టాంజానియా

టాంజానియా అధికారంగా యునైటెడు రిపబ్లికు ఆఫ్ టాంజానియా అని పిలువబడుతుంది.

(ఆంగ్లం : The United Republic of Tanzania తూర్పు ఆఫ్రికా లోని ఒక సార్వభౌమ రాజ్యం. ఇది గ్రేటు లేక్ ప్రాంతంలో ఉంది. దేశ ఈశాన్యసరిహద్దులో కెన్యా ఉంది. తూర్పులో హిందూమహాసముద్రం లోని కొమరో ద్వీపాలు ఉన్నాయి. ఉత్తరసరిహద్దులో ఉగాండా ఉంది. పశ్చిమసరిహద్దులో రువాండా, బురుండీ, కాంగో ఉన్నాయి. దక్షిణసరిహద్దులో జాంబియా, మలావి ఉన్నాయి. ఆగ్నేయసరిహద్దులో మొజాంబిక్ ఉంది. తూర్పు సరిహద్దులో హిందూ మహాసముద్రం ఉంది. టంజానియా ఈశాన్యప్రాంతంలో ఉన్న కిళిమంజారో పర్వతప్రాంతం ఆఫ్రికా అత్యున్నత ప్రాంతంగా గుర్తించబడుతుంది.

జమ్‌హూరియా మూంగానో వ తాంజానియా
యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా
Flag of టాంజానియా టాంజానియా యొక్క చిహ్నం
నినాదం
"ఉహురూ నా ఉమోజా"  (Swahili)
"స్వేచ్ఛా, సమానత్వం"
జాతీయగీతం
ముంగూ ఇబారికి ఆఫ్రికా
"దేవుడు ఆఫ్రికాను దీవించుగాక (God Bless Africa)"
టాంజానియా యొక్క స్థానం
టాంజానియా యొక్క స్థానం
రాజధానిడొడోమా
అతి పెద్ద నగరం దార్ ఉస్ సలాం
అధికార భాషలు స్వాహిలి (de facto)
ఆంగ్లం (Higher courts, higher education)
ప్రజానామము టాంజానియన్
ప్రభుత్వం రిపబ్లిక్
 -  అధ్యక్షుడు Jakaya Mrisho Kikwete
 -  ప్రధానమంత్రి Mizengo Pinda
స్వాతంత్ర్యం యునైటెడ్ కింగ్ డం నుండి 
 -  Tanganyika December 9, 1961 
 -  Zanzibar January 12, 1964 
 -  Merger April 26, 1964 
 -  జలాలు (%) 6.2
జనాభా
 -  నవంబరు 2006 అంచనా 40,000,000 (32వది)
 -  2005 జన గణన 37,445,392 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $48.921 బిలియన్లు 
 -  తలసరి $1,255 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $16.691 billion 
 -  తలసరి $428 
జినీ? (2000–01) 34.6 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) Increase 0.503 (medium) (153వది)
కరెన్సీ Tanzanian shilling (TZS)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tz
కాలింగ్ కోడ్ ++2552
1 Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.
² 007 from Kenya and Uganda.

6 మిలియన్ల సంవత్సరాల క్రితం టాంజానియాలో ప్లయోసీన్ అని పిలిచే మొట్టమొదటి మానవులు నివసించారని భావిస్తున్నారు. ఆస్త్రోపతిహేకసు జాతి ఆఫ్రికా అంతటా 4-2 మిలియన్ల సంవత్సరాల క్రితం నివసించారు. హోమో జాతికి చెందిన ప్రాచీన అవశేషాలు ఓల్డ్వాయి సరోవరం సమీపంలో కనిపిస్తాయి. 1.8 మిలియన్ల సంవత్సరాల క్రితం హోమో ఎరేక్టసు పెరుగుదల తరువాత మానవజాతి పురాతన ప్రపంచం అంతటా వ్యాపించిన తరువాత హోమో సేపియన్లు పేరుతో ఆస్ట్రేలియాకు వ్యాపించాయి. హోమో సేపియన్లు ఆఫ్రికామీద కూడా ఆధిక్య సాధించాయి. వీరు పురాతన జాతులు, ఉపజాతులను విలీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఉనికిలో ఉన్న పురాతన జాతి సమూహాలలో ఒకటైన హడ్జజా టాంజానియాలో ఉద్భవించిందని భావిస్తున్నారు. వారి మౌఖిక చరిత్ర పూర్వం ఉన్న పూర్వీకులను గుర్తుచేస్తుంది. వారు అగ్ని, ఔషధం ఉపయోగిస్తూ, గుహలలో నివసించిన మొదటి మానవులని భావిస్తున్నారు. హోమో ఎరేక్టసు, హోమో హేడిల్బెర్గేన్సిసు లని పిలువబడిన ఈ ప్రజలు ఇదే ప్రాంతంలో నివసించారని భావిస్తున్నారు.

టాంజానియాలో రాతియుగం, కాంస్య యుగంలో ప్రస్తుత దక్షిణ ఇథియోపియా నుండి దక్షిణానికి వచ్చిన దక్షిణ కుషిటికు మాట్లాడే ప్రజల చారిత్రపూర్వ వలసలు సంభవించాయి. 2,000 - 4,000 సంవత్సరాల క్రితం టాంజానియాలో తుర్కనా సరసుకు ఉత్తరాన ఉన్న తూర్పు కుషిటిక్ ప్రజలు; 2,900 - 2,400 సంవత్సరాల క్రితం మధ్య ప్రస్తుత దక్షిణ సుడాన్-ఇథియోపియా సరిహద్దు ప్రాంతము నుండి వచ్చిన డాటోగు ప్రజలతోతో సహా దక్షిణ నిలోట్సు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పశ్చిమాఫ్రికా లోని తంగన్యికా సరోవరం, విక్టోరియా సరోవరం ప్రాంతాలలో బంటుప్రజలు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు. తర్వాత వారు 2,300 - 1,700 సంవత్సరాల క్రితం టాంజానియా మిగిలిన ప్రాంతాలకు వలస వచ్చారు.

19 వ శతాబ్దం చివరిలో " జర్మనీ తూర్పు ఆఫ్రికా " స్థాపించబడడంతో టంజానియా ప్రధాన భూభాగంలో ఐరోపా వలసవాదం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇది బ్రిటీషు పాలనకు దారితీసింది. ప్రధాన భూభాగం టాంగ్యానికాగా పరిపాలించబడింది. జాంజిబారు ద్వీపసమూహం ప్రత్యేక న్యాయపరిధిలో ఉంది. 1961 - 1963 లలో అవి స్వతంత్రత పొందిన తరువాత రెండు ప్రాంతాలు 1964 ఏప్రెలులో విలీనమై " యునైటెడు రిపబ్లికు ఆఫ్ తంజానియా " రూపొందించాయి.

2016 లో టంజానియా జనసంఖ్య 55.57 మిలియన్లకు చేరుకున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రజలలో అనేక జాతి, భాషా, మత సమూహాలున్నాయి. టాంజానియా సార్వభౌమ రాజ్యం. ఇది రాష్ట్రపతి రాజ్యాంగ రిపబ్లిక్కు. 1996 నుండి డోడోమా దాని అధికారిక రాజధాని నగరంగా ఉంది. ఇక్కడ రాష్ట్రపతి కార్యాలయం, జాతీయ అసెంబ్లీ, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మాజీ రాజధాని అయిన దార్ ఎస్ సలాంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇది దేశంలోని అతి పెద్ద నగరంగా ప్రధాన నౌకాశ్రయం, ప్రముఖ వ్యాపార కేంద్రంగా గుర్తించబడుతుంది. టాంజానియా ఏకపార్టీ దేశం. ప్రజాస్వామ్య సామ్యవాద పార్టీ అయిన " చమా చ మపిండుజి " పార్టీ అధికారంలో ఉంది.

టాంజానియా ఈశాన్యంలో పర్వతాలు, దట్టమైన అడవులను కలిగి ఉంది. ఇక్కడ కిలిమంజారో పర్వతం ఉంది. ఆఫ్రికా గ్రేటు లేక్సు మూడు భాగాలు టంజానియాలో భాగంగా ఉంది. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో విక్టోరియా సరసు (ఆఫ్రికా, అతి పెద్ద సరస్సు) ఉంది. అదనంగా టాంకన్యిక సరస్సు ( ఆఫ్రికాఖండంలో లోతైన సరస్సు, ఇది చేపల కోసం ప్రసిద్ధి చెందింది) ఉంది. దక్షిణప్రాంతంలో మాలావి సరసు ఉంది. తూర్పు తీరం వేడి, తేమతో కూడి ఉంటుంది. జాంజిబారు ద్వీపసమూహం సముద్రంలో ఉంది. మెనాయి బే కన్జర్వేషను ఏరియా జాంజిబారు అతిపెద్ద సముద్ర రక్షిత ప్రాంతంగా ఉంది. జాంబియా సరిహద్దు వద్ద కలాంబో నదిపై ఉన్న కలాంబో జలపాతాలు ఆఫ్రికాలో రెండవ అత్యధిక ఎడతెగని జలప్రవాహం కలిగిన జలపాతంగా ప్రత్యేకత కలిగి ఉంది.

టాంజానియాలో 100 కన్నా ఎక్కువ భాషలు వాడుకలో ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో ఇది చాలా భాషా వైవిధ్యం కలిగిన దేశంగా ఉంది. దేశంలో అధికారిక భాష లేదు. [ఆధారం చూపాలి] అయితే జాతీయ భాషగ స్వాహిలీ ఉంది. స్వాహిలీ భాషను సుప్రీం పార్లమెంటరీ చర్చలో, దిగువ కోర్టులలో, ప్రాథమిక పాఠశాలలో బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు. ఇంగ్లీషును విదేశీ వాణిజ్యం, దౌత్యత్వంలో, ఉన్నత న్యాయస్థానాలలో, ద్వితీయ, ఉన్నత విద్యలో బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు. అయితే టాంజానియా ప్రభుత్వం ఇంగ్లీష్ను పూర్తిగా అభ్యసించే భాషగా నిలిపివేయాలని యోచిస్తోంది. సుమారుగా 10 % మంది టాంజానియావారు మొదటి భాషగా స్వాహిలి వాడుకభాషగా ఉంది. 90% వరకు రెండవ భాషగా మాట్లాడతారు.

పేరువెనుక చరిత్ర

"టాంజానియా" ఏకీకృతమైన రెండు దేశాల పేర్లలో కొంతభాగాలను కలిపి దేశానికి టంజానియా పేరు నిర్ణయించబడింది; టాంకన్యిక, జాంజిబారు. ఇది రెండు దేశాలలోని మొదటి మూడు అక్షరాలు "టాన్", "జాన్" అలాగే రెండు దేశాలలోని పేర్లు "ఐ", "ఎ" టాంజానియాను ఏర్పరుస్తాయి.

"తంగన్యిక" అనే పేరు స్వాహిలి పదమైన తంగ ("తెరచాప"), నైకా ("జనావాసాలు లేని మైదానం", "అరణ్యం") నుండి జనించింది. "అరణ్యంలో ప్రయాణం" అనే పదాన్ని సృష్టించారు. ఇది కొన్నిసార్లు టాంగ్యానిక సరస్సుకి సంబంధించింది.

జాంజిబారు పేరు "జెంజి" నుండి వచ్చింది. స్థానిక ప్రజల పేరు (జెంజి అంటే "నలుపు" అని అర్ధం), అరబికు పదం "బారు" అనగా తీరం లేదా తీరం అని అర్థం.

