జాంబియా

జాంబియా అధికారికంగా జాంబియా రిపబ్లికు .

ఇది దక్షిణ-మధ్య ఆఫ్రికాలో ఒక భూ పరివేష్టిత దేశం. (కొన్ని వనరులు ఇది తూర్పు ఆఫ్రికా) లో భాగంగా ఉందని సూచిస్తున్నాయి). దేశ ఉత్తరసరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పుసరిహద్దులో మలావి, దక్షిణసరిహద్దులో మొజాంబిక్, దక్షిణసరిహద్దులోజింబాబ్వే, బోత్సువానా, నైరుతిసరిహద్దులో నమీబియా, పశ్చిమసరిహద్దులో అంగోలా ఉన్నాయి. రాజధాని నగరం లుసాకా జాంబియా దక్షిణ-కేంద్ర ప్రాంతంలో ఉంది. జనాభా ప్రధానంగా దక్షిణప్రాంతంలో ఉన్న లసుకా, వాయవ్య ప్రాంతంలో ఉన్న కాపెబెల్టు ప్రావింసులో కేంద్రీకృతమై ఉంది. ఇవి రెండూ దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

రిపబ్లిక్ ఆఫ్ జాంబియా
Flag of జాంబియా జాంబియా యొక్క చిహ్నం
నినాదం
"ఒకే జాంబియా, ఒకే దేశం"
జాతీయగీతం

జాంబియా యొక్క స్థానం
జాంబియా యొక్క స్థానం
రాజధానిలుసాక
15°25′S 28°17′E / 15.417°S 28.283°E / -15.417; 28.283
అతి పెద్ద నగరం లుసాకా
అధికార భాషలు ఆంగ్లము
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు న్యంజ, బెంబ, లుండ, టోంగ, లొజి, లువలె, కవొండె.
ప్రజానామము జాంబియన్
ప్రభుత్వం రిపబ్లిక్
 -  అధ్యక్షుడు రుపియబండ
 -  ఉపాధ్యక్షుడు జార్జ్ కుండ
స్వతంత్రము బ్రిటన్ దేశము నుండి 
 -  తేదీ 24 అక్టోబరు1964 
 -  జలాలు (%) 1
జనాభా
 -  2009 అంచనా 12,935,000 (71st)
 -  2000 జన గణన 9,885,591 
జీడీపీ (PPP) 2009 అంచనా
 -  మొత్తం $18.454 billion 
 -  తలసరి $1,541 
జీడీపీ (nominal) 2009 అంచనా
 -  మొత్తం $13.000 billion 
 -  తలసరి $1,086 
జినీ? (2002–03) 42.1 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.434 (low) (165th)
కరెన్సీ జాంబియన్ క్వాచా (ZMK)
కాలాంశం CAT (UTC+2)
 -  వేసవి (DST) not observed (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .zm
కాలింగ్ కోడ్ +260

ఈ ప్రాంతంలో ముందుగా ఖియోసన్ ప్రజలు నివసించేవారు. ఈ ప్రాంతం 13 వ శతాబ్దంలో బంటు విస్తరణ ద్వారా ప్రభావితమైంది. 19 వ శతాబ్దంలో ఐరోపా అన్వేషకుల సందర్శనల తరువాత ఈ ప్రాంతం 19 వ శతాబ్దం చివరలో బారోట్జిలాండ్-నార్తు- వెస్టర్ను రోడేషియా, నార్తు-తూర్పు రోడేసియా బ్రిటీషు సంరక్షక ప్రాంతాలుగా మారాయి. 1911 లో ఇవి విలీనమై ఉత్తర రొడీషియాగా పిలువబడింది. బ్రిటీషు సౌత్ ఆఫ్రికా కంపెనీ సలహాతో లండను నుండి నియమించిన అధికారులు జాంబియాను పాలించారు.

1964 అక్టోబరు 24 న జాంబియా యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది. ప్రధాన మంత్రి కెన్నెత్ కౌండ మొదటి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కౌండా సోషలిస్టు యునైటెడు నేషనలు ఇండిపెండెన్సు పార్టీ 1964 నుండి 1991 వరకు అధికారాన్ని నిర్వహించింది. ప్రాంతీయ దౌత్య కార్యక్రమంలో కౌండా కీలక పాత్ర పోషించింది. రోడెసియా (జింబాబ్వే), అంగోలా, నమీబియాలలో వివాదాలకు పరిష్కారాల కోసం యునైటెడు స్టేట్సుతో సన్నిహితంగా ఉండి సహకరించింది. 1972 నుండి 1991 వరకు జాంబియా "వన్ జాంబియా, వన్ నేషన్" అనే నినాదంతో " యు.ఎన్.ఐ.పి. పార్టీ " ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా ఏకపార్టీ-దేశంగా ఉంది. 1991 లో బహుళ-పార్టీ ప్రజాస్వామ్య స్థాపన కొరకు సామాజిక-ప్రజాస్వామ్య ఉద్యమం సాగించి ఫ్రెడెరికు చిలుబా కౌండా నుండి అధికారం స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సామాజిక-ఆర్ధిక వృద్ధి, ప్రభుత్వ అధికార వికేంద్రీకరణ కాలం ప్రారంభమైంది. చిలీ ఎన్నుకున్న వారసుడిగా ఉన్న లేవీ మ్వానవాసా 2002 జనవరి నుండి ఆయన మరణం వరకు జాంబియా అధ్యక్షపదవి వహించాడు. 2008 ఆగస్టులో అతని మరణం వరకు అవినీతిని తగ్గించడానికి, జీవన ప్రమాణం పెంచడానికి ప్రచారంలో పాల్గొన్నాడు. మ్వానవాసా చనిపోయిన తరువాత 2008 లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు తాత్కాలిక అధ్యక్షుడుగా రూపియా బండా అధ్యక్షత వహించారు. 3 సంవత్సరాలు తాత్కాలిక అద్యక్షుడుగా కార్యాలయ బాధ్యతలు వహించిన తరువాత నిర్వహించబడిన " పేట్రియాటిక్ ఫ్రంట్ పార్టీ " నాయకుడైన మైఖేల్ సతా తన ఎన్నికలలో బండాను ఓడించి పదవి నుండి తొలగించాడు. 2014 అక్టోబరు 28 న సతా మరణించాడు. దీనితో ఆయన కార్యాలయంలో చనిపోయిన రెండవ జాంబియా అధ్యక్షుడిగా గుర్తించబడ్డాడు. Guy Scott served briefly as interim president until new elections were held on 20 January 2015, 2015 జనవరి 20 న కొత్త ఎన్నికలు నిర్వహించబడే వరకు గై స్కాట్ తాత్కాలిక అధ్యక్షుడిగా స్వల్పకాలం సేవలను అందించాడు. ఎన్నికలలో ఎడ్గరు లుంగు జింబావే 6 వ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

2010 లో ప్రపంచ బ్యాంకు ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికంగా సంస్కరించబడిన దేశం జాంబియా అని వర్గీకరించింది. తూర్పు, దక్షిణ ఆఫ్రికా కామను మార్కెట్టు ప్రధాన కార్యాలయం లూసాకాలో ఉంది.కెన్నెత్ కౌండజాంబియా దేశానికి మొదటి అధ్యక్షుడుగా పనిచేశాడు.

పేరు వెనుక చరిత్ర

ఈ భూభాగం 1911 నుండి ఉత్తర రోడేషియా అని పిలువబడింది. ఇది 1964 లో స్వాతంత్ర్యం సందర్భంగా జాంబియాగా పేరు మార్చబడింది. జాంబియా అనే కొత్త పేరు జాంబిజి నది కారణంగా వచ్చింది (జాంబేజి అంటే "గ్రాండ్ రివర్" అని అర్థం).

చరిత్ర

జాంబియా 
Skull of Broken Hill Man discovered in present-day Kabwe.

చరిత్రకు పూర్వం

క్రీ.పూ 300 వ దశాబ్ద కాలం వరకు ఖోసాను ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేవారు. ఈ ప్రాంతాలను బంటు ఈ ప్రాంతానికి వలసవచ్చి స్థావరాలను ఏర్పరుచుకుని నివసించడం ప్రారంభించారు. ఈ ప్రారంభ వేట- వస్తుసేకరణ సమూహాలు తరువాత మరింత వ్యవస్థీకృత బంటు సమూహాలచే నాశనం చేయబడడం, శోషించబడడం సంభవించింది.

జాంబేజీ లోయ కలాంబో జలపాతాల ప్రాంతంలో పురావస్తు త్రవ్వకాలలో మానవ సంస్కృతుల వారసత్వం ఆధారాలు లభించాయి. ప్రత్యేకంగా, కలాంబో జలపాతానికి సమీపంలో ఉన్న పురాతన శిబిరాల ప్రాంతాలు, ఉపకరణాలు 36,000 సంవత్సరాల క్రితం నాటి రేడియోకార్బన్గా భావిస్తున్నారు.

బ్రోకెన్ హిల్ మాన్ శిలాజపు పుర్రె అవశేషాలు క్రీ.పూ. 3,00,000 - 125,000 సంవత్సరాల మధ్యకాలం నాటివని భావిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రారంభ మానవులచే నివసించబడిందన్న వాదనను ఇది బలపరుస్తుంది.

బంటు సాంరాజ్యం

ఆధునిక జాంబియా ప్రజల ప్రారంభ చరిత్ర మౌఖిక సంప్రదాయం ద్వారా తరతరాలుగా అందించబడింది.

12 వ శతాబ్దంలో బంటు విస్తరణ సమయంలో బంటు-భాషావాడుకరులైన ప్రజాతరంగాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. వారిలో టోంగా ప్రజలు (బా-టోంగా అని కూడా పిలుస్తారు, "బా-" అనగా "పురుషులు") జాంబియాలో స్థిరపడిన మొట్టమొదటి ప్రజలుగా గుర్తించబడ్డారు. తూర్పు "పెద్ద సముద్రం" సమీపంలో నుండి వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. ఆధునిక ప్రజాస్వామ్య రిపబ్లికు ఆఫ్ కాంగో దక్షిణ ప్రాంతం, ఉత్తర అంగోలా ప్రాంతాలలోని లూబా-లుండా సామ్రాజ్యాల నుండి వచ్చిన న్కొయా ప్రజలు కూడా ముందుగానే ఈ ప్రాంతానికి వచ్చారు. తరువాత 12 వ - 13 వ శతాబ్దాల మధ్యకాలంలో ప్రవాహంలా వచ్చి చేరారు.

కలొంగా పాలనలో తూర్పున మరావీ సామ్రాజ్యం మలావి లోని ప్రాంతాలను, ఆధునిక ఉత్తర మొజాంబిక్ భాగాలను విలీనం చేసుకుంటూ అభివృద్ధి చెందింది.

