అల్జీరియా: ఉత్తర ఆఫ్రికాలో దేశం

అల్జీరియా (అరబీ: الجزائر‎ అల్-జజైర్; బెర్బర్: ⵍⵣⵣⴰⵢⴻⵔ జాఏర్) అధికారికంగా ప్రజాస్వామ్య గణతంత్ర అల్జీరియా మధ్యధరా సముద్ర తీరం వద్ద ఉత్తర ఆఫ్రికాలో ఒక సార్వభౌమ దేశం.

దాని రాజధాని, అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం అల్జీర్సు. ఇది దేశ ఉత్తరప్రాంతంలో ఉంది. దేశవైశాల్యం 2,381,741 చదరపు కి.మీ. వైశాల్యపరంగా అల్జీరియా ప్రపంచదేశాలలో 10వ స్థానంలో ఉంది. అల్జీరియా ఆఫ్రికా, అరబ్ దేశాలలో అతి పెద్ద దేశంగా ఉంది. ఆల్జీరియాకు ఈశాన్యం వైపు ట్యునీషియా, తూర్పు వైపు లిబియా, దక్షిణాన మొరాకో, నైరుతి వైపు దక్షిణ సహారా, మౌరిటానియ, మాలి, ఆగ్నేయానికి నైజీరియా, ఉత్తరానికి మెడిటరేనియన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఆ దేశం పాక్షిక అధ్యక్ష గణతంత్ర దేశంగా ఉంది. దేశంలో 48 నిర్వహణా విభాగాలు, 1,541 కమ్యూనియన్లు ఉన్నాయి. దేశానికి 1999 నుండి అధ్యక్షుడిగా అబ్దిలాజిజ్ బౌటెఫ్లికా ఉన్నాడు.

الجمهورية الجزائرية الديمقراطية الشعبية
అల్-జమ్‌హూరియా అల్-జజాయిరియా
అద్-దిముఖ్రుతియా అష్-షాబియా
(అరబీ)
పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా
Flag of అల్జీరియా అల్జీరియా యొక్క Emblem
నినాదం
ప్రజల నుండి ప్రజల కొరకు
من الشعب و للشعب   (అరబ్బీ)
"From the people and for the people"
జాతీయగీతం
Kassaman  (Arabic)
The Pledge

అల్జీరియా యొక్క స్థానం
అల్జీరియా యొక్క స్థానం
రాజధానిఅల్జీర్స్
36°42′N 3°13′E / 36.700°N 3.217°E / 36.700; 3.217
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అరబ్బీ1
ప్రజానామము అల్జీరియన్
ప్రభుత్వం పాక్షిక అధ్యక్షతరహా గణతంత్రం
 -  అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బౌతిఫ్లికా
 -  ప్రధానమంత్రి అబ్దుల్ అజీజ్ బెల్‌కదెమ్
స్థాపన
 -  en:Hammadid dynasty from 1014 
 -  ఉస్మానియా పాలన from 1516 
 -  ఫ్రెంచ్ rule from 1830 
 -  ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం జూలై 5, 1962 
విస్తీర్ణం
 -  మొత్తం 2,381,740 కి.మీ² (11th)
919,595 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  2007 అంచనా 33,333,216 (35వది)
 -  1998 జన గణన 29,100,867 
 -  జన సాంద్రత 14 /కి.మీ² (196వది)
36 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $253.4 బిలియన్ (38వది)
 -  తలసరి $7,700 (88వది)
జీడీపీ (nominal) 2005 అంచనా
 -  మొత్తం $102.026 బిలియన్ (48వది)
 -  తలసరి $3,086 (84వది)
జినీ? (1995) 35.3 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.728 (medium) (102nd)
కరెన్సీ అల్జీరియన్ దీనార్ (DZD)
కాలాంశం CET (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .dz
కాలింగ్ కోడ్ +213
1 తమాజైట్ (berber) languages are recognized as "జాతీయ భాషలు". ఫ్రెంచి భాష is also widely spoken.

ప్రాచీన ఆల్జీరియాకు ఎన్నో సామ్రాజ్యాలు, వంశాలు తెలుసు అవి నుమీడియన్లు, ఫినీషియన్లు, కార్థాగినియన్లు, రోమన్లు వాండల్లు, బైజాంటైన్లు, ఉమ్మాయద్లు, అబ్బసిద్లు, ఇద్రిసిద్లు, రుస్తమిద్, అఘ్లబిద్, రుస్తమిద్, ఫాతిమిద్, జిరిద్, హమ్మాదిద్, అల్మొరావిద్, అల్మొహాద్, ఒట్టోమాన్లు, ఫ్రెంచి వలస సామ్రాజ్యం. బెర్బెర్లు సాధారణంగా ఆ దేశీయ నివాసులుగా పరిగణింపబడ్డారు. ఉత్తర ఆఫ్రికా లోని అరబ్ ఆక్రమణ తరువాత, చాలా నివాసితులు అరబ్బులుగా మర్చబడ్డారు. అయితే అధికభాగం అల్జీరియన్స్ బెర్బెర్ మూలానికి చెందిన వారు అయినా, ఎక్కువ మంది వాళ్ళను అరబ్ సంస్కృతితో సంబంధించుకుంటారు. అల్జీరియన్ల సమూహం బెర్బర్లు, అరబ్బులు, తుర్కులు, సిరియన్లు, అండలుసియన్ల కలిసిన మిశ్రమ.

అల్జీరియా ఉత్తర ఐరోపాకి భారి మొత్తంలో సహజ వాయువులను సరఫరా చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకి శక్తి ఎగుమతులు వెన్నెముక్క లాంటివి. ఓపెక్ ప్రకారం అల్జీరియాలో ప్రపంచం లోనే 17వ అతి పెద్ద, ఆఫ్రికా లోనే 2వ అతి పెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచం లోనే 9వ అతి పెద్ద సహజ వాయువుల నిల్వలు అల్జీరియాలో ఉన్నాయి. సొనాట్రాచ్, ఆ దేశపు చమురు కంపెనీ ఆఫ్రికా లోనే అతి పెద్ద కంపెనీ. అల్జీరియా ఆఫ్రికా లోనే అతి పెద్ద సైన్యాలలో ఒకటి, ఆ ఖండం లోనే అతి పెద్ద రక్షణ బడ్జెట్ కలిగి ఉంది. చాలా వరకు అల్జీరియా ఆయుధాలు మిత్ర దేశమైన రష్యా నుండి దిగుమతి చెయ్యబడతాయి. అల్జీరియా ఆఫ్రికన్ యూనియన్, ది అరబ్ లీగ్, ఓపెక్, ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశం, మఘ్రెబ్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు.

శబ్ద ఉత్పత్తి

ఆ దేశం పేరు అల్జియర్స్ అనే నగరం పేరు నుంచి ఉత్పన్నమైంది. ఆ నగరం పేరు అరేబిక్ లో ఆల్-జజైర్ (الجزائر, "ద్వీపాలు"), దాని పాత రూపం ఐన జజైర్ బనీ మజ్హ్ఘన్నా (جزائر بني مزغنة, "మజ్ఘన్నా జాతి ద్వీపాలు") లోని ముక్క అని మధ్యయుగ భౌగోళిక శాస్త్రవేత్త అల్-ఇద్రిసి భావన.

చరిత్ర

ప్రాచీన చరిత్ర

ఉత్తర ఆఫ్రికాలో ఐన్ హనెచ్ ( సైదా ప్రావిన్సు) ప్రాంతంలో (క్రీ.పూ 2,00, 000) నాటి మానవుల ఆక్రమణ అవశేషాల కనుగొనబడ్డాయి. నీన్దేర్తలు పరికరాల తయారీదారులు లెవాంటులో మాదిరిగా లెవల్లొశియను, మౌస్టీరియాను శైలిలో (క్రీ.పూ.43, 000) చేతి గొడ్డళ్ళు ఉత్పత్తి చేశారు.

అల్జీరియా మధ్య రాతియుగ ఫ్లేకు పరికరాల తయారీ అభివృద్ధికి అత్యున్నత కేంద్రంగా ఉంది. క్రీ.పూ .30,000 ప్రారంభించి ఈ యుగంలో పరికరాలను ఎటీరియను అని అంటారు (దక్షిణ తెబెస్సా లోని పురాతత్వ స్థలమైన బిర్ ఎల్ ఎటెర్ ఈ పేరుకు మూలంగా ఉంది).

ఉత్తర ఆఫ్రికాలో మొట్టమొదటి బ్లేడు పరిశ్రమలను బెరోమెరీషియను (ప్రధానంగా ఆరాన్ ప్రాంతంలో ఉన్నాయి) అని అంటారు. ఈ పరిశ్రమ క్రీ.పూ 15,000 - 10,000 మధ్యకాలంలో మఘ్రేబు తీర ప్రాంతాలంతటా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. సహారా ఎడారి, మధ్యధరా మాఘ్రేబు నవీనశిలాయుగ నాగరికత (జంతు పెంపకం, వ్యవసాయం) క్రీ.పూ 11,000 లో గాని లేదా క్రీ.పూ 6000 నుండి క్రీ.పుఇ 2000 మధ్యలో గానీ అభివృద్ధి చెందింది. ఎన్ అజ్జరు చిత్రాలలో చిత్రీకరించిన ఈ జీవితం, క్లాసికల్ కాలం వరకు అల్జీరియాలో ప్రభావం చూపించాయి.

ఉత్తర ఆఫ్రికా ప్రజల మిశ్రమం చివరికి ఒక ప్రత్యేక స్థానిక జనాభాగా మారి ఉత్తర ఆఫ్రికా స్థానిక ప్రజలైన బెర్బర్లగా పిలవబడుతున్నారు.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
టింగాడు ప్రాచీన రోమను సామ్రాజ్య శిథిలాలు. ట్రాజను వంపుకు దారి
అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
క్యూకులులోని ప్రాచీన రోమను నాటకశాల

వారి అధికారానికి ప్రధాన కేంద్రమైన కార్తేజి నుండి కార్తగినియన్లు విస్తరించి ఉత్తర ఆఫ్రికా తీరం వెంబడి చిన్న స్థావరాలు ఏర్పాటు చేశారు. క్రీ.పూ 600 కాలం నాటికి తిపాసా, తూర్పు చెర్చెలు, హిప్పో రీజియసు (ఆధునిక అన్నాబ), రుసీసాడు (ఆధునిక స్కిక్డా) లో ఫినీషియను ఉనికిడి మనుగడలో ఉంది. ఈ ఆవాసాలు వాణిజ్య పట్టణాలుగా, లంగరులుగా పనిచేస్తున్నాయి.

కార్తేజిల అధికారం అధికరించి నాటకీయంగా వారి ప్రభావం స్థానిక ప్రజల మీద అధికరించింది. అప్పటికే బెర్బర్ల నాగరికత చాలా దేశాలకు విస్తరించి వ్యవసాయ, వర్తక, తయారీ, రాజకీయ వ్యవస్థలలో సహాయం చేసే దశలో ఉంది. కార్తేజీ-బెర్బర్ల వర్తకం (అంతర్గతంగా) అధికరించింది. కానీ ప్రాదేశిక విస్తరణ బెర్బర్లను బానిసలుగా చేయడానికి, కొంతమంది బెర్బర్లను సైనికులలో చేర్చడానికి, ఇతర బెర్బర్ల నుండి పన్ను వసూలు చేయడానికి కుడా కారణమయ్యింది.

క్రీస్తు పూర్వం నాల్గవ శకం నాటికి బెర్బర్లు, కార్తేజులుల సైన్యంలో ఒక సింహ భాగమయ్యారు. కిరాయి సైనికుల తిరుగుబాటుగా బెర్బరు సైనికులు కీ.పూ 241 నుంచి కీ.పూ 238 వరకు తిరుగుబాటును సాగించారు. మొదటి ప్యూనికు యుద్ధంలో పోరాడిన సైనికులకు జీతాలను చెల్లించకపోవడం దీనికి కారణంగా ఉంది. ఈ తిరుగుబాటుతో వారు ఉత్తర ఆఫ్రికా భూభాగాలలో అత్యధికభూభాగం మీద నియంత్రణ సాధించగలిగారు. అంతే కాకుండా వారు లిబ్యన్ అనే పేరు ఉన్న నాణాలను ముద్రించారు. గ్రీకులు ఉత్తరాఫ్రికా వాసులకు లిబ్యను అనే పేరు వాడతారు. ప్యూనిక్ యుద్ధాలలో గ్రీకుల చేతిలో వరుస ఓటముల కారణంగా కార్తేజుల రాజ్యం కనుమరుగవ్వటం మొదలయ్యింది.

క్రీ.పూ 146 లో కార్తేజు నగరం ధ్వసం అయ్యింది. ఒక వైపు కార్తేజుల ప్రభావం తగ్గుతూ అంతర్భాగంలో బెర్బెర నాయకుల ప్రభావం అధికరించింది. క్రీ.పూ 2 వ శతాబ్దం నాటికి నియంత్రణ సరిగా లేని అనేక బెర్బర రాజ్యాలు పుట్టాయి. కార్తేజులు పరిపాలిస్తున్న సముద్ర తీర ప్రాంతాల వెనుక ఉన్న న్యుమీడియాలో అందులో రెండు రాజ్యాలు ఏర్పరచబడ్డాయి. న్యుమీడియాకు ఉత్తరంలో మౌరిటానియ ఉంది. ఇది ప్రస్తుత మొరాకోలోని మౌలోవ్య నదికి ఇరువైపులా అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉండేది. ఆల్మోహాడ్లు, ఆల్మోరావిడ్ల వరకు బెర్బర్ల నాగరికత క్రీ.పూ 2 వ శతాబ్ధపు మాసింసేను పరిపాలనలో ఉచ్ఛ దశకు చేరుకుంది.

