అబ్‌ఖజియా

అబ్‌ఖజియా (Abkhazia) కాకస్ (కాకసస్) పర్వతాల ప్రాంతంలో ఉన్న ఒక భూభాగం.

ఇది దాదాపు పూర్తి (de facto) స్వాతంత్ర్యం కలిగిన గణతంత్ర దేశం, కాని అంతర్జాతీయంగా దీనికి దేశంగా గుర్తింపులేదు. ఒక్క జార్జియా దేశం మాత్రం అబ్‌ఖజియాను గుర్తించింది. అబ్‌ఖజియా దేశం పూర్తిగా జార్జియా (దేశం) సరిహద్దుల లోపల ఉంది. పశ్చిమాన నల్ల సముద్రం, ఉత్తరాన రష్యా అబ్‌ఖజియాకు సరిహద్దులు. జార్జియా దేశంలోని సమెగ్రెలో-జెమో స్వానెటి ప్రాంతం అబ్‌ఖజియాకు తూర్పున హద్దుగా ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర దేశాలు అబ్‌ఖజియాను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. కాని జార్జియా దేశం మాత్రం దీనిని స్వయం పరిపాలనా ప్రతిపత్తిగల గణతంత్ర దేశంగా గుర్తించింది.

Аҧсны
აფხაზეთი
Абхазия
Apsny / Apkhazeti / Abhazia
అబ్‌ఖజియా (Abkhazia)
Location of అబ్‌ఖజియా
Location of అబ్‌ఖజియా
Location of అబ్‌ఖజియా
Location of అబ్‌ఖజియా
అబ్‌ఖజియాను సూచించే పటం (ఎరుపు రంగు వలయంలో, ముదురు ఆకుపచ్చ రంగులో చూపబడింది.)
ఇది జార్జియా దేశం లేత ఆకుపచ్చ రంగులో చూపబడింది.
Area
 -  Total 8,600 km² 
3,320 sq mi 
 -  Water (%) అత్యల్పం
జనాభా
 -  2006 estimate 157,000-190,000 (International Crisis Group)
177,000 (Encyclopædia Britannica
 -  2003 census 216,000 (వివాదాస్పదం) 
 -  జనసాంద్రత 29/km² 
75.1/sq mi
టైమ్ జోన్ MSK (యు.టి.సి.+3)
అబ్‌ఖజియన్ రిపబ్లిక్ ప్రభుత్వం
Flag of అబ్‌ఖజియా Coat of arms of అబ్‌ఖజియా
Anthem
Aiaaira
రాజధానిసుఖుమి
43°00′N 40°59′E / 43.000°N 40.983°E / 43.000; 40.983
Official languages అబ్‌ఖజ్, రష్యన్ 1
ప్రభుత్వం
 -  ప్రెసిడెంట్ సెర్గీ బగప్ష్
 -  ప్రధాన మంత్రి అలెగ్జాండర్ అంక్వబ్
జార్జియా దేశం నుండి దాదాపు పూర్తిగా (De facto) స్వతంత్రం పొందింది.
 -  ప్రకటించబడింది. 23 జూలై 1992 
 -  గుర్తింపు -- 
కరెన్సీ రష్యన్ రూబుల్ (RUB)
1 రష్యన్ భాష విరివిగా గుర్తించబడి, వాడబడుతుంది.
అబ్‌ఖజియన్ స్వపరిపాలనా రిపబ్లిక్
Flag of జార్జియా (దేశం) Coat of arms of జార్జియా (దేశం)
రాజధానిసొఖుమి
Official languages అబ్‌ఖజ్, జార్జియన్
ప్రభుత్వం
 -  ఛైర్మ్
మంత్రుల కాబినెట్

మల్ఖాజ్ అకిష్బయ్యా
 -  ఛైర్మన్, సుప్రీమ్ కౌన్సిన్ తెమూర్ మఝావియా
జార్జియా దేశంలో స్వపరిపాలనా ప్రతిపత్తి గల రిపబ్లిక్
 -  జార్జియా స్వాతంత్ర్యం
సోవియట్ యూనియన్ నుండి
ప్రకటించబడింది
గుర్తింపబడినది


9 ఏప్రిల్ 1991
25 డిసెంబర్ 1991 
కరెన్సీ జార్జియన్ లారి (GEL)

