యాహూ!

యాహూ! వెబ్ సేవలు అందించే అమెరికన్ సంస్థ.

దీని ముఖ్యకార్యాలయం సన్నీవేల్, కాలిఫోర్నియాలో ఉంది. దీని స్వంతదారు వెరిజోన్ మీడియా. Yahoo! సంస్థను జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో 1994 జనవరిలో స్థాపించారు. 1995 మార్చి 2 న ఇన్‌కార్పొరేటు చేశారు. 1990 లలో ప్రారంభ ఇంటర్నెట్ యుగానికి మార్గదర్శకులలో యాహూ ఒకటి.

Yahoo!
యాహూ!
Screenshot
దస్త్రం:Yahoo partial screenshot 2017.png
Home page
Type of businessSubsidiary
Type of site
Web portal
Foundedజనవరి 1994; 30 సంవత్సరాల క్రితం (1994-01)
Headquarters
Sunnyvale, California
,
U.S.
Area servedWorldwide
Founder(s)
  • Jerry Yang
  • David Filo
Products
  • Yahoo! News
  • Yahoo! Mail
  • Yahoo! Finance
  • Yahoo! Sports
  • Yahoo! Search
  • Yahoo! Messenger
  • Yahoo! Answers
  • See Yahoo products
Revenue$5.17 billion
Employees8,600 (March 2017)
ParentIndependent
(1994–2017)
Verizon Media
(2017–present)
AdvertisingNative
RegistrationOptional
Current statusActive

ఇది Yahoo! Directory, Yahoo! Mail, Yahoo! News, Yahoo! Finance, Yahoo! Groups, Yahoo! Answers, ప్రకటనలు, ఆన్‌లైన్ మ్యాపింగ్, వీడియో షేరింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ దాని సోషల్ మీడియా వెబ్‌సైట్ వంటి అనేక సేవలను అందిస్తుంది. ఉచ్ఛస్థితిలో ఉండగా, ఇది యునైటెడ్ స్టేట్స్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సైట్లలో ఒకటి. థర్డ్-పార్టీ వెబ్ అనలిటిక్స్ ప్రొవైడర్స్ అలెక్సా, సిమిలర్‌వెబ్ ల ప్రకారం, యాహూ అత్యంత ఎక్కువగా చదివే వార్తలు, మీడియా వెబ్‌సైట్. నెలకు 7 బిలియన్లకు పైగా వీక్షణలతో 2016 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సందర్శకులున్న ఆరవ వెబ్‌సైట్‌గా నిలిచింది.

ఒకప్పుడు అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటైన యాహూ, 2000 ల చివరిలో నెమ్మదిగా క్షీణించడం ప్రారంభమైంది. 2017 లో వెరిజోన్ కమ్యూనికేషన్స్ యాహూ యొక్క చాలా ఇంటర్నెట్ వ్యాపారాన్ని, అలీబాబా గ్రూప్‌లో, Yahoo!జపాన్లో వాటాలు తప్పించి, $4.48 బిలియన్లకు కొనుగోలు చేసింది. పై రెండు వాటాలను యాహూ వారస సంస్థ అల్తాబాకు బదిలీ చేసారు. ప్రాముఖ్యత నుండి క్షీణించినప్పటికీ, యాహూ డొమైన్ వెబ్‌సైట్లు ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందాయి. 2019 అక్టోబరు నాటికి అలెక్సా ర్యాంకింగ్స్ ప్రకారం ఇవి ప్రపంచంలో 10 వ స్థానంలో ఉన్నాయి.

చరిత్ర, పరిణామం

1994 జనవరి లో, యాంగ్, ఫిలోలు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉండగా "జెర్రీ అండ్ డేవిడ్ గైడ్ టు వరల్డ్ వైడ్ వెబ్" అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ సైట్ శోధించదగిన పేజీల సూచిక కాదు, అది సోపానక్రమంలో అమర్చిన ఇతర వెబ్‌సైట్ల డైరెక్టరీ. 1994 మార్చి లో, "జెర్రీ అండ్ డేవిడ్ గైడ్ టు ది వరల్డ్ వైడ్ వెబ్" పేరును "యాహూ!"గా మార్చారు. ఈ మానవ కృత డైరెక్టరీ వారి మొదటి ఉత్పత్తి. అది సంస్థ యొక్క అసలు ఉద్దేశం కూడా. "Yahoo Archived 2021-07-28 at the Wayback Machine.com" డొమైన్‌ను 1995 జనవరి 18 న సృష్టించారు.

