బురుండి

అధికారికంగా బురుండి రిపబ్లిక్ ఇది తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్ లేక్ ప్రాంతంలో ఉన్న భూబంధిత దేశం.

అని అంటారు. ఉత్తరసరిహద్దులో రువాండా, తూర్పు, దక్షిణ సరిహద్దులో టాంజానియా, పశ్చిమసరిహద్దులో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉన్నాయి. ఇది మద్య ఆఫ్రికాలో భాగంగా ఉంది. బరుండి రాజధాని ముజుంబురా. నైరుతు సరిహద్దులో తంగానికా సరోవరం ఉంది.

Republika y'u Burundi
République du Burundi
Republic of Burundi
Flag of Burundi Burundi యొక్క చిహ్నం
నినాదం
"Ubumwe, Ibikorwa, Iterambere"  (Kirundi)
"Unité, Travail, Progrès"  (French)
"Unity, Work, Progress" 1
Burundi యొక్క స్థానం
Burundi యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Bujumbura
3°30′S 30°00′E / 3.500°S 30.000°E / -3.500; 30.000
అధికార భాషలు Kirundi, French
ప్రజానామము Burundian
ప్రభుత్వం Republic
 -  President Pierre Nkurunziza
Independence from Belgium 
 -  Date July 1 1962 
విస్తీర్ణం
 -  మొత్తం 27,830 కి.మీ² (145th)
10,745 చ.మై 
 -  జలాలు (%) 7.8%
జనాభా
 -  2005 అంచనా 7,548,000 (94th)
 -  1978 జన గణన 3,589,434 
 -  జన సాంద్రత 271 /కి.మీ² (43rd)
533.8 /చ.మై
జీడీపీ (PPP) 2003 అంచనా
 -  మొత్తం $4.517 billion² (142nd)
 -  తలసరి $739 (163rd)
జీడీపీ (nominal) 2005 అంచనా
 -  మొత్తం $799 million (162nd)
 -  తలసరి $90 (182nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.384 (low) (169th)
కరెన్సీ Burundi franc (FBu) (BIF)
కాలాంశం CAT (UTC+2)
 -  వేసవి (DST) not observed (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bi
కాలింగ్ కోడ్ +257
1 Before 1966, "Ganza Sabwa".
2 Estimate is based on regression; other PPP figures are extrapolated from the latest International Comparison Programme benchmark estimates.

500 సంవత్సరాల నుండి దివా, హుటు, టుట్టీ ప్రజలు కనీసం బురుండిలో నివసిస్తున్నారు. ఇందులో 200 సంవత్సరానికంటే అధికంగా బురుండి ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తరువాత అది ఈ భూభాగాన్ని బెల్జియంకు అప్పగించింది. జర్మన్లు ​, బెల్జియన్లు ఇద్దరూ బురుండిని పాలించారు. రువాండా రుయాండ-ఉరుండి పేరుతో యూరోపియన్ కాలనీగా పాలించబడింది.


1962 లో బురుండి స్వాతంత్ర్యం పొందింది. ప్రారంభంలో రాజరికం ఉన్నప్పటికీ వరుస హత్యలు, తిరుగుబాట్లు, ప్రాంతీయ అస్థిరత్వం వాతావరణం కారణంగా 1966 లో ఇది గణతంత్రగా రాజ్యంగా ఒక-పార్టీ రాజ్యంగా మారింది. జాతి ప్రక్షాళన యుద్ధాలు, రెండు పౌర యుద్ధాలు, 1970 లలో - 1990 లలో జరిగిన జాతినిర్మూలన హత్యాకాండ దేశాన్ని అభివృద్ధి చెందని దేశంగా ప్రపంచం లోని పేదదేశాలలో ఒకటిగా మిగిలిపోయింది. అధ్యక్షుడు పియరీ నకురన్జిజా అధ్యక్ష పదవిలో మూడవసారి ఎన్నికయ్యాడు. పెద్ద తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. దేశం పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలను అంతర్జాతీయ సమాజసభ్యులు అత్యధికంగా విమర్శించారు.

బురుండి రాజకీయ వ్యవస్థ సార్వభౌమ రాజ్యం ఒక బహుళ-పార్టీ రాష్ట్రంపై ఆధారపడింది. ప్రభుత్వానికి అధ్యక్షుడు నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం బురుండిలో 21 పార్టీలు నమోదై ఉన్నాయి. 1992 మార్చి 13 న టుట్సీ తిరుగుబాటు నాయకుడు పియరీ బీయోయోయా రాజ్యాంగంను స్థాపించాడు. ఇది ఒక బహుళ-పార్టీ రాజకీయ ప్రక్రియను, బహు-పార్టీ పోటీని ప్రతిబింబిస్తుంది. 6 సంవత్సరాల తరువాత 1998 జూన్ 6 న రాజ్యాంగం మార్చబడింది. జాతీయ అసెంబ్లీ సీట్లు విస్తరించడం, రెండు ఉపాధ్యక్షుల నియమాలను తయారు చేయడం జరిగింది. అరుష అకార్డు కారణంగా, 2000 లో బురుండిలో పరివర్తిత ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 2016 అక్టోబరులో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుండి ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితికి బురుండి తెలియజేసింది.

2013 లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభాలో కేవలం 13% మాత్రమే ఉన్న బురుండి అధికంగా నగరనివాసిత సమాజంగా మిగిలిపోయింది. చదరపు కిలోమీటరుకు 315 జనసాంద్రత (చదరపు మైలుకు 753)ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో జనసాధ్రతలో ద్వితీయ స్థానంలో ఉంది. జనాభాలో దాదాపు 85% మంది హుటు, 15% టుట్సి, 1% స్వల్ప స్వజాతి ప్రజలు ఉన్నారు. బురుండి అధికారిక భాషలుగా కిరుండి, ఫ్రెంచి, ఆంగ్లం ఉన్నాయి. కిరుండి అధికారికంగా ఏకైక జాతీయ భాషగా గుర్తింపు పొందాయి.

ఆఫ్రికాలోని అతి చిన్న దేశమైన బురుండిలో భూమధ్యరేఖా వాతావరణం ఉంటుంది. బురుండి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ పశ్చిమ పొడిగింపులో ఉన్న ఆల్బర్టౌనులో భాగంగా ఉంది. ఆఫ్రికా ఆఫ్రికాలో రోలింగ్ పీఠభూమి మీద ఉంది. 2,685 (8,810 ft) ఎత్తు ఉన్న మౌంట్ హేహ ఎత్తైన శిఖరంగా ఉంది. ఇది రాజధాని బుజుంబురా ఆగ్నేయంలో ఉంది. బురుండి లోని బురురీ ప్రావింసులో ఉన్న రువిరోరోజా నది నైలు నదికి అత్యంత సుదూర వనరుగా ఉంది. నైలు లేక్ విక్టోరియా సరసుతో అనుసంధానితమై ఉంది. విక్టోరియా సరోవర జలాలు కాగెరా నది ద్వారా రువిరోరోజా నదిలో సంగమించి నైలు నదికి చేరుతుంది. బురుండి నైరుతి మూలలో ఉన్న టాంగ్యానికా సరసు మరొక ప్రధాన సరసుగా ఉంది. ఈ రెండు జాతీయ ఉద్యానవనాలలో ఒకటి వాయువ్య దిశలో ఉన్న కిబిరా నేషనల్ పార్క్ (రువాండాలోని న్యుంగ్వే ఫారెస్ట్ నేషనల్ పార్కుకు సమీపంలో ఉన్న వర్షపు అడవులతో కూడిన ఒక చిన్న ప్రాంతం), రెండవది ఈశాన్య దిశలో ఉన్న రువాబు నేషనల్ పార్క్ (రురుబ నది వెంట కూడా రవుబు లేదా రువువువు అని కూడా పిలుస్తారు) . రెండు వన్యప్రాణుల జనాభాను రక్షించడానికి 1982 లో స్థాపించబడ్డాయి. బురుండిలో అధికంగా వ్యవసాయం లేదా పచ్చిక భూములు ఉన్నాయి.

గ్రామీణ ప్రజల స్థావరాలు అటవీ నిర్మూలనకు, నేల కోత, నివాస నష్టాలకు దారితీసింది. జనాభా పెరుగుదల కారణంగా మొత్తం దేశం అటవీ నిర్మూలనం దాదాపుగా 600 కిలోమీటర్లు (230 చదరపు మైళ్ళు) చేరుకుంది. సంవత్సరానికి సుమారు 9% నష్టపోతుంది. పేదరికంతో పాటు, బురుండియన్లు తరచూ అవినీతి, బలహీనమైన మౌలిక నిర్మాణాలు, ఆరోగ్యం, విద్యా సేవలకు తక్కువ అభివృద్ధి, ఆకలి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బురుండి అధిక జనసాంద్రత కలిగి ఉంది. యౌవనస్థులు అవకాశాలను కోరుకుంటూ గణనీయమైన వెలుపలకు వలస పోతూ ఉన్నారు. ప్రపంచ హ్యాపీనెస్ రిపోర్ట్ 2018 బురుండిని ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలలో 156 వ స్థానంలో ఉందని పేర్కొంది.

చరిత్ర

ఆఫ్రికాలోని దేశాలలో బురుండి ఒకటి. దాని పొరుగున ఉన్న రువాండా (బోట్స్వానా, లెసోతో, స్వాజిలాండ్ వంటివి) తో పాటు వలసరాజ్యానికి పూర్వ ఆఫ్రికన్ రాజ్యాంగ దేశంగా ఉంది. బురుండి ఆరంభకాల చరిత్రలో ముఖ్యంగా దేశపాలనలో మూడు ప్రధాన జాతి సమూహాల (దివా, హుటు, టుట్సీ) పాత్ర ఉందని విద్యావేత్తలలో అత్యధికంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ సంస్కృతి, జాతి సమూహాల స్వభావం ఎప్పుడూ మార్పులకు లోనౌతూ ఉడడం గమనించడం ముఖ్యం. వేర్వేరు సమయాలలో ఈ సమూహాల వలసల కారణంగా వేర్వేరు జాతి సమూహాలుగా మారిపోయినప్పటికీ ప్రస్తుత వ్యత్యాసాలు సమకాలీన సాంఘిక-సాంస్కృతిక నిర్మాణాలుగా భావించబడుతున్నాయి. ప్రారంభంలో వివిధ జాతి సమూహాలు శాంతితో కలిసి జీవించాయి. జనాభాలో నిరంతర వృద్ధి కారణంగా, 17 వ శతాబ్దం నాటికి జాతి సమూహాల మధ్య మొదటి సంఘర్షణలు ప్రారంభం అయ్యాయి.