చరిత్ర

టాంజానియా 
A 1.8-million-year-old stone chopping tool discovered at Olduvai Gorge and on display at the British Museum

కాలనీ పాలనకు ముందు

తూర్పు ఆఫ్రికా స్థానికభాషలలో భాషాపరంగా హజజా సండావ్ హంటర్-సంగ్రాహకులు టాంజానియాలో ఒంటరి ప్రజలుగా భావించబడుతున్నారు.: page 17 

ఇథియోపియా, సోమాలియా నుండి దక్షిణం వైపు తరలి వెళుతూ టంజానియాలోకి ప్రవేశించిన దక్షిణ కుషిటికు భాషావాడుకరులు ఈ ప్రాంతానికి వలసల సాగించిన మొదటి ప్రజలుగా భావిస్తున్నారు. వారు ఇరాక్వా, గొరవా, బురుంగే భాషావడుకరులైన ప్రజలకు పూర్వీకులని భావిస్తున్నారు. భాషాపరమైన సాక్ష్యాల ఆధారంగా సుమారు 4,000 - 2,000 సంవత్సరాల క్రితం తూర్పు కుషిటికు ప్రజల టాంజానియాలో రెండు దఫాలుగా ప్రవేశించి కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. తుర్కనా సరసు ఉత్తరప్రాంతం వీరి జన్మస్థానమని భావిస్తున్నారు.

డాటోగుతో సహా దక్షిణ నిలౌట్సు దక్షిణ సుడాను, ఇథియోపియా సరిహద్దు ప్రాంతం నుండి దక్షిణవైపు తరిలివెళ్ళి 2,900, 2,400 సంవత్సరాల క్రితం ఉత్తర టాంజానియాకు చేరుకున్నారని పురావస్తు ఆధారాలు వెల్లడించాయి.

ఈ ఉద్యమాలు సుమారుగా ఇదే సమయంలో ఇనుము తయారీకి చెందిన మషారకి బంటుప్రజలు పశ్చిమ ఆఫ్రికాలోని విక్టోరియాసరోవరం, టాంగ్యానికసరోవరం ప్రాంతాల నుండి వచ్చారు. వారు వారితో పశ్చిమ ఆఫ్రికా మొక్కలు నాటడం, ప్రధానాహారం అయిన కర్రపెండలం నాటడం వంటి సంప్రదాయం తీసుకుని వచ్చారు. ప్రాథమిక ప్రధానమైన వస్తువులను తీసుకువచ్చారు. తరువాత వారు ఈ ప్రాంతాల నుండి 2,300 - 1,700 సంవత్సరాల క్రితం టాంజానియా నుండి మిగిలిన ప్రాంతాలకు వలస వెళ్ళారు.

మసాయితో సహా తూర్పు నిలోటిక్ ప్రజలు గత 500 నుంచి 1,500 సంవత్సరాలలో ప్రస్తుత దక్షిణ సూడాన్ నుండి ఇటీవలి వలసలు జరిగాయని సూచిస్తున్నారు.

టాంజానియా ప్రజలు ఇనుము, ఉక్కు ఉత్పత్తితో అనుబంధం కలిగి ఉన్నారు. ఈశాన్య టాంజానియా పర్వత ప్రాంతాలను ఆక్రమించిన పారే ప్రజలు అత్యధికంగా డిమాండు కలిగిన ఇనుము ప్రధాన నిర్మాతలుగా గుర్తించబడుతున్నారు. విక్టోరియాసరసు పశ్చిమ తీర ప్రాంతాలలో ఉన్న హయా ప్రజలు అధిక ఉష్ణ-బ్లాస్టు ఫర్నేసును కనుగొన్నారు. ఇవి 1,500 సంవత్సరాల క్రితం 1,820 ° సెం (3,310 ° ఫా) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కార్బను ఉక్కును పోతపోయడానికి అనుమతించాయి.

సా.శ. మొదటి సహస్రాబ్ది కాలం ప్రారంభమైనప్పటి నుండి పర్షియను గల్ఫు, ఇండియా ప్రయాణికులు, వ్యాపారులు తూర్పు ఆఫ్రికా తీరాన్ని సందర్శించారు. సా.శ. 8-9 స్వాహిలి శతాబ్దం నాటికి స్వాహిలీ తీరంలో కొంతమంది ఇస్లాం ఆచరించారు.

వలస పాలన

టాంజానియా 
A 1572 depiction of the city of Kilwa, a UNESCO World Heritage Site

1840 లో తీరప్రాంతం స్ట్రిపును స్వాధీనం చేసుకుని ఓమిని సుల్తాన్ " సయిదు బిను సుల్తాను " తన రాజధానిని జాంజిబారు నగరానికి తరలించారు. ఈ సమయంలో సాన్జీబారు అరబు బానిస వ్యాపారం కోసం కేంద్రంగా మారింది. అరబు-జాంజిబారు లోని స్వాహిలీ జనాభాలో 65% నుండి 90% ప్రజలను బానిసలుగా మార్చింది. తూర్పు ఆఫ్రికా తీరంలో టిప్పు టిప్ అత్యంత అప్రసిద్ధ బానిస వ్యాపారులలో (బానిసలుగా చేయబడిన ఆఫ్రికన్ మనవడు) ఒకరుగా ఉన్నారు. నైమివేజీ బానిస వర్తకులు మిసిరీ, మిరాంబో నాయకత్వంలో పనిచేశారు. తిమోతి ఇన్సోలు ప్రకారం "19 వ శతాబ్దంలో స్వాహియన్ కోస్తా నుంచి 7,18,000 మంది బానిసలను ఎగుమతి చేయడం, తీరంపై 769,000 మందిని నిలిపారని గణాంకాలు నమోదు చేశాయి. 1890 లలో బానిసత్వం రద్దు చేయబడింది.

టాంజానియా 
1905 లో జర్మనీ వలస పాలనకు వ్యతిరేకంగా మాజీ తిరుగుబాటు

19 వ శతాబ్దం చివరలో జర్మనీ ప్రస్తుత టాంజానియా (జాంజిబారు మినహాయింపుగా) ప్రాంతాలను జయించి, వాటిని జర్మనీ తూర్పు ఆఫ్రికాగా (జె.ఇ.ఎ) మార్చింది.[ఆధారం చూపాలి] 1919 పారిసు పీసు కాన్ఫరెన్సు సుప్రీం కౌన్సిల్ (జె.ఇ.ఎ) మొత్తం 1919 మే 7 బ్రిటనుకు బహుమతిగా ఇచ్చింది. దీనిని బెల్జియం కఠినమైన అభ్యంతరాలను వెలిబుచ్చింది. బ్రిటిషు కాలనీ కార్యదర్శి అల్ఫ్రెడు మిల్నేరు, సమావేశంలో బెల్జియం మంత్రి ప్లెనిపొటెంటియరీ 1919 మే 30 నాటి ఆంగ్లో-బెల్జియను ఒప్పందం మీద చర్చించారు.: 618–9  బ్రిటను ఉత్తర-పశ్చిమ జి.ఇ.ఎ. దేశాలు, రువాండా, ఉరుండిలను బెల్జియంకు అప్పగించింది. 1919 జూలై 16 న సమావేశం కమిషను ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. 1919 ఆగస్టు 7 న ఒప్పందాన్ని సుప్రీం కౌన్సిలు ఆమోదించింది. 1919 జూలై 12 న కమీషను రోవామా నదికి చెందిన చిన్న కియోగా త్రికోణ ప్రాంతాన్ని పోర్చుగీసు మొజాంబికుకు ఇవ్వడానికి అనుమతించింది. చివరికిది స్వతంత్ర మొజాంబికులో భాగం అయింది. వాస్తవంగా 1894 లో పోర్చుగలు త్రిభుజాన్ని విడిచిపెట్టేలా జర్మనీ బలవంతం చేసిందని పేర్కొన్నది.: 243  1913 జూలై 28 న వేర్సైల్లెసు ఒప్పందంలో సంతకం చేశారు. ఇది 1920 జనవరి 10 లో క్రియారూపందాల్చింది. ఆ తేదీన జి.ఇ.ఎ. బ్రిటను, బెల్జియం, పోర్చుగలులకు అధికారికంగా బదిలీ చేయబడింది. అదే రోజున "తంగన్యిక" బ్రిటిషు భూభాగం పేరుగా మారింది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, టాంగ్యానికా నుండి సుమారు 1,00,000 మంది మిత్రరాజ్యాల దళాలలో చేరారు. 3,75,000 మంది ఆఫ్రికన్లు ఆ దళాలతో పోరాడారు. తంగన్యికాలు " కింగ్సు ఆఫ్రికా రైఫిల్సు "లోని యూనిట్లగా ఈస్టు ఆఫ్రికా పోరాటంలో సోమాలియా, అబిస్సినియాలో ఇటాలియన్లకు వ్యతిరేకంగా, మడగాస్కర్ పోరాటంలో విచి ఫ్రెంచుకు వ్యతిరేకంగా మడగాస్కరులో, బర్మా పోరాటంలో జపానుకు వ్యతిరేకంగా బర్మాలో పోరాడారు. ఈ యుద్ధ సమయంలో టాంగన్యికా ముఖ్యమైన ఆహార వనరుగా ఉండేది. పూర్వ యుద్ధ సంవత్సరాలలో సంభవించిన " గ్రేటు డిప్రెషను " తో పోలిస్తే దాని ఎగుమతుల ఆదాయం బాగా పెరిగింది. యుద్ధకాల అవసరాలు, కాలనీలో పెరిగిన సరకు ధరలు భారీ ద్రవ్యోల్బణాన్ని సృష్టించింది.

1954 లో జూలియసు నైయేరే ఒక సంస్థను రాజకీయంగా ఆధారిత " టాంగ్యానికా ఆఫ్రికన్ నేషనల్ యూనియను " గా మార్చారు. టంగ్యానికాకు జాతీయ సార్వభౌమత్వాన్ని సాధించడం దీని ప్రధాన లక్ష్యంగా ఉంది. పోరాటంలో పాల్గొనడానికి నూతన సభ్యులను నమోదు చేయడం ప్రారంభించబడింది. ఒక సంవత్సరంలోనే టి.ఎ.ఎన్.యు. దేశంలో ప్రముఖ రాజకీయ సంస్థగా మారింది. నేయరేరు 1960 లో బ్రిటీషు పాలిత టాంకన్యాకా మంత్రిగా అయ్యాడు. 1961 లో టాంకన్యా స్వతంత్రం పొందినప్పుడు ప్రధానమంత్రిగా కొనసాగారు. [ఆధారం చూపాలి]

వలస పాలన తరువాత

1961 డిసెంబరు 9 లో బ్రిటిషు పాలన ముగిసింది. కానీ స్వాతంత్ర్య మొదటి సంవత్సరం టంగ్యానికా బ్రిటీషు సాంరాజ్యానికి ప్రాతినిధ్యం వహించిన గవర్నరు జనరలు పాలనలో ఉంది. 1962 డిసెంబర్ 9 న టాంగాన్యికాకు ఒక కార్యనిర్వాహక అధ్యక్షుని పాలనలో టాంగ్యానికా స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది.

జంజిబారు విప్లవం తరువాత పొరుగున ఉన్న జంజిబారులో అరబు సాంరాజ్యం పడగొట్టబడింది. 1963 లో స్వతంత్రంగా జంజిబారు స్వత్రం దేశంగా మారిన పొరుగున ఉన్న జాంజిబారు ద్వీప సమూహం 1964 ఏప్రెలు 26 న ప్రధాన భూభాగం టాంకన్యాకాతో విలీనం అయ్యింది. అదే సంవత్సరం అక్టోబరు 29 న దేశం పేరును యునైటెడ్ రిపబ్లిక్ అఫ్ టాంజానియా ("టాన్" తంగన్యిక "జాన్" నుండి జాంజిబార్ నుండి జాన్ వచ్చింది) గా మార్చబడింది. ఇంతవరకు రెండు వేర్వేరు ప్రాంతాల యూనియన్ అనేక జాంజిబారిలలో వివాదాస్పదంగా ఉంది (విప్లవానికి సానుభూతితో ఉన్నది) కానీ నైరిరే ప్రభుత్వం, విప్లవాత్మక ప్రభుత్వం జంజిబారు రెండూ రాజకీయ విలువలను లక్ష్యంగా చేసుకుని అంగీకరించాయి.

