కాకసస్: యురేషియా లోని ప్రాంతం

 

కాకసస్
కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి
కాకసస్ ఉపరితల భౌగోళికం
Coordinates42°15′40″N 44°07′16″E / 42.26111°N 44.12111°E / 42.26111; 44.12111
దేశాలు
గుర్తింపు లేని, పాక్షిక గుర్తింపు ఉన్న దేశాలు
స్వాధికార గణతంత్రాలు, ఫెడరల్ ప్రాంతాలు
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Abkhazia
    (since 2008, in exile)
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Adjara
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Adygea
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Chechnya
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Dagestan
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Ingushetia
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Kabardino-Balkaria
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Kalmykia
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Karachay-Cherkessia
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Krasnodar Krai
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Nakhchivan
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి North Ossetia-Alania
  • కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి Stavropol Krai
DemonymCaucasian
Time ZonesUTC+02:00, UTC+03:00, UTC+03:30, UTC+04:00, UTC+04:30
ఎత్తైన పర్వతంఎల్‌బ్రస్ (5,642 metres (18,510 ft))

నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న ప్రాంతానికి కాకసస్ అని పేరు. దీన్ని కాకేసియా అని కూడా అంటారు. ప్రధానంగా ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, దక్షిణ రష్యాలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణితో సహా కాకసస్ పర్వతాలు చారిత్రికంగా తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య సహజ అవరోధంగా ఉంటాయి.

ఐరోపాలో కెల్లా ఎత్తైన పర్వతమైన రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం, పశ్చిమ కాకసస్‌లో ఉంది. దక్షిణం వైపున, లెస్సర్ కాకసస్‌లో జావఖేటి పీఠభూమి, అర్మేనియన్ మెరక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మెరక ప్రాంతాల్లో కొంత భాగం టర్కీలో ఉంది.

కాకసస్ ఉత్తర కాకసస్, దక్షిణ కాకసస్‌గా విభజించబడింది. అయితే పశ్చిమ కాకసస్ ఉత్తర కాకసస్‌లో ఒక ప్రత్యేక భౌగోళిక ప్రదేశంగా కూడా ఉంది. ఉత్తరాన ఉన్న గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణి ఎక్కువగా రష్యా, జార్జియా, అజర్‌బైజాన్‌లోని ఉత్తరాది భాగాల్లో విస్తరించి ఉంది. దక్షిణాన ఉన్న లెస్సర్ కాకసస్ పర్వత శ్రేణి అనేక స్వతంత్ర రాజ్యాల్లో విస్తరించి ఉంది. ఎక్కువగా ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, ఈశాన్య టర్కీ, ఉత్తర ఇరాన్, స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్‌సాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.

ఈ ప్రాంతం అక్కడి భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి: ఇండో-యూరోపియన్, టర్కిక్ భాషలను పక్కన పెడితే, కార్ట్‌వేలియన్, నార్త్‌వెస్ట్ కాకేసియన్, ఈశాన్య కాకేసియన్ భాషా కుటుంబాలు ఈ ప్రాంతానికి చెందినవి.

రాజకీయ భౌగోళికం

ఉత్తర కాకసస్ ప్రాంతాన్ని సిస్కాకాసస్ అని పిలుస్తారు. దక్షిణ కాకసస్ ప్రాంతాన్ని సాధారణంగా ట్రాన్స్‌కాకస్ అని పిలుస్తారు.

కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
కాకసస్ సమకాలీన రాజకీయ పటం

గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణిలో ఎక్కువ భాగం సిస్కాకాసస్‌లో ఉంది. ఇది దక్షిణ రష్యా లోని నార్త్ కాకేసియన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ లోని స్వయంప్రతిపత్త రిపబ్లిక్‌లు, జార్జియా, అజర్‌బైజాన్‌లోని ఉత్తర భాగాల్లో విస్తరించి ఉంది. సిస్కాకాసస్, పశ్చిమాన నల్ల సముద్రం, తూర్పున కాస్పియన్ సముద్రం, ఉత్తరాన సదరన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ మధ్య ఉంది. రెండు ఫెడరల్ జిల్లాలను సమిష్టిగా "సదరన్ రష్యా"గా సూచిస్తారు.