క్రీ.పూ 148 లో మాసింసేను చనిపోయిన తరువాత బెర్బరు రాజ్యాలు చాలా సార్లు విడిపోయి విలీనం అయ్యాయి. మాసింసేను వారసుల పాలన సా.శ. 24 వరకు కొనసాగింది. సా.శ. 24 లో బెర్బరు భూభాగం రోమన్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.

చాలా శతాభ్దాలు అల్జీరియాను రోమన్లు పరిపాలించారు. రోమన్లు అక్కడ పలు వలస రాజ్యాలను స్థాపించారు. అల్జీరియా మిగిలిన ఉత్తరాఫ్రికాలానే రాజ్యానికి ఒక ధాన్యాగారంగా ఉండేది. ఇక్కడ నుండి ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయబడ్డాయి. సెయింట్ అగస్టీను హిప్పో రేగసు (ఇప్పటి అల్జీరియా) మత గురువు (బిషపు)గా ఉండేవాడు. జంసరెక్కు (ఆంగ్లం: Genseric) రాజు జర్మనీ తెగలకు చెందిన సంచారమానవులు 429 లో ఉత్తరాఫ్రికాకు చేరి 435 నాటికి తీరప్రాంత న్యుమీడియాను నియంత్రించారు. స్థానిక తెగల చేత హింసించబడిన కారణంగా వారు అక్కడ స్థిరపడలేదు. నిజం చెప్పాలంటే, బైజాంటీన్లు వచ్చేనాటికి లెపిక్సు మాగ్నా విసర్జించబడింది. సెల్లాటా (ఆంగ్లం: Msellata) ప్రాంతాన్ని స్థానిక లాగ్వుతాన్లు ఆక్రమించారు. లాగ్వుతాన్లు బెర్బెర్ల రాజకీయ, సైనిక, సాంస్కృతిక పునరుజ్జీవనంలో నిమగ్నులైయ్యారు.

మధ్యయుగం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Mansourah mosque, Tlemcen

8 వ శతాబ్దం ప్రారంభంలో స్థానికుల నుండి చాలా తక్కువ ప్రతిఘటన తరువాత ఉమయ్యదు కాలిఫేటు నాయకత్వంలో ముస్లిం అరబ్బులు అల్జీరియాను జయించారు.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
అల్జీరియాలోని ఖెన్చెలాలో దిహ్యా స్మారక చిహ్నం

తరువాత పెద్ద సంఖ్యలో దేశీయ బెర్బెరు ప్రజలు ఇస్లాం మతంలోకి మారారు. 9 వ శతాబ్దం చివరి వరకు ట్యునీషియాలో క్రైస్తవులు, బెర్బెర్లు, లాటిన్ మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. 10 వ శతాబ్దంలో కొంతకాలం మాత్రమే ముస్లిముల ఆధిక్యత కొనసాగింది. ఉమయ్యదు యునైటెడ్ కింగ్డం పతనం తరువాత పలు స్థానిక రాజ్యాలు ఉద్భవించాయి. వీరిలో అఘ్లబిదులు, అల్మొహదులు, అబ్దల్వాదిదులు, జిరిదులు, రుస్టామిదులు, హమ్మదీలు, అల్మొరావిదులు, ఫాతిమిదులు ఉన్నారు. క్రైస్తవులు మూడు దఫాలుగా దేశాన్ని విడిచివెళ్ళారు; విజయంతరువాత, 10 వ శతాబ్దం, 11 వ శతాబ్దం. 14 వ శతాబ్దంలో చివరిగా నార్మన్లు క్రైస్తవులను సిసిలీకి తరిమికొట్టారు. మిగిలిన వారు చంపబడ్డారు.

మధ్య యుగాలలో ఉత్తర ఆఫ్రికా గొప్ప పండితులు, సాధువులు, సార్వభౌమాధికారులకు నివాసంగా ఉంది. సెమిటికు, బెర్బెరు భాషల మొదటి వ్యాకరణ రూపకల్పన చేసిన భాషావేత్త, సిడి బౌమెడిన్ (అబూ మాడియన్), సిడి ఎల్ హౌరి, ఎమిర్సు, అబ్దులు, ముమిను, యగ్మారసేను వంటి గొప్ప సూఫీ గురువులు ఈ కాలానికి చెందినవారే. ఈ సమయంలోనే ముహమ్మదు కుమార్తె ఫాతిమా లేదా ఫాతిమా పిల్లలు మాగ్రెబుకు వచ్చారు. ఈ "ఫాతిమిడ్లు" మాగ్రెబు, హెజాజు లెవాంటు అంతటా విస్తరించి ఉన్న ఒక రాజవంశాన్ని స్థాపించారు. అల్జీరియా నుండి రాజధాని కైరో వరకు విస్తరించిన అరబ్బులు, లెవాంటైనులు ఫాతిమిదు కాలిఫేటు ప్రతినిధులు జిరిడ్సు విడిపోయినప్పుడు ఈ రాజవంశం కూలిపోవడం ప్రారంభమైంది. వారిని శిక్షించడానికి ఫాతిమిడ్లు వారి మీదకు అరబు బాను హిలాల్, బాను సులైమ్లను పంపారు. ఫలితంగా జరిగిన యుద్ధం టగ్రిబాటు పురాణంలో వివరించబడింది. డ్యూయల్సు హిలాల హీరో అబూ జైద్ అల్-హిలాలే, అనేక ఇతర అరబు వీరులను ఓడించమని అల్-తఘ్రాబాటులో అమాజిగు జిరిదు హీరో ఖ్లాఫే అల్-జానాటే అడుగుతారు. అయినప్పటికీ జిరిడ్లు చివరికి అరబు ఆచారాలు, సంస్కృతిని అవలంబించడంలో ఓడిపోయారు. అయినప్పటికీ స్థానిక అమాజిగు తెగలు చాలావరకు స్వతంత్రంగానే ఉన్నాయి. తెగ, స్థానం, సమయానుకూలంగా మాగ్రెబు వివిధ భాగాల ఆధారంగా కొన్ని సమయాలలో దానిని ఏకీకృతం చేస్తాయి (ఫాతిమిదుల ఆధ్వర్యంలో). ఫాతిమిదు కాలిఫేటు అని కూడా పిలువబడే ఫాతిమిదు ఇస్లామికు సామ్రాజ్యాన్ని తయారు చేసింది. ఇందులో ఉత్తర ఆఫ్రికా, సిసిలీ, పాలస్తీనా, జోర్డాన్, లెబనాన్, సిరియా, ఈజిప్ట్, ఆఫ్రికా ఎర్ర సముద్ర తీరం, తిహామా, హెజాజ్, యెమెన్ ఉన్నాయి. ఉత్తర ఆఫ్రికాకు చెందిన కాలిఫేట్లు వారి కాలంలోని ఇతర సామ్రాజ్యాలతో వర్తకం చేశారు. అలాగే ఇస్లాం యుగంలో ఇతర ఇస్లాం రాజ్యాల సమాఖ్య మద్దతుతో వాణిజ్య నెట్వర్కులో భాగంగా ఉన్నాయి.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
సి. 960-1100 మధ్యకాలంలో ఫాతిమిడ్ కాలిఫేట్, షియా ఇస్మాయిలీ రాజవంశం, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువ భాగం పాలించినది

అమాజిగ్సులో చారిత్రాత్మకంగా అనేక తెగలు ఉన్నాయి. వీటిలో బోటరు, బర్ను తెగలను రెండు ప్రధాన తెగలుగా వాటి నుండి తిరిగి ఉప తెగలుగా విభజించారు. మాగ్రెబులోని ప్రాంతాలన్నింటిలో అనేక తెగలు ఉన్నాయి (ఉదాహరణకు సంహాద్జా, హౌరా, జెనాటా, మస్మౌడ, కుటామా, అవర్బా, బెర్గ్వాటా). ఈ తెగలందరూ స్వతంత్రంగా స్వయం నిర్ణయాలు తీసుకున్నారు.

మధ్య యుగాలలో మాఘ్రేబు, ఇతర సమీప భూములలో పలు అమాజిగు రాజవంశాలు ఉద్భవించాయి. మాఘ్రేబు ప్రాంతంలోని అమాజిగు రాజవంశాలలో జిరిద్, బాను ఇఫ్రాన్, మాఘ్రావా, అల్మోరవిదు, హమ్మడిదు, అల్మోహాదు, మెరినిదు, అబ్దుల్వాడిడు, వట్టాసిదు, మెక్నాస్సా, హఫ్సిదు ఉన్నాయి.

బాను హిలాలు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
The Berber Almohad Caliphate at its greatest extent, c. 1212

ప్రస్తుత ట్యునీషియాలోని ఇఫ్రికియాను కైరోలోని ఫాతిమిదు ఖలీఫా ఆధిపత్యంలో బెర్బెరు కుటుంబం, జిరిదులో పరిపాలించారు. బహుశా 1048 లో జిరిదు పాలకుడు (వైస్రాయి) ఎల్-ముయిజ్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతీకార దాడిచేయడానికి ఫాతిమిదు రాజ్యం, చాలా బలహీనంగా ఉంది; వైస్రాయి, ఎల్-ముయిజు, ప్రతీకారం తీర్చుకోవడానికి మరొక మార్గాన్ని కూడా కనుగొన్నాడు.

నైలు, ఎర్ర సముద్రం మధ్య బెడౌయిను గిరిజనులు అరేబియా నుండి బహిష్కరించబడ్డారు. ఈ అల్లకల్లోలానికి బాను హిలాల్, బాను సులైం ఇద్దరూ కారణంగా ఉన్నారు. వారి ఉనికి నైలు లోయలో రైతులకు అంతరాయం కలిగించింది. రైతులను తరచుగా సంచార జాతులు కూడా దోచుకునేవారు. అప్పటి ఫాతిమిదు విజియర్ మాగ్రెబ్ నియంత్రణను వదులుకోవడానికి ఆయన సార్వభౌమాధికారి ఒప్పందాన్ని పొందాడు. ఇది బెడౌయిన్‌లను విడిచిపెట్టమని ప్రేరేపించడమే కాక, ఫాతిమిడ్ ఖజానా వారికి తేలికపాటి బహిష్కరణ నగదు భత్యం ఇచ్చింది.

తెగలు మొత్తం మహిళలు, పిల్లలు, పూర్వీకులు, జంతువులు, క్యాంపింగు పరికరాలతో బయలుదేరారు. కొందరు మార్గంలో ఆగిపోయారు, (ముఖ్యంగా సిరెనైకాలో). ఇప్పటికీ స్థావరాల ముఖ్యమైన అంశాలలో ఇది ఒకటిగా ఉంది. కాని చాలా మంది గేబ్సు ప్రాంతం మీదుగా ఇఫ్రికియాకు వచ్చారు. ఈ పెరుగుతున్న ఆటుపోట్లను ఆపడానికి జిరిదు పాలకుడు ప్రయత్నించాడు. పోరాటంలో కైరో గోడల సమీపంలో ఆయన దళాలు ఓడిపోయాయి. అరబ్బులు ఈ క్షేత్రంలో ఆధిక్యతలో ఉన్నారు.

1057 లో వరద పెరుగుతున్న సమయంలో అరబ్బులు ఎత్తైన కాన్స్టాంటైను మైదాన ప్రాంతాలలో వ్యాపించారు. అక్కడ వారు కొన్ని దశాబ్దాల క్రితం కైరోవానులో చేసినట్లుగా, క్రమంగా బాను హమ్మదు కోటను ఉక్కిరిబిక్కిరి చేశారు. అక్కడ నుండి వారు క్రమంగా ఎగువ అల్జీర్సు, ఒరాన్ మైదానాలను స్వాధీనం చేసుకున్నారు. 12 వ శతాబ్దం రెండవ భాగంలో మరికొన్నింటిని ఆల్మోహాడ్లు బలవంతంగా తీసుకున్నారు. 13 వ శతాబ్దంలో అరబ్బులు బార్బర్లు నిలిచి ఉన్న ప్రధాన పర్వత శ్రేణులు, కొన్ని తీర ప్రాంతాలను మినహాయించి ఉత్తర ఆఫ్రికాలో అంతా విస్తరించారు.[ఆధారం చూపాలి] బెడౌయిన్ తెగల ప్రవాహం భాషాశాస్త్రంలో ఒక ప్రధాన అంశం, మాగ్రెబు సాంస్కృతిక అరబుప్రాంతంగా మారింది. గతంలో వ్యవసాయం ఆధిపత్యం వహించిన ప్రాంతాలలో సంచారవాదం వ్యాప్తి చెందింది. బాను హిలాల్ తెగలు నాశనం చేసిన భూములు పూర్తిగా శుష్క ఎడారిగా మారాయని ఇబ్న్ ఖల్దును గుర్తించారు.

16 వ శతాబ్దం ప్రారంభంలో స్పెయిన్ అల్జీరియన్ తీరం, సమీపంలో శక్తివంతమైన అవుట్‌పోస్టులను (ప్రెసిడియోస్) నిర్మించింది. 1505 లో మెర్స్ ఎల్ కేబీర్ వంటి కొన్ని తీర పట్టణాలను స్పెయిన్ తన ఆధీనంలోకి తీసుకుంది; 1509 లో ఓరన్; 1510 లో టెల్మ్సెన్, మోస్టాగనేం, టెనాస్. అదే సంవత్సరంలో అల్జీర్సు లోని కొంతమంది వ్యాపారులు తమ నౌకాశ్రయంలోని శిలామయ ద్వీపాలలో ఒకదాన్ని స్పెయినుకు అప్పగించారు. స్పెయిన్ దాని మీద ఒక కోటను నిర్మించింది. ఉత్తర ఆఫ్రికాలోని ప్రెసిడియోలు ఖరీదైన, అధికంగా ఉపకరించని సైనిక ప్రయత్నంగా మారాయి. ఇది స్పెయిన్ వ్యాపారి సముదాయానికి అందుబాటులో లేదు.