బురుండి రాజ్యం

16 వ శతాబ్దం చివరికాలం నాటికి బురుండియన్ దేశం ఏర్పడిందని మొదటి సాక్ష్యం లభించింది. ఇది ముందుగా తూర్పు పర్వత ప్రాంతాలలో ఉద్భవించి తరువాతి శతాబ్దాల్లో ఇది విస్తరించింది. చిన్న పొరుగువారిని కలుపుకుంటూ గ్రేట్ లేక్స్ ప్రాంతంలోని బురుండి రాజ్యం (యురుండి రాజ్యం) ఆయన ఆధ్వర్యంలో అనేక మంది సామంత రాజులతో సాంప్రదాయజాతికి చెందిన చక్రవర్తిచే పరిపాలించబడుతుంది. వారసత్వ పోరాటాలు సాధారణంగా ఉండేవి. మౌమి ( రాజు) గా పిలవబడే రాజు రాచరిక రాజ్యంలో (గన్వా) నాయకత్వం వహించాడు. ఇది స్థానిక రైతుల (ప్రధానంగా హుటు) నుండి పన్ను, సాంమత రాజుల (ప్రధానంగా తుట్సీ) నుండి కప్పం లేదా పన్ను వసూలు చేసింది. బురుండి సామ్రాజ్యం క్రమానుగత రాజకీయ అధికారం, ఉప-ఆర్థిక మార్పిడి విధానంగా వర్గీకరించబడింది.

18 వ శతాబ్దం మధ్యకాలంలో తుట్సీ రాజరికం, భూమి, ఉత్పత్తి, పంపిణీతో అభివృద్ధి అధికారాన్ని కలిగి ఉంది. రాచరిక సంబంధాలతో ప్రజలు కప్పం, పన్ను చెల్లించి బదులుగా రాజు నుండి రక్షణ పొందింది. ఈ సమయములో టుట్సి-బంయరుగురు రాచరికపు న్యాయస్థానం రూపొందించబడింది. వారు టుట్సి-హిమా వంటి ఇతర మతసంబంధవాసుల కంటే అధిక సాంఘిక హోదా కలిగి ఉన్నారు. ఈ సమాజం దిగువ స్థాయిలలో సాధారణంగా హుటు ప్రజలు ఉన్నారు. మద్య భాగంలో తవా ఉన్నారు. కొంతమంది హుటు ప్రజలు ప్రభువులుగా ఉన్నారు. ఈ విధంగా రాజ్యంలో పనితీరు వివరించబడింది. చెప్పబడింది.

హుటు (టుట్సీల) వర్గీకరణ కేవలం జాతిపరమైన ప్రమాణాల ఆధారంగా చేయబడలేదు. హ్యూటు రైతులు తరచూ సంపద, పశువుల నిర్వహణ ఆధారంగా ట్యుటీప్రజలకు అధిక సాంఘిక హోదాను మంజూరు చేశారు. కొంతమంది దీని ఆధారంగా గన్వాకు దగ్గర సలహాదారులయ్యారు. మరొక వైపు, టుట్సీ ప్రజలు వారి పశువులు కోల్పోయిన తరువాత సమాజంలో తమ స్థాయిని కోల్పోయారని నివేదికలు తెలియజేస్తున్నాయి. సంపద కోల్పోయిన వారు హుటుగా పిలువబడ్డారు. అందు వలన హుటు, టుట్సీల మధ్య వ్యత్యాసం పూర్తిగా జాతికి బదులుగా సాంఘిక-స్థాయి ప్రధానాంశంగా ఉండేదని భావిస్తున్నారు. హుటు, టుట్సీ ప్రజల మధ్య వివాహాల గురించి అనేక నివేదికలు ఉన్నాయి. సాధారణంగా ప్రాంతీయ సంబంధాలు, గిరిజన అధికార పోరాటాలు బురుండి రాజకీయాల్లో జాతి కంటే అత్యంత అధిక పాత్రను పోషించాయి.

రాజు నార్టే వి. న్దిజెయెను ఆయన ప్రధాన మంత్రి రాచరికం రద్దుచేసి పదవి నుండి తొలగించిన తరువాత, 1966 నవంబరు తిరుగుబాటు తరువాత చీఫ్ ఆఫ్ స్టాఫ్, కెప్టెన్ మిచెల్ మైకొబెరొ, రిపబ్లిక్ ప్రకటించాడు.

వలసపాలన

1884 నుండి జర్మనీ ఈస్టు ఆఫ్రికా కంపెనీ ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతంలో చురుకుగా ఉండేది. జర్మనీ తూర్పు ఆఫ్రికా కంపెనీ, బ్రిటీష్ సామ్రాజ్యం, జాంజిబారు సుల్తానేటు మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాల ఫలితంగా తలెత్తిన అబూసిరి తిరుగుబాటులను కూల్చి, ఈ ప్రాంతం మీద దృష్టిని కేంద్రీకరించాలని జర్మనీ సామ్రాజ్యం పిలుపునిచ్చింది. 1891 లో జర్మనీ తూర్పు ఆఫ్రికా కంపెనీ బరుండి, రువాండా, టాంజానియా మీద తమకు ఉన్న హక్కులను ప్రధాన భూభాగం (మునుపు టాంకన్యిక అని పిలుస్తారు) జర్మనీ సాంరాజ్యానికి బదిలీ చేసింది. జర్మనీ సాంరాజ్యం ఈ ప్రాంతంలో కాలనీని స్థాపించి " జర్మనీ తూర్పు ఆఫ్రికా " అని దీనికి పేరు పెట్టింది. ఇందులో బరుండి, రువాండా, ప్రధానభూభాగంలో భాగంగా ఉన్న టాంజానియా (పూర్వం దీనిని తంగాన్యికా అనే వారు) చేర్చింది. 1880 చివరిలో జర్మనీ సామ్రాజ్యం రుయాండా, బురుండిలో సాయుధ దళాలను నెలకొల్పింది. ప్రస్తుత-నగరమైన గిటెగా నగరం రువాండా-ఉరుండి ప్రాంత పరిపాలనా కేంద్రంగా ఉంది.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో తూర్పు ఆఫ్రికన్ పోరాటం ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతాన్ని బాగా ప్రభావితం చేసింది. సంకీర్ణ శక్తులు, బ్రిటీషు సామ్రాజ్యం బెల్జియం జర్మనీ కాలనీమీద సమైఖ్యంగా దాడిని ప్రారంభించింది. బురుండిలో ఉన్న జర్మనీ సైన్యం సంఖ్యాపరంగా ఆధిఖ్యత కలిగిన బెల్జియను సైన్యంతో పోరాడి ఓటమిని ఎదుర్కొన్నది. 1916 జూన్ 17 నాటికి బురుండి, రువాండా ఆక్రమించబడ్డాయి. బ్రిటీషు లేక్ ఫోర్సు తరువాత జర్మనీ తూర్పు ఆఫ్రికా పరిపాలనా కేంద్రమైన తబోరాను పట్టుకోవడంలో తీవ్రత చూపింది. యుద్ధం తరువాత వేర్సైల్లెస్ ఒప్పందంలో అంగీకరించినట్లు జర్మనీ మాజీ తూర్పు ఆఫ్రికా పశ్చిమ భాగాన్ని బెల్జియం "నియంత్రణ"కు వదిలివేయాలన్న వత్తిడికి గురైంది.

1924 అక్టోబరు 20 న ప్రస్తుత రువాండా, బురుండి, బెల్జియం లీగ్ అఫ్ నేషన్స్ ఆండేట్ భూభాగం అయ్యింది. ఆచరణాత్మకంగా అది బెల్జియను వలస సామ్రాజ్యంలో భాగంగా పరిగణించబడింది. ఐరోపావాసుల దండయాత్ర ఉన్నప్పటికీ రువాండా-ఉరుండిలో రాజవంశ పాలన కొనసాగింది.

బెల్జియన్లు చాలా రాజ్య సంస్థలను సంరక్షించారు. కనుక బురుండియను సామ్రాజ్యం తరువాత వలసకాలానీ పాలనలో మనుగడసాగించడంలో విజయం సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రుయాండా-ఉరుండి బెల్జియన్ పాలనా అధికారం ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ టెర్రిటరీగా వర్గీకరించబడింది. 1940 లో వరుస పాలసీల కారణంగా 1943 అక్టోబరు 4 న బురుండి లోని రాజాస్థానాలు ప్రభుత్వ శాసన విభాగాలుగా విడిపోయాయి. ఒక్కొక్క భూభాగానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి బాధ్యత వహించాడు. రాజాస్థానాలు భూభాగాలకు ఆధిపత్యం వహించాయి. ఉప రాజాస్థానాలు స్థాపించబడ్డాయి. స్థానిక అధికారులు కూడా అధికారాలు కలిగి ఉన్నారు. 1948 లో బెల్జియం ఈ ప్రాంతానికి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి అనుమతించారు. 1962 జూలై 1 లో బురుండి బెల్జియం నుండి స్వాతంత్ర్యం పొందింది.

స్వతంత్రం

బురుండి 
Flag of the Kingdom of Burundi (1962–1966).
బురుండి 
Independence Square and monument in Bujumbura.

