దక్షిణ సూడాన్: ఈశాన్య ఆఫ్రికాలోని దేశం

దక్షిణ సూడాన్ (/ˌsaʊθ suːˈdæn/ ( listen) or /suːˈdɑːn/), అధికారిక నామం, దక్షిణ సూడాన్ రిపబ్లిక్ , భూపరివేష్టిత దేశం.

ఇది తూర్పు మద్య ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి ఉత్తర ఆఫ్రికా ఉపప్రాంతంలో ఉంది. దీని ప్రస్తుత రాజధాని, పెద్ద నగరం జూబా. భవిష్యత్తులో దేశం మధ్యలో గల రామ్సియల్ అనే ప్రదేశం రాజధాని అవుతుంది. దీని ఉత్తరసరిహద్దులో సూడాన్, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, దక్షిణ సరిహద్దులో ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు, పశ్చిమసరిహద్దులో మధ్య జబలు అంటారు. అంటే ఆఫ్రికా రిపబ్లిక్కులు ఉన్నాయి. దీనిలో సుడ్డు అనబడే చిత్తడినేల ప్రాంతం ఉంది. ఇది వైట్ నైలేచే ఏర్పడింది. దీనిని స్థానికంగా బారు అల్ (పర్వత సముద్రం) అంటారు.

దక్షిణ సూడాన్ రిపబ్లిక్
Flag of దక్షిణ సూడాన్ దక్షిణ సూడాన్ యొక్క Coat of arms
నినాదం
"న్యాయం, స్వేచ్ఛ,అభ్యుదయం"
జాతీయగీతం
"South Sudan Oyee!"
దక్షిణ సూడాన్ యొక్క స్థానం
దక్షిణ సూడాన్ యొక్క స్థానం
Location of  దక్షిణ సూడాన్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

ప్రజానామము South Sudanese
ప్రభుత్వం Federal presidential democratic republic
 -  President Salva Kiir Mayardit
 -  Vice President Riek Machar
Independence from Sudan 
 -  Comprehensive Peace Agreement 6 January 2005 
 -  Autonomy 9 July 2005 
 -  Independence 9 July 2011 
జనాభా
 -  2008 జన గణన 8,260,490 (disputed) <--then:-->(94th)
జీడీపీ (nominal) 2011 అంచనా
 -  మొత్తం $13.227 billion  
 -  తలసరి $1,546  
కరెన్సీ South Sudanese pound (SSP)
కాలాంశం East Africa Time (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ss (registered but not yet operational)
కాలింగ్ కోడ్ ++211

సూడాన్, దక్షిణ సూడాన్ దేశాలను ఈజిప్టుని పరిపాలించిన మహమ్మద్ ఆలీ వంశం ఆక్రమించి " ఆంగ్లో ఈజిప్షియను కండోమినియంగా పాలించబడింది. బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తరువాత 1956 లో స్వతంత్రం పొందాయి. మొదటి సూడాన్ అంతర్యుద్ధం తరువాత 1972 లో దక్షిణ సూడాన్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏర్పడి 1983 వరకు కొనసాగింది. రెండవ సూడాన్ అంతర్యుద్ధం 2005 శాంతి ఒప్పందంతో ముగిసింది. అదే సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటయింది.

2011 జనవరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.83% ఓట్లు సాధించిన తరువాత 2011 జూలై 9న దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తరువాత ఇది ఐక్యరాజ్యసమితిలో, ఆఫ్రికా సమాఖ్యలో సభ్యదేశం అయింది.

దక్షిణ సూడానులో 12 మిలియన్ల ప్రజలు ఉన్నారు. వీరిలో నిలోటికు ప్రజలు అధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 17 సెప్టెంబరులో ఐఖ్యరాజ్య ప్రతినిధి (చిల్డ్రెన్ అండ్ ఆర్ముడు కాంఫ్లిక్టు) మాట్లాడుతూ దక్షిణ సూడాన్ నివాసితులలో సగం మంది 18 సంవత్సరాల లోపు వారు ఉన్నారని చెప్పాడు. ఇది ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా సమాఖ్య తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ ఇంటర్గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటులలో సభ్యదేశంగా ఉంది. 2012 జూలైలో దక్షిణ సుడాన్ జెనీవా ఒప్పందాల మీద సంతకం చేసింది. దక్షిణ సుడాన్ జాతి హింసను ఎదుర్కొంది. 2013 నుండి పౌర యుద్ధం సంభవించింది. 2018 నాటికి తాజా ఐక్యరాజ్య సమితి రిపోర్టు నివేదికలో దక్షిణ సుడాన్ దిగువస్థాయి నుండి మూడవ స్థానంలో ఉంది. అమెరికా ఫండు ఫర్ పీసు " ఫ్రాజిలు స్టేట్సు ఇండెక్సు (గతంలో ఫెయిల్డ్ స్టేట్స్ ఇండెక్స్).

చరిత్ర

దక్షిణ సుడాను లోని నిలొటికు ప్రజలలో -అకోలి, అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు, కాలిగి (అరబికు ఫెరోఘే), ఇతరులు- మధ్యయుగ నబ్బియా పతనం సంభవించిన 10 వ శతాబ్దానికి ముందు దక్షిణ సుడాన్లోకి ప్రవేశించారు. 15 వ నుండి 19 వ శతాబ్దాల వరకు బహరు ఎల్ ఘజలు ప్రాంతం, ఉన్నత నైలు ప్రాంతాలకు అన్యుయాకు, బారి, దిన్కా, నుయరు, షిల్లాకు ప్రజలు వలసగా వచ్చి చేరుకున్నారు. అచోలి, బారి ప్రజలు ఈక్వెటోరియాలో స్థిరపడ్డారు. 16 వ శతాబ్దంలో దక్షిణ సుడాన్లోకి ప్రవేశించిన అజాండే, ముండూ, అవకాయ, బకా దక్షిణ సూడానుకు చేరుకుని ఈ ప్రాంతం అతిపెద్ద దేశం అయిన గ్రేటు ఈక్వెటోరియా ప్రాంతంను స్థాపించారు.

సంఖ్యాపరంగా డింకా అతిపెద్ద జాతి, న్యూయరు రెండవ అతిపెద్దది, అజాండే మూడవ అతిపెద్దది, బారి దేశంలో నాల్గవ అతిపెద్ద జాతి సమూహంగా ఉంటాయి. ఈ ప్రజలు పశ్చిమ ఇకాటోరియా ఉష్ణమండల వర్షారణ్యపు బెల్టులోని మరీడి, యాంబియో, టోంబురు జిల్లాల్లో కనిపిస్తారు. అయోండో క్లయింటు ఎయి, మద్య ఈక్వెటోరియా, పశ్చిమ బహరు ఎల్ గజలు ప్రాంతాలలో ఉంటారు. 18 వ శతాబ్దంలో అవంగరా సిబు అధికారంలోకి వచ్చి మిగిలిన అజాండె సమాజం మీద సాధించిన ఆధిపత్యం 20 వ శతాబ్దం వరకు కొనసాగింది. వైటు నైలు, క్రైస్తవ మిషనరీలను 1922 నాటి క్లోజ్డు డిస్ట్రిక్టు ఆర్డినెంసు (చూడండి హిస్టరీ ఆఫ్ ఆంగ్లో-ఈజిప్టు సుడాన్) దక్షిణాది ప్రాంతాలకు పంపించే బ్రిటీషు ప్రాధాన్యతతో భౌగోళిక సరిహద్దులు ఏర్పడ్డాయి. దీని వలన వారి సాంఘిక, సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే వారి రాజకీయ, మత సంస్థలను నిలుపుకోవటానికి వీలు కల్పించింది. బ్రిటిషు ఉత్తర అరబు ప్రాంతాల వరకు అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పించి దక్షిణ ప్రాంతాలలో ఉన్న నల్లజాతీయులను విస్మరించింది. 1958 లో సూడాను మొట్టమొదటి స్వతంత్ర ఎన్నికల తర్వాత ఖార్టూం (పాఠశాలలు, రోడ్లు, వంతెనలు లేకపోవటం) దక్షిణప్రాంతాలను నిరంతరాయంగా విస్మరించడం తిరుగుబాటులు జరగడానికి, ఖండంలోని అతి పెద్ద పౌర యుద్ధం జరగడానికి దారి తీసింది. 2012 నాటికి ఈ ప్రాంతంలో ప్రజలు ఆచోలి, అనియుకు, అజాండే, బకా, బాలండా బ్వివిరి, బారి, బోయా, దితిదా, డిన్కా, జియీ, కాలిగి, కుకు, లోతుకా, ముందరి, మురీ, నిలోటికు, నుయరు, షిల్లోకు, టోపోసా, జండే ఉన్నారు.