ఓట్టమన్ శకం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
The Zayyanid kingdom of Tlemcen in the fifteenth century and its neighbors

1516 నుండి 1830 వరకు మూడు శతాబ్దాలుగా అల్జీరియా ప్రాంతాన్ని పాక్షికంగా ఒట్టోమన్లు పాలించారు. 1516 లో టర్కీ ప్రివాటీరు సోదరులు అరుజు, హేరుద్దీను బార్బరొసా అఫాసిదుల ఆధ్వర్యంలో అల్జీరులను ఎదుర్కొన్నారు. వారు స్పెయిను దేశస్థుల నుండి జిజెలు, అల్జీర్సు జయించడంలో విజయం సాధించారు. చివరికి నగరం, పరిసర ప్రాంతాల మీద నియంత్రణ సాధించి మునుపటి పాలకుడు బని జియాదు రాజవంశానికి చెందిన మూడవ అబూ హమో పారిపోవాలని బలవంతం చేశారు. 1518 లో ట్రెమ్సెను దాడిలో అరుజు చంపబడిన తరువాత హేరెడిన్ ఆల్జియర్సు సైనిక కమాండరుగా వచ్చాడు. ఒట్టోమను సుల్తాను ఆయనకు బెల్లెర్బే బిరుదును, సుమారు 2 వేల మంది జనిసరీల బృందాన్ని ఇచ్చాడు. ఈ సైనిక సహాయంతో హేరెడ్డిను కాన్స్టాంటైను, ఒరాను మధ్య ఉన్న ప్రాంతాన్ని మొత్తం జయించాడు (1792 వరకు ఓరన్ నగరం స్పానిష్ చేతుల్లోనే ఉంది).

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
హేరెద్దును బార్బరోస్సా

1544 లో ఈ హేరెద్దిను కుమారుడు హసన్ తరువాతి బెయిలరుబే పదవిని చేపట్టాడు. 1587 వరకు ఈ ప్రాంతాన్ని నిర్ణీత పరిమితులు లేని అధికారులచే పరిపాలించబడింది. తదనంతరం సాధారణ ఒట్టోమన్ పరిపాలన ప్రతినిధులుగా పాషా బిరుదు కలిగిన గవర్నర్లు మూడేళ్ల కాలానికి పాలించారు. పాషాకు అల్జీరియాలో ఓజాక్ అని పిలువబడే అఘా నేతృత్వంలోని జనిసరీలు సహాయం చేశారు. 1600 ల మధ్యలో ఓజాక్ మధ్య అసంతృప్తి పెరిగింది ఎందుకంటే వారికి వేతనం చెల్లించబడలేదు. వారు పాషాకు వ్యతిరేకంగా పదేపదే తిరుగుబాటు చేశారు. తత్ఫలితంగా ఆఘా పాషా అవినీతిపరుడని, అసమర్ధుడని అభియోగాలు మోపి 1659 లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర ఆఫ్రికా నగరాలను ప్లేగువ్యాధి పదేపదే తాకింది. 1620–21లో ప్లేగు కారణంగా అల్జీర్సులో 30,000 నుండి 50,000 మంది నివాసితుల ప్రాణాలు కోల్పోయారు. 1654–57, 1665, 1691, 1740–42లలో అధిక మరణాలు నమోదయ్యాయి.

1671 లో తైఫా తిరుగుబాటు చేసి ఆఘాను చంపి దానిలో ఒకదాన్ని మీద అధికారం సాధించాడు. కొత్త నాయకుడికి "డే" అనే బిరుదు లభించింది. 1689 తరువాత అరవై మంది ప్రభువుల మండలి అయిన దివాను డేని ఎన్నుకున్నారు. ఇది మొదట ఓజాక్ ఆధిపత్యంలో ఉంది; 18 వ శతాబ్దం నాటికి ఇది డే సాధనంగా మారింది. 1710 లో డే తనను, తన వారసులను ప్రతినిధులుగా గుర్తించమని సుల్తానును ఒప్పించి పాషాను పదవిని స్వాధీనం చేసుకున్నాడు. అయినప్పటికీ అల్జీర్సు ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒక భాగంగానే ఉన్నారు.

డే రాజ్యాంగబద్ధమైన ఆటోక్రాటుగా ఉన్నాడు. జీవితకాలం పదవిలో ఉంటాడు. కాని ఈ వ్యవస్థ మనుగడ సాగించిన 159 సంవత్సరాలలో (1671–1830) ఇరవై తొమ్మిది డేలలో పద్నాలుగు మంది హత్యకు గురయ్యారు. దోపిడీ, సైనిక తిరుగుబాట్లు, అప్పుడప్పుడు గుంపు పాలన ఉన్నప్పటికీ ఒట్టోమన్ ప్రభుత్వం రోజువారీ ఆపరేషన్ చాలా క్రమబద్ధంగా జరిగింది. ప్రతినిధులుగా గిరిజన నాయకులను పోషించినప్పటికీ, దీనికి ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాల ఏకగ్రీవ విధేయత లేదు. ఇక్కడ విధించిన భారీ పన్నులు తరచుగా ప్రజలను అశాంతికి గురిచేస్తాయి. గిరిజనులు స్వయంప్రతిపత్త గిరిజన రాజ్యాలుగా పాలించబడ్డారు. కబీలీలో చాలా అరుదుగా రీజెన్సీ అధికారం వర్తించబడుతుంది.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
అల్జీర్సులో క్రైస్తవ బానిసలు, 1706

బార్బరీ సముద్రబందిపోట్లు పశ్చిమ మధ్యధరా సముద్రంలో క్రైస్తవ, ఇతర ఇస్లామేతర నౌకలను వేటాడారు. సముద్రపు దొంగలు తరచూ ప్రయాణీకులను సిబ్బందిని బంధించి ఓడల్లోకి తీసుకెళ్ళి విక్రయించడం, బానిసలుగా ఉపయోగించడం చేసారు. కొంతమంది బందీలను విమోచన చేయడానికి ధనం వసూలుచేసి చురుకైన వ్యాపారం చేశారు. రాబర్టు డేవిసు అభిప్రాయం ఆధారంగా 16 - 19 వ శతాబ్దం వరకు, సముద్రపు దొంగలు 1 మిలియన్ నుండి 1.25 మిలియన్ల యూరోపియన్లను బానిసలుగా స్వాధీనం చేసుకున్నారని భావిస్తున్నారు. క్రైస్తవ బానిసలను ఉత్తర ఆఫ్రికా, ఒట్టోమను సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో బానిస మార్కెట్లలో విక్రయించడానికి పట్టుకోవటానికి ఐరోపా తీరప్రాంత పట్టణాలలో వారు తరచూ దాడులు చేశారు. ఉదాహరణకు 1544 లో హేరెడిన్ బార్బరోస్సా ఇస్చియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని 4,000 మంది ఖైదుచేసి స్వాధీనం చేసుకున్నాడు. దాదాపు 9,000 మంది లిపారి నివాసులను (దాదాపు మొత్తం జనాభా) బానిసలుగా చేసుకున్నాడు. 1551 లో అల్జీరుల ఒట్టోమన్ ప్రతినిధి తుర్గటు రీసు, మాల్టీసు ద్వీపం గోజో మొత్తం జనాభాను బానిసలుగా చేసుకున్నాడు. బార్బరీ సముద్రబంధిపోట్లు తరచుగా బాలేరికు దీవుల మీద దాడి చేశారు. ముప్పు చాలా తీవ్రంగా ఉండి నివాసితులు ఫోర్మెంటెరా ద్వీపాన్ని విడిచిపెట్టారు. 17 వ శతాబ్దం ప్రారంభం నుండి విస్తృత-నౌక నౌకల నిర్మాణం అట్లాంటిక్లోకి ప్రవేశించడానికి వీలు కల్పించింది.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Bombardment of Algiers by the Anglo-Dutch fleet, to support the ultimatum to release European slaves, August 1816

అల్జీర్సు నుండి డచ్ బంధిపోటు నౌకలు జాన్ జాన్‌జూన్ ఆధ్వర్యంలో ఐస్లాండు వరకు ప్రయాణించాయి. వారు బానిసల మీద దాడి చేసి బంధించారు. రెండు వారాల ముందు మొరాకోలోని సాలే నుండి మరొక సముద్రబంధిపోటు నౌక కూడా ఐస్లాండు మీద దాడి చేసింది. అల్జీరుకు తీసుకువచ్చిన కొంతమంది బానిసలు నష్టపరిహారం ఇచ్చి ఐస్లాండుకు తిరిగి వెళ్ళారు. కాని కొందరు అల్జీరియాలో ఉండటానికి ఎంచుకున్నారు. 1629 లో అల్జీరియా నుండి సముద్రపు బంధిపోటు నౌకలు ఫారో దీవుల దాడి చేశాయి.

మధ్యధరాలో బార్బరీ దోపిడీదారులు స్పానిషు వ్యాపార నౌకల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఫలితంగా స్పానిషు నావికాదళం 1783 - 1784 లలో అల్జీర్సు మీద బాంబు దాడి చేసింది. 13] 1784 లో జరిగిన దాడి కోసం, నేజిల్స్, పోర్చుగల్, నైట్స్ ఆఫ్ మాల్టా వంటి అల్జీర్సు సాంప్రదాయ శత్రువుల నుండి ఓడలతో స్పానిష్ నౌకాదళం చేరవలసి ఉంది. 20,000 కి పైగా ఫిరంగి బంతులు కాల్చబడ్డాయి. నగరం చాలా భాగం, దాని కోటలు నాశనమయ్యాయి. అల్జీరియన్ నౌకాదళంలో ఎక్కువ భాగం నౌకలు మునిగిపోయాయి.

19వ శతాబ్దంలో సముద్రపు బంధిపోట్లు కరేబియన్ అధికారాలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాయి. బదులుగా వారి ఓడలు సురక్షితంగా నౌకాశ్రయంలో నిలిపినందుకు బదులుగా "అనుమతి పన్ను" చెల్లించాయి.

మధ్యధరాలోని అమెరికన్ నాకౌలమీద సముద్రపు బంధిపోటు దొంగల దాడి ఫలితంగా యునైటెడు స్టేట్సు మొదటి (1801-1805), రెండవ బార్బరీ యుద్ధాలను (1815) ను ప్రారంభించింది. ఆ యుద్ధాల తరువాత అల్జీరియా బలహీన పడింది. ఐరోపియన్లు బ్రిటిషు లార్డ్ ఎక్స్‌మౌత్ నేతృత్వంలోని ఆంగ్లో-డచ్ విమానాలతో అల్జీర్సు మీద దాడి చేశారు. తొమ్మిది గంటల బాంబు దాడి తరువాత, వారు డే నుండి ఒక ఒప్పందాన్ని పొందారు. ఇది కెప్టెన్ (కమోడోరు) స్టీఫెన్ డికాటూరు (యు.ఎస్. నేవీ) నివాళుల సంబంధించి విధించిన షరతులను పునరుద్ఘాటించింది. అదనంగా క్రైస్తవులను బానిసలుగా చేసే పద్ధతిని అంతం చేయడానికి డే అంగీకరించారు.

19 వ శతాబ్దంలో స్పెయిన్ అల్జీరియా నుండి వైదొలగినప్పటికీ మొరాకోలో ఉనికిని నిలుపుకుంది. 20 వ శతాబ్దం వరకు సమీపంలోని మొరాకోలో స్పానిష్ కోటలను, నియంత్రణను నిరంతరం అల్జీరియా వ్యతిరేకించింది.

ఫ్రెంచి కాలనైజేషన్ (1830–1962)

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Battle of Somah in 1836

1830 లో ఫ్రెంచి వారు అల్జీర్సు మీద దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అల్జీరియా మీద ఫ్రెంచి ఆక్రమణ మీద చరిత్రకారుడు బెన్ కిర్నాను ఇలా వ్రాశాడు: "1875 నాటికి ఫ్రెంచి విజయం పూర్తయింది. 1830 నుండి యుద్ధంలో సుమారు 8,25,000 మంది స్థానిక అల్జీరియన్లను చంపింది." 1831–51 నుండి ఫ్రెంచి తరఫున ఆసుపత్రిలో 92,329 మంది మరణించారు. యుద్ధంలో 3,336 మంది మాత్రమే మరణించారు. 1872 లో 2.9 మిలియన్లుగా ఉన్న అల్జీరియా జనాభా 1960 నాటికి దాదాపు 11 మిలియన్లకు చేరుకుంది. ఫ్రెంచి విధానం దేశాన్ని "నాగరికత" చేసినట్లు భావించబడుతుంది. ఫ్రెంచి ఆక్రమణ తరువాత అల్జీరియాలో బానిస వ్యాపారం, సముద్రదోపిడీ చర్యలు ఆగిపోయాయి. ఫ్రెంచి వారు అల్జీరియాను జయించటానికి కొంత సమయం పట్టింది. ఇందులో గణనీయమైన రక్తపాతం సంభవించింది. హింస, అంటువ్యాధుల కలయిక వలన దేశీయ అల్జీరియను జనాభా 1830 - 1872 మద్యకాలంలో దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. ఈ కాలంలో ఫ్రెంచి మాట్లాడే స్థానిక ఉన్నతవర్గం ఏర్పడింది. ఇది బెర్బెర్సు (ఎక్కువగా కేబిల్సు)తో రూపొందించబడింది. పర్యవసానంగా ఫ్రెంచి ప్రభుత్వం కేబిల్సుకు మొగ్గు చూపింది. కేబిల్సు కోసం 80% స్వదేశీ పాఠశాలలు నిర్మించబడ్డాయి.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Emir Abdelkader, Algerian leader insurgent against French colonial rule, 1865

1848 నుండి స్వాతంత్ర్యం వరకు, ఫ్రాన్సు అల్జీరియాలోని మొత్తం మధ్యధరా ప్రాంతాన్ని ఫ్రాంసు అంతర్భాగంగా పాలించింది. ఫ్రాన్సు విదేశీ భూభాగాలలో ఒకటిగా సుదీర్ఘాకాలంగా ఉన్న అల్జీరియా లక్షలాది ఐరోపా వలసదారులకు గమ్యస్థానంగా మారింది. వీరు కోలన్లు అని పిలువబడిన తరువాత పైడ్-నోయిర్సు అని పిలువబడ్డారు. 1825 - 1847 మధ్య 50,000 మంది ఫ్రెంచి ప్రజలు అల్జీరియాకు వలస వచ్చారు.[page needed] ఫ్రెంచి ప్రజలు ఫ్రెంచి ప్రభుత్వం తరఫున గిరిజన ప్రజల నుండి భూములను జప్తు చేయడం, వ్యవసాయ యోగ్యమైన భూమి మొత్తాన్ని ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అభివృద్ధి చేయడం ద్వారా ప్రయోజనం పొందారు. చాలా మంది ఐరోపా ప్రజలు ఓరన్, అల్జీర్సులో స్థిరపడ్డారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో వారు రెండు నగరాలలోనూ సంఖ్యాపరంగా అధికంగా ఉన్నారు.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
ఎఫ్.ఎల్.ఎన్. ఆరుగురు చారిత్రక నాయకులు: రబా బిటాట్, మోస్టెఫా బెన్ బౌలాడ్, డిడౌచే మౌరాడ్, మొహమ్మదు బౌడియాఫ్, క్రిం బెల్కాసెం, లార్బీ బెన్ ఎం హిడి

19 వ శతాబ్దం చివరిలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో; ఐరోపా వాటా జనాభాలో దాదాపు ఐదవ వంతు. ఫ్రెంచి ప్రభుత్వం అల్జీరియాను ఫ్రాంసులో భాగంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగస్ 1900 తరువాత గణనీయంగా విద్యాభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టింది. స్థానిక సాంస్కృతి, మతపరమైన ప్రతిఘటన ఈ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే మధ్య ఆసియా, కౌకాససులోని ఇతర వలసరాజ్యాలకు భిన్నంగా అల్జీరియా నైపుణ్యం, మానవ-వనరులతో వ్యవసాయాన్ని విస్తారంగా అభివృద్ధి చేసింది.

