వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి.
ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.
మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
వ్యాసంలో ఒక సమాచారాన్ని నిర్ధారించడానికి ఆధారంగా పనికివచ్చే పుస్తకాలు, వెబ్సైట్లు, జర్నల్స్, పత్రికలు, వీడియోలు వంటివాటన్నిటినీ మూలాలుగానే ఈ మార్గదర్శక పేజీ పేర్కొంటుంది. వీటిని ప్రధానంగా మూడుగా విభజించవచ్చు:
ఒక అంశానికి నేరుగా సంబంధించిన మూలాలను ప్రాథమిక మూలాలు అనవచ్చు, ఇవి ఆ అంశానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు రాసేవి. ఉదాహరణకు ఒక సంఘటనకు ప్రత్యక్ష సాక్షుల కథనం, ఒక వ్యక్తి ఆత్మకథ, ఒక సందర్భంలో స్థానిక పత్రికా విలేకరి ప్రత్యక్ష కథనం వంటివి ప్రాథమిక మూలాలు. ప్రాథమిక మూలాల ఆధారంగా వ్యాసంలో పెద్ద భాగాలను కానీ, విశ్లేషణాత్మకమైన అంశాలను కానీ రాయకూడదు, అలానే మొత్తం వ్యాసాన్ని ప్రాథమిక మూలం ఆధారంగా రాయడమూ తగదు. ప్రాథమిక మూలాల నమ్మదగ్గవిగానూ, ఉపయోగకరంగానూ ఉండే సందర్బాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మౌలిక పరిశోధన కాకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో చేసే సూచనలు ఇవి.
ద్వితీయ స్థాయి మూలాలు ప్రాథమిక మూలాలు, ద్వితీయ స్థాయి మూలాలు వంటివి ఆధారం చేసుకుని తయారుచేసే విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక మూలాలు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షుల కథనాలకు తోడు, గణాంకాలను స్వీకరించి పరిశోధించి నిర్ధారణకు వస్తూ వ్యాసాన్ని రాస్తే అది ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. అలానే ఆత్మకథను, ఆ వ్యక్తి గురించిన పలు ద్వితీయ స్థాయి మూలాలను మథించి రాసే జీవిత చరిత్ర ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. ప్రాథమిక, తృతీయ స్థాయి మూలాలతో పాటు అదే సమాచారాన్ని నిర్ధారించగల ద్వితీయ స్థాయి మూలాలు దొరుకుతూంటే ద్వితీయ స్థాయి మూలాలనే ఎంచుకోవాలి, వికీపీడియా వ్యాసాలు మౌలికంగా ద్వితీయ స్థాయి మూలాల ఆధారంగా నిర్మించాలి.
ప్రాథమిక, ద్వితీయ స్థాయి మూలాల నుంచి సమాచారాన్ని విషయపరంగా కానీ, సూచికగా కానీ క్రోడీకరిస్తూ రూపొందించేవి తృతీయ స్థాయి మూలాలు. విజ్ఞాన సర్వస్వాలు, పాఠ్యపుస్తకాలు, పెద్ద బాలశిక్ష వంటివి తృతీయ స్థాయి మూలాలు. విజ్ఞాన సర్వస్వాలు, పరిచయ స్థాయిలోని పాఠ్యపుస్తకాలు వంటివి మూలాలుగా ఉపయోగపడతాయి. అయితే వికీపీడియా తృతీయ స్థాయి మూలం అయినా, వికీపీడియా వ్యాసాలను మూలాలుగా వినియోగించకూడదు.
బ్రేకింగ్-న్యూస్ రిపోర్టులలో తరచూ తీవ్రమైన తప్పులు ఉంటూ ఉంటాయి. ఒక ఎలక్ట్రానిక్ ప్రచురణగా, వికీపీడియా తాజాగా ఉంటుంది. ఉండాలి కూడా. కానీ వికీపీడియా వార్తాపత్రిక కాదు. ఇది నిజ సమయంలో వర్తమాన ఘటన యొక్క అన్ని వివరాలలోకి వెళ్లవలసిన అవసరం లేదు. తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయడంలో సహాయం చేయడం కంటే విజ్ఞానసర్వస్వానికి వివరాలను జోడించే ముందు, ఘటన జరిగిన తరువాత ఒకటి రెండు రోజులు వేచి ఉండటం మంచిది. ఈ సమయంలో జర్నలిస్టులు మరింత సమాచారం సేకరించడం, వివిధ వార్తలను ధ్రువీకరించడం, దర్యాప్తు అధికారుల నుండి అధికారిక ప్రకటనలు రావడం జరుగుతుంది. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కన్స్యూమర్స్ హ్యాండ్‌బుక్ లో అనామక మూలాలు, ధృవీకరించని నివేదికలు, అలాగే ఇతర వార్తా మాధ్యమాలకు ఆపాదించబడిన నివేదికలు వంటి అవిశ్వసనీయమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్నీ వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి అనేక సూచనలు ఉన్నాయి. బహుళ వనరులను కోరడం; ప్రత్యక్ష సాక్షుల నివేదికలను కోరడం; సంభావ్య బూటక వార్తల గురించి జాగ్రత్తగా ఉండటం, సామూహిక కాల్పుల్లో అదనపు దాడి చేసేవారి గురించిన నివేదికల గురించి సందేహంగా ఉండటం వంటివి ఇందులో భాగం.
ప్రారంభ వార్తా నివేదికలకు మూలాధారమైన క్లెయిమ్‌లను ప్రచురించిన వెంటనే వాటిని వెంటనే మెరుగైన-పరిశోధన హరిపిన వాటితో మార్చివేయాలి. ప్రత్యేకించి ఆ ఒరిజినల్ నివేదికలు సరికానివని తేలితే. బ్రేకింగ్-న్యూస్ కథనాలన్నీ, మినహాయింపే లేకుండా, ప్రాథమిక మూలాలే. వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి: వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం § ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మూలాలు చూడండి.
బ్రేకింగ్-న్యూస్ ఈవెంట్ గురించిన వ్యాసాల పేజీల్లో పైన {{current}}, {{recent death}} వంటి మూసలను చేర్చవచ్చు. వ్యాసంలోని కొంత సమాచారం సరికాదని పాఠకులను హెచ్చరించడానికి, మెరుగైన మూలాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని చేర్చాల్సిన అవసరాన్ని తెలపడానికీ ఇవి పనికొస్తాయి. అయితే, ఈ మూసలను వార్తల్లోని విషయాలకు, లేదా వ్యక్తులపై వ్యాసాలకూ ఉపయోగించకూడదు; అలా చేస్తే వందల వేల వ్యాసాల్లో అటువంటి మూసలు ఉంటాయి. కానీ దానివలన పెద్దగా ప్రయోజనం ఉండదు.
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.