బానిసత్వం చరిత్రవ్యాప్తంగా సుడానీసు జీవితంలో ఒక సంస్థగా ఉంది. 19 వ శతాబ్దంలో దక్షిణాన బానిస వాణిజ్యం తీవ్రమైంది. ఉప-సహారా ఆఫ్రికాలో బ్రిటిషు అధికంగా బానిసత్వాన్ని అణిచివేసిన తరువాత కూడా ఇది కొనసాగింది. ముస్లిమేతర ప్రాంతాలలో జరిగిన వార్షిక బానిస దాడులు ఫలితంగా దక్షిణ సుడానులో అనేక వేలమందిని బానిసలుగా పట్టుకోవడం ఈ ప్రాంతం స్థిరత్వం, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడం జరిగింది.

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
John Garang de Mabior led the Sudan People's Liberation Army until his death in 2005.

18 వ శతాబ్దంలో వారి రాజు గుబుడె విస్తరణ విధానం కారణంగా అజాండె పొరుగువారైన మోరు, ముండూ, పోజూలు, అవకయ, బకా, బహర్ ఎల్ ఘజల్లోని చిన్న సమూహాలతో సత్స్సంబంధాలు కలిగి ఉన్నాడు. 19 వ శతాబ్దంలో అజాండే వారి స్వతంత్రతను కాపాడటానికి ఫ్రెంచి, బెల్జియన్లు, మహ్దీస్టులతో పోరాడాడు. ఖైదీవు ఇస్మాయిలు పాషా పాలనలో ఈజిప్టు 1870 లలో ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసింది. ఇది దక్షిణ భాగంలో ఈక్వెటోరియా ప్రావిన్సును స్థాపించింది. 1869 లో ఈజిప్టు మొట్టమొదటి గవర్నరుగా శామ్యూలు బేకరు నియమితుడయ్యాడు. తరువాత 1874 లో చార్లెసు జార్జి గోర్డాను నియమించబడ్డాడు. 1878 లో ఎమిన్ పాషా నియమించబడ్డాడు.

1880 లలో జరిగిన మహదిస్టు తిరుగుబాటు నవజాత ప్రావిన్సును అస్థిరపరిచింది. 1889 లో ఈక్వెటోరియా ఈజిప్టియా స్థావరంగా మారడానికి దారితీసింది. ఈక్వేటోరియాలో ముఖ్యమైన స్థావరాలు లాడో, గోండోలోరో, దుయ్యెలు, వడైలై ఉన్నాయి. 1898 లో ప్రస్తుత కొడోకులో ఫషోడ సంఘటన సంభవించడంతో ఈ ప్రాంతంలోని ఐరోపా కాలనీల వ్యూహం మొదలైంది; బ్రిటిషు, ఫ్రాన్సు ఈ ప్రాంతం కొరకు దాదాపుగా యుద్ధం చేశాయి. 1947 లో ఉగాండాతో దక్షిణ సుడాను చేర్చేందుకు బ్రిటిషు ప్రయత్నించింది. కాంగో ప్రజాస్వామ్య రిపబ్లికులో భాగంగా ఉన్న పశ్చిమ ఈక్వెటోరియాను విడిచిపెట్టాలని బ్రిటిషు నిర్ణయించింది.[ఆధారం చూపాలి]


దక్షిణ సూడానులో 8 మిలియన్ల ప్రజలు ఉన్నట్లు అంచనా వేయబడింది. అయినప్పటికీ అనేక దశాబ్దాల్లో జనాభా గణన లేకపోవడం వలన ఈ అంచనా తీవ్రంగా వక్రీకరించబడింది. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామీణప్రజలకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయం మీద ఆధారపడుతుంది. 2005 నాటికి ఆర్థిక వ్యవస్థ ఈ గ్రామీణ ఆధిపత్యం నుండి పరివర్తనం చెందడం ప్రారంభించింది. దక్షిణ సుడానులోని పట్టణ ప్రాంతాలు విస్తృతమైన అభివృద్ధిని చూశాయి.

సుడానీసు స్వాతంత్ర్యం తర్వాత ఈ ప్రాంతం రెండు పౌర యుద్ధాల నుండి ప్రతికూలంగా ప్రభావితమైంది: 1955 నుండి 1972 వరకు, సుడాను ప్రభుత్వం అన్యన్యా తిరుగుబాటులో సైన్యంతో పోరాడింది (అన్య-నయా అనేది మాడి భాషలో పదం "పాము విషం" అని అర్థం) సుడాను పీపుల్సు లిబరేషను ఆర్మీ మూవ్మెంటు తరువాత రెండవ సుడానీసు అంతర్యుద్ధం 20 సంవత్సరాలు కొనసాగింది. ఫలితంగా దేశం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోవడం, ప్రధాన విధ్వంసం, స్థానభ్రంశం సంభవించాయి. 2.5 మిలియన్ల మందికి పైగా ప్రజలు చంపబడ్డారు. మిలియన్లమంది దేశం వెలుపల శరణార్థులుగా మారారు.

స్వతంత్రం (2011)

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
A South Sudanese girl at independence festivities

దక్షిణ సూడాను 2011 జనవరి 9- 15 మధ్య సూడాను నుండి వేరుపడి ఒక స్వతంత్ర దేశంగా ఉండడం నిర్ణయించటానికి ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో 98.83% జనాభా స్వతంత్రంగా ఉండడానికి అనుకూలంగా ఓటు వేసింది. జూలై 9 న సుడాను నుండి వేరుపడి దక్షిణ సుడాను స్వతంత్రంగా మారింది. అయితే కొన్ని వివాదాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ చమురు ఆదాయాన్ని విభజించడంతో మొత్తం సూడాను చమురు నిల్వలలో 75% దక్షిణ సూడానులో ఉన్నాయి. అబేయి ప్రాంతం ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది. సుడాను లేదా దక్షిణ సూడానులో చేరాలా వద్దా అనే దానిపై అబేయిలో ఒక ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణ జరుగాలని నిర్ణయించబడింది. 2011 జూనులో సుడాను సైన్యం , ఎస్.పి.ఎల్.ఎ. మద్య న్యుబా పర్వతాల ఆధిపత్యం కొరకు దక్షిణ కోర్ట్ఫాను వివాదం నెలకొంది.

2011 జూలై 9 న దక్షిణ సుడాను ఆఫ్రికాలో 54 వ స్వతంత్ర దేశం అయింది. 14 జూలై 2011 జూలై 14 నుండి దక్షిణ సుడాన్ ఐక్యరాజ్యసమితిలో 193 వ సభ్యదేశం అయింది. 2011 జూలై 27 న దక్షిణ సూడాను ఆఫ్రికా సమాఖ్యలో 54 వ దేశంగా మారింది.

దక్షిణ సూడాను 10 రాష్ట్రాలలోని 9 లో కనీసం ఏడు సాయుధ గ్రూపులతో యుద్ధం చేసింది. యుద్ధం కారణంగా వేలాది మంది స్థానచనం సంభవించింది.

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ గిరిజన బృందాలు అందరికీ ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇవ్వకుండా, మద్దతునివ్వకుండా, అధికారంలో ఉండడానికి ప్రణాళికలు వేస్తున్న ప్రభుత్వాన్ని పోరాటకారులు నిందించారు. జోసెఫు కోనియసు లార్డు " రెసిస్టెన్సు ఆర్మీ (ఎల్.ఆర్.ఎ)" కూడా దక్షిణ సుడానులోని ప్రాంతంలో పనిచేస్తుంది.


కొన్ని సందర్భాలలో స్వాతంత్ర్య యుద్ధం జాతుల మద్య విస్తృతంగా జరుగుతుందని భావించారు. 2011 డిసెంబరు 11 లో జోంగ్లీలో లౌ న్యురు ముర్లే, న్యూయరు వైటు ఆర్మీ మధ్య గిరిజన ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. ముర్లేను తుడిచివేయబడుతుందని వైట్ ఆర్మీ హెచ్చరించింది. దక్షిణ సుడాను, ఐఖ్యరాజ్యసమితి దళాలు పిబోరు చుట్టుపక్కల ప్రాంతానికి పంపించాలని భావించింది.

దక్షిణ సుడాను రాష్ట్రంలోని యూనివర్సిటీలోని సుడానస్ దళాల వివాదం తరువాత సౌదీ కోడోర్ఫన్ ప్రావిన్సులో సుడాను, దక్షిణ సుడాను రెండు దేశాలలోని హేగ్లిగు చమురు క్షేత్రాలను 2012 మార్చిలో దక్షిణ సుడాను దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దక్షిణ సుడాను మార్చి 20 న ఉపసంహరించుకుంది రెండు రోజుల తరువాత సుడానీస్ సైన్యం హెగ్లిగ్లోకి ప్రవేశించింది.