1992-1993 మధ్యకాలంలో జరిగిన వేర్పాటు ఉద్యమం సాయుధపోరాటంగా పరిణమించింది. ఇందులో జార్జియా మిలిటరీ ఓడిపోయింది. అబ్‌ఖజియా ప్రాంతంనుండి ఇతర జాతులవాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. 1994లో యుద్ధవిరమణ జరిగింది. అయినా ఇప్పటికీ వివాదం పరిష్కారమవలేదు. రష్యా అండ ఉన్న వేర్పాటువాదులు మొత్తం భూభాగంలో 83%పై అధిపత్యం కలిగిఉన్నారు (de-facto Government). మిగిలిన 17% భూభాగంపై అధిపత్యం కలిగి ఉన్న పార్టీలు 'కొడోరి లోయ'నుండి తమ పాలన సాగిస్తున్నారు. ఈ (17% పాలన) సముదాయానికే అబ్‌ఖజియాలో న్యాయపరమైన పాలకులుగా గుర్తింపు ఉంది. (de-jure Government)

రాజకీయ స్థితి

ఐక్య రాజ్య సమితి వంటి పెక్కు అంతర్జాతీయ సంస్థలు ( ఐరాస, యూరోపియన్ కమ్యూనిటీ, OSCE, NATO, WTO, యూరోపియన్ కౌన్సిల్, CIS వంటివి) అబ్ ఖజియాను జార్జియా దేశంలో ఒక అంతర్గత భాగంగా మాత్రమే గుర్తిస్తున్నాయి. జార్జియా, అబ్‌ఖజియాలు తమ మధ్య వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకొని తమ స్థితిని స్పష్టం చేయాలని ఐ.రా.స. కోరుతున్నది. కాని అబ్‌ఖజియాలో అధిక భాగంపై నియంత్రణ కలిగి ఉన్న పార్టీలు మాత్రం తమది స్వతంత్ర దేశం అని పేర్కొంటాయి. 2005లో జార్జియా దేశం అబ్ ఖజియాకు విస్తృతమైన స్వపరిపాలనా ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరరించింది.

అయితే అబ్‌ఖజియాలో అత్యధికభాగంపై అధిపత్యం కలిగి ఉన్న 'ప్రభుత్వాన్ని' అంతర్జాతీయంగా గుర్తించాలని రష్యా చట్టసభ డుమా కోరుతున్నది. ఇందుకు రష్యా మీడియా కూడా విస్తృతంగా సమర్ధన ఇస్తున్నది.జార్జియా-అబ్‌ఖజ్ యుద్ధం సమయంలో రష్యన్ అధికారులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలకు సహాయం అందించారు. ఇప్పటికీ అబ్‌ఖజియాలో అధికంగా అధికారం నెరపుతున్న వేర్పాటువాదులకు రష్యా బహుముఖంగా సహాయం అందిస్తున్నది. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా చాలామంది అబ్‌ఖజియన్లకు రష్యా తమ దేశం పాస్‌పోర్టులను ఇచ్చింది. 80% పైగా అబ్‌ఖజ్ ప్రజలకు రష్యా పౌరసత్వం కూడా లభించింది. పెన్షనులు వంటి సదుపాయాలు కూడా ఇచ్చారు. (కాని వారు రష్యాలో వోటు వేయరు. పన్నులు చెల్లించరు.) కాని ఇప్పుడు అబ్‌ఖజియా 'ప్రభుత్వం' తమ దేశవాసులకు తమ పాస్‌పోర్టులు ఇవ్వడం మొదలుపెట్టింది.

అబ్‌ఖజియాలో తమ పాలనను అంతర్జాతీయంగా గుర్తించాలని ఆ దేశపు 'పార్లమెంట్' తీర్మానించినప్పటికీ అంతర్జాతీయ సమాజం జార్జియా దేశపు సమైక్యతనే సమర్ధిస్తున్నది. అబ్‌ఖజియాలో జార్జియనులు, ఇతర జాతులవారి పట్ల వేధింపు, వివక్షతల గురించి పెక్కు అభియోగాలున్నాయి.