ట్రాన్స్‌కాకస్‌కు గ్రేటర్ కాకసస్ శ్రేణి, దాని ఉత్తరాన దక్షిణ రష్యా, పశ్చిమాన నల్ల సముద్రం, టర్కీ, తూర్పున కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇరాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో లెస్సర్ కాకసస్ పర్వత శ్రేణి, పరిసర లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆర్మేనియా, అజర్‌బైజాన్ (ఉత్తర భాగాలను మినహాయించి), జార్జియా (ఉత్తర భాగాలను మినహాయించి) దక్షిణ కాకసస్‌లో ఉన్నాయి.

గ్రేటర్ కాకసస్ శ్రేణిలో ఉన్న నదీలోయ ప్రాంతం యూరప్, నైరుతి ఆసియా మధ్య విభజన రేఖగా కొన్ని మూలాలు పరిగణిస్తాయి. దాని ప్రకారం, పశ్చిమ సిస్కాకాసస్‌లో ఉన్న ఎత్తైన శిఖరం, ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు) ఐరోపాలో ఎత్తైన ప్రదేశం. కుమా-మనీచ్ డిప్రెషన్, రష్యన్ మైదానాన్ని ఉత్తర కాకసస్ ఫోర్‌ల్యాండ్ నుండి విభజించే భౌగోళిక పల్లపు ప్రదేశాన్ని ఐరోపా, ఆసియాల మధ్య సహజమైన చారిత్రక సరిహద్దుగా సాంప్రదాయిక బ్రిటీష్-యేతర వర్గాలు పరిగణిస్తాయి. మరొక అభిప్రాయం ప్రకారం, కురా, రియోని నదులు ఈ సరిహద్దును సూచిస్తాయి లేదా అరాస్ నది కూడా ఈ హద్దును సూచిస్తుంది.

కాకసస్ భాషాపరంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా విభిన్న ప్రాంతం. ప్రస్తుతం కాకసస్‌లో సోవియట్ అనంతర దేశాలైన జార్జియా (అడ్జారా, అబ్ఖాజియాలతో సహా), అజర్‌బైజాన్ (నఖ్చివాన్‌తో సహా), ఆర్మేనియా, రష్యన్ ఫెడరేషన్‌లు ఉన్నాయి. రష్యన్ విభాగాలలో డాగేస్తాన్, చెచ్న్యా, ఇంగుషేటియా, నార్త్ ఒస్సేటియా-అలానియా, కాబర్డినో బల్కేరియా, కరాచే-చెర్కెస్సియా, అడిగేయా, క్రాస్నోడార్ క్రాయ్, స్టావ్రోపోల్ క్రాయ్‌లు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో మూడు భూభాగాలు స్వాతంత్య్రాన్ని కోరుతున్నాయి. కానీ వాటిని కొన్ని సంస్థలే గుర్తించాయి. అవి అర్ట్సాఖ్, అబ్ఖాజియా, దక్షిణ ఒస్సేటియా. అబ్ఖాజియా, దక్షిణ ఒస్సేటియాలు జార్జియాలో భాగంగా ప్రపంచ సమాజం గుర్తిస్తోంది. అర్ట్సాఖ్‌ను అజర్‌బైజాన్‌లో భాగంగా గుర్తిస్తోంది .

దక్షిణ కాకేసియన్ దేశాల గణాంకాలు

ఆర్మేనియా అజర్‌బైజాన్ జార్జియా మొత్తం
కోట్ ఆఫ్ ఆర్మ్స్ కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
జెండా కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి < కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
రాజధాని యెరెవాన్ బాకు తిబిలిసి
స్వాతంత్ర్యం
  • ప్రారంభ చరిత్ర
  • 28 మే 1918
  • 21 సెప్టెంబర్ 1991
  • ప్రారంభ చరిత్ర
  • 28 మే 1918
  • 30 ఆగస్టు 1991
  • ప్రారంభ చరిత్ర
  • 26 మే 1918
  • 9 ఏప్రిల్ 1991
రాజకీయ వ్యవస్థ పార్లమెంటరీ రిపబ్లిక్ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ పార్లమెంటరీ రిపబ్లిక్
పార్లమెంట్ అజ్గయిన్ జోగోవ్ మిల్లీ మజ్లిస్ పార్లమెంటి
ప్రస్తుత అధ్యక్షుడు అర్మెన్ సర్కిసియన్ ఇల్హామ్ అలియేవ్ సలోం జోరాబిచ్‌విలి
జనాభా (2020) కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  29,63,900 కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  1,00,27,874 కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  37,16,858 కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి  1,67,01,632
ప్రాంతం 29,743 km2 (11,484 sq mi) 86,600 km2 (33,400 sq mi) 69,700 km2 (26,900 sq mi) 186,043 km2 (71,832 sq mi)
సాంద్రత 101.5/km2 (263/sq mi) 115/km2 (300/sq mi) 53.5/km2 (139/sq mi) 90/km2 (230/sq mi)
నీటి ప్రాంతం % 4.71% 1.6% 3.2%
GDP (నామమాత్రం) మొత్తం (2019) $1344.4 కోట్లు $4717.1 కోట్లు $1592.5 కోట్లు $7,654.0 కోట్లు
తలసరి GDP (నామమాత్రం) (2019) $4,528 $4,689 $4,289 $4,571
సైనిక బడ్జెట్ (2020) $63/.4 $226.7 కోట్లు $29 కోట్లు $319.1 కోట్లు
గిని సూచిక 34.4 (2018) 28.6 (2018) 36.4 (2018)
HDI 0.760 ( ఎక్కువ ) 0.754 ( ఎక్కువ ) 0.786 (High)
ఇంటర్నెట్ TLD .ఉదయం .అజ్ .ge
కాలింగ్ కోడ్ +374 +994 +995

