పక్షి

పక్షులు (ఆంగ్లం Birds) రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.

పక్షులు
కాల విస్తరణ: జురాసిక్ యుగం ఆఖరు - ప్రస్తుతము
పక్షి
Superb Fairy-wren, Malurus cyaneus, juvenile
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
పక్షులు

క్రమాలు

సుమారు రెండు డజన్లు - క్రింద విభాగము చూడండి.

సామాన్య లక్షణాలు

  • పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.
  • ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
పక్షి 
External anatomy of a bird: 1 Beak, 2 Head, 3 Iris, 4 Pupil, 5 Mantle, 6 Lesser coverts, 7 Scapulars, 8 Median coverts, 9 Tertials, 10 Rump, 11 Primaries, 12 Vent, 13 Thigh, 14 Tibio-tarsal articulation, 15 Tarsus, 16 Feet, 17 Tibia, 18 Belly, 19 Flanks, 20 Breast, 21 Throat, 22 Wattle
  • శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
  • వీటిలో ఒకే ఒక గ్రంథి (తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
  • పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
  • కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.
  • ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది.
  • నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
  • ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
  • మూత్రపిండాలు అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్థం.

ఆర్ధిక ప్రాముఖ్యత

  • పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి కోడి, కోడి గుడ్లు. ఇవే కాకుండా బాతు, టర్కీ కోడి, ఈము మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు, దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.
  • పక్షుల ఈకలు దుస్తులు, పరుపులు తయారుచేయడంలో, కొన్ని రకాల ఎరువుల తయారీలో ఉపయోగపడతాయి.
  • చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.
  • కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.
  • జంతువులలో ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.

పక్షులకు సంబందించిన పదాలు

  • ఆకుపక్షి
  • అపశకున పక్షి
  • పక్షి తీర్థము

పక్షుల విశేషాలు

  • అతి పెద్ద పక్షి: నిప్పుకోడి
  • అతి చిన్న పక్షి: హమ్మింగ్ బర్డ్
  • అతి వేగంగా ఎగర గల పక్షి-స్విఫ్ట్
  • వెనక్కి కూడా ఎగరగలిగే ఒకే ఒక పక్షి హమ్మింగ్ బర్డ్
  • మనిషి మాటలను అనుకరించి పలుక గలిగిన పక్షులు: 1. చిలుక, 2. మైనా
  • వేటకుపయోగ పడే పక్షి. = డేగ

పక్షులలో వర్గాలు

  • నీటిలో వుండగలిగినవి = నీటి పక్షులు 1. నీటి కోడి, 2.బాతు. 3. హంస, 4. నీటికాకి
  • వలస పక్షులు = నిర్ణీత కాలంలో సుదూరంలో వున్న దేశాలకు వలస పోయి తిరిగి వచ్చే పక్షులు
  • నిశాచర పక్షులు: (రాత్రి వేళలందు మాత్రమే తిరుగునవి)= 1. గుడ్లగూబ2. పైడిగంట,
  • దేవతా పక్షి: గండబేరుండము లేదా గండబేరుండపక్షి

వర్గీకరణ

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

మూలాలు

పక్షి 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

పక్షి సామాన్య లక్షణాలుపక్షి ఆర్ధిక ప్రాముఖ్యతపక్షి పక్షులకు సంబందించిన పదాలుపక్షి పక్షుల విశేషాలుపక్షి పక్షులలో వర్గాలుపక్షి వర్గీకరణపక్షి ఇవి కూడా చూడండిపక్షి చిత్రమాలికపక్షి మూలాలుపక్షి

🔥 Trending searches on Wiki తెలుగు:

స్మితా సబర్వాల్సెక్స్ (అయోమయ నివృత్తి)కలువసుమతీ శతకముదొమ్మరాజు గుకేష్శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంకురుక్షేత్ర సంగ్రామంచిత్త నక్షత్రమువిజయవాడఉపాధ్యాయుడుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసింహంతెలుగులో అనువాద సాహిత్యంనిర్వహణమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాపిఠాపురంఆర్టికల్ 370ముదిరాజ్ (కులం)ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఅల్లరి నరేష్కరక్కాయపోకిరిసాయి ధరమ్ తేజ్భారత ప్రధానమంత్రుల జాబితాకింజరాపు అచ్చెన్నాయుడుధర్మవరం శాసనసభ నియోజకవర్గంAభారత రాజ్యాంగ పీఠికకేశినేని శ్రీనివాస్ (నాని)కృతి శెట్టిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళికల్వకుంట్ల కవితసూర్య నమస్కారాలుఆరూరి రమేష్ఛత్రపతి శివాజీవిజయనగరంకె. అన్నామలైటంగుటూరి ప్రకాశంఉప రాష్ట్రపతిరైతుబంధు పథకంఉపద్రష్ట సునీతసుభాష్ చంద్రబోస్చెమటకాయలుదేవీఅభయంఅంగారకుడు (జ్యోతిషం)పొట్టి శ్రీరాములురమణ మహర్షిఅనూరాధ నక్షత్రంమహామృత్యుంజయ మంత్రంన్యుమోనియారోజా సెల్వమణిరామసహాయం సురేందర్ రెడ్డితెలుగు వ్యాకరణంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతీయ రిజర్వ్ బ్యాంక్శివమ్ దూబేనందిగం సురేష్ బాబువంగవీటి రంగావాట్స్‌యాప్భీష్ముడుభారతదేశంలో బ్రిటిషు పాలనఅరిస్టాటిల్రమ్య పసుపులేటిరాకేష్ మాస్టర్బంగారంకడప లోక్‌సభ నియోజకవర్గంరుతురాజ్ గైక్వాడ్దగ్గుబాటి పురంధేశ్వరిదువ్వాడ శ్రీనివాస్తెలుగు సినిమాసురేఖా వాణిలలితా సహస్ర నామములు- 1-100ధరిత్రి దినోత్సవంకడియం కావ్యతెలుగు పత్రికలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)టమాటోఆంధ్రప్రదేశ్ శాసనసభఇండియన్ ప్రీమియర్ లీగ్🡆 More