ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదెర్లాండ్స్ రాజధాని

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ రాజధాని.

మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 24,10,960. నగరంలో ఉన్న అనేక కాలువల కారణంగా దీన్ని ఉత్తరాది వెనిస్ గా దీన్ని పేర్కొంటారు. ఈ కాలువలను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదెర్లాండ్స్ రాజధాని
ఆమ్‌స్టర్‌డ్యాం, నార్త్‌ సీ కాలువల ఉపగ్రహ చిత్రం

ఆమ్‌స్టెల్ అనే నది పైన కట్టిన డ్యాము వద్ద ఉన్న నగరంగా దీనికి ఆ పేరు వచ్చింది. 12 వ శతాబ్దిలో చేపల పట్టే వారి పల్లెగా ఇది వెలసింది. 17 వ శతాబ్దిలో ఒక ముఖ్యమైన రేవుపట్టణంగా, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. 19, 20 శతాబ్దాల్లో నగరం బాగా విస్తరించింది.

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్‌కు వాణిజ్య రాజధని. సాంస్కృతిక రాజధాని కూడా. ఫిలిప్స్, అక్జోనోబెల్, టోంటోం, ఐఎన్‌జి వంటి అనేక సంస్థల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఉబర్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా వంటి విదేశీ సంస్థల ఐరోపా కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. 2012 లో, ఐరోపా లోని అత్యంత జీవనానుకూలమైన నగరాల్లో రెండవదిగా ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎంపికైంది. జీవన నాణ్యతలో ప్రపంచంలో 12 వ అత్యుత్తమ నగరంగా మెర్సర్ ఎంపిక చేసింది. అత్యుత్తమ సాంకేతిక కేంద్రాల్లో ప్రపంచంలో 4 వ స్థానంలోను, ఐరోపాలో రెండవ స్థానం లోనూ నిలిచింది. ఆమ్‌స్టర్‌డ్యామ్ ఐరోపాలో ఐదవ అతి పెద్ద రేవుపట్టణం. ఆమ్‌స్టర్‌డ్యామ్ లోని షిఫోల్ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీలో ఐరోపా లోకెల్లా మూడవ స్థానంలో ఉంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ పౌరుల్లో ప్రముఖులు రెంబ్రాంట్, వాన్ గాఫ్.

భౌగోళికం

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలో నార్త్ హాలండ్ ప్రావిన్సులో ఉంది.అంస్టెల్ నది నగరం మధ్య వరకూ ప్రవహించి ఆగిపోతుంది. అక్కడి నుండి అనేక కాలువలుగా చీలి పోతుంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ సముద్ర మట్టానికి 2 మీటర్ల దిగువన ఉంటుంది. నగర విస్తీర్ణం 219.4 చ.కి.మీ. ఇందులో పార్కులు, ప్రకృతి వనాలు 12% భాగాన్ని ఆక్రమిస్తాయి..

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాభాగవతంకడప లోక్‌సభ నియోజకవర్గంశ్రవణ నక్షత్రముధర్మరాజుసంధ్యావందనంకన్యారాశికర్ణాటకరామాయణంలోని పాత్రల జాబితాముత్యాలముగ్గుభరణి నక్షత్రముఛత్రపతి శివాజీసప్త చిరంజీవులుపంచభూతాలువై.యస్.భారతిఅమరావతి స్తూపంఅంగారకుడు (జ్యోతిషం)గంగా నదిరక్తంఅయ్యప్పకృష్ణా నదిగౌడశివుడువిశాల్ కృష్ణసంజు శాంసన్అనసూయ భరధ్వాజ్సీతా రామంAవిడదల రజినికుంభరాశిఅధిక ఉమ్మనీరుపూరీ జగన్నాథ దేవాలయంరూప మాగంటితెలుగుకుటుంబంభారత రాజ్యాంగంశ్రీనాథుడుమంగళసూత్రంభాగ్యశ్రీ బోర్సేరామాయణంలో స్త్రీ పాత్రలునర్మదా నదిగురువు (జ్యోతిషం)మండల ప్రజాపరిషత్కంచుపాలపిట్టపరిటాల రవిపరకాల ప్రభాకర్గాయత్రీ మంత్రంసింగిరెడ్డి నారాయణరెడ్డిబ్రహ్మ (1992 సినిమా)జనకుడుఆదిత్య హృదయంశివ పురాణంరాజమండ్రికల్వకుంట్ల చంద్రశేఖరరావుఅశోకుడుకాశీలైంగిక సంక్రమణ వ్యాధిప్రేమలుభారతదేశంలో విద్యమంజుమ్మెల్ బాయ్స్గోల్కొండతెలంగాణ జిల్లాల జాబితామల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంమఖ నక్షత్రముచంద్రుడు జ్యోతిషంనరేంద్ర మోదీ స్టేడియంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)టిల్లు స్క్వేర్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాభారతదేశ చరిత్రహైదరాబాద్ రేస్ క్లబ్దశరథుడుభగవద్గీతఆదిపురుష్వృషణంతెలంగాణా సాయుధ పోరాటం🡆 More