జిబౌటి

జిబౌటి (ఆంగ్లం : Djibouti) (అరబ్బీ : جيبوتي జిబూతి ), అధికారిక నామం, జిబౌటి గణతంత్రం.

ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశం. దీనికి ఉత్తరసరిహద్దులో ఎరిట్రియా, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో సోమాలియా ఉన్నాయి. మిగిలిన తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఉన్నాయి. జిబౌటి వైశాల్యం 23,200 చ.కి.మీ (8,958 చ.కీ).

جمهورية جيبوتي
జమ్‌హూరియత్ జీబూతి
[Jamhuuriyadda Jabuuti] Error: {{Lang}}: text has italic markup (help)
République de Djibouti
రిపబ్లిక్ ఆఫ్ జిబౌటి
Flag of జిబౌటి జిబౌటి యొక్క Coat of arms
నినాదం
"Unité, Égalité, Paix"  (en:translation)
"Unity, Equality, Peace"
జాతీయగీతం

జిబౌటి యొక్క స్థానం
జిబౌటి యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Djibouti
11°36′N 43°10′E / 11.600°N 43.167°E / 11.600; 43.167
అధికార భాషలు అరబ్బీ, French
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Afar, Somali
ప్రజానామము జిబౌటియన్
ప్రభుత్వం Semi-presidential republic
 -  President Ismail Omar Guelleh
 -  Prime Minister Dileita Mohamed Dileita
Independence from France 
 -  Date June 27 1977 
 -  జలాలు (%) 0.09 (20 km² / 7.7 sq mi)
జనాభా
 -  July 2007 అంచనా 496,374 (160th)
 -  2000 జన గణన 460,700 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $1.740 billion 
 -  తలసరి $2,273 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $850 million 
 -  తలసరి $1,110 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.516 (medium) (149th)
కరెన్సీ Franc (DJF)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .dj
కాలింగ్ కోడ్ +253

జిబౌటి ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగులలో క్రియాశీలకంగా ఉంది.

పురాతన కాలంలో ఇది పుంట్ భూభాగంలో అక్సమ్ రాజ్యంలో భాగంగా ఉంది. సమీపంలోని జీల (ఇప్పుడు సోమాలియాలో) మధ్యయుగకాలంలో అడాల్, ఇనాట్ సుల్తానేట్స్ స్థానంగా ఉంది. 19 వ శతాబ్దం చివరలో సోమాలి, అఫార్ సుల్తాన్లతో ఫ్రెంచి ఒప్పందం మీద సంతకం చేసుకున్న తరువాత ఫ్రెంచి సొమాలియాండు కాలనీ, దాని రైల్రోడ్ " డైర్ దావా " (తరువాత అడ్డిస్ అబాబా) తో స్థాపించబడ్డాయి. తరువాత 1967 లో " ఫ్రెంచి టెర్రిటరీ ఆఫ్ ది అఫర్సు అండ్ ది ఇషస్ " గా పేరు మార్చబడింది. ఒక దశాబ్దం తరువాత జిబౌటియన్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఓటు వేశారు. ఇది అధికారికంగా జిబౌటి రిపబ్లిక్ స్థాపనకు చిహ్నంగా ఉంది. దేశానికి దీని రాజధాని నగరం పేరు పెట్టబడింది. 1977 సెప్టెంబర్ 20 న జిబౌటి ఐఖ్యరాజ్యసమితి సభ్యదేశం అయింది. 1990 ప్రారంభంలో ప్రభుత్వ ప్రాతినిధ్యంపై తలెత్తిన ఉద్రిక్తతలు సాయుధ పోరాటానికి దారితీశాయి. 2000 లో అధికార పార్టీ, ప్రతిపక్ష మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం ముగిసింది.

జిబౌటి ఒక బహుళ-జాతి దేశం. దేశ జనసంఖ్య 9,42,333 ఉంది. దేశంలో సోమాలి, అరబిక్, ఫ్రెంచి భాషలు మూడూ అధికారిక భాషలుగా ఉన్నాయి. సుమారు 94% మంది నివాసితులు ఇస్లాం ధర్మం ఆచరిస్తున్న కారణంగా ఇది అధికారిక మతంగా ఉంటోంది. ఇస్లాం వెయ్యి సంవత్సరాల కంటే అధికంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉంది. సోమాలి (ఇసా వంశం), అఫార్ రెండు అతిపెద్ద జాతి సమూహాలుగా ఉన్నాయి. ఆఫ్రోయాటిక్ భాషలు రెండు వాడుక భాషలుగా ఉన్నాయి.

జిబౌటి వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాయానమార్గం సమీపంలో ఉంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్ర మార్గాన్ని నియంత్రిస్తుంది. ఇది కీ రీఫ్యూయలింగు, సరకులను మార్చే కేంద్రంగా పనిచేస్తుంద. పొరుగునున్న ఇథియోపియాకు దిగుమతి, ఎగుమతులకు ప్రధాన నౌకాశ్రయంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా, దేశంలో క్యాంప్ లెమోనియెరు వంటి అనేక విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయి. " డెవలప్మెంటు ఇంటరు-గవర్నమెంటలు అథారిటీ " ప్రాంతీయ సంస్థకు జిబౌటి నగరంలో ప్రధాన కార్యాలయం ఉంది.

చరిత్ర

చరిత్రకు పూర్వం

జిబౌటి 
Geometric design pottery found in Asa Koma.

జిబౌటి ప్రాంతం నియోలిథిక్ నుండి మానవ ఆవాసితంగా ఉంది. భాషా ప్రతిపాదనలు ఆధారంగా మొదటి దశలో ఆఫ్రోయాసిటిక్-మాట్లాడే ప్రజలు నైలు లోయలో, నియర్ ఈస్టు ("అసలు మాతృభూమి") నుండి ఈ ప్రాంతంలో వచ్చారు. ఇతర పరిశోధకులు ఆఫ్రోయాసియాటిక్ ప్రజలు హోర్నులోని సిటూలో స్థిరపడ్డారు.

జిబౌటి 
జిబౌటిలో చరిత్రపూర్వ రాక్ కళ, సమాధులు

అసా కోమాలోని గోబాద్ మైదానంలో కనుగొనబడిన మట్టిపాత్రలు 2 వ సహస్రాబ్ది మధ్యకాలానికి చెందినవని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించిన సామాన్లు చుక్కలు, రేఖాచిత్రాలు చిత్రించబడి ఉన్నాయి. ఇవి దక్షిణ అరేబియాలోని మా'లేబా నుండి సబీర్ సంస్కృతి మొదటి దశ మట్టిపాత్రలను పోలి ఉన్నాయి. అస్కో కోమాలో కనుగొనబడిన పొడవైన కొమ్ముల పశువుల ఎముకలు 35,000 సంవత్సరాలకు ముందు పెంపుడు జంతువులుగా ఉన్న జంతువులకు సంబంధించినవని భావిస్తున్నారు. డోర్రా, బల్హోలో ఉన్న శిలా చిత్రాలలో ఉన్న యాంటెలోపులు, జిరాఫీలు ఉన్నాయి. నాల్గవ సహస్రాబ్దికి చెందిన హ్యాండోగా, పెంపుడు జంతువులతో ప్రారంభ సంచార పాస్టోరలిస్టులు సెరామికును, రాతి పనిముట్లు ఉపయోగించారు. అంతేకాకుండా, జిబౌటి సిటీ, లోయిడాల మధ్య ఎన్నో మానవాకారాలు, లింగాకారాలు శిల్పాలు, దూలాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు మద్య ఇథియోపియాలో కనుగొనబడిన నిలువు స్లాబ్లచే చుట్టుముట్టబడిన దీర్ఘచతురస్రాకార సమాధులతో సంబంధం కలిగి ఉంటాయి. జిబౌటి-లాయిడా దూలాల కాలం అనిశ్చితంగా ఉంది. వాటిలో కొన్ని T- ఆకారపు గుర్తుతో అలంకరించబడ్డాయి.

పుంటు

జిబౌటి 
Queen Ati, wife of King Perahu of Punt, as depicted on Pharaoh Hatshepsut's temple at Deir el-Bahri.

ఉత్తర సోమాలియా, ఎరిట్రియా, సూడాన్, ఎర్ర సముద్ర తీరంతో కలిసిన జిబౌటీ ప్రాంతాన్ని పురాతన ఈజిప్టు పౌరులు పురాతనమైన ఈజిప్షియన్లకు పుంటు (లేదా "తాజ్ నెత్జేరు" అంటే "దేవుని భూమి") అని పిలుస్తారు. పుంటు గురించి క్రీ.పూ. 25 వ శతాబ్దంలో మొట్టమొదటి ప్రస్తావన చేయబడింది. 5 వ రాజవంశమైన ఫారో సహోరు, 18 వ రాజవంశం రాణి హాత్షెప్సుటు పాలనలో ప్రాచీన ఈజిప్టుతో దగ్గరి సంబంధాలు కలిగిన ఒక దేశంగా పుంటు ఉంది. డేర్ ఎల్-బహరి వద్ద ఉన్న దేవాలయ కుడ్య ప్రకారం పుంటు భూమిని ఆ సమయంలో రాజు పరహు, రాణి ఆతి పాలించారు.

ఇఫాట్ సుల్తానేటు (1285–1415)

జిబౌటి 
The Ifat Sultanate's realm in the 14th century.

