యూట్యూబ్

యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ.

దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

యూట్యూబ్
యూట్యూబ్
Screenshot
Type of site
వీడియో ఆతిథ్య సేవ
Foundedఫిబ్రవరి 14, 2005; 19 సంవత్సరాల క్రితం (2005-02-14)
Headquarters901 చెర్రీ అవెన్యూ
శాన్ బర్నో, కాలిఫోర్నియా,
అమెరికా
Ownerఆల్ఫాబెట్
Founder(s)
  • స్టీవ్ చెన్
  • చాడ్ హార్లీ
  • జావెద్ కరీం
CEOసుసాన్ వుజిసిక్
Industryఅంతర్జాలం
వీడియో హోస్టింగ్ సేవ
Parentగూగుల్ (2006–ప్రస్తుతం)
Advertisingగూగుల్ యాడ్ సెన్స్
Registrationఐచ్చికం (చాలా వీడియోలు చూడటానికి ఇందులో సభ్యులుగా నమోదు కానవసరం లేదు. కానీ వీడియోలు ఎక్కించడానికి, 18 సంవత్సరాలు నిండినవారు చూడగలిగే వీడియోలు చూడాలంటే, ప్లే లిస్టులు తయారు చేసుకోవాలంటే, ఇష్టాయిష్టాలను గుర్తించడానికి, వ్యాఖ్యానించడానికి మాత్రం నమోదు అయి ఉండాలి.)
Launchedఫిబ్రవరి 14, 2005; 19 సంవత్సరాల క్రితం (2005-02-14)

దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. నవంబరు 2006లో గూగుల్ సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది.

అందుబాటులో ఉన్న కంటెంట్: వీడియో క్లిప్లు, TV షో క్లిప్లు, మ్యూజిక్ వీడియోలు, చిన్న, డాక్యుమెంటరీ ఫిల్మ్లు, ఆడియో రికార్డింగ్లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్,, విద్యాసంబంధిత వీడియోలు వంటి ఇతర కంటెంట్ను కలిగి ఉంది.

ఇందులో నమోదైన సభ్యులు తమ వీడియోలను అపరిమిత సంఖ్యలో ఎక్కించవచ్చు. వేరే వాళ్ళు ఎక్కించిన వీడియోలు చూడవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. రేట్ చేయవచ్చు. ఇష్టమైన వీడియోలను జాబితాగా తయారు చేసుకోవచ్చు. వేరేవారిని అనుసరించవచ్చు. వ్యక్తులు సంబంధించిన వీడియోలే కాక సంస్థలకు సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు. నమోదుకాని వినియోగదారులు సైట్లో వీడియోలను మాత్రమే చూడగలరు.

యూట్యూబు గూగుల్ యాడ్సెన్స్ (కంటెంట్, ప్రేక్షకుల ప్రకారం ప్రకటనలను లక్ష్యంగా చేసుకునే కార్యక్రమం) నుండి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది.

సీఈఓ

నీల్ మోహన్ 2023 ఫిబ్రవరి 16న యూట్యూబ్‌ సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ రాజీనామా చేయడంతో యూట్యూబ్ సీఈవోగా బాధ్య‌త‌లు చేపట్టాడు.

స్థాపన - తొలినాళ్ళు (2005 - 2006)

యూట్యూబ్ ని 2005 లో స్టీవ్ చెన్, చాడ్ హార్లీ, జావెద్ కరీం ప్రారంభించారు. వీరు ముగ్గురు అంతకు మునుపు పేపాల్ సంస్థలో పనిచేశారు. పేపాల్ లో వీరు మొదటి తరం ఉద్యోగులు కావడంతో, ఈ సంస్థను ఈబే కొనుగోలు చేసినప్పుడు వీరికి పెద్ద మొత్తంలో ధనం వచ్చింది. యూట్యూబును సులభంగా వీడియోలు పంచుకునే వేదికగా రూపొందించారు. వ్యవస్థాపకుల్లో ఒకడైన కరీం తాము చూడదలుచుకున్న వీడియో క్లిప్స్ సులభంగా అంతర్జాలంలో చూడలేకపోవడం యూట్యూబ్ ని ప్రారంభించడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. ఉదాహరణకు 2004 లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తాలూకు దృశ్యాలు వారు చూడలేకపోయారు. హర్లీ, చెన్ ప్రకారం యూట్యూబ్ మొదట్లో డేటింగ్ వెబ్‌సైట్లకు వీడియో రూపంలా ఉండాలని అనుకున్నారు. హాట్ ఆర్ నాట్ అనే వెబ్‌సైటు నుంచి స్ఫూర్తి పొందారు. క్రెయిగ్ లిస్ట్ అనే ప్రకటనల వేదిక మీద ఆకర్షణీయమైన మహిళలను తమ వీడియోలను అప్లోడు చేస్తే 100 డాలర్లు ఇస్తామని ప్రకటించారు. కానీ దానికి అంతగా స్పందన లభించక ఎక్కువ వీడియోలు రాకపోవడంతో తమ ప్రణాళిక మార్చుకుని ఎలాంటి వీడియోలలైనా ఎక్కించడానికి అనుమతి కల్పించారు.