క్రమంగా వలసరాజ్యాల వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక హోదా లేని ముస్లిం ప్రజలలో అసంతృప్తి అధికరించింది. ఫలితంగా అధిక రాజకీయ స్వయంప్రతిపత్తి కూరారు. చివరికి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం కావాలని నిర్భంధించడానికి దారితీసింది. 1945 మేలో ఫ్రెంచి దళాలకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును ప్రస్తుతం సెటిఫు (గుయెల్మా) ఊచకోత అని పిలువబడింది. 1954 లో రెండు సమూహాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. తరువాత అల్జీరియా యుద్ధం అని పిలువబడే మొదటి హింసాత్మక సంఘటనలు ప్రారంభమయ్యాయి. ఫ్రంట్ డి లిబరేషన్ నేషనల్ (ఎఫ్ఎల్ఎన్) లేదా అల్జీరియాలోని లించి మూకల చేత 30,000 - 150,000 మంది హర్కిలు, వారిమీద ఆధారపడినవారు చంపబడ్డారని చరిత్రకారులు అంచనా వేశారు. ఎఫ్.ఎల్.ఎన్. యుద్ధంలో భాగంగా అల్జీరియా, ఫ్రాంసులలో హిట్ అండ్ రన్ దాడులను ఉపయోగించింది. తరువాత ఫ్రెంచి వారు ప్రతీకారం తీర్చుకున్నారు.

ఈ యుద్ధం లక్షలాది మంది అల్జీరియన్లు, లక్షలాది మంది గాయపడడానికి దారితీసింది. అలిస్టెయిరు హార్న్, రేమండ్ అరోన్ వంటి చరిత్రకారులు అల్జీరియా ముస్లిం యుద్ధంలో చనిపోయిన వారి అసలు సంఖ్య ఎఫ్ఎల్ఎన్, అధికారిక ఫ్రెంచ్ అంచనాల కంటే చాలా అధికం అని పేర్కొన్నారు. అయితే స్వాతంత్ర్యం తరువాత అల్జీరియా ప్రభుత్వం పేర్కొన్న ఒక మిలియను మరణాల కంటే తక్కువ అని పేర్కొంది. ఎనిమిది సంవత్సరాల కాలంలో అల్జీరియన్ మరణాలు 7,00,000 అని హార్ను అంచనా వేశారు. ఈ యుద్ధం 2 మిలియన్లకు పైగా అల్జీరియన్లను నిర్మూలించింది.

1962 మార్చి ఎవియన్ ఒప్పందాలు, 1962 జూలై ప్రజాభిప్రాయ సేకరణ తరువాత అల్జీరియా పూర్తి స్వాతంత్ర్యం పొందిన తరువాత 1962 లో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా యుద్ధం ముగిసింది.

స్వతంత్రం తరువాతి మూడు దశాబ్ధాలు (1962–1991)

అల్జీరియా నుండి పారిపోయిన ఐరోపా పైడు-నోయిర్సు సంఖ్య 1962 - 1964 మధ్య మొత్తం 9,00,000 కంటే అధికం. 1962 నాటి ఓరాన్ ఊచకోత తరువాత ఫ్రాన్సు ప్రధాన భూభాగానికి వెళ్ళడం వేగవంతమైంది. దీనిలో వందలాది మంది ఉగ్రవాదులు నగరంలోని ఐరోపా విభాగాలలోకి ప్రవేశించి పౌరుల మీద దాడి చేయడం ప్రారంభించారు.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
హౌరి బౌమీడిను

ఫ్రంట్ డి లిబరేషన్ నేషనల్ (ఎఫ్ఎల్ఎన్) నాయకుడు అహ్మద్ బెన్ బెల్లా అల్జీరియా మొదటి అధ్యక్షుడయ్యాడు. పశ్చిమ అల్జీరియాలోని కొన్ని భాగాల హక్కు కొరకు మొరాకో వివాదించడం 1963 లో ఇసుక యుద్ధానికి దారితీసింది. 1965 లో బెన్ బెల్లాను ఆయన మాజీ మిత్రుడు, రక్షణ మంత్రి హౌరి బౌమాడియన్ పడగొట్టాడు. బెన్ బెల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వం సోషలిస్టు ప్రభుత్వంగా పనిచేసింది. బౌమాడియెను ఈ ధోరణిని కొనసాగించాడు. అయినప్పటికీ ఆయన తన మద్దతు కొరకు సైన్యం మీద అధికంగా ఆధారపడ్డాడు. చట్టబద్దమైన ఏకపార్టీన ప్రభుత్వం నామమాత్ర పాత్రకు తగ్గించాడు. ఆయన వ్యవసాయాన్ని సమీకరించాడు. భారీ పారిశ్రామికీకరణ ప్రారంభించాడు. చమురు వెలికితీత సౌకర్యాలు జాతీయం చేయబడ్డాయి. 1973లో సంభవించిన అంతర్జాతీయ చమురు సంక్షోభం తరువాత నాయకత్వానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది.

అధ్యక్షుడు హౌరి బౌమీడిను ఆధ్వర్యంలో 1960 - 1970 లలో అల్జీరియా ప్రభుత్వ నియంత్రణలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. బౌమెడిన్ వారసుడు చాడ్లీ బెండ్జెడిడు కొన్ని సరళీకృత ​​ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఆయన అల్జీరియా సమాజంలో, ప్రజా జీవితంలో అరబిజేషను విధానాన్ని ప్రోత్సహించాడు. ఇతర ముస్లిం దేశాల నుండి అరబికు ఉపాధ్యాయులను తీసుకువచ్చారు. సాంప్రదాయ పాఠశాలలలో ఇస్లాం విధానాలను వ్యాప్తి చేశారు. ఇలా సంప్రదాయ ఇస్లాంకు తిరిగి రావడానికి బీజాలు నాటారు.

అల్జీరియా ఆర్థిక వ్యవస్థ చమురు మీద అధికంగా ఆధారపడింది. 1980 ల చమురు సంక్షోభం సమయంలో ధర పతనమై కష్టాలకు దారితీసింది. ప్రపంచ చమురు ధరల పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం 1980 లలో అల్జీరియా సామాజిక అశాంతికి దారితీసింది; దశాబ్దం చివరి నాటికి బెండ్జెడిడు బహుళ పార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ముస్లిం సమూహాల విస్తృత కూటమి అయిన ఇస్లామికు సాల్వేషన్ ఫ్రంటు వంటి రాజకీయ పార్టీలు అభివృద్ధి చెందాయి.

అంతర్యుద్ధం (1991–2002) , తరువాత

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Massacres of over 50 people in 1997–1998. The Armed Islamic Group (GIA) claimed responsibility for many of them.

1991 డిసెంబరులో శాసనసభ ఎన్నికలలో " ఇస్లామిక్ సాల్వేషన్ ఫ్రంట్" రెండు విడతల ఆధిక్యత సాధించింది. ఇస్లామిస్ట్ ప్రభుత్వం వస్తుందని భయపడిన అధికారులు 1992 జనవరి 11 న ఎన్నికలను రద్దు చేశారు. బెండ్జెడిడు రాజీనామా చేశారు. " హై కౌన్సిల్ ఆఫ్ స్టేటు " ప్రెసిడెన్సీగా పనిచేయడానికి ఏర్పాటు చేయబడింది. ఇది ఎఫ్.ఐ.ఎస్.ని నిషేధించింది. ఫ్రంటు సాయుధ విభాగం, సాయుధ ఇస్లామికు గ్రూపు జాతీయ సాయుధ దళాల మధ్య తిరుగుబాటును తలెత్తింది. తిరుగుబాటులో 1,00,000 మందికి పైగా మరణించినట్లు భావించారు. ఇస్లామిస్టు ఉగ్రవాదులు పౌర ఉచకోతల మీద హింసాత్మక పోరాటం నిర్వహించారు. సంఘర్షణ కారణంగా అల్జీరియాలో తలెత్తిన పరిస్థితి అంతర్జాతీయ ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా సంక్షోభ సమయంలో సాయుధ ఇస్లామిక్ గ్రూప్ ఎయిర్ ఫ్రాన్సు ఫ్లైటు 8969 ను హైజాకింగు ఆందోళలను అధికరింపజేసింది. 1997 అక్టోబరులో సాయుధ ఇస్లామిక్ గ్రూప్ కాల్పుల విరమణ ప్రకటించింది.

1999 అల్జీరియాలో ఎన్నికలను నిర్వహించింది. అంతర్జాతీయ పరిశీలకులు, పలు ప్రతిపక్ష సమూహాలు ఎన్నికలు పక్షపాతంతో నిర్వహించారని పరిగణించారు. ఎన్నికలలో అబ్దేలాజిజ్ బౌటెఫ్లికా అధ్యక్షపదవిని గెలుచుకున్నాడు. ఆయన దేశరాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి పనిచేశాడు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆమోదించబడిన "సివిల్ కాంకర్డ్"ను ప్రకటించి పలువురు రాజకీయ ఖైదీలకు క్షమాపణ లభించింది. 2000 జనవరి 13 వరకు అనేక వేల మంది సాయుధ సమూహాల సభ్యులకు పరిమిత ప్రాసిక్యూషను మినహాయింపు లభించింది. ఎ.ఐ.ఎస్. రద్దు చేయబడింది. తిరుగుబాటు హింస స్థాయిలు వేగంగా పడిపోయాయి. సాయుధ ఇస్లామిక్ గ్రూప్ చీలిక సమూహం అయిన గ్రూప్ సలాఫిస్ట్ పౌర్ లా ప్రిడికేషన్ ఎట్ లే కంబాట్ (జిఎస్పిసి) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద పోరాటాన్ని కొనసాగించింది.

జాతీయ సయోధ్య కార్యక్రమం ప్రచారం తరువాత నిర్వహించబడిన 2004 ఏప్రెలు అధ్యక్ష ఎన్నికలలో బౌటెఫ్లికా తిరిగి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో దేశాన్ని ఆధునీకరించడానికి, జీవన ప్రమాణాలను పెంచడానికి, పరాయీకరణ వంటి సమస్యల పరిష్కరించడానికి ఆర్థిక, సంస్థాగత, రాజకీయ, సామాజిక సంస్కరణలు చేయబడ్డాయి. ఇది రెండవ రుణమాఫీ చొరవ, చార్టర్ ఫర్ పీస్ అండ్ నేషనల్ సయోధ్య, 2005 సెప్టెంబరులో ప్రజాభిప్రాయ సేకరణలో ఆమోదించబడింది. ఫలితంగా గెరిల్లాలకు, ప్రభుత్వ భద్రతా దళాలకు క్షపాపణ లభించింది.

2008 నవంబరున పార్లమెంటులో ఓటు వేసిన తరువాత అల్జీరియా రాజ్యాంగం సవరించబడింది. అధ్యక్ష పదవికి ఉన్న రెండు-దఫాల పరిమితిని తొలగించింది. 2009 అధ్యక్ష ఎన్నికలలో బౌటెఫ్లికా తిరిగి పోటీ చేయడానికి ఈ మార్పు అవకాశం ఇచ్చింది. 2009 ఏప్రెలులో ఆయన తిరిగి ఎన్నికయ్యాడు. తిరిగి ఎన్నికైన తరువాత బౌటెఫ్లిక $ 150- బిలియన్ల వ్యయంతో మూడు మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ఒక మిలియన్ కొత్త హౌసింగ్ యూనిట్ల నిర్మాణం, ప్రభుత్వ రంగ మౌలిక సదుపాయాల ఆధునీకరణ కార్యక్రమాలను కొనసాగించడానికి ఒక ప్రణాళికను ప్రకటించాడు.

