైప్రస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ", యూనివర్శిటీ ఆఫ్ నికోసియా, ఫ్రెడరిక్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రాతీయ విద్యాసంస్థలు కళలలో శిక్షణ ఇస్తున్నాయి. ముంసిపల్ ఆర్ట్ గ్యాలరీలు అన్ని ప్రధాన పట్టణాలలో ఉన్నాయి. అక్కడ కళాఖండాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించబడుతుంటాయి. 2006లో సైప్రస్ " ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ "కు ఆతిథ్యం ఇచ్చే ఏర్పాటు డచ్- సైప్రస్ మద్య తలెత్తిన వివాదం కారణంగా చివరి నిముషంలో రద్దుచేయబడింది. ఇతర గ్రీకు సైప్రికాట్‌లో హెలెనే బ్లాక్, కలోపెడిస్ కుటుంబం, పనయియోటిస్ కలోర్కోటి, నికోలస్ నికోలైడెస్, స్టాస్ పరస్కోస్, అరెస్టిస్ స్టాసి, టెలెమాచోస్ కంతోస్, కొంస్టాంటియా సొఫొక్లౌస్, క్రిస్ అచిల్లియస్ మొదలైన ప్రముఖ కళాకారులు ఉన్నారు. టర్కిష్ సైప్రికాట్‌లలో ఇస్మెట్ గునే, రుజెన్ అటకన్, ముత్లు సెర్కెజ్ మొదలైన ప్రముఖ కళాకారులు ఉన్నారు.

సంగీతం

సైప్రస్ 
Lute; dominant instrument of the Cypriot traditional music.
సైప్రస్ 
Prominent Cypriot pop singer Michalis Hatzigiannis

సైప్రస్ సంప్రదాయ జానపద సంగీతంలో గ్రీకు సంగీతం, టర్కీ సంగీతం, అరబిక్ సంగీతం భాగస్వామ్యం వహిస్తున్నాయి. గ్రీకో- టర్కిష్ నృత్యరీతులలో సైస్త, సిర్తోస్, జెలెబికికోస్, తత్సియా, కర్సిలమాస్ నృత్యరీతులు వాడుకలో ఉన్నాయి. అలాగే మద్య ఆసియా ప్రభానితమైన త్సిప్తెతెలి నృత్యం, అరాపియస్ నృత్యం సైప్రస్‌లో చత్తిస్ట అనే సంగీత ప్రధానమైన సాహిత్యం కూడా వాడుకలో ఉంది. చత్తిస్ట సంప్రదాయ విందులు, ఉత్సవాలలో ప్రదర్శించబడుతూ ఉంటుంది. సైప్రస్ జానపద సంగీతంలో సాధారణంగా బౌజౌకి, ఓద్ (ఔటి), వయోలిన్ (ఫ్కియోలిన్), ల్యూటే (లవౌటే), అకార్డియన్, సైప్రస్ ఫ్లూట్, (పిత్కియావిన్), పర్క్యూషన్ (గుండ్రని డ్రమ్ము) వంటి వాద్యపరికరాలు ఉపయోగించబడుతుంటాయి. సైప్రస్ సంగీత రీతులలో ఎవాగొరాస్ కరజియోర్జిస్, మరియోస్ టొకాస్, సొలోన్ మైకేలిడీస్, సవ్వాస్ సలిడీస్ మొదలైనవి ప్రధాన్యత కలిగి ఉన్నాయి. సంగీత కళాకారులలో సంగీత కూర్పు, కళా దర్శకత్వం వహిస్తున్న మరియోస్ జన్నౌ ఎలియా, పియానో కళాకారుడు సైప్రియన్ కత్సరీస్ ప్రధాన్యత వహిస్తున్నారు.

సైప్రస్‌లో పాపులర్ మ్యూజిక్ మీద గ్రీకు లైకా ప్రభావం ఉంది. ఈ సంగితకళాకారులు అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్నారు.

సాహిత్యం

సైప్రస్ 
Zeno of Citium, founder of the Stoic school of philosophy.