భౌగోళికం, వాతావరణం

అబ్‌ఖజియా 
పిట్సుండా కేప్‌ నుండి దృశ్యం

మొత్తం 8,600 చ.కి.మీ. వైశాల్యం గల అబ్‌ఖజియా దేశం ప్రధానంగా పర్వతమయమైనది. కాకస్ పర్వతాలలో విస్తరించి ఉంది. చాలా పర్వత శిఖరాలు 4,000 మీటర్లు (13,200 అడుగులు) పైబడి ఎత్తు గలవి. నల్ల సముద్రం తీరాన మైదాన ప్రాంతాలనుండి ఉత్తరాన శాశ్వత హిమమయమైన లోయలవరకు వైవిధ్యం గల భౌగోళిక స్వరూపం కలిగి ఉంది.

అబ్‌ఖజియా 
రిట్సా సరస్సు

మైదాన ప్రాంతాలలో సాగు అయ్యే తేయాకు, పుగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు అబ్‌ఖజియా ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు. కాకస్ పర్వతాలనుండి సముద్రంలోకి ప్రవహించే చిన్న చిన్న నదులు వ్యవసాయానికి ప్రధానమైన నీటివనరులు. వీటిలో కోడోరి, బజిబ్, ఘలిడ్జ్‌గల్, గుమిస్టా ముఖ్యమైన నదులు. ప్సో నది రష్యాకు సరిహద్దుగాను, ఇంగూరి నది ప్రధాన జార్జియాతో సరిహద్దుగాను ఉన్నాయి. హిమపాతాల వలన ఏర్పడిన పలు పెరి గ్లేసియల్ సరస్సులు, బిలాల వలన ఏర్పడిన క్రేటర్ సరస్సులు అబ్‌ఖజియా పర్వతాలలో ఉన్నాయి. వీటిలో రిట్సా సరస్సు ముఖ్యమైనది.

ఒక ప్రక్క నల్ల సముద్రం తీర ప్రభావం, మరొక ప్రక్క కాకస్ పర్వతాల రక్షణ ల వలన అబ్‌ఖజియా వాతావరణంలో కొంత తుల్యత ఏర్పడింది. తీర ప్రాంతాలలో సగటు ఉష్ణత 15 డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది. సంవత్సర వర్షపాతం తీర ప్రాంతాలలో 1,100 - 1,500 మి.మీ. మధ్య, ఎత్తైన పర్వతాలలో 1,700-3,500 మి.మీ. మధ్య ఉంటుంది. కాని అబ్‌ఖజియా ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వలన అంత తేమగా ఉండదు. పర్వతాలలో చెప్పుకోదగిన మంచు కురుస్తుంది.

పాలనా విభాగాలు

సోవియట్ కాలంలో అబ్‌ఖజియా ASSR ఆరు ఉప భాగాలుగా విభజింపబడింది. వాటి కేంద్రాలు: గాగ్రా, గదౌతా, సుఖుమి, ఒచాంచిరె, గుల్‌రిప్ష్, గాలి. ఇప్పుడు కూడా అబ్‌ఖజ్ రిపబ్లిక్‌లో సుమారు ఇవే విభాగాలు కొనసాగుతున్నాయి. 1995లో ఒక క్రొత్త విభాగం తకవార్చెలి ఏర్పఅటయ్యింది.

ఆర్ధిక వ్యవస్థ

అబ్‌ఖజియా ఆర్థిక వ్యవస్థ రష్యాతో గాఢంగా ముడిపడి ఉంది. రష్యన్ రూబుల్ వారి కరెన్సీ కూడాను. పర్యాటకం వారి ముఖ్యమైన ఆర్థిక వనరులలో ఒకటి. ప్రధానంగా రష్యానుండి వచ్చే పర్యాటకులు అబ్‌ఖజియాకు పర్యాటక రంగానికి ముఖ్య పోషకులు. సాలీనా సుమారు లక్ష మంది పర్యాటకులు వస్తున్నారని అంచనా (యుద్ధానికి ముందు సుమారు 2 లక్షలు వచ్చేవారు) రష్యా పాస్‌పోర్టు కలిగినవారికి అబ్‌ఖజియా వెళ్ళడానికి వీసా అవసరం లేదు.