అంతర్యుద్ధం (2013–present)

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Military situation in South Sudan as of 1 April 2016
  Under control of the Government of South Sudan
  Under control of the Sudan People's Liberation Movement-in-Opposition
  Under control of the Government of Sudan

2013 డిసెంబరులో రాష్ట్రపతి కైరు, ఆయన మాజీ డిప్యూటీ రికు మాచార్ల మధ్య ఒక రాజకీయ అధికార పోరాటం మొదలైంది. అధ్యక్షుడు మచారు ఒక పదిమంది ఇతరులతో తిరుగుబాటు ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దక్షిణ సుడాను అంతర్యుద్ధానికి ప్రేరణగామారి పోరాటం ప్రారంభమైంది. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా దక్షిణ సుడాను ప్రభుత్వ దళాలతో పోరాడడానికి ఉగాండా దళాలు నియమించబడ్డాయి. దక్షిణ సుడాను ఐక్యరాజ్యసమితి మిషనులో భాగంగా ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతా సిబ్బంది ఉన్నారు. సుడాను పీపుల్సు లిబరేషను మూవ్మెంటు (ఎస్.పి.ఎల్.ఎం), ఎస్.పి.ఎల్.ఎం- ఐ.ఒ.ల మద్య శాంతి నెలకొల్పడానికి ఇంటర్గవర్నమెంటలు అథారిటీ ఆన్ డెవెలెప్మెంటు (ఐ.జి.ఎ.డి) అనేక కాల్పుల విరమణల జరగడానికి మధ్యవర్తిత్వం ప్రయత్నాలు విచ్ఛిన్నమయ్యాయి. ఆగష్టు 2015 ఆగస్టులో ఐక్యరాజ్యసమితి ఆంక్షలతో ఇరుపక్షాలు ఇథియోపియాలో ఒక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసాయి.2016 లో మచారు జుబాకు తిరిగి ఉపాధ్యక్షుడు అయ్యాడు. జుబాలో రెండవసారి హింసాకాండ జరిగిన తరువాత మాచారు ఉపాధ్యక్ష పదవిని విడిచి పారిపోయాడు. పోరాటంలో రెబెలు ఇన్-ఫైటింగు ప్రధాన భాగమైంది. అధ్యక్షుడు మాలాంగు ఎవాను నేతృత్వంలోని దిన్కా వర్గాల మధ్య పోటీ కూడా పోరాటానికి దారితీసింది. 2018 ఆగస్టులో మరొక అధికార భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.


యుద్ధంలో సుమారు 4,00,000 మంది పౌరులు చంపబడ్డారు. వీటిలో 2014 బెంటియూ మారణకాండలో గుర్తించదగిన దురాగతాలతో ఉన్నాయి. ఇరుపక్షాలకు సంప్రదాయ జాతుల నుండి మద్దతు లభించింది. ఫలితంగా యుద్ధం జాతి యుద్ధంగా మారింది. తిరుగుబాటుదారులు కీరు డింకా సంప్రదాయ ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించారు. ప్రభుత్వ సైనికులు నూయర్ల మీద దాడ్సాగించారు. మొత్తం 4 మిలియన్ల కంటే అధికంగా స్థానభ్రంశం చెందారు. వీరిలో 1.8 మిలియన్ల మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందగా, సుమారు 2.5 మిలియన్ల మంది పొరుగున ఉన్న ఉగాండా, సుడానులకు పారిపోయారు.

భౌగోళికం

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
This CIA map uses the provincial borders that existed at the time Sudan gained independence in 1956. In 1960, small sections were transferred to northerly provinces. The Comprehensive Peace Agreement of 2005 ending the second Sudanese civil war provided that the border between southern and northern Sudan would be restored to its 1956 state.
దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
A satellite image of South Sudan

దక్షిణ సుడాను 3 ° నుండి 13 ° ఉత్తర అక్షాంశం, 24 ° - 36 ° తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది ఉష్ణమండల అటవీ, చిత్తడి, గడ్డిభూములలో కప్పబడి ఉంటుంది. వైట్ నైలు దేశం గుండా ప్రవహిస్తుంది.

జీవవైవిధ్యం

దక్షిణ సూడాను రక్షిత ప్రాంతం బాండినిలో నేషనల్ పార్కు ప్రపంచంలో రెండవ అతిపెద్ద వన్యప్రాణి వలసను కలిగి ఉంది. కాంగో సరిహద్దు దగ్గర ఉన్న బోమ నేషనల్ పార్కు ఇథియోపియా సరిహద్దుకు పశ్చిమంలో అలాగే సుడు చిత్తడి, దక్షిణ జాతీయ ఉద్యానవనం ఉన్నాయి. ఇకిఅడ పెద్ద సంఖ్యలో హార్టెబీస్టు, కోబు, టాపి, గేదె, ఏనుగులు, జిరాఫీలు, సింహాలు ఉన్నాయి.

దక్షిణ సుడాను అటవీ రిజర్వులో బోంగో, భారీ అటవీ పందులు, ఎర్ర నది పందులు, అడవి ఏనుగులు, చింపాంజీలు, అటవీ కోతులకు నివాసంగా ఉంది. 2005 లో దక్షిణ సుడాను సెమీ స్వాధికార ప్రభుత్వం, విల్డు లైఫ్ కంసర్వేషను సొసైటీ భాగస్వాంతో సర్వే ప్రారంభమైంది. క్షీణించిపోతున్న దశలో ఉన్న వన్యప్రాణుల జనాభా ఇప్పటికీ ఉనికిలో ఉందని ఈ సర్వేలు వెల్లడించాయి. ఆశ్చర్యకరంగా ఆగ్నేయ ప్రాంతంలో 1.3 మిలియన్ల జింకల భారీగా వలసలు గణనీయంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి.

దేశంలోని జంతునివాసాలలో గడ్డి మైదానాలు, ఎత్తైన ఎత్తుగల పీఠభూములు, ఎస్కార్పుమెంటులు, వృక్షాలు, గడ్డి సవన్నాలు, వరద మైదానాలు, చిత్తడి నేలలు ఉన్నాయి. ఉనికిలో ఉన్న వన్యప్రాణుల జాతులలో స్థానిక తెల్లటి చెవి కబు, నైలు లెచ్వీ, అలాగే ఏనుగులు, జిరాఫీలు, కామన్ ఎలాండు, జెయింటు ఎలాండు, ఒరిక్సు, సింహాలు, ఆఫ్రికా అడవి కుక్కలు, కేప్ గేదె, టోపీ (స్థానికంగా పిలువబడే టాంగ్) ఉన్నాయి. తెల్ల చెవి కబు, తీయాంగు గురించి ప్రపంచానికి కొంచమే తెలుసు. పౌరయుద్ధానికి ముందు ఈ రెండు యాంటిలోపుల భారీవలసలు చరిత్రను సృష్టించాయి. బోమా-జోంగ్లీ ప్రాంతం బోమా నేషనలు పార్కు విస్తృతమైన పచ్చిక బయళ్ళు, వరద మైదానాలు ఉన్నాయి. బంన్డిగిలో నేషనలు పార్కు, విస్తారమైన చిత్తడినేలలు ఉన్న సుద్, సీజన్లలో వరదలు సంభవించే పచ్చిక మైదానాలలో జిరాఫీ వైల్డులైఫ్ రిజర్వు భాగంగా ఉంది.

దక్షిణ సుడానులో శిలీంధ్రాల గురించి తెలిసింది చాలా తక్కువ. సుడాను శిలీంధ్రాల జాబితాను ఎస్.ఎ.జి.టారు తయారుచేస్తుంది. 1955 లో కామన్వెల్తు మైకోలాజికలు ఇన్స్టిట్యూటు (క్యూ, సుర్రే, యుకె) ప్రచురించింది. 175 రకాలలో 383 జాతుల జాబితాలో అన్ని శిలీంధ్రాలు దేశ సరిహద్దులలోనే గుర్తించబడ్డాయి. ఈ రికార్డులలో చాలా దక్షిణ సూడాను దేశానికి సంబంధించినవి. నమోదు జాతులు చాలా పంటల వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నాయి. దక్షిణ సుడానులో శిలీంధ్ర జాతుల నిజమైన సంఖ్య చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

2006 లో అధ్యక్షుడు కీరు ప్రభుత్వం దక్షిణ సుడాను జంతుజాలం ​, వృక్ష జాతులను రక్షించడం సాధ్యం కాగలదని ప్రకటించాడు. అడవి మంటలు, వ్యర్ధ డంపింగు, నీటి కాలుష్యం ప్రభావాలను తగ్గించేందుకు ప్రయత్నించాలని చెప్పాడు. ఆర్ధికాభివృద్ధి, మౌలికసౌకర్యాల అభివృద్ధి కారణంగా పర్యావరణం ప్రమాదంలో ఉంది.