1000 సంవత్సరాలకు పైగా పొరుగున ఉన్న అరేబియా ద్వీపకల్పంతో సంబంధాల ద్వారా, ఈ ప్రాంతంలోని సోమాలి, అఫార్ జాతి సమూహాలు ఖండంలో ఇస్లాం స్వీకరించిన మొదటి ప్రజలుగా ఉన్నారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇనాన్ సుల్తానేట్ ఒక మద్యయుగానికి చెందిన ముస్లిం మధ్యంతర రాజ్యంగా ఉంది. 1285 లో వలాష్మా రాజవంశం స్థాపించబడింది. ఇది జైలాలో కేంద్రీకృతమై ఉంది. ఐయాట్ జిబౌటి, ఉత్తర సోమాలియాలో స్థావరాలను స్థాపించింది. తరువాత ఇది అహ్మరు పర్వతాలకు దక్షిణం వైపు విస్తరించింది. దీని సుల్తాన్ ఉమర్ వలాష్మా (మరొక మూలం ఆధారంగా మరో కుమారుడు అలీ). 1285 లో షెవా సుల్తానేటును జయించినట్లు నమోదు చేయబడింది. ముస్లిం భూభాగాలను హార్నులో సమైఖ్యం చేయడానికి సుల్తాన్ ఉమరు సైనిక దండయాత్రను సాగించాడు. అదే కాలంలో చక్రవర్తి యుకునూ అమ్లాక్ పర్వత ప్రాంతాలలో క్రిస్టియన్ భూభాగాలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ఈ రెండు రాజ్యాల మద్య షెవా, దక్షిణ భూభాగాలపై ఆధిపత్యం కొరకు సంఘర్షణ మొదలై సుదీర్ఘమైన యుద్ధానికి దారితీసింది. కానీ ఆ సమయంలోని ముస్లిం సుల్తానేట్లు బలంగా సమైఖ్యం చేయబడలేదు. 1332 లో ఇథియోపియా చక్రవర్తి అమ్డా సెయోన్ ఇఫాకును ఓడించి షెవా నుండి వెలుపలకు పంపాడు.

అడలు సుల్తానేటు (1415–1577)

జిబౌటి 
The Sultan of Adal (right) and his troops battling King Yagbea-Sion and his men.

అరేబియా ద్వీపకల్పం నుండి హజ్రకు విస్తరించిన తరువాత కొంతకాలానికి ప్రాంతంలో ఇస్లాం పరిచయం చేయబడింది. జైలాలో ఉన్న రెండు-మిహిబ్ మసీదులు అల్-ఖిబ్లతెన్ 7 వ శతాబ్దానికి చెందినదినవి. ఇవి నగరంలోని పురాతన మసీదులుగా గుర్తించబడుతున్నాయి. 9 వ శతాబ్దం చివర అల్-యాకూబి ఉత్తర సముద్రపు ఒడ్డున ముస్లింలు నివసిస్తున్నట్లు వ్రాశారు. ఆయన అవదల్ ప్రాంతంలో జిబౌటీ పొరుగున ఒక ఓడరేవులోని జీలై అడాల్ రాజ్యం రాజధానిగా ఉందని కూడా పేర్కొన్నాడు. జైలాతో అడాల్ సుల్తానేటు ప్రధాన కార్యాలయం కనీసం 9 వ లేదా 10 వ శతాబ్దానికి చెందినది అని సూచిస్తుంది. ఐ.ఎం. లెవిస్ రచనల ఆధారంగా సొమాలిజిత అరబ్లు లేదా అరైబైజ్ సోమాలిసు స్థానిక రాజవంశాలు దక్షిణప్రాంతాలలోని బెనాడిరు లోని మొగడిషు సుల్తానేటు వంటి రాజ్యాలను స్థాపించి పాలించబడ్డాయి. ఈ స్థాపన కాలం నుండి అడాల్ చరిత్ర పొరుగు ఉన్న అబిస్సినియాతో పోరాటాలతో ముడిపడి ఉంటుంది. అడాల్ సామ్రాజ్యం శిఖరాగ్రదశలో ఆధునిక దిగ్బౌటీ, సోమాలియా, ఎరిట్రియా, ఇథియోపియా అధిక భూభాగాలను నియంత్రించింది.

ఓట్టమన్ ఇయాలెట్ (1577–1867)

జిబౌటి 
The Ottoman Eyalet in 1566.

గవర్నర్ అబౌ బేకర్ సాగల్లోని ఈజిప్షియన్ సైన్యాలను యుద్ధం నుండి విరమించుకుని జైలాకు తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. ఈజిప్షియన్లు విడిచిపెట్టిన కొద్ది రోజుల తర్వాత క్రూయిజర్ సీనిల్లే సాగల్లోకు చేరుకున్నాడు. ఎడెన్లోని బ్రిటీషు ఏజెంటు ఆడెన్ నుండి నిరసనలు ఉన్నప్పటికీ ఫ్రెంచి దళాలు ఈ కోటను ఆక్రమించాయి. మేజరు ఫ్రెడెరికు మెర్సెరు బ్రిటీషు, ఈజిప్టు ప్రయోజనాలను కాపాడటానికి జైలాకు దళాలను పంపించి ఆ దిశగా ఫ్రెంచి మరింత విస్తరించకుండా అడ్డుకున్నాడు.1884 ఏప్రెలు 14 న పెట్రోలు స్లాపు కమాండరు ఎల్ ' ఇంఫరెంట్ గల్ఫు ఆఫ్ టాడ్జౌరాలో ఈజిప్టు ఆక్రమణపై నివేదించాడు. పెట్రోల్ స్లాప్ లే వాడురేయిల్ ఈజిప్షియన్లు ఆకోక్, తద్జౌరా లోతట్టు ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నారు. ఇథియోపియా చక్రవర్తి నాలుగవ యోహాన్స్ ఈజిప్షియన్లు పోరాటం విరమించుకుని ఇథియోపియా, సోమాలియా సముద్రతీరం నుండి ఈజిప్షియన్ దళాల తరలింపును అనుమతించడానికి గ్రేట్ బ్రిటనుతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. ఈజిప్టు సైనిక దళం టాడ్జౌరా నుండి ఉపసంహరించబడింది. లెయోన్స్ లగర్డ్ తరువాతి రాత్రి టాడ్జౌరాకు ఒక పెట్రోల్ స్లాపును నియమించాడు.

ఫ్రెంచి సోమాలిలాండు (1894–1977)

జిబౌటి 
French Somaliland in 1922.

1862 నుండి 1894 వరకు టాడ్జౌర్ గల్ఫుకు ఉత్తరాన ఉన్న భూమిని అబోక్ అని పిలిచారు. దీనిని సోమాలి, అఫార్ సుల్తానులు పాలించారు. దీనితో ఫ్రాన్సు 1883 - 1887 మధ్య వివిధ ఒప్పందాలను కుదుర్చుకుని ఈ ప్రాంతంలో మొట్టమొదటి స్థావరం స్థాపించింది. 1894 లో లియోన్స్ లగర్డ్ జిబౌటి నగరంలో శాశ్వత ఫ్రెంచి పాలనా యంత్రాంగం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ఫ్రెంచి సోమాలిలాండుగా పేరు పెట్టాడు. ఇది 1896 నుండి 1967 వరకు కొనసాగింది. ఇది టెర్టొటరీ ఫ్రాంకుల్ డెస్ అఫార్సు డెస్ ఇషెస్ " ("అఫర్స్, ఇషాలను ఫ్రెంచ్ భూభాగం") గా మార్చింది.

పొరుగున సోమాలియా 1960 లో స్వాతంత్రం సందర్భంగా ఫ్రాంసులో ఉండడమా లేదా సోమాలియా రిపబ్లికులో చేరడమా నిర్ణయించటానికి జిబౌటీలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ జైబౌటీలో జరిగింది. ఈ ప్రజాభిప్రాయ ఫలితం ఫ్రాన్సుతో నిరంతర సహకారంతో ఉండడానికి అనుకూలంగా మారింది. పాక్షికంగా అపరార్ జాతి సమూహం, ఐరోపావాసులు సంయుక్తంగా అనుకూలమైన ఓటు వేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు రిగ్గింగు జరిగాయన్న ఆరోపణలు కూడా అధికంగా ఉన్నాయి. ఎవరికీ ఓటు వేయని వారిలో చాలామంది సోమాలియన్లు ఉన్నారు. వారు సోమాలియాను యునైటెడ్ కౌన్సిలు వైస్ ప్రెసిడెంట్ మహమౌద్ హర్బి ప్రతిపాదించిన యునైటెడ్ సోమాలియాలో చేరడానికి అనుకూలంగా ఉన్నారు. హర్బి రెండు సంవత్సరాల తరువాత విమాన ప్రమాదంలో చంపబడ్డాడు.

జిబౌటి 
జిబౌటి రాజధాని జిబౌటి సిటీ వైమానిక వీక్షణ

భూభాగం విధిని గుర్తించేందుకు 1967 లో రెండవ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఫ్రెంచి అధికారుల సహకారంతో ఓటు రిగ్గింగు జరిగిందన్న ఆరోపణ కారణంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ మరలా జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన కొద్దికాలం తర్వాత " మాజీ కోట్ ఫ్రాంకైయిస్ డెస్ సోమాలిస్ (ఫ్రెంచ్ సోమాలియాండ్) " పేరును టెర్రియోయిరే ఫ్రాంకాయిస్ డెస్ అఫార్స్ ఎట్ డేస్ ఇసాస్ " గా మార్చారు.