సారవంతమైన అబ్‌ఖజియా భూమిలో తేయాకు, పుగాకు, ద్రాక్ష, ఇతర పండ్ల తోటలు, ముఖ్యంగా టాంగరిన్ (కమలా ఫలం వంటివి) బాగా పండుతాయి. ఇంగూరి జల విద్యుత్ నుండి ప్రధానంగా విద్యుత్ లభిస్తుంది. చాలా మంది రష్యన్ వాణిజ్య ప్రముఖులు అబ్‌ఖజియాలో పెట్టుబడులు పెట్టారు. ఇరు వర్గాల సమష్టి కృషితో సోచి నగరంలో 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు జరపడానికి ప్రతిపాదన ఉంది. అయితే అబ్‌ఖజియాలో విదేశీ (రష్యన్) ఆర్థిక జోక్యాన్ని జార్జియా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది.

యుద్ధం పరిణామాలు, అవినీతి, వ్యాపారాలపై క్రిమినల్ గ్యాంగుల పట్టు వంటివి అబ్‌ఖజియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన సమస్యలు.

జన విస్తరణ

అబ్‌ఖజియాలో వివిధ జాతులవారు మిళితమై ఉన్నారు. రాజకీయ అనిశ్చితివలన వివిధ జనగణన గణాంకాలు ప్రస్తావించబడుతున్నాయి. వాటిలో కొన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

సంవత్సరం మొత్తం జార్జియనులు అబ్‌ఖజియనులు రష్యనులు ఆర్మీనియనులు గ్రీకులు
1926 జన గణన 186,004 67,494 55,918 12,553 25,677 14,045
1939 జన గణన 311,885 91,967 56,197 60,201 49,705 34,621
1959 జన గణన 404,738 158,221 61,193 86,715 64,425 9,101
1970 జన గణన 486,959 199,596 77,276 92,889 74,850 13,114
1979 జన గణన 486,082 213,322 83,087 79,730 73,350 13,642
1989 జన గణన 525,061 239,872 93,267 74,913 76,541 14,664
2003 జన గణన 215,972 45,953 94,606 23,420 44,870 1,486

అయితే ఈ గణాంకాలను జార్జియా అధికారులు, మరి కొన్ని అంతర్జాతీయ సంస్థలు సరైనవిగా అంగీకరించడంలేదు. అంతర్జాతీయ విపత్తు సముదాయం వారి 2006 అంచనాల ప్రకారం అబ్‌ఖజియా మొత్తం జనసంఖ్య 157,000 - 190,000 మధ్య ఉంటుంది. (ఐరాస అభివృద్ధి ప్రణాళిక వారి అంచనా 180,000 - 220,000 మధ్య, 1998 అంచనా),

చరిత్ర

పాత చరిత్ర

క్రీ.పూ. 9వ శతాబ్దం నుండి ఈ ప్రాంతం పురాతన జార్జియా రాజ్యం (కొల్ఖా సామ్రాజ్యం)లో భాగంగా ఉండేది. అది క్రీ.పూ.63లో ఎగ్రిస్ రాజ్యంలో కలిసిపోయింది. అప్పటినుండి గ్రీకు వర్తకులు వలస వచ్చి నల్ల సముద్రం తీరంలో రేవు పట్టణాలు అభివృద్ధి చేశారు. వాటిల్లో 'డయోస్కూరియాస్' అనే రేవు పట్టణం కాలాంతరంలో రాజధాని సుఖుమిగా అభివృద్ధి చెందింది.

తరువాత సా.శ. 1వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం ఎగ్రిస్‌ను తనలో కలుపుకొంది. కాని 4వ శతాబ్దంలో తిరిగి స్వతంత్రమయ్యింది. సా.శ.7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు బైజాంటియన్ సామ్రాజ్యంలో ఒక స్వతంత్ర భాగంగా ఉండేది. తరువాత క్రమంగా ఇది జార్జియా రాజ్యంలో కలిసింది. అబ్‌ఖజియాలో క్రైస్తవ మతము ఎప్పటినుండి విస్తరించిందో స్పష్టంగా తెలియదు కాని, సా.శ. 325లో ఒక క్రైస్తవ సమావేశం జరిగినట్లు రికార్డులలో ఉంది.