18 వ శతాబ్దం చివరలో కొంతమంది మ్బుండా ప్రజలు ఇతర వసలదారులతో మధ్య వలసలు, బారోట్సాలాండు, మొంగుకు వలస వచ్చారు. అలుయి వారి నాయకుడు లితుంగా ములాంబ్వా పోరాట సామర్ధ్యం కొరకు ముబండని కూడా గౌరవిస్తారు.

19 వ శతాబ్దం ప్రారంభంలో నస్సోలో ప్రజలు ఉత్తర ప్రావింసులోని మబలా జిల్లాలో స్థిరపడ్డారు. 19 వ శతాబ్దంలో నగోనీ, సోతో ప్రజలు దక్షిణప్రాంతం నుండి వచ్చారు. 19 వ శతాబ్దం చివరి నాటికి జాంబియాలోని పలువురు ప్రజలు తమ ప్రస్తుత ప్రాంతాలలో స్థిరపడ్డారు.

ఐరోపా

జాంబియా 
An 1864 portrait of Scottish explorer and missionary David Livingstone.

18 వ శతాబ్దం చివరలో పోర్చుగీసు అన్వేషకుడైన ఫ్రాన్సిస్కో డి లెస్డెర్ను ఈ ప్రాంతంలో సందర్శించడానికి మొట్టమొదటి యూరోపియనుగా గుర్తింపు పొందాడు. లాజెర్డా నాయకత్వంలో అంవేషకుల బృందం మొజాంబిక్ నుండి కంబెం ప్రాంతానికి అక్కడి నుండి జాంబియాలో (మొదటిసారి తీరప్రాంత తీరప్రాంతాల నుండి దక్షిణాఫ్రికాను దాటడానికి), ఈ ప్రాంతంలో ప్రవేశించి 1798 లో యాత్రలో మరణించారు. అంవేషణ బృందం తరువాత ఆయన స్నేహితుడు ఫ్రాన్సిస్కో పింటో నేతృత్వంలో ముందుకు సాగింది. పోర్చుగీసు మొజాంబిక్, పోర్చుగీసు అంగోలా మధ్య ఉన్న ఈ భూభాగాన్ని ఆ సమయంలో పోర్చుగలుతో పేర్కొనబడి అన్వేషించబడింది.

19 వ శతాబ్దంలో ఇతర ఐరోపా సందర్శకులు అనుసరించారు. వీరిలో ప్రముఖమైనవాడు డేవిడ్ లివింగుస్టను బానిస వాణిజ్యాన్ని ముగించే దృష్టిని కలిగి ఉన్నాడు. క్రైస్తవ మతం, వాణిజ్యం, నాగరికత అనే లక్ష్యాలతో ఆయన అంవేషణ సాగించాడు. 1855 లో ఆయన జాంబేజి నదిపై ఉన్న అద్భుతమైన జలపాతాలను గుర్తించిన మొట్టమొదటి యూరోపియనుగా జలపాతానికి యునైటెడ్ కింగ్డమ్ రాణి విక్టోరియా పేరుపెట్టాడు. అతను ఆదృశ్యన్ని ఇలా వివరించాడు: "దేవదూతలు వారి విమానంలో చాలా మనోహరమైన దృశ్యాలు చూడవచ్చు."

స్థానికంగా ఈ జలపాతం "మోసి-ఓ-తున్య" లేదా "థింగ్ స్మోక్" లాజి లేదా కొలోలో మాండలికంలో పిలువబడుతుంది. జలపాత సమీపంలో పట్టణానికి లివింగుస్టను పేరు పెట్టబడింది. 1873 లో ఆయన మరణం తరువాత ఐరోపా సందర్శకులు, మిషనరీలు, వ్యాపారతరంగాలు అతని ప్రయాణాలను అత్యంత ప్రచారం చేశారు.[నమ్మదగని మూలం?]

బ్రిటిషు దక్షిణ ఆఫ్రికా కంపెనీ

1888 లో సెసిలు రోడెసు నాయకత్వంలోని " బ్రిటిషు సౌతు ఆఫ్రికా కంపెనీ " (బి.ఎస్.ఎ. కంపెనీ), లోజి ప్రజానాయకుడు లితుంగా నుండి ఖనిజ హక్కులను పొందింది. తరువాత బా-రొస్టేగా ఈ ప్రాంతం బారోట్జిలాండ్-నార్త్- పశ్చిమ రోడేషియా అయింది.

జాంబియా 
సెసిలు రోడ్సు

1897 డిసెంబరులో తూర్పుప్రాంతంలో ఉన్న అంగోనీ (న్గోని) సమూహం ( జులలాండు పూర్వీకం కలిగిన ప్రజలు) రాజు మెపెజని కుమారుడు సింకోలో నాయకత్వంలో తిరుగుబాటు చేశాడు. కానీ తరువాత తిరుగుబాటును నిలిపివేశారు. మెపెజెని " పాక్సు బ్రిటానికా "ను అంగీకరించాడు. తరువాత తూర్పుప్రాంతం ఉత్తర-తూర్పు రోడేషియా అని పిలువబడింది. 1895 లో రోడెసు తన అమెరిక స్కౌట్ ఫ్రెడెరికు రస్సెలు బర్నుహాంను ఈ ప్రాంతంలో నది రవాణాను మెరుగుపరిచి ఖనిజాలు అన్వేషించాలని కోరాడు. ఈ ట్రెక్కింగు సమయంలో బర్ఫం కాఫుయే నది వెంట ప్రధాన రాగి నిక్షేపాలు కనుగొన్నారు.

ఉత్తర-తూర్పు రోడేషియా, బారోట్జిల్యాండు-నార్తు-వెస్టర్ను రోడేషియాను 1911 వరకు ప్రత్యేక విభాగాలుగా నిర్వహించబడింది. తరువాత బ్రిటిషు సంరక్షిత నార్తరను రోడేషియాను ఏర్పాటు చేయడానికి రెండు విభాగాలు విలీనం చేయబడ్డాయి. 1923 లో బి.ఎస్.ఎ. కంపెనీ బ్రిటీషు ప్రభుత్వం కంపెనీ అధికారాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించి నార్తరన్ రోడెసియా నియంత్రణను తీసుకుంది.

బ్రిటిషు వలసపాలన

బి.ఎస్.ఎ. కంపెనీచే స్వాధీనం చేసుకుని నిర్వహించబడిన భూభాగంగా ఉన్న దక్షిణ రోడేషియా (ప్రస్తుత జింబాబ్వే), ఒక స్వయంపాలిత బ్రిటిషు కాలనీగా మారింది. 1924 లో చర్చల తరువాత ఉత్తర రోడేషియా పరిపాలన బ్రిటీషు కలోనియలు కార్యాలయానికి బదిలీ చేయబడింది.

రొడీషియా, న్యాసాలాండు సమాఖ్య

1953 లో రోడేషియా, న్యాసాలాండు ఫెడరేషను స్థాపన ఉత్తర రోడేషియా, దక్షిణ రోడేషియా, నైసాలాండు (ఇప్పుడు మాలావి) సమైక్యం చేసి పాక్షిక-స్వతంత్ర ప్రాంతంగా చేసింది. జనాభా గణనీయమైన సంఖ్యలో దీనిని వ్యతిరేకిస్తూ 1960-61లో ప్రదర్శన నిర్వహించారు. నార్తరను రోడేషియా చివరి సంవత్సరాలలో ఫెడరేషను సంక్షోభానికి కేంద్రంగా ఉంది. ప్రారంభంలో హ్యారీ న్కుంబూల " ఆఫ్రికన్ నేషనలు కాంగ్రెసు (ఎ.ఎన్.సి) ఈ ప్రచారానికి నాయకత్వం వహించింది. కెన్నెత్ కౌండా " యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ (యు.ఎన్.ఐ.పి.) " తరువాత బాధ్యతలు చేపట్టింది.

స్వతంత్రం

జాంబియా 
కెన్నెత్ కౌండ first Republican president, on a state visit to Romania in 1986.

1962 లో అక్టోబరు డిసెంబరు నిర్వహించిన రెండు-దశల ఎన్నిక ఫలితంగా శాసన మండలిలో ఆఫ్రికన్ మెజారిటీ, ఆఫ్రికన్ జాతీయవాద పార్టీల మధ్య అసంతృప్తికరమైన సంకీర్ణం ఏర్పడింది. ఈ సమాఖ్య సమాఖ్య నుండి విడిపోవడానికి ఉత్తర రోడేషియా పిలుపునిచ్చి నూతన రాజ్యాంగం రూపొందించి పూర్తి ప్రజాస్వామ్య విధానం ఆధారంగా కొత్త జాతీయ అసెంబ్లీతో పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం కావాలని పట్టుపట్టింది.

1963 డిసెంబరు 31 న ఈ సమాఖ్య రద్దు చేయబడింది. 1964 జనవరిలో నిర్వహించిన ఎన్నికలలో ఉత్తర రోడేషియా ప్రధాన మంత్రి కుండా విజయం సాధించాడు. కలోనియలు గవర్నరు సర్ ఎవెలిను హోను కౌండాకు చాలా సమీపంలో ఉన్నందున ఆ పదవిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కొద్దికాలం తరువాత ఆలిసు లెన్షినే నేతృత్వంలో దేశంలోని ఉత్తరప్రాంతంలో " లంపా తిరుగుబాటు " జరిగింది. దేశనాయకుడిగా కుండా ఎదుర్కొన్న మొదటి అంతర్గత సంఘర్షణగా ఇది గుర్తించబడింది.

1964 అక్టోబరు 24 న ఉత్తర రొడీషియా జాంబియా రిపబ్లిక్కుగా అవతరించింది, కెన్నెత్ కౌండా మొదటి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. స్వాతంత్రం సమయంలో దేశంలో గణనీయ ఖనిజ సంపద ఉన్నప్పటికీ జాంబియా ప్రధాన సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా కొంతమంది శిక్షణ పొందిన, విద్యావంతులైన జాంబియన్లు ప్రభుత్వాన్ని నిర్వహించగలిగారు. ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా విదేశీ నైపుణ్యం మీద ఆధారపడి ఉంది. జాన్ విల్సను సి.ఎం.జి. అందించాడు. 1964 లో జాంబియాలో 70,000 మందికంటే ఐరోపియన్లు ఉన్నారు. వారు అసమాన ఆర్థిక ప్రాధాన్యత కలిగి ఉన్నారు.

పొరుగు దేశాలతో సంఘర్షణలు

పాండ్రియటికు ఫ్రంటు గెరిల్లాల కౌండా ఆమోదం పొరుగునున్న (దక్షిణం) రోడేషియా మీద దాడికి దారితీసింది. రాజకీయ ఉద్రిక్తత, సరిహద్దు సైనికీకరణ ఫలితంగా 1973 లో పాండ్రియటికు ఫ్రంటు మూసివేతకు దారితీసింది. రోడీషియను నిర్వహణ ఉన్నప్పటికీ దేశం విద్యుత్తు అవసరాలను తీర్చడానికి సామేబిజి నదిమీద కరీబా హైడ్రో ఎలక్ట్రికు స్టేషను తగినంత సామర్థ్యాన్ని అందించింది.

