ఉభయచరము

ఉభయచరాలు (ఆంగ్లం Amphibians) జలచర జీవనం నుంచి భూచర జీవనానికి నాంది పలికిన మొట్ట మొదటి జీవులు.

భూచర జీవనానికి పూర్తిగా అనుకూలత సాధించడంలో విఫలమయి భూమికి నీటికి మధ్య జీవిస్తాయి. అందువల్ల ఉభయచరాలు పేరు ద్వంద్వ జీవితాన్ని సూచిస్తుంది. ఇవి చేపల నుంచి డిపోనియన్ కాలంలో ఏర్పడిన మొదటి చతుష్పాదులు. వీటి పూర్వ జీవులు ఆస్టియోలెపిడ్ చేపలు.

ఉభయచరాలు
కాల విస్తరణ: Late Devonian - Recent
ఉభయచరము
Western Spadefoot Toad, Spea hammondii
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
ఏంఫీబియా

Subclasses and Orders

   Order Temnospondyli - extinct
Subclass Lepospondyli - extinct
Subclass లిస్సేంఫోబియా
   Order అనూర
   Order కాడేటా
   Order అపోడా

సామాన్య లక్షణాలు

  • ఇవి శీతల రక్త లేదా అస్థిరోష్ణ జీవులు.
  • ఇవి ద్వంద్వ జీవితాన్ని గడుపుతాయి. ఇవి మంచినీటిలో ప్రజననం జరిపి అక్కడే అభివృద్ధి చెందుతాయి. ప్రౌఢజీవులు చాలా వరకు భౌమ జీవితానికనుకూలంగా పుపుస శ్వాసక్రియ జరిపితే, కొన్ని మాత్రం పాక్షికంగా జలచరజీవనానికి మొప్పలు కూడా కలిగి ఉంటాయి.
  • చర్మం మృదువుగా గానీ గరుకుగా గానీ ఉండి, శ్లేష్మగ్రంధులను లేదా పెరోటిడ్ గ్రంధులను కలిగి ఉంటుంది. బాహ్యాస్థిపంజరం లేదు. కానీ ఎపొడా జీవులలో మాత్రం చర్మం క్రింది మధ్యత్వచ పొలుసులు కనిపిస్తాయి. చర్మవర్ణానికి కారణం క్రొమెటోఫోర్లు.
  • పుర్రెలో రెండు అనుకపాల కందాలుంటాయి. అందువల్ల దాన్ని 'డైకాండైలిక్ పుర్రె' అంటారు. ఇది శీర్షదరం తో సంధించబడి ఉంటుంది.
  • పైదవడ లేదా రెండు దవడలూ చిన్నవిగా ఉండి సమదంతాలను కలిగి ఉంటాయి. నాలుక కొన్నింటిలో బహిస్సారి.
  • శ్వాసక్రియ ఊపిరితిత్తుల వల్ల జరుగుతుంది. ఆస్య కుహరం కూడా ప్రౌఢజీవులలో దీనికి తోడ్పడతాయి. డింబకాలలో మాత్రం మొప్పలు ఉంటాయి. జలచరజీవులలో మొప్పలు ప్రౌఢ దశలో కూడా ఉంటాయి.
  • రెందు కర్ణికలు, ఒక జఠరిక కలిగిన మూడు గదుల హృదయం ఉంటుంది. దీని ద్వారా మిశ్రమ రక్తం మాత్రమే ప్రవహిస్తుంది. బాగా అభివృద్ధి చెందిన వృక్క, కాలేయ నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి.
  • వృక్కాలు మధ్యవృక్కాలు, మూత్రశయం బాగా పెద్దది. ఇవి యూరియోటిలిక్ జీవులు.
  • కపాలనాడులు 10 జతలు. పది నాశికా రంధ్రాలు ఆస్యకుహరంలోకి తెరచుకుంటాయి. మధ్యచెవి మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది. దీనితో పాటు కర్ణభేరి, శ్రోత్రరంధ్రాలు కూడా ఏర్పడతాయి. పార్శ్వరేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ డింబక దశలకు, కొన్ని జలచర జీవులకు మాత్రమే పరిమితమవుతుంది.
  • లింగ విభేదన ఉంటుంది. పురుష జీవులకు సంపర్కావయవం లేదు. బాహ్య ఫలదీకరణ. అండాలు తగిన మాత్రం సొనకలిగిన 'మీసో లెసిథల్ అండాలు'. ఉభయచరాలలో జలచర జీవనం గడిపే డింభకం ఉంటుంది. రూపవిక్రియ ద్వారా ఇది ప్రౌఢదశను చేరుకొంటుంది.