1959 జనవరి 20 న బురుండి పాలకుడు ఐదవ మవమి మవంబుట్సా బెల్జియం నుండి బురుండి స్వాతంత్ర్యం కోరుతూ రువాండా-ఉరుండి సంఘం రద్దు చేయమని అభ్యర్థించారు. తరువాతి మాసాలలో బురుండి రాజకీయ పార్టీలు బెల్జియను వలసరాజ్య పాలన ముగింపు, రువాండా, బురుండిల విభజన కోసం వాదించడం ప్రారంభించాయి. ఈ రాజకీయ పార్టీలు మొదటి, అతిపెద్ద జాతీయ ప్రోగ్రెస్ యూనియనుగా రూపొందాయి.

స్వాతంత్ర్యం కోసం బురుండి పురోగతితో ప్రభావితమై రువాండా విప్లవం మొదలుకావడం రాజాకీయ అస్థిరత, జాతి అస్థిరతకు దారితీసింది. రువాండా విప్లవం ఫలితంగా 1959 నుండి 1961 వరకు అనేక మంది రువాండాన్ టుట్సి శరణార్థులు బురుండిలోకి వచ్చారు.

1961 సెప్టెంబరు 8 న బురుండి మొదటి ఎన్నికలలో ప్రిన్సు లూయిస్ రవగసోర్ నేతృత్వంలోని ఒక బహుళ జాతి ఐక్యత పార్టీ కేవలం 80% ఓట్లను గెలుచుకుంది. ఎన్నికల నేపథ్యంలో అక్టోబరు 13 న బురుండి ప్రజల మనసులను దోచుకుని అత్యంత ప్రజాదరణ పొందిన 29 సంవత్సరాల ప్రిన్సు రవగసోరు హత్యకు గురయ్యాడు.

1962 జూలై 1 న స్వాతంత్ర్యం పొందింది, చట్టబద్ధంగా తన పేరును రువాండా-ఉరుండి నుండి బురుండిగా మార్చింది.బురుండి ప్రిన్సు రువాస్సోరు తండ్రి అయిన 5 వ మవామి మవంబుట్సా నాయకత్వంలో రాచరిక రాజ్యాంగం అయ్యింది. 1962 సెప్టెంబరు 18 న బురుండి యునైటెడ్ నేషంసు సభ్యత్వం పొందింది.


1963 లో కింగ్ మ్వాంబుస్టా ఒక హ్యూటు జాతికి వ్యక్తి పియరు న్జండండుంవేను ప్రధాన మంత్రి నియమించాడు. కానీ ఆయనను యు.ఎస్. ఎంబసీ నియమించిన ర్వాండను టుట్సీ 1965 జనవరి 15 న కాంగో సంక్షోభంలో సందర్భంలో హత్య చేసాడు. కాంగోలో పోరాడుతున్న కమ్యూనిస్టు తిరుగుబాటుదారుల కోసం బురుండిని ఒక లాజిస్టిక్స్ స్థావరాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించినందుకు ప్రతిస్పందనగా పశ్చిమ కమ్యూనిస్టు వ్యతిరేక దేశాలు " కమ్యూనిస్టు పీపుల్సు రిపబ్లిక్కు ఆఫ్ చైనాను" ఎదుర్కొన్నాయి. మే 1965 లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు హుటును అధిక సంఖ్యలో పార్లమెంటులోకి తీసుకువచ్చాయి. అయితే కింగ్ మ్వాంబుస్టా ఒక టుట్సీ ప్రధాన మంత్రిగా నియమించాడు. కొంతమంది హుటులు అన్యాయమైనదని ఈకారణంగా జాతి ఉద్రిక్తతలు మరింత అధికరించాయని భావించారు. 1965 అక్టోబరులో హుటు-ఆధికసంఖ్యలో ఉన్న పోలీసుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. టుట్సీ అధికారి కెప్టెన్ మిచెల్ మైకోబెరో నాయకత్వం వహించిన టుట్సి సైన్యం,హుటును ర్యాంకుల నుండి తొలగించింది. 1972 ముందుగా జరిగిన బురుండియన్ జాతి హత్యలలో 5,000 మంది ప్రజలు మరణించారు.

1965 అక్టోబరు తిరుగుబాటు సమయంలో దేశం విడిచిపెట్టిన రాజు మవంబుట్సా 1966 జూలైలో తిరుగుబాటు చేత తొలగించబడ్డాడు. అతని యువ రాజు ప్రిన్స్ నార్టే సింహాసనాన్ని అధిష్ఠించాడు. అదే సంవత్సరం నవంబరులో టుట్సి ప్రధాన మంత్రి, అప్పటి-కెప్టెన్ మిచెల్ మైక్రోబెరో మరొక తిరుగుబాటును నిర్వహించాడు. ఈసారి నార్టేను రాచరికం రద్దు చేసి దేశాన్ని ఒక గణతంత్రంగా ప్రకటించాడు. అయితే ఆయన ఒక పార్టీ ప్రభుత్వంగా శక్తివంతమైన ఒక సైనిక నియంతృత్వపాలనగా భావించబడుతుంది.

అధ్యక్షుడు మైకొంబ్రొ ఆఫ్రికా సోషలిజానికి న్యాయ్వాదిగా మారాడు. ఇనుకు ఆయనకు చైనా నుండి మద్దతు లభించింది. ఆయన సరికొత్త చట్టరక్షణ విధానం ప్రవేశపెట్టి హుటూ సైన్యవిధానాన్ని పూర్తిగా అణిచివేసాడు.

అంతర్యుద్ధం, హుటుకు వ్యతిరేకంగా జాతి హత్యలు

1972 ఏప్రిల్ చివరలో జరిగిన రెండు సంఘటనలు మొదటి బురుండియన్ జాతినిర్మూలన హత్యలకు దారితీసాయి. 1972 ఏప్రెలు 27 న హుటు జండర్మేరీ సభ్యుల నాయకత్వంలో రుమొంజే, న్యాన్జా-లాక్ పట్టణాలలో తిరుగుబాటు లేవనెత్తి తరువాత తిరుగుబాటుదారులు స్వల్పకాలిక మార్టిజో రిపబ్లిక్ను ప్రకటించారు. తిరుగుబాటుదారులు టుట్సి, హుటులు (తమ తిరుగుబాటులో చేరడానికి నిరాకరించిన వార్) మీద దాడి చేసారు.

ఈ ప్రారంభ హుటు తిరుగుబాటు సమయంలో 800 నుంచి 1200 మంది చనిపోయారు.అదే సమయంలో బురుండి రాజైన న్తరె వి దేశ బహిష్కరణ నుండి తిరిగి దేశంలో ప్రవేశించడం రాజకీయ ఉద్రిక్తతను అధికరింపజేసింది. 1972 ఏప్రెలు 29 న 24 సంవత్సరాల నార్తే వి హత్య చేయబడ్డాడు. తరువాతి నెలలలో తొమ్మిబెరో టుట్సి ఆధిపత్యంలో ప్రభుత్వం హుటు తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి సైన్యాలను హ్యూటు మెజారిటీ లక్ష్యంగా చేసుకుని హత్య చేస్తూ జాతి నిర్మూలనకు ఉపయోగించింది. మరణాల సంఖ్య ఎన్నటికీ నిర్ధారించబడనప్పటికీ సమకాలీన అంచనాలు 80,000 నుండి 2,10,000 ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా అనేక వందల వేల హుటు ప్రజలు జైరే, రువాండా, టాంజానియాలోకి పారిపోయారని అంచనా. పౌర యుద్ధం, సామూహిక హత్యాకాండను తరువాత మైకోంబో మానసికంగా బాధపడుతూ హత్యాకాండను ఉపసంహరించుకున్నాడు. 1976 లో కల్నల్ జీన్-బాప్టిస్టే బాగజా (ఒక టుట్సి) రక్తపు రహిత తిరుగుబాటుతో మైకోబోను పదవీచ్యుతుని చేసి పదివీ బాధ్యతలు చేపట్టి సంస్కరణలకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించుకున్నాడు. 1981 లో అతని పరిపాలన కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది బురుండిని ఏక-పార్టీ రాష్ట్రంగా నిర్వహించింది. 1984 ఆగస్టులో బాజాజా దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన పదవీకాలంలో బాగజా రాజకీయ ప్రత్యర్థులను మత స్వేచ్ఛను అణిచివేసారు.


మేజర్ పియరీ బీయోయో (టుట్సి) 1987 లో బాగజాను పడగొట్టి, రాజ్యాంగ సస్పెండు చేసి, రాజకీయ పార్టీలను రద్దు చేసాడు. ఆయన నేషనల్ సాల్వేషన్ తరఫున ఒక మిలిటరీ కమిటీ ద్వారా సైనిక పాలనను పునరుద్ధరించాడు. 1972 యాంటీ-టుట్సి జాతిపరమైన పోరాట అవశేషాలను 1981 లో పాలిపెహూటూగా పునరుద్ధరించబడింది. తరువాత ఆగష్టు 1988 ఆగస్టులో నోటె, మారాంగార ఉత్తర కమ్యూన్లలో టుట్సీ రైతుల హత్యలు ప్రారంభం అయ్యాయి. మరణించినవారి సంఖ్య 5,000 గా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ [ఆధారం చూపాలి]; కొన్ని అంతర్జాతీయ NGO లు ఈ మరణాల సంఖ్య ఖచ్ఛితమైనవని విశ్వసించలేదు.

