గబాన్

గబాన్ పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం.

దేశ వాయవ్య సరిహద్దులలో ఈక్వటోరియల్ గ్వినియా, ఉత్తర సరిహద్దులో కామెరూన్, తూర్పు, దక్షిణ సరిహద్దులో కాంగో రిపబ్లిక్లు ఉన్నాయి. దేశ వైశాల్యం దాదాపు 270, 000 చ.కి.మీ. జనాభా 20,00,000. రాజధాని, పెద్ద నగరం లిబ్రెవీల్.

République Gabonaise
గబోనీస్ రిపబ్లిక్
Flag of గబాన్ గబాన్ యొక్క చిహ్నం
నినాదం
"Union, Travail, Justice"
జాతీయగీతం

గబాన్ యొక్క స్థానం
గబాన్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Libreville
0°23′N 9°27′E / 0.383°N 9.450°E / 0.383; 9.450
అధికార భాషలు ఫ్రెంచ్ భాష
ప్రజానామము గబోనీస్
ప్రభుత్వం రిపబ్లిక్కు
 -  President Ali Bongo Ondimba
 -  Prime Minister Paul Biyoghé Mba
Independence
 -  from France August 17 1960 
 -  జలాలు (%) 3.76%
జనాభా
 -  July 2005 అంచనా 1,454,867 (150th)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $21.049 billion 
 -  తలసరి $14,478 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $14.519 billion 
 -  తలసరి $9,986 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.729 (medium) (107th)
కరెన్సీ en:Central African CFA franc (XAF)
కాలాంశం CAT (UTC+1)
 -  వేసవి (DST) not observed (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ga
కాలింగ్ కోడ్ +241

1960 లో ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సార్వభౌమ రాజ్యమైన గబాన్ ను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. 1990 ల ప్రారంభంలో గబాన్ ఒక బహుళ పార్టీ వ్యవస్థను, ఒక నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. ఇది మరింత పారదర్శక ఎన్నికల ప్రక్రియకు సహకరించింది. అనేక ప్రభుత్వ సంస్థలను సంస్కరించింది. విస్తారమైన పెట్రోలియం నిలువలు, విదేశీ పెట్టుబడులు గాబన్ ను ఉప-సహారా ఆఫ్రికాలో అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటిగా చేసింది. తలసరి అత్యధిక జి.డి.పి. (పిపిపి) (మారిషస్, ఈక్వెటోరియల్ గినియా, సీషెల్స్ తర్వాత) ఆఫ్రికా దేశాలలో 4 వ స్థానంలో ఉంది. 2010 నుండి 2012 సంవత్సరానికి జి.డి.పి. 6% కంటే అధికరించింది. అయితే ఆదాయ పంపిణీలో అసమానత కారణంగా జనాభాలో గణనీయమైన సంఖ్యలో పేదలు మిగిలి ఉన్నారు.

పేరు వెనుక చరిత్ర

గబాల్ పేరుకు " గబాయో " అనే పదం మూలంగా ఉంది.

చరిత్ర

గబాన్ 
A map of West Africa in 1670

ఈ ప్రాంతంలోని మొట్టమొదటి పిగ్మీ ప్రజలు నివసించారు. వారు ఎక్కువగా అధికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి బంటు తెగలలో కలిసిపోయారు.

15 వ శతాబ్దంలో మొదటి సారిగా ఈ ప్రాంతానికి యూరోపియన్లు వచ్చారు. 18 వ శతాబ్దంనాటికి ఓరూన్ అని పిలువబడిన మెరీని భాషను మాట్లాడే ప్రజలు ఈ ప్రాంతంలో రాజ్యం స్థాపించారు.

1722 ఫిబ్రవరి 10 న బ్లాకు బార్టు అని పిలవబడే వెల్షు పైరేటు అయిన " బర్తోలోవ్ రాబర్టు కేపు " లోపెజ్ సముద్రంలో మరణించాడు. 1719 నుండి 1722 వరకు ఆయన అమెరికా, పశ్చిమ ఆఫ్రికా నుండి నౌకల మీద దాడి చేశాడు.

1875 లో ఫ్రెంచి అన్వేషకుడు " పియరు సావర్గానన్ డి బ్రెజా " నాయకత్వంలో మొట్టమొదటి మిషనును గాబోన్-కాంగో ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ ఆయన ఫ్రాన్సు విల్లే పట్టణాన్ని స్థాపించారు. తరువాత ఆయన కలోనియల్ గవర్నరుగా ఉన్నాడు. 1885 లో ఫ్రాన్సు అధికారికంగా ఆక్రమించిన సమయంలో ప్రస్తుత గ్యాబన్ ప్రాంతంలో అనేక బంటు సమూహాలు ఉన్నాయి.

1910 లో గాబన్ ఫ్రెంచి ఈక్వెటోరియల్ ఆఫ్రికాలోని నాలుగు భూభాగాల్లో ఒకటిగా మారింది. 1959 వరకు ఈ సమాఖ్య మనుగడలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు విచి ఫ్రాన్సు వలస రాజ్య పాలనను పడగొట్టడానికి గాబాన్‌ను ఆక్రమించాయి. 1960 ఆగస్టు 17 న ఫ్రెంచి ఈక్వెటోరియల్ ఆఫ్రికా భూభాగాలు స్వతంత్రం అయ్యాయి. 1961 లో గాబోన్ మొదటి అధ్యక్షుడుగా ఎన్నికైన లెమన్ మెబా నియమించబడగా ఒమర్ బొంగో ఒండింబ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించాడు.

అధికారంలోకి వచ్చిన ఎమ్'బా ప్రవేశం తరువాత ప్రెస్ అణిచివేతకు గురైంది. రాజకీయ ప్రదర్శనలు నిషేధించబడ్డాయి, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తగ్గించాయి. ఇతర రాజకీయ పార్టీలు క్రమంగా అధికారం నుండి మినహాయించబడ్డాయి. రాజ్యాంగం మార్చబడింది. ఎం'బా తనను తాను ఊహించుకున్నట్లు ప్రెసిడెన్సీ అధికారం ఫ్రెంచి తరహాలో మార్చబడింది. 1964 అయినప్పటికీ ఎం ' బా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఒక-పార్టీ నియమాన్ని స్థాపించడింది. ఒక సైన్యం తిరుగుబాటుతో ఎం' బా అధికారం నుండి తొలగించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. ఫ్రెంచి పారాట్రూపర్లు వచ్చి 24 గంటలలో ఎం, బాను అధికారంలో నిలబెట్టారు.