సా.శ. 16వ శతాబ్దంలో జార్జియా రాజ్యం విచ్ఛిన్నమైనపుడు ఈ ప్రాంతం ఒట్టొమన్ సామ్రాజ్యం అధీనంలోకి వచ్చింది. ఈ కాలంలో కొందరు అబ్‌ఖజియన్లు ఇస్లాం మతం అవలంబించారు. తరువాత మళ్ళీ జార్జినులు ఒట్టొమన్‌లను వతడలగొట్టి స్వతంత్ర అబ్‌ఖజియాను తిరిగి నెలకొలిపారు.

రష్యన్ సామ్రాజ్యంలోనూ, సోవియట్ యూనియన్‌లోనూ భాగంగా అబ్‌ఖజియా

అబ్‌ఖజియా 
1925లో అబ్‌ఖజియా జెండా
అబ్‌ఖజియా 
1978లో అబ్‌ఖజియా జెండా

కాకస్ పర్వతాల ప్రాంతంలో రష్యన్ సామ్రాజ్యం విస్తరణ సందర్భంగా రష్యన్ సేనలకూ, కాకస్ తెగలకూ మధ్య పలు సంఘర్షణలు సంభవించాయి. క్రమంగా కాకస్ యద్ధం తరువాత 1801-1864 మధ్య కాలంలో అబ్‌ఖజియా, జార్జియా ప్రాంతాలు రష్యన్ సామ్రాజ్యంలో కలుపబడ్డాయి. ఈ ప్రక్రియలో చాలా యుద్ధాలు, వలసలు, సంఘర్షణలు జరిగాయి. ఏ తెగవారు స్థానికులు, ఎవరు బయటినుండి వచ్చినవారు అన్న విషయాలపై భిన్న అభిప్రాయాలున్నాయి.

అబ్‌ఖజియా 
1989లో సోవియట్, కాకసస్ రాజకీయ విభాగాలు - ఇందులో అబ్‌ఖజియన్ SSR, జార్జియన్ SSR కూడా చూపబడ్డాయి

1917లో రష్యా విప్లం తరువాత 1918లో అబ్‌ఖజియా, జార్జియా కలిపి స్వతంత్ర జార్జియా ఏర్పడింది. కాని జార్జియాలోని మెన్షెవిక్ ప్రభుత్వం చాలా సమస్యలతో సతమతమయ్యింది. 1921లో బోల్షెవిక్‌ల ఎర్ర సైన్యం ఆక్రమణతో జార్జియా స్వాతంత్ర్యం ముగిసింది. అబ్‌ఖజియాను జార్జియన్ రిపబ్లిక్‌కు చెందిన 'యూనియన్ రిపబ్లిక్'గా వర్గీకరించారు. 1931లో స్టాలిన్ సమయంలో 'సోవియట్ జార్జియా'లో ఒక 'స్వతంత్ర రిపబ్లిక్'గా చేశారు. అయితే ఈ స్వతంత్రత నామమాత్రమే. ఈ కాలంలో (గణనీయమైన ప్రభుత్వ ప్రోత్సాహంతో) జార్జియా, అర్మీనియాలనుండి పెద్దయెత్తున ప్రజలు అబ్‌ఖజియాకు వలస వెళ్ళారు.

స్టాలిన్, బెరియాల మరణానంతరం అబ్‌ఖజ్‌ల పట్ల అణచివేత చాలావరకు సడలింది. తక్కిన చిన్న రిపబ్లిక్‌లలాగానే అబ్‌ఖజియన్‌ల సాంస్కృతిక, సాహిత్య పరిరక్షణకు ప్రోత్సాహం లభించింది. అధికార ఉద్యోగాల్లో అధికమైన కోటా ఇవ్వబడింది. ఇందువలన జార్జియన్ తెగలవారు అసంతృప్తికి గురయ్యారు.

అబ్‌ఖజియన్ యుద్ధం

అబ్‌ఖజియా 
1989లో అబ్‌ఖజియన్ SSR జెండా

1980 దశకంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం జరుగుతున్నపుడు అబ్‌ఖజియన్, జార్జియన్ వర్గాల మధ్య విభేదాలు పెచ్చరిల్లాయి. జార్జియా గనుక స్వతంత్ర దేశమైతే అబ్‌ఖజియన్లకు, వారి ప్రత్యేక ప్రతిపత్తికి రక్షణ లేకుండా పోతుందని అబ్‌ఖజియన్ల భయం. కనుక అబ్‌ఖజియాను జార్జియా నుండి వేరు చేసి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉంచాలని వారి ఉద్దేశం. ఈ సందర్భంలో 1989లో సుఖుమిలో జరిగిన హింసాకాండలో 16 మంది జార్జియన్లు మరణించారు. పెద్దపెట్టున అల్లర్లు చెలరేగాయి. సోవియట్ సేనలు కలుగజేసుకొని శాంతిని నెలకొల్పాయి.