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించిన ఇలాంటి నిరసనల నుండి పొందిన ప్రేరణతో 2010 న దేశవ్యాప్తంగా నిరంతర నిరసనలు ప్రారంభమయ్యాయి. 2011 ఫిబ్రవరి 24 న ప్రభుత్వం అల్జీరియా 19 సంవత్సరాలు కొనసాగిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేసింది. ప్రభుత్వం మహిళలకు రాజకీయ పార్టీలు, ఎన్నికల నియమావళి, ఎన్నికైన సంస్థలలో ప్రాతినిధ్యం వహించడానికి అనుమతించే చట్టాన్ని అమలు చేసింది. 2011 ఏప్రెలులో బౌటెఫ్లికా రాజ్యాంగ, రాజకీయ సంస్కరణలు చేస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఎన్నికలను ప్రతిపక్షాలు విమర్శించాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మీడియా సెన్సార్షిప్పు, రాజకీయ ప్రత్యర్థుల వేధింపులు కొనసాగుతున్నాయని చెబుతున్నాయి.

2019 ఏప్రెలు 2 న బౌటెఫ్లికా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

భౌగోళిక స్వరూపము

ఆఫ్రికాలోని మధ్యదరా సముద్ర ప్రాంతాలలో అల్జీరియా అతిపెద్ద దేశం. దేశ దక్షిణ భాగంలో సహారా ఎడారి ఎడారి భూభాగం ఉంది. ఉత్తరప్రాంతంలో అరెసు, నేమెంచా పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇందులో అతి ఎత్తైన పర్వతం తాహత్ పర్వతం (3,003 మీటర్లు). ఉత్తరాన సహారను అట్లాసులో భాగంగా ఉన్న టెల్ అట్లాసు ఉంటుంది. మరింత దక్షిణంగా ఉన్న రెండు సమాంతర పర్వతశ్రేణులు క్రమంగా తూర్పు దిక్కుకు చేరుకుంటాయి. ఈ శ్రేణుల మధ్య విస్తారమైన మైదానాలు, ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి. అట్లాసులు రెండూ తూర్పు అల్జీరియాలో విలీనం అవుతాయి. ఆరేసు, నెమెమ్చా పర్వత శ్రేణులు మొత్తం ఈశాన్య అల్జీరియాను ఆక్రమిస్తూ ట్యునీషియా సరిహద్దును ఏర్పరుస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న తహాత్ పర్వతం (3,003 మీటర్లు లేదా 9,852 అడుగులు)ఎత్తుతో దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది.

అల్జీరియా 19° - 37° ఉత్తర అక్షాంశాలలో ఉంది. చిన్నభూభాగం 37° ల ఉత్తర అక్షాంశంలో ఉంది. అలాగే 9° పశ్చిమ - 12°తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. తీర ప్రాంతం చాలావరకు కొండ కోనలతో, కొంత పర్వతాలతో నిండి ఉంది. కొన్ని సహజ ఓడరేవులు కుడా ఉన్నాయి. తీర ప్రాంతం నుండి టెల్ అట్లాసు వరకు సారవంతమైన భూములు ఉన్నాయి. టెల్ అట్లాసు దక్షిణంలోని సోపాన క్షేత్రాలతో (ఆంగ్ల భాష: స్టెప్పె ప్రకృతి దృశ్యం) సహారా అట్లాసులో కలుస్తుంది. దక్షిణంలో సహారా ఎడారి ఉంది.

అల్జీరియాలోని మధ్య సహారాలో హొగ్గరు పర్వతాలు (అరబ్బీ: جبال هقار‎) మద్య సహారా, దక్షిణ అల్జీరియాలో ఎత్తైన ప్రాంతంగా ఉంది. ఇవి అల్జీర్సు దక్షిణంలో దాదాపు 1500 కి.మీ ల దూరంలోను, తమాంఘాసేత్తుకు తూర్పున ఉన్నాయి. అల్జీర్సు, ఓరన్, కాన్సంటీనా, అన్నాబా వంటి ముఖ్య నగరాలు ఉన్నాయి.

వాతావరణం , వర్షపాతం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Algeria map of Köppen climate classification.

ఈ ప్రాంతంలో మధ్యాహ్నం ఎడారి ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా వేడిగా ఉంటాయి. సూర్యాస్తమయం తరువాత వీచే స్పష్టమైన పొడి గాలి కారణంగా వేడిని వేగంగా కోల్పోవటానికి సహకరిస్తుంది. రాత్రులు చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలో అపారమైన రోజువారీ వైవిధ్యతతో ఉష్ణోగ్రతలు నమోదు చేయబడతాయి.

టెల్ అట్లాసు తీరప్రాంతంలో వర్షపాతం చాలా సమృద్ధిగా ఉంటుంది. సంవత్సరానికి 400 - 670 మిమీ (15.7 నుండి 26.4 అంగుళాలు) వర్షపాతం ఉంటుంది. వర్షపాతం క్రమంగా పడమటి నుండి తూర్పుకు అధికరిస్తుంది. తూర్పు అల్జీరియా ఉత్తర భాగంలో వర్షపాతం భారీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని సమయాలలో ఇది 1,000 మిమీ (39.4 అంగుళాలు) వరకు చేరుకుంటుంది.

లోతట్టులో, వర్షపాతం తక్కువగా ఉంటుంది. అల్జీరియాలో పర్వతాల మధ్య ఎర్గ్స్ లేదా ఇసుక దిబ్బలు కూడా ఉన్నాయి. వీటిలో, వేసవి కాలంలో గాలులు భారీగా, గంభీరంగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు 43.3 ° సెం (110 ° ఫా) వరకు పెరగవచ్చు. యూనైటెడు కింగ్డం ఆఫ్ గ్రేటు బ్రిటను, ఉత్తర ఐర్లాండు.

జంతుజాలం , వృక్షజాలం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Cedrus of Chélia in the Aures

అల్జీరియా వైవిధ్యమైన వృక్షసంపద కలిగి ఉంటుంది. తీరప్రాంతాలు, పర్వతప్రాంతాలు, గడ్డి మైదానాలు, ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఇవి అన్ని రకాల వన్యప్రాణులకు మద్దతు ఇస్తాయి. అల్జీరియా వన్యప్రాణులు అధికంగా నాగరికప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్నాయి. సాధారణంగా కనిపించే జంతువులలో అడవి పందులు, నక్కలు, గజెల్లెలు ఉన్నాయి. అయినప్పటికీ ఫెన్నెక్సు (నక్కలు) జెర్బోలు కూడా కనిపిస్తుంటాయి. అల్జీరియాలో ఒక చిన్న ఆఫ్రికా చిరుతపులి, సహారా చిరుత కూడా ఉన్నాయి. అయితే ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. జింక జాతి, బార్బరీ స్టాగు, ఈశాన్య ప్రాంతాలలోని దట్టమైన తేమతో కూడిన అడవులలో నివసిస్తుంటాయి.

వివిధ రకాల పక్షి జాతులు పక్షులపట్ల ఆసక్తి కలిగిన వారిని దేశంలోకి ఆకర్షిస్తుంటాయి. అడవులలో పందులు, నక్కలు నివసిస్తాయి. దేశంలో కనిపించే ఏకైక స్థానిక కోతిజాతి పేరు బార్బరీ మకాక్సు. పాములు, మానిటరు బల్లులు వంటి అనేక ఇతర సరీసృపాలు అల్జీరియాలోని పాక్షిక శుష్క ప్రాంతాలలో (ఎలుకల కూడా ఉంటాయి) నివసిస్తాయి. బార్బరీ సింహాలు, అట్లాసు ఎలుగుబంట్లు, మొసళ్ళు వంటి చాలా జంతువులు ఇప్పుడు అంతరించిపోయాయి.

ఉత్తరప్రాంతంలో స్థానిక వృక్షజాలంలో కొన్ని మాకియా స్క్రబు, ఆలివ్ చెట్లు, ఓక్స్, దేవదారు, ఇతర కోనిఫర్లు ఉన్నాయి. పర్వత ప్రాంతాలలో సతతహరితాల పెద్ద అడవులు (అలెప్పో పైన్, జునిపెర్, సతత హరిత ఓక్), కొన్ని ఆకురాల్చే చెట్లు ఉన్నాయి. వెచ్చని ప్రదేశాలలో అత్తి, యూకలిప్టసు, కిత్తలి, వివిధ తాటి చెట్లు పెరుగుతాయి. తీరప్రాంతంలో ద్రాక్ష పండించబడుతుంది. సహారా ప్రాంతంలో కొన్ని ఒయాసిసులలో తాటి చెట్లు ఉన్నాయి. అడవి ఆలివులతో కూడిన అకాసియాసు సహారా మిగిలిన భాగంలో ప్రధానమైన వృక్షజాలంగా ఉంది.

ఒంటెలను విస్తృతంగా ఉపయోగిస్తారు; ఈ ఎడారిలో విషపూరితమైన, క్రూరమైన పాములు, తేళ్లు, అనేక కీటకాలు ఉన్నాయి.

నిర్వహణా విభాగాలు

అల్జీరియా 48 ప్రావిన్సులు (విలాయాలు), 553 జిల్లాలు (దైరాలు), 1,541 మునిసిపాలిటీలు (బాలాడియా) గా విభజించబడింది. ప్రతి ప్రావిన్స్, జిల్లా, మునిసిపాలిటీకి దాని సీటు పేరు పెట్టబడింది, ఇది సాధారణంగా అతిపెద్ద నగరం.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పరిపాలనా విభాగాలు చాలాసార్లు మారాయి. కొత్త ప్రావిన్సులను ప్రవేశపెట్టినప్పుడు, పాత ప్రావిన్సులను కూడా అలాగే ఉంచారు. అందువలన ప్రొవింసుల పేర్లు అక్షరక్రమ రహితంగా ఉంటాయి.

ఆర్ధికం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Graphical depiction of the country's exports in 28 colour-coded categories.

ప్రపంచ బ్యాంకు అల్జీరియాను ఎగువ మధ్య ఆదాయ దేశంగా వర్గీకరించింది. అల్జీరియా కరెన్సీ దినారు (DZD). స్వాతంత్య్రానంతర దేశం సోషలిస్టు అభివృద్ధి నమూనా ఆర్థికవిధానాలను అనుసరించింది. ఇటీవలి సంవత్సరాలలో అల్జీరియా ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేసింది. ఆర్థిక వ్యవస్థలో విదేశీప్రమేయం, దిగుమతుల మీద ఆంక్షలు విధించింది. అల్జీరియా నెమ్మదిగా వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా ఉన్నప్పటికీ ఈ పరిమితులు ఇటీవలే ఎత్తివేయడం ప్రారంభించింది.

అధిక ఖర్చులు, నిరంకుశధోరిణి కారణంగా అల్జీరియా కొంతవరకు వెలుపల ప్రాంతాలలో హైడ్రోకార్బనుల పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడింది. ఇంధన రంగానికి విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, నిరుద్యోగ శాతాన్ని తగ్గించడానికి, గృహ కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎక్కువగా చేయలేదు. వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, రాజకీయ, ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేయడం, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం వంటి అనేక స్వల్పకాలిక, మధ్యకాలిక సమస్యలను దేశం ఎదుర్కొంటోంది.

2011 లో ఫిబ్రవరి - 2011 మార్చిలో ఆర్థిక నిరసనల తరంగం అల్జీరియా ప్రభుత్వాన్ని 23 బిలియన్ల డాలర్లకు పైగా ప్రజా నిధులు మంజూరు చేయడానికి, రెట్రోయాక్టివ్ జీతం, ప్రయోజన పెరుగుదలను అందించడానికి ప్రేరేపించింది. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయం ఏటా 27% పెరిగింది. 2010-14 ప్రజా-పెట్టుబడి కార్యక్రమానికి US $ 286 బిలియన్లు వ్యయం చేయబడుతుందని అంచనా వేయబడింది. వీటిలో 40% మానవ అభివృద్ధికి వెళ్తాయి.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
The port city of Oran

2011 లో ప్రభుత్వ వ్యయాన్ని నిర్మాణ, ప్రజా పనుల రంగంలో, పెరుగుతున్న అంతర్గత అత్యవసర వ్యవస్థకు మళ్ళించిన కారణంగా అల్జీరియా ఆర్థిక వ్యవస్థ 2.6% వృద్ధి చెందింది. హైడ్రోకార్బన్లను మినహాయించిన తరువాత వృద్ధి 4.8% ఉన్నట్లు అంచనా వేయబడింది. అభివృద్ధి 2012 లో 3%, 2013 లో 4.2 శాతానికి చేరుకుంటుందని అంచనా. ద్రవ్యోల్బణ రేటు 4%, బడ్జెటు లోటు జిడిపిలో 3%. ప్రస్తుత-ఖాతా మిగులు జిడిపిలో 9.3%గా అంచనా వేయబడింది. 2011 డిసెంబరు చివరినాటికి అధికారిక నిల్వలు US $ 182 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యల్పంగా ఉన్న ద్రవ్యోల్బణం 2003 - 2007 మధ్య సగటున 4% స్థిరంగా ఉంది.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Algeria, trends in the Human Development Index 1970–2010

2011 లో అల్జీరియా బడ్జెటు మిగులు 26.9 బిలియన్ల డాలర్లుగా ప్రకటించింది. 2010 మిగులుతో పోలిస్తే 62% పెరుగుదల. సాధారణంగా 73 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి, 46 బిలియన్ల డాలర్లను దిగుమతి చేసుకుంది.

బలమైన హైడ్రోకార్బన్ ఆదాయాలు దేశ ఆర్థికవ్యవస్థకు సహకరిస్తున్నాయి. అల్జీరియాలో 173 బిలియన్ల డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి. బృహత్తరమైన హైడ్రోకార్బను క్రమబద్ధీకరణ నిధి ఉంది. అదనంగా అల్జీరియా బాహ్య రుణం జిడిపిలో 2% కంటే తక్కువగా ఉంది. ఆర్థికవ్యవస్థ హైడ్రోకార్బను సంపద మీద ఆధారపడి ఉంది. అధిక విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ (US $ 178 బిలియన్లు (మూడు సంవత్సరాల దిగుమతులకు సమానం)) ప్రస్తుత అధికరించిన వ్యయం కారణంగా అల్జీరియాలో దీర్ఘకాలిక లోటు బడ్జెటు సమస్యను ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. హైడ్రోకార్బను ఆదాయాల తరుగుదల ఆర్థికరంగానికి మరింత హాని కలిగిస్తుందని భావిస్తున్నారు.