కొన్ని రోజులు పోరాటం తరువాత తిరుగుబాటు ముగిసింది. విస్తృతమైన నిరసనలు, అల్లర్లు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఖైదు చేయబడ్డారు. ఫ్రెంచి సైనికులు ఇంకా గాంబో రాజధాని శివార్లలో క్యాంప్ డి గల్లెలో ఉన్నారు. 1967 లో ఎం ' బా మరణించిన తరువాత అయన స్థానంలో బొంగో నియమించబడ్డాడు.

గబాన్ 
The Battle of Gabon resulted in the Free French Forces taking the colony of Gabon from Vichy French forces, 1940

1968 మార్చిలో బాంగ్ బి.డి.జి.ను రద్దు చేసి " డెమొక్రాటిక్ గాబొనాయిస్ " పేరుతో కొత్తపార్టీని స్థాపించి ఏక పార్టీ దేశంగా ప్రకటించింది. ఆయన రాజకీయ అనుబంధం లేకుండా అన్ని గాబొనీయన్లను ఆహ్వానించాడు. 1975 లో బొంగో అధ్యక్షుడుగా ఎన్నిక అయ్యాడు. 1975 ఏప్రెలులో వైస్ ప్రెసిడెంట్ పదవిని రద్దు చేసి అది ప్రధాన మంత్రి పదవితో భర్తీ చేయబడింది. ఆయనకు ఆటోమేటిక్ వారసత్వానికి హక్కు లేదు. 1979 డిసెంబరు, 1986 నవంబరు రెండింటిలోనూ బోంగో తిరిగి ఎన్నికయ్యారు 7 సంవత్సరాల పదవీ కాలాల విధానాలతో కొనసాగాడు.

1990 ప్రారంభంలో ఆర్థిక అసంతృప్తి, రాజకీయ సరళీకరణ కోరుతూ విద్యార్థులు, కార్మికులు హింసాత్మక ప్రదర్శనలు, దాడులు చేయడానికి ప్రేరణ కలిగించాయి. కార్మికుల మనోవేదనలకు ప్రతిస్పందనగా బొంగో వారితో ఒక రంగాలవారిగా చర్చలు జరిపి గణనీయమైన వేతన రాయితీలు మంజూరు చేసాడు. అంతేకాక పి.డి.జి.ను తెరిచేందుకు, గాబన్ భవిష్యత్తు రాజకీయ వ్యవస్థను చర్చించడానికి మార్చి-ఏప్రిల్ 1990 లో ఒక జాతీయ రాజకీయ సమావేశాన్ని నిర్వహించాలని ఆయన హామీ ఇచ్చారు. పి.డి.జి,, 74 రాజకీయ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. పాల్గొనేవారిలో ముఖ్యంగా రెండు బలహీనమైన సంకీర్ణాలు, పాలక పి.జి.డి. దాని మిత్రపక్షాలు, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ప్రతిపక్ష అసోసియేషన్సు పార్టీలు, విడిపోయిన మొరెన ఫండమెంటల్, గాబొనీస్ ప్రోగ్రెస్ పార్టీలు ఉన్నాయి.

1990 ఏప్రిల్ సదస్సు జాతీయ సెనేటు ఏర్పాటు, బడ్జెట్ ప్రక్రియ వికేంద్రీకరణ, అసెంబ్లీ, పత్రికా స్వేచ్ఛ, ఎగ్జిట్ వీసా అవసరాన్ని రద్దు చేయడం వంటి రాజకీయ సంస్కరణలను ఆమోదించింది. రాజకీయ వ్యవస్థను బహుళపార్టీ ప్రజాస్వామ్యంగా పరివర్తన చేయడానికి మార్గనిర్దేశించేసే ప్రయత్నం జరిగింది. బొంగో పి.డి.జి. ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి కొత్త ప్రధాన మంత్రి కాసిమిర్ ఓయ్-మాబా నాయకత్వంలో పరివర్తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది గబోనీస్ సోషల్ డెమొక్రాటిక్ గ్రూపింగు ప్రభుత్వం అని పిలవబడింది. మంత్రివర్గంలో అనేక ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను నియమించింది. 1990 మేలో ఆఋ.ఎస్.డి.జి ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది ప్రాథమిక హక్కుల బిల్లును, స్వతంత్ర న్యాయవ్యవస్థను అందించింది. కానీ అధ్యక్షుడికి బలమైన కార్యనిర్వాహక అధికారాలను నిలుపుకుంది. ఒక రాజ్యాంగ కమిటీ, జాతీయ అసెంబ్లీ సమీక్ష తరువాత ఈ పత్రం 1991 మార్చిలో అమల్లోకి వచ్చింది.

పి.డి.జి.కి వ్యతిరేకతను అధిగమిస్తూ 1990 ఏప్రిల్ సమావేశం తర్వాత కొనసాగింది. 1990 సెప్టెంబరులో రెండు తిరుగుబాటు ప్రయత్నాలు అణిచివేయబడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఉన్నప్పటికీ ఒక ప్రతిపక్ష నేత అకాల మరణం తరువాత 1990 లో సెప్టెంబరు-అక్టోబరు 1990 లో 30 సంవత్సరాల కాలంలో మొదటి బహుళపార్టీ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో పి.జి.డి. ఒక పెద్ద మెజారిటీని పొందింది.

గబాన్ 
President George W. Bush welcomes President Omar Bongo to the Oval Office, May 2004

1993 డిసెంబరులో అధ్యక్షుడు జరిగిన రీ ఎలెక్షనులో ఒమర్ బొంగో ఎన్నికలలో 51% ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించడానికి నిరాకరించారు. తీవ్రమైన ప్రజా సంక్షోభం, హింసాత్మక అణచివేత ప్రభుత్వం, ప్రతిపక్ష వర్గాల మధ్య ఒక రాజకీయ పరిష్కారం వైపు పనిచేయడానికి ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి రావడానికి దారి తీసింది. ఈ చర్చల ఫలితంగా 1994 నవంబరులో పలు రాజకీయప్రముఖులు జాతీయ సమైక్య ప్రభుత్వంలో చేర్చబడ్డారు. ఈ ఏర్పాటు త్వరలోనే విఫలమయ్యింది. 1996 - 1997 శాసనసభ, పురపాలక ఎన్నికలు పునరుద్ధరించబడిన రాజకీయనేపథ్యం అందించాయి. ఎన్నికలలో పి.డి.జి. మెజారిటీ విజయాన్ని సాధించింది కాని అనేక పెద్ద నగరాలు, లిబ్రేవిల్లేతో 1997 స్థానిక ఎన్నికలలో ప్రతిపక్ష మేయర్లను ఎన్నుకున్నారు.