1991 మార్చి 17లో సోవియట్ యూనియన్ పునరుద్ధరించడానికి మిఖైల్ గోర్బచేవ్ అర్ధించిన రిఫరెండాన్ని జార్జియా బహిష్కరించింది. కాని 98.6% అబ్‌ఖజియన్లు సోవియట్ యూనియన్ పరిరక్షణకు అనుకూలంగా వోటు వేశారు. 

కొద్ది వారాలలో 9 ఏప్రిల్ 1991న సోవియట్ తిరుగుబాటు నాయకుడుజవియాద్ గమష్కుర్డియా నాయకత్వంలో జార్జియా స్వాతంత్ర్యం ప్రకటించింది. కాని అతని పట్ల వ్యతిరేకత పెరగడం వలన 1992 జనవరిలో ఎడువర్డ్ షెవర్డ్‌నాజె (పాత సోవియట్ యూనియన్ విదేశ వ్యవహారాల మంత్రి) జార్జియా ప్రెసిడెంట్ అయ్యాడు. కాని జార్జియా చట్టసభలలో మాత్రం నేషనలిస్టులు అధిక్యత కలిగి ఉన్నారు.

21 ఫిబ్రవరి 1992న సోవియట్ రాజ్యాంగాన్ని రథ్దు చేసి జార్జియా ప్రభుత్వం 1921 జార్జియా రాజ్యాంగాన్ని పునరుద్ధరించింది. దీనితో తమ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటిల్లుతుందని భావించిన అబ్‌ఖజియన్లు 1992 జూలై 23 స్వతంత్రం ప్రకటించారు. వారిని అణచివేయడానికి జార్జియా ప్రభుత్వం 3,000మంది సైన్యాన్ని పంపారు. తీవ్రమైన యుద్ధాలలో పెద్యెత్తున ప్రాణనష్టం వాటిల్లింది. క్రమంగా జార్జియా ప్రభుత్వం తమ అధిపత్యాన్ని నిలుపుకొని ప్రాంతీయ అబ్‌ఖజియా అసెంబ్లీని మూసివేసింది.

కాకస్ పర్వత ప్రాంత ప్రజా ప్రతిఘటన పార్టీలు, ఇతర వేర్పాటు వాద పార్టీల సహాయంతో జార్జియా ప్రభుత్వాన్ని బలంగా ప్రతిఘటించారు. రష్యా పారామిలిటరీ బలగాల సహాయంతో వీరు జార్జియా సేనలను గాగ్రా పోరాటంలో ఓడించి తరిమేశారు. 1992 తరువాత ఈ తిరుగుబాటుదారులు అబ్‌ఖజియాలో సుఖుమి ఉత్ర ప్రాంతాన్ని అధికభాగాన్ని తమ అధినంలో నిలుపుకొన్నారు. 1993 జూలైలో మరొక తీవ్రమైన పోరాటం ప్రాంభమైంది. 10రోజుల యుద్ధం తరువాత సుఖుమి కూడా 27 సెప్టెంబరు, 1993న తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చింది. ఈ సంఘర్షణలో పెద్ద పెట్టున ఆస్తి నష్టం, మరణాలు, అత్యాచారాలు జరిగాయి. తరువాత మళ్ళీ వివిధ తిరుగుబాటు దారుల మధ్య పెక్కు పోరాటాలు జరిగాయి. 10,000-30,000 మంది జార్జియనులు, 3,000 మంది అబ్‌ఖజియనులు మరణించి ఉంటారని, 250,000 పైగా ప్రజలు (ఎక్కువగా జార్జియనులు) వలస వెళ్ళి ఉంటారని అంచనా.

జార్జియనుల పట్ల దారుణమైన అత్యాచారాలు జరిగాయి. మొత్తం జార్జియన్ తెగనే తుడిచిపెట్టడానికి అబ్‌ఖజియన్ సేనలు ప్రయత్నించాయి.