2011 లో వ్యవసాయ రంగం, సేవారంగం వరుసగా 10% - 5.3% వృద్ధిని నమోదు చేశాయి. కార్మికశక్తిలో 14% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. 2011 లో ద్రవ్య విధానం సరళీకృతం చేయబడి ప్రభుత్వ పెట్టుబడులను ఉద్యోగాల కల్పనకు, గృహాల నిర్మాణానికి మళ్ళించడానికి వీలు కల్పించింది.

అనేక సంవత్సరాల చర్చలు జరిపినప్పటికీ అల్జీరియా " ప్రపంచ వాణిజ్య సంస్థ "లో సభ్యత్వం తీసుకోలేదు.

2006 మార్చిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశాన్ని సందర్శించినప్పుడు అల్జీరియా సోవియట్-యుగం రుణాన్ని 74 4.74 బిలియన్లను రద్దుచేయడానికి రష్యా అంగీకరించింది. ఇది అర్ధ శతాబ్దంలో రష్యను నాయకుడు చేసిన మొదటి ఋణమాఫీగా గుర్తించబడింది. దీనికి ప్రతిగా అల్జీరియా అధ్యక్షుడు అబ్డెలాజిజ్ బౌటెఫ్లికా రష్యా నుండి 7.5 బిలియన్ల డాలర్ల విలువైన యుద్ధ విమానాలు, వాయు-రక్షణ వ్యవస్థలు, ఇతర ఆయుధాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి అంగీకరించాడు.

దుబాయి సమ్మేళనంలో ఎమారత్ జాయర్ గ్రూప్ అల్జీరియాలో 6 1.6 బిలియన్ల ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి చేయడానికి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

హైడ్రోకార్బన్లు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Pipelines across Algeria

పెట్రోలియం మీద ఆధారపడిన అల్జీరియా 1969 నుండి ఒపెక్ సభ్యదేశంగా ఉంది. ఇది రోజుకు సుమారు 1.1 మిలియన్ల బారెలు ముడి చమురు ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది ఒక ప్రధాన గ్యాసు ఉత్పత్తిదారు దేశంగానూ, ఎగుమతిదారు దేశంగానూ ఉంటూ ఐరోపాతో ముఖ్యసంబంధాలను అభివృద్ధి చేస్తుంది. హైడ్రోకార్బన్లు చాలాకాలంగా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. బడ్జెటు ఆదాయంలో సుమారు 60%, జిడిపిలో 30%, ఎగుమతి ఆదాయంలో 95%కు హైడ్రోకార్బన్లు భాగస్వామ్యం వహిస్తున్నాయి. అల్జీరియా ప్రపంచంలో సహజ వాయువు ఉత్పత్తి చేస్తున్న ప్రపంచదేశాలలో అల్జీరియా 10 వ స్థానంలో ఉంది. సహజవాయువు ఎగుమతి చేస్తున్న ప్రపంచదేశాలలో అల్జీరియా 6 వ స్థానంలో ఉంది. యు.ఎస్. ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2005 లో అల్జీరియాలో 4.5 ట్రిలియన్ల క్యూబికు మీటర్లు (160 × 1012 క్యూ అడుగులు) నిరూపితమైన సహజ-వాయువు నిల్వలు ఉన్నాయని నివేదించింది. 4.5 trillion cubic metres (160×10^12 cu ft) చమురు నిల్వలలో ఇది ప్రపంచదేశాలలో 16 వ స్థానంలో ఉంది.

2011 లో హైడ్రోకార్బను కాని వృద్ధి 5%గా అంచనా వేయబడింది. సామాజిక అవసరాలను ఎదుర్కోవటానికి, అధికారులు ప్రాథమిక ఆహార మద్దతు, ఉపాధి కల్పన, ఎస్.ఎం.ఇ లకు మద్దతు, అధిక జీతాల కొరకు వ్యయాన్ని అధికరించారు. అధిక హైడ్రోకార్బను ధరలు ఇప్పటికే అంతర్జాతీయ నిల్వలను మెరుగుపర్చాయి.

అధిక చమురు ధరలను కొనసాగించడం వలన 2011 లో చమురు, వాయువు నుండి ఆదాయం అధికరించింది. అయినప్పటికీ ఉత్పత్తి ప్రమాణం అధికరించింది. వాల్యూం పరంగా చమురు, గ్యాస్ రంగం ఉత్పత్తి 2007 - 2011 మధ్య కాలంలో 43.2 మిలియన్ల టన్నుల నుండి 32 మిలియన్ల టన్నులకు పతనం అయింది. అయినప్పటికీ ఈ రంగం 2011 లో మొత్తం ఎగుమతుల పరిమాణంలో 98% (1962 లో 48%) ఉంది. 70% బడ్జెటు రసీదుల మొత్తం US $ 71.4 బిలియన్ల అమెరికా డాలర్లు.

అల్జీరియా జాతీయ చమురు సంస్థ సోనాట్రాచు అల్జీరియాలోని చమురు, సహజ వాయువు రంగాలలోని అన్ని అంశాలలో కీలక పాత్ర పోషిస్తుంది. విదేశీ ఆపరేటర్లు అందరూ సోనాట్రాచు భాగస్వామ్యంతో పనిచేయాలి. ఇది సాధారణంగా ఉత్పత్తి-భాగస్వామ్య ఒప్పందాలలో అధికశాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రత్యామ్నాయ శక్తి వనరులు , పరిశోధనలు

పరిశోధన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, పరిశోధకులకు చెల్లించడానికి అల్జీరియా 100 బిలియన్ల దినార్లను పెట్టుబడి పెట్టింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిని (ప్రధానంగా సౌర, పవన శక్తిని) అభివృద్ధి ప్రధానాంశంగా ఉంది. అల్జీరియా మధ్యధరా ప్రాంతంలో అతిపెద్ద సౌర శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని అంచనా వేయబడింది. కాబట్టి హస్సీ ఆర్'మెల్‌లో సోలార్ సైన్స్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ప్రస్తుతం అల్జీరియాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో 780 కి పైగా పరిశోధనా ప్రయోగశాలలలో 20,000 మంది పరిశోధకులు ఉన్నారు. సౌర శక్తితో పాటు, అల్జీరియాలో పరిశోధనా రంగాలలో అంతరిక్ష, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్సు, అణుశక్తి, వైద్య పరిశోధనలు భాగంగా ఉన్నాయి.

కార్మికసంత

నిరుద్యోగం శాతం తగ్గినప్పటికీ యువత, మహిళలలో నిరుద్యోగం అధికంగా ఉంది. నిరుద్యోగం ముఖ్యంగా యువకులను ప్రభావితం చేస్తుంది, 15-24 వయస్సులో నిరుద్యోగిత రేటు 21.5%.

2011 లో మొత్తం నిరుద్యోగిత శాతం 10% ఉంది. యువతలో 15 - 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో నిరుద్యోగశాతం 21.5% అధికంగా ఉంది. 1988 లో ప్రభుత్వం " డిస్పోసిటిఫ్ డి ఎయిడు ఇన్సర్షను ప్రొఫెషనల్ " ఉద్యోగ కార్యక్రమాలు (ముఖ్యంగా పని కోరుకునే వారికి సహాయపడే కార్యక్రమం) నిర్వహిస్తుంది.

పర్యాటకం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Djanet

అల్జీరియాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఇంతకుముందు సౌకర్యాల కొరత ఉండేది. అయితే 2004 నుండి పర్యాటక అభివృద్ధి వ్యూహం అమలు చేయబడింది. దీని ఫలితంగా అనేక ఆధునిక హోటళ్ళు నిర్మించబడ్డాయి.

అల్జీరియాలో అనేక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. హమ్మడిదు సామ్రాజ్యం మొదటి రాజధాని బెని హమ్మదు అల్ ఖాలాతో సహా; టిపాసా (ఒక ఫీనిషియను పట్టణంగానూ తరువాత రోమను పట్టణంగానూ ఉంది), జమిలా, టిమ్గాడు, రోమను శిథిలాలు; ఎం' జాబ్ లోయ, సున్నపురాయి లోయ (ఇందులో పట్టణీకరించిన ఒయాసిసు ఉంది), అల్జీర్సు కాస్బా, ఒక ముఖ్యమైన కోట పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. సహజమైన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాస్సిలి ఎన్ అజ్జెర్, పర్వత శ్రేణి కూడా ఉంది.

ప్రయాణసౌకర్యాలు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
The main highway connecting the Moroccan to the Tunisian border was a part of the Cairo–Dakar Highway project

అల్జీరియా రహదారి నెట్వర్కు ఆఫ్రికాలో అధికంగా ఉంది; మొత్తం రహదారుల పొడవు 1,80,000 కిమీ (110,000 మైళ్ళు) ఉన్నట్లుగా అంచనా వేయబడింది. 3,756 కంటే ఎక్కువ నిర్మాణాలు 85% పాదచారులబాటతో నిర్మించబడ్డాయి. ఈ నెట్వర్కు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయిన ఈస్ట్-వెస్ట్ హైవే నిర్మాణంతో పూర్తి అవుతుంది. ఇది 3-మార్గం, 1,216 కిలోమీటర్ల పొడవైన (756 మైళ్ళు) రహదారి, ఇది తూర్పున అన్నాబాను పడమరాంతంలోని టెల్ముసెనుతో కలుపుతుంది. ట్రాన్స్-సహారా హైవే అల్జీరియా మీదుగా పయనిస్తుంది. ఇది ప్రస్తుతం పూర్తిగా పాదచారులబాటతో నిర్మించబడింది. ఆరు దేశాల మధ్య వాణిజ్యాన్ని అధికరించడానికి అల్జీరియా ప్రభుత్వం ఈ రహదారికి మద్దతు ఇస్తుంది: అల్జీరియా, మాలి, నైజర్, నైజీరియా, చాద్, ట్యునీషియా.

గణాంకాలు

Historical populations (in thousands)
సంవత్సరంజనాభా±%
1856 2,496—    
1872 2,416−3.2%
1886 3,752+55.3%
1906 4,721+25.8%
1926 5,444+15.3%
1931 5,902+8.4%
1936 6,510+10.3%
1948 7,787+19.6%
1954 8,615+10.6%
1966 12,022+39.5%
1977 16,948+41.0%
1987 23,051+36.0%
1998 29,113+26.3%
2008 34,080+17.1%
2013 37,900+11.2%
Source: (1856–1872) (1886–2008)

2016 జనవరిలో అల్జీరియా జనాభా 40.4 మిలియన్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా అరబ్-బెర్బెరు జాతిప్రజలు అధికంగా ఉన్నారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో దాని జనాభా సుమారు నాలుగు మిలియన్లు. ఉత్తర, తీర ప్రాంతంలో 90% అల్జీరియన్లు నివసిస్తున్నారు; సహారా ఎడారి నివాసులు ప్రధానంగా ఒయాసిసులో కేంద్రీకృతమై ఉన్నారు, అయినప్పటికీ 1.5 మిలియన్ల మంది సంచార లేదా పాక్షిక సంచార జాతులుగా ఉన్నారు. అల్జీరియన్లలో 15 సంవత్సరాల లోపు వారు 28.1% ఉన్నారు.

దేశంలోని న్యాయవాదులలో 70%, న్యాయమూర్తులలో 60% మహిళలు ఉన్నారు. వైద్య రంగంలో కూడా మహిళలు ఆధిపత్యంలో ఉన్నారు. పురుషుల కంటే మహిళలు గృహ ఆదాయానికి ఎక్కువ సహకరిస్తున్నారు. విశ్వవిద్యాలయ పరిశోధనల ఆధారంగా విశ్వవిద్యాలయ విద్యార్థులలో 60% మహిళలు ఉన్నారని అంచనా.

పశ్చిమ సహారా నుండి 90,000 - 1,65,000 మంది సహ్రావిలు సహ్రావి శరణార్థి శిబిరాలలో నివసిస్తున్నారు. వీరు పశ్చిమ అల్జీరియన్ సహారా ఎడారిలో ఉన్నారు. 4,000 మందికి పైగా పాలస్తీనా శరణార్థులు కూడా ఉన్నారు. వారు దేశంలోని మిగిలిన ప్రజలతో బాగా కలిసిపోయారు. వారు ఐక్యరాజ్యసమితి " హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్)" నుండి సహాయం కోరలేదు. 2009 లో అల్జీరియాలో 35,000 మంది చైనా వలస కార్మికులు నివసించారు.

అల్జీరియా వెలుపల అల్జీరియా వలసదారులు అత్యధిక సంఖ్యలో ఫ్రాన్సులో ఉన్నారు. ఇక్కడ 1.7 మిలియన్లకంటే అధికంగా రెండవ తరం అల్జీరియన్లు ఉన్నారు.

సంప్రదాయ సమూహాలు

స్వదేశీ బెర్బరులతో పాటు ఫోనిషియన్లు, రోమన్లు, బైజాంటైను గ్రీకులు, అరబ్బులు, టర్కులు, వివిధ ఉప-సహారా ఆఫ్రికన్లు, ఫ్రెంచి ప్రజలు, అల్జీరియా చరిత్రలో భాగంగా ఉన్నారు. అల్జీర్సు, ఇతర నగరాల జనాభాలో అండలూసియా శరణార్థుల వారసులు కూడా ఉన్నారు. అంతేకాకుండా 18 వ శతాబ్దం వరకు ఈ అరగోనీలు, కాస్టిలియా మొరిస్కో వారసులు స్పానిషు మాట్లాడేవారు. గ్రిషలు ఎల్- ఔడు అనే చిన్న పట్టణంలో నివసిస్తున్న కాటలాన్ మోరిస్కో వారసులు కాటలాన్ మాట్లాడారు.