విభజిత ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు ఒమర్ బొంగో 1998 డిసెంబరులో తిరొగి ఎన్నికలు నిర్వహించి ఓటు వేయడం ద్వారా సులభంగా తిరిగి ఎన్నికయ్యారు. బోంగో ప్రధాన ప్రత్యర్థులు ఎన్నికలను మోసపూరిత ఫలితంగా తిరస్కరించారు. కొందరు అంతర్జాతీయ పరిశీలకులు అనేక అవకతవకలు జరిగినప్పటికీ ప్రతినిధులుగా వ్యవహరించారు. 1993 ఎన్నికల తరువాత పౌర అల్లర్లు జరగలేదు. 2001-2002లో చట్టవిరుద్ధమైన శాసన ఎన్నికలు జరిగాయి. వీటిని అనేక చిన్న ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. వారి నిర్వాహక బలహీనతలను విమర్శించాయి. పి.డి.జి. అనుబంధిత స్వతంత్ర సంస్థలచే జాతీయ అసెంబ్లీని సృష్టించింది. 2005 నవంబరులో అధ్యక్షుడు ఒమర్ బొంగో తన ఆరవ పదవీకాలానికి ఎన్నికయ్యారు. అతను తిరిగి ఎన్నికలను సులభంగా గెలుచుకున్నాడు. అయితే ప్రత్యర్థులు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించారు. అతని విజయం ప్రకటించిన తరువాత కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ గాబన్ సాధారణంగా శాంతియుతంగానే మిగిలిపోయింది.

2006 డిసెంబరులో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ జరిగాయి. ఓటింగు అసమానతల కారణంగా అనేక స్థానాలను రాజ్యాంగ న్యాయస్థానం రద్దు చేసింది. 2007 ప్రారంభంలో జరిగిన తదుపరి ఎన్నికల ఎన్నికలలో పి.డి.జి. జాతీయ మరోసారి విజయం సాధించింది.

గబాన్ 
Independence Day celebration in Gabon

గాబన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక 2009 జూన్ 8 న బార్సిలోనాలోని స్పానిష్ ఆసుపత్రిలో అధ్యక్షుడు ఒమర్ బొంగో గుండెపోటుతో మరణించాడు. గాబొనీస్ రాజకీయం ఒక కొత్త యుగంలో ప్రవేశించింది. రాజ్యాంగం సవరణ ఆధారంగా ప్రకారం 2009 జూన్ 10 న సెనేట్ అధ్యక్షుడు రోజ్ ఫ్రాన్సిన్ రోగోమ్ తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. 2009 ఆగస్టు 30 న గాబన్ చరిత్రలో మొదటి సారిగా ఓమర్ బోంగో అభ్యర్థిత్వం లేని ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో 18 మంది అభ్యర్థులు అధ్యక్షపదవికి పోటీ చేసారు. ఎన్నికలకు వ్యతిరేకంగా కొన్ని నిరసనలు ఉన్నప్పటికీ కానీ గణనీయమైన ఆటంకాలు లేవు. ఓమర్ బొంగో కుమారుడు అధికార పార్టీ నాయకుడు అలీ బొంగో ఓండింబ రాజ్యాంగ న్యాయస్థానం 3 వారాల సమీక్ష తర్వాత అధికారికంగా విజేతగా ప్రకటించబడ్డాడు. 2009 అక్టోబరు 16 న ఆయన పదనీబాధ్యతలు మొదలైయ్యాయి.

ఎన్నికల ఫలితాల తొలి ప్రకటన తరువాత దేశం రెండవ అతి పెద్ద నగరం పోర్టు-జెంటిలులో తీవ్రమైన నిరసనలు తలెత్తాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన పి.డి.జి. పాలనకు వ్యతిరేకత హింసాత్మక నిరసన ప్రదర్శనలు చోటు చేసుకుకున్నాయి. పోర్ట్-జెంటిల్ పౌరులు అసంఖ్యాకంగా వీధులకు చేరుకుని అనేక దుకాణాలను, నివాసాలను, ఫ్రెంచ్ కాన్సులేటు, స్థానిక జైలుతో సహా దగ్ధం చేసారు. అల్లర్లలో కేవలం నాలుగు మరణాలు సంభవించాయని అధికారవర్గాలు ప్రకటించినప్పటికీ, ప్రతిపక్షం, స్థానిక నాయకులు చాలా ఎక్కువ మంది మరణించారని వాదించారు. బెదిరిపోయే పోలీసులకు మద్దతుగా జెండెర్మెస్, సైన్యం పోర్ట్-జెంటిలుకు పంపబడ్డారు. మూడునెలల కాలం కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

2010 జూన్ లో పాక్షికంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్తగా సంకీర్ణం ఏర్పరచుకున్న పార్టీలు ది యూనియన్ నేషనలే మొదటిసారిగా ఎన్నికలలో పాల్గొన్నాది.

2019 తిరుగుబాటు ప్రయత్నం

2019 జనవరి సైనికుల ఆధ్వర్యంలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించబడింది.

భౌగోళికం

గబాన్ 
Gabon map of Köppen climate classification
గబాన్ 
Beach scene in Gabon

సెంట్రల్ ఆఫ్రికా అట్లాంటిక్ తీరంలో భూమధ్యరేఖ మీద 3 ° ఉత్తర 4 ° దక్షిణ అక్షాంశం, 8 ° నుండి 15 ° తూర్పు రేఖాంశం మధ్య సెంట్రల్ అట్లాంటిక్ తీరంలో ఉంది. గబాన్ సాధారణంగా ఈక్వెటోరియల్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. విస్తారమైన వర్షారణ్యాలు దేశభూగంలో 8.5% పరిధిలో విస్తరించి ఉన్నాయి.

దేశభూభాగంలో మూడు విభిన్న ప్రాంతాలు ఉన్నాయి: తీర మైదానాలు (మహాసముద్రపు ఒడ్డు నుండి 300 కిలోమీటర్లు), పర్వతాలు (లిబ్రేవిల్లే ఈశాన్యంలో ఉన్న క్రిస్టల్ పర్వతాలు, మధ్యలో చైల్లూ మాసిఫ్), తూర్పున సవన్నా. తీర మైదానాలు ప్రపంచ వన్యప్రాణి ఫండ్ అట్లాంటిక్ ఈక్వెటోరియల్ తీరప్రాంత పర్యావరణ ప్రాంతంలోని పెద్ద విభాగాన్ని ఏర్పరుస్తాయి. సెంట్రల్ ఆఫ్రికన్ వర్షారణ్యాల ఖండికలు (ముఖ్యంగా ఈక్వాటోరియల్ గినియా సరిహద్దులో ముని నదితీరాలలో) ఉంటాయి.