జిబోటి రిపబ్లికు

1977 లో మూడవ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 98.8% మంది ఫ్రాన్సు నుండి డిజెబౌటి స్వాతంత్ర్యంను అధికారికంగా గుర్తిస్తున్నారు. 1958 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో అవును ఓటు కోసం ప్రచారం చేసిన ఒక సోమాలి రాజకీయ నాయకుడు హసన్ గోల్డ్ అప్టిడాన్, చివరకు దేశం మొదటి అధ్యక్షుడిగా (1977-1999)నియమించబడ్డాడు.

మొదటి సంవత్సరంలో జిబౌటి ఆఫ్రికన్ యూనిటీలో (ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్), అరబ్ లీగ్, ఐఖ్యరాజ్యసమితిలో చేరారు. 1986 లో " జిబోటి " ఇంటర్ గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటు " వ్యవస్థాపక ఆరంభ సభ్యులలో ఒకటి అయింది.

1990 ల ప్రారంభంలో ప్రభుత్వ ప్రాతినిధ్యంపై జిబౌటీ అధికార పార్టీ " పీపుల్స్ ర్యాలీ ఫర్ ప్రోగ్రెస్ (పిఆర్ పి), యూనిటీ అండ్ డెమోక్రసీ రిస్టోరేషన్ " పార్టీల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు సాయుధ పోరాటానికి దారితీశాయి. ఈ పోరాటం 2000 లో అధికార-భాగస్వామ్య ఒప్పందంలో ముగిసింది.

భౌగోళికం

Satellite images of Djibouti during the day (left) and night (right)

జిబౌటి ఆఫ్రికాలోని హార్ను, ఎడెను గల్ఫు, ఎర్ర సముద్రం దక్షిణ ప్రవేశద్వారం వద్ద బాబ్-ఎల్-మండేబులో ఉంది. ఇది 10 ° - 13 ° ఉత్తర అక్షాంశం, 41 ° - 44 ° తూర్పు రేఖాంశం మద్య ఉంటుంది. సోమాలి ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, అరేబియా ప్లేట్ త్రికేంద్రంలో ఉంటుంది.

దేశం సముద్రతీరం 403 కిలోమీటర్ల (250 మైళ్ళు) పొడవు ఉంది. నైసర్గికంగా పీఠభూమి, మైదానాలు, ఎత్తైన భూములు ఉన్నాయి. జిబౌటిలో మొత్తం 23,200 చదరపు కిలో మీటర్ల వైశాల్యం (9,000 sq mi) ఉంది. దీని సరిహద్దులు 528 కి.మీ (328 మైళ్ళు), ఎమిట్రియా, 342 కి.మీ (213 మై) ఇథియోపియాతో 61 కి.మీ (38 మై) సోమాలియాతో పంచుకుంటుంది. వీటిలో 125 కి.మీ (78 మై) ఉన్నాయి. జిబౌటి అరేబియా ప్లేట్లో దక్షిణాంతం ఉండే దేశం.

జిబౌటిలో ఎనిమిది పర్వత శ్రేణులు 1,000 మీటర్ల (3,300 అడుగులు) ఎత్తులో ఉన్నాయి. దేశంలోని ఎత్తైన పర్వత శ్రేణిగా పరిగణించబడుతున్న మౌసా అలీ పర్వతశ్రేణిలో ఇథియోపియా, ఎరిట్రియా సరిహద్దులో అతి ఎత్తైన శిఖరం 2,028 మీటర్ల (6,654 అడుగులు) ఎత్తులో ఉంది. గ్రాండు బారా ఎడారి ఆర్టా, అలీ సబీ, డిఖిల్ మొదలైన దక్షిణ జిబౌటి భూభాగాలను కలిగి ఉంది. ఇది చాలా తక్కువగా సముద్రమట్టానికి 1,700 అడుగుల (520 మీటర్లు) దిగువన తక్కువ ఎత్తులో ఉంటుంది.

భౌగోళిక ప్రదేశాలు: ఉత్తరాన రాస్ డౌమెరా, ఎరిట్రియాతో ఉన్న సరిహద్దును అకోక్ రీజియన్లో ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే పాయింట్; తూర్పున రాస్ బిర్కు ఉత్తరాన ఉన్న ఎర్ర సముద్రం విభాగం; దక్షిణాన ఎల్యా పట్టణంలోని ఇథియోపియా సరిహద్దులో ఉన్న ఒక ప్రదేశం; పశ్చిమాన ఇథియోపియా పట్టణమైన అఫాంబోకు తూర్పున ఇథియోపియాతో సరిహద్దులో ఉన్న ఒక ప్రదేశం.

జిబౌటిలో చాలామంది ఇథియోపియన్ జెర్రిక్ గడ్డి మైదానాలు, పొదలభూములు ఉన్నాయి. ఇందుకు మినహాయింపుగా ఎర్ర సముద్ర తీర వెంట ఎరిట్రియన్ తీరప్రాంత ఎడారిలో భాగంగా ఉన్న బెల్టు వంటి చీలిక ప్రాంతం ఉంది.

వాతావరణం

జిబౌటి 
Djibouti map of Köppen climate classification.
  Semi-arid climate
  Arid climate

జిబౌటీ వాతావరణం గణనీయంగా వెచ్చగా ఉంటుంది. ప్రపంచ సగటు కంటే తక్కువగా కాలానుగుణ వైవిధ్యాన్ని కలిగి ఉంది. రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుండి 41 ° సెంటీగ్రేడు (90 నుండి 106 °ఫారెన్ హీటు) వరకు ఉంటాయి. అధిక ఎత్తుల వద్ద మినహా. ఒక చల్లని ఆఫ్షోర్ ప్రవాహ ప్రభావాలు ఉంటాయని భావించవచ్చు. ఉదాహరణకు జిబౌటి నగరంలో ఏప్రెలు మాసంలో సగటు మధ్యాహ్నం అత్యధికంగా 28 నుండి 34 ° సెంటీగ్రేడు (82 నుండి 93 ° ఫారెన్ హీటు) వరకు ఉంటుంది. జాతీయంగా రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 15 నుండి 30 ° సెంటీగ్రేడు (59 నుండి 86 ° ఫారెన్ హీటు) వరకు ఉంటాయి.


తూర్పు జిబౌటిలో వాతావరణం వ్యత్యాసంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు జూలైలో జూలైలో 41 ° సెంటీగ్రేడు (106 ° ఫారెన్ హీటు)ఉంటుంది.41 °C (106 °F)ఈ ప్రాంతంలో జూలై ఎగువభూములలో చలి మంచుతో గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ఈ ప్రాంతంలో తేమ మద్యాహ్నసమయంలో 40%, రాత్రివేళలో 80% నికి చేరుకుంటుంది. సీజన్ అనుసరించి కొన్ని మార్పులు ఉంటాయి.

జిబౌటి వాతావరణం ఈశాన్య తీర ప్రాంతాల్లో శుష్కంగా ఉంటుంది. దేశంలోని మధ్య, ఉత్తర, పశ్చిమ, దక్షిణ భాగాలలో పాక్షికంగా శుష్కవాతావరణం ఉంటుంది. తూర్పు సముద్ర తీరంలో వార్షిక వర్షపాతం 5 అంగుళాల (131 మిమీ) కంటే తక్కువగా ఉంటుంది. కేంద్ర పర్వత ప్రాంతాలలో అవక్షేపణం 8 నుండి 11 అంగుళాలు (200 నుండి 300 మిమీ) వరకు ఉంటుంది. తీర ప్రాంతాల కంటే లోతట్టు ప్రాంతంలో తేమ తక్కువగా ఉంటుంది. జిబౌటి సముద్రతీరంలో సౌమ్యమైన వాతావరణం ఉంటుంది. ది జిబౌటీ వాతావరణ మార్పు బిల్లు 2020 నాటికి పరిశుద్ధ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి 100% వుద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Average daily temperatures for the ten cities in Djibouti
Location July (°C) July (°F) January (°C) January (°F)
జిబౌటీ నగరం 41/31 107/88 28/21 83/70
అలి సబియెహ్ 37/25 99/77 24/14 75/58
టాడ్జౌరా 41/31 107/88 29/22 84/72
దిఖిల్ 38/26 101/80 29/19 84/66
ఒబొకు 41/30 105/87 28/22 84/72
అర్టా 37/26 99/79 24/14 76/58
రాండా 34/23 94/73 23/13 74/56
హోల్ హోల్ 38/27 101/81 26/16 79/61
అలి అడ్డే 38/26 100/79 26/16 79/61
ఎయిరొలాఫ్ 31/19 88/67 22/10 71/51

వన్యజీవితం

జిబౌటి 
The Djibouti francolin, a critically endangered species living only in Djibouti.

దేశంలోని కఠినమైన భూభాగంలో మొత్తం దేశవైశాల్యంలో 1% ఒక శాతం కంటే తక్కువ అటవీ ప్రాంతంలో వృక్షజాలం, జంతుజాలం కనిపిస్తాయి. మూడు ప్రధాన ప్రాంతాల్లో వన్యప్రాణులు విస్తరించి ఉంది. ఇది దేశంలోని ఉత్తర పర్వత ప్రాంతం నుండి దక్షిణ, మధ్య భాగంలో అగ్నిపర్వత పీఠభూమి, తీరప్రాంతంలోవిస్తరించి ఉంది.

