విజ్ఞానశాస్త్రం

విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది.

ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. గణిత శాస్త్రం లాంటివి సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఇంజనీరింగ్,, వైద్యశాస్త్రం లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.

విజ్ఞానశాస్త్రం
విశ్వం నమూనా

మధ్యయుగంలో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన అల్ హజెన్ అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు. ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు. ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని తత్వ శాస్త్రం ప్రకారం నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని విభజిస్తే మధ్యయుగపు మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా పదార్థాలను వివధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు.

17, 18 వ శతాబ్దాలలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరంగా తాము కనుగొన్న సత్యాలను కొన్ని ప్రకృతి నియమాల రూపంలోకి సూత్రీకరించే ప్రయత్నం చేశారు. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు రూపుదిద్దుకున్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఇంజనీరింగ్గణిత శాస్త్రంప్రకృతి శాస్త్రంవైద్యశాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

సిద్ధు జొన్నలగడ్డవిశ్వనాథ సత్యనారాయణఒంటిమిట్టనానార్థాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపార్లమెంటు సభ్యుడురోహిణి నక్షత్రంకరణంమాధ్యమిక విద్యసింహంమన బడి నాడు నేడుహరిశ్చంద్రుడుగుమ్మడిపమేలా సత్పతిఆంధ్రజ్యోతితెలుగు సినిమాభారతదేశ అత్యున్నత న్యాయస్థానంహైదరాబాదుపరిటాల రవిమంగళవారం (2023 సినిమా)మంతెన సత్యనారాయణ రాజుతులారాశిప్లాస్టిక్ తో ప్రమాదాలుప్రదీప్ మాచిరాజుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురాధికా పండిట్సమాచార హక్కుకోదండ రామాలయం, ఒంటిమిట్టమహాసముద్రంయూట్యూబ్భీమా (2024 సినిమా)వర్షంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుమురుడేశ్వర ఆలయంచెమటకాయలువెలిచాల జగపతి రావువాయవ్యంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఅరవింద్ కేజ్రివాల్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాన్యుమోనియాఇందిరా గాంధీమామిడిజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిరామ్ చ​రణ్ తేజపూరీ జగన్నాథ దేవాలయంవిశాల్ కృష్ణఅశ్వని నక్షత్రముహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపాముప్రేమ (1989 సినిమా)తెలంగాణ గవర్నర్ల జాబితాపొట్టి శ్రీరాములురావణుడురామప్ప దేవాలయంనరేంద్ర మోదీఇండియన్ ప్రీమియర్ లీగ్గోవిందుడు అందరివాడేలేతామర వ్యాధిరావి చెట్టుకల్లుఖండంరాష్ట్రంవంగవీటి రంగాపంచభూతలింగ క్షేత్రాలుAకాళోజీ నారాయణరావువారాహిపార్వతివిటమిన్ బీ12మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనారా బ్రహ్మణిచిరుధాన్యంకేంద్రపాలిత ప్రాంతంరాజస్తాన్ రాయల్స్ప్రియురాలు పిలిచిందిపుష్పనాగార్జునసాగర్🡆 More