భౌగోళికంగా గాబన్ ప్రాచీన ఆర్కిన్, పాలియోప్రొటరోజోయిక్ అగ్నిపర్వతం, మెటామార్ఫిక్ బేస్మెంట్ రాక్, ఇది కాంగో క్రాటన్, స్థిరమైన కాంటినెంటల్ క్రస్టుకు చెందినది. చాలా పురాతన ఖండాంతర క్రస్టు మిగిలిన భాగం. కొన్ని నిర్మాణాలకు రెండు బిలియన్ కంటే ఎక్కువ సంవత్సరాల వయసు ఉంది. సముద్రపు కార్బొనేట్, లాస్కురైన్, కాంటినెంటల్ అవక్షేపణ శిలలు అలాగే క్వాటర్నరి చివరి 2.5 మిలియన్ సంవత్సరాలలో ఏర్పడిన అస్థిరమైన అవక్షేపణలు, పురాతన రాతి భాగాలుగా ఉంటాయి. సూపర్ కాంటినెంటల్ పాంగాయాల విస్ఫోటనం పాక్షిక నింపబడిన హరివాణాలను సృష్టించింది. హైడ్రోకార్బన్లు గ్యాబొనీస్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవిగా ఉన్నాయి. ఓక్లో రియాక్టర్ మండలాలకు గాబన్ గుర్తించదగినదిగా ఉంది. రెండు బిలియన్ సంవత్సరాల క్రితం క్రియాశీలకంగా ఉన్న భూమి మీద ఉన్న ఏకైక సహజ అణు విచ్ఛేదకం. 1970 లో యురేనియం మైనింగ్ సమయంలో ఫ్రెంచ్ అణుశక్తి పరిశ్రమను సరఫరా చేయడానికి ఈ సైట్ కనుగొనబడింది.

1,7 కిలోమీటర్ల (750 మైళ్ళు) పొడవున్న ఓగోవే గాంబొన్ అతిపెద్ద నదిగా గుర్తించబడుతుంది. గాబోనులో మూడు కార్స్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ డోలమైటు, సున్నపురాయి రాళ్ళ వందల గుహలు ఉన్నాయి. ఇక్కడ గ్రోట్ డు లాటోర్స్విల్లే, గ్రొట్టే డు లేబాబా, గ్రోట్ట్ డు బొంగోలో, గ్రొట్టే డు కేసిపుౌగౌ గుహలు ఉన్నాయి. అనేక గుహలు ఇంకా అన్వేషించబడలేదు. 2008 వేసవిలో గుహలను సందర్శించడానికి ఒక జాతీయ భౌగోళిక సాహసయాత్రికులు వాటిని సందర్శించారు.

సహజ పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నాలకు గాబోన్ కూడా ప్రసిద్ధి చెందింది. 2002 లో అధ్యక్షుడు ఒమర్ బొంగో ఒండింబా దేశం భూభాగంలో దాదాపు 10% దాని జాతీయ ఉద్యానవనాలలో భాగంగా (మొత్తం 13 ఉద్యానవనములలో) రూపొందించాడు. ఇది ప్రపంచములో జాతీయ ఉద్యానవన అతిపెద్ద నిష్పత్తులలో ఒకటి. జాతీయ ఏజెన్సీ గాబన్ నేషనల్ పార్క్ వ్యవస్థను నిర్వహిస్తుంది.

సహజవనరులలో పెట్రోలియం, మెగ్నీషియం, ఇనుము, బంగారం, యురేనియం, అడవులు ఉన్నాయి.

ఆర్ధికరంగం

గబాన్ 
A proportional representation of Gabon's exports

గాబన్ ఆర్థిక వ్యవస్థలో చమురు నిలువలు ఆధిపత్యం చేస్తున్నాయి. చమురు ఆదాయాలు ప్రభుత్వ బడ్జెట్లో దాదాపు 46% భాగస్వామ్యం వహిస్తున్నాయి. స్థూల దేశీయ ఉత్పత్తిలో 43% (జి.డి.పి), ఎగుమతులలో 81% లకు భాగస్వామ్యం వహిస్తుంది. ప్రస్తుతం చమురు ఉత్పత్తి రోజుకు 3,70,000 బ్యారెల్స్ నుండి వేగంగా క్షీణిస్తుంది. గాబోన్ లోని చమురు 2025 నాటికి ఖర్చు చేయబడుతుందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. తగ్గుతున్న చమురు ఆదాయాలు క్షీణిస్తున్న ఉన్నకారణంగా ఇతర వనరుల అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంది . గ్రాండిన్ ఆయిల్ ఫీల్డ్ 1971 లో 50 మీ. (160 అడుగులు) నీటి లోతుల సముద్రానికి 40 కిలోమీటర్ల (25 మైళ్ళు) దూరంలో కనుగొనబడింది. మాస్ట్రిచ్యుయన్ యుగం బటాంగా ఇసుక రాళ్ళ నుండి ఒక ఉపరితల ఉప్పు నిర్మాణ పట్టీని ఏర్పరుస్తుంది ఇది 2 కి.మీ. లోతు ఉంటుంది.

సంవత్సరాల నుండి లభిస్తున్న గణనీయమైన చమురు ఆదాయం గాబొనీస్ ప్రజల కొరకు సమర్థవంతంగా వ్యయం చేయబడుతుంది. ట్రాన్స్-గాబన్ రైల్వే అత్యధికంగా వ్యయం చేస్తుంది. 1994 సి.ఎఫ్.ఎ. ఫ్రాంక్ విలువ తగ్గింపు తక్కువ చమురు ధరల కాలానుగుణ తగ్గింపు కారణంగా దేశం ఇప్పటికీ తీవ్రమైన రుణ సమస్యలను ఎదుర్కొంటున్నది.

