పర్యాయపదం

ఒక భాషలో ఒకే అర్థం గల రెండు పదాలను పర్యాయ పదాలు అంటారు.

ఉదాహరణకు వాన, వర్షం పర్యాయపదాలు. ఏవైనా రెండు పదాలను పర్యాయ పదాలు అనాలంటే, ఒక వాక్యంలో రెండు పదాలను ఒకదాని బదులు ఒకటి వాడినప్పుడు అర్థం మారకూడదు. ఈ ప్రతిపాదికన చూస్తే చాలా పదాలు ఏదో ఒక అర్థఛాయలోనే పర్యాయ పదాలుగా ఉంటాయి. ఉదాహరణకు భూగోళాన్ని గురించి చెప్పేటప్పుడు భూమీ, ధరిత్రి పర్యాయపదాలుగా ఉంటాయి. కానీ స్థలాన్ని గురించి మాట్లాడేటప్పుడు రెండెకరాల భూమి అన్నట్లు రెండెకరాల ధరిత్రి అని అనడం వ్యాకరణ సమ్మతం కాదు. అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది ఆని లేక చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది అన్న ఈ పదాల్లో చాలా సమయం, సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కాబట్టి ఒక పదానికి మరొక పదం పర్యాయపదం అని చెప్పవచ్చు. కానీ కాలం చేసారు అనడానికి సమయం చేసారు అనే వాడుక లేదు.

పర్యాయపదం
Synonym list in cuneiform on a clay tablet, Neo-Assyrian period.

పూర్తిగా పర్యాయపదాలైన రెండు పదాలు ఉండవని కొందరు నిపుణుల అభిప్రాయం. వ్యుత్పత్తీ, అక్షర లక్షణాలూ, వాడే సందర్భాలూ, సూచించే భావాలూ వంటి రకరకాల కారణాల వల్ల ప్రతీ పదం పత్యేక అర్థాన్ని కలిగి ఉంటుందని వారి ఉద్దేశం. చాలా పర్యాయ పదాలను వాడే సందర్భాలు వేరు అయ్యి ఉంటాయి. ఉదాహరణకు నిలిపివేయడం అనేది ఆపివేయడంతో పోల్చితే మరింత నియత పదంగా చూడబడుతుంది. భూమి, ధరిత్రి అనే పదాలు మన్ని అర్థఛాయల్లోనూ పర్యాయపదాలుగా సరిపోవు. ఇక పర్యాయ పదాలు సభ్యోక్తులుగా కూడా వాడబడుతుంటాయి.

కొన్ని సందర్భాలలో అన్యాపదేశ పదాలు పర్యాయ పదాలుగా మారతాయి. ఉదాహరణకు సింహాసనానికి విధేయుడను, రాజుకు విధేయుడను అనే రెండు వాక్యాల్లో సింహాసనం, రాజు పర్యాయ పదాలుగా మారాయి.

వెంకటేశ్వరస్వామిని శ్రీనివాసుడు, బాలాజీ, తిరుమలేశుడు, వెంకటాద్రీశుడు, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నామాలన్నింటిని పర్యాయపదాలుగా చెప్పవచ్చు.

పుట్టుక

పర్యాయపదాల పుట్టుకకు చాలా కారణాలు ఉంటాయి. రెండు భాషలు కలిసి ఒక భాషగా ఏర్పడినప్పుడు ఆ మునుపటి భాషల్లోని పదాలు కొత్త భాషలో మిగిలిపోవడం ఒక కారణం. ఉదాహరణకు ఆధునిక ఆంగ్లం, పురాతన ఆంగ్లం, నొర్మన్ ఫ్రెన్చ్‌ల కలయికతో పుట్టిన భాష. కనుక రెండు భాషల పదాలూ ఇందులో కనబడతాయి. ఉదాహరణకు విలుగాడికి ఆంగ్లంలో ఫ్రెన్చ్ పదమైన ఆర్చర్ (archer), పాత ఆంగ్ల పదమైన బోమన్ (bowman) అనే రెండు పదాలున్నాయి.

ఒక భాషపై ఇతర భాషల ప్రభావం పర్యాయ పదాల పుట్టుకకు మరొక కారణం. తెలుగులో మత కార్యకలాపాలకు సంస్కృతం ఎక్కువగా వాడగా, వ్యవహారిక భాషలో దేశ్యాల వాడకం ఎక్కువ. ఉదాహరణకు పురాణేతిహాసాల్లోని యుద్ధాల వర్ణనలో శిరచ్ఛేదం అనే పదం వాడగా, సమకాలిక కక్షలూ, ముఠా గొడవలు వల్లెవేసేటప్పుడు తల నరుకుట అనే మాట ఎక్కువ వినబడుతుంది.

పర్యాయ పదాల తయారీకి ఇంకో కారణం అన్యదేశ్యాలు. తెలుగులో ఒక పగలూ, రాత్రిని సూచించేందుకు ఉర్దూ అన్యదేశ్యమైన రోజునూ, దేశ్యపదమైన నాడునూ వాడతారు. ఉదాహరణకు ఆరోజు, ఆనాడు. చాలా ఐరోపా భాషల్లో సాంకేతిక సందర్భాన్ని సూచించేందుకు లాటిను, గ్రీకు అన్యదేశ్యాలను వాడి, ఇతర సందర్భాల్లో ఆ సంబంధిత భాష దేశ్యాలను వాడుతుంటారు. ఇస్లామిక సంస్కృతుల్లో అరబీ, ఫార్సీ భాషల ప్రభావం స్థానిక భాషలపై ఉంటుంది.