టాంజానియా స్వాతంత్ర్యం, టాంజానియా రాజ్యస్థాపనకు దారితీసే జాంజీబారు విలీనం తరువాత అధ్యక్షుడు నేయరేరే కొత్త దేశ పౌరులకు జాతీయ గుర్తింపును నిర్మించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దాని భూభాగంలో 130 భాషల కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి. టాంజానియా ఆఫ్రికాలో అత్యంత జాతి వైవిధ్యభరితమైన దేశాలలో ఒకటిగా ఉంది. ఈ అడ్డంకి ఉన్నప్పటికీ టాంజానియాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా దాని పొరుగునున్న కెన్యాతో పోలిస్తే జాతి విభాగాలు చాలా అరుదుగా ఉంటాయి. అంతేకాకుండా స్వతంత్రం పొందినప్పటి నుండి టాంజానియా ఇతర ఆఫ్రికా దేశాల కంటే అత్యంత రాజకీయ స్థిరత్వం ప్రదర్శించింది. ముఖ్యంగా న్యేరేరే జాతి అణచివేత పద్ధతుల కారణంగా.

టాంజానియా 
ది అరుష డిక్లరేషన్ స్మారకం

1967 లో నైరెరే మొదటి అధ్యక్షుడు అరూష డిక్లరేషను తర్వాత లెఫ్టు వైపుకు మలుపు తీసుకున్నాడు. ఇది సోషలిజానికి పాను-ఆఫ్రికలిజం వలె నిబద్ధతను కలిగి ఉంది. డిక్లరేషను తరువాత బ్యాంకులు, అనేక భారీ పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి

టాంజానియా చైనాతో కలసి ఉండేది. 1970 నుండి 1975 మధ్యకాలంలో డార్ ఎస్ సలాం నుండి జాంబియా వరకు 1,860 కిలోమీటర్ల పొడవైన (1,160 మైళ్ళు) తజరా రైల్వేని నిర్మించటానికి చైనా ఆర్థికంగా సహాయపడింది. అయినప్పటికీ 1970 ల చివరలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలను ప్రభావితం చేసిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సందర్భంలో టాంజానియా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.

1980 వ దశకం మధ్యకాలంలో పాలననిర్వహణ కొరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రుణాలు తీసుకుంది. తరువాత కొంత సంస్కరణలను చేపట్టింది. అప్పటి నుండి టాంజానియా స్థూల జాతీయోత్పత్తి పెరిగింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం పేదరికం తగ్గింది.

1992 లో బహుళ రాజకీయ పార్టీలను అనుమతించేలా టాంజానియా రాజ్యాంగం సవరించబడింది. 1995 లో జరిగిన టాంజానియా మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అధికారపార్టీ " చమా చా మపిండుజీ " జాతీయ అసెంబ్లీలోని 232 స్థానాలలో 186 స్థానాలలో విజయం సాధించారు. బెంజమిను మకాపా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

భౌగోళికం

An elephant passing by the snow-capped Mt. Kilimanjaro
Ngorongoro Crater, the world's largest inactive and intact volcanic caldera
టాంజానియా 
Tanzania map of Köppen climate classification

9,47,303 చదరపు కిలో మీటర్లు (3,65,756 చదరపు మైళ్ళు) టాంజానియా ఆఫ్రికాలో 13 వ అతిపెద్ద దేశంగా, ప్రపంచంలోని 31 వ అతిపెద్ద దేశంగా ఈజిప్ట్, నైజీరియా మధ్య స్థానంలో ఉంది. ఉత్తరసరిహద్దులో కెన్యా, ఉగాండా ఉన్నాయి. పశ్చొమసరిహద్దులో రువాండా, బురుండి, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఉన్నాయి. దక్షిణసరిహద్దులో జాంబియా, మలావి, మొజాంబిక్ ఉన్నాయి. టాంజానియా ఆఫ్రికా తూర్పు తీరంలో ఉంది. సుమారు 1,424 కిలోమీటర్లు (885 మైళ్ళు) పొడవై హిందూ మహాసముద్ర తీరం ఉంది. ఇది ఉంగుజా (జంజీబారు), పెంబా, మఫియా వంటి పలు సంద్రాంతర దీవులను కలిగి ఉంది. ఆఫ్రికా అతి ఎత్తైన, అత్యల్ప స్థానాలు: దేశం కిలిమంజారో సముద్ర మట్టానికి 5,895 మీటర్ల (19,341 అడుగులు) ఎత్తులో ఉంది, సముద్ర మట్టానికి 352 మీటర్లు (1,155 అడుగులు) దిగువన తంగన్యిక సరస్సు నేల ఉంది.

టాంజానియా 
సెరెంగెటిలో వైల్డ్ బేర్ మైగ్రేషన్

టాంజానియా ఈశాన్యంలో పర్వతాలు (కిలిమంజారో పర్వతం), దట్టమైన అడవులు ఉన్నాయి. ఆఫ్రికా గ్రేటు లేక్సు మూడు భాగాలు తన్జానియాలో భాగంగా ఉన్నాయి. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో విక్టోరియా సరోవరం ఉంది. ఆఫ్రికా అతి పెద్ద సరస్సు, ఖండంలో లోతైన సరస్సుగా గుర్తించబడుతున్న టాంకన్యిక సరస్సు చేపలకు ప్రసిద్ధి చెందింది. నైరుతిప్రాంతంలో నైజీ సరస్సు ఉంది. మద్య టాంజానియాలో ఒక పెద్ద పీఠభూమి, మైదానాలు సాగు భూమి ఉన్నాయి. తూర్పు తీరం వేడి, తేమతో కూడి ఉంటుంది. జాంజిబారు ద్వీపమాలిక సముద్రమ్లో ఉంది.

నైరుతీప్రాంతం రుక్వాలో కలంబొ జలపాతాలు ఉన్నాయి. నిరంతరంగా ప్రవహించే ఎత్తైన ఆఫ్రికా జలపాతాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. ఇది టాంకన్యికా ఈశాన్య తీరంలో జాంబియా సరిహద్దులో ఉంది. మెనై బే కంసర్వేషను ప్రాంతం జంజీబారులోని అతిపెద్ద సముద్ర సంరక్షిత ప్రాంతంగా గుర్తించబడుతుంది.

వాతావరణం

టాంజానియాలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. పర్వతాలలో ఉష్ణోగ్రతలు వరుసగా 10 నుండి 20 ° సెం (50 నుండి 68 ° ఫా) మధ్య చల్లని, వేడి సీజన్లు ఉంటాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అరుదుగా 20 ° సెం (68 ° ఫా) కంటే తక్కువగా ఉంటాయి. నవంబరు, ఫిబ్రవరి మధ్య శీతాకాలం 25-31 ° సెం (77.0-87.8 ° ఫా) వరకు వర్షపాతం నమోదవుతుంది. మే, ఆగస్టు మధ్య అత్యల్ప కాలం 15-20 ° సెం (59-68 ° ఫా) సంభవిస్తుంది. వార్షిక ఉష్ణోగ్రత 20 ° సెం (68.0 ° ఫా). అధిక పర్వత ప్రాంతాలలో వాతావరణం చల్లగా ఉంటుంది.

టాంజానియాలో రెండు ప్రధాన వర్షాకాలాలు ఉన్నాయి: ఒకటి యూని-మోడలు (అక్టోబరు-ఏప్రిలు), మరొకది బై-మోడలు (అక్టోబరు-డిసెంబరు, మార్చి-మే). మొదటి వర్షాకాలం దక్షిణ, మధ్య, పశ్చిమ భాగాలలో మాజీ ఉంటుంది. తరువాతి వర్షాకాలం విక్టోరియా సరస్స ఉత్తరభాగంలో తూర్పు తీరానికి తూర్పున విస్తరించడం కనిపిస్తుంది. ఇంటరు మోండరల్ కన్వర్జెన్సు జోన్ కాలానుగుణ వలస కారణంగా బై -మోడల్ వర్షపాతం సంభవిస్తుంది.

వన్యజీవితం, అభయారణ్యం

టాంజానియా 
A tower of giraffes at Arusha National Park. The giraffe is the national animal.

టాంజానియా భూభాగంలో దాదాపు 38% పరిరక్షణా ప్రాంతాలుగా పరిరక్షించబడుతోంది. టాంజానియాలో 16 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వివిధ రకాల వేటప్రాంతాలు, అటవీ నిల్వలు ఉన్నాయి. వీటిలో నగోరోంగోరో కన్జర్వేషను ఏరియా ఉంది. పశ్చిమ టాంజానియాలో గోమ్బే స్ట్రీం నేషనలు పార్కులో 1960 లో జానే గూడల్ చింపాంజీ ప్రవర్తన గురించి అధ్యయనం ప్రారంభించిన ప్రదేశం ఉంది.

టాంజానియా అత్యధిక జీవవైవిధ్యం కలిగివుంది. ఇక్కడ అనేక రకాల జంతువుల ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడి సెరెంగెటి వన్యప్రాణి సంరక్షిత ప్రాంతంలో వైల్డెబీస్ట్‌లు, ఇతర బోవిడ్లు, జీబ్రాలు ఏటా భారీ ఎత్తున వలస పోతాయి. టాంజానియాలో సుమారు 130 ఉభయచరాలు, 275 సరీసృపాలు ఉన్నాయి. వీటిలో అనేకం అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి.

ఆర్ధిక రంగం మౌలికనిర్మాణాలు

టాంజానియా 
Bank of Tanzania Twin Towers

ఐ.ఎం.ఎఫ్. ఆధారంగా 2018 నాటికి టాంజానియా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) $ 56.7 బిలియన్లు (నామమాత్రపు). కొనుగోలు శక్తి 176.5 బిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా వేయబడింది. తలసరి జి.డి.పి. (పి.పి.పి) $ 3,457 అమెరికా డాలర్లు.

2009 నుండి 2013 వరకు టాంజానియా తలసరి జి.డి.పి. (స్థిర స్థానిక కరెన్సీ ఆధారంగా) సంవత్సరానికి సగటున 3.5% అధికరించింది. ఇది తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ (ఇ.ఎ.సి) ఇతర సభ్యుల కంటే ఎక్కువగా ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో కేవలం తొమ్మిది దేశాలు దీనిని అధిగమించాయి: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, ఘనా, లెసోతో, లైబీరియా, మొజాంబిక్, సియెర్రా లియోన్, జాంబియా, జింబాబ్వే.

2017 లో టంజానియా నుండి $ 5.3 బిలియన్ల అమెరికా డాలర్ల వస్తువులు ఎగుమతి చేయబడింది. టాంజానియా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం, వియత్నాం, దక్షిణ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, చైనా ఉన్నాయి. టంజానియా దిగుమతులు US $ 8.17 బిలియన్ల అమెరికా డాలర్లు. దిగుమతులలో భారతదేశం, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతిపెద్ద భాగస్వాములుగా ఉన్నాయి.