గేబన్ రుణ, ఆదాయం నిర్వహణ కారణంగా పారిస్ క్లబ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలలో అప ఖ్యాతిని సంపాదించింది. తరువాతి ఐఎంఎఫ్ మిషన్లు బడ్జెట్ అంశాలలో (మంచి సంవత్సరాలలో, గడ్డు కాలంలో), సెంట్రల్ బ్యాంక్ నుండి అధిక రుణాలు తీసుకుంటూ, ప్రైవేటీకరణ, పరిపాలనా సంస్కరణల ప్రయత్నాలన జారవిడిచిందని ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఏదేమైనా 2005 సెప్టెంబరులో గబాన్ 15 నెలల స్టాండ్-బై ఏర్పాటును విజయవంతంగా ముగించింది. 2007 మేలో ఐ.ఎం.ఎఫ్.తో మరో 3 సంవత్సరాల స్టాండ్-బై అమరిక ఆమోదించబడింది. ఆర్థిక సంక్షోభం, అధ్యక్షుడు ఒమర్ బొంగో, ఎన్నికల సామాజిక పరిణామాల కారణంగా గ్యాబన్ తన ఆర్థిక లక్ష్యాలను స్టాండ్-బై ఏర్పాటు కింద 2009 లో ఐ.ఎం.ఎఫ్.తో చర్చలు జరిగాయి.

గాబన్ చమురు ఆదాయాలు $ 8,600 తలసరి జి.డి.పి.ను ఇచ్చాయి. ఈ ప్రాంతంలో ఇది అధికం. అయినప్పటికీ వక్రీకరించిన ఆదాయం పంపిణీ కారణంగా సాంఘిక సూచికలలో బలహీనత స్పష్టంగా ఉన్నాయి. జనాభాలో 20% ప్రజలు ఆదాయంలో 90% కంటే ఎక్కువ సంపాదించారు. అయితే గబోనీస్ జనాభాలో మూడవ వంతు పేదరికంలో జీవనం సాగిస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థ వెలికితీతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. చమురు ఆవిష్కరణకు ముందు కలప గాబొనీస్ ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్థూపంగా ఉంది. నేడు కలప, మాంగనీస్ త్రవ్వకం తదుపరి అత్యంత ముఖ్యమైన ఆదాయ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఇటీవలి అన్వేషణలు ప్రపంచంలో అధికంగా కనిపించని ఇనుము ధాతువు డిపాజిట్ ఉనికిని సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని కుటుంబ సభ్యుల నుంచి అందుకుంటున్న ఆదాయంతో జీవితం సాగిస్తున్నారు.

విదేశీ, స్థానిక పరిశీలకులు గబోనీస్ ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యం లేకపోవడం గమనించి ఆంగోళన చెందారు. ఇప్పటివరకు నూతన పరిశ్రమల అభివృద్ధిని అనేక కారణాలు పరిమితం చేసాయి:

  • మార్కెట్ చిన్నది, సుమారు ఒక మిలియన్
  • ఫ్రాన్స్ నుండి దిగుమతులపై ఆధారపడి ఉంటుంది
  • ప్రాంతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాలేదు
  • గాబొనీస్లో ఎల్లప్పుడూ ఉత్సాహపూరిత ఉత్సాహం లేదు
  • చమురు "అద్దెకు" నిచ్చే క్రమంగా, అది తగ్గిపోయింది.

వ్యవసాయ లేదా పర్యాటక రంగాల్లో మరింత పెట్టుబడి పేలవమైన మౌలికనిర్మాణం కారణంగా సంక్లిష్టంగా ఉంటుంది. ఉనికిలో ఉన్న చిన్న ప్రాసెసింగ్ సేవ విభాగాలను ప్రధానంగా కొన్ని ప్రముఖ స్థానిక పెట్టుబడిదారులచే నిర్వహించబడుతూ ఉన్నాయి.

ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. పట్టుదలతో 1990 లో ప్రభుత్వ రంగ సంస్థలు, పరిపాలనా సంస్కరణల ప్రైవేటీకరణ కార్యక్రమం ప్రారంభించింది. ప్రభుత్వ రంగ ఉపాధి, వేతన వృద్ధిని తగ్గించడంతో పాటు పురోగతి నెమ్మదిగా ఉంది. కొత్త ప్రభుత్వం దేశం ఆర్థిక పరివర్తన వైపు పయనించడానికి ఒక నిబద్ధతను ప్రకటించింది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంది..

గణాంకాలు

Population in Gabon
Year Million
1950 0.5
2000 1.2
2016 2
గబాన్ 
గబాన్ సముద్రతీరంలో జనసందోహం

గబాన్ జనసంఖ్య దాదాపు 2 మిలియన్లు ఉంది. 2 million. చారిత్రాత్మక, పర్యావరణ కారణాలు గబాన్ జనాభా 1900, 1940 ల మధ్య క్షీణించటానికి కారణమయ్యాయి. [ఆధారం కోరబడినది] .[ఆధారం చూపాలి] ఇతర ఆఫ్రికన్ దేశాల కంటే గబానులో అతి తక్కువ జనసాంధ్రత ఉంటుంది. అలాగే గబాన్ ఉప-సహారా ఆఫ్రికాలో నాలుగో అత్యధిక మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది.

సంప్రదాయ సమూహాలు

గాబొనీస్ ప్రజలందరూ దాదాపు బంటు సంతతికి చెందినవారుగా ఉన్నారు. గాబన్ విభిన్న భాషలు, సంస్కృతులతో కనీసం వైవిధ్యమైన నలభై జాతుల సమూహాలను కలిగి ఉంది. వీరిలో ఇటీవలి గణాంకాల సమాచారం నజ్బికి అనుకూలంగా ఉన్నప్పటికీ సాధారణంగా ఫాంగ్ అతిపెద్దదిగా భావిస్తారు.[ఆధారం చూపాలి] ఇతర సమూహాలలో మైనే, కోటా, షిరా, పురు, కండేలు ఉన్నారు. బొంగో, కోట, బాకా వంటి వివిధ స్థానిక పిగ్మీ ప్రజాసమూహాలు కూడా ఉన్నాయి. గేబన్లో బంటు కాని భాషను మాత్రమే మాట్లాడతారు. 10,000 కంటే అధికమైన ఫ్రెంచి ప్రజలు గాబన్లో నివసిస్తున్నారు. వీరిలో 2,000 మంది ద్వంద్వ జాతీయులు ఉన్నారు.