1978 సెప్టెంబరు 3 న రష్యన్-సరఫరాచేసిన " హీటు సీకింగు " క్షిపణిని ప్రయోగించి కరైబా సమీపంలో " ఎయిరు రోడేషియా ఫ్లైటు 825 " అనే ఒక పౌర విమానం కూల్చబడింది. నమ్మశక్యంకాని విధంగా పిల్లలతో సహా 18 మంది ప్రమాదం నుండి ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ జొకోబో న్కోమో నేతృత్వంలోని జింబాబ్వే ఆఫ్రికన్ పీపుల్స్ యూనియన్ (జిఎపియు) తీవ్రవాదులు వారిలో చాలామందిని కాల్చారు. ఆపరేషన్ గాట్లింగు చర్యకు రోడెషియా ప్రతిస్పందించి జాంబియా నెకోమో గెరిల్లా స్థావరాలపై (ప్రత్యేకించి లూసాకా వెలుపల సైనిక ప్రధాన కార్యాలయం మీద) దాడి చేసింది. ఈ దాడి " గ్రీను లీడరు రైడు " అని పిలిచారు. అదే రోజున, జాంబియాలో మరో రెండు స్థావరాల మీద వైమానిక శక్తి, ఎలైటు పారరొరోప్సు, హెలికాప్టరు దళాలు ఉపయోగించి దాడి చేయబడ్డాయి.

1975 లో టాంజానియాలోని " డారు ఎస్ సల్లాం " నౌకాశ్రయానికి అనుసంధానంగా రైల్వే (టజార - టాంజానియా జాంబియా రైల్వేసు) చైనీయుల సహాయంతో పూర్తి చేయబడింది. జాంబియా దక్షిణప్రాంతంలో దక్షిణాఫ్రికా, పశ్చిమప్రాంతంలో సమస్యాత్మకంగా మారిన " పోర్చుగీసు అంగోలా " రైలుమార్గం మీద ఆధారపడడాన్ని ఇది తగ్గించింది. రైల్వే పూర్తయ్యే వరకు దిగుమతికి, క్లిష్టమైన రాగి ఎగుమతి కొరకు టాంజం రహదారి (ఇది జాంబియాను టాంజానియాలోని పోర్టు నగరాలతో అనుసంధానిస్తుంది) మీద ఆధారపడింది. డారు ఎస్ సలాం నుండి జాంబియాలోని న్డోలా వరకు " టాజమా చమురు పైపులైను " కూడా నిర్మించారు.

1970 ల చివరినాటికి మొజాంబిక్, అంగోలా రెండూ పోర్చుగల నుండి స్వాతంత్ర్యం పొందాయి. రోడేషియా శ్వేతజాతి ప్రభుత్వం 1965 లో స్వతంత్ర ప్రకటన విడుదల చేసింది. 1979 లో లాంకాస్టర్ హౌస్ ఒప్పందంలో ఇది ఆమోదించబడింది.

పోర్చుగీసు కాలనీలు, నమీబియా స్వతంత్ర పోరాటం కారణంగా జరిగిన పౌర కలహాలు శరణార్థుల ప్రవాహానికి దారితీసి రవాణా సమస్యలను కలిగించాయి. అంగోలా ద్వారా పశ్చిమప్రాంతంలో విస్తరించిన బెంగుయేలా రైలుమార్గం 1970 ల చివరి నాటికి జాంబియా రవాణాకు మూసివేయబడింది. ఆఫ్రికన్ నేషనలు కాంగ్రెసు (ఎ.ఎన్.సి.) వంటి జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు జాంబియా మద్దతు ఇవ్వడం కూడా భద్రతా సమస్యలను సృష్టించింది. సౌతు ఆఫ్రికన్ డిఫెన్సు ఫోర్సు వెలుపల దాడుల కారణంగా లక్ష్యాలను కోల్పోయింది.

ఆర్ధిక సమస్యలు

1970 లో ప్రపంచవ్యాప్తంగా రాగి ధర తీవ్రంగా క్షీణించిన కారణంగా జాంబియా ప్రధాన ఎగుమతి బాధించబడింది. రాగిని దూరాలలో ఉన్న మార్కెట్టుకు చేర్చడానికి అవసరమైన రవాణా వ్యయం అదనపు ఒత్తిడి కలిగించింది. జాంబియా ఉపశమనం కొరకు విదేశీ, అంతర్జాతీయ రుణదాతల సహాయం కొరకు దృష్టి మరలించింది. కానీ రాగి ధరలు మరింత పతనం కావడం పెరుగుతున్న రుణ భారం జాంబియాన్ని ఆ మరింత సమస్యలోకి త్రోసింది. 1990 ల మధ్య కాలానికి పరిమిత రుణ విముక్తి ఉన్నప్పటికీ జాంబియా తలసరి విదేశీ రుణం ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరింది.

ప్రజా ప్రభుత్వం

1990 జూను మాసంలో కౌండాకు వ్యతిరేకంగా తీవ్రం అయ్యాయి. 1990 నిరసనప్రదర్శన సమయంలో ప్రభుత్వదళాలు పలు నిరసనకారులను చంపింది. 1990 లో కౌండా తిరుగుబాటు నుండి ప్రాణాలతో తప్పించుకున్నాడు. 1991 లో ఆయన బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించడానికి అంగీకరించాడు. 1972 లో చోమా కమిషను ఆధ్వర్యంలో ఏకపార్టీ పాలనను ప్రవేశపెట్టబడింది. బహుళ పార్టీ ఎన్నికల తరువాత కౌండా కార్యాలయం నుండి తొలగించబడ్డాడు.

2000 వ దశకంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీపడింది. 2006-2007లో ఒకే స్థాయిలో ద్రవ్యోల్బణం కొనసాగి వాస్తవ జిడిపి వృద్ధి, వడ్డీరేట్లు తగ్గడం, వాణిజ్యస్థాయి అభివృద్ధి చెందింది. మైనింగులో విదేశీపెట్టుబడులు అధికరించాయి, ప్రపంచ రాగి ధరలు అధికరించాయి. దీని కారణంగా జాంబియాకు సహాయంచేసిన దాతలలో ఉత్సాహం ప్రవర్తించటానికి దారితీసింది, దేశంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది అధికరించింది.

భౌగోళికం

జాంబియా 
Zambia map of Köppen climate classification.

జాంబియా ఒక భూబంధిత దేశం. జాంబియాలో ఒక ఉష్ణ మండలీయ వాతావరణం ఉంటుంది. కొన్ని కొండలు, పర్వతాలతో ఎత్తైన పీఠభూమిలను కలిగి ఉంటుంది. ఇవి నది లోయలచే విడదీయబడ్డాయి. 7,52,614 చ.కి.మీ (290,586 చ.మై) వైశాల్యంతో ప్రపంచంలో 39 వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇది చిలీ కంటే స్వల్పంగా తక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. దేశం 8 డిగ్రీల నుండి 18 ° దక్షిణ అక్షాంశం, 22 ° నుండి 34 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది.

జాంబియాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి: మధ్యభాగం, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో జామ్బెజీ (కఫ్యూ హరిన్) ప్రవహిస్తుంది. ఇది దేశంలో నాల్గింట మూడువంతుల భూభాగానికి నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది. ఉత్తరంలో ఉన్న నాలుగవ భాగానికి కాంగోనది ముఖ్యద్వారం నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. ఈశాన్య భాగంలో టాంజానియాలోని రుక్వా సరసు ఒక చిన్న భూభాగానికి నీటి పారుదల అందిస్తుంది.

జాంబేజి ముఖద్వారంలో జాంబియ ద్వారా పూర్తిగా లేదా పాక్షికంగా ప్రవహించే అనేక ప్రధాన నదులు ఉన్నాయి: కంబోమ్పో, లుంగ్వేబుంగు, కాఫ్యూ, లువంగ్వా, జామ్బెజీ దేశం గుండా ప్రవహిస్తుంది. జాంబేజీ నదీప్రవాహం నమీబియా, బోత్సువానా, జింబాబ్వే దేశాలతో దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది. దీని మూలం జాంబియాలో ఉంది తరువాత అది అంగోలాకు దారి తీస్తుంది. అంగోలా కేంద్ర పర్వత ప్రాంతాలలో అనేక ఉపనదులు జన్మించాయి. కువాండో నది వరద మైదానం అంచు (దాని ప్రధాన ఛానల్ కాదు) జాంబియా నైరుతి సరిహద్దును ఏర్పరుస్తుంది. చోబే నదీతీరం ద్వారా నది చాలా బాష్పీభవనం తరువాత స్వల్పంగా జలాలను జాంబేజి నదికి అందిస్తుంది.

జాంబెజీ ఉపనదులలో కఫ్యూ, లుయాంగ్వా పొడవైన, అతిపెద్ద నదులుగా ఉన్నాయి. జంబేజీతో సంగమించే సమయంలో చిరుండు, లుయాంగ్వా పట్టణంలో జింబాబ్వే సరిహద్దును ఏర్పరుస్తుంటాయి. అది లుయాంగ్వ నది సంగమముకు ముందు లుయాంగ్వానది మొజాంబిక్తో జాంబియా సరిహద్దును ఏర్పరుస్తూ ఉంది. లుయాంగ్వా పట్టణం నుండి జంబాజీ నది జాంబియాను విడిచి మొజాంబికులో ప్రవేశిస్తుంది. చివరికి మొజాంబిక్ చానెల్లోకి వస్తుంది.

జాంబేజీ నదీ ప్రవాహాలు 1.6 కి.మీ (0.99 మై) వెడల్పు, 100 మీటర్ల (328 అడుగులు) ఎత్తు ఉన్న విక్టోరియా జలపాతం (దేశం నైరుతీ భాగంలో ఉంది) సృష్టించి తరువాత కరీబా సరసులోకి ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో ఉన్న జాంబేజీ లోయ లోతుగా విస్తారంగా ఉంటుంది. కరీబాసరసు నుండి లాయాంగ్వా, మ్వెరూ-లూయాపుల, మువెయు-వా-న్టిపా, తంగన్యిక లోయలు ఏర్పడతాయి.

జాంబియా ఉత్తరప్రాంతం విస్తారమైన మైదానాలతో చాలా చదునైనదిగా ఉంటుంది. పశ్చిమప్రాంతం జాంబేజీనది బారోస్జు వరద మైదానంగా గుర్తించబడుతుంది. డిసెంబరు నుండి జూను వరకు వరదలు సంభవిస్తుంటాయి. వార్షిక వర్షాకాలం (సాధారణంగా నవంబరు నుండి ఏప్రిలు వరకు) ఉంటుంది. ఈ వరద సహజ పర్యావరణం, నివాసులు, సమాజం, సంస్కృతి మీద ఆధిక్యత చేస్తుంది. దేశం అంతటా ఇతర చిన్న, వరద ప్రాంతాలు ఉన్నాయి.