ఈ ప్రాంతంలో అనేక విభిన్న భాషలు, భాషా కుటుంబాలూ ఉన్నాయి. 50 కంటే ఎక్కువ జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. కనీసం మూడు భాషాకుటుంబాలు ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనవి. అదనంగా, ఈ ప్రాంతంలో తూర్పు స్లావిక్, అర్మేనియన్, ఒస్సేటియన్ వంటి ఇండో-యూరోపియన్ భాషలు, అజర్‌బైజాన్, కుమిక్ భాష, కరాచే- బల్కర్ వంటి టర్కిక్ భాషలు మాట్లాడతారు. ముఖ్యంగా ఉత్తర కాకసస్‌లో రష్యన్ భాష మాట్లాడతారు.

ఉత్తర, దక్షిణ కాకసస్‌లోని ప్రజలు ఎక్కువగా షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు, తూర్పు ఆర్థోడాక్స్ క్రైస్తవులు, అర్మేనియన్ క్రైస్తవులు.

చరిత్ర

టర్కీ, ఇరాన్, రష్యా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం శతాబ్దాలుగా రాజకీయ, సైనిక, మత, సాంస్కృతిక తగాదాలకు, విస్తరణవాదానికి వేదికగా ఉంది. దాని చరిత్ర అంతటా, కాకసస్ సాధారణంగా ఇరానియన్ సామ్రాజ్యాల లోని భాగంగానే ఉంటూ వచ్చింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఖజార్ ఇరాన్ నుండి ఈ భూభాగాన్ని రష్యన్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది.

పూర్వ చరిత్ర

కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
అజర్‌బైజాన్‌లోని గోబస్తాన్‌లోని పెట్రోగ్లిఫ్స్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, సా.పూ. 10,000 నాటిది

పాతరాతియుగం నుండి కాకసస్ భూభాగంలో హోమో ఎరెక్టస్ నివసించింది. 1991లో, జార్జియాలోని ద్మనిసి పురావస్తు ప్రదేశంలో 18 లక్షల సంవత్సరాల నాటి ప్రారంభ మానవ (అంటే హోమినిన్) శిలాజాలు లభించాయి. శాస్త్రవేత్తలు ఈ శిలాజ అస్థిపంజరాలను హోమో ఎరెక్టస్ జార్జికస్ అనే ఉపజాతిగా వర్గీకరించారు.

ఆఫ్రికా ఖండం వెలుపల ప్రారంభ మానవుల ఉనికికి ఈ స్థలం లోనే తొలి నిస్సందేహమైన ఆధారాలు లభించాయి; ద్మానిసిలో లభించిన 5 పుర్రెలు ఆఫ్రికా వెలుపల కనుగొనబడిన అత్యంత పురాతన హోమినిన్‌ శిలాజాలు.

ప్రాచీనకాలం

సా.పూ. 4000 నుండి సా.పూ. 2000 వరకు కురా-అరాక్సెస్ సంస్కృతి సుమారు 1,000 కి.మీ X 500 కి.మీ. విస్తారమైన ప్రాంతాన్ని ఆవరించింది. ఆధునిక భూభాగాలలో ఇది దక్షిణ కాకసస్ (పశ్చిమ జార్జియా మినహా), వాయువ్య ఇరాన్, ఈశాన్య కాకసస్, తూర్పు టర్కీ, సిరియా వరకు ఉంది.