ఇతర ఆఫ్రికా దేశాలకంటే గాబోన్లో జాతి అంతరాలు తక్కువగా ఉంటాయి. స్థానిక జాతులు గ్యాబన్ అంతటా వ్యాపించిన కారణంగా సమూహాల మధ్య నిరంతరంగా పరస్పర చర్యలకు దారితీస్తూ జాతి ఉద్రిక్తతలకు చోటులేకుండా చేసింది. గబనీ ప్రజలు జాత్యంతర వివాహాలు సాధారణం కావడం ఇందుకు ముఖ్యమైన కారణంగా ఉంది. ప్రతి గాబోనీస్ వ్యక్తి అనేక తెగలతో జన్యు సంబంధంగా అనుసంధానితమై ఉంటాడు. వాస్తవానికి జాత్యంతర వివాహం తరచుగా అవసరంగా మారింది. అనేక తెగలలో అదే తెగ లోపల వివాహం నిషేధించబడింది. ఈ తెగలు ఒక నిర్దిష్ట పూర్వీకుల సంతతికి చెందినవి అందుచేత తెగలోని అందరు సభ్యులకు ఒకరితో ఒకరికి దగ్గర సంబంధం ఉంటుంది (హిందువులలోని గోత్రా వ్యవస్థ, స్కాట్లాండు లోని క్లాన్). గబాన్ మాజీ వలస పాలకదేశం ఫ్రెంచి ప్రజల కారణంగా ఫ్రెంచి భాష వాడుకలో ఉండి ప్రజలకు ఇది అనుసంధానిత భాషగా ఉంది. ది డెమోక్రటిక్ పార్టీ అఫ్ గాబాన్ (పిడిజి) చారిత్రాత్మక ఆధిక్యత కూడా జాతుల సమైక్యతకు దారితీస్తుంది.

జనసాంధ్రత కేంద్రాలు

గబాన్ 
Libreville
గబాన్ 
People in Libreville
గబానులో నగరాలు
Order నగరం జనసంఖ్య ప్రొవింసు
2003 గణాంకాలు 2013 census
1. లిబ్రెవిల్లే 538,195 7,03,940 ఈస్టియారే
2. పోర్టు - జంటిలే 105,712 136,462 మారిటైం
3. ఫ్రాంసు విల్లే 1,03,840 110,568 హౌట్ ఒగోగ్యూ
4. ఒవెండో 51,661 79,300 ఈస్టుయారె
5. ఒయం 35,241 60,685 వోల్యూ - టెం
6. మొయాండా 42,703 59,154 హౌట్ ఒగోగ్యూ
7. టౌం 12,711 51,954 ఈస్టుయారె
8. లంబరెనే 24,883 38,775 మొయన్- ఒగొగ్యూ
9. మౌయిలా 21,074 36,061 గౌనీ
10. అకండా - 34,548 అకండా

భాషలు

80% ఫ్రెంచ్ మాట్లాడగలరు. 30% లిబ్రెవిల్లే నివాసితులకు స్థానిక భాష వాడుకలో ఉంది. 32% గబానీ ప్రజలకు ఫాంగు భాష మాతృభాషగా ఉంది.

ఫ్రాన్సు విచారణలో అవినీతికి పాల్పడిన ఆఫ్రికన్ దేశంగా ప్రకటించినందుకు ప్రతిస్పందనగా 2012 అక్టోబరులో సంస్థ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫొనీ 14 వ సమావేశానికి ముందు ఇంగ్లీషు రెండవ అధికారిక భాషగా జతచేసే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధి అది ఆచరణాత్మకంగా మాత్రమే ఉందని నొక్కి చెప్పాడు. తరువాత ఇంగ్లీషు పాఠశాలలలో బోధనా భాషగా మాత్రమే ఉంటుందని, ఫ్రెంచి అధికార భాషగా, ప్రభుత్వ నిర్వహణా భాషగా ఉంటుందని వివరణ ఇవ్వబడింది.[ఆధారం చూపాలి]

మతం

గాబన్లో క్రైస్తవ మతం (రోమన్ కాథలిక్, ప్రొటెస్టంట్) ప్రధాన మతంగా ఉంది. అదనంగా ప్రొటెస్టెంట్లు, బ్విటి, ఇస్లాం, స్థానిక మతవిశ్వాసాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. అత్యధికమంది ప్రజలు క్రైస్తవ మతంతో ఇతర స్థానిక మతాలను రెండింటినీ కలిపి ఆచరిస్తుంటారు. 73% ప్రజలు, పౌరులు కానివారు బ్విటీతో కలిసిన క్రైవమతాచారలో కొన్నింటినైనా ఆచరిస్తుంటారు. 12% మంది ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. 10% ప్రజలు సంప్రదాయ స్థానిక మతాలను ఆచరిస్తున్నారు. 5% ప్రజలు నాస్థికులుగా ఉన్నారు. స్క్విట్జర్ ప్రజలు ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తుంటారు.

ఆరోగ్యం

గబానులో ఆరోగ్యసేవలు అధికంగా ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 1913 లో ఆల్బర్టు స్వెట్జర్ చేత లాంబారెనేలో స్థాపించబడిన హాస్పిటలు వంటి కొన్ని సంస్థలు ఆరోగ్యసేవలు అందిస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో గబాన్ వైద్య సేవలు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. 1985 నాటికి 28 ఆసుపత్రులు, 87 వైద్య కేంద్రాలు, 312 సమాచార కేంద్రాలు, చికిత్సాకేంద్రాలు ఉన్నాయి. 2004 నాటికి 1,00,000 మందికి 29 వైద్యులు ఉన్నారు. జనాభాలో సుమారు 90% మంది ఆరోగ్య సంరక్షణ సేవలకు అందుబాటులో ఉన్నారు.

2000 లో జనాభాలో 70% మందికి సురక్షితమైన తాగునీరు, 21% తగినంత పారిశుధ్య వసతులు అందుబాటులో ఉన్నాయి. ఒక సమగ్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమం ద్వారా కుష్టు వ్యాధి, నిద్ర లేమి, మలేరియా, ఫిల్టరియాసిస్, నులి పురుగులు, క్షయవ్యాధి వంటి వాటికి చికిత్స అందించబడుతుంది. ఒక సంవత్సరం వయస్సులోపు పిల్లలలో క్షయవ్యాధి నిరోధకం 97%, పోలియో నిరోధకం 65% అందించబడుతుంది. డి.పి.టి. తట్టు కోసం ఇమ్యునైజేషన్ వరుసగా 37%, 56% అందించబడుతుంది. గేబన్ లిబ్రేవిల్లెలో ఒక ఫ్యాక్టరీ నుండి ఔషధ సరఫరా దేశీయ స్థాయిలో సరఫరా చేయబడుతూ ఉంది.