దక్షిణ సుడాను అంతటా అనేక పర్యావరణ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి: ఈస్టు సుడానియన్ సవన్నా, నార్తర్ను కాంగోలియా అటవీ-సవన్నా మొజాయికు, సహారాను గ్రాస్ల్యాండ్సు(సుడు), సహలీ అకాసియా సవన్నా, తూర్పు ఆఫ్రికా మొట్టమొదటి అడవులు, ఉత్తర అకాసియా-కమిపోరా బుష్ల్యాండ్సు, దట్టమైన అడవులు.

వాతావరణం

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
కొప్పెన్ వాతావరణ వర్గీకరణ యొక్క దక్షిణ సుడాన్ చిహ్నం

దక్షిణ సుడాను ఈక్వెటోరియల్ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితికి సమానమైన వాతావరణాన్ని కలిగి ఉంది. అధిక తేమ, భారీ మొత్తంలో పొడి సీజను తరువాత వర్షపాతం నమోదవుతుంది. సగటు ఉష్ణోగ్రతలు 20 - 30 ° సెం(68 - 86 ° ఫా) జూలై అతిశీతల మాసంగా ఉంటుంది. 23 నుండి 37 ° సెం(వరకు 73 - 98 ° ఫా). సగటు ఉష్ణోగ్రతతో మార్చి వెచ్చని మాసంగా పరిగణించబడుతుంది.

మే, అక్టోబరు మధ్య అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ వర్షాకాలం ఏప్రిల్లో మొదలై నవంబరు వరకు విస్తరించవచ్చు. మే అతి తేమగా ఉన్న నెలగా పరిగణించబడుతుంది. ఈ సీజన్ "ఇంటర్-ట్రాపికలు జోను వార్షిక మార్పులచే ప్రభావితం చేయబడింది". దక్షిణ, నైరుతి గాలులు కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలు, అధిక తేమ, ఎక్కువ మేఘావృతంగా మారడానికి దారితీస్తుంది.

ఆర్ధికరంగం

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Loka Teaks is the largest teak plantation in Africa.[ఆధారం చూపాలి]

దక్షిణ సుడాను ఆర్ధికవ్యవస్థ ప్రపంచపు అభివృద్ధిదశలో ఉన్న ఆర్ధికవ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షిణ సూడాను మౌలిక సదుపాయాల కొరత, 2011 లో ప్రపంచంలో అత్యధిక ప్రసూతి మరణాలు, మహిళా నిరక్షరాస్యత శాతం కలిగి ఉంది. దక్షిణ సూడాను అంతర్జాతీయ మార్కెటుకు కలపను ఎగుమతి చేస్తుంది. దేశంలో పెట్రోలియం, ఇనుము ధాతువు, రాగి, క్రోమియం ధాతువు, జింకు, టంగ్స్టను, మైకా, వెండి, బంగారం, డైమండ్సు, హార్డ్వుడ్సు, సున్నపురాయి, జలశక్తి వంటి అనేక సహజ వనరులు ఉన్నాయి. అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నట్లు దేశం ఆర్ధికవ్యవస్థ, వ్యవసాయం మీద అధికంగా ఆధారపడింది.

సహజ వనరుల ఆధారిత కంపెనీలతో ఉన్న ఇతర సంస్థలలో " దక్షిణ సుడాను బీవరేజెసు లిమిటెడు " (సబ్సిడరీ ఆఫ్ సాబు మిల్లరు) ఉన్నాయి.

చమురు

20 వ శతాబ్దం చివరి భాగంలో దక్షిణప్రాంతంలో ఆయిల్ఫీల్డు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకరించాయి. దక్షిణ సుడానులో ఉప-సహారా ఆఫ్రికాలోని మూడవ అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ 2011 జూలైలో దక్షిణ సుడాను ఒక స్వతంత్ర దేశం అయిన తరువాత దక్షిణ, ఉత్తర మద్యవర్తులు ఈ దక్షిణ ఆయిలు ఫీల్డుల నుండి లభిస్తున్న రాబడిని ఎలా విభజించాలన్న విషయంలో వెంటనే ఒప్పందం కుదుర్చుకోలేదు.

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
సుడాన్లో చమురు, వాయువు రాయితీలు - 2004

దక్షిణ సూడాను చమురు నిక్షేపాలను సుడాను కంటే సుమారు 4 రెట్లు అధికంగా కలిగి ఉందని అంచనా వేశారు. సమగ్ర శాంతి ఒప్పందం (సి.పి.ఎ) ప్రకారం చమురు ఆదాయాలు, ఒప్పందం కాల వ్యవధికి సమానంగా విభజించబడ్డాయి. సూడానులోని ఎర్ర సముద్రం ప్రాంతంలో పైపులైనులు, రిఫైనరీలు, పోర్టు సుడాను సౌకర్యాల మీద దక్షిణ సూడాను ఆధారపడింది కనుక ఈ ఒప్పందం ఆధారంగా సుడాను ప్రభుత్వం కార్టూంలోని లభిస్తున్న చమురు ఆదాయం మొత్తంలో 50% వాటాను అందుకుంటుంది. ఈ అమరిక 2005 నుండి 2011 వరకు రెండవసారి స్వయంప్రతిపత్తి సమయంలో నిర్వహించబడింది.

స్వాతంత్ర్యం వచ్చే వరకు 50-50 చమురు రెవెన్యూల విభజన నిర్వహించడం కోసం ఉత్తర సంధానకర్తలు ఒత్తిడి చేసారు. దక్షిణ సుడాను అనుకూలమైన నిబంధనలకు దూరంగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక ప్రణాళికా మంత్రిత్వశాఖ ప్రకారం దక్షిణ సుడాను బడ్జెటుకు 98% పైగా చమురు ఆదాయాల సహకరిస్తున్నాయి. ఇది శాంతి ఒప్పందం మీద సంతకం చేసినప్పటి ఆదాయం కంటే $ 8 బిలియన్ల కంటే అధికరించింది.

స్వాతంత్ర్యం తరువాత దక్షిణ సూడాను పోర్టు సుడాను వద్ద చమురు టెర్మినలు పైపులైను ద్వారా రవాణా చేయబడుతున్న చమురు రవాణాకు సుడాను బారెలుకు US $ 34 చార్జి చేయాడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. రోజుకు సుమారు 30,000 బారెల్సు రవాణా జరుగుతున్న ఈ నౌకాశ్రయం నుండి రోజుకు మిలియన్ల డాలర్ల ఆదాయం లభిస్తుంది. 2012 జనవరిలో దక్షిణ సూడాను చమురు ఉత్పత్తిని సస్పెండు చేసింది. ఫలితంగా ఆదాయంలో తరుగుదల సంభవించి ఆహార వ్యయాలలో నాటకీయంగా 120% అధికరించింది.

దక్షిణ సుడాను చమురు క్షేత్రంలో చైనా నేషనలు పెట్రోలియం కార్పొరేషను (సి.ఎన్.పి.సి) ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారము చమురు నిల్వలు 2020 నాటికి తగ్గుతాయని దక్షిణ సుడాను ఆర్ధిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటుందని భావించబడుతుంది.

ఋణం

గత ఐదు దశాబ్దాలలో సుడాను, దక్షిణ సుడానులు కలిసి సంయుక్తంగా తీసుకున్న ఋణాలు సుమారు $ 38 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుంది. ఈ రుణం చిన్న భాగాన్ని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (2009 బ్యాంకు ఆఫ్ సూడాను అందించిన నివేదిక ప్రకారం ప్రపంచ బ్యాంకు $ 5.3 బిలియన్లు) అటువంటి అంతర్జాతీయ సంస్థలకు రుణపడి ఉన్నప్పటికీ, దాని రుణ భారం వాస్తవానికి పారిసు క్లబ్బు ( $ 11 బిలియన్ల అమెరికా డాలర్ల కంటే అధికం), పారిసు క్లబ్బుతో సంబంధం లేని ద్వైపాక్షిక రుణదాతలు (13 బిలియన్ల అమెరికా డాలర్లు)లతో, విదేశీ సంస్థలు అందించిన ఆర్థిక రుణాలు ఉన్నాయి.