అషుర్బానిపాల్ (సా.పూ. 669–627) కింద, అస్సిరియన్ సామ్రాజ్యపు సరిహద్దులు కాకసస్ పర్వతాల వరకు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని తరువాత వచ్చిన పురాతన రాజ్యాలలో అర్మేనియా, అల్బేనియా, కొల్చిస్, ఐబీరియాలు ఉన్నాయి. ఈ రాజ్యాలు తరువాత వివిధ ఇరానియన్ సామ్రాజ్యాలలో విలీనమయ్యాయి. వీటిలో మీడియా, అచెమెనిడ్ సామ్రాజ్యం, పార్థియా, సస్సానిడ్ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇవి కాకసస్‌ను అనేక వందల సంవత్సరాల పాటు పరిపాలించాయి. సా.పూ. 95-55 లో అర్మేనియన్ రాజు టిగ్రాన్స్ ది గ్రేట్ పాలనలో, అర్మేనియా రాజ్యంలో అర్మేనియా రాజ్యంతో పాటు, సామంతులు ఐబెరియా, అల్బేనియా, పార్థియా, అట్రోపటేన్, మెసొపొటేమియా, కప్పడోసియా, సిలిసియా, సిరియా, నబాటేయన్ కింగ్డమ్, జుడేడమ్ ఉండేవి. సా.పూ. మొదటి శతాబ్దం నాటికి, జొరాస్ట్రియనిజం ఈ ప్రాంతంలో ఆధిపత్య మతంగా మారింది; అయితే, పర్షియా, రోమ్ ఆ తరువాత బైజాంటియం మధ్య బలమైన పోటీ కారణంగా ఈ ప్రాంతం రెండు ఇతర మతపరమైన పరివర్తనలను చూసింది. రోమన్లు మొదటగా సా.పూ. 1వ శతాబ్దంలో కోల్చిస్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఈ ప్రాంతం లోకి వచ్చారు. ఆ తరువాత దీన్ని లాజికమ్ ప్రావిన్స్‌గా మార్చారు. తరువాతి 600 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం రోమ్, సస్సానిడ్ సామ్రాజ్యాల మధ్య ఘర్షణలు జరిగాయి. పశ్చిమ జార్జియాలో తూర్పు రోమన్ పాలన మధ్యయుగం వరకు కొనసాగింది.

మధ్య యుగం

కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
జార్జియా రాజ్యం 13వ శతాబ్దపు ప్రారంభంలో దాని ఉచ్ఛస్థితిలో ఉంది.

అర్మేనియాలోని అర్సాసిడ్ రాజవంశం (పార్థియాలోని అర్సాసిడ్ రాజవంశం పేరు తోనే ఉన్న దాని శాఖ) క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా స్వీకరించిన మొదటి దేశం (క్రీ.శ. 301లో). కాకేసియన్ అల్బేనియా, జార్జియాలు క్రైస్తవ దేశాలుగా మారడంతో, క్రైస్తవ మతం జొరాస్ట్రియనిజం తదితర మతాలను అధిగమించడం మొదలైంది. పర్షియాపై ముస్లింల విజయంతో, ఈ ప్రాంతంలోని పెద్ద ప్రాంతాలు అరబ్బుల పాలనలోకి వచ్చాయి. దాంతో ఇస్లాం ఈ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది.

10వ శతాబ్దంలో, అలాన్‌లు (ప్రోటో- ఒస్సెటియన్లు ) ఉత్తర కాకసస్‌లో తదనంతర కాలంలో సిర్కాసియాగా, ఆధునిక ఉత్తర ఒస్సేటియా-అలానియాగా అభివృద్ధి చెందిన అలనియా రాజ్యాన్ని స్థాపించారు. 1238-39లో మంగోలులు దీన్ని నాశనం చేసారు.

మధ్య యుగాలలో బాగ్రాటిడ్ అర్మేనియా, తాషిర్-జోరాగెట్ రాజ్యం, స్యునిక్ రాజ్యం, ఖచెన్ ప్రిన్సిపాలిటీ, పురాతన అర్మేనియా రాజ్యం పతనం తర్వాత స్థానిక అర్మేనియన్ జనాభాకు అనేక ముప్పులు ఎదురయ్యాయి. కాకేసియన్ అల్బేనియా, అర్మేనియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. కాకేసియన్ అల్బేనియా చర్చి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి అవలంబించిన క్రైస్తవ సిద్ధాంతాలనే పాటించింది.