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
కొన్ని అల్జీరియా సాంప్రదాయ బట్టలు

అల్జీరియాలో బెర్బెరు సంస్కృతి, జాతి ఆధిపత్యం ఉన్నప్పటికీ 20 వ శతాబ్దంలో అరబ్ జాతీయవాదం పెరిగిన తరువాత అల్జీరియన్లలో ఎక్కువమందిని అరబిక్కులుగా గుర్తిస్తున్నారు. బెర్బర్సు, బెర్బెర్ మాట్లాడే అల్జీరియన్లు వివిధ భాషాసమూహాలుగా విభజించబడ్డారు. అల్జీర్సుకు తూర్పున కబీలీ ప్రాంతం, ఈశాన్య అల్జీరియాలోని చౌయి, దక్షిణ ఎడారిలోని టువరెగ్సు, ఉత్తర అల్జీరియాలోని షెన్వా ప్రజలు వీటిలో అతి పెద్ద సమూహాలుగా ఉన్నారు.[page needed]

వలసరాజ్యాల కాలంలో అధికశాతంలో (1960 లో 10%)

ఐరోపా జనాభా ఉంది. వీరు పైడ్-నోయిర్సు అని పిలువబడ్డారు. వారు ప్రధానంగా ఫ్రెంచి, స్పానిషు, ఇటాలియను మూలాలు ఉన్నాయి. ఈ జనాభాలో దాదాపు అందరూ స్వాతంత్ర్య యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇక్కడే మిగిలిపోయారు.

భాషలు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Signs in the University of Tizi Ouzou in three languages: Arabic, Berber, and French

ఆధునిక అరబికు, బర్బరు భాషలు అధికారిక భాషలు. అల్జీరియా అరబిక్ (దర్జా)భాషను ప్రజలలో ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. సంభాషణకు అవసరమైన పదాలను అల్జీరియా అరబిక్, ఫ్రెంచి బెర్బెరు నుండి పదాలను రుణంగా తీసుకుంటుంది.

2002 మే 8 న రాజ్యాంగ సవరణ ద్వారా బెర్బరును "జాతీయ భాష"గా గుర్తించారు. కబిలీలోని కొన్ని భాగాలలో పాక్షికంగా సహ-అధికారిక (కొన్ని పరిమితులతో) బెర్బెరు భాష కంటే పూర్వం నుండి వాడుకలో ఉన్న కబైలు భాషా మాధ్యమంలో బోధించబడుతోంది. 2016 ఫిబ్రవరిలో అల్జీరియా రాజ్యాంగం అరబికుతో బెర్బరును అధికారిక భాషగా తీర్చిదిద్దే తీర్మానాన్ని ఆమోదించింది.

ఫ్రెంచికి అధికారిక హోదా లేనప్పటికీ మాట్లాడేవారి సంఖ్యాపరంగా అల్జీరియా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఫ్రాంకోఫోన్ దేశంగా ఉంది. ఫ్రెంచి, ప్రభుత్వం, మాధ్యమం (వార్తాపత్రికలు, రేడియో, స్థానిక టెలివిజన్), విద్యా వ్యవస్థ రెండింటిలోనూ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ప్రాథమిక పాఠశాల నుండి). అల్జీరియా వలస చరిత్ర కారణంగా విద్యాసంస్థలు దీనిని అల్జీరియా భాషా భాషగా పరిగణిస్తున్నాయని భావిస్తున్నారు. 2008 లో 11.2 మిలియన్ల అల్జీరియన్లు ఫ్రెంచి భాషలో చదవగలరు, వ్రాయగలరు. 2000 ఏప్రెలులో ఒక అబాస్సా ఇన్స్టిట్యూటు అధ్యయనం ఆధారంగా 60% కుటుంబాలు ఫ్రెంచ్ మాట్లాడగలవు, అర్థం చేసుకోగలవు లేదా 30 మిలియన్ల జనాభాలో 18 మిలియన్లు. స్వతంత్రం తరువాత అల్జీరియా ప్రభుత్వం ఫ్రెంచును తొలగించటానికి ప్రయత్నించింది (అందుకే దీనికి అధికారిక హోదా లేదు), ఇటీవలి దశాబ్దాలలో ప్రభుత్వం ఫ్రెంచి టెలివిజన్ కార్యక్రమాల అధ్యయనాన్ని వెనక్కి నెట్టింది.

1962 తరువాత అల్జీరియా ద్విభాషా రాజ్యంగా ఉద్భవించింది. సంభాషణ కొరకు అల్జీరియా అరబికు భాషను జనాభాలో 72%, బెర్బెరు భాషను 27-30% మాట్లాడతారు.

మతం

Religion in Algeria, 2010 (Pew Research)
Religion Percent
Islam
  
97.9%
Unaffiliated
  
1.8%
Christianity
  
0.2%
Judaism
  
0.1%

అల్జీరియాలో ఇస్లాం ప్రధానమైన మతంగా ఉంది. దాని అనుచరులు అధికంగా సున్నీలుగా ఉన్నారు. 2012 సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్, 2010 లో ప్యూ రీసెర్చ్ ప్రకారం 97.9% జనాభాలో 99% ఉన్నారు. ఘర్దైయా ప్రాంతంలో మజాబు లోయలో సుమారు 150,000 ఇబాడీలు ఉన్నారు.

అల్జీరియా ముస్లిం ప్రపంచానికి ఎమిర్ అబ్దేల్కాడర్, అబ్దేల్హామిడ్ బెన్ బాడిస్, మౌలౌద్ కాసెం నాట్ బెల్కాసెం, మాలెక్ బెన్నాబి, మొహమ్మద్ అర్కౌన్లతో సహా పలువురు ప్రముఖ ఆలోచనాపరులను ఇచ్చింది.

సంస్కృతి

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Algerian musicians in Tlemcen, Ottoman Algeria. Painting by Bachir Yellès

ఆధునిక అల్జీరియా సాహిత్యానికి అరబికు, టామాజైటు, ఫ్రెంచి భాషలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. సాహిత్యాన్ని ఇటీవలి చరిత్ర తీవ్రంగా ప్రభావితం చేసింది. 20 వ శతాబ్దానికి చెందిన నవలా రచయితలలో మొహమ్మదు డిబ్, ఆల్బర్ట్ కాముస్, కటేబ్ యాసిన్, అహ్లాం మోస్టెఘేనిమి ప్రాబల్యత సంతరించుకున్నారు. అస్సియా డిజెబర్ రచనలు విస్తృతంగా అనువదించబడ్డారు. 1980 లలోని ముఖ్యమైన నవలా రచయితలలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాచిద్ మిమౌని, తహార్ జజౌట్ లౌకికవాద అభిప్రాయాలను వ్యతిరేకించిన ఇస్లామిక్ సమూహం 1993 లో వారిని హత్య చేసింది.

మాలెక్ బెన్నాబి, ఫ్రాంట్జ్ ఫనాన్ డీకాలనైజేషన్ మీద వారి ఆలోచనల కారణంగా ప్రసిద్ధి చెందారు; హిప్పో అగస్టిను టాగస్టే (ఆధునిక సూక్ అహ్రాస్) లో జన్మించాడు; ట్యూనిసులో జన్మించిన ఇబ్న్ ఖల్దున్ అల్జీరియాలో నివసించిన సమయంలో ముకాద్దిమా రాశారు. వలసరాజ్యానికి పూర్వం సానుసి కుటుంబం, వలసరాజ్యాల కాలంలో ఎమిర్ అబ్దేల్కాడర్, షేక్ బెన్ బాడిస్ రచనలు విస్తృతంగా గుర్తించబడ్డాయి. లాటిన్ రచయిత అపులేయస్ మదారసులో జన్మించి తరువాత అల్జీరియానుగా మారాడు.

సమకాలీన అల్జీరియా సినిమా కళా ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. సమస్యలను అన్వేషిస్తూ విస్తృతమైన ఇతివృత్తాలతో చలనచిత్రాలు నిర్మించబడ్డాయి. స్వాతంత్ర్య యుద్ధం మీద దృష్టి సారించిన సినిమాల నుండి అల్జీరియన్ల దైనందిన జీవితాలకు సంబంధించిన సినిమాల ఇతివృత్తాల చిత్రీకరణ మీద దృష్టిసారించేలా మార్పు చెందింది.

కళలు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Mohammed Racim was a painter and founder of the Algerian school of miniature painting

అల్జీరియా చిత్రకారులు మొహమ్మదు రాసిం, భయా వంటివారు ఫ్రెంచి వలసరాజ్యానికి ముందు ఉన్న ప్రతిష్ఠాత్మక అల్జీరియా గతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో వారు అల్జీరియా ప్రామాణికమైన విలువలను పరిరక్షించడానికి సహాయపడ్డారు. ఈ వరుసలో మొహమ్మదు తేమాం, అబ్దేల్ఖదరు హౌమెలు కూడా చిత్రకళాభివృద్ధికి తోడ్పాటు అందించారు. దేశ చరిత్రలోని దృశ్యాలు, గత అలవాట్లు, ఆచారాలు, దేశ జీవితం వారికి ప్రధానకళాశం అయ్యాయి. అల్జీరియా చిత్రకళా రంగంలో ఎం.హమేదు ఇస్సియాఖెం, మొహమ్మదు ఖడ్డా, బచిరు యెల్లెసు సహా ఇతర కొత్త కళాకారులు వెలుగులోకి వచ్చారు. వీరు శాస్త్రీయ చిత్రలేఖనాన్ని వదిలి దేశంలోని తమచిత్రాలను నూతన వాస్తవికతకు అనుగుణంగా మార్చడానికి, నూతన చిత్రశైలిని కనుగొన్నారు. మొహమ్మద్ ఖడ్డా మహ్మదు ఇసియాఖేం ఇటీవలి సంవత్సరాలలో గుర్తింపు పొందారు.

సాహత్యం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Ahlam Mosteghanemi, the most widely read woman writer in the Arab world.

అల్జీరియా సాహిత్యం చారిత్రాత్మక మూలాలు న్యూమూడియా, రోమను ఆఫ్రికాయుగానికి తిరిగి వెళ్తడానికి ప్రయత్నించాయి. అపులేయసు రచించిన " ది గోల్డెను యాస్ " సజీవంగా ఏకైక లాటిన్ నవలగా గుర్తించబడుతుంది. ఈ కాలంలో అగస్టిను (హిప్పో), నోనియస్ మార్సెల్లస్, మార్టియనస్ కాపెల్లా వంటి గుర్తింపు పొందిన రచయితలు ఉన్నారు. మధ్య యుగాలలో అరబ్బు ప్రపంచ సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు చేసిన గుర్తింపు పొందిన అరబిక్కు రచయితలు ఉన్నారు. అహ్మద్ అల్-బుని, ఇబ్న్ మంజూరు, ఇబ్ను ఖల్డౌను వంటి రచయితలు అల్జీరియాలో ఉన్నసమయంల్ఫ్ ముకాద్దిమా రాశారు. అల్జీరియాలో ఇంకా చాలా మంది గుర్తింపు పొందిన రచయితలు ఉన్నారు.

ఫ్రెంచ్ పైడ్-నోయిర్ రచయిత ఆల్బర్టు కాముస్ అల్జీరియాలో జన్మించాడు. 1957 లో ఆయనకు సాహిత్యంలో నోబెలు బహుమతి లభించింది.

అపులియసు
కటేబు యాసిను

ఈ రోజు అల్జీరియా తన సాహిత్యంలో అల్జీరియా సాహిత్య రచయితలే కాక అరబికు ఫ్రెంచి భాషలలో సార్వత్రిక సాహిత్య వారసత్వాన్ని కలిగిన రచయితలు కూడా ఉన్నారు.

మొదటి దశగా అల్జీరియా సాహిత్యం అల్జీరియా జాతీయ వాదన, దేశంలోని ఆందోళన మీద దృష్టిసారించారు. మొహమ్మద్ డిబ్ " అల్జీరియన్ ట్రియాలజీ " పేరున్న ప్రచురణా సంస్థ నవలారచనను చేపట్టింది. కటేబు యాసిను వ్రాసిన నవల నెడ్జ్మా వంటి నవల చాలాప్రాచుర్యం పొందింది. అల్జీరియా సాహిత్యభివృద్ధికి సహకరించిన ఇతర ప్రసిద్ధ రచయితలలో మౌలౌడ్ ఫెరాన్, మాలెక్ బెన్నాబి, మాలెక్ హడ్డాడ్, మౌఫ్ది జకారియా, అబ్దేల్హమిదు బెన్ బాడిసు, మొహమ్మదు లాద్ అల్-ఖలీఫా, మౌలౌదు మమ్మెరి, ఫ్రాంట్జ్ ఫనాను, అస్సియా జెబారు ఉన్నారు.

స్వాతంత్ర్యం తరువాత అల్జీరియా సాహిత్య రంగంలో అనేక మంది కొత్త రచయితలు ఉద్భవించారు. వారు వారి రచనల ద్వారా అనేక సామాజిక సమస్యలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించిన వారిలో రాచిదు బౌద్జేద్రా, రాచిడ్ మిమౌని, లీలా సెబ్బారు, తహారు జాజౌటు, తాహిరు వత్తారు ఉన్నారు.

ప్రస్తుతం అల్జీరియా రచయితలలో కొంత భాగం 1990 లలో సంభవించిన ఉగ్రవాదాన్ని దిగ్భ్రాంతికరంగా సాహిత్యం రూపంలో నిర్వచించారు. ఇతర పార్టీ విభిన్న శైలి సాహిత్యరూపంలో మానవ సాహసం, ప్రత్యేకమైన భావనను ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో " స్వాలోస్ ఆఫ్ కాబూల్ ", ది అటాక్ (యస్మినా ఖాద్రా) దాడి, ది ఓట్ ఆఫ్ బార్బేరియంసు (బౌలేం సంసాలు), మెమరీ ఆఫ్ ఫ్లెష్ (అహ్లాం మోస్టెఘనేమి), " నో వేర్ ఇన్ మై ఫాదర్సు హౌస్ " (అస్సియా డిజెబరు)ప్రఖ్యాతి సంతరించుకున్నారు.