పారిసు క్లబ్బు అనేది యునైటెడు స్టేట్సు, యునైటెడు కింగ్డం, జర్మనీ, ఫ్రాన్సు, కెనడా వంటి సభ్య దేశాలతో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక వ్యవస్థలలో 19 దేశాల నుండి అధికారిక, అనధికారిక సమూహాన్ని సూచిస్తుంది. అయితే పారిసు-కాని క్లబ్బు ద్వైపాక్షిక రుణదాతలుగా ఉన్న ఏ సంస్థ పారిసు క్లబ్బు సభ్యదేశంగా శాశ్వతఅనుబంధ హోదాను పొందదు. ప్రైవేటు ద్వైపాక్షిక రుణదాతల (అనగా ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు క్రెడిటు సరఫరాదారులు) మొత్తం (మొత్తం రుణంలో దాదాపు US $ 6 బిలియన్ల అమెరికా డాలర్లు) ఉంటుంది.

తూర్పు ఆఫ్రికా సమూహం

2011 లో కెన్యా, రువాండా అధ్యక్షులు సుడాను స్వయంప్రతిపత్తి కలిగిన దక్షిణ సూడాను స్వాతంత్ర్యం సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి దక్షిణ సుడాను ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. 2011 జూలై మధ్యకాలంలో దక్షిణ సుడాను ఒక దరఖాస్తుదారు దేశంగా ఉంది. కెన్యా, ఉగాండాలలోని వ్యవస్థలతో రైలు సంబంధాలు, చమురు పైపులైనులు, అంతర్గత నిర్మాణాన్ని సమగ్రపరచడం కోసం సుడాను మీద ఆధారపడకుండా దక్షిణ సుడాను ప్రారంభ ప్రయత్నాలు చేయాలని, జుబా ప్రాంతం మీద దృష్టి సారించాలని కెన్యా, ఉగాండా దేశాలు సూచించాయి. దక్షిణ సుడాన్ స్వల్పకాలంలో ఇ.ఎ.సి. విస్తరణకు యోగ్యత కలిగిన అభ్యర్థిగా ర్యూటర్సు భావిస్తుంది. టాంజానియా దినపత్రిక ది సిటిజెనులో ఒక వ్యాసం తూర్పు ఆఫ్రికా శాసనసభ స్పీకరు అబ్దిరాహీను హైతారు అబ్ధి సయ్యదు దక్షిణ సుడాను " స్వేచ్ఛగా ఇ.ఎ.సి.లో చేరవచ్చని" పేర్కొన్నాడు. దేశం త్వరలోనే ప్రాంతీయ సంస్థ పూర్తిస్థాయి సభ్యదేశంగా మారిపోతుందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.

2011 సెంప్టెంబరు 17 న డైలీ నేషను ఒక దక్షిణ సుడాను ఎంపిని ఉటంకిస్తూ తన ప్రభుత్వం ఇ.ఎ.సి.లో చేరాలని కోరుకునేటప్పుడు ఇ.ఎ.సి. సభ్య దేశాలతో పోటీ పడటానికి దాని ఆర్థిక వ్యవస్థ తగినంతగా అభివృద్ధి చెందలేదని ఆందోళనలకు గురవుతుందని వ్యాఖ్యానించింది. కెన్యా, టాంజానియా, ఉగాండా ఎగుమతులకు "డంపింగ్ గ్రౌండు " గా మారాలని సూచించింది. దక్షిణ సూడాను అధికారికంగా ఒక నెల తరువాత దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిందని అధ్యక్షుడు సాల్వా కీరు ప్రకటించడం వివాదాస్పదమైంది. 2012 డిసెంబరులో ఇ.ఎ.సి. ఈ అభ్యర్ధనను నిలిపి వేసింది. అయితే దక్షిణ సుడానులోని ఉగాండా బోడా-బోడా ఆపరేటర్ల చర్యలు రాజకీయ ఉద్రిక్తత సృష్టించి ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

2012 డిసెంబరులో టాంజానియా అధికారికంగా ఇ.ఎ.సి లో చేరడానికి దక్షిణ సుడాను అభ్యర్ధనను అంగీకరించింది. ఇది దక్షిణ సూడాను ప్రపంచ నూతన దేశంగా ప్రాంతీయ సమూహం ఆరవ సభ్యదేశంగా మారడానికి మార్గం సుగమం చేసింది. ప్రవేశానికి 2016 వరకు దక్షిణ సుడాను ఇ.ఎ.సి. ప్రవేశం జరగకపోయినా 2013 లో ఇ.ఎ.సి. దక్షిణ సుడానుకు $ 82,000 అమెరికా డాలర్లు కేటాయించింది. ఆగస్టు 2013 ఆగస్టులో ఇ.ఎ.సి. కౌన్సిల్ ఆఫ్ మంత్రుల సమావేశం తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది . 2012 లో నైరోబీలో నిర్వహించిన 14 వ ఆర్డినరీ సమ్మిటు వద్ద ఇ.ఎ.సి. దేశాల మంత్రిమండలిచే సమర్పించబడిన ధృవీకరణ నివేదికను ఆమోదించి దక్షిణ సుడానుతో సంప్రదింపులు ప్రారంభించాలని ఆదేశించారు.

దక్షిణ సుడాను అభ్యర్ధనను అంచనా వేసేందుకు ఒక బృందం ఏర్పడింది; ఏదేమైనా 2014 ఏప్రెలులో దశాబ్దం దక్షిణ సుడాను అంతర్యుద్ధం కారణంగా దరఖాస్తుల ప్రక్రియను జాప్యం చేసింది.

దక్షిణ సుడాను విదేశాంగ వ్యవహారాల మంత్రి బర్నబా మేరీయలు బెంజమిను 2015 అక్టోబరులో బహిరంగంగా ప్రకటించారు. మే, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో ప్రత్యేక సాంకేతిక కమిటీ అంచనాలు, సమావేశాలను అనుసరించి దక్షిణ సూడాను తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ సభ్యత్వం అనుమతించబడింది. అయితే ప్రజలకు అధికారికంగా ప్రకటించబడ లేదు. 2015 నవంబరులో తూర్పు ఆఫ్రికా దేశాల అధిపతులు తమ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణ సూడానును అనుమతించవచ్చని నివేదించబడింది.


2016 మార్చిలో దక్షిణ సూడాను తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీలో సభ్యదేశంగా ఆమోదించబడింది. 2016 ఏప్రెలులో ఒప్పందాన్ని సంతకంతో అధికారికంగా అంగీకరించారు.

దక్షిణ సుడాను, కామంవెల్తు దేశాలు

దక్షిణ సుడాను కామన్వెల్తు ఆఫ్ నేషంసులో చేరడానికి దరఖాస్తు చేసింది. దక్షిణ సుడాను ఆంగ్లో-ఈజిప్టు సుడానులో భాగం కావడం ఆలోచనలో ఉంది. పొరుగు దేశాలలో 2 కామన్వెల్తు రిపబ్లిక్లు కెన్యా, ఉగాండాలు ఉన్నాయి.

గణాంకాలు

దక్షిణ సూడాను జనసంఖ్య సుమారు 12 మిలియన్లు. (ఐఖ్యరాజ్యసమితి అంచనా ఖచ్చితమైన సంఖ్యావివరణ వివాదాస్పదంగా ఉంది). ప్రధానంగా గ్రామీణ ప్రజలు ఆధిఖ్యతలో ఉన్నారు. ఈ ప్రాంతం ప్రత్యక్షంగా యుద్ధం కారణంగా 1956 నుండి ఒక దశాబ్ధకాలం ప్రభావితమైంది. ఫలితంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోవడం, ప్రధాన విధ్వంసం, స్థానభ్రంశం ఏర్పడింది. 2 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు మరణించగా, 4 మిలియన్లకు పైగా అంతర్గత స్థానచలనం చెందడం, శరణార్థులుగా మారడం సంభవించాయి.

నగరీకరణ

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
John Garang Square in Juba
దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Children in Yambio, Western Equatoria, South Sudan
దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Rural school children participating in the USAID-funded Southern Sudan Interactive Radio Instruction project, July 2010

సంప్రదాయ సమూహాలు

దక్షిణ సుడానులో ఉన్న ప్రధాన జాతి సమూహాలు డింకాలో 1 మిలియను కంటే అధికం (సుమారు 15%), నూయరు (సుమారు 10%), బారి, అజాండేలు ఉన్నాయి. షిల్లాకు ప్రజల నివాసిత రాష్ట్రం వైటు నైలు వెంట చారిత్రాత్మకంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంటోంది. వారి భాష దింకా నూయరు భాషతో చాలా దగ్గరగా ఉంటుంది. షిల్లాకు, ఈశాన్య దిన్కాల సంప్రదాయ ప్రాంతాలు ప్రక్కనే ఉన్నాయి.