సైప్రస్ పురాతన సాహిత్య ప్రక్రియగా గుర్తించబడుతున్న పద్య కావ్యం సైప్రియా క్రీ.పూ 7 వ శతాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు. సైప్రియా గ్రీకు యురేపియన్ కవిత్వంలో మొదటిదని భావిస్తున్నారు. సైప్రియాట్ " జెనో ఆఫ్ సిటియం " స్టోయిక్ ఫిలాసఫీ స్కూలును స్థాపించాడు.

సైప్రస్ 
Ioannis Kigalas (c. 1622–1687) was a Nicosia born Greek Cypriot scholar and professor of Philosophy who was largely active in the 17th century.

మద్యయుగంలో " ఆక్రిటిక్ సాంగ్స్ " అనే కావ్య కవిత్వం ప్రాబల్యత కలిగి ఉండేది. లియాంటియోస్ మచారియాస్ రచించున గాథ, జార్జియస్ వౌవ్స్ట్రోనియాస్ ఫ్రాంకిష్ పాలన (1489)!ముగింపుకు వచ్చే వరకు జరిగిన సంఘటనలు ఇందులో చోటుచేసుకున్నాయి. గ్రీకు సైప్రికాట్ డామౌర్ వ్రాసిన పద్యాలు 16 వ శతాబ్ధానికి చెందినవి. ద్వీపంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల కారణంగా పలువురు పండితులు సైప్రియాస్ నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. లవోనిస్ కిగలస్ (1622-1687) సైప్రియాస్ నుండి ఇటలీకి 17 వ శతాబ్దంలో వలస వెళ్ళాడు. ఆయన వ్రాసిన పలు రచనలు ఇతర పండితుల గ్రంథాలతో భద్రపరచబడ్డాయి. టర్కిష్ సైప్రియాట్ కవి హాసన్ హిలిమి ఎఫెండి ఓట్టమన్ సుల్తాన్ రెండవ మహ్ముద్ నుండి సత్కారం పొందాడు. ఆయన " సుల్తాన్ ఆఫ్ ది పోయంస్ "గా శ్లాఘించబడ్డాడు.

సైప్రస్ ఆధునిక సాహిత్యకారులలో కవి, రచయిత కొస్టాస్ మొంటిస్, కవి కిరియాకొస్ చరలంబిడేస్, కవి మిచలిస్ పసియార్డిస్, రచయిత నికోలైడెస్, స్టిలియాంస్ అటెషిల్స్, అల్థియోడ్స్, లొకిస్ అక్రితాస్ , డెమెట్రిస్ ట్.హె. గోట్సిస్ ప్రాధాన్యత కలిగి ఉన్నారు. డెనెట్రిస్ లిపర్టిస్, వసిల్లిస్ మైకేలిడీస్, పవ్లాస్ లియాసిడ్స్ జానపద గీతరచయితలుగా (ప్రధానంగా సైప్రికాట్ గ్రీకు) గుర్తించబడుతున్నారు. ప్రపంచ సాహిత్యంలో చోటు సంపాదించుకుంటున్న సైప్రియాస్ రచయితల సంఖ్య క్రమంగా అధికరిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న సైప్రియాస్ రచయితలలో రెండోతరం, ముడోతరం రచయితలు ఆగ్లసాగిత్యంలో అంతర్జాతీయ గుర్తింపు పొదుతూ ఉన్నారు. వీరిలో స్టీఫెన్ లౌగ్టంస్, మైకేల్ పరస్కోస్, స్టెల్ పవ్లవ్, స్టెఫనిస్ స్టెఫనిడేస్ ప్రముఖులు. విలియం షేక్స్ఫియర్ " ఒథెల్లో " నాటకం సైప్రస్ నేపథ్యం ఆధారితంగా రచింపబడింది. బ్రిటిష్ రచయిత లారెంస్ డ్యూరెల్ బ్రిటిష్ కాలనీ పాలనలో 1952-1956 వరకు నివసించాడు. సమీప కాలంలో విక్టోరియా హిస్పాల్ " సన్ రైస్ " (2014) పుస్తకానికి సైప్రస్ నేపథ్యంగా ఉంది.