అబ్‌ఖజియా రిపబ్లిక్ స్వపాలనా ప్రతిపత్తి ప్రభుత్వం

'అబ్‌ఖజియా అటానమస్ రిపబ్లిక్ ప్రభుత్వం' (పాత పేరు 'అబ్‌ఖజియన్ అటానమస్ రిపబ్లిక్ మంత్రుల కౌన్సిల్') అనే దాన్ని మాత్రమే అబ్‌ఖజియాకు చట్టపరమైన ప్రభుత్వంగా జార్జియా దేశం గుర్తిస్తుంది. సుఖుమి నగరం తిరుగుబాటు దారుల అధీనంలోకి వెళ్ళిన తరువాత ఈ అటానమస్ ప్రభుత్వం చకల్టా నుండి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ మంత్రుల మండలి దాదాపు సోవియట్ కాలంలో ఏర్పడిన విధంగానే ఎన్నుకొనబడుతుంది. ఇందులో వివిధ జాతులవారికి ప్రాతినిధ్యం ఉంది. ఝియూలి షర్తవా ఈ మండలికి ఛైర్మన్. 1992 అంతర్గత విభేదాల తరువాత వేర్పాటును సమర్ధించే వర్గాలు మండలినుండి విడివడి గడౌతా నుండి తమ సాయుధ పోరాట కార్యాలను సాగిస్తున్నారు. సుఖుమిలో ఉన్న మంత్రుల మండలి సభ్యులు (అబ్‌ఖజియాలో అధిక భాగం వీరి అధీనంలో ఉంది) మాత్రం వివిధ జాతుల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తూ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి వివిధ వర్గాల మధ్య రాజకీయంగానూ, సాయుధంగానూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. 2006లో మల్ఖజ్ అకిష్బయా నాయకత్వంలో చట్టపరమైన ప్రభుత్వం పునఃస్థాపించబడింది. వీరు 'ఎగువ అబ్‌ఖజియా'లోని చకల్తా కేంద్రంగా పనిచేస్తున్నారు.

రాజకీయాలు

జార్జియా దేశంతో ఉన్న వివాదాలూ, నాయకత్వం గురించిన ఘర్షణలూ అబ్‌ఖజియా రాజకీయాలలో ప్రధాన అంశాలు. 3 అక్టోబర్ 2004లో జరిగిన ఎన్నికలలో రష్యనుల అండ ఉన్న రావుల్ ఖజింబా, మరొక ప్రత్యర్థి సెర్గీ బగాప్ష్‌ల మధ్య పోటీ నెలకొంది. కాని ఇద్దరూ చివరకు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ప్రతి గ్రామానికీ, జిల్లాకూ అసెంబ్లీ ప్రతినిధులు ఎన్నుకొనబడుతారు. జిల్లా అసెంబ్లీ ప్రతినిధులలో ఒకరిని జిల్లా ప్రధానాధికారిగా ప్రెసిడెంట్ నియమిస్తడు. 35 మంది ఎన్నుకొనబడిన సభ్యులు గల ప్రజా అసెంబ్లీ ప్రధానమైన చట్టసభ. 2007లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 250,000 మంది జార్జియన్ జాతీయులకు నివాసం, వోటు హక్కులు లేకుండా స్థానిక అబ్‌ఖజియన్ అధికారులు నిరోధిస్తున్నారని అభియోగాలున్నాయి.

అంతర్జాతీయ జోక్యం

అబ్‌ఖజియాలోని సంఘర్షణల కాలంలోనూ, తరువాత శాంతి నెలకొలిపే యత్నంలోనూ ఐక్య రాజ్య సమితి ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. బలవంతంగా సరిహద్దులు మార్చడాన్ని ఐ.రా.స. వ్యతిరేకిస్తుంది. చట్టబద్ధమైన ప్రజాభిప్రాయ సేకరణ, అన్ని జాతులవారికీ సమానమైన స్వేచ్ఛ ఉండాలని ఐరాస అభిమతం. ఇందుకోసం వివిధ అంతర్జాతీయ ప్రతినిధులు పెక్కు సమావేశాలు, చర్చలు నిర్వహించారు. అబ్‌ఖజియా ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన, జాతి వివక్షతను వ్యతిరేకించారు and later at the Lisbon Summit Declaration in 1996. ఇంకా ఈ ప్రయత్నాలు వివిధ అంతర్జాతీయ సంస్థల, మానవ హక్కుల సంస్థల అధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కాని ప్రస్తుతానికి జార్జియా దేశపు సంపూర్ణతను, స్వాధిపత్యాన్ని ఐక్య రాజ్య సమితి గుర్తిస్తున్నది.