1960 లో మొత్తం సంతానోత్పత్తి శాతం 5.8 ఉండగా 2000 లో సంతానోత్పత్తి శాతం 4.2కు తగ్గింది. జన్మించిన శిశువులందరిలో 10 % తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. 1998 నాటికి మాతృ మరణాలు 1,00,000 మందికి 520 గా ఉంది. 2005 లో శిశు మరణాలు 1000 మందిలో 55.35 గా ఉంది. ఆయుఃప్రమాణం 55.35 సంవత్సరాలు ఉంది. మొత్తం మరణాలు 1000 మందికి 17.6 గా అంచనా వేయబడింది.

వయోజనులలో (వయస్సు 15-49) ఎయిడ్సు 5.2% ఉన్నట్లు అంచనా వేయబడింది. 2009 నాటికి సుమారు 46,000 మంది ప్రజలు ఎయిడ్సు వ్యాధితో బాధపడుతున్నారు. 2009 లో ఎయిడ్సు వ్యాధితో 2,400 మంది మరణించారు-2003 లో 3,000 మంది మరణించారు.

విద్య

గబాన్ విద్యావ్యవస్థను రెండు మంత్రిత్వశాఖలు నిర్వహిస్తున్నాయి. మినిస్టరీ ఆఫ్ ఎజ్యుకేషన్ ప్రి కిండర్ గార్టెన్ నుండి హైస్కూలు విద్య వరకు నిర్వహిస్తుంది. మినిస్టరీ ఆఫ్ హయ్యరు ఎజ్యుకేషన్ ఉన్నత విద్య, సాంకేతిక విద్యా నిర్వహణ బాధ్యత వహిస్తుంది.

విద్యా చట్టం క్రింద 6 నుండి 16 ఏళ్ళ వయస్సు పిల్లలకు నిర్బంధ విద్య అమలులో ఉంది. గాబానులో చాలా మంది పిల్లలు తమ పాఠశాల జీవితాలను నర్సరీలు లేదా "క్రెచీ", "జార్డిన్స్ డీ ఎన్ఫాంట్స్" అని పిలిచే కిండరు గార్టెన్కు హాజరవడం ప్రారంభించారు. 6 ఏళ్ళ వయస్సులో వారు ప్రాథమిక పాఠశాలలో ప్రవేశిస్తారు. "ఎకోల్ ప్రిమైర్" ఆరు తరగతులుగా రూపొందించబడింది. తదుపరి స్థాయి "ఎకోల్ సెకండరీ", ఇది ఏడు గ్రేడ్లతో రూపొందించబడింది. గ్రాడ్యుయేషన్ వయస్సు 19 సంవత్సరాలు. పట్టభద్రులైన వారు ఇంజనీరింగ్ పాఠశాలలు లేదా బిజినెస్ స్కూల్సుతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గాబాన్ అక్షరాస్యత శాతం 83.2%.

ప్రభుత్వం చమురు ఆదాయంతో పాఠశాల నిర్మాణం, ఉపాధ్యాయుల జీతాలను చెల్లించడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య ప్రోత్సహించబడుతుంది. అయినప్పటికీ పాఠశాల నిర్మాణాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలు తగ్గుముఖం పట్టాయి. 2000 లో నికర ప్రాథమిక నమోదు రేటు 78% ఉంది. స్థూల, నికర నమోదు నిష్పత్తులు ప్రాథమిక పాఠశాలలో అధికారికంగా నమోదు చేయబడిన విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. 2001 నాటికి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన పిల్లల్లో 69% గ్రేడ్ 5 చేరుకోవడానికి అవకాశం ఉంది. పేలవమైన నిర్వహణ, ప్రణాళికాలోపం, పర్యవేక్షణ, పేలవమైన అర్హత గల ఉపాధ్యాయులు, తరగతి గదులలో అధికసంఖ్యలో విద్యార్థులు ఉండడం విద్యా వ్యవస్థలో సమస్యలుగా ఉన్నాయి.

సంస్కృతి

గబాన్ 
A Gabonese mask

21 వ శతాబ్దంలో అక్షరాస్యత వ్యాప్తి చెందే ముందు మౌఖిక సంప్రదాయంలో విద్యాభ్యాసం జరిగేది. గబానులో గొప్ప జానపద, పురాణాల సంపద ఉంది. ప్రస్తుతం ఫెంగ్సులో వెట్టిలు, జెబిసులో ఇగ్వాలా ప్రజలలో ఈ సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి "రాకాంటియర్సు" పనిచేస్తున్నాయి.

గాబన్ కూడా అంతర్జాతీయంగా ప్రశంశించబడిన మాస్కులను కలిగి ఉంది. వీటిలో ఎన్గోల్టాంగ్ (ఫాంగ్), కోట ప్రజల పౌరాణిక పాత్రల సంబంధిత మాస్కులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రతి సమూహానికి వివిధ కారణాలతో వారికే ప్రత్యేకమైన మాస్కులను ఉపయోగిస్తుంటారు. వారు ఎక్కువగా వివాహం, జననం, అంత్యక్రియలు వంటి సాంప్రదాయ వేడుకలలో మాస్కులను ఉపయోగిస్తారు. సాంప్రదాయవాదులు ప్రధానంగా అరుదైన స్థానిక కొయ్యతో, ఇతర విలువైన పదార్థాలతో మాస్కులు తయారు చేస్తారు.

సంగీతం

డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కామెరూన్ లాంటి ప్రాంతీయ గాయకులతో పోలిస్తే గాబొనీస్ సంగీతానికి గుర్తింపు తక్కువగా ఉంది. దేశంలో జానపద శైలుల శ్రేణులు ఉన్నాయి. అలాగే పేషెన్స్ డబానీ, అనీ-ఫ్లోర్ బ్యాచిలీల్స్, గాబొనీస్ పాప్ స్టార్స్ ప్రఖ్యాత ప్రత్యక్ష ప్రదర్శనకారులుగా ప్రఖ్యాతి వహిస్తున్నారు. జార్జెస్ ఒయెంజే, లా రోస్ మొడాడో, సిల్వైన్ అవరా వంటి గిటారిస్టులు, ఒలివర్ ఎన్'గోమా వంటి గాయకులు ఉన్నారు.

యు.ఎస్, యు.కె ల నుండి దిగుమతి చేసుకున్న రుంబ, మకోసా, సౌకాస్ వంటి రాక్ అండ్ హిప్ హాప్ సంగీతం గబాన్లో ప్రసిద్ధి చెందిందాయి. గాబొనీస్ జానపద వాయిద్యాలలో ఓబాల, ది ఇంటర్లేకింగ్ లింక్ మల్టీ, ది బాలాఫన్, సాంప్రదాయ డ్రమ్స్ ఉన్నాయి.