టాంజానియా 
దారు ఎస్ సలాంలో కరికు మార్కెట్టు

టాంజానియా గ్రేటు రిసెషన్ను 2008 లో, 2009 ప్రారంభంలో ప్రారంభమై బాగా అభివృద్ధి చేసింది. బలమైన బంగారు ధరలు, దేశం మైనింగు పరిశ్రమను బలపరిచాయి. గ్లోబలు మార్కెట్లలో టాంజానియా పేలవమైన తరుగుదల నుండి దేశాన్ని నిరోధిస్తుంది. మాంద్యం ముగిసిన తరువాత టాంజానియా ఆర్థిక వ్యవస్థకు బలమైన పర్యాటక రంగం, టెలీకమ్యూనికేషన్సు, బ్యాంకింగు రంగాలు సహాయం అందిస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం, జాతీయ ఆర్థికవ్యవస్థలో ఇటీవలి పెరుగుదల "చాలా తక్కువ" మాత్రమే ఉంది. అధిక సంఖ్యలో జనాభా ఆర్థికాభివృద్ధిని వదిలివేసింది. బురుండి మినహా ఇ.ఎ.సి. లోని ఇతర దేశాలకంటే టాంజానియా 2013 ప్రపంచ హంగరు ఇండెక్సులో అధ్వాన్నంగా ఉంది. 2010-12లో పోషకాహారలోపాన్ని ఎదుర్కొన్న వ్యక్తుల నిష్పత్తి బురుండి మినహా ఇతర ఇ.ఎ.సి. దేశాల కంటే ఘోరంగా ఉంది.

టంజానియా గురించి అదనంగా

టాంజానియా తీవ్ర ఆకలి, పోషకాహార లోపం సమస్యలను తగ్గించడానికి కొన్ని పురోగతి చేసింది. గ్లోబలు హంగరు ఇండెక్సు ఈ పరిస్థితిని 2000 లో దీనావస్థలో 42 వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అప్పటినుండి జి.హెచ్.ఐ 29.5 కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలు అధిక పోషకాహారలోపం, దీర్ఘకాలిక ఆకలిని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పట్టణ-గ్రామీణ రెండింటిలో అసమానతలు తక్కువగా స్థభింపజేసేలా ఉన్నట్లు పరిగణించబడింది. మౌలికనిర్మాణాల పెట్టుబడుల కొరత కారణంగా గ్రామీణ క్షేత్ర ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ పెట్టుబడుల, సేవల పొడిగింపు, ఋణాల అందుబాటు పరిమితంగా ఉంటాయి. పరిమిత సాంకేతికత అలాగే వాణిజ్య, మార్కెటింగు మద్దతు; వర్షపు ఆధారిత వ్యవసాయం, సహజ వనరులపై భారీ ఆధారపడటం ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్నాయి.

టాంజానియాలో 44.9 మిలియన్ల పౌరులలో సుమారు 68% మంది రోజుకు 1.25 డాలర్ల ఆదాయంతో దారిద్య్రరేఖకు దిగుతున్నారు. జనాభాలో 32% మంది పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ఆధారంగా అవసరాలకు తగినంత పంటదిగుబడులు లేక పోవడం, వాతావరణ మార్పు, నీటి వనరుల ఆక్రమణ, టాంజానియా ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లుగా భావిస్తున్నారు.

యు.ఎన్.డి.పి. ప్రకారం దేశంలో ఆకలి, పేదరికాన్ని మరింతగా పెంచే వ్యవసాయ సాంకేతికతలకు రుణ సేవలు, మౌలికవసతుల లభ్యత పరంగా టాంజానియాకు వనరులు చాలా తక్కువ ఉన్నాయి. యునైటెడు నేషన్సు హ్యూమను డెవలప్మెంటు ఇండెక్సు (2014) ప్రకారం పేదరికంలో 187 దేశాలలో టాంజానియా 159 వ స్థానంలో ఉంది.

వ్యవసాయం

టాంజానియా 
Tea fields in Tukuyu

టాంజానియా ఆర్థికవ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. 2013 లో స్థూల జాతీయోత్పత్తిలో 24.5% ఉంది. ఎగుమతుల 85% ఉత్పత్తి చేస్తుంది. ఉద్యోగుల సంఖ్యలో సగం మందికి ఉపాధి అందిస్తుంది. 2012 లో వ్యవసాయ రంగం 4.3% అధికరించింది. ఇది సహస్రాబ్ధి డెవెలెప్మెంటు లక్ష్యం 10.8% కంటే తక్కువగా ఉంది. భూమిలో 16.4% సాగుభూమి, శాశ్వత పంటలు పండించబడుతున్న భూమి 2.4%, టాంజానియా ఆర్థికవ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. కానీ వాతావరణ మార్పు వారి వ్యవసాయంపై ప్రభావం చూపింది.

2013 నాటికి టాంజానియా ప్రధాన భూభాగంలో మొక్కజొన్న (5.17 మిలియన్ల టన్నులు), కాసావా (1.94 మిలియన్ల టన్నులు), తీపి బంగాళాదుంపలు (1.88 మిలియన్ల టన్నులు), బీన్సు (1.64 మిలియన్ల టన్నులు), అరటి (1.31 మిలియన్ల టన్నులు), బియ్యం (1.4 మిలియన్ల టన్నులు), చిరుధాన్యాలు (1.04 మిలియన్ల టన్నులు). ప్రధాన భూభాగంలో 2013 లో చక్కెర (296,679 టన్నులు), పత్తి (241,198 టన్నులు), జీడిపప్పు (126,000 టన్నులు) పొగాకు (86,877 టన్నులు), కాఫీ (48,000 టన్నులు), జనుము (37,368 టన్నులు), టీ (32,422 టన్నులు). గొడ్డు మాసం (అతిపెద్ద మాంసం ఉత్పత్తి) (2,99,581 టన్నులు) గొర్రె మాంసం (1,15,652 టన్నులు), కోడి (87,408 టన్నులు), పంది మాంసం (50,814 టన్నులు).: page 60 

2002 నేషనలు ఇరిగేషను మాస్టర్ ప్లాను ఆధారంగా టాంజానియాలో 29.4 మిలియన్ల హెక్టార్ల సాగుభూమికి నీటిపారుదలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ 2011 జూనులో 3,10,745 హెక్టార్లను మాత్రమే సాగు చేసారు.

పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి, నిర్మాణరంగం

Williamson diamond mine
Songo Songo Gas Plant

పరిశ్రమ, నిర్మాణం టాంజానియా ఆర్థికవ్యవస్థలో ప్రధాన భాగంగా ఉన్నాయి. ఇవి 2013 లో జి.డి.పి.లో 22.2 % వాటాను కలిగి ఉన్నాయి. ఈ విభాగంలో మైనింగు, క్వారీ, తయారీ, విద్యుత్తు, సహజ వాయువు, నీటి సరఫరా, నిర్మాణరంగం ఉన్నాయి. 2013 లో మైనింగుకు జి.డి.పి.లో 3.3% వాటా ఉంది.: page 33  దేశంలోని ఖనిజ ఎగుమతి ఆదాయంలో అత్యధిక భాగం బంగారం నుండి వస్తుంది. 2013 లో బంగారం ఎగుమతుల విలువలో 89% ఉంది. టంజానియా గణించతగినంత రత్నాలను (వజ్రాలతో కలిపి), టంజానైటును ఎగుమతి చేస్తుంది. 2012 లో టాంజానియా మొత్తం బొగ్గు ఉత్పత్తి 1,06,000 టన్నులు. ఇది దేశీయంగా ఉపయోగించబడింది.

2011 లో 15% టాంజానియన్లకు మాత్రమే విద్యుత్తుశక్తి అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టాంజానియా ఎలక్ట్రికు సప్లై కంపెని లిమిటెడ్ (టనెస్కొ) టాంజానియాలో విద్యుత్తు సరఫరా పరిశ్రమను ఆధిపత్యం చేస్తుంది. 2013 లో విద్యుత్తు ఉత్పత్తి 6.013 బిలియన్ల కిలోవాట్లు విద్యుదుత్పత్తి చేసింది. 2012 లో 5.771 బిలియన్ల కిలోవాట్ల ఉత్పత్తితో 4.2% పెరిగింది. 2005 - 2012 మధ్య 63% అభివృద్ధి చెందింది. దొంగతనం, పంపిణీ సమస్యల కారణంగా 2012 లో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తులో దాదాపు 18% విద్యుత్తు కోల్పోయింది. విద్యుత్తు సరఫరా విధానం మారుతుంటుంది. ప్రత్యేకంగా కరువు జల విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం కలిగించినప్పుడు.: page 1251  విశ్వసనీయమైన విద్తుత్తు సరఫరా కారణంగా టంజానియా పారిశ్రామికభివృద్ధి దెబ్బతింటుంది.: page 1251  2013 లో టాంజానియా విద్యుత్తు ఉత్పత్తిలో 49.7% సహజ వాయువునుండి లభిస్తుంది. 28.9% జలవిద్యుత్తు మూలాల నుండి లభిస్తుంది. థర్మలు వనరుల నుండి 20.4%, దేశం వెలుపల నుండి 1.0 శాతంగా లభిస్తూ ఉంది. ప్రభుత్వం మన్నాజీ బే నుండి డారు ఎస్ సలాంకు 532 కిలోమీటర్ల (331 మైళ్ళు) గ్యాసు పైపులను నిర్మించింది. ఈ పైపులైను దేశం 2016 నాటికి 3,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని భావించింది. 2025 నాటికి కనీసం 10,000 మెగావాట్ల వరకు సామర్ధ్యాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

టాంజానియా 
నైగెరు బ్రిడ్జ్ ఇన్ కిగంబోని, దార్ ఎస్ సలాం, టాంజానియా (, తూర్పు ఆఫ్రికా) మాత్రమే సస్పెన్షన్ వంతెన

పి.ఎఫ్.సి. ఎనర్జీ ఆధారంగా 2010 నుంచి టాంజానియాలో 25 నుంచి 30 ట్రిలియను క్యూబికు అడుగుల సహజ వనరుల వనరులు కనుగొనబడ్డాయి. 2013 నాటికి మొత్తం నిల్వలు 43 ట్రిలియను క్యూబికు అడుగులకి చేరుకున్నాయి. వాస్తవానికి సహజ వాయువు విలువ 2013 లో 52.2 మిలియన్ల డాలర్లు, 2012 నాటికి 42.7% అధికరించింది.

2004 లో హిందూ మహాసముద్రంలో సాంగో ద్వీప క్షేత్రం నుండి వాయువు వాణిజ్య ఉత్పత్తి మొదలైంది. అది కనుగొనబడిన ముప్పై సంవత్సరాల తరువాత. 2013 లో 35 బిలియను క్యూబికు అడుగుల గ్యాసు ఉత్పత్తి చేయబడింది. నిల్వలు 1.1 ట్రిలియన్ల క్యూబికు అడుగుల ఉన్నట్లు నిరూపితమయింది. వాయువు పైపులైను ద్వారా దార్ ఎస్ సలాంకు రవాణా చేయబడుతుంది. 2014 ఆగస్టు 27 నాటికి ఈ ఫీల్డు ఆపరేటరు, ఓర్కా ఎక్సుప్లోరేషను గ్రూప్ ఇంకును టానెస్కొ స్వంతం చేసుకుంది.

2013 లో మన్నాజీ బేలో నూతన సహజ వాయువు క్షేత్రం సాంగో ద్వీపం సమీపంలో ఉత్పత్తి చేయబడిన మొత్తంలో ఏడవ వంతు ఉత్పత్తి చేసింది. కాని ఇది 2.2 ట్రిలియను క్యూబికు అడుగుల నిరూపించబడింది. వాస్తవానికి ఈ గ్యాసు అంతా మ్టువారాలో విద్యుత్తు ఉత్పత్తి కోసం ఉపయోగించబడుతోంది.