జిబౌటి 
ఫోర్ట్ డు డే నేషనల్ పార్క్లో మొక్కల జాతులు

దేశం ఉత్తర భాగంలో, డే ఫారెస్టు నేషనలు పార్కు పర్యావరణ వ్యవస్థలో వన్యప్రాణుల చాలా జాతులు కనిపిస్తాయి. సగటు ఎత్తు 1,500 మీటర్లు (4,921 అడుగులు) ఈ ప్రాంతంలో గోదా మాసిఫ్, 1,783 మీ (5,850 అ) శిఖరం కలిగి ఉంటుంది. ఇది జునిపెరాసు ప్రాజెరా అడవుల 3.5 చదరపు కిలోల పుట మీటర్ల (37,673,686 చ.) విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 20 మీటర్లు (66 అడుగుల) ఎత్తుకు పెరిగిన అనేక చెట్లు ఉన్నాయి. ఈ అటవీప్రాంతం అంతరించిపోతున్న స్థానిక జాతికి చెందిన జిజిటీ ఫ్రాంకోలిన్ (ఒక పక్షి) ప్రధాన నివాసస్థానంగా ఉంది. ఇటీవల గుర్తించిన సకశేరుకం, ప్లాటిసెప్స్ అఫారన్సిస్ (ఒక కొలోబ్రిన్ పాము). దేశంలోని మొత్తం గుర్తించిన జాతులలో 60% బాక్సువుడ్, ఆలివ్ చెట్లు ఉన్నాయి.

జిబౌటిలో జీవవైవిద్యం ఉన్న దేశంలో లభిస్తున్న సమాచారం ఆధారంగా దేశంలో 820 కి పైగా జాతుల మొక్కలు, 493 జాతులు అకశేరుకాలు, 455 జాతుల చేపలు, 40 రకాల సరీసృపాలు, 3 జాతుల ఉభయచరాలు, 360 జాతుల పక్షులు, 66 జాతుల క్షీరదాలు ఉన్నాయి. జిబౌటి వన్యప్రాణుల సమూహం ఆఫ్రికన్ బయోడైవర్శిటీ కేంద్రంగా ఉంది. ఎర్ర సముద్రం ఎడెన్ పగడపు రీఫు కేంద్రంగా గల్ఫులో భాగంగా ఉంది.క్షీరదాల్లో సోమెర్రింగు గజెల, పెల్జెలు గజెలె అనేక రకాల జాతులు ఉన్నాయి. 1970 ప్రారంభం నుండి విధించిన వేట నిషేధం ఫలితంగా ఈ జాతులు ఇప్పుడు బాగా సంరక్షించబడుతున్నాయి. ఇతర క్షీరదాలు గ్రేవీ జీబ్రా, హమడ్రియాస్ బబూన్, హంటర్ జింక ఉన్నాయి. డే నేషనల్ పార్కులో వార్తాగు వంటి అంతరించిపోతున్న జంతువు కనుగొనబడింది. తీర జలాల్లో దుగాంగులు, అబిస్సినియన్ ఉన్నాయి. వీటికి మరికొంత అధ్యయనాల నిర్ధారణ అవసరం. తీర జలాల్లో పచ్చటి తాబేళ్లు, హాక్స్బిల్ తాబేళ్ళు ఉన్నాయి. జిబౌటీలో ఉన్న ఈశాన్య ఆఫ్రికన్ చిరుత ఏసినోనైక్స్ జుబాటస్ సోమేమేర్మియం అంతరించిపోయినట్లు భావిస్తున్నారు.

ఆర్ధికం

జిబౌటి 
Djibouti GDP by sector

జిబౌటి ఆర్ధికవ్యవస్థలో సేవా రంగం అధింగా ఆధిఖ్యత వహిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు దేశం స్వేచ్ఛా వాణిజ్య విధానాలను కేంద్రంగా చేసుకుని (ఎర్ర సముద్ర రవాణా కేంద్రంగా) తిరుగుతాయి. తక్కువ వర్షపాతం కారణంగా ప్రధాన పంటల ఉత్పత్తిలో కూరగాయలు, పండ్లు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇతర ఆహార పదార్థాలు దిగుమతి చేసుకొనడం అవసరం. 2013 లో జి.డి.పి. (కొనుగోలు శక్తి సమానత్వం) $ 2.505 బిలియన్లు ఉంటిందని అంచనా. వార్షిక వృద్ధిరేటు 5%. తలసరి ఆదాయం సుమారు $ 2,874 అమెరికన్ డాలర్లు. సేవల రంగం జి.డి.పిలో సేవారంగం 79.7%, పరిశ్రమ 17.3%, వ్యవసాయం 3% గా బాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి.

2013 నాటికి జిబౌటి నౌకాశ్రయం లోని కంటైనర్ టెర్మినల్ దేశ వాణిజ్యంలో అత్యధికంగా భాగం నిర్వహిస్తుంది. నౌకాశ్రయ కార్యకలాపాలలో 70% నికి పొరుగున ఉన్న ఇథియోపియా నుండి వస్తున్న దిగుమతులు, ఎగుమతులు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆదేశాలు నౌకాశ్రయంలోని ఔట్ లెటు దుకాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నౌకాశ్రయం అంతర్జాతీయ ఇంధన కేంద్రంగా, రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. 2012 లో ప్రపంచ సహకారంతో జిబౌటియన్ ప్రభుత్వం డొరాలె కంటైనరు టెర్మినలు నిర్మాణం ప్రారంభమైంది. మూడవ ప్రధాన ఓడరేవు జాతీయ రవాణా సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఉద్ధేశించబడింది. ఒక $ 396 మిల్లియన్ల ప్రాజెక్టు, ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల ఇరవై అడుగుల కంటైనరు యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంది.

" 2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్కు ర్యాంకింగు " లో జిబౌటి ప్రపంచంలో 177 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తించబడింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అభివృద్ధి చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు, దేశం వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించడానికి పలు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి జిబౌటి అధికారులు అనేక అభివృద్ధి ప్రణాళికలను ప్రారంభించారు. ప్రభుత్వం అధిక వడ్డీ, ద్రవ్యోల్బణ శాతాన్ని తగ్గించడానికి ప్రైవేటు రంగంలో కొత్తవిధానాలను ప్రవేశపెట్టింది. వీటిలో వ్యాపారాలు పన్ను భారం తగ్గించడం, వినియోగ పన్నుపై మినహాయింపులను అనుమతించడం వంటి చర్యలు జరిగాయి.

జిబౌటి 
జిబౌటి ఎగుమతుల అనుపాత ప్రాతినిథ్యం

అంతేకాకుండా విభిన్న రంగాల్లో పెట్టుబడి ద్వారా మరింత ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పట్టణ నిరుద్యోగ రేటును 60% తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి నిధులు అధికంగా వినియోగించబడుతున్నాయి. జి.డి.పి.లో సుమారు 15% ప్రాతినిధ్యం వహిస్తున్న చేపల విక్రయాలు, వ్యవసాయం రంగాలలో 2008 నుండి పెట్టుబడి అధికరించింది.

పారిశ్రామిక రంగం విస్తరించేందుకు 2018 నాటికి 56 మెగావాట్ల భూఉష్ణ విద్యుత్తు ప్లాంటు ఒ.పి.ఇ.సి. ప్రపంచ బ్యాంకు, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటి సహాయంతో నిర్మాణం పూర్తిచేసుకుంది. ఈ సదుపాయం విద్యుత్తు కొరతలను పరిష్కరిస్తుంది. ఇంధనం కోసం ఇథియోపియాపై దేశం ఆధారపడడాన్ని తగ్గిస్తుంది, డీజిల్-ఉత్పత్తికి విద్యుచ్ఛక్తి కోసం ఖరీదైన చమురు దిగుమతులను తగ్గిస్తూ తద్వారా జీడీపీ అభివృద్ధి చేసి, రుణాలను తగ్గించవచ్చు.

జిబౌటి " సాల్ట్ ఇంవెస్టుమెంటు " (ఎస్.ఐ.ఎస్.) జిబౌటి అస్సలు సరస్సు ప్రాంతంలో ఉన్న విస్తారమైన ఉప్పు నులువలను పారిశ్రామికీకరణ చేయడానికి భారీ-స్థాయి ఆపరేషనును ప్రారంభించింది. 4 మిలియను టన్నుల వార్షిక సామర్ధ్యంతో పనిచేసి డీశాలినేషను ప్రాజెక్టు ఎగుమతుల ఆదాయాన్ని సృష్టించి మరింత ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ప్రాంతంలో నివాసిస్తున్న వారికి మరింత మంచి నీటిని అందించింది. 2012 లో జిబౌటి ప్రభుత్వం ఒక ఒరే టెర్మినలు నిర్మాణం కోసం చైనా హార్బరు ఇంజనీరింగు కంపెనీ లిమిటెడు సేవలను ఉపయోగించుకుంది. $ 64 మిలియన్ల విలువైన ఈ ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని ఊహించారు. ఈప్రాజెక్టు ద్వారా ఆగ్నేయ ఆసియా మార్కెట్లకు సంవత్సరానికి 5,000 టన్నుల ఉప్పును ఎగుమతి చేయడానికి జిబౌటికి అవకాశం లభిస్తుంది.