సినిమా

ప్రఖ్యాత సైప్రికాట్ దర్శకుడు మైకేల్ కాకోయన్నిస్ విదేశాలలో పనిచేసి తన ప్రతిభను నిరూపించాడు. సైప్రికాట్ ఇతర దేశాల కంటే చాలా నిదానంగా మొదలైంది. 1960, 1970 జార్జి ఫిల్స్ " గ్రిగోరిస్ అఫ్క్సెంటియు ", ఎత్సి ప్రొడోతికె ఐ కిప్రోస్ ", ది మెగా డాక్యుమెంట్ చిత్రాలను తయారుచేసి దర్శకత్వం వహించాడు. 2009లో గ్రీకు దర్శకుడు రచయిత, నిర్మాత వసిల్లీస్ మజోమెనొస్ " గల్ట్ " సైప్రస్‌లో చిత్రీకరించాడు. ఈ చిత్రానికి 2012 లో లండన్ గ్రీకు ఫెస్టివల్‌లో బెస్ట్ స్క్రీన్ రైటింగ్ అవార్డ్ లభించింది. అంతేకాక మాంట్రియల్ వరల్డ్ ఫిల్ం ఫెస్టివల్, కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్ం ఫెస్టివల్, తల్లిన్ బ్లాక్ నైట్స్ ఫిల్ం ఫెస్టివల్, ఫెంటాస్ పోర్టో, అథెంస్‌లో నిర్వహించబడిన యురేపియన్ సినిమా చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ఎన్నిక చేయబడింది. 2010 లో హెలెనిక్ ఫిల్ం అకాడామీ ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎన్నిక చేసింది.

ఆహారసంస్కృతి

సైప్రస్ 
Cypriot meze

హలౌమీ చీస్ తయారీ సైప్రస్‌లో మొదలైంది. ఈ చీజ్ తయారీ మద్యయుగంలో బైజాంటిన్ కాలంలో ఆరంభించబడింది. హలౌమీ సాధారణంగా స్లైస్, ఫ్రెష్ లేక గ్రిల్డ్ చేసి అపిటైజర్‌గా అందించబడుతుంది.

సైప్రస్ 
Cypriot style cafeteria in an arcade in Nicosia

సముద్ర ఆహారాలలో స్క్విడ్, అక్టోబస్, రెడ్ ముల్లెట్, యురేపియన్ సీ బాస్ ప్రాధాన్యత వహిస్తున్నాయి. సలాడ్ తాయారీలో కుకుంబర్, టొమాటో అధికంగా ఉపయోగించబడుతుంది. సాధారణంగా ఆలివ్ ఆయిల్, ఉర్లగడ్డలు, పార్సిలీ, కాలీఫ్లవర్ ఊరగాయ, బీట్స్, అస్పరాగస్, టారో అధికంగా ఉపయోగించబడుతుంటాయి. ఇతర సంప్రదాయ ఆహారాలలో ఎండబెట్టిన, ఊరబెట్టిన మాసం, ధనియాలు, వైన్, ఎండబెట్టిన పొగబెట్టిన పోర్క్, బొగ్గుల మీద కాల్చిన లాంబ్, సౌవ్లకి (బిగ్గుల మీద కాల్చిన పోర్క్, చికెన్), షెఫ్తలియా (మింస్డ్ మీట్) ఉపయోగించబడుతుంటాయి. గోధుమ రొట్టెల తరువాత గోధుమ అటుకులు ప్రధాన ఆహారంగా ఉపయోగించబడుతుంది.

తాజా కూరగాయలు, పండ్లు సాధారణంగా ఆహారతయారీలో ఉపయోగించబడుతుంటాయి. తరచుగా కొర్రెగెట్స్, తాజా మిరియాలు, ఓక్రా, గ్రీన్ బీంస్, అర్టిచోక్స్, కేరట్, టొమాటో, కుకుంబర్, లెట్యూస్, ద్రాక్ష ఆకులు ఆహార తయారీలో ఉపయోగించబడుతుంటాయి. బీంస్, బ్రాడ్ బీంస్, పీస్, బ్లాక్ ఆఇడ్ బీంస్, చిక్ పీస్, లెంటిల్స్ మొదలైన పప్పుధాన్యాలు అహార తయారీలో ఉపయోగించబడుతుంటాయి. అత్యధికంగా పియర్స్, ఆఫిల్, ద్రాక్ష, ఆరెంజ్, మాండరిన్ ఆరంజ్,నెక్టేరియంస్, మెడ్లర్, బ్లాక్ బెర్రీ, చెర్రీ, స్ట్రాబెర్రీ, అత్తిపండ్లు, పుచ్చకాయలు, అవకాడో, నిమ్మ, పిస్తాచియో, బాదం, చెస్ట్ నట్, వాల్ నట్, హాజెల్ నట్ మొదలైన పండ్లు, శుష్కఫలాలను తరచుగా తీసుకుంటుంటారు.