టాంజానియాలోని రువామా, న్యునా ప్రాంతాల్లో ఎక్కువగా 75% అమీనేక్సు సంస్థ ఆవిష్కరణలో అన్వేషించబడ్డాయి. 3.5 ట్రిలియన్ల క్యూబికు అడుగుల సహజ వాయువును కలిగి ఉన్నట్లు నిరూపించింది. ఆఫ్షోరు సహజవాయువులను టాంజానియా వాణిజ్య రాజధాని దార్ ఎస్ సలాంను కలిపే పైపులౌను 2015 ఏప్రెలు చివరిలో పూర్తయింది.

పర్యాటకరంగం

టాంజానియా 
The snowcapped Uhuru Peak

2016 లో టాంజానియా స్థూల జాతీయోత్పత్తిలో పర్యాటక రంగం 17.5 శాతం వాటాను కలిగి ఉంది. . 2013 లో దేశంలోని కార్మిక శక్తిలో 11.0%కి (1,189,300 ఉద్యోగాలు)ఉపాధి కల్పించింది. 2010 లో అంతర్జాతీయ పర్యాటకుల నుండి $ 1.255 బిలియన్ల అమెరుకా డాలర్లు లభించగా 2016 లో $ 2 బిలియన్ల అమెరికా డాలర్లకు అధికరించింది.

మొత్తం ఆదాయం 2004 లో US $ 1.74 బిలియన్ల అమెరికా డాలర్లు ఉండగా 2013 నాటికి $ 4.48 బిలియన్ల అమెరికా డాలర్లకు అధికరించింది. 2005 లో 5,90,000 మంది పర్యాటకులు సందర్శించగా 2016 లో 12,84,279 మంది పర్యాటకులు టాంజానియా సరిహద్దుల్లోకి వచ్చారు.

అధికసంఖ్యలో పర్యాటకులు జాంజిబారు, సెరెంగేటి నేషనల్ పార్కు, నగోరోన్రోరో కన్జర్వేషను ఏరియా, టార్గైరు నేషనలు పార్కు, లేక్ మినిరా నేషనలు పార్కు, కిలిమంజారో పర్వతం "ఉత్తర సర్క్యూటు"ను సందర్శిస్తున్నారు. 2013 లో అత్యంత సందర్శించే జాతీయ ఉద్యానవనం సెరెంగేటి (4,52,485 మంది పర్యాటకులు), తర్వాత మొరారా (1,87,773), తరంగైరు (1,65,949).

బ్యాంకింగు

The Bank of Tanzania is the central bank of Tanzania and is primarily responsible for maintaining price stability, with a subsidiary responsibility for issuing Tanzanian shilling notes and coins. At the end of 2013, the total assets of the Tanzanian banking industry were 19.5 trillion Tanzanian shillings, a 15 percent increase over 2012.

రవాణా

One of the main trunk roads
Air Tanzania is the country's flag carrier.

టాంజానియాలో దేశం సరుకు రవాణా 75% ప్రయాణీకుల 80% ఉన్న రహదారిద్వారా రవాణా చేయబడుతుంది.: page 1252  The 86,500 kilometres (53,700 mi) road system is in generally poor condition.: page 1252  86,500 కిలోమీటర్ల (53,700 మైళ్ళు) రహదారి వ్యవస్థ సాధారణంగా పేలవమైన పరిస్థితిలో ఉంది. టాంజానియాలో రెండు రైల్వే కంపెనీలు ఉన్నాయి: దార్ ఎస్ సలాం, కపిరి మోపొషి (జాంబియాలో ఒక రాగి మైనింగు జిల్లా) టాంజానియా రైల్వే లిమిటెడు మధ్య సర్వీసును అందిస్తుంది. ఇది దార్ ఎస్ సలాంను ఉత్తర టాంజానియాతో అనుసంధానిస్తుంది. టాంజానియాలో రైలు ప్రయాణం తరచుగా నెమ్మదిగా ప్రయాణించటం, ఆలస్యంగా గమ్యం చేరడం వంటి సమస్యలను అందిస్తుంది. రైల్వేలు భద్రత లోటును నమోదు చేస్తున్నాయి.

దార్ ఎస్ సలాంలో, డర్ ఎస్ సలాం నగరం ఉపనగరాలను అనుసంధానిస్తున్న డార్ రాపిడ్ ట్రాన్సిటు వేగవంతమైన బస్సుల భారీ ప్రాజెక్టు ఉంది. డార్టు వ్యవస్థ అభివృద్ధి ఆరు దశలను కలిగి ఉంది. ఆఫ్రికన్ డెవలప్మెంటు బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, టాంజానియా ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తుంది. మొదటి దశ ఏప్రిలు 2012 లో ప్రారంభమైంది. 2015 డిసెంబరులో పూర్తయింది. 2016 మేలో కార్యకలాపాలను ప్రారంభించింది.

టాంజానియాలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 100 చిన్న విమానాశ్రయాలు లేదా ల్యాండింగు స్ట్రిప్సు ఉన్నాయి. విమానాశ్రయ మౌలిక సౌకర్యాల పరిస్థితి నిస్సందేహంగా ఉంది. టాంజానియాలో ఎయిరు లైంసులో ఎయిరు టాంజానియా, ప్రెసిషను ఎయిరు, ఫాస్ట్జెటు, కోస్టలు ఏవియేషను, జాన్ ఎయిరు ఉన్నాయి.: page 1253 

సమాచారరంగం

2013 లో కమ్యూనికేషన్సు రంగం టాంజానియాలో వేగంగా అభివృద్ధి చెంది 22.8% విస్తరించింది; ఆ సంవత్సరానికి ఈ రంగం భాగస్వామ్యం మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తిలో కేవలం 2.4% మాత్రమే ఉంది.

2011 నాటికి టాంజానియాలో 100 మందిలో 56 మొబైలు టెలిఫోను చందాదారులు ఉన్నారు. సబ్-సరాన్ సరాసరికి కొద్దిగా తక్కువగా ఉంది. టాంజానియన్లకు స్థిర-లైన్ టెలిఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంఖ్య వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, 2011 నాటికి టాంజానియాలో సుమారు 12% మంది అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు. దేశానికి ఫైబరు-ఆప్టికు కేబులు నెట్వర్కు ఉంది. అది నమ్మకమైన ఉపగ్రహ సేవను భర్తీ చేసినప్పటికీ ఇంటర్నెటు సామర్ధ్యం తక్కువ స్థాయిలో ఉంది.

నీటి సరఫరా, పారిశుధ్యం

టాంజానియా 
Domestic expenditure on research in Southern Africa as a percentage of GDP, 2012 or closest year. Source: UNESCO Science Report: towards 2030 (2015), Figure 20.3

2000 లలో టాంజానియాలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) కొన్ని పారిశుద్ధ్యం సౌకర్యాలు (1990 ల నుండి 93%), తక్కువస్థాయి నీటి సరఫరా, సాధారణంగా తక్కువ నాణ్యత కలిగిన సేవలు మాత్రమే అందిస్తుంది. తక్కువ సుంకాలు, తక్కువ సమర్థత కారణంగా సేవల నిర్వహణ ఖర్చులను భరించలేక పోతుంది. అరుష, మోషి, తంగ అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. ప్రాంతీయంగా సేవల అందుబాటులో తేడాలు ఉన్నాయి.

2002 నుండి టాంజానియా ప్రభుత్వం ప్రధాన రంగ సంస్కరణల ప్రక్రియను చేపట్టింది. 2006 లో సమీకృత నీటి వనరుల నిర్వహణ, పట్టణ, గ్రామీణ నీటి సరఫరా అభివృద్ధిని ప్రోత్సహించే ప్రతిష్ఠాత్మక జాతీయ జలశక్తి అభివృద్ధి వ్యూహం ఇదులో భాగంగా ఉన్నాయి. పారిశుధ్యం సేవ సదుపాయం స్థానిక ప్రభుత్వ అధికారులకు మార్చబడింది. 20 పట్టణ అవసరాలు, 100 జిల్లా సౌకర్యాలు, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని కమ్యూనిటీ యాజమాన్య నీటి సరఫరా సంస్థలు నిర్వహించబడుతున్నాయి.

2006 లో ప్రారంభమయ్యే బడ్జెటు గణనీయమైన పెరుగుదలతో ఈ సంస్కరణలు వెనుకబడ్డాయి. ఈ సమయంలో నీటి రంగం అభివృద్ధి, పేదరికం జాతీయ వ్యూహం ప్రాధాన్యతా రంగాలలో చేర్చబడింది. బాహ్య దాత సంస్థలు అందించిన నిధులు 88% లతో టాంజానియా జలశక్తి బాహ్య దాతలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. ఉదాహరణగా వరల్డు బ్యాంకు నుండి భారీగా పెట్టుబడులు తీసుకురాబడ్డాయని " డ్యూట్స్చే ఫర్ ఇంటర్నేషనలే జ్యూసమ్మెనర్దియటు గమనించింది. ఐరోపా సమాఖ్య (డార్ ఎస్ సలాం) అత్యంత పేలవంగా పనిచేస్తున్న నీటిసరఫరా సంస్థగా నిలిచింది.

ఆహారం, పోషకాహారం

టాంజానియా 
A Tanzanian woman cooks Pilau rice dish wearing traditional Kanga.

పేలవమైన పోషకాహారం టాంజానియాలో ఒక నిరంతర సమస్యగా మిగిలిపోయింది. దేశం అంతటా వైద్యభరితంగా చాలా అధికంగా ఉంది. యు.ఎస్.ఎ. ఎయిడులో 16% పిల్లలు బరువు తక్కువగా ఉండగా, 34% పిల్లలలో పోషకాహారలోపం కారణంగా పెరుగుదల స్థభించిందని తెలిపింది. 10 ప్రాంతాలలోని గృహాలలో పెరుగుదల స్తంభనతో బాధపడుతున్న 58% మంది పిల్లలు ఉన్నారు. 5 ప్రాంతాలలో 50% తీవ్రంగా పోషకాహారలోపం ఉన్న పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో టాంజానియాలోని మారా జిల్లాలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 15%కి తగ్గింపు జరిగింది. 2005 - 2010 లో 46% నుండి 31%కి పడిపోయింది. మరోవైపు డడోమా ఈ వయస్సులో 7% పెరుగుదలను పెంచింది. 2005 లో 50% ఉండగా 2010 లో 57%కు అధికరించింది. ఆహారం లభ్యత పెరుగుదల స్తంభించిన మొత్తం పిల్లల సంఖ్యకు చాలదు. ఇరింటా, మొబియా, రుక్వా ప్రాంతాలలో మొత్తం ఆహార లభ్యత 50% కంటే అధికంగా ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది. తాబో, సిండిడా ప్రాంతాలలో ఆహార కొరత సాధారణం. పెరుగుదల స్తంభన ఇరింటా, మొబియా, రుక్వాలలో కనిపించే దానికంటే తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పోషకాహార లోపం, పేద శిశువుల పెంపకం, పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు, పేలవమైన హెల్తు కేరు సర్వీసులలో వ్యత్యాసాలకు సంబంధించి టాంజానియా ఫుడు అండ్ న్యూట్రిషను సెంటరు ఆపాదించింది. కరువు కాలాలు టాంజానియాలో పంటల ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. తూర్పు ఆఫ్రికాలో కరువు టాంజానియా జనాభాలో ఎక్కువ భాగం పోషకాలకు కీలకమైన పంటలైన మొక్కజొన్న, జొన్న వంటి ఆహారపదార్ధాల ధరలు భారీ పెరుగుదలకు దారితీసింది. కరువు సమయంలో మొక్కజొన్న ధరలు రెట్టింపు అయింది. 2015 నుండి 2017 వరకు కిలోగ్రాముకు 400 షిల్డింగ్సు కొనుగోలు చేయబడిన మొక్కజొన్న కరువు సమయంలో కిలోగ్రాముకు 1253 షిల్లింగ్లకు టోకు కొనుగోలు చేయబడింది.