విద్య

ప్రాంతీయ దక్షిణ సూడాను మునుపటి విద్యా వ్యవస్థలా కాకుండా 1990 నుండి సుడాను రిపబ్లికులో ఉపయోగించే వ్యవస్థ అనుసరించి రూపొందించబడింది - దక్షిణ సూడాను రిపబ్లికు ప్రస్తుత విద్యా వ్యవస్థ 8 + 4 + 4 వ్యవస్థను అనుసరిస్తుంది (కెన్యా మాదిరిగానే). ప్రాథమిక విద్య ఎనిమిది సంవత్సరాలు, తరువాత నాలుగు సంవత్సరాల ఉన్నత విద్య, నాలుగు సంవత్సరాల విశ్వవిద్యాలయ బోధనను కలిగి ఉంటుంది.

ఆంగ్లం అన్ని స్థాయిలలో ప్రాధమిక భాషగా ఉంది. సుడాను రిపబ్లికులో బోధనా భాష అరబికు ఉంటుంది. 2007 లో దక్షిణ సూడాను ఆంగ్ల భాషను అధికారికంగా కమ్యూనికేషను భాషగా స్వీకరించింది. శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో ఆంగ్ల ఉపాధ్యాయులు, ఆంగ్ల భాష మాట్లాడే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది.

భాషలు

దక్షిణ సుడాను అధికార భాష ఆంగ్లం.

60 కి పైగా దేశీయ భాషలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిలో-సహారన్ భాషా కుటుంబంగా వర్గీకరించబడ్డాయి; సమిష్టిగా ఇవి నైలు సూడాను, మద్య సుడాను విభాగాలుగా విభజించబడ్డాయి.

రాజ్యాంగ సవరణలు

2005 తాత్కాలిక రాజ్యాంగం దక్షిణ సుడాను స్థానిక భాషలు, జాతీయ భాషలు గౌరవించబడాలని, అభివృద్ధి చేయబడాలని, ప్రోత్సహించబడాలని ప్రకటించింది. రాజ్యాంగంలో ఇలా చెప్పబడింది: "దక్షిణ సూడాను రాష్ట్రాల ప్రభుత్వాలు, ఉన్నత విద్య బోధనా భాషల స్థాయిలో ఇంగ్లీషు, అరబికు ఉండాలని, అలాగే అవి అధికారిక భాషగా ఉండాలి. " అని సూచించింది.


కొత్త స్వతంత్ర ప్రభుత్వంగా మారిన తరువాత అధికారిక భాషగా అరబికును తొలగించి ఇంగ్లీషును ఏకైక అధికారిక భాషగా ఎంచుకుంది.

దక్షిణ సుడాను రిపబ్లికు ఆఫ్ న్యూ సుడాను నూతన పరివర్తన రాజ్యాంగం ప్రకారము "దక్షిణ సూడాను స్వదేశీయ భాషలు, జాతీయ భాషలు గౌరవించబడతాయి, అభివృద్ధి చేయబడతాయి, ప్రోత్సహించబడతాయి " అని ప్రకటించింది. రాజ్యాంగంచేత ఇలా నిర్వచించబడింది: "ఆంగ్లం దక్షిణ సూడాను రిపబ్లికులో అధికారిక పని భాషగా ఉండాలి. అంతేకాక అన్ని స్థాయి విద్యలో బోధనా భాషగా ఉంటుంది. "

2017 జూలై 6 న దక్షిణ సూడాను స్వాహిలీభాషను అధికార భాషగా స్వాగతించటానికి ఎంచుకుంది. దేశంలోకి స్వాహిలీ ఉపాధ్యాయులను పంపించాలని టాంజానియా సహాయం కోరింది. అధికారిక భాషగా దాని స్వీకరణకు ముందు పాఠశాల పాఠ్యాంశాలలో స్వాహిలీ భాషని పరిచయం చేసింది.

కొన్ని ప్రాంతాలు

కాలానుగుణంగా, శాశ్వతంగా నివసిస్తున్న వారిలో మక్కా నుండి వెనక్కి తిరిగి వెళ్లే మార్గంలో ఇక్కడ స్థిరపడిన సంప్రదాయబద్ధంగా సంచార జీవితం అలవాటు కలిగిన నోమాడికు ప్రజలు ఉన్నారు. వీరు పశ్చిమ ఆఫ్రికన్ దేశాల నుండి ఇక్కడకు చేరుకున్నారు. వారు ప్రాథమికంగా చాడియా భాషలు మాట్లాడతారు, వారి సాంప్రదాయ భూభాగాలు ఉత్తర కర్దాను, డార్ఫూరు సుడాను దక్షిణ భాగాలలో ఉన్నాయి.

రాజధాని జుబాలో సంప్రదాయరహిత అరబికు (సాధారణంగా పిడ్జినున్లు జుబా అరబికు అంటారు) వేలాది ప్రజలు ఉన్నారు. కానీ కెన్యా దక్షిణ సుడాను రాయబారి 2 ఆగష్టు 2011 ఆగస్టున మాట్లాడుతూ " అరబ్బు స్థానంలో స్వాహిలీని ప్రవేశపెట్టే లక్ష్యంతో దక్షిణ సుడానులో స్వాహిలీ పరిచయం అవుతుంది. దక్షిణ సుడాను, అరబు లీగు కంటే తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీ వైపు దృష్టి సారించాలని దేశం ఉద్దేసిస్తుంది.అయినప్పటికీ దక్షిణ సుడాను అరబు లీగులో 2014 మార్చి 25 న సభ్య దేశంగా చేరడానికి అభ్యర్ధన పత్రం సమర్పించింది. ఇది ఇప్పటికీ పెండింగులో ఉంది. దక్షిణ సుడాను విదేశాంగ మంత్రి డెంగు అలోరు కుయోలు " అశ్చర్ఖు అల్-అవ్సతు " వాత్రాపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: దక్షిణ సూడాను అరబు ప్రపంచంలో అత్యంత దగ్గరి ఆఫ్రికా దేశం, మాకే ప్రత్యేకమైన అరబికు భాషని మేము జుబా అరబికు అని పిలుస్తాము. అరబు లీగులో చేరడానికి దక్షిణ సుడాను అభ్యర్థనకు సూడాను మద్దతు ఇస్తుంది. జుబా అరబికు దక్షిణ సూడానులో ఒక లింగుయా ఫ్రాంకాగా భావించబడుతుంది.

2008 గణాంకాలు

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Woman in South Sudan
దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
A village in South Sudan

సూడాను మొత్తం "సుడాను ఐదవ జనాభా, హౌసింగు సెన్ససు" 2008 ఏప్రెలులో నిర్వహించబడింది. ఈ జనాభా గణనలో దక్షిణ సుడాను జనాభా 8.26 మిలియనుగా లెక్కించారు; అయితే దక్షిణ సుడాను అధికారులు జనాభా గణనను నిరాకరించారు. ఎందుకంటే "కార్టూమ్లోని కేంద్ర బ్యూరో సుడాను సెన్ససు డేటాను దక్షిణ సుడాను కేంద్ర గణాంకాల భాగస్వామ్యం చేయడానికి నిరాకరించింది." అదనంగా అధ్యక్షుడు కీరు "అనుమానిత సంఖ్యలు కొన్ని ప్రాంతాలలో అధికరించినట్లు, ఇతరప్రాంతాలలో తగ్గాయి. అందువలన ఇవి అంగీకార యోగ్యం కాదని భావించబడ్డాయి " అని పేర్కొన్నారు. దక్షిణ సుడాను జనాభాలో వాస్తవానికి మూడింట ఒక వంతు సుడాను ప్రజలు ఉన్నారు. అయితే జనాభా గణన కేవలం 22% మాత్రమేనని చూపించింది.

అనేక దక్షిణ సుడాను కూడా వాతావరణం, పేలవమైన సమాచారవ్యవస్థ, బలహీనమైన రవాణా నెట్వర్కుల కారణంగా లెక్కించబడలేదు. కొన్ని ప్రాంతాలు అందుబాటులో లేవు. అనేక దక్షిణ సుడాను పొరుగు దేశాలలో బహిష్కరణలో ఉండడం " 'ఆమోదయోగ్యం కాని ఫలితాల' అని దక్షిణ సుడాను అధికారులు నిర్ధారించడానికి దారితీసింది. దక్షిణ ప్రాంత జనాభా గణాంకాల కొరకు ప్రధాన అమెరికా సాంకేతిక సలహాదారు జనాభా లెక్కల ప్రకారం జనాభా గణాంకాలలో 89% మాత్రమే చేరుకున్నట్లు పేర్కొన్నారు.

2009 గణాంకాలు

2009 లో స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణకు ముందు దక్షిణ సుడాను జనాభా గణనను ప్రారంభించబడింది. అయినప్పటికీ దక్షిణ సుడాను ప్రజలు అధికభాగంతో దేశాల నుండి వెళ్ళినందున ఈ ప్రయత్నం విమర్శించబడింది.

