మానవుడు

మనిషి జీవితం గురించి ఒక చిన్న మాట : మనిషి తన జీవితం లో ఏదో సాదించలని చేస్తున్నా పరిశోధన లో ఒక మనిషిని మనిషిగా చూడటం మనెషాడు.

మనిషి లేదా మానవుడు హోమినిడే (పెద్ద ఏప్స్) కుటుంబములో హోమో సేపియన్స్ (లాటిన్లో "తెలివైన మనిషి" లేదా "తెలిసిన మనిషి") అనే క్షీరదాల స్పీసీసుకు చెందిన రెండు పాదాల మీద నడిచే ఏప్. భూగోళంపైనున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుష్యులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకము, ఆలోచన, భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉండడం వల్ల సాధ్యపడినాయి. దీనికి తోడు రెండు కాళ్ళపైన నిలబడగలిగే లక్షణం మానవులు అధికంగా పనిముట్లను వాడుకొని పురోగమించడానికి దోహదపడింది.డి.ఎన్.ఎ. ఆధారాల ప్రకారం మానవుల ఆవిర్భావం ఆఫ్రికాలో సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రస్తుతము అన్ని ఖండాల్లో ఉన్న మానవావాసాల ప్రకారం మానవ జాతి జనాభా దాదాపు 6.6 బిలియన్లు (2007 వరకు). ఇతర ప్రైమేట్‌ల వలె మనుషులు కూడా సహజసిద్ధంగా సంఘజీవులు. మానవులు భావ వ్యక్తీకరణ కొరకై సమాచార పద్ధతులను వాడడంలో అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు. మానవులు అతిక్లిష్టమైన సంఘంలో జీవిస్తారు. ఇలాంటి సంఘంలో కుటుంబాలు, సమూహాలు లేదా జాతుల మధ్య సహాయసహకారాలతో పాటు పోటీతత్వం కూడా అగుపిస్తుంది. మానవులలో సంప్రదాయాలు, మతాలు, నీతి నియమాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మానవులు అందంగా కనిపించడానికి కృషి చేయడంతో పాటూ కళ, సాహిత్యం, సంగీతం వంటి ఆవిష్కరణలు గావించారు. ,హిందూ మత సాహిత్యంలో పేర్కొనబడిన మనువు,బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన ఆదాము ఈ ఆధునిక మానవ జాతికి చెందినవారిగా చెప్పవచ్చు.

మానవుడు
కాల విస్తరణ: Pleistocene - Recent
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ప్రైమేట్స్
Family:
Genus:
Species:
సెపియన్స్
Subspecies:
హోమో సెపియన్స్
Trinomial name
హోమో సెపియన్స్ సెపియన్స్
మానవుడు
మానవుడు

చరిత్ర

పరిణామము

శాస్త్రీయపరంగా మానవ పరిణామము హోమో ప్రజాతితో ముడిపడి ఉంది. అయినా కొన్నిసార్లు హోమినిడ్‌లు, హోమినిన్‌ల అధ్యయనం కూడా చేస్తారు. ఆధునిక మానవుడు హోమో సేపియెన్స్గా నిర్వచించబడినాడు. ఈ జాతిలోనూ హోమో సేపియెన్స్ సేపియెన్స్ అనబడే ఉపజాతిగా ఇప్పటి మానవుడు వర్గీకరించబడ్డాడు. అదే జాతిలోని హోమో సేపియెన్స్ ఇడాల్టు (పెద్ద తెలివైన మనిషి అని అర్దం వస్తుంది) అనే ఉపజాతి అంతరించిపోయింది. ఆధునిక మానవుని శిలాజాలు ఆఫ్రికాలో 1,30,000 క్రితం నాటివి లభిస్తాయి.