టాంజానియా 
టాంజానియాలోని ఇగుంగా జిల్లాలో రైతులు

టాంజానియా ఎక్కువగా వ్యవసాయం ఆధారితంగా ఉంది. మొత్తం జనాభాలో 80% జీవనాధారానికి వ్యవసాయంలో పాల్గొంటున్నది. పట్టణీకరణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఆహార కొరతను అధికరింపజేస్తున్నాయి. 2017 లో దేశం నిర్వహించిన ఒక సర్వేలో నగరంలోని 64% మంది నివాసితులతో పోల్చుకుంటే 3 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో 84% మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ, నగర పోషకాహారాల మధ్య ఈ అసమానతకు వివిధ అంశాలకు కారణమవుతుంది; మాన్యువలు కార్మిక, మౌలికసౌకర్యాల కొరత ఫలితంగా ఆహారానికి మరింత పరిమితంగా లభించడం, ప్రకృతివనరుల విధ్వంసం, వ్యవసాయ ఉత్పత్తులలో అంతరాయం పోషకాహార అవసరాలను అధికరింపజేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత అంతరాయం "కార్మికునికి జోడించిన విలువ" వ్యవసాయ రంగాల్లో చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక వ్యవసాయ రంగంలోని కార్మిక కేటాయింపు ప్రభావవంతంగా ఉండదు.

ఆకలిని లక్ష్యంగా చేసుకున్న కార్యక్రమాలు

యు.ఎస్.ఎయిడు కార్యక్రమాలు మోరోగోరో, డోడోమా, ఇరింగా, మొబియా, మినిరా, సాంగ్వే, టాంజానియాలోని జాంజీబార్ ప్రాంతాల పోషణ మీద దృష్టి కేంద్రీకరించింది. ఈ "ఫ్యూచరు ఫీడు" కార్యక్రమాలలో దేశంలో పోషక, మౌలిక వనరులు, విధానాల రూపకల్పన, సంస్థల సామర్ధ్యం, వ్యవసాయ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇది దేశంలో ఆర్థిక వృద్ధిలో కీలకమైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. టాంజానియా ప్రభుత్వం నేతృత్వంలోని "కిలిమో క్వాన్జా" లేదా "అగ్రికల్చరు ఫస్టు" అనేవి ప్రైవేటు రంగంలో వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించాలని, దేశంలోని వ్యవసాయ విధానాలు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 1990 లలో టాంజానియా జనాభాలో దాదాపు 25% మందికి అయోడిను ఆయిలు అందుబాటులో ఉంది. తల్లులలో అయోడిను లోపం గర్భాశయంలోని పిల్లల అభివృద్ధి మీద ప్రభావం చూపి విద్యా సామర్ధ్యంలో ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని అధ్యయనాల ఫలితంగా నిరూపించబడింది. పరిశోధన ప్రకారం సప్లిమెంటు అందుబాటులో ఉన్న తల్లుల పిల్లలు అందుబాటులో లేని తల్లుల పిల్లల కంటే సంవత్సరానికి మూడింట ఒకవంతు కంటే ఎక్కువగా విద్యను సాధించారు.

టాంజానియా 
ప్రపంచ ఆహార కార్యక్రమం పార్సెల్ ఉదాహరణ

వరల్డు ఫుడు ప్రోగ్రాం నేతృత్వంలోని కార్యక్రమాలు టాంజానియాలోనే పనిచేస్తాయి. సప్లిమెంటరీ ఫీడింగు ప్రోగ్రాం నెలవారీ ప్రాతిపదికన 5 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, తల్లులకు విటమిన్లతో నిండిన మిశ్రమ ఆహారాన్ని అందించడం తీవ్రమైన పోషకాహారలోపాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తల్లుల మాతా శిశు ఆరోగ్యం, పోషక ప్రోగ్రాం "సూపరు సెరెలు " అందుబాటు కలిగిస్తుంది. ప్రపంచ ఆహార కార్యక్రమం టాంజానియా శరణార్థులకు ప్రధాన ఆహార వనరుగా మిగిలిపోయింది. కనీస అవసరాలకు అనుగుణంగా సప్లిమెంటు రిలీఫు అండ్ రికవరీ ఆపరేషనులో కానీసం 2,100 కేలరీల ఆహారం అవసరమని భాంచి సూపరు సీరీయలు, వెజిటేబులు ఆయిలు, పప్పులు, ఉప్పు సరఫరా చేయబడ్డాయి. టాంజానియాలోని పోషకాహారంలో పెట్టుబడి కొనసాగించిన యూనిసెఫు దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది: దేశంలో పోషకాహారం దాని ప్రస్తుత స్థాయిలోనే ఉండి ఉంటే. 2025 నాటికి టాంజానియా 20 బిలియన్ డాలర్లను కోల్పోతుందని అంచనా వేసింది. అయితే పోషకాహారంలో మెరుగుదలలు 4.7 బిలియన్ల డాలర్ల లాభం పొందగలవు.

యూనిసెఫు, ఐర్లాండు ఎయిడు నిధుల సహాయంతో టాంజానియాలో న్యూట్రిషను ఫరు పార్టనర్షిపును సృష్టించింది. 2011 లో ఇది దేశంలో పోషకాహారాన్ని అందించడానికి ప్రత్యేకంగా పౌర సమాజ సంస్థలను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పోషకాహారంలో వివిధ రంగాలు వ్యవసాయం, నీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి వంటి లక్ష్యాలను కలిగి ఉన్నాయి. టాంజానియాలో జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో సృష్టించిన అభివృద్ధి ప్రణాళికలు, బడ్జెటులో పోషకాహారంలో ముఖ్యమైన శ్రద్ధ వహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. ఇది సృష్టించబడిన నాటి నుండి ఇది దేశవ్యాప్తంగా 94 నుండి 306 మంది పాల్గొనే పౌర సమాజ సంస్థల సాయంతో వృద్ధి చెందింది. టాంజానియాలో వ్యవసాయం ప్రత్యేకంగా ఐరిషు ఎయిడు నేతృత్వంలోని ప్రోత్సాహంతో న్యూట్రిషను ఫలితాల కోసం హార్నెసింగు అగ్రికల్చరు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోని లిన్డి జిల్లాలో వ్యవసాయంతో పోషకాహార కార్యక్రమాలు విలీనం చేయడమే లక్ష్యంగా కృషిచేస్తుంది. ఈ ప్రాజెక్టు 0 నుండి 23 సంవత్సరాల పిల్లలలో పెరుగుదల స్తంభీకరణ 10% తగ్గిపోతుంది.

సైంసు, సాంకేతికత

టాంజానియా 
Researchers (HC) in Southern Africa per million inhabitants, 2013 or closest year

1996 లో టాంజానియా మొట్టమొదటి "నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ"ను స్వీకరించారు. ప్రభుత్వం "విజన్ 2025" (1998) డక్యుమెంటు " పేరుతో సైన్సు, టెక్నాలజీ సాయంతో ఆర్థిక వ్యవస్థను బలమైన, స్థితిస్థాపకంగా పోటీదారుగా మార్చింది.

2008 లో ఒక ఐఖ్యరాజ్యసమితి కార్యక్రమం గొడుగు క్రింద యునెస్కో, టాంజానియా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు "నేషనలు సైన్సు అండు టెక్నాలజీ పాలసీ"ను పునర్విచారణకు ప్రతిపాదనలు రూపొందించాయి. మొత్తం సంస్కరణల బడ్జెటు $ 10 మిలియన్ల అమెరికా డాలర్లు. దీనికి అఖ్యరాజ్యసమితి నిధులు, ఇతర వనరుల నుండి నిధులు సమకూర్చబడింది. ప్రధాన భూభాగం, జాంజిబారు, రెండవ కుకుటా, రెండవ కుజా ప్రాంతాలలో "నేషనల్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ" ద్వారా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలను ప్రధాన యుక్తికి యునెస్కో మద్దతు అందించింది.

టాంజానియా సవరించబడిన సైన్సు విధానం 2010 లో ప్రచురించబడింది. "నేషనలు రీసెర్చి అండు డెవలపు మెంటు పాలసీ" పేరుతో ఇది పరిశోధనా సామర్థ్యాల ప్రాధాన్యతలను మెరుగుపరచవలసిన అవసరాన్ని గుర్తించింది. పరిశోధన సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యత్వం ఇచ్చింది. పరిశోధనా, అభివృద్ధి వంటి వ్యూహాత్మక ప్రాంతాలలో అంతర్జాతీయ సహకారం అభివృద్ధి చేయటానికి, మానవ వనరుల అభివృద్ధికి కృషిచేస్తుంది. ఇది నేషనలు రీసెర్చి ఫండు స్థాపనకు నిబంధనలను రూపొందిస్తుంది. ఈ విధానం 2012, 2013 లో సమీక్షించబడింది.

టాంజానియా 
2014 లో SADC దేశాలలో మిలియన్ల మంది సైంటిఫిక్ ప్రచురణలు. మూలం: యునెస్కో సైన్స్ రిపోర్ట్ (2015), థామ్సన్ రాయిటర్స్ వెబ్ సైన్స్, సైన్స్ సైటేషన్ ఇండెక్స్ నుండి డేటా విస్తరించింది

2010 లో టాంజానియా జి.డి.పిలో 0.38% పరిశోధన, అభివృద్ధికి అంకితం చేసింది. 2013 లో ప్రపంచ సగటు జిడిపి 1.7% ఉంది. 2010 లో టాంజానియాలో 69 మంది పరిశోధకులు ఉన్నారు. 2014 లో టాంజానియా రాయిటర్సు వెబు సైన్సు (సైన్సు సైటేషను ఇండెక్సు ఎక్స్పాండెడు) ఆధారంగా టాంజానియా అంతర్జాతీయంగా జాబితా చేయబడిన పత్రికలలో మిలియన్ల మందికి 15 ప్రచురణలను అందించింది. సబ్ సహారా ఆఫ్రికా సగటున మిలియను మందికి 20 ప్రచురణలు ఉండగా ప్రపంచ సగటు మిలియన్ల మందికి 176 ప్రచురణలు ఉన్నాయి.

గణాంకాలు

Population in Tanzania
Year Million
1950 7.9
2000 35.1
2016 55.6

2012 జనాభా లెక్కల ప్రకారం టంజానియా జనసంఖ్య 4,49,28,923. వీరిలో 15 సంచత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారి 44.1% మంది ఉన్నారు.

టాంజానియాలో జనాభా పంపిణీ అసమానంగా ఉంది. ఉత్తర సరిహద్దు, తూర్పు తీరంలో ప్రజలు అధికసంఖ్యలో నివసిస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో జనసాంధ్రత చాలా తక్కువ ఉంది. కటావి ప్రాంతంలో చదరపు కిలోమీటరుకు 12 ఉండగా ఇతర ప్రాంతాలలో జన సాంధ్రత వైవిధ్యంగా మారుతుంది. డర్ ఎస్ సలాం ప్రాంతంలో జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 3,133 ఉంది.

సుమారు 70% జనాభా గ్రామీణ ఉండగా ఇది 1967 నుండి తగ్గుతూనే ఉంది. అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని దారు ఎస్ సలాం (జనాభా 43,64,541) . దోడోమా (జనాభా 410,956). ఇది టాంజానియా మధ్యలో ఉంది. ఇది దేశ రాజధానిగా ఉంది. ఇక్కడ జాతీయ అసెంబ్లీ ఉంది.