జిబౌటి 
జిబౌటి స్థూల జాతీయోత్పత్తి సంవత్సరానికి సగటున 6 % కంటే అధికం. 1985 లో $ 341 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి 2015 లో 1.5 బిలియన్ల డాలర్లకు వరకు విస్తరించింది

జిబౌటి స్థూల జాతీయోత్పత్తి సంవత్సరానికి సగటున 6 శాతం కంటే అధికం. 1985 లో $ 341 మిలియన్ల అమెరికన్ డాలర్లు నుండి 2015 లో 1.5 బిలియన్ డాలర్ల వరకు విస్తరించింది. జిబౌటియన్ ఫ్రాంకు అనబడే జిబౌటి కరెన్నిసీ అధికారికంగా " జిబౌటి సెంట్రల్ బ్యాంక్ " జారీ చేస్తుంది. జిబౌటియన్ ఫ్రాంక్ యుఎస్ డాలరుకు అనుగుణంగా ఉన్నందున ఇది స్థిరంగా ఉండి ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కోకుండా ఉంటుంది. ఇది దేశంలో పెట్టుబడి పెరుగుతున్న ఆసక్తిని అధికం చేస్తుంది.

2010 నాటికి 10 సంప్రదాయ ఇస్లామిక్ బ్యాంకులు జిబౌటిలో పనిచేస్తాయని భావించబడింది. సోమాలి డబ్బు బదిలీ కంపెనీ దహాబ్షియిల్ , బి.డి,సి,డి, స్విస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనుబంధ సంస్థతో సహా గత కొన్ని సంవత్సరాలలో పలు సంస్థలు ప్రవేశించాయి. బ్యాంకింగు వ్యవస్థ ఇంతకుముందు రెండు సంస్థలచే స్వతంత్రీకరించబడింది: ఇండో-సూయెజు బ్యాంకు, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ బ్యాంకు. ప్రభుత్వానికి ఒక బలమైన క్రెడిట్, డిపాజిట్ రంగానికి భరోసా ఇవ్వాలంటే వాణిజ్య బ్యాంకులు ఆర్థిక సంస్థలో 30% వాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ బ్యాంకులకు కనీసం 300 మిలియన్ల జైబుటియన్ ఫ్రాంకులు తప్పనిసరిగా మంజూరు చేయాలి. ఒక హామీ నిధిని సృష్టించడం ద్వారా లెండింగ్ ప్రోత్సాహించబడింది. ఇది మొదట చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు హామీరహిత ఋణాలు అందించడానికి బ్యాంకులకు అనుమతిస్తుంది.


సౌదీ పెట్టుబడిదారులు హార్బర్ ఆఫ్ ది ఆఫ్రికాను అరేబియా ద్వీపకల్పంతో (28.5 కిలోమీటర్ల పొడవైన (17.7 మైళ్ళు)మార్గం) అనుసంధించడానికి సాగిస్తున్నారు అన్వేషణలో జిబౌటీ వద్ద " బ్రిడ్జ్ ఆఫ్ ది హార్ను " పేరుతో ఓవర్సీ వంతెన నిర్మించాలని భావించారు. పెట్టుబడిదారుడు తారెక్ బిన్ లాడెన్ ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేయబడ్డాడు. అయినప్పటికీ 2010 లో ప్రాజెక్టు మొదటిదశ ఆలస్యం అయ్యిందని ప్రకటించబడింది.

రవాణా సౌకర్యాలు

జిబౌటి 
Main Terminal at Djibouti–Ambouli International Airport.

దేశంలోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం " జిబౌటి-అంబోలి అంతర్జాతీయ విమానాశ్రయం " షెడ్యూల్డు, చార్టర్డు విమానాలుతో అనేక ఖండాతర మార్గాలలో విమానసేవలను అందిస్తోంది. జిబౌటి జెండా ధరించిన " క్యారియరు ఎయిరు జిబౌటి " ఇది దేశం అతిపెద్ద వైమానిక సంస్థగా గుర్తించబడుతుంది.

కొత్త విద్యుద్దీకృత ప్రామాణిక గేజ్ అడ్డిస్ అబాబా-జిబౌటి రైల్వే 2018 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇథియోపియా నుండి డోరోలేహ్ జిబౌటియాన్ నౌకాశ్రయం మధ్య సరుకు రవాణా సేవలను అందించడం లక్ష్యంగా ఇది నిర్మించబడింది.

జిబౌటి నగరం నుండి టాడ్జౌరా వరకు " టాడ్జౌర్ గల్ఫు " కార్ ఫెర్రీలు నడుపబడుతున్నాయి. జిబౌటి నగరానికి పశ్చిమాన జిబౌటి ప్రధాన నౌకాశ్రయం అయిన " డోరలేహ్ నౌకాశ్రయం " ఉంది. డోరలేహ్ ఓడరేవు కొత్త అడ్డిస్ అబాబా-జిబౌటి రైల్వే టెర్మినలుగా ఉంది. సాధారణ కార్గో, చమురు దిగుమతులను నిర్వహిస్తున్న డోరలేహ్ ఓడరేవుతో ప్రస్తుతం జిబౌటి (2018)లో తడ్జౌరా నౌకాశ్రయం (పోటాష్), డామెర్జోగ్ పోర్ట్ (పశువుల పెంపకం) ), పోర్ట్ ఆఫ్ గౌబెట్ (ఉప్పు) నుండి భారీ మొత్తంలో వస్తువులు, పశువులు దిగుమతి ఎగుమతి చేయబడుతున్నాయి. ఇథియోపియా దిగుమతులు, ఎగుమతుల్లో దాదాపు 95% జిబౌటియన్ ఓడరేవుల ద్వారా తరలించబడుతున్నాయి.

ప్రధాన రోడ్లుగా పరిగణించబడుతున్న రహదారులు సాధారణంగా జిబౌటిలోని అన్ని ప్రధాన నగరాల మధ్య రవాణా సౌకర్యాలను అందిస్తున్నాయి.

మాధ్యం, సమాచారరంగం

జిబౌటి 
The Djibouti Telecom headquarters in Djibouti City.

జిబౌటిలో టెలికమ్యూనికేషన్సు మంత్రిత్వ శాఖ అధికారంలో సమాచారరంగం పనిచేస్తుంది.

జిబౌటి టెలికాం అనేది సమాచార సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా పనిచేస్తుంది. ఇది ఎక్కువగా మైక్రోవేవ్ రేడియో రిలే నెట్వర్కును ఉపయోగించుకుంటుంది. రాజధానిలో ఒక ఫైబర్-ఆప్టిక్ కేబులు స్థాపించబడింది. గ్రామీణ ప్రాంతాలు వైర్లెస్ స్థానిక లూప్ రేడియో వ్యవస్థల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. మొబైల్ సెల్యులార్ సేవలు జిబౌటి నగరం, చుట్టుప్రక్కల ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. 2015 నాటికి 23,000 టెలిఫోన్ ప్రధాన మార్గాలు, 312,000 మొబైల్ / సెల్యులార్ లైన్లు ఉపయోగంలో ఉన్నాయి. సీ-మీ-వీ 3 జలాంతర్గామి కేబుల్ జెడ్డా, సూయజ్, సిసిలీ, మార్సిల్లే, కొలంబో, సింగపూరులను దాటికి పనిచేస్తుంది. స్టేషన్లలో " 1 ఇంటెల్సట్ (హిందూ మహాసముద్రం), 1 అరాబ్సాట్ టెలిఫోన్ ఉపగ్రహ సేవలు అందిస్తుంది. మెడరాబెల్ మైక్రోవేవ్ రేడియో రిలే టెలిఫోన్ నెట్వర్క్ ప్రాంతీయంగా సేవలు అందిస్తుంది.

ప్రభుత్వ యాజమాన్య జాతీయ బ్రాడ్కాస్టరు " జిబౌటి రేడియో టెలివిజన్ " ఇది ఏకైక టి.వి. స్టేషనును అలాగే ఎ.ఎం. 1, ఎఫ్.ఎం. 2, షార్టు వేవ్ రెండింటిపై రెండు దేశీయ రేడియో నెట్వర్లను నిర్వహిస్తుంది. ప్రసార మాధ్యమ లైసెన్సింగు, నిర్వహణలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. రాజధానిలోని ఓడియన్ వంటి సినిమా థియేటర్లు ఉన్నాయి.


2012 నాటికి 215 స్థానిక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఉన్నాయి. 2015 లో 99,000 మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు." డి.జె " ఇంటర్నెట్ దేశీయ ఉన్నత-స్థాయి డొమైనుగా పని చేస్తుంది.

పర్యాటకరంగం

జిబౌటి 
Arta Plage on the Gulf of Tadjoura.

జిబౌటిలో పర్యాటకం అభివృద్ధి చెందితున్న ఆర్ధికరంగాలలో ఒకటిగా ఉంది. జిబౌటీ వార్షిక పర్యాటకుల సంఖ్య 80,000 కు చేరుకుంది. పర్యాటకులలో అధికంగా దేశంలోని అతిపెద్ద నౌకాదళ స్థావరాలలో ఉన్న సైనికుల కుటుంబం, స్నేహితులు ఉన్నారు. సంఖ్యపరంగా పెరుగుదల ఉన్నప్పటికీ పర్యాటక వృద్ధిని పరిమితం చేయగల వీసా సంబంధిత చర్చలు నిలిపివేయబడ్డాయి.