తూర్పు జాంబియాలో జాంబేజి, తంగన్యిక సరసు లోయల మధ్య విస్తరించి ఉన్న పీఠభూమి ఉత్తరం వైపు వాలుతూ 900 మీ (2,953 అడుగులు) నుండి 1,200 మీ (3,937 అడుగులు) ఎత్తు వరకు క్రమంగా ఎత్తు అధికరిస్తూ మంబలా సమీపంలో 1,800 మీ (5,906 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ప్రపంచ " వైల్డ్ లైఫ్ ఫండ్ " ఉత్తర జాంబియా పీఠభూమి ప్రాంతాలను " సెంట్రలు జామ్బెజియాను మియాంబొ వుడు ల్యాండ్సు "గా వర్గీకరించింది.

తూర్పు జాంబియా గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది. లువంగ్వా లోయ సరిహద్దులో చీలి ఈశాన్య నుండి వైపుగా వంపు తిరిగి నైరుతి వైపు వంపుతిరిగి పీఠభూమి కేంద్రస్థానానికి పశ్చిమప్రాంతంలో వ్యాపించింది లంసెంఫ్వా నది లోతైన లోయకు చేరుకుంటుంది. లోయలో కొన్ని విభాగాలలో కొండలు పర్వతాలు ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్యంలో నైకా పీఠభూమి (2,200 మీ. లేదా 7,218 అడుగులు) ఇది మలావి సరిహద్దులో ఉండి జాంబియాలో మాఫింగా కొండగా విస్తరించింది. దేశంలోని ఎత్తైన ప్రదేశం మాఫింగా సెంట్రల్ (2,339 మీ. లేదా 7,674 అడుగులు).

లంకావా నది లోతైన లోయకు సమాంతరంగా ఉన్న మంబింగ్జీ, కాంగో ముఖద్వారాల మధ్య మంచింగ్ పర్వతాలు దాదాపుగా 1,700 మీ (5,577 అడుగులు) క్రింద ఉన్నప్పటికీ ఉత్తర సరిహద్దుకు నేపథ్యాన్ని ఏర్పరుస్తాయి. తూర్పు సరిహద్దు ప్రాంతం నుంచి దూరంగా ఉన్న జాంబియాలో ఎత్తైన శిఖరం ముండు 1,892 మీ (6,207 అడుగులు) ఎత్తులో ఉంటుంది. కాంగో పెడిల్లే సరిహద్దు ఈ పర్వతం ప్రాంతంలో ఉంది.

కాంగో నది దక్షిణ భాగం ప్రధానప్రవాహం జాంబియాలో జన్మిస్తుంది. మొదట ఉత్తర ప్రాంతం గుండా పశ్చిమంగా ప్రవహించి చంబెషీకి చేరి తరువాత కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్తులో సరిహద్దులో భాగమైన లుపులలా వలె బంగవేలు చిత్తడి నేలలు తరువాత. లవపులా ఉత్తరానికి తరువాత దక్షిణంగా ప్రవహించి తరువాత పశ్చిమానికి తిరుగి మ్వేరు సరసును చేరుకుంటుంది. ఈ సరస్సు ఇతర ప్రధాన ఉపనది కలుంగ్విషి నది తూర్పు నుండి ప్రవహిస్తుంది. లివౌవా నది మ్వేరు సరస్సులో సంగమిస్తుంది. ఇది లియలాబా నదికి (ఉత్తరం కాంగో నదికి) ఉత్తరం వైపు నుండి ప్రవహిస్తుంది.

టాంగ్యానికా సరసు కాంగో ముఖద్వారానికి చెందిన ఇతర ప్రధాన హైడ్రోగ్రాఫికు విశిష్ట లక్షణం కలిగి ఉంటుంది. దాని ఆగ్నేయ తీరం తుంజానియాతో జాంబియ సరిహద్దులో భాగమైన కలాబో నది నుండి నీటిని పొందుతుంది. ఈ నది ప్రవాహాలు ఆఫ్రికా రెండవ అతి ఎత్తైన జలపాతం కలాంబో జలపాతాన్ని సృష్టిస్తాయి.

వాతావరణం

జాంబియా మధ్య ఆఫ్రికా పీఠభూమిపై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1000-1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1200 మీటర్ల సగటు ఎత్తులో సాధారణంగా మితమైన వాతావరణం ఉంటుంది. జాంబియా వాతావరణం ఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది. ఎత్తులో మార్పులు ఉంటాయి. కొప్పెను శీతోష్ణస్థితి వర్గీకరణలో దేశంలోని అధికభాగం తేమతో కూడిన ఉప ఉష్ణ మండలీయ లేదా ఉష్ణమండల తడి, పొడిగా వర్గీకరించబడింది. నైరుతీలో జామ్బెజీ లోయలో అర్ధ- శుష్క స్టెప్పీ వాతావరణం ఉంటుంది.

రెండు ప్రధాన రుతువులు ఉంటాయి. వర్షాకాలం (నవంబరు నుండి ఏప్రిలు వరకు) వేసవి కాలం పొడి వాతావరణం (మే / జూన్ నుండి అక్టోబరు / నవంబరు వరకు), శీతాకాలంతో ఉంటాయి. పొడి కాలం చల్లని పొడి సీజన్ (మే / జూన్ నుండి ఆగస్టు వరకు), వేడి పొడి కాలం (సెప్టెంబరు నుండి అక్టోబరు / నవంబరు వరకు) ఉపవిభజన చేయబడింది. మే నుండి ఆగస్టు వరకు చలికాలం మార్పుల ప్రభావంతో ఉష్ణమండల వాతావరణం కంటే హ్లాదకరమైన ఉపఉష్ణమండల వాతావరణాన్ని ఇస్తుంది. దేశంలోని ఎక్కువ భాగంలో సంవత్సరానికి ఎనిమిది, అంతకంటే ఎక్కువ నెలలు సగటు నెలవారీ ఉష్ణోగ్రతలు 20 ° సెం (68 ° ఫా) కంటే ఎక్కువగా ఉన్నాయి.

జీవవైవిద్యం

దక్షిణ లుయాంగ్వా జాతీయ ఉద్యానవనంలో రోడేసియన్ జిరాఫీ
ఆఫ్రికన్ చేప డేగ, జాంబియా జాతీయ పక్షి
జాంబియా బార్బెట్, జాంబియా యొక్క ఏకైక నిజమైన పక్షి జాతి

జాంబియాలో 14 పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. ఫారెస్టు, తిక్కెట్టు. ఉడుల్యాండు, గ్రాసుల్యాండు వృక్షాలుగా విభజించారు.

జాంబియా సుమారుగా 12,505 జాతులలో (63%) జంతు జాతులు, 33% వృక్ష జాతులు, 4% బాక్టీరియలు సూక్ష్మజీవుల జాతులు ఉన్నాయి.

అడవిలో పుష్పించే మొక్కల 3,543 జాతులు ఉన్నాయి. వీటిలో సెడ్జెసు, హెర్బసియోసు, కలప వేక్షాలు ఉన్నాయి. దేశం ఉత్తర, వాయవ్య ప్రాంతాలలో పుష్పించే మొక్కలలో అత్యధిక వైవిధ్యం ఉంటుంది. సుమారుగా పుష్పించే మొక్కలు 53% ఉన్నాయి.[విడమరచి రాయాలి] ఇవి దేశం అంతటా కనిపిస్తాయి.

క్షీరద జాతులు మొత్తం 242 ఉనికిలో ఉన్నాయి. వీటిలో అంతరించి పోతున్న చాలా జంతువులు అడవులు, గడ్డిభూముల వ్యవస్థలను ఆక్రమించాయి. రోడెసియను జిరాఫీ, కఫ్యూ లెచ్వీ జాంబియాకు చెందిన కొన్ని ఉపజాతులు ఉన్నాయి.

757 పక్షి జాతులు ఉనికిలో ఉన్నాయని అంచనా వేయబడింది. వీటిలో 600 స్థానిక జాతులు, అప్రోట్రోపికు వలసదారులు. 470 జాతులు దేశంలోనే సంతానోత్పత్తి చేస్తాయి. 100 జాతులు సంతానోత్పత్తి చేయని వలస పక్షులు ఉంటాయి. జాంబియా బార్బెటు అనేది జాంబియాలో ప్రసిద్ధి చెందినది.

సుమారు 490 ప్రసిద్ధి చెందిన చేప జాతులు ఉన్నాయి. 24 చేప జాతి కుటుంబాలు జాంబియాకు చెందినవిగా ఉన్నాయి. టాంగ్యానికా సరసు వైవిధ్యభరితమైన చేప జాతులకు నివాసంగా ఉంది.

ఆర్ధికం

ప్రస్తుతం జాంబియా సంవత్సరానికి సగటు 7.5 - 8 బిలియన్ల డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. సుమారు 60.5% మంది జాంబియన్లు జాతీయ దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్నారని గుర్తించబడుతున్నారు. గ్రామీణ పేదరికం శాతం 77.9%, నగర పట్టణాల పేదరికం శాతం 27.5% ఉంది. పట్టణ ప్రాంతాలలో తీవ్ర సమస్యలు ఉన్నాయి. చాలామంది గ్రామీణ జాంబియన్లు వ్యవసాయం జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు.మూస:Recent Annual Budget Expenditure in Zambia

2007 గ్లోబల్ కాంపిటిటివిటీ జాబితా జాంబియా ఇటీవలి వార్షిక బడ్జెటు వ్యయం 128 దేశాలలో 117 వ స్థానంలో ఉందని తెలియజేసింది. ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అంశాలపై దృష్టి పెడుతుంది. సాంఘిక సూచికలు ఆధారంగా ఆయుఃపరిమితి సుమారు 40.9 సంవత్సరాలు, ప్రసూతి మరణాలు 1,00,000 గర్భాలలో 830. ఆర్ధిక వృద్ధి రేటు దేశం వేగవంతమైన జనాభా పెరుగుదల, ఆర్థిక వ్యవస్థపై ఎయిడ్సు సంబంధిత సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వదు.