ఇది ప్రారంభం కావడమే వెంచర్ క్యాపిటలిస్ట్ వెన్నుదన్నుతో ప్రారంభమైంది. 2005 నవంబరు 2006 ఏప్రిల్ మధ్యలో పలు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమకూర్చుకుంది. వీటిలో సుక్వోయా క్యాపిటల్ (11.5 మిలియన్ డాలర్లు), ఆర్టిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (8 మిలియన్ డాలర్లు) రెండు అతి పెద్ద ఇన్వెస్టర్లు. దీని మొదటి ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాన్ మేటియో లో ఒక జపనీస్ రెస్టారెంటు పైన ఉండేది. 2005 ఫిబ్రవరిలో ఈ కంపెనీ youtube.com అనే యూఆర్ఎల్ ని అందుబాటులోకి తెచ్చింది. 2005 ఏప్రిల్ 2003 న మొదటి వీడియో అందులో అప్లోడు అయింది. దీనిని వ్యవస్థాపకుడు కరీం తాను శాన్ డియాగో జూలో తీసిన దృశ్యాలను మి అట్ ది జూ అనే పేరుతో అప్లోడ్ చేసాడు. దీనిని ఇప్పటికీ యూట్యూబులో చూడవచ్చు.

చాలామంది అనుకున్నట్లుగా యూట్యూబు అంతర్జాలంలో మొట్టమొదటి వీడియోల వెబ్‌సైట్ కాదు. 2004 నవంబరులో విమియో.కాం అనే సైటు దీనికన్నా ముందు ప్రారంభమైంది. దీన్ని కాలేజ్ హ్యూమర్ అనే వెబ్‌సైట్ నిర్వాహకులు ఒక సైడ్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అయితే ఇది యూట్యూబ్ అంత పెద్దగా ప్రాచుర్యంగా పొందలేదు.

బ్రాడ్‌కాస్ట్ యువర్‌సెల్ఫ్ యుగం (2006-2013)

2006 అక్టోబరు 9 న గూగుల్ 1.65 బిలియన్ డాలర్ల విలువ చేసే గూగుల్ షేర్లతో ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం 2006 నవంబరు 13 న పూర్తయింది. గూగుల్ యూట్యూబ్ ని కొనుగోలు చేయడంతో మార్కెట్లో వీడియో షేరింగ్ సైట్ల మీద ఆసక్తి పెరిగింది. విమియో.కాం వాళ్ళు యూట్యూబుతో పోటీపడటం కోసం కంటెంట్ సృష్టించేవాళ్ళకు సహాయం చేయడం మొదలుపెట్టింది. అప్పుడే గూగుల్ బ్రాడ్‌కాస్ట్ యువర్‌సెల్ఫ్ అనే నినాదాన్ని తీసుకువచ్చింది.

వీక్షణల రికార్డు

పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్‌ వీడియో వ్యూస్‌ జనవరి, 2022 నాటికి వెయ్యి కోట్లు దాటి యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ప్లాట్‌ఫాంపై ఇలాంటి రికార్డు సాధించిన తొలి వీడియో ఇదే. అత్యధిక వ్యూస్‌ కలిగిన వీడియో కూడా ఇదే. 2016 జూన్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు. రెండో స్థానంలో 700 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్యూర్టోరికన్ పాప్‌ స్టార్‌ లూయిస్ ఫోన్సీ సాంగ్‌ డెస్పాసిటో ఉంది.

వయసు రీత్యా అత్యంత పెద్ద యూట్యూబరుగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ రికార్డు స్థాపించింది. కంట్రీ ఫుడ్స్ అనే ఆమె ఛానెలుకు 15 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారు.

సీఈవో

మూలాలు

Tags:

యూట్యూబ్ సీఈఓయూట్యూబ్ వీక్షణల రికార్డుయూట్యూబ్ సీఈవోయూట్యూబ్ మూలాలుయూట్యూబ్అంతర్జాలంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకాలిఫోర్నియా

🔥 Trending searches on Wiki తెలుగు:

పొంగూరు నారాయణపరీక్షబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశ్రీశైల క్షేత్రండి. కె. అరుణనితీశ్ కుమార్ రెడ్డిహైన్రిక్ క్లాసెన్అరుణాచలంఉగాదిసెక్యులరిజంసివిల్ సర్వీస్క్వినోవామాడుగుల శాసనసభ నియోజకవర్గంఎయిడ్స్రష్మి గౌతమ్చదలవాడ ఉమేశ్ చంద్రవ్యతిరేక పదాల జాబితాహెబియస్ కార్పస్భారతదేశంలో బ్రిటిషు పాలనశాసనసభ సభ్యుడునెల్లూరుజే.సీ. ప్రభాకర రెడ్డిచరాస్తివిజయశాంతితామర పువ్వుఈనాడుభారత స్వాతంత్ర్యోద్యమంవంగవీటి రంగారక్తనాళాలున్యుమోనియాథామస్ జెఫర్సన్కల్క్యావతారముగంగా నదిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరక్తంసపోటావై.యస్.భారతిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుప్రేమలుదగ్గుబాటి పురంధేశ్వరికమల్ హాసన్ నటించిన సినిమాలుఇత్తడిసాహిత్యంఆపిల్తీన్మార్ సావిత్రి (జ్యోతి)షికారు (2022 సినిమా)అష్ట దిక్కులుభారత రాష్ట్రపతిఅడవిజెర్రి కాటువజ్రాయుధంపసుపు గణపతి పూజచతుర్వేదాలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునారా బ్రహ్మణిప్రియమణిపరశురాముడుబెల్లంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుడీజే టిల్లుసామెతలుమడమ నొప్పియుద్ధంలలితా సహస్ర నామములు- 301-400మంచి మనసులు (1986 సినిమా)నవగ్రహాలుకార్తీక్ ఘట్టమనేనిసంస్కృతంకౌరవులుఆర్యవైశ్య కుల జాబితాగుంటకలగరబ్రాహ్మణులుఅటల్ బిహారీ వాజపేయిఉపాధ్యాయుడుసావిత్రి (నటి)రామప్ప దేవాలయంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు🡆 More