మౌలికసౌకర్యాల కొరత కారణంగా పర్యాటకులు స్వతంత్రంగా ప్రయాణించడాన్ని కష్టతరం చేస్తుంది. ప్రైవేటు యాత్రల వ్యయం ఎక్కువగా ఉంటుంది. 2018 జనవరిలో అడ్డిస్ అబాబా నుంచి జిబౌటి వరకు రైలు మార్గాన్ని తిరిగి ప్రారంభించినప్పటి నుండి భూమార్గ పర్యటనలు కూడా పునఃప్రారంభం అయ్యాయి. జిబౌటి లోని రెండు ప్రధాన భౌగోళిక అద్భుతాలైన అబే సరస్సు, అస్సాలు సరస్సు పర్యాటకులు అధికంగా సందర్శిస్తున్న పర్యాటక ప్రాంతాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రెండు ప్రాంతాలు వార్షికంగా వందల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

విద్యుత్తు

జిబౌటిలో చమురు డీజిల్ ప్లాంట్లు 126 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. 2002 లో విద్యుత్తు ఉత్పాదన 232 గిగావాట్లకు అభివృద్ధి చేయబడి 216 గిగావాట్లు వినియోగం చేయబడింది. 2015 నాటికి తలసరి వార్షిక విద్యుత్తు వినియోగం 330 కిలోవాట్లు ఉన్నాయి. 45% ప్రజలకు విద్యుత్తు అందుబాటులో లేదు. దేశం విద్యుత్తు రంగంలో దేశావసరాలకు తగినంత సామర్ధ్యన్ని అభివృద్ధిజేయగలిగగిన స్థాయికి అభివృద్ధి సాధించలేదు. ఇథియోపియా నుండి అధికరించిన జలవిద్యుత్తు దిగుమతులు ప్రస్తుతం 65% జిబౌటి అవసరాలను సంతృప్తి పరుస్తుంది. దేశం పునరుత్పాదక ఇంధన సరఫరాను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రాండ్ బారాలోని ఫోటోవోల్టాయిక్ పవర్ స్టేషన్ (సౌర పొలాలు) నిర్మాణం 50 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

గణాంకాలు

జిబౌటిలో 9,42,333 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది బహుళజాతి ప్రజలు నివసిస్తున్న దేశం. 20 వ శతాబ్దం చివరి భాగంలో స్థానిక జనాభా వేగంగా వృద్ధి చెందింది. 1960 నాటికి జనసంఖ్య 83,000 ఉండగా 2016 నాటికి 8,46,000 కి అధికరించింది. ప్రజలలో సోమాలి (60%), అఫార్ (35%) రెండూ అతిపెద్ద జాతి సమూహాలుగా ఉన్నాయి. సోమాలి వంశానికి చెందిన ప్రజలు ప్రధానంగా ఇస్సాప్రజలు ఉన్నారు. మిగిలిన 5% జిబౌటీ జనాభా ప్రధానంగా యెమెన్ అరబ్లు, ఇథియోపియన్లు, యూరోపియన్లు (ఫ్రెంచి,ఇటాలియన్లు) ఉంటారు. ప్రజలలో దాదాపు 76% పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మిగిలినవారు మతసంబంధిత ప్రజలు. జిబౌటిలో పొరుగు దేశాలకు చెందిన అనేక మంది వలస ప్రకలు, శరణార్ధులు నివసిస్తున్నారు. కాస్మోపాలిటన్ పట్టణవాదం కారణంగా జిబౌటీ నగరాన్ని "ఎర్ర సముద్రంలో ఫ్రెంచ్ హాంగ్ కాంగ్" అని పిలుస్తారు.

భాషలు

Historical Population
సంవత్సరంజనాభా±% p.a.
195062,001—    
195569,589+2.34%
196083,636+3.75%
19651,14,963+6.57%
19701,59,659+6.79%
19772,77,750+8.23%
19803,58,960+8.93%
19854,25,613+3.47%
19905,90,398+6.76%
19956,30,388+1.32%
20007,17,584+2.62%
20057,84,256+1.79%
20108,51,146+1.65%
20159,27,414+1.73%
20169,42,333+1.61%
Source: World Bank

జిబౌటి ఒక బహుభాషా దేశం. స్థానిక నివాసితులలో అధికంగా సోమాలి (5,24,000) భాషావాడుకరులు, అఫారు (3,06,000)భాషావాడుకరులు ఉన్నారు. ఈ భాషలు సోమాలి, అఫారు జాతి సమూహాల మాతృభాషలుగా ఉన్నాయి. రెండు భాషలు ఆఫ్రోయాసియాటిక్ (కుషిటిక్) కుటుంబానికి చెందినవి. జిబౌటిలో సోమాలియా, అరబిక్, ఫ్రెంచి భాషలు మూడూ అధికారిక భాషలు ఉన్నాయి.

జిబౌటి భాషలు

  సోమాలీ (60%)
  అఫారు (35%)
  అరబిక్ (3%)
  Other (2%)

అరబిక్ మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. అరబిక్ ప్రజలు ఆధునిక ప్రామాణిక అరబిక్ భాషా వాడుకరులు ఉన్నారు. దాదాపు 59,000 స్థానిక నివాసితులు " తా- ఇజ్జి- అదేని అరబిక్ మాండలికం మాట్లాడతారు. దీనిని జిబౌటీ అరబిక్ అని కూడా పిలుస్తారు. ఫ్రెంచి చట్టబద్ధమైన జాతీయ భాషగా పనిచేస్తుంది. ఇది కాలనీల కాలం నుండి వారసత్వంగా ఉంది.

మతం

జిబౌటిలో ప్రధానంగా ముస్లింలు సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉన్నారు. దేశం జనాభాలో 94% మంది (2012 నాటికి సుమారు 7,40,000 మంది ముస్లిములు) ముస్లిములు ఉన్నారు. అయితే మిగతా 6% క్రైస్తవులు ఉన్నారు.

Religion in Djibouti
religion percent
Islam
  
94%
Christianity
  
6%

హింసాత్మకచర్యల నుండి తప్పించుకోవడానికి ఎర్ర సముద్రం దాటి ముస్లిం సమూహం హార్ను ఆఫ్ ఆఫ్రికాలో ప్రవేశించడంతో జిబౌటీలోకి మొదటిసారిగా ముస్లిం మతం ప్రవేశించింది. 1900 లో ఫ్రెంచి వలస పాలన ప్రారంభ కాలం వరకు జిబౌటీలో క్రైస్తవులు లేరు. ఫ్రెంచి సోమాలియాండులో కొన్ని కాథలిక్ బృందాల పాఠశాలలు, అనాధ శరణాలయాల స్థాపన చేయడానికి వచ్చిన 100-300 అనుచరులు మాత్రమే ఉన్నారు. జిబౌటి రాజ్యాంగం ఇస్లాంకు ఏకైక దేశీయ మతంగా గుర్తిస్తూ అన్ని విశ్వాసాలకు చెందిన పౌరులకు సమానత్వం (మొదటి ఆర్టికల్), మత అనుసరణ స్వేచ్ఛ (రెండవ ఆర్టికల్) ఇచ్చింది. చాలామంది స్థానిక ముస్లింలు షుని పాఠశాల, సున్ని తెగకు కట్టుబడి ఉంటారు. సూఫీ ముస్లిములు ఇతర పాఠశాలలకు హాజరౌతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ (2008) ఆధారంగా ముస్లిం జిబౌటియన్లకు మతమార్పిడి చేయడానికి, మరొక మతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడానికి అధికారం ఉంది. మతమార్పిడి చేసుకున్న ప్రజలు వారి కుటుంబం, వంశం, సమాజం నుండి ప్రతికూల చర్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

జిబౌటి డియోసెస్ స్వల్పసంఖ్యలో స్థానిక క్యాథలిక్ ప్రజలకు సేవలు అందిస్తుంది. 2006 లో 7,000 మంది క్రైస్తవులు ఉన్నారు.

ఆరోగ్యం

జిబౌటి 
Entrance to the ISSS Faculty of Medicine in Djibouti City.

జిబౌటీ ప్రజల ఆయుఃప్రమాణం 63.2 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మహిళలకు సంతానోత్పత్తి 2.35 ఉంది. జిబౌటిలో 1,00,000 మందికి 18 మంది వైద్యులు ఉన్నారు.

2010 నాటికి జిబౌటిలో 1,00,000 శిశుజననాలలో 300 తల్లులు మరణిస్తున్నారు. ఇవి 2008 లో 461.6, 1990 లో 606.5 లు ఉండేవి. 5 సంవత్సరాల లోపు పిల్లాలలో 1000 మందికి 95 మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో నాలుగు వారాలలోపు శిశుమరణాలు 37 ఉన్నాయి. జిబౌటిలో 1,000 ప్రసవాలకు సేవలు అందిస్తున్న మంత్రసానుల సంఖ్య 6. 93 లో గర్భిణీ స్త్రీలకు 1 మరణం సంభవిస్తుంది.

జిబౌటీ మహిళల బాలికలలో 93.1% మంది స్త్రీ సున్కిషన్ విధానానికి లోనౌతూ ఉన్నారు. ఈశాన్య ఆఫ్రికా ప్రధాన భూభాగం, తూర్పు సమీప భాగాలలో ఈ స్థానికాచారం ఆచరణలో ఉంది. 1994 లో చట్టబద్దంగా నిషేధించినప్పటికీ ఈ విధానం ఇప్పటికీ విస్తృతంగా ఆచరణలో ఉంది. ఇది స్థానిక సంస్కృతిలో లోతుగా పాతుకుపోవడమే ఇందుకు కారణం. సమాజంలో మహిళలచే ప్రోత్సహించబడి, ప్రదర్శించబడే సున్తీ నిరోధించడానికి బలవంతంగా అంగీకరించడం నుండి రక్షణను అందించడానికి ఇది ఉద్దేశించబడింది.