1970 లలో అంతర్జాతీయ రాగి ధరలు క్షీణించిన తరువాత జాంబియా పేదరికంలోకి పడిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలలో అనేక విరమణ ప్రయత్నాలతో కూడిన సోషలిస్టు పాలన రూపొందించబడింది. ప్రధాన సరఫరా మార్గం ద్వారా రవాణా చేయడం, రైలు మార్గం ద్వారా రోడేషియా (1965 నుండి 1979 వరకు) అని పిలువబడేది (ప్రస్తుతం జింబాబ్వే అని పిలుస్తారు) - ఆర్థిక వ్యవస్థకు చాలా భారంగా మారినందున నిలిపి వేయబడింది. కౌండా పాలన తరువాత 1991 నుండి వచ్చిన వరుస ప్రభుత్వాలు పరిమిత సంస్కరణలను ప్రారంభించాయి. 1990 ల చివరి వరకు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. 2007 లో జాంబియా వరుసగా తొమ్మిదో ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2000 లో 30% నుండి ద్రవ్యోల్బణం 8.9% తగ్గించబడింది.

జాంబియా 
జాంబియా ఎగుమతి వృక్షం మ్యాపు (2014)

జాంబియా ఇప్పటికీ ప్రైవేటు రంగాల పరిమితి, జాంబియా సామాజిక రంగ పంపిణీ వ్యవస్థల మెరుగుపరచడం వంటి ఆర్థిక సంస్కరణల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆర్థిక నిబంధనలు, రెడ్ టేప్ విస్తృతంగా ఉన్నాయి. అవినీతి విస్తృతంగా ఉంది. లైసెన్సులను పొందే ప్రక్రియకు సంబంధించిన అధికార పద్ధతులు చెల్లింపులను సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. జాంబియా మొత్తం విదేశీ రుణం $ 6 బిలియన్లను అధిగమించింది. 2000 లో అత్యధిక రుణపడి ఉన్న పేద దేశాలలో ఇనిషియేటివ్ (హెచ్.ఐ.పి.సి.) రుణ విముక్తికి అర్హత సాధించింది. జాంబియా హెచ్.ఐ.పి.సి.ని పూర్తిచేసి 2003 చివరిలో రుణ క్షమాపణ నుండి గణనీయమైన ప్రయోజనం పొందడానికి కృషిచేయాలని కోరుకుంది.

జాంబియా 
పొరుగు దేశాలతో (ప్రపంచ సగటు = 100) పోలిస్తే తలసరి జి.డి.పి (ప్రస్తుత)

2003 జనవరిలో జాంబియా ప్రభుత్వం జాంబియా నేషనలు కమర్షియలు బ్యాంకు, జాతీయ టెలిఫోను, విద్యుత్తు వినియోగాలు ప్రైవేటీకరణ అంగీకరించిన సంస్థలతో తిరిగి సంప్రదించాలని కోరుకుంటున్నట్లు ఇంటర్నేషనలు మానిటరీ ఫండు, ప్రపంచ బ్యాంకుకు తెలియజేసింది. ఈ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ పౌర సేవా వేతనాల అధికవ్యయం కారణంగా హెచ్.ఐ.పి.సి ఋణ క్షమాపణ కాలం 2003 నుండి 2005 ప్రారంభం వరకు పొడిగించబడింది. 2004 లో HIPC పూర్తి అయ్యే ప్రయత్నంలో ప్రభుత్వం 2004 లో ఒక కాఠిన్యంతో కూడిన ఆర్థికప్రణాళికను రూపొందించింది. పౌర సేవా జీతాలపెరుగుదలను నిలుపు చేయడం అనేక పన్నులు పెంచడం ఇందులో భాగంగా ఉన్నాయి. పన్ను పెంపు, ప్రభుత్వ రంగ వేతనాలు పెరుగుదల నిలుపుదల చేస్టూ కొత్త ఉద్యోగ నియామకాలను నిషేధించడం 2004 ఫిబ్రవరిలో జాతీయ సమ్మెను ప్రేరేపించబడింది.

రాగి పరిశ్రమ మీద ఆర్థిక విశ్వాసాన్ని తగ్గించటానికి జాంబియా ప్రభుత్వం ఆర్థిక విభిన్నీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వ్యవసాయం, పర్యాటక రంగం, రత్నం త్రవ్వకాలు, జల-శక్తిని ప్రోత్సహించడం ద్వారా జాంబియా " రిచ్ రిసోర్సు బేసు " ఇతర భాగాలను అధికంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. 2018 జూలైలో టర్కీ అధ్యక్షుడు " రెసెప్ టయిప్ ఎర్డోగాన్ " జాంబియా అధ్యక్షుడు " ఎడ్గారు లున్గుడు " లౌసాకాలో 12 ఒప్పందాల మీద సంతకం చేశారు. వాణిజ్య, పెట్టుబడుల నుండి పర్యాటక, దౌత్య కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

గనులు

జాంబియా ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకంగా రాగి త్రవ్వకాల పరిశ్రమపై ఆధారపడి ఉంది. పెట్టుబడి లేకపోవడం, రాగి ధరలు తగ్గడం, ప్రైవేటీకరణపై అనిశ్చితి కారణంగా ఉత్పత్తిలో 30 సంవత్సరాల క్షీణత తర్వాత 1998 లో రాగి ఉత్పత్తి 2,28,000 మెట్రికు టన్నులకు తగ్గింది. 2002 లో పరిశ్రమ ప్రైవేటీకరణ తరువాత రాగి ఉత్పత్తి 3,37,000 మెట్రికు టన్నులకు అధికరించింది. ప్రపంచ రాగి మార్కెట్లో మెరుగుదలలు ఆదాయం, విదేశీ మారకం ఆదాయాలు ఈ వాల్యూం పెరుగుదల ప్రభావాన్ని వృద్ధి చేశాయి.

జాంబియా 
ప్రధాన న్కానా ఓపెన్ రాగి గని, కిట్వే

2003 లో లోహేతర ఎగుమతులు 25% అధికరించాయి. మొత్తం ఎగుమతి ఆదాయంలో 38% (గతంలో 35%గా నమోదయింది). జాంబియా ప్రభుత్వం ఇటీవలే నికెలు, టిను, రాగి, యురేనియం వంటి ఖనిజాల కోసం అవకాశాల కోసం అంతర్జాతీయ వనరుల సంస్థలకు లైసెన్స్లను మంజూరు చేసింది. నికెలు రాగి నుంచి దేశం అగ్ర లోహపు ఎగుమతిగా నిలుస్తుంది. 2009 లో జాంబియా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది.

వ్యవసాయం

జాంబియా ఆర్థిక వ్యవస్థలో మైనింగు పరిశ్రమ కంటే వ్యవసాయ రంగం చాలా ఎక్కువ ఉద్యోగాలను అందిస్తుంది. రాబర్టు ముగాబే చేత బహిష్కరించబడిన కొద్దిమంది శ్వేతజింబాబ్వే రైతులు జాంబియా ఆదరించింది. వీరి సంఖ్య 2004 నాటికి దాదాపు 150 నుండి 300 మందికి చేరుకుంది. వారు పొగాకు, గోధుమ, మిరపకాయలతో సహా వివిధ రకాల పంటలను 150 ఎకరాలలో పండిస్తుంటారు. జాంబియా అధ్యక్షుడు లెవీ మ్వానవాసా చేపట్టిన ఆర్థిక సరళీకరణతో రైతుల నైపుణ్యాలు కలిసి జాంబియాలో వ్యవసాయ విజృంభణను ప్రేరేపించాయి. 2004 లో 26 సంవత్సరాలలో మొట్టమొదటి సారి జాంబియా దిగుమతి చేసుకున్నదాని కంటే ఎక్కువ మొక్కజొన్నను ఎగుమతి చేసింది.

పర్యాటకం

జాంబియా 
Victoria Falls (Mosi-oa-Tunya Falls) a UNESCO World Heritage Site
జాంబియా 
The Kuomboka ceremony of the Lozi people

జాంబియాలో అత్యుత్తమ వన్యప్రాణి, గేమ్ రిజర్వులు సమృద్ధిగా పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర లుయాంగ్వా, దక్షిణ లుయాంగ్వా కఫ్యూ నేషనలు పార్క్సు ఆఫ్రికాలో అత్యంత సుసంపన్నమైన జంతుజాలం కలిగిన ప్రదేశాలుగా ఉన్నాయి. దేశం దక్షిణ భాగంలో విక్టోరియా జలపాతం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది.

73 జాతి సమూహాలు ఉన్న కారణంగా ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయ వేడుకలు కూడా అనేకం ఉన్నాయి.

విద్యుత్తు

2009 లో జాంబియాలో 10.3 TWh విద్యుత్తు ఉత్పన్నమైంది. సౌర శక్తి, హైడ్రోఎలక్ట్రిసిటి రెండింటిలోనూ అత్యధికంగా విద్యుత్తు ఉత్పత్తి చేయబడింది. 2015 నాటికి జాంబియా 2014,2015 సంవత్సరాలలో పేలవమైన వర్షపాతం కారణంగా తీవ్రమైన విద్యుత్తు కొరతను ఎదుర్కొంది. ఇది కరీబా ఆనకట్ట, ఇతర ప్రధాన ఆనకట్టలలో నీటి స్థాయి తక్కువగా ఉన్నందున ఇది సంభవించింది.

గణాంకాలు

జాంబియా జనాభా లెక్కల ఆధారంగా జాంబియా జనసంఖ్య 1,30,92,666. జాంబియా జాతిపరంగా వైవిధ్యభరితంగా ఉంటుంది. దేశంలో మొత్తం 73 జాతులు ఉన్నాయి. 1911 - 1963 మధ్యకాలంలో బ్రిటిషు ఆక్రమణ సమయంలో దేశం ఐరోపా, ఉపఖండం నుండి వచ్చిన వలసదారులను ఆకర్షించింది. వీరిలో కొంత మంది ప్రత్యేకంగా కార్మికులుగా వచ్చారు. శ్వేతజాతీయుల పాలన కూలిపోయిన తరువాత చాలామంది ఐరోపియన్లు దేశంవిడిచి పోయినప్పటికీ ఆసియన్లు చాలా మంది ఇప్పటికీ ఇక్కడే స్థిరపడ్డారు.

జాంబియా 
ముతాంబొకో వేడుకకు ప్రారంభం చేస్తున్న చీఫ్ మవాతా కజెంబే

1911 మే 7 న నిర్వహించిన మొదటి జనాభా గణాంకాల సేకరణలో 1,497 మంది యూరోపియన్లు, 39 మంది ఆసియాప్రజలు, 8,20,000 ఆఫ్రికన్లు ఉన్నారని అంచనా. 1911, 1921, 1931, 1946, 1951, 1956 లలో స్వతంత్రానికి ముందు నిర్వహించిన ఆరు జనాభా గణాంకాల సేకరణలో నల్లజాతి ఆఫ్రికన్లు లెక్కించబడలేదు. 1956 నాటికి స్వాతంత్ర్యం ముందుగా జరిగిన చివరి గణాంకాలలో నిర్వహించినప్పుడు 65,277 యూరోపియన్లు, 5,450 ఆసియన్లు, 5,450 కలరెడ్లు, 2,100,000 మంది ఆఫ్రికన్లు అంచనా వేశారు.