మతం

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Sunday Mass in the Roman Catholic Diocese of Rumbek

దక్షిణ సుడాను మతాలలో సాంప్రదాయ స్థానిక మతాలు, క్రైస్తవ మతం, ఇస్లాం ఉన్నాయి. 1956 నిర్వహించిన గణాంకాల ఆధారంగా దక్షిణాదివాసుల మతం గణాంకాలు పరిశీలించబడుతున్నాయి. ఇక్కడ ఎక్కువమంది సాంప్రదాయిక నమ్మకాలను అనుసరించే క్రైస్తవులుగా ఉన్నారు. 18% ముస్లింలు ఉన్నారు. చాలామంది దక్షిణ సూడాన్ సాంప్రదాయిక స్వదేశీ (అమాస్టీస్టుగా పిలువబడుతున్న) నమ్మకాలని అల్పసంఖ్యాక క్రైస్తవ మతంతో అనుసరిస్తూ ఉన్నారని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని యు.ఎస్. డిపార్టుమెంటు ఆఫ్ స్టేటు వనరులు పేర్కొన్నాయి. అయినప్పటికీ 2012 నాటి యు.ఎస్. స్టేటు డిపార్టుమెంటు ఇంటర్నేషనలు రిలిజియసు ఫ్రీడం రిపోర్టు ఆధారంగా ఎక్కువమంది ప్రజలు క్రైస్తవ మతానికి అనుగుణంగా ఉన్నారు. అయితే అనిమిస్టు, ముస్లిం విశ్వాసం గురించిన విశ్వసనీయమైన గణాంకాలు అందుబాటులో లేవు.


యు.ఎస్. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెసు ఫెడరలు రీసెర్చి డివిజను ఆధారంగా "1990 ల ప్రారంభంలో దక్షిణ సుడాను జనాభాలో 10% కంటే అధికంగా క్రైస్తవులు లేరని భావిస్తున్నారు. 1990 ల ప్రారంభంలో సూడాను అధికారిక నివేదికలు దక్షిణ సూడానులో ఉన్నవాటిలో 25% మంది ప్రజలు సంప్రదాయ స్థానిక మతాలు, 5% క్రైస్తవులు ఉన్నారు అని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని వార్తా నివేదికలు క్రైస్తవ ఆధిఖ్యత ఉందని పేర్కొన్నాయి.ప్రపంచ క్రిస్టియను ఎన్సైక్లోపెడియా ఆధారంగా కాథలిక్కు చర్చి 1995 నుండి సూడానులో అతిపెద్ద సింగిలు క్రిస్టియను మండలం, 2.7 మిలియను కాథలిక్కులు ప్రధానంగా దక్షిణ సూడానులో కేంద్రీకృతమై ఉన్నారు. 2005 లో 2 మిలియన్ల మంది సభ్యులు ఉన్న ఎపిస్కోపలు చర్చి ఆఫ్ సూడాను నుండి పెద్ద సంఖ్యలో ఆంగ్లికను మద్దతుదారులు ఉన్నట్లు ఎపిస్కోపలు చర్చి పేర్కొంది. సూడానులోని ప్రెస్బిటేరియా చర్చి దక్షిణ సుడానులో మూడవ అతిపెద్దది ఖ్యాతిగాంచింది. ఇది 2012 లో 500 సమ్మేళనాలలో ఒక మిలియను మంది సభ్యులను కలిగి ఉంది. 2012 డిసెంబరు 18 న ప్యూ రీసెర్చి సెంటరు మతం, ప్రజా జీవితం నివేదిక ఆధారంగా దక్షిణ సూడానులో 60.5% క్రైస్తవులు, 32.9% సాంప్రదాయ ఆఫ్రికా స్థానిక మతం అనుచరులు, 6.2% మంది ముస్లింలు ఉన్నారని భావిస్తున్నారు. కొంతమంది ప్రచురణకర్తలు విభజనకు ముందు సంఘర్షణలను ముస్లిం-క్రైస్తవ యుద్ధంగా వర్ణించారు. కానీ కొందరు ముస్లిం, క్రైస్తవ పక్షాలు కొన్నిసార్లు కలగలిసినట్లు ఆరోపిస్తూ ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు.

జుబా లోని సెయింటు తెరెసా కేథడ్రలు వద్ద మాట్లాడుతూ దక్షిణ సూడాను అధ్యక్షుడు కీరు (ఒక రోమను క్యాథలికు) దక్షిణ సూడాను మత స్వేచ్ఛను గౌరవించే ఒక దేశం అని అన్నారు. క్రైస్తవులలో చాలామంది కేథలికు, ఆంగ్లికను, ఇతర తెగలవారు కూడా క్రియాశీలంగా ఉంటారు. అనింస్టు విశ్వాసాలు తరచుగా క్రైస్తవ విశ్వాసాలతో మిళితమయ్యాయి.

విదేశీ ఉపాధి

విదేశాలలో నివసిస్తున్న దక్షిణ సుడాను పౌరులలో విదేశీఉపాధిదారులు అధికంగా ఉంటారు. ఉత్తర సుడాన్ నుండి స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభమైనప్పటి నుండి దక్షిణ సుడాను వెలుపల నివసిస్తున్న దక్షిణ సుడానియుల సంఖ్య గణనీయంగా అధికరించింది. దేశం వదిలి శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్ళిన దాదాపు ఒకటిన్నర మిలియన్ల దక్షిణ సుడానీయులు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా పనిచేస్తున్న శరణార్థులుగా మిగిలిపోయారు. ఇది దక్షిణ సుడానీ ప్రవాసులుగా స్థిరపడడానికి దారితీసింది.

దక్షిణ సుడానీసు ప్రవాసులలోని అతిపెద్ద వర్గాలు ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపాలలో ఉన్నారు. ఓషియానియాలు యునైటెడు స్టేట్సు, కెనడా, యునైటెడు కింగ్డం, ఆస్ట్రేలియా, చిన్న కమ్యూనిటీలుగా ఫ్రాంస్, ఇటలీ, జర్మనీ, స్వీడన్, న్యూజిలాండ్లలో ఉన్నారు.

సంస్కృతి

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
Scarified tribeswoman, South Sudan, 2011

అనేక సంవత్సరాల పౌర యుద్ధం కారణంగా దక్షిణ సుడాను సంస్కృతి దాని పొరుగువారిచే భారీగా ప్రభావితమవుతూ ఉంది. చాలామంది దక్షిణ సుడానీయులు ఇథియోపియా, కెన్యా, ఉగాండాలకు పారిపోయారు. అక్కడ వారు జాతీయులతో పరస్పరం మిశ్రితమై వారి భాషలు, సంస్కృతిని నేర్చుకున్నారు. దేశంలో మిగిలిపోయిన ప్రజలల్ఫ్ సుడాను, ఈజిప్టుకు ఉత్తరంగా వెళ్లి అరబు సంస్కృతిలో మిశ్రితమై ఉన్నారు.

ప్రవాస సమయంలో కూడా ఈ ప్రజలు ఒక గిరిజన మూలం, దాని సాంప్రదాయక సంస్కృతి, మాండలికం గురించి తెలిసిన దక్షిణ సుడానీ విలువలను సరక్షించారు. జుబా అరబికు, ఆంగ్లం, స్వాహిలి సాధారణంగా వాడుకలో ఉన్నప్పటికీ తూర్పు ఆఫ్రికా పొరుగు దేశాల సంబంధాలు మెరుగుపరచడానికి ఇది సహకరించింది.

సంగీతం

దక్షిణ సుడాను నుండి అనేక మంది సంగీత కళాకారులు ఇంగ్లీషు, స్వాహిలీ, అరబీ జుబా, వారి మాండలికం లేదా అన్ని మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. బార్బజు, యాబా ఏంజెలోసి వంటి పాపులర్ కళాకారులు ఆఫ్రో-బీటు, ఆర్ & బి, జుకు పాడతారు; డైనంకు రెగె విడుదలలకు ప్రసిద్ది చెందాడు; జానపద, రెగె, ఆఫ్రో-బీటు పాడుతున్న ఇమ్మాన్యూలు కెంబు. దక్షిణ సుడానీస్ సంగీత కళాకారుడు ఇమ్మాన్యూలు జలు తన ప్రత్యేకమైన హిప్ హాప్, సాహిత్యంలో సానుకూల సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. మాజీ బాల సైనికుడు జెలు సంగీతకారుడిగా మారి యు.కె.లో మంచి ప్రసారం, ఆల్బం సమీక్షలను అందుకున్నాడు. టి.ఇ.డి. వంటి ప్రసిద్ధ చర్చా వేదికలలో ప్రధాన చర్చలలో ఉపన్యాసం చేయడానికి కూడా అవకాశం లభించింది.