12వ శతాబ్దంలో, జార్జియన్ రాజు డేవిడ్ ది బిల్డర్ కాకసస్ నుండి ముస్లింలను తరిమివేసి, జార్జియా రాజ్యాన్ని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చాడు. 1194-1204లో జార్జియన్ రాణి క్వీన్ తమర్ సైన్యాలు ఆగ్నేయం, దక్షిణాల నుండి ఎదురైన కొత్త సెల్జుక్ టర్కిష్ దండయాత్రలను అణిచివేసాయి. సెల్జుక్, టర్కిష్‌ల పాలనలో ఉన్న దక్షిణ అర్మేనియాలో అనేక దండయాత్రలు చేసాయి. జార్జియన్ రాజ్యం కాకసస్ ప్రాంతంలో దండయాత్రలు కొనసాగించింది. ఆమె సైనిక పోరాటాల వలన, 1204లో బైజాంటైన్ సామ్రాజ్యం తాత్కాలిక పతనమవడం వలనా జార్జియా, ఉత్తర ఇరాన్, ఈశాన్య టర్కీ నుండి ఉత్తర కాకసస్ వరకు విస్తరించి ఉన్న కాకసస్‌లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. మొత్తం సమీప తూర్పు ప్రాంతంలో బలమైన క్రైస్తవ రాష్ట్రంగా అవతరించింది.

కాకసస్ ప్రాంతాన్ని ఒట్టోమన్లు, టర్కో-మంగోలులు, స్థానిక రాజ్యాలు, ఖానేట్లు, అలాగే మరోసారి ఇరాన్ స్వాధీనం చేసుకున్నాయి.

ఆధునిక కాలం

కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
కాకసస్‌లోని రష్యన్ కోటపై సిర్కాసియన్ దాడి, 1840

19వ శతాబ్దం ప్రారంభం వరకు, దక్షిణ కాకసస్, దక్షిణ డాగేస్తాన్ అన్నీ పెర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. 1813, 1828 లలో గులిస్తాన్ ఒప్పందం, తుర్క్‌మెన్‌చాయ్ ఒప్పందం ప్రకారం, పర్షియన్లు దక్షిణ కాకసస్, డాగేస్తాన్‌లను రష్యా సామ్రాజ్యానికి అప్పగించవలసి వచ్చింది. ఈ లాభాల తర్వాత తరువాతి సంవత్సరాల్లో, రష్యన్లు ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి అనేక యుద్ధాల ద్వారా పశ్చిమ జార్జియాతో కూడిన దక్షిణ కాకసస్ లోని మిగిలిన భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు.

19వ శతాబ్దం రెండవ భాగంలో, రష్యన్ సామ్రాజ్యం ఉత్తర కాకసస్‌ను కూడా జయించింది. కాకేసియన్ యుద్ధాల తరువాత రష్యా, సిర్కాసియన్ల జాతి ప్రక్షాళన జరిపింది. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజలను, ఎక్కువగా సిర్కాసియన్లు, వారి మాతృభూమి నుండి పారద్రోలారు. వాళ్ళు ప్రధానంగా ఒట్టోమన్ సామ్రాజ్యానికి వెళ్లారు.

అర్మేనియన్ మారణహోమంలో పశ్చిమ ఆర్మేనియాకు చెందిన చాలా మంది ఆర్మేనియన్లను చంపి, బహిష్కరించిన టర్కులు, తూర్పు అర్మేనియాలోని అర్మేనియన్ జనాభాను కూడా నిర్మూలించాలని భావించారు. 1920 టర్కిష్-అర్మేనియన్ యుద్ధంలో, 60,000 నుండి 98,000 మంది ఆర్మేనియన్ పౌరులను టర్కీ సైన్యం చంపేసిందని అంచనా వేసారు.

1940లలో సోవియట్ భద్రతా సంస్థలు, సుమారు 4,80,000 మంది చెచెన్లు, ఇంగుష్‌లు, 1,20,000 కరచే - బాల్కర్లు, మెస్కెటియన్ టర్కులు, వేలాది మంది కల్మిక్లు, నక్చివాన్, కాకసస్‌ల లోని 2,00,000 మంది కుర్దులను మధ్య ఆసియా, సివియెట్ అప్పారాట్ నుండి మూకుమ్మడిగా బహిష్కరించారు. వారిలో పావు వంతు మంది చనిపోయారు.