సంగీతం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
El Hadj M'Hamed El Anka

అల్జీరియా సంగీతంలో అరబిక్ మాండలికంలో రచించబడిన ఖాసిడేటు (ప్రసిద్ధ కవితలు) ఉంటాయి. ఈ సంగీతంలో " మాస్టర్ ఎల్ హడ్జ్ ఎం'హమేడ్ ఎల్ అంకా " తిరుగులేని పేరుగడించాడు. సంగీతకారుడు మొహమ్మదు తహారు ఫెర్గాని కాన్సుస్టాంటినోయిసు మలోఫ్ శైలిని సంరక్షించాడు.

జానపద సంగీత శైలి సంగీతంలో బెడౌయిను సంగీతం, పొడవైన కాసిడా (కవితలు) కవితా పాటల ఆధిక్యత కలిగి ఉంటాయి. కబైలు సంగీతం, కవిత్వం, పాత కథలు తరతరాలుగా గొప్ప కచేరీలలో ప్రదర్శించబడతాయి. షావియా సంగీతం విభిన్న పర్వతప్రాంతాల నుండి వచ్చిన జానపద కథ. ఆరేసులో రహబా సంగీత శైలి ప్రత్యేకతసంతరించుకుంది. సౌద్ మాస్సీ అల్జీరియా జానపద గాయకుడు పేరుతెచ్చుకుంటున్నాడు. ఇతర అల్జీరియా గాయకులలో జర్మనీలోని మానెల్ ఫిలాలి, ఫ్రాన్స్‌లోని కెంజా ఫరా ఉన్నారు. టెర్గుయి సంగీతం సాధారణంగా టువరెగు భాషలలో పాడతారు. ఇందులో టినారివెను ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించాడు. చివరగా సాటిఫులో స్టెఫీ సంగీతం జన్మించింది. ఇది ప్రత్యేకమైన శైలిగా మిగిలిపోయింది.

ఆధునిక సంగీతం అనేక కోణాలలో లభిస్తుంది. పశ్చిమ అల్జీరియాలో విలక్షణమైన రాసు సంగీతంగా ప్రసిద్ధి చెందింది. అల్జీరియాలో ఇటీవలి శైలిగా రాపు గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది.

చలనచిత్రాలు

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
Italian-Algerian film The Battle of Algiers (1966) won the Golden Lion at the 27th Venice International Film Festival.

చలనచిత్ర-పరిశ్రమ కార్యకలాపాల మీద అల్జీరియా ప్రభుత్వ ఆసక్తి చూపిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమలుచేసిన ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పునరుద్ధరించే కార్యక్రమ ప్రణాళికకు వార్షిక ఆర్థికప్రణాళికలో DZD 200 మిలియన్ల (యూరో 1.8)కేటాయించింది.

ఫండ్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ఆర్ట్స్, టెక్నిక్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ (ఎఫ్‌డాటిక్), అల్జీరియన్ ఏజెన్సీ ఫర్ కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం జాతీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2007 - 2013 మధ్య, ఎఫ్.డి.ఎ.టి.ఐ.సి. 98 చిత్రాలకు (చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు) సబ్సిడీ ఇచ్చింది. 2013 మధ్యలో 42 చలనచిత్రాలు, 6 లఘు చిత్రాలు, 30 డాక్యుమెంటరీలతో సహా మొత్తం 78 చిత్రాలకు ఎ.ఎ.ఆర్.సి. ఇప్పటికే మద్దతు ఇచ్చింది.

యూరోపియన్ ఆడియోవిజువల్ అబ్జర్వేటరీ ల్యూమియరీ డేటాబేస్ ఆధారంగా 1996 - 2013 మధ్య ఐరోపాలో 41 అల్జీరియా చిత్రాలు పంపిణీ చేయబడ్డాయి; అల్జీరియన్-ఫ్రెంచ్ సహ నిర్మాణాల విధానంలో 21 సినిమాలు. డేస్ ఆఫ్ గ్లోరీ (2006), ఔట్‌సైడ్ ది లా (2010) ఐరోపాసమాఖ్యలో అత్యధికంగా 3,172,612 - 474,722 సందర్శకులనును నమోదు చేశాయి.

అల్జీరియా క్రానికల్ ఆఫ్ ది ఇయర్స్ ఆఫ్ ఫైర్ (1975) చిత్రం పామ్ డి'ఆర్ అవార్డును, జెడ్ (1969) చిత్రం రెండు ఆస్కార్ అవార్డులను, ఇటాలియన్-అల్జీరియన్ చిత్రం ది బాటిల్ ఆఫ్ అల్జీర్స్ చిత్రం ఇతర అవార్డులను గెలుచుకుంది.

క్రీడలు

పురాతన కాలం నుండి అల్జీరియాలో వివిధ క్రీడలు వాడుకలో ఉన్నాయి. ఆరేసులో ప్రజలు ఎల్ ఖెర్బా లేదా ఎల్ ఖెర్గుబా (వైవిధ్యమైన చదరంగం) వంటి అనేక ఆటలను ఆడారు. కార్డులు, చెక్కర్సు, చదరంగం ఆటలను ఆడటం అల్జీరియన్ సంస్కృతిలో భాగంగా ఉంటుంది. రేసింగు (ఫాంటాసియా), తుపాలితో కాల్చడం అల్జీరియన్ల సాంస్కృతిక వినోదంలో భాగంగా ఉంటాయి.


1928 లో మారథాన్‌లో ఆమ్స్టర్డాం ఒలింపిక్స్లోస్వర్ణపతకం సాధించి బౌగెరా ఎల్ ఓవాఫీ మొట్టమొదటి అల్జీరియా, ఆఫ్రికా స్వర్ణపతక విజేతగా గుర్తించబడ్డాడు. 1956 మెల్బోర్నులో జరిగిన వేసవి ఒలింపిక్సులో అలైన్ మిమౌన్ పతకం సాధించి రెండవ అల్జీరియా పతక విజేతగా గుర్తించబడ్డాడు. 1990 లలో అనేక మంది పురుషులు, మహిళలు అథ్లెటిక్సులో ఛాంపియన్లుగా ఉన్నారు. వీరిలో నౌరెడిన్ మోర్సెలి, హసిబా బౌల్మెర్కా, నౌరియా మేరా-బెనిడా, తౌఫిక్ మఖ్లౌఫీ ఉన్నారు. వీరంతా మధ్య-దూర పరుగులో నైపుణ్యం కలిగి ఉన్నారు.

అల్జీరియాలో ఫుట్బాల్ క్రీడ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో లఖ్దార్ బెల్లౌమి, రాచిదు మేఖ్లౌఫీ, హాసెను లాల్మాసు, రబా మాడ్జరు, సలా అస్సాదు, జమెల్ జిదానేతో వంటి పలువురి క్రీడాకారుల పేరు నమోదైంది. అల్జీరియా జాతీయ ఫుట్బాల్ జట్టు 1982 ఫిఫా ప్రపంచ కప్పు, 1986 ఫిఫా ప్రపంచ కప్పు, 2010 ఫిఫా ప్రపంచ కప్పు, 2014 ఫిఫా ప్రపంచ కప్‌పుకు అర్హత సాధించింది. అదనంగా ఇ.ఎస్. సెటిఫు క్లబ్బు, జె.ఎస్. కబిలియా క్లబ్బు వంటి పలు ఫుట్బాల్ క్లబ్బులు ఖండాంతర, అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకున్నాయి. అల్జీరియా ఫుట్బాల్ సమాఖ్య, అల్జీరియా ఫుట్బాల్ క్లబ్బుల సంఘం అల్జీరియా జాతీయ ఫుట్బాల్ జట్టును ఎంపికచేసి జాతీయ పోటీలు, అంతర్జాతీయ మ్యాచులను నిర్వహిస్తుంది.

ఆహారం

అల్జీరియా: శబ్ద ఉత్పత్తి, చరిత్ర, భౌగోళిక స్వరూపము 
A Couscous-based salad

అల్జీరియా వంటకాలు విభిన్నమైనవి. దేశాన్ని "రోం ధాన్యాగారం"గా పరిగణించారు. ఇది ప్రాంతాలు, రుతువుల ఆధారంగా దేశంలో వైవిధ్యమైన వంటకాలు ప్రాధాన్యం వహిస్తున్నాయి. వంటకాలలో తృణధాన్యాలు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. తృణధాన్యాలు లేని వంటకం ఉండదు.

కాలానుగుణ కూరగాయల అల్జీరియా వంటకాలు ప్రాంతం నుండి ప్రాంతానికి వైవిధ్యంగా ఉంటాయి. మాంసం, చేపలు, కూరగాయలను ఉపయోగించి ఆహారాలను తయారు చేస్తారు. అల్జీరియా వంటకాలలో కౌస్కాసు, చోర్బా, రెచ్తా, చఖ్చౌఖా, బెర్కౌకెసు, షక్షౌకా, మ్థెవెం, చిత్తా, మర్డెల్, డోల్మా, బ్రిక్ (బౌరెక్), గారంటిటా, లాం'హౌ, మొదలైనవి ప్రజాదరణ కలిగి ఉన్నాయి. అల్జీరియాలో మెర్గెజు సాసేజు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. కానీ ప్రాంతాల వారీగా జోడించిన సుగంధ ద్రవ్యాల మీద ఆధారపడి వైవిధ్యంగా ఉంటాయి.

అజ్లీరియాలో విక్రయించబడే కేకులు అల్జీరియా, ఐరోపా, ఉత్తర అమెరికాలోని నగరాలలో కూడా ఉంటాయి. అయినప్పటికీ ప్రతి కుటుంబానికీ వారికే ప్రత్యేకమైన అలవాట్లు, ఆచారాలు అనుసరించి సాంప్రదాయ కేకులు ఇంట్లో కూడా తయారు చేస్తారు. ఈ కేకులలో తమీనా, బక్లావా, క్రిక్, గార్ను లాగ్జెల్లెసు, గ్రియోచి, కల్బు ఎల్-లూజ్, మాక్రౌడు, ఎంబార్డ్జా, మ్చెక్, సామ్సా, తారక్, బాఘ్రిరు, ఖ్ఫాఫ్, జ్లాబియా, ఆరాయెక్, ఘ్రౌబియా, ఎమ్ఘర్గెట్టే ఉన్నాయి. అల్జీరియా పేస్ట్రీలో ట్యునీషియా, ఫ్రెంచి కేకులు కూడా ఉన్నాయి. మార్కెటు చేయబడుతున్న, ఇంట్లో తయారుచేసిన రొట్టె ఉత్పత్తులలో కెస్రా లేదా ఖ్మిరా లేదా హర్చాయ, చాప్ స్టిక్లు, ఖౌబ్జ్ దారు, మాట్లౌ వంటి రకాలు ఉన్నాయి. వీధి ఆహారంగా తరచుగా విక్రయించే ఇతర సాంప్రదాయ భోజనాలలో మద్జేబ్ లేదా మహాజౌబా, కరాంటికా, డిబారా, చఖ్చౌఖా, హసౌనా, టిచిచా ఉన్నాయి.

మూలాలు

Tags:

అల్జీరియా శబ్ద ఉత్పత్తిఅల్జీరియా చరిత్రఅల్జీరియా భౌగోళిక స్వరూపముఅల్జీరియా నిర్వహణా విభాగాలుఅల్జీరియా ఆర్ధికంఅల్జీరియా గణాంకాలుఅల్జీరియా సంస్కృతిఅల్జీరియా మూలాలుఅల్జీరియాఅరబీఆఫ్రికాట్యునీషియానైజీరియామొరాకోమౌరిటానియలిబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

సౌందర్యనరసింహ శతకముఉమ్మెత్తమదర్ థెరీసానన్నయ్యఇందిరా గాంధీరాజీవ్ గాంధీరావు గోపాలరావుఅన్నమయ్యతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాగుంటకలగరకుటుంబంఒంటెLపిబరే రామరసంమకరరాశిఆల్బర్ట్ ఐన్‌స్టీన్గ్రామ పంచాయతీశ్రీరామదాసు (సినిమా)మహాభారతంచెక్ (2021 సినిమా)ఋగ్వేదంమృణాల్ ఠాకూర్ఇస్లాం మతంనాగులపల్లి ధనలక్ష్మివ్యాసుడుటాన్సిల్స్సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)ఎస్. ఎస్. రాజమౌళితొలిప్రేమమీనానక్షత్రం (జ్యోతిషం)వృశ్చిక రాశికన్యారాశికిలారి ఆనంద్ పాల్పురాణాలువై.యస్.భారతియోగాసనాలుమిషన్ భగీరథవంగవీటి రంగాభాగ్యశ్రీ బోర్సేఅమరావతి స్తూపంఅదితి శంకర్కాట ఆమ్రపాలిశుక్రుడు జ్యోతిషంపి.సుశీలసామజవరగమనజొన్నరావి చెట్టుశ్రీరామ పట్టాభిషేకంన్యుమోనియామూలా నక్షత్రంశివ పురాణంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకనకదుర్గ ఆలయంశ్రీరంగనీతులు (సినిమా)బాలగంగాధర తిలక్ఆంధ్రప్రదేశ్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఅంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవంధర్మరాజుఆది పర్వముఅరణ్యకాండతిక్కనశ్రీవిష్ణు (నటుడు)శివ ధనుస్సుహనుమాన్ చాలీసాచాకలిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురోజా సెల్వమణిరుహానీ శర్మశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లితమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో సెక్యులరిజంజన సాంద్రతపరశురాముడు🡆 More