క్రీడలు

దక్షిణ సూడాన్: చరిత్ర, భౌగోళికం, ఆర్ధికరంగం 
South Sudanese-born basketball player Luol Deng

దక్షిణ సూడానులో చాలా సంప్రదాయ, ఆధునిక క్రీడలు ప్రజాదరణ పొంది ఉన్నాయి. ముఖ్యంగా మల్లయుద్ధం, మాకు యుద్ధాలు ప్రసిద్ధి చెందాయి. సంప్రదాయక క్రీడలు ప్రధానంగా పంటలు ఇంటికి చేరుకున్నాక జరుపుకునే పండుగలలో భాగంగా ఉంటాయి. వ్యవసాయ క్రీడల సమయంలో వారు తమకుతాము బంకమట్టిని పులుముకుంటారు. బహుశా పట్టును పెంచడానికి వారి అవగాహనను పెంచడానికి ఉండవచ్చు. ఈ క్రీడలు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షింస్తాయి. వారు పాటలు పాడుతూ, డ్రమ్సు వాయిస్తూ, వారి అభిమాన మల్లయోధులకు మద్దతుగా నాట్యం చేస్తారు. వీటిని పోటీగా భావించినప్పటికీ, వారు ప్రధానంగా వినోదం కోసం చేస్తుంటారు.


అసోసియేషను ఫుటు బాలు కూడా దక్షిణ సుడానులో ప్రజాదరణ పొందింది. దక్షిణ సూడాను ప్రభుత్వం, ఇతర భాగస్వాములు క్రీడ ప్రోత్సహించడానికి, క్రీడ స్థాయిని పెంచడానికి అనేక కార్యక్రమాలు చేబడుతుంటాయి. ఈ కార్యక్రమాలలో ఒకటి దక్షిణ సుడాను యూతు స్పోర్ట్సు అసోసియేషను (ఎస్ఎస్‌వైఎస్ఏ) ఇప్పటికే జూబాలోని కొన్యోకొన్యో, మునికి ప్రాంతాలలో ఫుట్బాలు క్లినిక్లను కలిగి ఉంది. ఇందులో యువకులు బాలురుకు శిక్షణ ఇస్తారు. యువత ఫుట్బాలు ప్రయత్నాల గుర్తింపుగా దేశం ఇటీవల సి.ఇ.సి.ఎ.ఎఫ్.ఎ. యువత ఫుట్బాలు పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది. ఒక నెల ముందుగానే బృహత్తరమైన తూర్పు ఆఫ్రికా పాఠశాలల క్రీడలు టోర్నమెంట్లకు కూడా ఆతిధ్యమిచ్చింది.[ఆధారం చూపాలి]


దక్షిణ సుడాను జాతీయ అసోసియేషను ఫుట్బాలు జట్టు 2012 ఫిబ్రవరిలో కాన్ఫెడరేషను ఆఫ్ ఆఫ్రికా ఫుట్బాలులో చేరింది. 2012 మేలో పూర్తి ఎఫ్.ఐ.ఎఫ్.ఎ సభ్యదేశంగా మారింది. 2011 జూలై 10 న జబాలలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ప్రారంభంలో టెన్కరు ఎఫ్.సి.కు వ్యతిరేకంగా మొదటి టెస్టు మ్యాచు జరిగింది. ప్రసిద్ధ దక్షిణ సుడాన్సు ఫుటు బాలు క్రీడాకారులలో జేమ్సు మోగా, రిచర్డు జస్టిను, అథీరు థామసు, గోమా జెన్నారో అవదు, ఖమిసు లేయానో, ఖమిసు మార్టిను, రాయ్ గుల్వాకు ఉన్నారు.

దక్షిణ సుడానీసు టాప్ బాస్కెటు బాలు ఆటగాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తుంది. లుయోలు డెంగు సంయుక్త రాష్ట్రాలలో నేషనలు బాస్కెటు బాలు అసోసియేషను స్టారుగా మిన్నెసోట టిమ్బర్వాల్సు కోసం ఆడుతాడు; అంతర్జాతీయ స్థాయిలో గ్రేటు బ్రిటనుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దక్షిణ సుడానులోని ఇతర ప్రముఖ అంతర్జాతీయ బాస్కెట్బాలు ఆటగాళ్ళలో మనుటు బోలు, కుతు డ్యూనీ, డెంగు గాయి, ఆటరు మజోకు, థోను మేకరు ప్రాధాన్యత కలిగి ఉన్నారు. 2011 జూలై 10 న దక్షిణ సుడాను జాతీయ బాస్కెట్బాలు జట్టు ఉగాండా జాతీయ బాస్కెట్బాలు జట్టుతో మొదటి మ్యాచులో పాల్గొన్నది.


దక్షిణ సుడాను గ్వారు మరియలు నుండి ఒక క్రీడాకారుడు 2012 వేసవి ఒలింపిక్సులో పోటీ చేశాడు. దక్షిణ సుడానులో ఇంకా అధికారిక ఒలింపిక్సు సంస్థను కలిగి లేదు, మరియలుకు ఇంకా అమెరికా పౌరసత్వం లేదు. ఆయన మాజీ నెదర్లాండ్సు ఆంటిల్లెసు నుండి మూడు అథ్లెట్లతో పాటు ఇండిపెండెంటు ఒలంపికు అథ్లెట్ల బ్యానరుతో పోటీ పడ్డాడు.

2015 ఆగస్టు న 128 వ ఐ.ఒ.సి. సమావేశంలో దక్షిణ సూడాను జాతీయ ఒలింపికు కమిటీ పూర్తి గుర్తింపు పొందింది. దక్షిణ సూడాను 2016 సమ్మరు ఒలంపిక్సులో ట్రాకు, ఫీల్డులలో మూడు అథ్లెట్లతో పోటీ పడింది. ఈ ఒలింపిక్సులో ఏ పతకాలు సాధించలేదు.

బయటి లింకులు

వనరులు



Tags:

దక్షిణ సూడాన్ చరిత్రదక్షిణ సూడాన్ భౌగోళికందక్షిణ సూడాన్ ఆర్ధికరంగందక్షిణ సూడాన్ గణాంకాలుదక్షిణ సూడాన్ సంస్కృతిదక్షిణ సూడాన్ బయటి లింకులుదక్షిణ సూడాన్ వనరులుదక్షిణ సూడాన్En-us-Sudan.oggఇథియోపియాఉగాండాఎర్ర సముద్రంకాంగోకెన్యాదస్త్రం:En-us-Sudan.oggభూపరివేష్టిత దేశంసూడాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ ప్రధానమంత్రికృత్రిమ మేధస్సుప్రీతీ జింటాధూర్జటితెలంగాణ ఉద్యమంవందేమాతరంపెళ్ళిశోభన్ బాబుఎస్. ఎస్. రాజమౌళిబ్రహ్మక్రిక్‌బజ్పిఠాపురంరాహుల్ గాంధీవిజయనగర సామ్రాజ్యంఆది పర్వములవకుశచిరంజీవిథామస్ జెఫర్సన్జాషువాభారత జాతీయ కాంగ్రెస్కామసూత్ర (సినిమా)తెలుగు పదాలుభారత ఆర్ధిక వ్యవస్థతెలుగుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచదరంగం (ఆట)సౌర కుటుంబంసరస్వతిజ్యోతీరావ్ ఫులేపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాసూర్య (నటుడు)తొలిప్రేమఅరణ్యకాండఎనుముల రేవంత్ రెడ్డిపాగల్త్యాగరాజు కీర్తనలుమొదటి ప్రపంచ యుద్ధంచేతబడినర్మదా నదివసంత ఋతువుపల్లెల్లో కులవృత్తులుమేరీ ఆంటోనిట్టేఅన్నమయ్యహృదయం (2022 సినిమా)త్రిఫల చూర్ణంవిమల (రచయిత్రి)మంతెన సత్యనారాయణ రాజుశుక్రుడురాశి (నటి)దానంసీతారాముల కళ్యాణం చూతము రారండీతిక్కనపిబరే రామరసంతెలుగు పత్రికలుడీజే టిల్లుసిద్ధార్థ్గరుత్మంతుడుప్లీహముఆంధ్రజ్యోతిచంద్రయాన్-3శివ కార్తీకేయన్విష్ణుకుండినులుదివ్యభారతివిశాల్ కృష్ణరాకేష్ మాస్టర్సమంతరోహిణి నక్షత్రంశత్రుఘ్నుడురాశివిశాఖ నక్షత్రముఅదితి శంకర్నడుము నొప్పిసలేశ్వరంఐక్యరాజ్య సమితిసుడిగాలి సుధీర్ఆర్టికల్ 37020వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి🡆 More