సైప్రస్ డిసర్ట్ లకు కూడా ప్రసిద్ధిచెందుంది. లోకుం (దీనిని టర్కిష్ డిలైట్ అని కూడా అంటారు), సౌత్జౌకోస్ మొదలైన డిసర్టులకు ఆదరణ అధికంగా ఉంది. లోకుం తయారు చేయబడుతున్న జెరొస్కిపౌ గ్రామం కారణంగా సైప్రస్ " ప్రొటెక్టెడ్ గియోగ్రాఫికల్ ఇండికేషన్ "లో చేర్చబడింది.[ఆధారం చూపాలి]

క్రీడలు

సైప్రస్ 
Spyros Kyprianou Athletic Center in Limassol

సైప్రస్‌లో ప్రభుత్వ ఆధీనంలో " సైప్రస్ ఫుట్ బాల్ అసోసియేషన్, సైప్రస్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్, సైప్రస్ వాలీబాల్ ఫెడరేషన్, సైప్రస్ ఆటోమొబైల్ అసోసియేషన్, సైప్రస్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ " సైప్రస్ క్రికెట్ అసోసియేషన్, సైప్రస్ రగ్బీ ఫెడరేషన్, సైప్రస్ పూల్ అసోసియేషన్ మొదలైన క్రీడాబృందాలు ఉన్నాయి. సైప్రస్‌లోని ప్రముఖ క్రీడా బృందాలలో ఎ.పి.ఒ.ఇ.ఎల్ ఎఫ్.సి, అనొర్థొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి, ఎ.సి. ఒమొనియా, ఎ.ఇ.ఎల్. లెమెసోస్, అపొల్లన్ లిమసోల్, నియా సలమీస్ ఫమగుస్టా ఎఫ్.సి. ఎ.ఇ.కె లర్నక ఎఫ్.సి ప్రధానమైనవి.

స్టేడియంలు

జి.ఎస్.పి. స్టేడియం (సైప్రస్ ఆధీన ప్రాంతంలో అతి పెద్దది), త్సిరియాన్ స్టేడియం, నియో జి.ఎస్.జె. స్టేడియం, అంటోనిస్ పపడోపౌల్స్ స్టేడియం, అమ్మొచొస్టోస్ స్టేడియం, మకరియో స్టేడియం ఉన్నాయి.

2008-2009 లలో అనొర్తొసిస్ ఫమగుస్టా ఎఫ్.సి. యు.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడింది. తరువాత సీజన్‌లో ఎ.పి.ఒ.ఇ.ఎల్. ఎఫ్.సి " యు.ఇ.ఎఫ్.ఎ. చాంపియన్ లీగ్ కొరకు ఎన్నిక చేయబడింది.

సైప్రస్ నేషనల్ రగ్బీ యూనియన్ టీం ( మౌఫ్లాంస్ అని కూడా పిలువబడుతుంది)పలు అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పింది.

ఇతర క్రీడలు

టెన్నిస్ క్రీడాకారుడు మార్కోస్ బఘ్దాతిస్ ప్రపంచంలో 8 వ స్థానం సాధించాడు. తరువాత వింబుల్టన్ చాంపియన్‌ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. హై జంపర్ కిరియాకోస్ లోయానౌ జపాన్‌లోని ఒసాకాలో జరిగిన ఐ.ఎ.ఎ.ఎఫ్. వరల్డ్ చాంపియంషిప్ ఇన్ అథ్లెటిక్స్ పోటీలో 2,35 మీ దూరం దూకి కాంశ్యపతకం సాధించాడు. లాంగ్ జంప్ క్రీడలో ఆయన ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు. మిక్సెడ్ మార్షల్ ఆర్టిస్ట్ కొస్టాస్ ఫిలిప్పౌ అల్టిమేట్ ఫైటింగ్ చాంపియంషిప్ పూర్తి చేసి మిడి ఈస్ట్ స్థాయికి చేరుకున్నాడు. మీటర్ స్పోర్ట్స్‌లో టియో ఎల్లినాస్ రేస్ కార్ పోటీలలో విజయవంతంగా పాల్గొంటున్నాడు.

