గాడిద లేదా గాడిదె (ఆంగ్లం: Donkey / ass) ఒక గుర్రం లాంటి జంతువు.
ఇవి ఈక్విడే లేదా గుర్రం కుటుంబానికి చెందినవి. ఇవి పెరిసోడాక్టిలా క్రమానికి చెందిన ఖురిత జంతువులు. గాడిదలు ఆఫ్రికా అడవి గాడిదల నుండి పరిణామం చెందాయని భావిస్తారు. సంస్కృతంలో దీని పేరు గార్ధభము.
గాడిద | |
---|---|
Conservation status | |
Domesticated | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | పెరిసోడాక్టిలా |
Family: | |
Genus: | ఈక్వస్ |
Subgenus: | ఎసినస్ |
Species: | ఈ. ఎసినస్ |
Binomial name | |
ఈక్వస్ ఎసినస్ లిన్నేయస్, 1758 |
దీనిని ఎక్కువగా బరువులు మోసేందుకు వినియోగిస్తారు. మరొకరిని తిట్టేందుకు కూడా అధికంగా వాడుతారు.
ఈక్విడే కుటుంబంలోని వివిధ జాతులకు చెందిన జంతువులు జతకడతాయి. ఆడ గాడిదలు మగ గుర్రాలతోనూ, మగ గాడిదలు ఆడ గుర్రాలతోను జతకట్టి పిల్లలు పుడతాయని చాలా మందికి తెలియదు.
గాడిదలు మొదటిసారిగా సుమారు 3000 BCE నుండి మానవులు పెంచుకుంటున్నారు. ఇంచుమించు గుర్రాలను ఇదే కాలం నుండి పెంపకం మొదలైనది. తరువాత ఇవి రెండు ప్రపంచమంతా వ్యాపించాయి. పెంచుకొనే గాడిదలు విస్తరించగా, అడవి గాడిదలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఇవి తమ ఆత్మరక్షణ కోసం ఎక్కువగా వెనుక కాళ్ళను వాడతాయి. వాటితో తంతే కొన్ని సార్లు బలమైన గాయాలు కూడా తగులుతాయి. మూతి పల్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇతర దేశాలలో గాడిద పాల నుండి తీసిన వెన్న ఒక కిలో ధర $1800 పలుకుతుంది, మన భారతీయ రూపాయలలో కనీసం రు.80,000 పలుకుతుంది, భారతీయ రైతులు దీని మీద ద్రష్టి పెడితే మంచి లాభాలు వస్తాయి .
వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.
This article uses material from the Wikipedia తెలుగు article గాడిద, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.