నూతన పాలన 1972 కఠినమైన ప్రత్యామ్నాయాలను నిర్లక్ష్యం చేయలేదు. ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి హత్యకు పిలుపునిచ్చిన వారికి, హత్యల ద్వారా ప్రయోజనం పొందినవారి క్షమాభిక్షను రద్దు చేసింది.[ఆధారం చూపాలి]


ఈ హత్యల తరువాత హుటు మేధావుల ప్రభుత్వ నిర్వహణలో ప్రాతినిధ్యం అధికరించాలని కోరుతూ సమూహం పియరీ పెయోయోయాకు బహిరంగ లేఖ రాశారు. ఫలితంగా వారు ఖైదు చేయబడ్డారు. కొన్ని వారాల తరువాత హ్యూటు, టుట్సీ మంత్రుల సమాన సంఖ్యతో బొయియో ఒక కొత్త ప్రభుత్వాన్ని నియమించారు. ఆయన అడియెన్ సిబోమానా (హుటు) ను ప్రధానమంత్రిగా నియమించాడు. తరువాత బొయియో జాతీయ ఐక్యత సమస్యలను చర్చించడానికి ఒక కమిషనును సృష్టించింది. 1992 లో ప్రభుత్వం ఒక బహుళ-పార్టీ విధానంతో ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించింది. కానీ తరువాత ఒక అంతర్యుద్ధం మొదలయ్యింది.

1962 - 1993 మధ్య విభేదాల కారణంగా బురుండిలో సుమారు 250,000 మంది మరణించారు. 1962 లో బురుండి స్వాతంత్ర్యం తరువాత దేశంలో రెండు జాతినిర్మూలన హత్యాకాండలు జరిగాయి. 1972 లో టుటు-ఆధిపత్యంలో సైన్యం నిర్వహించిన హుటు ప్రజల సామూహిక హత్యలు, 1993 లో హ్యూటు మెజారిటీ ప్రజలు సాగించిన టుట్సిస్ ప్రజల సామూహిక హత్యాకాండ. 2002 లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సమర్పించిన " ఇంటర్నేషనల్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ " తుది నివేదికలో బురుండిలో జరిగిన హత్యాకాండను జాతి హత్యాకాండగా అభివర్ణించారు.

ప్రజాపాలన ప్రయత్నం, టుట్సికి వ్యతిరేకంగా సామూహిక జాతి హత్యలు

1993 జూన్ లో బురుండీలో ప్రజాస్వామ్యం హ్యూటు- ఫ్రంటు నాయకుడు మెల్చియరు నదడె మొదటి ప్రజాస్వామ్య ఎన్నికలో విజయం సాధించి హుటు ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి హుటు నాయకుడు అయ్యాడు. అక్టోబర్ 1993 అక్టోబరులో టుట్సీ సైనికులు న్దదాయేను చంపడంతో తలెత్తిన తీవ్రమైన సంఘర్షణలు టుట్సీ మెజారిటీకి వ్యతిరేకంగా మొదలైన జాతినిర్మూలన హత్యాకాండకు సంవత్సరాల కాలం కొనసాగింది. హత్య తరువాత సంవత్సరాలలో దాదాపు 3,00,000 మంది పౌరులు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

1994 ప్రారంభంలో పార్లమెంటు సైప్రియన్ నటియారిమిరా (హుటు) ను అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఆయన రువాండా అధ్యక్షుడు జ్యువెనల్ హబ్యారిమానా ఒకేసారి 1994 ఏప్రెలులో విమానాన్ని కూల్చి చంపబడ్డారు. శరణార్థులు రువాండా పారిపోవడం ప్రారంభించారు. పార్లమెంటు స్పీకరు సిల్వెస్ట్రే నట్టిబంతంగని (హుటు) 1994 అక్టోబరులో అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 13 పార్టీలకు చెందిన 12 సభ్యులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. భీతికరమైన ఊచకోత మొదలైంది. రాజధానిలో బుజుంబరాలో ఉన్న అనేక హుటు శరణార్థులు, [ఆధారం చూపాలి] చంపబడ్డారు. ప్రధానంగా టుట్సీ యూనియన్ ఫర్ నేషనల్ ప్రొగ్రెస్స్ ప్రభుత్వం పార్లమెంటు నుండి ఉపసంహరించింది.

1996 లో తిరుగుబాటుదారుల ద్వారా పియరీ పెయోయోయ (టుట్సీ) మళ్లీ అధికారపీఠం అధిష్ఠించాడు. తరువాత ఆయన రాజ్యాంగం సస్పెండుచేసి 1998 లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. 1987 నుండి 1993 వరకు కొనసాగిన ఆయన మొదటి పదవీకాలం తరువాత అధ్యక్షుడిగా ఆయన రెండవ పదవీకాల ఆరంభం అయింది. తిరుగుబాటు దాడులకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ప్రజలలో ఎక్కువమందిని శ్రణార్ధుల శిబిరాలకు పంపవలసిన వత్తిడికి గురైంది. బుయాయొ పాలనలో దీర్ఘమైన శాంతి చర్చలు ప్రారంభించారు. దీనికి దక్షిణ ఆఫ్రికా మధ్యవర్తిత్వం వహించింది. బురుండిలో అధికారాన్ని పంచుకునే ఒప్పందం మీద అరూనా, టాంజానియా, ప్రిటోరియా, దక్షిణాఫ్రికాల్లో రెండు పార్టీలు సంతకాలు చేసాయి. ఒప్పందాలు కార్యరూపందాల్చడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.


బురుండి 
కబిల్లాకు వ్యతిరేకంగా ఉగాండా రువాండా, బురుండి మద్దతుదారులు తిరుగుబాటుదారులు చూపిస్తున్న ఆఫ్రికన్ దేశాల రంగుల చిహ్నం

2000 ఆగస్టు 28 న అరుషా శాంతి ఒప్పందంలో భాగంగా బురుండి ఆపత్కాల ప్రభుత్వం ఏర్పాటుకు ప్రణాళిక చేయబడింది. ఆపత్కాల ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ప్రయోగాత్మకంగా ఉంచబడింది. అనేక కాల్పుల అసఫల విరమణ ఒప్పందాల తరువాత 2001 శాంతి ప్రణాళిక, అధికారం-భాగస్వామ్య ఒప్పందం విజయవంతమైంది. 2003 లో టుట్సీ-నియంత్రిత బురిండియన్ ప్రభుత్వం, అతిపెద్ద హుటు తిరుగుబాటు సమూహం (ప్రజాస్వామ్య రక్షణ కోసం డెమోక్రసీ-దళాల రక్షణ కోసం నేషనల్ కౌన్సిల్) కాల్పుల విరమణ సంతకం చేశారు.


2003 లో ఫోర్డెబూ నాయకుడు డోమిటీన్ నడిజీయే (హుటు) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005 ప్రారంభంలో బురుండి ప్రభుత్వంలో స్థానాలను నిర్ణయించడానికి సంప్రదాయ కుటాలు సమావేశం అయ్యారు. 2005 లో తిరుగుబాటు బృందం నాయకుడు పియరీ న్కురుంజిజా (హుటు)అధ్యక్ష్యునిగా ఎన్నిక చేయబడ్డాడు. 2008 నాటికి బురిండియన్ ప్రభుత్వం దేశంలో శాంతి నెలకొల్పడానికి హుటు నేతృత్వంలోని పాలిపెహుటు-నేషనల్ లిబరేషన్ ఫోర్సెసుతో చర్చలు జరిపింది.

శాంతి ఒప్పందం

ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బ్యూరోస్ బోట్రోస్-ఘాలి అభ్యర్థనను అనుసరించి పోరాటం సాగిస్తున్న రెండు వర్గాల మధ్య 1995 లో మాజీ టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరే ఆధ్వర్యంలో శాంతి చర్చలు ప్రారంభించబడ్డాయి. అతని మరణం తరువాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా చర్చల బాధ్యతను చేపట్టాడు. చర్చలు పురోగమించిన తరువాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో బెకీ, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా శాంతి చర్చలు పురోగతికి సహకారం అందించారు.

టుట్సీ, హుటు మధ్య జాతి అంతరాన్ని నిర్మూలించే క్రమంలో బురుండియన్ ప్రభుత్వం, సైనికాధికారులను క్రమబద్ధీకరించడం ప్రధానాంశంగా భావించబడింది. ఇది రెండు ప్రధాన దశల్లో జరిగింది. మొదట మూడు సంవత్సరాల కాలం అధ్యక్షుడితో ఒక ఆపత్కాల ఉన్న అధ్యక్షులతో ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. రెండవది సాయుధదళాలను పునర్నించబడింది. ఇందులో రెండు వర్గాలు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తాయి.

శాంతి చర్చల దీర్ఘకాలికంగా కొనసాగిన కారణంగా మధ్యవర్తులకు, పార్టీలకు అనేక అడ్డంకులు ఎదురైయ్యాయి. మొదట బురుండియన్ అధికారులు చర్చల లక్ష్యాలు అవాస్తవంగా ఉన్నాయని భావించి ఒప్పందాలను అస్పష్టంగా, విరుద్ధంగా, గందరగోళంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండవది బహుశా అతి ముఖ్యమైనది బురుండియన్లు కాల్పుల విరమణ లేని ఈ ఒప్పందం అసంబద్ధం ఉంటుందని విశ్వసించారు. ఇందుకు తిరుగుబాటు బృందాలతో ప్రత్యేకమైన ప్రత్యక్ష చర్చలు అవసరం అని భావించారు. ప్రధాన హుటు పార్టీ అధికార-భాగస్వామ్య ప్రభుత్వ ప్రతిపాదనను సందేహం వ్యక్తపరిచింది. వారు గత ఒప్పందాలలో టుట్సీలు మోసగించారని ఆరోపించారు.

2000 లో బురుండియన్ ప్రెసిడెంటు ఒప్పందం మీద 19 పోరాడుతున్న హుటు, తుట్సీ వర్గాల్లో 13 మంది సంతకం చేసారు. ప్రభుత్వానికి అధ్యక్షత వహించడం, కాల్పుల విరమణ ప్రారంభం కావడం విషయాలలో విబేధాలు కొనసాగాయి. శాంతి చర్చల ఒప్పందానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన టుట్సీ, హుటు బృందాలు సంతకం చేయడానికి నిరాకరించారు. ఫలితంగా హింస తీవ్రమైంది. మూడు సంవత్సరాల తరువాత టాంజానియాలోని ఆఫ్రికన్ నాయకుల సమ్మిట్ వద్ద, బురుండియన్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష హుటు బృందం వివాదాన్ని అంతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సంతకం చేసిన సభ్యులకు ప్రభుత్వం లోపల మంత్రిత్వ శాఖలు మంజూరు చేయబడ్డాయి. అయినప్పటికీ - నేషనల్ లిబరేషన్ కోసం ఫోర్సెస్ వంటి చిన్న ఉగ్రవాద హుటు గ్రూపులు చురుకుగా ఉన్నాయి.