మాధ్యమం

రేడియో - డిఫ్యూషన్ టెలివిజన్ గబానైజ్ ప్రభుత్వం యాజమాన్యంలో పనిచేస్తుంది. ఇది ఫ్రెంచి, దేశీయ భాషల్లో ప్రసారాలను అందిస్తుంది. ప్రధాన నగరాల్లో కలరు టెలివిజన్ ప్రసారాలు ప్రవేశపెట్టబడ్డాయి. 1981 లో వాణిజ్య రేడియో స్టేషన్ ఆఫ్రికా నెం .1 కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది ఖండంలోని అత్యంత శక్తివంతమైన రేడియో స్టేషనుగా గుర్తించబడుతుంది. ఇది ఫ్రెంచి, గాబొనీస్ ప్రభుత్వాల పాలనలో పాల్గొంటున్న ప్రైవేట్ యూరోపియన్ మీడియాగా ప్రత్యేకత సంతరించుకుంది.

2004 లో ప్రభుత్వం రెండు రేడియో స్టేషన్లను నిర్వహించింది. మరో 7 ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తున్నాయి. రెండు ప్రభుత్వ టెలివిజన్ స్టేషన్లు, నాలుగు ప్రైవేటు యాజమాన్య సంస్థలు ఉన్నాయి. 2003 లో ప్రతి 1,000 మంది ప్రజలకు 488 రేడియోలు, 308 టెలివిజన్ సెట్లు ఉన్నట్లు అంచనా వేయబడ్డాయి. ప్రతి 1,000 మందిలో 11.5 మంది కేబుల్ చందాదారులు ఉన్నారు. 2003 లో ప్రతి 1,000 మంది ప్రజలకు 22.4 వ్యక్తిగత కంప్యూటర్లు ఉన్నాయి. ప్రతి 1,000 మందికి 26 మంది ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. జాతీయ ప్రెస్ సర్వీస్ గాబొనీస్ ప్రెస్ ఏజెన్సీ ఒక దినసరి పత్రిక, గాబోన్-మాటిన్ (2002 నాటికి 18,000 సర్క్యులేషన్) ప్రచురించబడుతున్నాయి.

లిబ్రేవిల్లెలోని " ఎల్- యూనియన్ " ప్రభుత్వ నియంత్రిత రోజువారీ వార్తాపత్రిక 2002 లో సగటున రోజువారీ పంపిణీ 40,000 చేరుకుంది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ గాబన్ డి'అజౌర్ధూయి వారపత్రికను ప్రచురించింది. స్వతంత్రంగా లేదా రాజకీయ పార్టీలతో అనుబంధించబడిన తొమ్మిది ప్రైవేటు యాజమాన్యం కలిగిన పత్రికలు ఉన్నాయి. చిన్న సంఖ్యలో ఉన్న ఈ ప్రచురణ తరచుగా ఆర్థిక పరిమితుల కారణంగా ఆలస్యం అవుతాయి. గాబోన్ రాజ్యాంగం వాక్స్వాతంత్ర్యం, స్వేచ్ఛాయుతమైన ప్రెస్ అందిస్తుంది. ప్రభుత్వం ఈ హక్కులకు మద్దతిస్తుంది. అనేక పత్రికలు చురుకుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి. విదేశీ ప్రచురణలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

ఆహార సంస్కృతి

గబానీలు ఆహారసంస్కృతిని ఫ్రెంచి ఆహారసంస్కృతి ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ స్థానికాహారాలు అందుబాటులో ఉంటాయి.

వెలుపలి లింకులు

మూలాలు

బయటి లింకులు

Gabon గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

గబాన్  నిఘంటువు విక్షనరీ నుండి
గబాన్  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
గబాన్  ఉదాహరణలు వికికోట్ నుండి
గబాన్  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
గబాన్  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
గబాన్  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

    Government

Tags:

గబాన్ పేరు వెనుక చరిత్రగబాన్ చరిత్రగబాన్ భౌగోళికంగబాన్ ఆర్ధికరంగంగబాన్ గణాంకాలుగబాన్ సంస్కృతిగబాన్ వెలుపలి లింకులుగబాన్ మూలాలుగబాన్ బయటి లింకులుగబాన్en:Librevilleఆఫ్రికాఈక్వటోరియల్ గ్వినియాకాంగో రిపబ్లిక్కామెరూన్

🔥 Trending searches on Wiki తెలుగు:

కొంపెల్ల మాధవీలతకోమటిరెడ్డి వెంకటరెడ్డిప్రకృతి - వికృతి2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅంగచూషణనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంగాయత్రీ మంత్రంజ్యోతిషంఉండిభూదానోద్యమంయవలుమాధవీ లతబలి చక్రవర్తిపరీక్షకాప్చాభారతదేశంలో విద్యరజినీకాంత్చిత్త నక్షత్రముబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంభారత పార్లమెంట్విద్యవర్షం (సినిమా)కన్యారాశిషష్టిపూర్తివెండిలోక్‌సభ స్పీకర్విజయవాడభారతదేశంలో సెక్యులరిజంపూర్వాషాఢ నక్షత్రముదొమ్మరాజు గుకేష్కరణంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంవై.యస్. రాజశేఖరరెడ్డిసున్నభారతరత్నవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాకలువతిరుమల చరిత్రఎస్త‌ర్ నోరోన్హానవరత్నాలుఅమితాబ్ బచ్చన్శ్రీశ్రీమూర్ఛలు (ఫిట్స్)తెలుగునాట ఇంటిపేర్ల జాబితాపంచారామాలుజీమెయిల్పొడుపు కథలులోక్‌సభగొట్టిపాటి నరసయ్యమామిడికొండగట్టుశిబి చక్రవర్తిఆది శంకరాచార్యులుతోట త్రిమూర్తులుచెమటకాయలుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుధనూరాశిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఖమ్మండీజే టిల్లుగజము (పొడవు)కార్తెనీరుతమన్నా భాటియాపక్షముమాగుంట శ్రీనివాసులురెడ్డిచంద్రుడు జ్యోతిషంఏలూరు లోక్‌సభ నియోజకవర్గంమహామృత్యుంజయ మంత్రంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఉపనిషత్తుమా ఇంటి దేవతషర్మిలారెడ్డివాట్స్‌యాప్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు🡆 More