ముఖ్య కార్యనిర్వాహక అధికారి

ముఖ్య కార్యనిర్వాహక అధికారి అనగా ఏదేని పబ్లిక్ సంస్థ లేదా ప్రవేట్ సంస్థ అనగా లాభాపేక్ష సంస్థ కోసం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి లేదా అత్యంత సీనియర్ కార్పొరేట్ అధికారి (ఎగ్జిక్యూటివ్) స్థానంలో ఉన్నవాడు అని అర్థం.

ముఖ్య కార్యనిర్వాహక అధికారిని ఆంగ్లంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer లేదా CEO) అని అంటారు.తరచుగా ఈ స్థానానికి పనిచేసే ముఖ్య కార్యనిర్వాహక అధికారిని అమెరికన్ ఇంగ్లీష్ లో CEO, నిర్వహణ డైరక్టర్, బ్రిటిష్ ఇంగ్లీష్ లో మేనేజింగ్ డైరెక్టర్ (MD) అని, ఇంకా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CE) వంటి ఇతర పేర్లు ఉన్నాయి. ఇతను సంస్థ మొత్తం విజయానికి, ఉన్నత స్థాయి నిర్వాహక నిర్ణయాలు తీసుకోవటానికి,సంస్థకు సంబందించిన అన్ని బాధ్యతలకు పూర్తి బాధ్యత వహిస్తాడు.

ముఖ్య కార్యనిర్వాహక అధికారి
దినేష్ కనబార్,దృవ ఎడ్వవైజర్స్ కంపెనీ స్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్

కార్పొరేషన్ లేదా కంపెనీ సీఈఓ సాధారణంగా బోర్డు డైరెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాడు.దీని ప్రాథమిక బాధ్యతలు, ప్రధాన కార్పొరేట్ నిర్ణయాలు తీసుకోవడం, ఒక సంస్థ మొత్తం కార్యకలాపాలు,వనరులను నిర్వహించడం, డైరెక్టర్ల బోర్డు మధ్య కమ్యూనికేషన్ ప్రధాన బిందువుగా వ్యవహరించడంలాంటి విధులు నిర్వహిస్తాడు. కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలు సి.ఇ.ఓ.లను డైరెక్టర్ల బోర్డుద్వారా ఎన్నుకుంటారు.

సిఇఒ విధులు, బాధ్యతలు

సి.ఇ.ఓ. విధులు, బాధ్యతలు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారుతూ ఉంటాయి. ఇది సంస్థాగత నిర్మాణం లేదా సంస్థ పరిమాణాన్ని బట్టి ఉంటుంది. చిన్న కంపెనీలలో దిగువ స్థాయి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిని నియమించడం వంటి చర్యలు సి.ఇ.ఓ చేతుల మీదుగా జరుగుతుంది. పెద్ద కంపెనీలలో సిఇఓ సాధారణంగా ఉన్నత స్థాయి కార్పొరేట్ వ్యూహం, ప్రధాన కంపెనీ నిర్ణయాలతో మాత్రమే వ్యవహరిస్తాడు. ఇతర పనులు నిర్వాహకులకు లేదా వివిధ విభాగాలకు అప్పగించబడతాయి.సిఇఓలకు దిగువ వివరింపబడిన విధులు భాధ్యతలు కలిగి ఉన్నాడు.

  • ఒక సంస్థ లేదా సంస్థల మొత్తం విజయానికి కారకుడిగా వ్యవహరిస్తాడు.కంపెనీ వాటాదారుల విలువను అదనంగా పెంచే లక్ష్యంతో దీర్ఘకాలిక వ్యూహాల అభివృద్ధి,అమలుకు నాయకత్వం వహించే బాధ్యత సి.ఇ.ఓ.పైన ఉంది.
  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్రలు, బాధ్యతల ప్రామాణిక జాబితా ప్రత్యేకంగా లేదు.
  • సంస్థ తరపున, వాటాదారులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటాడు.
  • సంస్థ స్వల్ప దీర్ఘకాలిక వ్యూహ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తాడు.
  • సంస్థ, సంస్థల దృష్టి లక్ష్యాన్ని సృష్టించడం,అమలు చేయడం సిఇఓ నిర్వహణలో ఉంటుంది.
  • డైరెక్టర్లు, ఉపాధ్యక్షులు, అధ్యక్షులతో సహా సంస్థలోని ఇతర కార్యనిర్వాహక నాయకుల పనిని అంచనా వేయటం.
  • పోటీ మార్కెట్, ప్రకృతి వైపరీత్యాలద్వారా జరిగిన కష్ట,నష్టాలకు నివేదికలు తయారు చేయటం, విస్తరణ అవకాశాలు, పరిశ్రమ పరిణామాలు మొదలైన వాటిపై అవగాహన కలిగి ఉండటం.
  • వ్యాపారం చేసే చోట కంపెనీ అధిక సామాజిక బాధ్యతను నిర్వహించే భరోసా కలిగి ఉంటాడు.
  • సంస్థకు నష్టాలను అంచనా వేయడం, వాటిని పర్యవేక్షించడం, తగ్గించటానికి అవసరమైన చర్యలు చేపడతాడు.వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించడం.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలుఆంగ్లంనిర్వహణ

🔥 Trending searches on Wiki తెలుగు:

మాల (కులం)రక్త పింజరికల్వకుంట్ల కవితమహాత్మా గాంధీబొల్లిజొన్ననవీన్ పట్నాయక్సాయి ధరమ్ తేజ్భారతదేశంలో కోడి పందాలుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)బాలగంగాధర తిలక్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిక్షత్రియులుమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంజవహర్ నవోదయ విద్యాలయంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాసూర్య (నటుడు)అంగచూషణపూజా హెగ్డేభారతీయ రిజర్వ్ బ్యాంక్భారత రాష్ట్రపతివర్షం (సినిమా)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభరతుడు (కురువంశం)దశావతారములుకానుగభారతీయ జనతా పార్టీఐక్యరాజ్య సమితిభారత పార్లమెంట్సామెతలుశ్రీరామరాజ్యం (సినిమా)బరాక్ ఒబామాగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతెలుగు సినిమాలు డ, ఢసమంతఏప్రిల్భారతదేశంజ్యోతీరావ్ ఫులేసరస్వతిపాల్కురికి సోమనాథుడుపాలపిట్టరాహుల్ గాంధీభగత్ సింగ్థామస్ జెఫర్సన్శక్తిపీఠాలుతెలుగు సంవత్సరాలుబంగారంఅంజలి (నటి)గోవిందుడు అందరివాడేలేదశరథుడుభారతదేశంలో మహిళలుహరే కృష్ణ (మంత్రం)వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఊరు పేరు భైరవకోనఎఱ్రాప్రగడఫ్లిప్‌కార్ట్ఇక్ష్వాకు వంశంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)టిల్లు స్క్వేర్ఏప్రిల్ 17భారత జాతీయ కాంగ్రెస్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఇక్ష్వాకులుఓంనువ్వు నాకు నచ్చావ్మగధీర (సినిమా)ఉత్తరాషాఢ నక్షత్రముతెలంగాణా బీసీ కులాల జాబితాజి.కిషన్ రెడ్డిమహాభాగవతంహార్దిక్ పాండ్యాచిలుకద్వాపరయుగంపుష్యమి నక్షత్రముబ్రాహ్మణ గోత్రాల జాబితాపుచ్చపంచభూతలింగ క్షేత్రాలు🡆 More