ఐఖ్యరాజ్యసమితి జోక్యం

టాంజానియా, దక్షిణాఫ్రికా, ఉగాండాలలో ప్రాంతీయ నాయకుల పర్యవేక్షణలో పలు రౌండ్లు శాంతి చర్చలు జరిగాయి. మెజారిటీ పోటీదారులను సంతృప్తిపరిచేందుకు క్రమంగా అధికారభాగస్వామ్య ఒప్పందాలు ఏర్పడ్డాయి. బహిష్కరణ నుండి తిరిగి వచ్చిన బురుండియన్ నాయకులను రక్షించడానికి మొట్టమొదట దక్షిణాఫ్రికా రక్షణ మద్దతు దళాలను నియమించారు. ఈ దళాలు బురుండికి ఆఫ్రికన్ యూనియన్ మిషనులో భాగం అయ్యాయి. ఇది ఆపత్కాల ప్రభుత్వాలను స్థాపించడానికి సహాయపడింది. జూన్ 2004 లో యు.ఎన్. శాంతి భద్రత బాధ్యతలు చేపట్టింది. బురుండిలో ఇప్పటికే గుర్తించదగిన శాంతి ప్రక్రియకు అధికరిస్తున్న అంతర్జాతీయ మద్దతుకు ఇది సంకేతంగా ఉంది.


ఐక్యరాజ్యసమితి చార్టరు 7 వ అధ్యాయం ఆధారంగా మిషన్ కాల్పుల విరమణను పర్యవేక్షించడం, నిరాయుధీకరణ, మాజీ పోరాటాల పునరేకీకరణ చేయడం కొరకు పనిచేసింది. అదనంగా శరణార్ధులకు మానవతావాద సహాయం చేయడం ఎన్నికల సహాయం చేయడం, అంతర్జాతీయ సిబ్బంది, బురుండియన్ పౌరులను కాపాడటం వంటి బాధ్యతలను చేపట్టింది. సమస్యాత్మకమైన బురుండి సరిహద్దులను పర్యవేక్షించడం, అక్రమ ఆయుధాల ప్రవాహంతో నిరోధించడం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, సాయుధ దళాలు, పోలీసుల సంస్థాగత సంస్కరణలు చేపట్టడంలో సహాయపడ్డాయి. ఈ మిషను 5,650 సైనిక సిబ్బందిని, 120 పౌర పోలీసులను, 1,000 మంది అంతర్జాతీయ, స్థానిక పౌర సిబ్బందిని కేటాయించారు. ఈ మిషన్ బాగా పని చేసింది. ఇది ప్రజాస్వామ్య ఎన్నిక నుండి అధిక ప్రయోజనం పొందింది.

ప్రారంభ హుటు జాతీయవాద తిరుగుబాటు బృందాలు ప్రారంభ దశలో శాంతి ప్రక్రియను ప్రతిఘటించాయి. ఐక్యరాజ్య సమితి ఉన్నప్పటికీ ఈ సంస్థ రాజధాని శివార్లలో తన హింసాత్మక కార్యకలాపాలను కొనసాగించింది. 2005 జూన్ నాటికి ఆ బృందం పోరాటాన్ని నిలిపివేసింది. దాని ప్రతినిధులు రాజకీయ స్రవంతిలోకి తిరిగి తీసుకునిరాబడ్డారు. సంప్రదాయంగా సమైఖ్యం కాని రాజకీయ పార్టీ ప్రభుత్వ కార్యాలయ ప్రక్రియలో భాగస్వామ్యం వహించకూడదన్న సూత్రాన్ని రాజకీయ పార్టీలు అన్ని ఆమోదించాయి.


ప్రజల ప్రజాస్వామ్య భాగస్వామ్య ఏర్పాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి పనిచేసింది. ఇందులో భాగంగా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్థాపించాలని భావించింది. 2005 ఫిబ్రవరిలో 90% కంటే అధిక ఓటుతో రాజ్యాంగం ఆమోదించబడింది. మే, జూన్, ఆగస్టు 2005 మే, జూన్, ఆగస్టులలో పార్లమెంటు, అధ్యక్ష స్థానాలకు స్థానిక స్థాయిలో మూడు వేర్వేరు ఎన్నికలు జరిగాయి.

శరణార్ధుల రాకతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రజలు తగిన ఆహార సరఫరాలను పొందగలిగారు. ఆ బృందం పోరాడుతున్న అత్యధిక పోరాటయోధులు, పెద్ద సంఖ్యలో ప్రజల విశ్వాసాన్ని పొందగలిగింది. ఇది పాఠశాలలు, అనాధ శరణాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, నీటి మార్గాల వంటి పునర్నిర్మాణ సదుపాయాలను కలిగించడంలో సంబంధం కలిగి ఉంది.

2006 నుండి 2015

బురుండి 
View of the capital city Bujumbura in 2006.

2006 తరువాత బురుండిలో పునర్నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపందాల్చడం ప్రారంభమైంది. ఐఖ్యరాజ్య సమితిశాంతి భద్రత మిషనును మూసివేసింది. పునర్నిర్మాణంలో సహాయం చేయడం మీద తిరిగి దృష్టి సారించింది. ఆర్ధిక పునర్నిర్మాణం సాధించే దిశగా కృషిచేస్తూ రువాండా, డి.ఆర్.కాంగో, బురుండి గ్రేట్ లేక్సు కంట్రీల, ప్రాంతీయ ఆర్ధిక సంఘాన్ని పునఃప్రారంభించారు. అంతేకాక 2007 లో బురుండి రువాండాతో కలిసి తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలో చేరింది.

అయినప్పటికీ 2006 సెప్టెంబరులో ప్రభుత్వం, చివరి సాయుధ ప్రతిపక్ష సమూహం, ఎఫ్.ఎల్.ఎన్ (నేషనల్ లిబరేషన్ ఫోర్సెస్, (ఎన్.ఎల్.ఎఫ్. లేదా ఫ్రొలినా అని కూడా పిలుస్తారు)) మద్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా అమలు చేయబడలేదు. సీనియర్ ఎఫ్.ఎల్.ఎన్. సభ్యులు తమకు రక్షణ లేదని పర్యవేక్షణ బృందం నుండి వెలుపలికి వెళ్ళారు. సెప్టెంబరు 2007 సెప్టెంబరు లో ప్రత్యర్థి ఎఫ్.ఎల్.ఎన్. శాఖలు రాజధానిలో గొడవపడి 20 మంది చంపి నివాసితులు పారిపోవడానికి కారణమయ్యాయి. దేశంలోని ఇతర ప్రాంతాలలో రెబెల్ దాడులు జరిగాయి. తిరుగుబాటు వర్గాలు నిరాయుధీకరణ, రాజకీయ ఖైదీలను విడుదల చేయడంలో ప్రభుత్వంతో విభేదించింది. 2007 చివర 2008 ప్రారంభంలో ఎఫ్.ఎల్.ఎన్. పోరాటకారులు ప్రభుత్వ రక్షణలో మాజీ పోరాటవీరులు నివసిస్తున్న శిబిరాల మీద దాడి చేశారు. గ్రామీణ నివాసుల గృహాలు కూడా దోపిడీకి గురైయ్యాయి.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2007 నివేదిక అనేక ప్రాంతాల్లో అభివృద్ధి అవసరం అని పేర్కొంది. పౌరులు ఎఫ్.ఎల్.ఎన్. పునరావృతం చేసిన హింసాత్మక చర్యల బాధించబడ్డారు. తరువాత బాల సైనికులను కూడా నియమించింది. మహిళలపై హింస శాతం అధికం అయింది. ప్రభుత్వం విచారణ, శిక్షల నుండి నేరస్థులను తప్పించింది. న్యాయ వ్యవస్థ సంస్కరణకు తక్షణ అవసరం ఏర్పడింది. జాతినిర్మూలన హింసాకాండ, యుద్ధ నేరాలు, మానవజాతికి వ్యతిరేకంగా నేరాలు దండింపబడలేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిమితంగా ఉంది. జర్నలిస్టులకు చట్టబద్దమైన వృత్తిపరమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్న జర్నలిస్టులను తరచూ ఖైదుచేసారు. జనవరి, నవంబరు 2007 మధ్య మొత్తం 38,087 బురుండియన్ శరణార్థులు తిరిగి స్వదేశానికి పంపబడ్డారు.

2008 మార్చి చివరలో ఎఫ్.ఎల్.ఎన్. అరెస్టు నుండి తమకు 'తాత్కాలిక రక్షణ' హామీ కల్పించే ఒక చట్టాన్ని రూపొందించమని పార్లమెంటును కోరింది. ఇది సాధారణ నేరాలకు వర్తిస్తుంది కానీ యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు వంటి అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనకు వర్తించదు. గతంలో ఇది ప్రజలకు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఎఫ్.ఎల్.ఎన్. తాత్కాలిక రక్షణను పొందలేకపోయింది.