1990 లలో యాహూ వేగంగా పెరిగింది. 1996 ఏప్రిల్ లో యాహూ ప్రజల్లోకి వెళ్ళింది. దాని స్టాక్ ధర రెండేళ్లలో 600 శాతం పెరిగింది. అనేక సెర్చ్ ఇంజన్లు, వెబ్ డైరెక్టరీల మాదిరిగానే, యాహూ వెబ్ పోర్టల్‌ను జోడించి, ఎక్సైట్, లైకోస్, అమెరికా ఆన్‌లైన్ వంటి సేవలతో పోటీ పడింది . 1998 నాటికి, వెబ్ వినియోగదారులకు యాహూ అత్యంత ప్రాచుర్యం పొందిన తొలి అడుగు. మానవికంగా-సవరించిన యాహూ డైరెక్టరీ అత్యంత ప్రాచుర్యం పొందిన సెర్చ్ ఇంజిన్. రోజుకు 95 మిలియన్ పేజీల వీక్షణలను అందుకునేది,.దాని ప్రత్యర్థి, ఎక్సైట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ఇది చాలా ఉన్నత స్థాయిలో సంస్థలను కొనేసింది. రాకెట్‌మెయిల్ కొనుగోలు చేసిన తరువాత 1997 అక్టోబరు నుండి యాహూ ఉచిత ఇ-మెయిల్‌ను అందించడం ప్రారంభించింది. దాని పేరు Yahoo! Mail . 1998 లో, తన డైరెక్టరీకి అంతర్లీనంగా ఉన్న క్రాలర్-ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ ఆల్టావిస్టా స్థానంలో ఇంక్‌టోమిని తీసుకోవాలని యాహూ నిర్ణయించింది. యాహూ యొక్క రెండు అతిపెద్ద కొనుగోళ్ళు 1999 లో జరిగాయి - జియోసిటీస్ 3.6 బిలియన్ డాలర్లకు, , బ్రాడ్‌కాస్ట్.కామ్‌ను 5.7 బిలియన్ డాలర్లకూ కొనేసింది.

డాట్-కామ్ బబుల్ సమయంలో దాని స్టాక్ ధర ఆకాశానికి ఎగబాకింది, 2000 జనవరి 3 న యాహూ స్టాక్స్ వాటా ఆల్-టైమ్ హై $ 118.75 వద్ద ముగిసింది. అయితే, డాట్-కామ్ బబుల్ పేలిన తరువాత, 2001 సెప్టెంబరు 26 న కనిష్ఠ స్థాయి $8.11 కు చేరుకుంది.

యాహూ 2000 లో శోధన కోసం గూగుల్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. తరువాతి నాలుగు సంవత్సరాల్లో, ఇది దాని స్వంత శోధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. 2004 లో ఇంక్టోమిని 280 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాక, కొంతవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. గూగుల్ యొక్క Gmailకు ప్రతిస్పందనగా, యాహూ 2007 లో అపరిమిత ఇమెయిల్ నిల్వను అందించడం ప్రారంభించింది. ఈ సంస్థ 2008 లో కష్టాల్లో పడి, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది.

2008 ఫిబ్రవరి లో, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యాహూను 44.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి అయాచిత బిడ్ చేసింది. యాహూ అధికారికంగా బిడ్‌ను తిరస్కరించింది, ఇది సంస్థను "గణనీయంగా తక్కువగా అంచనా వేసింద"ని, అది వాటాదారులకు ప్రయోజనం కాదనీ పేర్కొంది. 2011 నాటికి, యాహూలో 22.24 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది (మూడేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అందించిన దానిలో సగం మాత్రమే). జనవరి 2009 లో యాంగ్ స్థానంలో CEO గా కరోల్ బార్ట్జ్ వచ్చింది. సెప్టెంబర్ 2011 లో, కంపెనీ ఛైర్మన్ రాయ్ బోస్టాక్ ఆమెను ఆ స్థానం నుండి తొలగించాడు. కంపెనీ CFO గా ఉన్న టిమ్ మోర్స్ ను సంస్థ తాత్కాలిక CEO గా నియమించారు.