ఇక పర్యాయ పదాలకు మరొక ముఖ్య కారణం పూనుకుని చేసిన కొత్త పదాల సృష్టి. ఉన్న పదాలకు కొత్త పదాలను సాధారణంగా మేలిమి భాషావాదులు సృష్టిస్తుంటారు. ఉదాహరణకు పుస్తకపు ముందుమాటను సూచించే ఆంగ్ల పదం ప్రెఫిస్ (preface)కు రోమను వ్యుత్పత్తి ఉన్నందున, దానికి దీటుగా ఫోర్‌వార్డ్ (foreword) అనే ఆంగ్ల పదం తయారైంది. తెలుగులో ఇలాంటి ఒక ప్రయత్నం కనిపించే పుస్తకం బంగారు నాణేలు.

వాడుక

కొన్ని సందర్భాలలో పర్యాయ పదాలు అర్థఛాయలలోని సూక్ష్మమైన వ్యత్యాసాలను తెలియజేయగా, కొన్నిసార్లు అవి వాడబడే సందర్భాలు వేరేవి అయ్యి ఉంటాయి. ఉదాహరణకు మలవిసర్జనా అవయువముకు ముడ్డి, గుద్ద, మలద్వారం అను మూడు పర్యాయపదాలు ఉండగా, గుద్ద చాలాసార్లు బూతుగా, ముడ్డి వాడుక భాషలో పదంగా, మలద్వారం సభ్యోక్తిగా చెలామణీ అవుతున్నాయి.

కొన్ని సాంకేతిక రంగాలు పర్యాయ పదాలను వేర్వేరు సాంకేతిక అర్థాలకు పరిమితం చేయవచ్చు.

కొందరు రచయితలు ఒకే వాక్యంలో లేదా దగ్గరగా ఉన్న వాక్యాలలో ఒకే పదాన్ని వాడకుండా, పర్యాయ పదాలు వాడుతుంటారు.

భాషాభాగాలూ-పర్యాయపదాలూ

పర్యాయపదాలు అన్ని భాషాభాగాల్లోనూ ఉంటాయి.

నామవాచకాలు

క్రియలు

  • కొనుగోలు, క్రయం
  • అమ్మకం, విక్రయం

విశేషణాలు

  • పెద్ద, భారీ

క్రియా విశేషణాలు

  • వెంటనే, త్వరగా

విభక్తి ప్రత్యయము

  • పైన, మీద

నిఘంటువులు

పర్యాయపదాలు నిఘంటువులలో అర్థంతో పాటుగా ఉండవచ్చు. కేవలం పర్యాయపదాలు తెలియజేసే నిఘంటువులు కూడా ఉంటాయి. తెలుగులో ఉన్న నిఘంటువులు:

  • తెలుగు పర్యాయపద నిఘంటువు; ఆచార్య జి.యన్. రెడ్డి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మే 1998. ఆర్కైవ్ ప్రతి

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

పర్యాయపదం పుట్టుకపర్యాయపదం వాడుకపర్యాయపదం భాషాభాగాలూ-పర్యాయపదాలూపర్యాయపదం నిఘంటువులుపర్యాయపదం ఇవి కూడా చూడండిపర్యాయపదం మూలాలుపర్యాయపదంసమయం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముకర్మ సిద్ధాంతంభారత ఆర్ధిక వ్యవస్థరవితేజవడదెబ్బవిరాట పర్వము ప్రథమాశ్వాసములక్ష్మివెంట్రుకచంపకమాలభూమిహస్తప్రయోగంతెలుగు వ్యాకరణంసుందర కాండఉత్తరాభాద్ర నక్షత్రముఅక్కినేని అఖిల్బమ్మెర పోతననాగ్ అశ్విన్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాదగ్గుబాటి పురంధేశ్వరిరేవతి నక్షత్రంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాబుధుడు (జ్యోతిషం)అయోధ్యఆంధ్రప్రదేశ్ మండలాలుసాయి ధరమ్ తేజ్మొదటి పేజీహనుమాన్ చాలీసాకాకతీయుల శాసనాలులలితా సహస్ర నామములు- 1-100ఆల్ఫోన్సో మామిడిడి. కె. అరుణసురేఖా వాణిసద్గరు పూలాజీ బాబాఫేస్‌బుక్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్గురువు (జ్యోతిషం)సంతోష్ యాదవ్శివపురాణంతెలంగాణ ఉద్యమంచార్మినార్రాజీవ్ గాంధీశ్రీ కృష్ణుడుగొట్టిపాటి నరసయ్యముప్పవరపు వెంకయ్య నాయుడుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపరిసరాల పరిశుభ్రతనందమూరి బాలకృష్ణఎబిఎన్ ఆంధ్రజ్యోతిమంగ్లీ (సత్యవతి)జనసేన పార్టీభారత ఎన్నికల కమిషనుజవాహర్ లాల్ నెహ్రూఅక్కినేని నాగ చైతన్యమియా ఖలీఫాభారతీయ తపాలా వ్యవస్థపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)నారా లోకేశ్మేషరాశిభారతదేశంలో బ్రిటిషు పాలనఎమ్.ఎ. చిదంబరం స్టేడియంనాగార్జునసాగర్గుణింతంభారతదేశ ప్రధానమంత్రిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకేతిక శర్మస్టూడెంట్ నంబర్ 1రష్మి గౌతమ్అమ్మనువ్వు నేనుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంగోవిందుడు అందరివాడేలేమిథాలి రాజ్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాగోత్రాలు జాబితాగంగా నదివంగా గీత🡆 More