మతం

అబ్‌ఖజియా జనాభాలో సుమారు 75% ఆర్థొడాక్స్ క్రైస్తవులు, సుమారు 10% సున్నీ ముస్లిములు. కొద్ది మంది యూదులు, యెహోవా సాక్షులు ఉన్నారు. 1995నుండి యెహోవా సాక్షులు మతాన్ని నిషేధించారు.

రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలవారికీ (నాస్తికులకు కూడా) సమాన హక్కులు ఉన్నాయి.

అబ్‍ఖజియా చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

  • దేశాల జాబితాల జాబితా
    ఆంగ్లవికీలోని సంబంధిత ప్రధాన వ్యాసాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

అబ్‌ఖజియా రాజకీయ స్థితిఅబ్‌ఖజియా భౌగోళికం, వాతావరణంఅబ్‌ఖజియా పాలనా విభాగాలుఅబ్‌ఖజియా ఆర్ధిక వ్యవస్థఅబ్‌ఖజియా జన విస్తరణఅబ్‌ఖజియా చరిత్రఅబ్‌ఖజియా రాజకీయాలుఅబ్‌ఖజియా అంతర్జాతీయ జోక్యంఅబ్‌ఖజియా మతంఅబ్‌ఖజియా అబ్‍ఖజియా చిత్రమాలికఅబ్‌ఖజియా ఇవి కూడా చూడండిఅబ్‌ఖజియా మూలాలుఅబ్‌ఖజియా బయటి లింకులుఅబ్‌ఖజియాen:Samegrelo-Zemo Svanetien:autonomous republicen:de factoకాకసస్ పర్వతాలుజార్జియా (దేశం)నల్ల సముద్రంరష్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంపొడుపు కథలురుతురాజ్ గైక్వాడ్ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ఎనుముల రేవంత్ రెడ్డినయన తారదేవుడుచూడాలని వుందితెలుగు కవులు - బిరుదులుదానిమ్మభారత రాజ్యాంగ ఆధికరణలునిన్నే ఇష్టపడ్డానుహోళీచెన్నై సూపర్ కింగ్స్ఆది శంకరాచార్యులునానార్థాలునక్షత్రం (జ్యోతిషం)కేతువు జ్యోతిషంతెలంగాణ ప్రభుత్వ పథకాలుసాయిపల్లవితన్నీరు హరీశ్ రావుపార్వతితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377పంచారామాలుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుసింగిరెడ్డి నారాయణరెడ్డిపూర్వాషాఢ నక్షత్రముజాతిరత్నాలు (2021 సినిమా)ఇస్లాం మతంముహమ్మద్ ప్రవక్తనవధాన్యాలుజవాహర్ లాల్ నెహ్రూగర్భాశయముపిఠాపురంఅయోధ్యయోగాచెట్టుజమదగ్నిమధుమేహంగ్రామ సచివాలయంఉపనయనముఅనుపమ పరమేశ్వరన్మాయాబజార్విష్ణువు వేయి నామములు- 1-1000శుభాకాంక్షలు (సినిమా)భూమిఅల్లు అర్జున్సాహిత్యందుక్కిపాటి మధుసూదనరావుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంలలితా సహస్రనామ స్తోత్రంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శివ పురాణంగుడ్ ఫ్రైడేశారదరాకేష్ మాస్టర్పుచ్చతెలుగుదేశం పార్టీరాధిక (నటి)గూగుల్2019 పుల్వామా దాడిమలబద్దకంటిల్లు స్క్వేర్కృత్తిక నక్షత్రముఅండాశయములెజెండ్ (సినిమా)ఆతుకూరి మొల్లవ్యాసుడుభారతదేశంలో కోడి పందాలుప్లీహముఅధిక ఉమ్మనీరుఅశోకుడుసంభోగంఉబ్బసముబాలకాండముంతాజ్ మహల్స్వామి వివేకానంద🡆 More