వర్గీకరణ

  • ఉపవిభాగం I: స్టీగోసిఫాలియా (Stegocephalia) : వీటి చర్మం పొలుసులతోను అస్థిపలకాలతోను కప్పబడి ఉంటుంది. దీనిలో 5 క్రమములు ఉంటాయి. అనీ విలుప్తజీవులే.
    • క్రమం 1: లాబిరింతోడాన్ షియా
    • క్రమం 2: ఫిల్లోస్పాండిలి
    • క్రమం 3: లెపోస్పాండిలి
  • ఉపవిభాగం II: లిస్సేంఫిబియా (Lissamphibia) : దీనిలో బాహ్యాస్థిపంజరం లేని జీవించియున్న ఉభయచరాలు ఉంటాయి. దీనిలో 3 క్రమములు ఉంటాయి.
    • క్రమం 1: జిమ్నోఫియానా లేదా అపోడా (Gymnophiona or Apoda): ఉ. ఇక్తియోఫిస్, యూరియోటిప్లస్
    • క్రమం 2: యూరోడీలా లేదా కాడేటా (Caudata): ఉ. సాలమండర్, న్యూట్లు, మెగలోబెట్రాకస్, ఆంఫియామా, ఎంబ్లైస్టోమా, సైరన్.
    • క్రమం 3: సేలింటియా లేదా అనూర (Anura): ఉ. కప్పలు.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సావిత్రి (నటి)షారుఖ్ ఖాన్జనకుడువిష్ణువు వేయి నామములు- 1-1000అనుష్క శర్మరుహానీ శర్మతామర వ్యాధిభారత రాష్ట్రపతుల జాబితాశుభాకాంక్షలు (సినిమా)నరసింహ (సినిమా)ధనిష్ఠ నక్షత్రముదాశరథి కృష్ణమాచార్యకల్వకుంట్ల కవితభారతరత్నకుటుంబంవ్యతిరేక పదాల జాబితారోణంకి గోపాలకృష్ణజెర్రి కాటుభారత రాజ్యాంగ పరిషత్పరిటాల రవిఆవర్తన పట్టికరష్మి గౌతమ్ఒగ్గు కథహిందూధర్మంవేమన శతకముపులివెందుల శాసనసభ నియోజకవర్గంగుండెఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డివిష్ణుకుండినులుతెలంగాణ జిల్లాల జాబితాజాతీయములుమానవ జీర్ణవ్యవస్థభారత రాష్ట్రపతిఅంబటి రాంబాబుప్రీతీ జింటాస్త్రీభామనే సత్యభామనేప్రజా రాజ్యం పార్టీసుడిగాలి సుధీర్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)బుర్రకథరామావతారంవామనావతారముగాయత్రీ మంత్రంస్టూడెంట్ నంబర్ 1జాంబవంతుడురాశిఎఱ్రాప్రగడసంగీత వాద్యపరికరాల జాబితామిథాలి రాజ్తెలుగు సినిమాలు 2024కాలేయంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంచంద్రుడువృషభరాశిభారత జాతీయ ఎస్టీ కమిషన్రాహువు జ్యోతిషంభీమా (2024 సినిమా)ముఖేష్ అంబానీరావు గోపాలరావుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్2019 భారత సార్వత్రిక ఎన్నికలుమహాభారతంవిజయవాడ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసోరియాసిస్కల్లుదేవదాసిపెరిక క్షత్రియులుయుద్ధకాండతిథిరాగులుఎయిడ్స్చెట్టుఇక్ష్వాకులు🡆 More