టాంజానియా 
హడ్జెరు ప్రజలు వేట-సంగ్రాహకులుగా నివసించారు

టంజానియాలో సుమారు 125 జాతుల సమూహాలు ఉన్నాయి. సుకుమా, నైమువేజీ, చాగ్గా, హయా ప్రజలు ఒక్కొక సమాజంలో 1 మిలియను ప్రజలు ఉన్నారు. టాంజానియాలో సుమారు 99% మంది స్థానిక ఆఫ్రికా సంతతికి చెందినవారు ఉన్నారు. చిన్న సంఖ్యలో అరబ్బు, ఐరోపా, ఆసియా సంతతికి చెందినవారు ఉన్నారు. సునుమా, న్యామ్వేజీలతో సహా టాంజానియాలో ఎక్కువ మంది బంటు ప్రజలు ఉన్నారు.

ఈ జనాభాలో అరబ్బు, పర్షియను, భారతీయ మూలాలు, చిన్న ఐరోపా, చైనా వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. చాలామంది షిరాజీ ప్రజలు ఉన్నట్లు గుర్తించారు. 1964 నాటి సాన్జిబారు విప్లవ సమయంలో వేలమంది అరబ్లు, పర్షియన్లు, భారతీయులు సామూహికంగా హత్య చేయబడ్డారు. 1994 నాటికి ఆసియా కమ్యూనిటీ ప్రధాన భూభాగంలో 50,000, జాంజిబార్లో 4,000 ఉన్నారు. సుమారుగా 70,000 అరబ్బులు, 10,000 మంది ఐరోపా ప్రజలు టాంజానియాలో నివసించారు.

ఇటీవలి సంవత్సరాలలో టాంజానియాలో కొంత మది అల్బినోలు హింసాకాండ బాధితులుగా ఉన్నారు. అల్బునోల ఎముకలు ఉంటే సంపద తీసుకుని వస్తుందని ప్రజలలో ఉన్న విపరీతమైన మూఢ విశ్వాసం కారణంగా అల్బునోల అవయవాల కొరకు తరచుగా దాడులు జరిగాయి. ఆచరణను నివారించడానికి దేశంలో మంత్రగత్తె వైద్యులను నిషేధించినప్పటికీ అది కొనసాగింది.

టాంజానియా ప్రభుత్వ గణాంకాల ఆధారంగా టాంజానియాలోని మొత్తం సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు సరాసరి 5.4 పిల్లలు. పట్టణ ప్రధాన భూభాగంలో 3.7 ఉండగా గ్రామీణ ప్రధాన భూభాగంలో 6.1 ఉంది. సాన్జిబారులో 5.1 పిల్లలు ఉన్నారు.

45- 49 మద్య వయసున్న మహిళలలో 37.3% ఎనిమిది అంతకంటే ఎక్కువ మందికి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ వయస్సు వివాహిత చేసుకున్న మహిళలలో 45% శాతం మంది చాలా మంది పిల్లలకు జన్మనిచ్చారు.

మతం

Religion in Tanzania (2014)
Christianity
  
61.4%
Islam
  
35.2%
Indigenous beliefs
  
1.8%
Other
  
1.6%
Source: CIA World Factbook.
Azania Front Lutheran Church, built by German missionaries in 1898

మతంపై అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. 1967 తర్వాత ప్రభుత్వ జనాభా గణనల నుండి మతపరమైన సర్వేలు తొలగించబడడమే అందుకు కారణం. 2007 లో అంచనా వేసిన మతనాయకులు, సాంఘిక శాస్త్రవేత్తలు ముస్లిం, క్రైస్తవ సంఘాలు పరిమాణంలో సమానంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. వీరు జనాభాలో 30% నుండి 40% మంది ఉన్నారు. మిగిలినవారు ఇతర మతవిశ్వాసాలు, దేశీయ మతాలు, నాస్థికులు ఉన్నారు.".

సి.ఐ.ఎ. వరల్డు ఫాక్టు బుకు అంచనా ఆధారంగా ప్రజలలో 61.4% క్రైస్తవులు, 35.2% మంది ముస్లింలు, 1.8% సాంప్రదాయ ఆఫ్రికా మతస్థులు, 1.4% ఏ మతానికి అనుబంధించబడలేదు, 0.2% ఇతర మతాలను అనుసరించారు. జంజీబారు మొత్తం జనాభా ముస్లింలు. ముస్లింలలో 16% అహమదీయ (ముస్లింలుగా పరిగణించబడరు), 20% మంది అహేతుక ముస్లింలు, 40% మంది సున్నీ, 20% షియా, 4% సూఫి ఉన్నారు.

క్రైస్తవులలో అధికంగా రోమను కాథలిక్కులు, ప్రొటెస్టంట్లు ఉన్నారు. ప్రొటెస్టంట్లు మధ్య, పెద్ద సంఖ్యలో లూథరన్లు, మొరవియన్లు దేశం (జర్మనీ పూర్వీకసంతతికి చెందిన ప్రజలు) ఉన్నారు. అయితే ఆంగ్లికన్ల టాంక్యీనిక బ్రిటిషు చరిత్రతో సంబంధితులై ఉన్నారు. మిషనరీ కార్యకలాపాల వలన పెంటెకోస్టులు, అడ్వెంటిస్టులు కూడా ఉన్నారు. కొంతమంది వాలోకోల్ ఉద్యమం (తూర్పు ఆఫ్రికా పునరుద్ధరణ) నుండి వివిధ స్థాయిలలో ప్రభావం కలిగి ఉన్నారు. ఇది ఆకర్షణీయమైన పెంటెకోస్టల్ సమూహాల విస్తరణకు సారవంతమైన మైదానంగా కూడా ఉంది.

ప్రధాన భూభాగాలలో ప్రధానంగా బౌద్ధులు, హిందువులు, బహాయిసు వంటి ఇతర మత సమూహాలు కూడా ఉన్నాయి.

భాషలు

టాంజానియా 
A carved door with Arabic calligraphy in Zanzibar

టాంజానియాలో 100 కన్నా ఎక్కువ భాషలు వాడుకలో ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో ఇది చాలా భాషా వైవిధ్యమైన దేశంగా ఉంది. వాడుక భాషలలో ఆఫ్రికాలోని నాలుగు భాషా కుటుంబాలు ఉన్నాయి: బంటు, కుషిటికు, నిలోటికు, ఖోసను. టాంజానియాలో అధికారిక భాషలు లేవు.

స్వాహిలీ భాషను సుప్రీం పార్లమెంటరీ చర్చలో, దిగువ కోర్టులలో, ప్రాథమిక పాఠశాలలో బోధన మాధ్యమంగా ఉపయోగిస్తారు. విదేశీ వాణిజ్యంలో, దౌత్యంలో, ఉన్నత న్యాయస్థానాల్లో, ద్వితీయ, ఉన్నత విద్యలో బోధన మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. ఆంగ్లభాష వాణిజ్యం, దౌత్యం, ఎగువకోర్టులు, సెమిఅండరీ, ఉన్నత విద్యకు బోధనా మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ టాంజానియా ప్రభుత్వం ఆంగ్ల పదజాలం ఉపసంహరించుకోవాలని ప్రణాళికలు చేసింది.

అతని ఉజ్జమా సాంఘిక విధానాలకు సంబంధించి, దేశంలోని అనేక జాతుల సమూహాలను ఏకం చేయడంలో సహాయపడేందుకు స్వాహిలీని ఉపయోగించడాన్ని అధ్యక్షుడు నేరేరే ప్రోత్సహించాడు. సుమారుగా 10% మంది టాంజానియావారు మొదటి భాషగా స్వాహిలిను మాట్లాడతారు. 90% వరకు రెండవ భాషగా మాట్లాడతారు. చాలామంది విద్యావంతులైన టాంజానియన్లు ఆంగ్లంలో మాట్లాడటం కూడా వాడుకలో ఉంది. వీరిని త్రిభాషా వాడుకరుగా భావిస్తారు. స్వాహిలీ విస్తృత వినియోగం, ప్రచారం దేశంలో చిన్న భాషల క్షీణతకు దోహదపడింది. నగర ప్రాంతాలలో చిన్నపిల్లలు సుప్రసిద్ధంగా మొదటి భాషగా స్వాహిలీ భాషను మాట్లాడతారు. స్వాహిలీ కాకుండా ఇతర కమ్యూనిటీ భాషలు బోధన భాషగా అనుమతించబడవు. ప్రాథమిక విద్యలో కొన్ని సందర్భాల్లో అవి అనధికారికంగా ఉపయోగించినప్పటికీ. వారు ఒక అంశంగా బోధించరు. ఒక ఇ.సి.ఎల్.లో టెలివిజను రేడియో కార్యక్రమాలు నిషేధించబడ్డాయి, ఒక ఇ.సి.ఎల్.లో ఒక వార్తాపత్రిక ప్రచురించడానికి అనుమతి పొందడం దాదాపు అసాధ్యం. డార్ ఎస్ సలాం విశ్వవిద్యాలయంలో స్థానిక, ప్రాంతీయ ఆఫ్రికన్ భాషలు, సాహిత్యాల విభాగం ఏదీ లేదు. అరబిక్ సన్జిబార్లో సహ-అధికారిక భాషగా ఉంది.

సండావి ప్రజలు ఖో భాషలతో సంబంధం కలిగి ఉన్న ఒక భాషని మాట్లాడేవారు. అదే సమయంలో బోత్సునా, నమీబియా లోన్ హడ్జుబే ప్రజల భాష అదే క్లిక్కు హల్లులను కలిగి ఉన్నప్పటికీ నిస్సందేహంగా ఈ భాషను ఒంటరి భాషగా భావిస్తారు. The language of the Iraqw people is Cushitic.

విద్య

టాంజానియా 
Nkrumah Hall at the University of Dar es Salaam

2012 లో 15 సంవత్సరాల కంటే అధికమైన వయసున్న వారిలో అక్షరాస్యత 67.8% ఉంది. టంజానియాలో పిల్లలు 15 సంవత్సరాల వరకు నిర్బంధవిద్య అమలులో ఉంది. 2010 లో 5 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలో 74.1% మంది పాఠశాలకు హాజరయ్యారు. 2012 లో ప్రాథమిక పాఠశాల హాజరు 80.8 శాతం ఉంది.

ఆరోగ్యసంరక్షణ

2012 నాటికి ఆయుఃపరిమితి 61 సంవత్సరాలు. 2012 లో ఐదుసంవత్సరాల లోపు వయసున్న పిల్లల మరణాల నిష్పత్తి 1000 జననాలకు 54 గా ఉంది. 2013 లో ప్రసూతి మరణాల రేటు 1,00,000 ప్రసవాలలో 410 గా అంచనా వేయబడింది. 2010 లో 5 సంవత్సరముల వయస్సు ఉన్న పిల్లలలో మరణం సంభవించడానికి ప్రధాన కారణం ముందుగా ప్రసవం జరగడం, మలేరియా భావిస్తున్నారు. ఈ పిల్లల మరణానికి ఇతర ప్రధాన కారణాల క్రమంలో మలేరియా, అతిసారం, ఎయిడ్సు, మసూచి తగ్గుముఖం పడుతున్నాయి. టంజానియాలో మలేరియా అంటువ్యాధి అత్యధిక మరణాలకు కారణం ఔతూ ఉంది. 2008 లో ఆసుపత్రులు 11.5 మిలియన్ల మలేరియా కేసులను నమోదు చేసాయి. 2007-2008 సంవత్సరంలో 6 మాసాల నుండి 5 వయస్సు ఉన్న పిల్లలకు మధ్య మలేరియా ప్రాబల్యం కగెరాప్రాంతంలోని విక్టోరియా సరోవర పశ్చిమ తీరంలో అత్యధికంగా (41.1%) ఉండగా, అరూషా ప్రాంతణ్లో (0.1%) అత్యల్పంగా ఉంది.