క్రిస్టోఫర్ పపమిచలోపౌలస్, సోఫియా పపమిచలోపౌలస్ కెనడా లోని వాంకోవర్‌లో జరిగిన " 2010 వింటర్ ఒలింపిక్స్‌ "లో పాల్గొనడానికి అర్హత సాధించారు.

2012 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలలో సెయిలర్ పవ్లొస్ కొంటిడెస్ సైప్రస్ కొరకు మొదటి ఒలింపిక్ పతకంగా రజితపతకాన్ని సాధించాడు.

గమనికలు

మూలాలు

Tags:

సైప్రస్ పేరువెనుక చరిత్రసైప్రస్ చరిత్రసైప్రస్ భౌగోళికంసైప్రస్ రాజకీయాలుసైప్రస్ ఆర్ధికంసైప్రస్ ప్రయాణసౌకర్యాలుసైప్రస్ సమాచారరంగంసైప్రస్ గణాంకాలుసైప్రస్ విద్యసైప్రస్ సంస్కృతిసైప్రస్ క్రీడలుసైప్రస్ గమనికలుసైప్రస్ మూలాలుసైప్రస్En-us-Cyprus.oggGreek languageISBN (identifier)ఇజ్రాయిల్ఈజిప్ట్గ్రీకుటర్కీదస్త్రం:En-us-Cyprus.oggప్రత్యేక:పుస్తకమూలాలు/0-7546-6437-6మూస:Cite bookలెబనాన్వర్గం:CS1 maint: extra punctuationసిరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

గురజాడ అప్పారావుప్రియా వడ్లమానిక్రోధికల్వకుంట్ల తారక రామారావుఏలకులుజాతీయ విద్యా విధానం 2020బర్రెలక్కభారత రాజ్యాంగ పీఠికరుద్రమ దేవిభారత ఆర్ధిక వ్యవస్థకడప లోక్‌సభ నియోజకవర్గంబి.ఆర్. అంబేద్కర్ రాజగృహంచెరువువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)యాదవముదిరాజ్ (కులం)తామర వ్యాధిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసర్పినవగ్రహాలునందమూరి బాలకృష్ణఉత్తరాభాద్ర నక్షత్రముశివపురాణంబ్రాహ్మణ గోత్రాల జాబితాశ్రీదేవి (నటి)వేమనసలేశ్వరంపులిజూదంమొదటి పేజీఎంసెట్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోపసుపు గణపతి పూజకుమ్మరి (కులం)ఉండేలుచతుర్దశ భువనాలువిజయనగర సామ్రాజ్యంసమ్మక్క సారక్క జాతరరష్మికా మందన్నరాజ్యసభనక్షత్రం (జ్యోతిషం)పరశురాముడుపోలీసులుతెలుగు నాటకరంగంసాయి ధరమ్ తేజ్శ్రీకాళహస్తిరాష్ట్రంరూపకాలంకారముఫేస్‌బుక్తెలుగుదేశం పార్టీదక్షిణ భారతదేశంగౌతమ బుద్ధుడుతెలుగుబౌద్ధ మతంధనూరాశియువరాజ్ సింగ్మదర్ థెరీసావాతావరణంమారేడువిద్యుత్తుటి. రాజాసింగ్ లోథ్కొబ్బరికారకత్వంరాజనీతి శాస్త్రముకులంతెనాలి రామకృష్ణుడుట్రావిస్ హెడ్రుహానీ శర్మమిథునరాశిసిరికిం జెప్పడు (పద్యం)పురాణాలుద్విగు సమాసముభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 001 – 075శ్రీ కృష్ణదేవ రాయలుగర్భాశయమురక్తంచందనా దీప్తి (ఐపీఎస్‌)పురుష లైంగికతఏప్రిల్ 15🡆 More