2013 నాల్గవ త్రైమాసికం నాటికి, జూలై 2012 లో మారిస్సా మేయర్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కంపెనీ వాటా ధర రెట్టింపు అయ్యింది; అయితే, వాటా ధర నవంబర్ 2013 లో సుమారు $ 35 కు చేరుకుంది. ఇది డిసెంబర్ 2, 2015 మధ్యలో $36.04 వరకు పెరిగింది, బహుశా మేయర్ యొక్క భవిష్యత్తుపైన, ఇబ్బందుల్లో ఉన్న ఇంటర్నెట్ వ్యాపారాన్ని విక్రయించాలా వద్దా అనే విషయం పైనా చైనా యొక్క అలీబాబా ఇ-కామర్స్ సైట్లో దాని వాటాను అమ్మెయ్యాలా తదితర విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.మేయర్ పదవీకాలంలో అన్నీ సరిగ్గా జరగలేదు. 1.1 బిలియన్ డాలర్లతో టంబ్లర్‌ను కొన్నాక, ఇంకా దని ఫలితాలు రాలేదు. ఒరిజినల్ వీడియో కంటెంట్‌లోకి ప్రవేశించడం 42 మిలియన్ డాలర్ల నష్టానికి దారితీసింది. డార్ట్మౌత్ కాలేజీ యొక్క టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ సిడ్నీ ఫింకెల్స్టెయిన్ ది వాషింగ్టన్ పోస్ట్తో మాట్లాడుతూ, "మీరు చేయగలిగే ఉత్తమమైన పని ఏమిటంటే ... సంస్థను అమ్మడం." అని అన్నాడు. 2015 డిసెంబరు 7 న యాహూ ఇంక్ ముగింపు ధర $34.68.

2016 జూలై 25 న, వెరిజోన్ కమ్యూనికేషన్స్ యాహూ యొక్క ప్రధాన ఇంటర్నెట్ వ్యాపారాన్ని $4.83 బిలియన్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ప్రకటించింది.     కొనుగోలు ముగిసిన తరువాత, ఈ ఆస్తులు AOL తో విలీనం అయ్యాయి, 2017 జూన్ 13 న ఓత్ ఇంక్ అని పిలువబడే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది;  యాహూ, AOL, హఫింగ్టన్ పోస్ట్ లు వాటి స్వంత పేర్లతో, ఓత్ ఇంక్ గొడుగు కింద పనిచేయడం కొనసాగిస్తాయి.  ఈ ఒప్పందం అలీబాబా గ్రూపులో యాహూ యొక్క 15% వాటాను, Yahoo! Japanలో 35.5% వాటాను మినహాయించింది.   కొనుగోలు పూర్తయిన తరువాత, ఈ రెండు ఆస్తులను ఆల్టాబా పేరుతో, కొత్త కార్యనిర్వాహక బృందంతో ఉంచుతారు.     

మూలాలు

Tags:

వెబ్ సర్వీస్

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.అవినాష్‌రెడ్డివృషభరాశిభూమన కరుణాకర్ రెడ్డికలువవినోద్ కాంబ్లీసత్య సాయి బాబారజినీకాంత్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానితిన్చిరంజీవితెలంగాణనాయట్టుబగళాముఖీ దేవిఅమెరికా సంయుక్త రాష్ట్రాలునందిగం సురేష్ బాబుభారత సైనిక దళంకన్యారాశితెలుగు సినిమాపి.సుశీలసుభాష్ చంద్రబోస్Aఅర్జునుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆషికా రంగనాథ్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలులావు రత్తయ్యఇంగువమా తెలుగు తల్లికి మల్లె పూదండరఘుపతి రాఘవ రాజారామ్ఎస్త‌ర్ నోరోన్హాభార్యమహావీర్ జయంతిబంజారా గోత్రాలుఆప్రికాట్అశోకుడుతెలంగాణ గవర్నర్ల జాబితాతిథికామాక్షి భాస్కర్లతెలుగువింధ్య విశాఖ మేడపాటినిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకలబందఅయ్యప్పవిజయవాడఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సజ్జల రామకృష్ణా రెడ్డివిజయ్ (నటుడు)అక్క మహాదేవిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణకర్ణుడుపమేలా సత్పతిచరవాణి (సెల్ ఫోన్)అశ్వత్థామసాయి ధరమ్ తేజ్భారతదేశ జిల్లాల జాబితాగైనకాలజీవశిష్ఠ మహర్షిపచ్చకామెర్లుకె. అన్నామలైసిమ్రాన్చోళ సామ్రాజ్యంధనూరాశికన్యకా పరమేశ్వరికుమ్మరి (కులం)భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుశ్రీ కృష్ణదేవ రాయలుభూమిఇన్‌స్టాగ్రామ్విలియం షేక్‌స్పియర్అశ్వని నక్షత్రముభామావిజయండీజే టిల్లుసీతాదేవి🡆 More