బొనోబో లేదా పిగ్మీ చింపాంజీ (పాన్ పనిస్కస్), చింపాంజీ (పాన్ ట్రోగ్లోడైట్స్) అనబడే పాన్ ప్రజాతికి చెందిన ఈ రెండు జాతులు హోమో సేపియన్స్‌తో అతి దగ్గర సంబంధం కలిగి ప్రస్తుతము నివసిస్తున్న జాతులు. ఈ జాతులు పరిణామక్రమంలో ఒకే పూర్వీకుడిని కలిగి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సంఘజీవనంలో కనిపిస్తుంది: బొనోబోలు 'మాతృస్వామ్య' (కుటుంబ పెద్ద ఆడ జీవి) కాని చింపాంజీలు 'పితృస్వామ్య' (కుటుంబ పెద్ద మగ జీవి) పద్ధతులను పాటిస్తారు. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం చేయడం వల్ల మానవుని జీనోమ్, బొనోబో/చింపాంజీ జీనోమ్ మధ్య ఉన్న తేడా (దాదాపు 6.5 మిలియన్ సంవత్సరాల విడి పరిణాం తర్వాత), ఇద్దరు సంబంధంలేని వ్యక్తుల జీనోమ్‌లలో ఉన్న తేడా కన్నా కేవలం 10 రెట్లు ఎక్కువ,, ఎలుకలు, చుంచుల జీనోమ్‌ల మధ్య ఉన్న తేడా కన్నా 10 రెట్లు తక్కువ. నిజానికి 98.4% డి.ఎన్.ఎ. సీక్వెన్స్ మానవులు, ఈ రెండు పాన్ జాతులకు ఒకే రకమైనదిగా కనుగొనబడింది.

మానవ జాతులు

ఆధునిక మానవ జాతి ఆవిర్భవించక మునుపు లక్షల సంవత్సరాల క్రితమే చాలా మానవ జాతులు విరాజిల్లాయి. వాటిలో ముఖ్యమైనవి హోమో హాబిలిస్, హోమో ఎర్గాస్టర్, హోమో హైడెల్బెర్జెసిస్, హోమో యాంటిసిసర్, హోమో, హోమో నియాండర్తాలెంసిస్ మొదలైనవి.

మూలాలు

లంకెలు

https://www.duhoctrungquoc.vn/wiki/en/Human_evolution

Tags:

మానవుడు చరిత్రమానవుడు మానవ జాతులుమానవుడు మూలాలుమానవుడు లంకెలుమానవుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్వేపల్లి రాధాకృష్ణన్విక్రమ్రామావతారంజనసేన పార్టీకాట ఆమ్రపాలికరీనా కపూర్బొల్లిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుముదిరాజ్ (కులం)అనసూయ భరధ్వాజ్ఇంద్రజకాప్చాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసింధు లోయ నాగరికతసీ.ఎం.రమేష్ఇండియన్ ప్రీమియర్ లీగ్గరుడ పురాణంభీష్ముడుఇన్‌స్టాగ్రామ్సాయి ధరమ్ తేజ్పెరిక క్షత్రియులుసుడిగాలి సుధీర్బెల్లంబీబి నాంచారమ్మఆదిపురుష్సునయనసంస్కృతంఇండియన్ సివిల్ సర్వీసెస్విశ్వనాథ సత్యనారాయణమంతెన సత్యనారాయణ రాజుశివ ధనుస్సువిశ్వామిత్రుడుస్త్రీఅరుణాచలంఅర్జునుడుప్లీహముమఖ నక్షత్రముకులంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవంగవీటి రాధాకృష్ణ2019 భారత సార్వత్రిక ఎన్నికలుకల్వకుంట్ల చంద్రశేఖరరావునితిన్గౌతమ బుద్ధుడుభారత కేంద్ర మంత్రిమండలిఆవర్తన పట్టికసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్శ్రీరామకథభారత జాతీయగీతంఇంటి పేర్లుబ్రహ్మమొఘల్ సామ్రాజ్యందానంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థన్యుమోనియాదేవులపల్లి కృష్ణశాస్త్రిఐక్యరాజ్య సమితిఅభిరామిభారతదేశ చరిత్రరజాకార్లువై.ఎస్.వివేకానందరెడ్డిమహావీర్ జయంతి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసాయిపల్లవిరక్తంవల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయంకైకేయితామర వ్యాధిపూరీ జగన్నాథ దేవాలయంకృష్ణా నదిదశావతారములుమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంశ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థంనడుము నొప్పిఅనూరాధ నక్షత్రంపిత్తాశయముసత్యనారాయణ వ్రతంవల్లభనేని బాలశౌరికల్వకుంట్ల కవిత🡆 More