2010 జనాభా గణాంకాల సేకరణలో 98.2% మంది నల్ల ఆఫ్రికన్లు, మిగిలిన ప్రధానజాతులకు చెందిన ప్రజలు 1.8% ఉన్నారు.

ఉప-సహారా ఆఫ్రికాలో అత్యంత ఎక్కువ పట్టణీకరణ కలిగిన దేశాలలో జాంబియా ఒకటి. ప్రధాన రవాణా కారిడార్లలో కొన్ని పట్టణ ప్రాంతాలలో 44% జనాభా కేంద్రీకృతమై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జనసంఖ్య తక్కువగా ఉంటుంది. 2007 నాటికి సగటు సంతానోత్పత్తి శాతం 6.2 (1996 లో 6.1, 2001 లో 5.9).

పెద్ద నగరాలు

1920 ల చివరిలో కాపరు బెల్టులో పారిశ్రామికంగా రాగిగనుల త్రవ్వకం ప్రారంభమైన తరువాత వేగవంతమైన కేంద్రీకృత పట్టణీకరణ ప్రారంభమైంది. వలసరాజ్యాల కాలంలో పట్టణీకరణ స్థాయిలు ఎక్కువగా అంచనా వేసినప్పటికీ అది పరిమితంగానే ఉంది. కాపరుబెల్టులో మైనింగు టౌనుషిప్పు త్వరలోనే ప్రస్తుత జనాభా కేంద్రాలుగా ఎదిగాయి. జాంబియన్ స్వాతంత్ర్యం తరువాత మరింత వేగంగా అభివృద్ధి చెందాయి. 1970 ల నుండి 1990 ల వరకు కాపరుబెల్టు ఆర్థిక తిరోగమనం పట్టణ అభివృద్ధి నమూనాలను మార్చింది. దేశం జనాభా కాపరుబెల్టు నుండి కాపిరి మోపొషి, లుసాకా, చోమా, లివింగుస్టనుల నుండి దక్షిణప్రాంతాలకు నడుస్తున్న రైల్వే, రహదారుల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.

సంప్రదాయ సమూహాలు

జాంబియాలో సుమారు 73 జాతి సమూహాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం బంటు-మాట్లాడేప్రజలు ఉన్నారు. దాదాపు 90% జాంబియా దేశస్థులు తొమ్మిది ప్రధాన జాతి శాస్త్రవేత్తల సమూహాలకు (నైయాన్జా-చేవా, బెంబా, టాంకా, టంపూకా, లుండా, లువాల్, కాండే, నికోయ, లోజీ) చెందినవారై ఉన్నారు. గ్రామీణప్రాంతంలో ఒక్కొక జాతి సమూహం దేశం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అనేక సమూహాలు చాలా చిన్నవిగా ఉండి గుర్తింపు లేకుండా ఉంటాయి. లుసాకా, కాపరుబెల్టులలో అన్ని జాతి సమూహాలను గణనీయమైన సంఖ్యలో గుర్తించవచ్చు. జాంబియాలో గిరిజన గుర్తింపులు భాషావైవిధ్యం మీద ఆధారితమై ఉంటాయి. ఈ గిరిజన గుర్తింపులు తరచూ కుటుంబం అనుయాయత, సాంప్రదాయ అధికారులతో ముడిపడి ఉంటాయి. గిరిజన గుర్తింపులు ప్రధాన భాషా సమూహాలతో అనుసంధానితమై ఉంటాయి.

జాంబియా 
జాంబియా గిరిజన, భాషా పటం

వలసదారులు ఎక్కువగా బ్రిటీషు, దక్షిణాఫ్రికా, అలాగే బ్రిటీషు సంతతికి చెందిన శ్వేతజాతి జాంబియన్ పౌరులు, ప్రధానంగా లుసాకాలో, ఉత్తర జాంబియాలోని కాపరు చెల్టులలో నివసిస్తున్నారు. ఇక్కడ వారు గనులు, ఆర్థిక సంబంధిత కార్యకలాపాలలో ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ చేసిన వారు నివసిస్తున్నారు. 1964 లో జాంబియాలో 70,000 ఐరోపియన్లు ఉన్నారు. కానీ తరువాత చాలామంది దేశం నుండి నిష్క్రమించారు.

జాంబియా ఒక చిన్న కానీ ఆర్థికంగా ముఖ్యమైన ఆసియా జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది భారతీయులు, చైనీయులు ఉన్నారు. జాంబియాలో 13,000 మంది భారతీయులు ఉన్నారు. ఈ మైనారిటీ గ్రూపు ఉత్పాదక రంగంపై నియంత్రణను ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపుతుంది. జాంబియాలో సుమారు 80,000 మంది చైనీస్లు నివసిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో అనేక వందలమంది శ్వేతజాతి రైతులు జాంబియా ప్రభుత్వం ఆహ్వానం అందుకొని జింబాబ్వేను వదిలి దక్షిణ ప్రావింసులో తోటలపంపకం చేపట్టారు.

జాంబియాలో ఆఫ్రికా, బ్రిటీషు నేపథ్యం నుంచి వచ్చిన మిశ్రమజాతి ప్రజలు ఉన్నారు. భారతీయ తండ్రులు, నల్ల జాంబియా తల్లుల మధ్య సంబంధాల ఫలితంగా అల్పసంఖ్యాక మిశ్రమజాతి ప్రజలు కూడా ఉన్నారు. వలసవాదం సమయంలో, పాఠశాలలు, ఆసుపత్రులు, గృహాలలో సహా బహిరంగ ప్రదేశాల్లో మిశ్రమజాతీయులను,, నల్లజాతీయులు, శ్వేతజాతీయులు వేరుచేయబడ్డారు. జాంబియాలో ఎక్కువ భాగం మిశ్రమజాతి ప్రజలలో బ్రిటిషు పురుషులు, జాంబియన్ స్త్రీల సంతానం అయినప్పటికీ, ఇతర మిశ్రమజాతి కుటుంబాలలో వివాహం చేసుకోవడం కొనసాగింది, జాంబియా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ చైనా, ఇతర ఐరోపా దేశాల వంటి ఇతర జాతిప్రజలు వచ్చిన కారణంగా జాత్యాంతర సంబంధాలు అధికరించాయి. ఒక కొత్త మొదటి తరం మిశ్రమజాతి పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. మిశ్రమజాతి ప్రజలు ప్రస్తుతం జనాభా గణనలో నమోదు చేయబడనప్పటికీ జాంబియాలో అల్పసంఖ్యాక ప్రజలుగా పరిగణించబడుతున్నారు.

" యు.ఎస్. కమిటీ ఫర్ రెఫ్యూజీ & ఇమ్మిగ్రెంట్సు " ప్రచురించిన 2009 ప్రపంచ రెఫ్యూజీ సర్వే ఆధారంగా జాంబియాలో సుమారు 88,900 మంది శరణార్ధులు ఉన్నారని భావిస్తున్నారు. దేశంలో శరణార్థులు ఎక్కువ మంది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (2007 లో జాంబియాలో నివసిస్తున్న 47,000 మంది శరణార్థులు), అంగోలా (27,100; జాంబియాలో అంగోలియన్లు), జింబాబ్వే (5,400) రువాండా (4,900) ఉన్నారు.

2008 మేలో మొదలై జాంబియాలో జింబాబ్వేయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దక్షిణాఫ్రికాలో గతంలో నివసిస్తున్న జింబాబ్వేవాసులు, అక్కడ జాతిహింసలకు భీతిచెంది పారిపోయి వచ్చిన వారు ఉన్నారు. దాదాపు 60,000 శరణార్థులు జాంబియాలోని శరణార్ధుల శిబిరాల్లో నివసిస్తున్నారు. అయితే 50,000 మంది స్థానిక జనాభాతో కలిసి ఉన్నారు. జాంబియాలో పని చేయాలనుకునే శరణార్థులు అధికారిక అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. ఇది సంవత్సరానికి $ 500 అమెరికా డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.

మతం

1996 రాజ్యాంగం ప్రకారం జాంబియా అధికారికంగా ఒక క్రిస్టియన్ దేశం, అయినప్పటికీ జాంబియాలో అనేక మతసంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయిక మతపరమైన ఆలోచనలు " సింక్రిటిక్ చర్చిలలో అధికంగా క్రైస్తవ విశ్వాసాలతో సులభంగా మిళితం ఔతుంటాయి. సుమారు మూడొంతులు మంది జనాభా ప్రొటెస్టంట్లుగా ఉన్నారు. 20% మంది రోమను కాథలిక్కు మతాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవ వర్గీకరణలలో కాథలిక్కులు, ఆంగ్లికనిజం, పెంటెకోస్టలిజం, న్యూ అపోస్టోలికు చర్చి, లూథరనిజం, యెహోవాసాక్షులు, సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చి, చర్చి ఆఫ్ జీససు క్రైస్టు ఆఫ్ లేటర్-డే సెయింట్సు, బ్రానుహామిట్లు, ఎవాంజెలికల్ తెగల వివిధ రకాలు ఉన్నాయి.

మొట్టమొదటి మిషినరీ స్థావరాలు (పోర్చుగీసు, తూర్పున మొజాంబిక్ నుండి కాథలిక్కులు), దక్షిణం నుండి ఆంగ్లికనిజం (బ్రిటీషు ప్రభావాలు) నుండి సర్దుబాటుతో అభివృద్ధి చెందాయి. కొన్ని సాంకేతిక స్థానాలకు మినహాయించి (ఉదాహరణకు వైద్యులు), పాశ్చాత్య మిషనరీలు స్థానిక విశ్వాసులు అంగీకారం పొందాయి. ఫ్రెడెరికు చిలబా (పెంటెకోస్టలు క్రిస్టియను) 1991 లో ప్రెసిడెంటు అయ్యాక పెంటెకోస్టలు సమ్మేళనాలు దేశవ్యాప్తంగా గణనీయంగా విస్తరించాయి. సంఖ్యాపరంగా సెవెన్ట్-డే అడ్వెంటిస్టులు శాతంలో జాంబియా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 18 జాంబియన్లలో ఒకరు సెవెంటు డే అడ్వెంటిస్టు ఉన్నారు. లూథరను చర్చి ఆఫ్ సెంట్రలు ఆఫ్రికాలో దేశంలో 11,000 మంది సభ్యులు ఉన్నారు.

కేవలం క్రియాశీల ప్రచారకులను లెక్కించడం, జాంబియాలోని యెహోవాసాక్షులు 2018 లో క్రీస్తు మరణం వార్షిక ఆచరణకు 9,30,000 మంది హాజరయ్యారు. ఈ మతాన్ని 2,04,000 మందికంటే అధికమైన అనుచరులు ఉన్నారు. జాంబియాలో ఈ మతం 1911 నుండి బోధించబడుతుంది.