2008 ఏప్రెల్ 17 న ఎఫ్.ఎల్.ఎన్. బాంజుబురా మీద బాంబు దాడి చేసింది. బురుండియన్ సైన్యం తిరిగి పోరాడింది ఎఫ్.ఎల్.ఎన్. భారీ నష్టాలను ఎదుర్కొంది. 2008 మే 26 న కొత్త కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేయబడింది. 2008 ఆగస్టులో అధ్యక్షుడు ఎన్కురుంజియా ఎఫ్.ఎల్.ఎన్. నేత అగాథన్ రవాసాతో కలిసి, దక్షిణాఫ్రికా భద్రత, భద్రతా మంత్రి చార్లెస్ నక్కులా మధ్యవర్తిత్వంతో సమావేశమైంది. 2007 జూన్ నుండి మొదటి ప్రత్యక్ష సమావేశం అయింది. శాంతి చర్చల సమయంలో తలెత్తే ఏవైనా వివాదాలను పరిష్కరించడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఇద్దరూ వారానికి రెండుసార్లు సమావేశం కావడానికి కూడా రెండు వర్గాలు అంగీకరించాయి.


శరణార్ధ శిబిరాలు ఇప్పుడు మూసివేయబడుతున్నాయి. 4,50,000 శరణార్థులు తిరిగి వచ్చారు. దేశం ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. 2011 నాటికి ప్రపంచంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాలలో బురుండి ఒకటిగా ఉంది. తిరిగి వచ్చిన శరణార్ధులు, ఇతరుల మద్య ఆస్తి సంఘర్షణ ప్రారంభమైంది.

బురుండీ ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక బృందాల్లో పాల్గొంటుంది. దీనిలో అల్-షబాబ్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మిషన్ సోమాలియా కార్యకలాపాలలో పాల్గొంటున్నది.

2015 అశాంతి

2015 ఏప్రిల్లో అధికార పార్టీ ప్రెసిడెంట్ పియర్ నకురన్జిజా మూడవసారి పదవిని అధిష్ఠించిన తరువాత నిరసనలు ప్రారంభమయ్యాయి. న్కురుంజిజా మూడోసారి పదవిలో కొనసాగకూడదని నిరసనకారులు ఆరోపించారు. దేశరాజ్యాంగ న్యాయస్థానం అధ్యక్షుడి అభిప్రాయాన్ని (దాని సభ్యులు కొందరు తమ ఓటు సమయంలో దేశంలో పారిపోయారు) అంగీకరించారు.న్కురుంజిజా పదవి నుండి తొలగించడానికి చేసిన ప్రయత్నం విఫలం అయింది. 13 మే న ప్రయత్నించిన ఒక తిరుగుబాటుదారుడిని Nkurunziza ని విరమించడం విఫలమైంది. [70] [71]


ఆయన బురుండికి తిరిగివచ్చి తన ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించాడు. అనేక తిరుగుబాటు నాయకులను అరెస్టు చేశారు. తిరుగుబాటు ప్రయత్నం తరువాత నిరసనలు కొనసాగాయి. 20 మే నాటికి 1,00,000 మంది ప్రజలు దేశవ్యాప్తంగా పారిపోయారు. ఇది అత్యవసర పరిస్థితిని సృష్టించింది. చట్టవిరుద్ధమైన హత్యలు, హింస, అదృశ్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు వంటి మానవ హక్కుల నిరంతర ఉల్లంఘన, విస్తారమైన దుర్వినియోగాల నివేదికలు ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, అనేక ఇతర ప్రభుత్వాల పిలుపుతో 29 జూన్ న పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి. అయినప్పటికీ వీటిని ప్రతిపక్షాలు బహిష్కరించాయి.

విచారణ కమీషన్

2016 సెప్టెంబరు 30 న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి బురుండిపై విచారణ కొరకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. "2015 ఏప్రెలు నుండి బురుండిలో మానవ హక్కుల ఉల్లంఘన, దుర్వినియోగాలపై దర్యాప్తు జరిపి ఆరోపణలున్న నేరస్థులను గుర్తించడానికి సిఫారసులను రూపొందించడానికి ఆదేశం ఇచ్చింది. మానవ హక్కుల మండలి తరువాత సంవత్సరం సెప్టెంబరు వరకు కమిషన్ పొడిగించమని ఆదేశించింది. 2017 సెప్టెంబరు 29 న బురుండిపై విచారణ కమిషన్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ముగింపును విధించమని బురుండియన్ ప్రభుత్వాన్ని పిలుపునిచ్చింది.అభ్యర్థనలు పునరావృతం అయినప్పటికీ బురుండియన్ ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ కమిషనుతో సహకరించడానికి నిరాకరించింది. " కమిషన్ విదేశాల్లో 500 కంటే ఎక్కువ మంది బురుండియన్ల శరణార్థులు, మిగిలిన వారితో ఇంటర్వ్యూలను నిర్వహించి 2015 ఏప్రెలు నుండి బురుండిలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దుర్వినియోగాలు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. అరెస్టులు, నిర్బంధాలు, హింస, క్రూరమైన, ప్రజలకు వ్యతిరేకంగా నిర్వహించిన అమానుషమైన అధర్మమైన చర్యలు, విచారణరహిత మరణశిక్షలు, బలవంతపు అదృశ్యాలు, బలాత్కారాలు, లైంగిక వేధింపులు, ఇతర నేరాలు నమోదుచేయబడ్డాయి.

Geography

బురుండి 
Map of Burundi.

ఆఫ్రికాలో అతి చిన్న దేశాలలో బురుండి ఒకటి. ఇది ఈక్వెటోరియల్ వాతావరణం కలిగి ఉంది. బురుండి తూర్పు ఆఫ్రికా రిఫ్టు పశ్చిమ పొడిగింపు అయిన అల్బెర్నిన్ రిఫ్టులో భాగంగా ఉంది. దేశం మద్య ఆఫ్రికాలో రోలింగ్ పీఠభూమి మీద ఉంది. కేంద్ర పీఠభూమి సగటు ఎత్తు 1,707 మీ (5,600 అడుగులు). సరిహద్దుల వద్ద తక్కువ ఎత్తులతో ఉంటుంది. ఎత్తైన శిఖరం మౌంటు హేహ ఎత్తు 2,685 మీ(8,810 అడుగులు).ఇది రాజధాని బుజుంబురా ఆగ్నేయంలో ఉంది. బురురీ ప్రావింసులో నైలు నది మూలం ఉంది. ఇది రివియోరోన్జా నది గుండా విక్టోరియా సరస్సుతో అనుసంధానించబడింది.[విడమరచి రాయాలి] లేక్ విక్టోరియా కూడా ఒక ముఖ్యమైన నీటి వనరుగా ఉంది. ఇది కగేరా నదికి ఫోర్కు. బురుండి నైరుతి మూలలో ఉన్న టాంగ్యానికా మరొక ప్రధాన సరస్సుగా గుర్తించబడుతుంది.


బురుండి భూములు ఎక్కువగా వ్యవసాయం లేదా పచ్చికమైదానాలుగా ఉంటాయి. గ్రామీణ ప్రజల స్థావరాలు అటవీ నిర్మూలన, నేల కోత, వన్యమృగాల నివాస నష్టానికి దారితీసింది. మొత్తం దేశంలో దాదాపుగా 600 కిలోమీటర్లు (230 చదరపు మైళ్ళు) అటవీ నిర్మూలనం జరిగింది. జసంఖ్య అధికరిస్తున్నందున వార్షికంగా సుమారు 9% నష్టాన్ని కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. రెండు జాతీయ ఉద్యానవనాలు, వాయువ్యంలో కిబిర నేషనల్ పార్క్ (రువాండా లోని న్యుంగువే ఫారెస్ట్ నేషనల్ పార్కుకు ప్రక్కనే ఉన్న రెయిన్ఫారెస్ట్ యొక్క ఒక చిన్న ప్రాంతం) ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో రువుబు నేషనల్ పార్క్ (రురుబ నది వెంట, ఇది కూడా రవుబూ లేదా రువువువు అని కూడా పిలువబడుతుంది). ఈ రెండు 1982 లో వన్యప్రాణుల జనాభాను రక్షించడానికి స్థాపించబడ్డాయి.

ఆర్ధికం

బురుండి భూబంధిత దేశం. బలహీనమైన వనరులు ఉన్న దేశం. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన వనరుగా ఉంది. 2017 లో జి.డి.పి.లో 50% వ్యవసాయం భాగస్వామ్యం వహిస్తూ ఉంటుంది. జనాభాలో 90% కంటే ఎక్కువ మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. 90% చిన్నతరహా వ్యవసాయంగా ఉంది. బురుండి ప్రాథమిక ఎగుమతులలో కాఫీ, టీ విక్రయాల ద్వారా 90% విదేశీ మారక ఆదాయం లభిస్తుంది. అయితే ఎగుమతులు జి.డి.పి.లో చాలా తక్కువ భాగం మాత్రమే ఉన్నాయి. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల పత్తి, టీ, మొక్కజొన్న, జొన్న, తియ్యటి బంగాళాదుంపలు, అరటిపండ్లు, మనియోక్ (టాపియోకా); గొడ్డు మాంసం, పాలు, చర్మము ప్రాధాన్యత వహిస్తున్నాయి. జీవనాధారానికి వ్యవసాయం మీద అధికంగా ఆధారపడినప్పటికీ చాలామందికి తాము నిలదొక్కుకోవడానికి తగిన వనరులు లేవు. జనాభా పెరుగుదల, భూ యాజమాన్య విధానాలలో ఉన్న లోపాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. 2014 లో ఒక వ్యక్తికి సగటుగా ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది.

భూబంధిత దేశంఅయిన బురుండి ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటి, బలహీనమైన న్యాయవ్యవస్థ, ఆర్ధిక స్వేచ్ఛ లేకపోవడం విద్యకు అందుబాటులో లేకపోవటం, ఎయిడ్సు వ్యాధి విస్తరణ పేదరికం అధికంగా ఉండడానికి కారణంగా ఉన్నాయి. బురుండి జనాభాలో దాదాపు 80% పేదరికంలో నివసిస్తున్నారు. 20 వ శతాబ్దంలో బురుండిలో కరువు, ఆహారం కొరత ఏర్పడ్డాయి. బురుండి అంతటా కరువు, ఆహార కొరత ఏర్పడింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆధారంగా 5 సంవత్సరాలలోపు వయస్సున్న వారిలో 56.8% దీర్ఘకాలిక పోషకాహారలోపంతో బాధపడుతున్నారని భావిస్తున్నారు. బురుండి ఎగుమతి ఆదాయాలు, దిగుమతుల కోసం చెల్లించే సామర్థ్యం - ప్రధానంగా వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ కాఫీ, తేయాకు ధరలపై లభించే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది.