జిబౌటి మగ జనాభాలో 94% పురుషులలో కూడా సున్తీ ఆచరించబడుతుందని నివేదించబడింది.

విద్య

జిబౌటీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. 2009 నాటికి 20.5% సాంవత్సరిక బడ్జెటును విద్యాభివృద్ధి కొరకు కేటాయించింది.

జిబౌటి 
జిబౌటియన్ మహిళలు గ్లోబల్ పల్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ (2010) లో పాల్గొంటున్నారు

జిబౌటియన్ విద్యావ్యవస్థ ప్రారంభంలో ఒక పరిమిత విద్యార్థులకు తగినట్లుగా రూపొందించబడింది. అదేవిధంగా పాఠశాల విధానాన్ని అధికంగా ఉన్నతస్థాయి ఫ్రెంచ్ వలసవాద విధ్యావిధానం ఆకర్షించింది. ఇది స్థానిక పరిస్థితులకు, అవసరాలకు తగినట్లు రూపొందించబడ లేదు.

1990 ల చివరలో జిబౌటియన్ అధికారులు జాతీయ విద్యా విధానంలో సవరణలు చేసారు. నిర్వాహక అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జాతీయ అసెంబ్లీ సభ్యులు, ప్రభుత్వేతర సంస్థలు సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించారు. చొరవ శ్రద్ధ అవసరం అయిన ప్రాంతాలను గుర్తించారు. వాటిని మెరుగుపరచడానికి దృఢమైన సిఫార్సులు అందించబడ్డాయి. 2000-2010 కాలంలో విద్యా రంగం ఆధునీకరించడం కోసం ప్రభుత్వం సమగ్ర సంస్కరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2000 ఆగస్టులో అధికారిక విద్య ప్రణాళిక చట్టం ఆమోదించబడింది. పంచవర్ష ప్రణాళికా విధానంలో ఒక మధ్య-కాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ప్రాథమిక విద్యా వ్యవస్థ గణనీయంగా పునర్వ్యవస్థీకరించబడింది. నిర్భంధ విద్య ప్రవేశపెట్టబడింది. ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్య, నాలుగు సంవత్సరాల మాధ్యమిక విద్య ఇందులో భాగంగా ఉన్నాయి. సెకండరీ పాఠశాలలకు ప్రవేశానికి ప్రాథమిక విద్య సర్టిఫికేట్ అవసరమవుతుంది. అదనంగా కొత్త చట్టం ద్వితీయ స్థాయి వృత్తి బోధనను ప్రవేశపెట్టి దేశంలో విశ్వవిద్యాలయ సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

ఎడ్యుకేషనల్ ప్లానింగ్ చట్టం, మీడియం-టర్మ్ యాక్షన్ స్ట్రాటజీ ఫలితంగా విద్యా రంగం అంతటా గణనీయమైన పురోగతి నమోదు చేయబడింది. ప్రధానంగా పాఠశాల నమోదు, హాజరు నిలుపుదల శాతం కొంత ప్రాంతీయ వైవిధ్యంతో క్రమంగా అధికరించింది. 2004 నుండి 2005 నుండి 2007-08 వరకు ప్రాధమిక పాఠశాలలో బాలికలు నికర నమోదు 18.6% పెరిగింది; బాలురలో 8.0% పెరిగింది. ఇదే కాలంలో మాధ్యమిక పాఠశాలల నికర నమోదులు 72.4% అధికరించాయి. బాలురలో 52.2% అధికరించింది. సెకండరీ స్థాయిలో నమోదుల శాతం బాలికలలో 49.8%, బాలురలో 56.1% అధికరించింది.

జిబౌటియన్ ప్రభుత్వం ముఖ్యంగా సంస్థాగత మౌలిక సదుపాయాలను, బోధనా సామగ్రిని అభివృద్ధి చేయడానికి దృష్టిని కేంద్రీకరించింది. కొత్త తరగతి గదులను నిర్మించడం, పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడం ఇందులో భాగంగా ఉంది. పోస్టు గ్రాజ్యుయేషన్ విద్యాభివృద్ధి కొరకు అర్హత ఉన్న శిక్షకులను తయారుచేయడం, వృత్తి శిక్షణకు అనుగుణంగా యువతను ప్రోత్సహించటం పై దృష్టి పెట్టడం జరిగింది. 2012 నాటికి జిబౌటిలో అక్షరాస్యత శాతం 70% ఉన్నట్లు అంచనా వేయబడింది.

దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి " జిబౌటి విశ్వవిద్యాలయం " స్థాపించబడింది.

సంస్కృతి

జిబౌటి 
Traditional wood-carved jar from Oue'a in the Tadjourah region.

జిబౌటియన్ వస్త్రధారణ ప్రాంతం వేడి శుష్క వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. జీన్సు, టీ షర్టులు వంటి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు, పురుషులు సాధారణంగా మాకవిస్ ధరిస్తారు. ఇది నడుము చుట్టూ ధరించే సాంప్రదాయ సరోంగ్ లాంటి వస్త్రం. అనేకమంది సంచార జాతులకు చెందిన ప్రజలు టోగా (రోమన్ టోగా) అని పిలిచే తెల్లటి పత్తి వస్త్రాన్ని ధరిస్తారు. దీనిని మోకాలి మీదుగా చుట్టి భుజం మీద వేసుకుంటారు.

స్త్రీలు సాధారణంగా డైరక్ ధరిస్తారు. ఇది ఒక పొడవైన, తేలికపాటి, డయాఫనస్ వాయైలె అనే డ్రెసు. ఇది పత్తి లేదా పాలిస్టరుతో తయారుచేసే ఈ డ్రెసును పూర్తి-పొడవు, సగం-స్లిప్, బ్రాతో ధరిస్తారు. వివాహిత స్త్రీలు షాషు అని పిలువబడే డ్రెసును తలపై ధరిస్తారు. అలాగే గార్బాసరు అనే వస్తంతో పై శరీరాన్ని కప్పుకుంటారు. పెళ్లి కాని యువతులు అయితే ఎల్లప్పుడూ వారి తలలు కప్పే వస్త్రం ధరించరు. సంప్రదాయ అరేబియన్లలో పురుషులు జెల్బియా (సోమాలీలో జెల్లీయ్యాద్), స్త్రీ జిల్బాబులు వంటి సాంప్రదాయ అరేబియా వస్త్రం ధరిస్తారు. పండుగలు వంటి కొన్ని సందర్భాలలో మఘ్రేబు లోని బెర్బెరు తెగల ప్రజలు ధరించే ఆభరణాలకు సమానమైన ప్రత్యేక నగలతో, తల వస్త్రాలతో స్త్రీలు తమను తాము అలంకరించవచ్చు.

జిబౌటీ వాస్తవిక కళ చాలావరకు మరుగునపడి ప్రధానంగా పాటల రూపంలో మౌఖికంగా సంరక్షించబడుతుంది. ఇస్లామిక్, ఒట్టోమన్, ఫ్రెంచి ప్రభావాల అనేక ఉదాహరణలు స్థానిక భవనాల్లో కూడా గుర్తించవచ్చు, వీటిలో ప్లాస్టార్వరు పని, సంప్రదాయ చిత్రాలు, కాలిగ్రాఫులు ఉన్నాయి.

సంగీతం

జిబౌటి 
The oud is a common instrument in traditional Djibouti music.

సోమాలీ ప్రజలు సోమాలి జానపద నృత్య ఆధారిత సుసంపన్నమైన సంగీత వారసత్వాన్ని కలిగి ఉన్నారు. చాలా సోమాలి పాటలు పెంటటోనిక్గా (పంచ గమకాలు)ఉంటాయి. వారు ప్రధాన స్థాయి వంటి హిప్టాటోనిక్ (సప్త గమకాలు)కు భిన్నంగా కేవలం ఎనిమిదికి ఐదు స్వరాలను మాత్రమే ఉపయోగిస్తారు. సోమాలీ సంగీతం మొట్టమొదట వినగానే ఇథియోపియా, సుడాన్ లేదా అరేబియా ద్వీపకల్పం వంటి సమీప ప్రాంతాల శబ్దాలకంటే భిన్నంగా వినపడుతుంది. కానీ దాని స్వంత ప్రత్యేక స్వరాలు, శైలులు చివరికి గుర్తించబడతాయి. సోమాలీ పాటలు పాటల రచయితలు (లక్ష్కాన్), గాయకులు (కోడ్కా "వాయిస్") మధ్య సహకార విధానంతో రూపొందించబడుతుంటాయి. ప్రేమ ఆధారిత గీతాలతో కూడిన సోమాలీ సంగీతబాణి " బాల్వో " జిబౌటిలో ప్రజాదరణ పొందింది.

సాంప్రదాయ అఫారు సంగీతం హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల (ఇథియోఫియా) జానపద సంగీతాన్ని పోలి ఉంటుంది. ఇది అరబిక్ సంగీత మూలాంశాలను కలిగి ఉంటుంది. జిబౌటీ చరిత్ర సంచార ప్రజల కవిత్వం, పాటల్లో నమోదు చేయబడింది. సంచార తెగల ప్రజలు వేలాది సంవత్సరాలకు ముందు చర్మాలను ఇచ్చి పురాతన ఈజిప్ట్, భారతదేశం, చైనా మసాలాదినుసులు, పరిమళద్రవ్యాలను కొనుగోలు చేసేవారు. అఫర్ సాహిత్యం కూడా అధికంగా సంగీతమయంగా ఉంటుంది. వివాహం, యుద్ధం, ప్రశంసలు, ప్రగల్భాలు వంటి భావాలను పాటలరూపంలో వ్యక్తపరుస్తుంటారు.