న్యూ అపొస్టోలికు చర్చిలో 11,200 మంది జాంబియన్లు సభ్యులుగా ఉన్నారు.[ఆధారం చూపాలి] జాంబియా డిస్ట్రిక్టు ఆఫ్ చర్చిలో 1,200,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ చర్చి ప్రంపంచంలో (కాంగో ఈస్టు, తూర్పు ఆఫ్రికా (నైరోబి) మూడవ అతిపెద్ద చర్చిగా ఉంది.[ఆధారం చూపాలి]

జాంబియా బహాయి జనాభా 1,60,000 ఉంటుంది. (జనాభాలో 1.5% పైగా) ఉంది. బహాయి సమాజంచే నిర్వహించబడుతున్న విలియం మ్యుంటిలు మాసెల్లా ఫౌండేషను ముఖ్యంగా అక్షరాస్యత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాంతాలలో చురుకుగా ఉంటుంది. జనాభాలో దాదాపు 1% మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో చాలామంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. దేశంలో ఆర్థికరంగంలో వీరు ప్రధానపాత్రను పోషిస్తున్నారు. జాంబియాలో అహ్మదియ వర్గానికి చెందిన 500 మంది ప్రజలు ఉన్నారు. జాంబియాలో ఒక చిన్న యూదు సమాజం కూడా ఉంది.

భాషలు

జాంబియా అధికారిక భాష ఆంగ్లం. ఇది అధికారికంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది. పాఠశాలల్లో బోధన మాధ్యమంగా ఉంది. ప్రధాన స్థానిక భాషలుగా (ప్రత్యేకించి లుసాకాలో) న్యాంజ (చెవా), తరువాత బెంబా. కాపరుబెల్టు బెంబాలో ప్రధాన భాషగా ఉంటుంది. రెండవ భాషగా న్యాన్జా ఉంది. జాంబియాలోని నగరప్రాంతాలలో సాధారణంగా వాడుకలో ఉన్న ఇతర దేశీయ భాషలతో బెంబా, న్యాన్జా భాషలు వాడుకలో ఉన్నాయి. స్థానిక భాషలలో లాజి, కాండే, టోంగా, లుండా, లువాలు భాషలు ఉన్నాయి. వీటి వివరణలు జాంబియా " నేషనలు బ్రాడ్కాస్టింగు కార్పోరేషను (ZNBC)" స్థానిక భాషల విభాగం పర్యవేక్షిస్తుంది. జాంబియాలో మాట్లాడే మొత్తం భాషల సంఖ్య 73.

పట్టణీకరణ ప్రక్రియ స్థానిక దేశీయ భాషలలో ఇతర ఆంగ్ల భాషలలోని పదాల సమష్టితో, స్థానిక భాషలలో కొంత నాటకీయ ప్రభావాన్ని కలిగి ఉంది. నగర నివాసులు కొన్నిసార్లు గ్రామీణ భాషలను 'లోతైన' భాషలుగా భావిస్తారు. ఒకే భాష పట్టణ, గ్రామీణ మాండలికాల మధ్య విభేదం కనిపిస్తుంది.

కాపరు బెల్టులో చాలామంది ఈ విధంగా బెంబా, న్యాన్జా మాట్లాడతారు. లుజానా, తూర్పు జాంబియాలో ప్రధానంగా నిన్జా మాట్లాడతారు. ఇంగ్లీషు అధికారిక సంభాషణలలో ఉపయోగించబడుతుంది. ఇప్పుడు గృహాలకు పరిమితమైంది. ఇప్పుడు సాధారణ - ఇంటర్ట్రిబలు కుటుంబాలకు పరిమితం అయింది. భాషల ఈ నిరంతర పరిణామం లాంసాకా, ఇతర ప్రధాన నగరాల అంతటా రోజువారీ జీవితంలో వినిపించే జాంబియన్ యాసకు దారితీసింది. పోర్చుగీసు భాష మాట్లాడే అంగోలా సమాజం ఉనికి కారణంగా పోర్చుగీసును పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టారు. ఫ్రెంచి సాధారణంగా ప్రైవేటు పాఠశాలల్లో అధ్యయనం చేయబడుతుంది. కొన్ని సెకండరీ పాఠశాలలు దీనిని ఒక ఐచ్ఛిక విషయంగా అభ్యసించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఒక జర్మను కోర్సు కూడా ప్రవేశపెట్టబడింది.

విద్య

జాంబియా 
Pupils at the St Monicas Girls Secondary School in Chipata, Eastern Province

జాంబియా రాజ్యాంగంలో ప్రజలందరికి సమాన, తగిన విద్య అభ్యసించడానికి హక్కు పొందుపరచబడింది. 2011 లో క్రమబద్ధీకరించబడిన విద్యావిధానం సమాన, నాణ్యమైన విద్యను అందించాలని తెలియజేసింది. విద్యా మంత్రిత్వశాఖ విధానం, క్రమబద్దీకరణ ద్వారా నాణ్యమైన విద్యను అందించడాన్ని మంత్రిత్వ శాఖ సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది.

ప్రాథమికంగా జాంబియాలో విద్య విధానం అందరు అభ్యాసకుల భౌతిక, మేధో, సామాజిక, ప్రభావవంతమైన, నైతిక, ఆధ్యాత్మిక విధానాలతో కూడిన పూర్తి, సంపూర్ణ అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకుని జాంబియాలో విద్యావిధానానికి వార్షికం వ్యయం చేయబడుతుంది. విద్యా వ్యవస్థ విస్తృతంగా మూడు ప్రధాన నిర్మాణాలు కలిగి ఉంది: ప్రారంభ బాల్య విద్య, ప్రాథమిక విద్య (తరగతులు 1 - 7), సెకండరీ విద్య (తరగతులు 8 - 12), తృతీయ విద్య. అంతేకాక, అర్ధ-అక్షరాస్యత, నిరక్షరాస్యులైన వ్యక్తులు కోసం అడల్టు అక్షరాస్యత కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.

విద్య కొరకు ప్రభుత్వం వార్షిక వ్యయం సంవత్సరాలలో 16.1% (2006) నుండి 20.2%కి (2015) పెరిగింది.

ఆరోగ్యం

జాంబియా ఒక సాధారణ ఎయిడ్సు అంటువ్యాధిని అనుభవిస్తున్న ఆఫ్రికా దేశాలలో ఒకటిగా ఉంది. ఇది పెద్దవారిలో 12.40% ఎయిడ్సు వ్యాప్తి ఉంటుంది. 2007 లో 1,00,000 మందిలో 591 శిశుమరణాలు సంభవించగా, 2014 లో మరణించిన వారి సంఖ్య 1,00,000 లో 398 గా ఉంది. అదే కాలంలో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు 1000 మందిలో 75 కు తగ్గించబడింది. 2001- 02 లో 16% నుండి 2013-2014లో 15-49 మధ్య వయస్కులలో ఎయిడ్సు ప్రాబల్యం శాతం 13% తగ్గింది.

సంస్కృతి

జాంబియా 
Nshima (top right corner) with three types of relish.

ఆధునిక జాంబియా స్థాపనకు ముందు స్థానికులు స్వతంత్ర తెగలుగా నివసించారు. వీరిలో ప్రతి ఒక్కరూ స్వంత జీవితాన్ని కలిగి ఉన్నారు. వలసరాజ్యాల ఫలితాలలో ఒకటి పట్టణీకరణ పెరుగుదల. వివిధ జాతుల సమూహాలు పట్టణాలు, నగరాలలో కలిసి జీవిస్తూ, ఒకరిని ఒకరు ప్రభావితం చేసారు. అలాగే ఐరోపా సంస్కృతికి కూడా అధికంగా దత్తత తీసుకున్నాయి. స్వచ్ఛమైన సంస్కృతులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో మనుగడలో ఉన్నాయి. పట్టణ నేపథ్యంలో ఈ సంస్కృతుల నిరంతర ఏకీకరణ, పరిణామం చెందిన సంస్కృతి ప్రస్తుతం "జాంబియన్ సంస్కృతి" అని పిలవబడుతుంది.

జాంబియా 
ఎ యోమ్బే శిల్పం, 19 వ శతాబ్దం

మిశ్రమజాతీయుల వార్షిక జాంబియన్ సాంప్రదాయ వేడుకలలో సాంప్రదాయం, సంస్కృతి బాగా కనిపిస్తుంది. కుంబోబా, నంవాలా (తూర్పు ప్రావిన్సు), లివినిది, షిమనంగా (దక్షిణ ప్రావిన్సు), లుండా లుబాన్జా (నార్తు వెస్ట్రను), లికుంమి లిమాజ్జు (నార్తు వెస్ట్రను), మొబుండా లక్వాక్వా (నార్తు వెస్ట్రను ప్రావిన్సు), చిబ్వేలా కుమాషి (సెంట్రలు ప్రావిన్సు), వింఖాకనింబా (మచిన్యా ప్రావిన్సు), ఉకుసేఫయ పే న్గవేనా (ఉత్తర ప్రావిన్సు).

పాపులరు సంప్రదాయ కళలలో మృణ్మయ, బుట్ట (టోంగా బాస్కెట్లు), బల్లలు, బట్టలు, చాపలు, చెక్క బొమ్మలు, దంత శిల్పాలు, వైరు అల్లికలు, రాగి కళలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. చాలా జాంబియన్ సంప్రదాయ సంగీతం డ్రంసు (ఇతర పెర్క్యుషను సాధన) ఆధారంగా పాడటం, నృత్యం చేయడంతో కూడి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో విదేశీ సంగీత రంగాలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా కాంగోలస్ రుంబ, ఆఫ్రికన్-అమెరికన్ మ్యూజికు, జమైకన్ రెగె. విచ్, ముసి-ఓ-తున్య, రిక్కి ఇలిలోంగ, అమనాజు, ది పీసు, క్రిసీ జబ్బి టమ్బో, బ్లాక్ఫుటు, 1970 లలో అనేక మనోధర్మి రాక్ కళాకారులు నాగోజీ ఫ్యామిలీ వంటి జామ్-రాక్ గా పిలువబడే ఒక కళా ప్రక్రియను ఆవిష్కరించారు.

మాధ్యమం

" ఇంఫర్మేషను, బ్రాడ్కాస్టింగు సర్వీసెసు అండు టూరిజం ఇన్ జాంబియా " జాంబియా న్యూసు ఏజెన్సీకి బాధ్యత వహిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు కూడా ఉన్నాయి; టెలివిజన్ స్టేషన్లు, వార్తాపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, ఇంటర్నెటు న్యూసు వెబ్సైట్లు.