బురుండి 
బురుండి ఉత్పత్తి ఎగుమతుల గ్రాఫికల్ వర్ణన 28

ద్రవ్యోల్భణానికి తగిన వేతన పెంపులు జరగనందున చాలామంది బురుండియన్లలో కొనుగోలు శక్తి తగ్గింది. పేదరికం తీవ్రంగా ఉండటం వలన బురుండి ద్వైపాక్షిక, బహుపాక్షిక దాతల సహాయం మీద అధికంగా ఆధారపడి ఉంది. బురుండీల జాతీయ ఆదాయంలో 42% విదేశీ సహాయం ఉంది. ఉప సహారా ఆఫ్రికాలో అత్యధిక శాతం సహాయం అందుకుంటున్న దేశాలలో బురుండి ద్వితీయ స్థానంలో ఉంది. 2009 లో బురుండి తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలో చేరింది. అది దాని ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను అధికరింప జేస్తుంది. 2009 లో కూడా $ 700 మిలియన్ రుణ విముక్తి పొందింది. సంస్థలు ఎప్పటికప్పుడు మారిపోతున్న నియమాలతో వాతావరణాన్ని నావిగేట్ చేయటానికి ప్రయత్నించడం, ప్రభుత్వ అవినీతి ఆరోగ్యవంతమైన ప్రైవేటు రంగం అభివృద్ధిని అడ్డుకుంటుంది.

శాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ 2007 అధ్యయనాలు బురుండియన్లు జీవితం చాలా పేద స్థాయిలో ఉన్నట్లు చూపించాయి. 2018 లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2018 బురుడి ప్రపంచంలోనే అత్యల్ప సంతోషంగా ఉన్న దేశంగా ఉందని పేర్కొన్నది.

బురుండి 
సరస్సు తంగన్యికపై మత్స్యకారులు

బురుండిలో యురేనియం, నికెల్, కోబాల్ట్, రాగి, ప్లాటినం వంటి సహజవనరులు ఉన్నాయి. వ్యవసాయంతో పాటు ఇతర పరిశ్రమలలో దిగుమతి చేసుకున్న విభాగాలు, మౌలిక వనరుల నిర్మాణం, ఆహార తయారీ, దుప్పట్లు, బూట్లు , సబ్బు వంటి వినియోగ వస్తువులు.

టెలికమ్యూనికేషన్ల స్థాపన సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక నెట్వర్కు రెడినేసు ఇండెక్సు (ఎన్.ఆర్.ఐ.ఐ.) లో బురుండి 2 వ స్థానంలో నిలిచింది - ఇది దేశం సమాచార, సమాచార సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి స్థాయిని నిర్ణయించడానికి సూచికగా ఉంది. 2014 ఎన్.ఆర్.ఐ వర్గీకరణలో బురుండి సంఖ్య 147 స్థానంలో ఉంది. ఇది 2013 లో 144 కు పడిపోయింది.

ఆర్థిక సేవలకు అందుబాటులో లేకపోవడమే, ముఖ్యంగా జనాభాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో చాలా మందికి తీవ్రమైన సమస్య. మొత్తం జనాభాలో కేవలం 2% మాత్రమే బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. 0.5% కంటే తక్కువగా బ్యాంక్ లెండింగ్ సేవలను ఉపయోగిస్తున్నారు. అయితే మైక్రోఫైనాన్స్ ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. బురండియన్లలో 4% మైక్రో ఫైనాన్షియల్ సంస్థల సభ్యులుగా ఉన్నారు. బ్యాంకింగ్ , తపాలా సేవలలో ఉన్న దానికంటే ఇది అధికం. 26 లైసెన్స్ కలిగిన సూక్ష్మఋణ సంస్థలు (ఎంఎఫ్ఐలు)పొదుపులు, డిపాజిట్, స్వల్ప- మధ్యతరగతి ఋణాలు అందిస్తాయి. దాతల సహాయరంగం మీద ఆధారపడటం పరిమితంగా ఉంది.

బురుండి తూర్పు ఆఫ్రికన్ కమ్యూనిటీలో భాగంగా, ప్రణాళికాబద్ధమైన " ఈస్ట్ ఆఫ్రికన్ ఫెడరేషన్ " లో శక్తివంతమైన సభ్యదేశంగా ఉంది. బురుండిలో ఆర్థిక వృద్ధి సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ బురుండి ఇంకా పొరుగు దేశాల కంటే వెనుకబడి ఉంది.

ద్రవ్యం

బురుండీ ద్రవ్యాన్ని " బురుండియన్ ఫ్రాంకు " (ఐ.ఎస్.ఒ.4217 కోడు బి.ఐ.ఎఫ్.) అంటారు. ఇది 100 సెంటిములుగా విభజించబడుతుంది. నాణ్యాలు తయారు చేయబడడం లేదు. బురుండి బెల్జియన్ కాంగో ఫ్రాంకు ఉపయోగించిన సమయంలో మాత్రమే నాణ్యాలు చెలామణిలో ఉన్నాయి.

ద్రవ్యవిధానాన్ని " సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బురుండి నియంత్రిస్తున్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

బురుండి 
Bicycles are a popular means of transport in Burundi

బురుండి రవాణా నెట్వర్కు పరిమిమైన అభివృద్ధి చెందింది. 2012 డి.హెచ్.ఎల్. గ్లోబల్ కనెక్టడ్నెస్ ఇండెక్స్ ఆధారంగా బురుండి 140 ప్రంపంచ దేశాలలో చివరి స్థానంలో ఉంది.


బురుండిలో రన్వే వసతి కలిగి ఉన్న ఏకైక విమానాశ్రయం బుజ్బురురా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే. 2017 మే నాటికి ఈ విమానాశ్రయం నుండి ఎయిర్లైన్స్ (బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్, ఇథియోపియన్ ఎయిర్లైన్స్, కెన్యా ఎయిర్వేస్, ర్వాండ్ ఎయిర్) సేవలందిస్తుంది. కిగాలీ నగరం బుజుంబురా నుండి కిగాలీ నగరానికి రోజువారీ విమానప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. దేశంలో రహదారి నెట్వర్కు ఉంది. 2005 నాటికి దేశంలో 10% కంటే తక్కువగా పేవ్ చేసిన రోడ్లు ఉన్నాయి. 2013 నాటికి కిగాలీకి అంతర్జాతీయ మార్గంలో ప్రైవేట్ బస్సు కంపెనీల బస్సులు నిర్వహించబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇతర పొరుగు దేశాలకు (టాంజానియా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్) బస్సు సౌకర్యాలు లేవు. బుజాంబూరా టాంజానియాలోని కిగోమా వరకు ప్రయాణీకుల, కార్గో ఫెర్రీ (ఎం.వి. మ్వాన్జోగో) సౌకర్యాలు ఉన్నాయి. కిగాలీకి రైలుమార్గం నిర్మించడం ద్వారా దేశాన్ని కంబాల, కెన్యాలతో అనుసంధానించడానికి ఒక దీర్ఘ-కాల ప్రణాళిక ఉంది.

గణాంకాలు

బురుండి 
A group of Burundian women rearing goats.
బురుండి 
Children in Bujumbura, Burundi

ఐక్యరాజ్యసమితి అంచనా అనుసరించి 2016 జూలై నాటికి బురుండి జనసంఖ్య 1,05,24,117 గా అమచనా వేయబడింది. 10,524,117 people,1950 లో బురుండి జనసంఖ్య 24,56,000 మాత్రమే. జనాభా వృద్ధి రేటు సంవత్సరానికి 2.5% సగటు ప్రపంచ శాతం కంటే ఇది రెట్టింపు. బురుండియన్ స్త్రీ సగటు పిల్లల శాతం 6.3 %. దాదాపుగా అంతర్జాతీయ సంతానోత్పత్తి శాతానికి మూడురెట్లు అధికరించింది. 2012 లో ప్రపంచంలో అతి పెద్ద సంతానోత్పత్తి రేటు కలిగి ఉన్న దేశాలలో దురుండి 5 వ స్థానంలో ఉంది.

అనేకమంది బురుండియన్లు పౌర యుద్ధం ఫలితంగా ఇతర దేశాలకు వలస వెళ్ళారు. 2006 లో యునైటెడ్ స్టేట్స్ సుమారు 10,000 బురుండియన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది.

2013 లో పట్టణ ప్రాంతాల్లో 13% నివసిస్తున్నారు. బురుండి ప్రజలు అధికంగా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంది. చదరపు కిలోమీటరుకు 315 ప్రజల సాంద్రత (చదరపు మైలుకు 753) ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో బురుండి జనసాంధ్రతలో రెండవ స్థానంలో ఉంది. జనాభాలో దాదాపు 85% మంది హుటు జాతి, 15% టుట్సీ, 1% కంటే తక్కువ స్థానిక జాతి తెవా.బురుండి అధికారిక భాషలు కిరుండి, ఫ్రెంచి, ఇంగ్లీషు (2014 నుండి) టాంజానియా సరిహద్దులో " స్వాహిలి " భాషమాట్లాడే ప్రజలు ఉన్నారు. అధికారభాషగా గుర్తించబడుతున్న స్వాహిలీ భాష ప్రజలకు వాడుక భాషగా ఉండి బోధనాభాషగా కూడా ఉపయోగించబడుతుంది.

