వికీపీడియా

వికీపీడియా, వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.

దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది

వికీపీడియా
జిమ్మీ వేల్స్, వికీపీడియా సహ వ్యవస్థాపకుడు

చరిత్ర

వికీపీడియా 
లారీ సాంగర్, వికీపీడియా సహ వ్యవస్థాపకుడు

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్స్,, దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.

లారీ సాంగర్, జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.

సాఫ్టువేరు , హార్డువేరు

వికీపీడియా ఓపెన్ సోర్సు, ఉచితంగా లభించే వికీమీడియా సాఫ్టువేరు ఆధారంగా నడుస్తుంది. ఇది పి హెచ్ పి (PHP) అనే భాషలో అభివృద్ధి చేయబడింది. దీనిలో వాడే డేటాబేసు పేరు మై ఎస్ క్యు ఎల్ (MySQL). ఇది జి ఎన్ యు జనరల్ పబ్లిక్ లైసెన్సు క్రింద రిజిస్టర్ చేయబడి ఉంది.

ఇతర భాషలు

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబరు 2007 గణాంకాలననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

ఎంతవరకూ ఆధారపడవచ్చు?

వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేవారు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నమోదు చేసుకోని సభ్యులు చేసే మార్పులు కూడా సభ్యత్వం ఉన్నవారు చేసే మార్పులతో సరిపోల్చగలవని 2007లో డార్ట్ మౌత్ అనే కాలేజీలో జరిగిన పరిశోధన ఆధారంగా తేలింది.

విమర్శ

వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా మార్పులు చేయవచ్చు కాబట్టి, ఈ సమాచారం మీద పూర్తిగా ఆధారపడలేమన్నది కొద్ది మంది విమర్శకుల వాదన. అంతేకాకుండా కొన్ని వ్యాసాలకు సరైన మూలాలు లేవని కూడా వారు భావిస్తున్నారు. కొద్ది మంది వ్యాఖ్యాతలు మాత్రం వికీపీడియా మొత్తంగా పోల్చుకుంటే ప్రమాణాలు కలిగిఉంది కానీ ఏదైనా ఒక్క వ్యాసాన్ని తీసుకుని దాని నాణ్యతను కచ్చితంగా అంచనా వేయలేమని భావిస్తున్నారు.

సోదర ప్రాజెక్టులు

వికీపీడియాతో బాటు అదే బాటలో నడిచే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. విక్షనరీ సమష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు[permanent dead link] ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం.

మూలాలు

ఇవి కూడా చూడండి

Tags:

వికీపీడియా చరిత్రవికీపీడియా సాఫ్టువేరు , హార్డువేరువికీపీడియా ఇతర భాషలువికీపీడియా ఎంతవరకూ ఆధారపడవచ్చు?వికీపీడియా విమర్శవికీపీడియా సోదర ప్రాజెక్టులువికీపీడియా మూలాలువికీపీడియా ఇవి కూడా చూడండివికీపీడియా2001ఇంటర్నెట్జిమ్మీ వేల్స్లారీ సాంగర్వికీమీడియావిజ్ఞాన సర్వస్వమువెబ్ సైటు

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకులంధర్మరాజుపూరీ జగన్నాథ దేవాలయంసుమతీ శతకముభారత పార్లమెంట్సురేఖా వాణిబెల్లంవై.యస్.రాజారెడ్డిసింగిరెడ్డి నారాయణరెడ్డివై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు విద్యార్థిరామావతారంనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంతిరువీర్పార్లమెంటు సభ్యుడుఎనుముల రేవంత్ రెడ్డిసత్య సాయి బాబాఆవర్తన పట్టికతెనాలి రామకృష్ణుడుకుక్కఏలూరుసంజు శాంసన్నరసింహ (సినిమా)మీనరాశిపరీక్షగోత్రాలు జాబితాదిల్ రాజువై.ఎస్.వివేకానందరెడ్డిసింహరాశిఅల్లు అర్జున్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు నాటకరంగంఏనుగు లక్ష్మణ కవిమంతెన సత్యనారాయణ రాజుత్రివిక్రమ్ శ్రీనివాస్భారత రాష్ట్రపతుల జాబితామంగళగిరి శాసనసభ నియోజకవర్గంత్రిష కృష్ణన్ఇజ్రాయిల్గోవిందుడు అందరివాడేలేవాయు కాలుష్యంమీనాక్షి అమ్మవారి ఆలయంఅరవింద్ కేజ్రివాల్అమ్మల గన్నయమ్మ (పద్యం)డీజే టిల్లుమూలా నక్షత్రంసరస్వతికర్ణాటకతెలంగాణవంగవీటి రాధాకృష్ణసమాచారంఅంతర్జాతీయ ద్రవ్య నిధిపవన్ కళ్యాణ్హను మాన్నువ్వుల నూనెగోదావరిరామప్ప దేవాలయంహల్లులుతరుణ్ కుమార్రక్తపోటుమిలియనుయోనిఇండియన్ ప్రీమియర్ లీగ్నువ్వులుయువరాజ్ సింగ్అశోకుడుపెళ్ళిసచిన్ టెండుల్కర్పెళ్ళి (సినిమా)తెలుగు కథతిలక్ వర్మతెలుగులో అనువాద సాహిత్యంతెలుగు సినిమాలు డ, ఢకడియం కావ్యప్లీహములోక్‌సభ🡆 More