క్రీడలు

1964 వేసవి ఒలింపిక్సు వేడుక ముగింపు రోజున జాంబియా స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. తద్వారా ఒక ఒలింపికు క్రీడలలో ఒక దేశంగా ప్రవేశించి వెళ్ళేసమయంలో మరొక దేశంగా వెలుపలకు పోయిన మొట్టమొదటి దేశం అయింది. 2016 లో జాంబియా ఒలింపికు క్రీడలలో 13 వ సారి పాల్గొంది. రెండు పతకాలు గెలిచాయి. అథ్లెటిక్సు, బాక్సిగులలో పతకాలు సాధించుకుంది. 1984 లో కీతు మ్విలా కాంస్య పతకం గెలుచుకున్నాడు. 1996 లో శామ్యూలు మ్యాటేటు 400 మీటర్ల హర్డిలులో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జాంబియా వింటరు ఒలింపిక్సులో ఎన్నడూ పాల్గొనలేదు.

జాంబియాలో ఫుటు బాలు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. జాంబియా జాతీయ ఫుట్బాలు జట్టు ఫుట్బాలు క్రీడలో కొన్ని ప్రత్యేక విజయాలు సాధించింది. 1988 లో సియోలులో జరిగిన ఒలంపిక్సులో జాతీయ జట్టు 4-0 స్కోరుతో ఇటాలీ జాతీయ జట్టును ఓడించింది. జాంబియా అత్యంత ప్రసిద్ధి చెందిన ఫుట్బాలు క్రీడాకారుడు, ఆఫ్రికా చరిత్రలో గొప్ప ఫుట్ బాలు క్రీడాకారులలో ఒకరు అయిన కలుష బ్వల్వాయా ఈ మ్యాచులో హ్యాట్రికు సాధించాడు. అయినప్పటికీ ఈ రోజు వరకు చాలామంది నిపుణులు జాంబియా ఏర్పాటు చేసిన ఎన్నడూ లేనంత గొప్ప బృందం 1993 ఏప్రెలు 28 న లిబ్రేవిల్లే (గాబన్లో) జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించింది. అయినప్పటికీ 1996 లో అధికారిక ఫిఫా ప్రపంచ ఫుట్బాలు టీము వర్గీకరణలో జాంబియా 15 వ స్థానంలో నిలిచింది. ఇది దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన జట్టు సాధించిన అత్యధిక స్కోరుగా గుర్తించబడింది. 2012 లో జాంబియా (గతంలో రెండుసార్లు ఫైనలులో ఓడిపోయిన తరువాత) మొదటిసారిగా ఆఫ్రికా కప్పు ఆఫ్ నేషన్సు " లో విజయం సాధించింది. ఫైనలులో జరిగే పెనాల్టి షూటు అవుట్లో కోటు డి ఐవోరీని వారు 8-7తో ఓడించారు. 19 సంవత్సరాల క్రితం విమాన ప్రమాదం సంభవించిన ప్రాంతానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న లిబ్రేవిల్లెలో ఈ క్రీడలు నిర్వహించబడ్డాయి.

రగ్బీ యూనియను, బాక్సింగు, క్రికెటు జాంబియాలో కూడా ప్రసిద్ధ క్రీడలుగా ఉన్నాయి. ముఖ్యంగా 2000 ల ప్రారంభంలో ఒకే సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జాతీయ రగ్బీ జట్లు ఒకే లుసాకా హాస్పిటలులో జన్మించిన జార్జి గ్రెగాను, కార్నేలను క్రిగెలులో కెప్టెన్లుగా నియమించబడ్డారు. జాంబియా ప్రపంచంలోని అత్యధిక రగ్బీ పోల్సులను (లువాన్షయాలోని లువాన్షయ స్పోర్ట్సు కాంప్లెక్సు వద్ద ఉంది) కలిగి ఉందని సగర్వంగా చెప్పుకుంటున్నది.[ఆధారం చూపాలి]

జాంబియాలో రగ్బీ యూనియను చిన్నదైనప్పటికీ అభివృద్ధి చెందుతున్న క్రీడగా ఉంది. వారు ప్రస్తుతం ఐ.ఆర్.బి. వర్గీకరణలో 73 వ స్థానంలో ఉన్నారు. ఇందులో 3,650 క్రీడాకారులు నమోదు చేయబడ్డారు. అధికారికంగా నిర్వహించబడే మూడు క్లబ్బులు ఉన్నాయి. జాంబియా రోడేషియాలో భాగంగా క్రికెట్టు క్రీడలో పాల్గొంటున్నది. 2008 లో జాంబియాలో జన్మించిన ఎడ్డీ టాంపో జాంబియా ఐర్లాండుతో షినిటీ / హర్లింగ్ ఆట రాజీ నియమాలపై స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు.

2011 లో జాంబియా " 10 వ ఆల్ ఆఫ్రికా " ఆతిథ్యం ఇవ్వడానికి న్దోలా, లివింగుస్టన్లలో మూడు స్టేడియంలను నిర్మించింది. లుసాకా స్టేడియం 70,000 ప్రేక్షకులు సందర్శించకలిగిన సామర్ధ్యం ఉంటుంది. మిగిలిన రెండు స్టేడియంలలో 50,000 ప్రేక్షకులు సందర్శించకలిగిన సామర్ధ్యం ఉంటుంది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ నిధుల కొరత కారణంగా క్రీడల సౌకర్యాల నిర్మించడానికి ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోంది. జాంబియా 2011 ఆల్-ఆఫ్రికా క్రీడలను నిధుల కొరతగా పేర్కొంటూ బిడ్డును రద్దు చేసింది. అందువల్ల మొజాంబిక్ జాంబియా హోస్టు బాధ్యత తీసుకుంది.

జాంబియాకు చెందిన మాడలిత్సో ముతియా " యునైటెడు స్టేట్సు గోల్ఫు ఓపెను " లో (4 నాలుగు ప్రధాన గోల్ఫ్ టోర్నమెంటు) లోఆడటానికి అర్హత సాధించిన మొట్టమొదటి నల్ల ఆఫ్రికా జాతీయుడుగా గుర్తింపు పొందాడు.

1989 లో జాంబియా బాస్కెట్టు బాలు జట్టు ఎ.ఐ.బి.ఎ. ఆఫ్రికా చాంపియన్షిప్పుకు అర్హత సాధించి అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి తద్వారా ఆఫ్రికా అత్యున్నత 10 జట్లలో ఒకటిగా నిలిచింది.

2017 లో జాంబియా పాన్-ఆఫ్రికా ఫుట్బాలు టోర్నమెంటు, యు-20 ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి (20 అంతకంటే తక్కువ వయస్సు క్రీడాకారులు పాల్గొన్న) విజయం కూడా సాధించింది.

సంగీతం , నృత్యం

జాంబియా స్వాతంత్ర్యం తరువాత కాలంలో సాంప్రదాయ గ్రామాలు, ప్రైవేటు మూజియంలు అభివృద్ధి సంస్కృతిలో జరిగిన మార్పులకు సంకేతంగా ఉన్నాయి. నృత్యం, సంగీతం వారి సాంస్కృతిక వ్యక్తీకరణలో భాగంగా ఉన్నాయి. అది జాంబియాలో జీవితసౌందర్యం, వినోదం స్వరూపం, కమంగు డ్రంసు మలైలా సంప్రదాయ వేడుక ప్రారంభాన్ని ప్రకటించడానికి ఉపయోగిస్తారు. నృత్యం ప్రజలను ఒకరితో ఒకరు ఒకరు సమైక్యంగా ఉండడానికి కారకంగా పనిచేస్తుంది.

1970 లలో ఉద్భవించిన ఒక సంగీత శైలి జామ్రోకు పశ్చిమప్రాంతంలో ఒక సంస్కృతిని అభివృద్ధి చేసింది. జిమ్మి హెండ్రిక్సు, జేమ్సు బ్రౌను, బ్లాకు సబ్బాతు, రోలింగు స్టోన్సు, డీపు పర్పులు, క్రీం వంటి సమూహాలకు మాదిరిగానే సాంప్రదాయ జాంబియన్ సంగీతాన్ని మిళితం చేయడంతో జామ్రోక్ రూపొందించబడింది. ఈ రకానికి చెందిన ప్రముఖ సమూహాలలో రిక్కి ఇల్లినోంగా, ఆయన బృందం మ్యూసి-ఓ-తున్య, విచ్, క్రిసీ "జబీ" టాంబో, పాల్ నగోజీ, ఆయన నాగోజీ కుటుంబాలు ప్రాధాన్యత వహిస్తున్నారు.

మూలాలు

Tags:

జాంబియా పేరు వెనుక చరిత్రజాంబియా చరిత్రజాంబియా భౌగోళికంజాంబియా ఆర్ధికంజాంబియా గణాంకాలుజాంబియా సంస్కృతిజాంబియా మూలాలుజాంబియాఅంగోలాకాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్జింబాబ్వేటాంజానియానమీబియాబోత్సువానామలావిమొజాంబిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్పంచితమిళిసై సౌందరరాజన్మర్రిరజాకార్చంద్ర గ్రహణంరక్షకుడుకనకదుర్గ ఆలయంఅనిల్ అంబానీజిడ్డు కృష్ణమూర్తిమురుడేశ్వర ఆలయంమొటిమరజాకార్లుచంద్రుడు జ్యోతిషంధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంఅష్ట దిక్కులువరిమీనరాశిశ్రీకాళహస్తిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅమ్మమీసాల గీతశాసనసభ సభ్యుడుశ్రవణ నక్షత్రముపౌష్టిక ఆహారంఉపనయనముపరిపూర్ణానంద స్వామిమేడిరంజాన్మరణానంతర కర్మలుప్రపంచీకరణశాతవాహనులుప్రజా రాజ్యం పార్టీదీపావళిపునర్వసు నక్షత్రముకాలుష్యంభారత పౌరసత్వ సవరణ చట్టంచిత్త నక్షత్రముభారతదేశ అత్యున్నత న్యాయస్థానంశ్రీవిష్ణు (నటుడు)పిఠాపురం మండలంతెలంగాణ జిల్లాల జాబితారోజా సెల్వమణిభారతదేశంలో ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుడేటింగ్రాబర్ట్ ఓపెన్‌హైమర్రౌద్రం రణం రుధిరంసింగిరెడ్డి నారాయణరెడ్డిమేషరాశితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శివ కార్తీకేయన్రతన్ టాటావిటమిన్ బీ12భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకల్వకుంట్ల కవితతాజ్ మహల్సర్దార్ వల్లభభాయి పటేల్అండాశయముమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిపిఠాపురంరోహిణి నక్షత్రంమకరరాశిరామప్ప దేవాలయంపాములపర్తి వెంకట నరసింహారావుఅమరావతిమానవ జీర్ణవ్యవస్థతట్టునవరత్నాలుశివ పురాణంమావటి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅయ్యప్పసర్పిఅట్రోపిన్సీతాదేవివినాయకుడుసామెతల జాబితాసద్గురు🡆 More