సాహిత్యం

జిబౌటిలో సుదీర్ఘ కవిత్వ సంప్రదాయం ఉంది. బాగా అభివృద్ధి చేయబడిన సోమాలీబాణి గబాయ్, జిఫ్టో, జీరారు, విగ్లో, బురన్బరు, బీర్కాడే, అఫరే, గ్యారూ మొదలైన సొమాలీ కవిత్వ రూపాలు ఉన్నాయి. గబే (ఇతిహాస పద్యం) చాలా క్లిష్టంగా తరచుగా 100 వరుసల పొడవైన కవిత్వరూపంలో ఉంటుంది. ఒక యువ కవి పద్యం కంపోజు చేయగలిగినప్పుడు కవిత్వ సాధనగా పరిగణించబడుతుంది. ఇది ఉన్నత కవిత్వంగా పరిగణించబడుతుంది. మెమోరిజరు బృందాలు, రీసిటర్ల బృందాలు (హఫీదాయాల్) సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందిన కళారూపాన్ని ప్రచారం చేశారు. కవితలకు బారూరోడిక్ (స్మృతి సంగీతం), అమాన్ (ప్రశంసలు), జాకేల్ (శృంగారం), గుహదీన్ (దూషణ), డిగ్రోలో (గ్లోయింగ్), గుబాబాబో (మార్గదర్శకత్వం) వంటి పలు అంశాలు నేపథ్యంగా ఉంటాయి. ఒక ప్రముఖ కవి, వ్యక్తి మరణం జ్ఞాపకార్ధం బారూరోడికు స్వరపరచబడింది. అఫార్ జిన్నాలికి అనుసంధానితమై ఉంటుంది. ఇంది వీరత్వం, కవిత్వం, భక్తి కలగలిసిన జానపద కథల మౌఖిక సంప్రదాయం. వారు కూడా యుద్ధ సంబంధిత పాటలలో ప్రతిభను కలిగి ఉన్నారు.

అదనంగా, జిబౌటిలో సుదీర్ఘమైన ఇస్లాం సాహిత్యం సంప్రదాయం ఉంది. 16 వ శతాబ్దంలో అబిస్సినియా మీద అడాల్ సుల్తానేట్ సైన్యం ఆక్రమణకు సాహిత్యరూపం ఇస్తూ షియాబ్ అల్-దీను రచించిన ఫుటుహ్ అల్-హబాష్ అత్యంత ముఖ్యమైన చారిత్రక రచనలలో ఒకటిగా భావించబడుతుంది. సమీపకాలంలో అనేకమంది రాజకీయవేత్తలు, మేధావులు తమ జ్ఞాపకాలను వ్రాతబద్ధం చేసారు.

క్రీడలు

జిబౌటియన్లలో ఫుట్బాలు క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది. 1994 లో జిబౌటీ " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. " సభ్యదేశం అయినప్పటికీ 2000 లో ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్సు వరల్డు కప్పులలో క్వాలిఫైయింగు రౌండ్లలో మాత్రమే పాల్గొంది. నవంబరు 2007 నవంబరులో జిబౌటి జాతీయ ఫుట్బాల్ జట్టు 2010 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పు క్వాలిఫికేషన్ రౌండ్లలో సోమాలియా జాతీయ జట్టు మీద 1-0 తేడాతో విజయం సాధించి ఇది మొట్టమొదటి వరల్డ్ కప్-సంబంధిత విజయాన్ని మొదటిసారిగా నమోదు చేసింది. సమీపకాలం నుండి నూతనక్రీడలు అభివృద్ధి చేయబడుతున్నాయి. విలువిద్య వంటి క్రీడలు పరిచయం చేయబడుతున్నాయి. ప్రపంచ ఆర్చరీ ఫెడరేషను జిబౌటీ ఆర్చరీ ఫెడరేషన్ను అమలు చేయడానికి సహాయం చేసింది. తూర్పు ఆఫ్రికా, ఎర్ర సముద్ర ప్రాంతంలో విలువిద్య అభివృద్ధికి మద్దతుగా ఆర్టాలో అంతర్జాతీయ విలువిద్య శిక్షణ కేంద్రం స్థాపించబడింది.

ఆహార సంస్కృతి

జిబౌటి 
A plate of sambusas a popular traditional snack.

జిబౌటియన్ వంటకాలు సోమాలి, అఫార్, యెమెన్, ఫ్రెంచి వంటల మిశ్రమంతో అదనంగా దక్షిణ ఆసియా (ముఖ్యంగా భారతీయ) ఆహారాలతో ప్రభావితమై ఉంటాయి. స్థానిక వంటకాలు సామాన్యంగా కుంకుమ పూవు నుండి దాల్చినచెక్క వంటి మధ్యప్రాచ్య సుగంధాలను ఉపయోగించి తయారు చేస్తారు. తందూరి శైలి ఓవెన్లలో వండ యెమెని చేప స్థానిక రుచికరమైన వంటకం ప్రజాదరణ కలిగి ఉంది. సంప్రదాయ వంటకాలలో ఫహ్-ఫాహ్ లేదా "సోప్ జిబౌటిన్నె" (కారంగా ఉండే ఉడికించిన గొడ్డు మాంసం సూప్) నుండి, యెటకెల్టు వెట్ (స్పైసి మిశ్రమ కూరగాయల వంటకం)వంటి అనేక వైవిద్యమైన మసాలా వంటకాలు లభిస్తాయి. క్సెలో ("హలో" అని ఉచ్ఛరిస్తారు) లేదా హల్వా వంటి ఆహారాలు ఈద్ ఉత్సవాలు లేదా వివాహ రిసెప్షన్ల వంటి పండుగ సందర్భాలలో తినడం ఒక ప్రసిద్ధ సాంప్రదాయంగా ఉంది. హల్వా చక్కెర, మొక్కజొన్న పిండి, ఏలకులు పొడి, జాజికాయ పొడి, నెయ్యి వేసి తయారు చేస్తారు.ఒ కొన్నిసార్లు రుచిని పెంచడానికి వేరుశనగలు జోడించబడతాయి. భోజనం తర్వాత గృహాలలో సాంద్రాణి వంటి సుగంధాలను ఉపయోగించి ధనికులు ధూపం వేస్తారు.

మూలాలు

బయటి లింకులు

Djibouti గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

జిబౌటి  నిఘంటువు విక్షనరీ నుండి
జిబౌటి  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
జిబౌటి  ఉదాహరణలు వికికోట్ నుండి
జిబౌటి  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
జిబౌటి  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
జిబౌటి  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

    ప్రభుత్వం

Tags:

జిబౌటి చరిత్రజిబౌటి భౌగోళికంజిబౌటి ఆర్ధికంజిబౌటి గణాంకాలుజిబౌటి సంస్కృతిజిబౌటి మూలాలుజిబౌటి బయటి లింకులుజిబౌటిఅరబ్బీఇథియోపియాఎరిట్రియాసోమాలియా

🔥 Trending searches on Wiki తెలుగు:

హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులురామసేతుకమల్ హాసన్ నటించిన సినిమాలువిశాల్ కృష్ణతాటి ముంజలుజన సాంద్రతద్వాపరయుగంఆశ్లేష నక్షత్రముశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ప్రీతీ జింటాసెక్స్ (అయోమయ నివృత్తి)మొదటి ప్రపంచ యుద్ధంఫ్లిప్‌కార్ట్దాశరథీ శతకముఆప్రికాట్రావి చెట్టుజూనియర్ ఎన్.టి.ఆర్తామర వ్యాధిఇరాన్చదరంగం (ఆట)కేతువు జ్యోతిషంహరి హర వీరమల్లుదశరథుడుగుణింతంఉబ్బసముసంక్రాంతికాప్చాకంచుమంతెన సత్యనారాయణ రాజునక్సలైటుశ్రీరంగనీతులు (సినిమా)సంజు శాంసన్పరిటాల రవిపెడన శాసనసభ నియోజకవర్గంసంగీత వాయిద్యంబౌద్ధ మతంచెక్ (2021 సినిమా)మహాసముద్రంకలబందతెలుగు సినిమాల జాబితాఒంటెఏప్రిల్ 19మాదిగయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్సింహరాశివినాయకుడుఫ్యామిలీ స్టార్హోళీదానంబారసాలకర్ర పెండలంవాలిమియా ఖలీఫాహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనిధి అగర్వాల్శ్రీ కృష్ణుడుభీష్ముడుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిప్రభాస్నవమిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పాములపర్తి వెంకట నరసింహారావుసంపూర్ణ రామాయణం (1959 సినిమా)ఎయిడ్స్అలంకారంపర్యాయపదంఉత్తరాషాఢ నక్షత్రముఉత్తరాభాద్ర నక్షత్రముటాన్సిల్స్ప్రజా రాజ్యం పార్టీసంధ్యావందనంనాస్తికత్వంకమ్మభారతదేశంలో విద్యపార్లమెంటు సభ్యుడుసెక్యులరిజంఅదితి శంకర్పిఠాపురంవిశాఖపట్నం🡆 More