మతం

Religion in Burundi
religion percent
Catholic
  
65%
Protestant
  
26%
Folk
  
5%
Muslim
  
3%
Other
  
1%
None
  
1%

బురుండిలో క్రైస్తవులు 80-90% ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీరిలో రోమన్ క్యాథలిక్కులు 60-65% (అతిపెద్ద సమూహాం) ఉన్నారు. ప్రొటెస్టంటు, ఆంగ్లికన్లు 15-25% ఉన్నారు. జనాభాలో 5% మంది సాంప్రదాయ దేశీయ మత విశ్వాసాలకు కట్టుబడి ఉంటారు. ముస్లింలు 2-5% ఉన్నారు. వీరిలో అత్యధిక మంది సున్నీలు ఉన్నారు. విInftec రు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

ఆరోగ్యం

బురుండి ప్రజలు తీవ్రమైన ఆకలి, పోషకాహార సమస్యలతో బాధపడుతున్నారు. డబల్యూ. హెచ్.ఒ. ఆధారంగా ప్రజల సగటు ఆయుఃప్రమాణం 58 - 62 సంవత్సరాలు.

సంస్కృతి

బురుండి 
Drums from Gitega.

బురుండి సంస్కృతి స్థానిక సాంప్రదాయం, పొరుగు దేశాల ప్రభావం మీద ఆధారపడింది. అయినప్పటికీ సాంస్కృతిక ప్రాముఖ్యత పౌర అశాంతి కారణంగా అడ్డుకోబడింది. వ్యవసాయం ప్రధాన పరిశ్రమ అయినందున ఒక సాధారణ బురుండియన్ భోజనం తియ్యటి బంగాళాదుంపలు, మొక్కజొన్న, బటానీలను కలిగి ఉంటుంది. వ్యయం కారణంగా మాంసం నెలకు కేవలం కొన్ని సార్లు మాత్రమే తింటారు.

సన్నిహిత పరిచయాలుండే బురుండియన్లు ఒక సమావేశానికి హాజరై ఒకటిగా " ఇంపెక్ " అనే ఒక బీరు (ఒక పెద్ద కంటైనర్ నుండి ఐక్యతను) సేవించడం వారి ఐఖ్యతను సూచిస్తుంది.

బురుండియనులో ఫుట్ బాల్ క్రీడాకారుడు మొహమ్మద్ త్చిటే, గాయకుడు జీన్-యర్రే నింబోనా కితుము (నైరోబీ, కెన్యాలో చెందినవారు) గా గుర్తించబడుతున్నారు.

బురుండిలో హస్థకళలు ఒక ముఖ్యమైన కళ రూపంగా ప్రాబల్యత సంతరించుకుని చాలామంది పర్యాటకులకు ఆకర్షణీయమైన బహుమతులుగా ఉన్నాయి. స్థానిక కళాకారులు బుట్టలు అల్లడంలో ప్రావీణ్యత కలిగి ఉన్నారు. బురుండిలో ముసుగులు, కవచాలు, విగ్రహాలు, మట్టి పాత్రలు వంటి ఇతర హస్థకళాఖండాలు బురుండిలో తయారు చేయబడుతున్నాయి.

సాంస్కృతిక వారసత్వంలో డ్రమ్మింగ్ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. బురుండి 40 సంవత్సరాల కరాండెం, అమాషకో, ఇబిషికోసో, ఇక్రిన్య డ్రమ్సు ఉపయోగించి సంప్రదాయ డ్రమ్మింగు ప్రదర్శిస్తూ ఉంది. బురుండిలో ప్రపంచ ప్రఖ్యాత రాయల్ డ్రమ్మర్లు ఉన్నారు. డాన్సు తరచుగా డ్రమ్మింగుతో ప్రదర్శించబడుతుంది. తరచుగా ఇది వేడుకలలో, కుటుంబ సమావేశాలు, అధికారిక ఉత్సవాలు, ఆచారాలు ప్రదర్శించబడుతుంది. వేగమైన అబ్యానంగసిమ్బో వంటి నృత్యం బురుండియనులో ప్రసిద్ధి చెందింది. బురుండియన్లు వేణువు, జితార్, ఇగ్బే, ఎంటొనొంగో, ఉముడురి, ఇన్గా, ఇనగర సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తుంటారు.

బురుండి 
ఎరుపు, నల్ల చారల జెర్సీ, పసుపు జెర్సీలో నలుగురు ఆటగాళ్ళు ఉన్నారు

దేశం మౌఖిక సాంప్రదాయం బలంగా ఉంది. ఇందులో చరిత్ర, జీవితపాఠాలు కథలుగా చెప్పడం, కవిత్వం, పాటలు భాగంగా ఉంటాయి. బురుండిలో ఇముగని, ఇందిరింబో, అమాజినా, ఇవీవుగో వంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి.

బాస్కెట్బాలు, ట్రాకు, ఫీల్డు వంటి ప్రముఖ క్రీడలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్సు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 5 ప్రధాన జూడో క్లబ్బులు ఉన్నాయి: క్లబ్ జూడో డి ఎల్ 'ఎంటెంట్ స్పోర్టివ్, డౌన్టౌన్లో, నగరమంతా 4 ఇతర క్లబ్బులు ఉన్నాయి. అసోసియేషన్ ఫుట్బాలు, అలాగే మన్కాల ఆటలు దేశవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ కాలక్షేపంగా ఉంది.

క్రిస్టియన్ సెలవులలో క్రిస్మస్ అత్యుస్త్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూలై 1 న బురుండియన్ స్వాతంత్ర్య దినం జరుపుకుంటారు. 2005 లో బురుండియన్ ప్రభుత్వం ఈద్ అల్ ఫిత్ర్ అనే ఒక ఇస్లామిక్ సెలవుదినం ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించబడింది.

విద్య

బురుండి 
Carolus Magnus School in Burundi. The school benefits from the campaign "Your Day for Africa" by Aktion Tagwerk.

2009 లో బురుండిలో వయోజన అక్షరాశ్యత 67% (73% పురుషులు, 61% మంది స్త్రీలు) గా అంచనా వేశారు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులలో అక్షరాశ్యత 77% - 76% ఉంది. 2015 నాటికి ఇది 85.6% కు అధికరించింది. (88.2% మగ, 83.1% స్త్రీ). 2002 నుండి వయోజన మహిళలలో అక్షరాస్యత 17% పెరిగింది. పాఠశాల పాఠశాల హాజరు తక్కువ కారణంగా బురుండి అక్షరాస్యత రేటు తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కిరుండిలో భాషలో ముద్రించిన పాఠ్యపుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ అనేక ఇతర ఆఫ్రికన్ దేశాల కంటే బురుండిలో అక్షరాశ్యత అధికంగా ఉంది. బురుండియన్ బాలురలో 10% మాత్రమే ద్వితీయ స్త్యీయి విద్యను అభ్యసించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

బురుండిలో కేవలం ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం " బురుండి విశ్వవిద్యాలయం " ఉంది. బుజుంబురాలోని బురుండి జియోలాజికల్ మ్యూజియం, బురుండి నేషనల్ మ్యూజియం, గిటిగాలోని బురుండి మ్యూజియమ్ ఆఫ్ లైఫ్ వంటి మ్యూజియంలు ఉన్నాయి.

బురుండి ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఆంగ్ల ఛారిటీ నిధులతో వెనుకబడిన ప్రాంతాలు ఒకదానిలో ఒక కొత్త పాఠశాల ప్రారంభం చేయాలని ప్రణాళిక వేసింది. బురుండి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 2014 వేసవిలో పాఠశాలను తెరవాలని ప్రణాళిక వేసింది.

2010 లో కెనడాలోని క్యుబెక్లో వెస్ట్వుడ్ హైస్కూల్ విద్యార్థుల నిధులతో రౌగా అనే కుగ్రామంలో ఒక కొత్త ప్రాథమిక పాఠశాల ప్రారంభించబడింది.

వెలుపలి లింకులు

మూలాలు

Tags:

బురుండి చరిత్రబురుండి Geographyబురుండి ఆర్ధికంబురుండి ప్రయాణ సౌకర్యాలుబురుండి గణాంకాలుబురుండి సంస్కృతిబురుండి వెలుపలి లింకులుబురుండి మూలాలుబురుండిటాంజానియారువాండా

🔥 Trending searches on Wiki తెలుగు:

అరుంధతిసన్ రైజర్స్ హైదరాబాద్రామావతారంపుష్పతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాప్రకటనవిద్యార్థిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుసూర్య నమస్కారాలుసమాసంఅల్లుడి కోసంసుందర కాండభరణి నక్షత్రముఆయుర్వేదంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఇంద్రజజైన మతంఅటల్ బిహారీ వాజపేయిమారేడుస్వాతి నక్షత్రముమిథునరాశిఎనుముల రేవంత్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)గుణింతంవడదెబ్బనవరత్నాలుపర్యాయపదంఉపమాలంకారంజీలకర్రఇద్దరు మొనగాళ్లుటెలివిజన్వెంకటేశ్ అయ్యర్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామప్ప దేవాలయంతిరుపతిటిల్లు స్క్వేర్విశ్వామిత్రుడుసర్పివిరాట పర్వమువేమన శతకముమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డినరేంద్ర మోదీచిత్త నక్షత్రమురాజమండ్రిఅనసూయ భరధ్వాజ్ఘట్టమనేని కృష్ణగౌతమ బుద్ధుడుకుసుమ ధర్మన్నగురజాడ అప్పారావుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఉమ్మెత్తసావిత్రి (నటి)ప్రేమలుప్రియురాలు పిలిచిందికల్వకుంట్ల చంద్రశేఖరరావుఅక్షయ తృతీయకొణతాల రామకృష్ణప్రేమ (నటి)వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపాడేరు శాసనసభ నియోజకవర్గంశ్రీశైల క్షేత్రంబ్రహ్మంగారి కాలజ్ఞానంసౌర కుటుంబంమేషరాశిగర్భాశయముకుండలేశ్వరస్వామి దేవాలయంహరిశ్చంద్రుడుకలువసీ.ఎం.రమేష్వ్యాసుడుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీరామనవమిపాముసామెతలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు🡆 More