2010 టాంజానియా డెమోక్రటికు అండు హెల్తు సర్వే ఆధారంగా టాంజానియా మహిళల్లో 15% సత్నా ఆచారం ఉంది. 72% టాంజానియా పురుషులు సున్నతి పొందారు. మయారా, డోడొమా, అరుషా, సింగిడా ప్రాంతాలలో సత్నా ఆచారం అధికంగా ఉంది. జంజీబారులో ఇది ఉనికిలో లేదు.: page 296  తూర్పు (దార్ ఎస్ సలాం, పివని, మొరోగోరో ప్రాంతాలలో), ఉత్తర (కిలిమంజారో, తూర్పు) లో మగ సుంతీ ప్రాబల్యం 90% పైన ఉంది. తూర్పు, అరూషా, మినిరా ప్రాంతాలు), కేంద్ర ప్రాంతాలు (డోడోమా, సిండిడా ప్రాంతాలు) దక్షిణ పర్వత ప్రాంత మండలంలో (బేయా, ఇరింగా, రుక్వా ప్రాంతాలు) మాత్రమే 50% కంటే తక్కువగా ఉన్నాయి.

2012 నాటి జనాభాలో 53% మంది మెరుగైన తాగునీటి వనరులను ఉపయోగించారు. 12% మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఎయిడ్సు

2011- 2012 లో " వరల్డు హెల్తు ఆర్గనైజేషను " టాంజానియాలో ఎయిడ్సు వ్యాప్తి 3.1% ఉందని అంచనా వేసింది. అయితే " టంజానియా ఎయిడ్సు, మలేరియా ఇండికేటరు సర్వే 2011-2012 " 15 నుండి 49 సంవత్సరాల మద్యవయస్కులలో ఎయిడ్సు వ్యాప్తి 5.1% ఉందని అంచనా వేసింది. 2011 లో 19% ఉండగా 2013 లో 37% మంది హెచ్ఐవీతో బాధపడుతున్నవారికి వ్యతిరేక రెట్రోవైరలు చికిత్స అందుబాటులో ఉంది. ఎయిడ్సు మరణాలు 33% తగ్గిపోయాయి. హెచ్ఐవి అంటురోగం 36% తగ్గింది. పిల్లల మధ్య కొత్త హెచ్ఐవి అంటువ్యాధులు 67% తగ్గుముఖం పట్టాయి.

మహిళలు

స్త్రీలకు, పురుషులకు చట్టంలో సమానత్వం ఉంది. 1985 లో మహిళలు వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షతలను తొలగించాలన్న సదస్సులో ప్రభుత్వం సంతకం చేసింది. 18 వయసు లోపున్న పది మంది స్త్రీలలో దాదాపు ముగ్గురు మహిళలు లైంగిక హింసను అనుభవించినట్లు నివేదించింది. స్త్రీలలో సత్నా ప్రాబల్యం తగ్గింది. పాఠశాల బాలికలు డెలివరీ తర్వాత పాఠశాలకు తిరిగి చేరుతారు. పోలీసు ఫోర్సు పరిపాలన దుర్వినియోగం చేసిన బాధితుల ప్రాముఖ్యతను పెంచుటకు సాధారణ పోలీసు కార్యకలాపాలనుంచి లింగ సంబంధిత విభాగం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తుంది. స్త్రీలు, పిల్లలపై జరిగిన అతిక్రమణలు, హింస చాలావరకు కుటుంబ స్థాయిలో జరుగుతుంది. జాతీయ అసెంబ్లీ ఎన్నుకోబడిన సభ్యులలో కనీసం 30% మంది మహిళలను టాంజానియా రాజ్యాంగం కోరుతుంది. విద్య, శిక్షణలో లింగ భేదాలు ఈ మహిళల, బాలికల తరువాతి జీవితంలో ప్రభావం చూపుతాయి. పురుషుల కంటే స్త్రీలలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. కార్మిక చట్టంలో ప్రసూతి సెలవులు ఒక మహిళా ఉద్యోగికి హక్కుగా హామీ ఇవ్వబడుతుంది.

సంస్కృతి

టాంజానియా 
Judith Wambura (Lady Jaydee) is a popular Bongo Flava recording singer.

సాహిత్యం

టాంజానియా సాహిత్య సంస్కృతి ప్రధానంగా మౌఖికసంప్రదాయంగా ఉంది. ప్రధానమైన మౌఖిక సాహిత్య ఆకృతులు జానపద కథలు, పద్యాలు, పొడుపుకథలు, సామెతలు, పాటలు భాగంగా ఉంటాయి. టాంజానియా నమోదు చేయబడిన మౌఖిక సాహిత్యం గొప్ప భాగం స్వాహిలి భాషలో ఉంది. బహుళజాతి సామాజంగా అభివృద్ధి చెందిన కారణంగా దేశం మౌఖిక సాహిత్యం క్షీణిస్తుంది. మరింత కష్టతరమైన మౌఖిక సాహిత్యం, పెరుగుతున్న ఆధునికీకరణతో మౌఖిక సాహిత్యం విలువ తగ్గించబడుతుంది.

టాంజానియా వ్రాతబద్ధమైన సాహిత్య సంప్రదాయం అభివృద్ధి చెందలేదు. టాంజానియాలో జీవితకాల పఠనా సంస్కృతి లేదు. పుస్తకాలు తరచూ ఖరీదైనవి, దొరకడం కష్టమవుతున్నాయి.: page 75  టాంజానియా సాహిత్యం అధికంగా స్వాహిలి లేదా ఆంగ్లంలో ఉంది. టంజానియా వ్రాత సాహిత్యంలో షాబాను రాబర్టు (స్వాహిలీ సాహిత్య పిత), ముహమ్మదు సాలే ఫార్సే, ఫరాజి కటంబులా, ఆడం షాఫీ ఆడం, ముహమ్మద్ సయీద్ అబ్దుల్లా, మొహమ్మద్ సలీమాన్ మొహమ్మద్, యూఫ్రేజ్ కెజిలాహబీ, గబ్రియేల్ రుహంబిక, ఇబ్రహీం హుస్సేన్, మే మాటర్రు బాలిసిడ్యా, ఫదీ మంతంగా, అబ్దులరాకు గూర్నా, పెనినా ఓ.మలమా ప్రాధాన్యత వహిస్తున్నారు.

పెయింటింగు, శిల్పం

టాంజానియా 
A Tingatinga painting

రెండు టాంజానియా కళ శైలులు అంతర్జాతీయ గుర్తింపును సాధించాయి. ఎడ్వర్డు సెడు తింగింగ్టా స్థాపించిన టింగెటింగు పెయింటింగు స్కూలు కాన్వాసు మీద సాధారణంగా రంగులో ప్రకాశవంతమైన ఎనామెలు పెయింటింగులో శిక్షణ ఇస్తుంది. ఈ చిత్రాలలో సాధారణంగా ప్రజలు, జంతువులు లేదా రోజువారీ జీవితాన్ని చిత్రిస్తారు.: p. 113  1972 లో తింగింగ్టా మరణించిన తరువాత ఇతర కళాకారులు అతని శైలిని స్వీకరిచి అభివృద్ధి చేశారు. తద్వారా తూర్పు ఆఫ్రికాలో కళా ప్రక్రియ అత్యంత ముఖ్యమైన పర్యాటక శైలిగా ఉంది.: p. 113  చారిత్రాత్మకంగా, టాంజానియాలో అధికారిక ఐరోపా కళల శిక్షణకు పరిమిత అవకాశాలు ఉన్నాయి. అనేక ఔత్సాహిక టాంజానియా కళాకారులు తమ వృత్తిని కొనసాగించడానికి దేశమును విడిచిపెట్టారు.

క్రీడలు

టంజానియాలో అసోసియేషను ఫుట్ బాలు క్రీడ అత్యధికంగా ప్రజాదరణ పొందుతూ ఉంది. " టంజానియాలో డారు ఎస్ సలేంలో ఉన్న యంగు ఆఫ్రికంసు ఎఫ్.సి, సింబా ఎస్.సి, అత్యధిక ప్రాముఖ్యత కలిగిన ప్రొఫెషనలు ఫుటుబాలు క్లబ్బులుగా ఉన్నాయి. టంజానియా ఫుట్ బాలు సమాఖ్య దేశంలో ఫుట్ బాలు వ్యవస్థ నిర్వహణా బాధ్యతలు వహిస్తుంది.

ఇతర ప్రజాదరణ కలిగిన క్రీడలలో బాస్కెటుబాలు, నెట్ బాలు, బాక్సింగు, వాలీబాలు, అథ్లెటిక్సు, రగ్బీ ఉన్నాయి.

సినిమా

టంజానియాలో " బాంగో మువీ " ప్రముఖ చలనచిత్ర పరిశ్రమ ఉంది.

చిత్రమాలిక

గమనికలు

మూలాలు

బయటి లంకెలు

Tanzania గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

టాంజానియా  నిఘంటువు విక్షనరీ నుండి
టాంజానియా  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
టాంజానియా  ఉదాహరణలు వికికోట్ నుండి
టాంజానియా  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
టాంజానియా  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
టాంజానియా  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

    ప్రభుత్వం

Tags:

టాంజానియా పేరువెనుక చరిత్రటాంజానియా చరిత్రటాంజానియా భౌగోళికంటాంజానియా ఆర్ధిక రంగం మౌలికనిర్మాణాలుటాంజానియా ఆహారం, పోషకాహారంటాంజానియా సైంసు, సాంకేతికతటాంజానియా గణాంకాలుటాంజానియా సంస్కృతిటాంజానియా చిత్రమాలికటాంజానియా గమనికలుటాంజానియా మూలాలుటాంజానియా బయటి లంకెలుటాంజానియాఉగాండాకాంగోకెన్యాజాంబియాబురుండీమలావిమొజాంబిక్రువాండాహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

చదలవాడ ఉమేశ్ చంద్రజెర్రి కాటుప్రేమలుఉలవలుమలబద్దకంఇద్దరు మొనగాళ్లుసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుమమితా బైజుసీతాదేవిఅనపర్తి శాసనసభ నియోజకవర్గంచెమటకాయలుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)పునర్వసు నక్షత్రముఏప్రిల్ 21కృతి శెట్టియవ్వనంరంగ రంగ వైభవంగావడదెబ్బపంచభూతలింగ క్షేత్రాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమూర్ఛలు (ఫిట్స్)తెలంగాణ ఉద్యమంజాంబవంతుడునాగ్ అశ్విన్పిఠాపురంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపూజా హెగ్డేట్రూ లవర్వేయి స్తంభాల గుడివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిహరే కృష్ణ (మంత్రం)గ్రామ పంచాయతీఆంధ్రప్రదేశ్పండుభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుప్రభాస్అనూరాధ నక్షత్రంనరసింహావతారంపరకాల ప్రభాకర్మహాసముద్రంశ్రీశ్రీబతుకమ్మకోణార్క సూర్య దేవాలయంతాటి ముంజలురాజా (1999 సినిమా)జామపొడుపు కథలుతోట త్రిమూర్తులురాశిహనుమజ్జయంతిగణపతి (సినిమా)దళితులురక్త ప్రసరణ వ్యవస్థహస్తప్రయోగంచంపకమాలబి.ఆర్. అంబేద్కర్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుక్షయభారతదేశ జిల్లాల జాబితాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంరాహుల్ గాంధీ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుLనువ్వులుకలువమంచి మనసులు (1986 సినిమా)ఐక్యరాజ్య సమితిఇన్‌స్పెక్టర్ రిషికాశీభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకర్ణుడుకరోనా వైరస్ 2019ఏలకులుసప్తర్షులుశ్యామ్ ప్రసాద్ రెడ్డితేలుఅత్తిపత్తి🡆 More