కాకసస్: రాజకీయ భౌగోళికం, చరిత్ర, ఇవి కూడా చూడండి 
జార్జియన్ అంతర్యుద్ధం, ఆగస్ట్-అక్టోబర్ 1993 లో అబ్ఖాజియాలో జరిగిన యుద్ధం

దక్షిణ కాకసస్ ప్రాంతం రెండుసార్లు ఏక రాజకీయ వ్యవస్థగా ఏకీకృతమైంది. ఒకసారి రష్యన్ అంతర్యుద్ధం ( ట్రాన్స్‌కాకేసియన్ డెమోక్రటిక్ ఫెడరేటివ్ రిపబ్లిక్ ) సమయంలో 1918 ఏప్రిల్ 9 నుండి 1918 మే 26 వరకు, మరోసారి సోవియట్ పాలనలో (ట్రాన్స్‌కాకేసియన్ SFSR ) 1922 మార్చి 12 నుండి 1936 డిసెంబరు 5 వరకు ఇవి జరిగాయి. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు అయిన తర్వాత, జార్జియా, అజర్‌బైజాన్, ఆర్మేనియాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.

సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ ప్రాంతం వివిధ ప్రాదేశిక వివాదాలు తలెత్తాయి. మొదటి నగోర్నో-కరాబఖ్ యుద్ధం (1988-1994), తూర్పు ప్రిగోరోడ్నీ సంఘర్షణ (1989-1991), అబ్ఖాజియాలో యుద్ధం (1992-93), మొదటి చెచెన్ యుద్ధం (1994-1996), రెండవ చెచెన్ యుద్ధం (1999-2009), రస్సో-జార్జియన్ యుద్ధం (2008), రెండవ నాగోర్నో-కరాబాఖ్ యుద్ధాలు (2020) వీటిలో కొన్ని.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

కాకసస్ రాజకీయ భౌగోళికంకాకసస్ చరిత్రకాకసస్ ఇవి కూడా చూడండికాకసస్ మూలాలుకాకసస్

🔥 Trending searches on Wiki తెలుగు:

విద్యమేకసిద్ధు జొన్నలగడ్డఅయలాన్ఇంద్రుడుకాశీకుమ్మరి (కులం)సరోజినీ నాయుడుమహాసముద్రంగుత్తా సుఖేందర్ రెడ్డియేసుమంచి మనసులు (1962 సినిమా)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఅరుణాచలంసపోటాజవాహర్ లాల్ నెహ్రూఆర్టికల్ 370 రద్దుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.తామర వ్యాధిచదరంగం (ఆట)జిల్లా కలెక్టర్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకొంపెల్ల మాధవీలతసుభాష్ చంద్రబోస్జనసేన పార్టీసంధ్యావందనంతోలుబొమ్మలాటకేంద్రపాలిత ప్రాంతంఆశ్లేష నక్షత్రముహనుమజ్జయంతిపేర్ని వెంకటరామయ్యచాట్‌జిపిటిరజాకార్తోట త్రిమూర్తులుఅమ్మాయి కోసంఘట్టమనేని మహేశ్ ‌బాబుగోత్రాలు జాబితామిథునరాశిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలితూర్పు చాళుక్యులుశ్రీశైల క్షేత్రంఏ.పి.జె. అబ్దుల్ కలామ్ప్రహ్లాదుడుశోభన్ బాబుఅక్కినేని అఖిల్ద్రోణాచార్యుడుషారుఖ్ ఖాన్పెళ్ళి చూపులు (2016 సినిమా)సుమతీ శతకముకులంలక్ష్మితెలుగు పదాలుకామసూత్రతెనాలి రామకృష్ణుడుఅనా డి అర్మాస్మానుగుంట మహీధర్ రెడ్డిభారత కేంద్ర మంత్రిమండలివర్ధమాన మహావీరుడుసర్పంచికాజల్ అగర్వాల్ఫ్యామిలీ స్టార్విజయవాడడి. కె. అరుణకర్కాటకరాశిశుక్రాచార్యుడుభారత రాష్ట్రపతిపాకిస్తాన్జాంబవంతుడుతెలుగు అక్షరాలుచదలవాడ ఉమేశ్ చంద్రమెదడు వాపుఅమ్మలావు శ్రీకృష్ణ దేవరాయలుఅశ్వని నక్షత్రముఅవకాడోబోండా ఉమామహేశ్వర రావుకల్వకుంట్ల చంద్రశేఖరరావుపూర్వాభాద్ర నక్షత్రము🡆 More