సిరియా

సిరియా ఒక పశ్చిమాసియా దేశము.

2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది.

الجمهورية العربية السورية
Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah
Syrian Arab Republic
Flag of సిరియా సిరియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Homat el Diyar
Guardians of the Land

సిరియా యొక్క స్థానం
సిరియా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
డమాస్కస్
33°30′N 36°18′E / 33.500°N 36.300°E / 33.500; 36.300
అధికార భాషలు అరబిక్
ప్రభుత్వం అధ్యక్ష గణతంత్ర రాజ్యం
 -  అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్
 -  ప్రధాన మంత్రి ముహమ్మద్ నాజీ Etri
స్వాతంత్ర్యము ఫ్రాన్స్ నుండి 
 -  మొదటి ప్రకటన September 19361 
 -  రెండవ ప్రకటన January 1 1944 
 -  గుర్తింపు April 17 1946 
విస్తీర్ణం
 -  మొత్తం 185,180 కి.మీ² (88th)
 చ.మై 
 -  జలాలు (%) 0.06
జనాభా
 -  July 2007 అంచనా 20,314,747 (55th)
 -  జన సాంద్రత 103 /కి.మీ² (96th)
 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $71.74 బిలియన్ (65వ స్థానం)
 -  తలసరి $5,348 (101వ స్థానం)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) మూస:Medium 0.716 (medium) (107th)
కరెన్సీ Syrian pound (SYP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sy
కాలింగ్ కోడ్ +963
1 The Franco-Syrian Treaty of Independence (1936), not ratified by France.

నైసర్గిక స్వరూపము

  • పూర్వ నామం :సిరియన్ అరబ్ రిపబ్లిక్ (అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా)
  • ఖండం: ఆసియా
  • దేశస్తులు:సిరియన్లు
  • వైశాల్యం: 1,85,180 చదరపు కిలోమీటర్లు
  • జనాభా: 2,20,87,048 (తాజా అంచనాలు 2004 ప్రకారం)
  • రాజధాని: డమాస్కస్
  • ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
  • కరెన్సీ: సిరియన్ పౌండ్
  • అధికారిక భాష: అరబిక్
  • మతం: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాలు .
  • వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగస్టులో 18 నుండి 37 డిగ్రీలు ఉంటుంది.
  • పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు.
  • పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు.
  • సరిహద్దులు: ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, మధ్యధరా సముద్రం.
  • స్వాతంత్ర్య దినోత్సవం: 1944 ఏప్రిల్ 17

చరిత్ర

సామాన్య శకం 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజల ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో నిత్యమూ పోరాటాలు, చిన్నపాటి యుద్ధాలు నేడు చోటు చేసుకుంటున్నాయి. సామాన్య శఖం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఒకప్పుడు సిరియా దేశం వివిధ దేశాల రాజులకు యుద్ధభూమిగా ఉండేది. 'సిరియన్లు '’ ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నాయి. సమీప దేశాలతో వీరి వ్యాపార బంధాలుగా చైనా, భారతదేశం, అరబ్బు దేశాలలో ఉన్నాయి. దేశాన్ని ఫోనేషియన్ల తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్ రాజుల పరిపాలించారు. సామాన్య శకం 632లో ముస్లిం మత నమ్మకం కలిగిన ప్రాఫెట్ మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు కలీఫాలు పరిపాలించారు. సా.శ. 1095లో యూరోపు నుండి క్రైస్తవులు క్రమంగా వచ్చి ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సా.శ. 1114లో సుల్తాన్ నూరుద్ధీన్ అనే రాజు క్రమంగా సిరియాదేశాన్ని ఆక్రమించి క్రిస్టియన్లను తరిమివేశాడు. 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1944తో సిరియా దేశం స్వాతంత్ర్యం పొందింది.

పరిపాలన

సిరియా 
సిరియా గవర్నోరేట్ లు

సిరియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 14 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని గవర్నోరేట్ అని అంటారు. ఇవి తిరిగి 61 జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. జనాభా ఎక్కువగా రాజధాని డమాస్కస్ చుట్టూ అలాగే యూఫ్రటీస్ నదీ తీరం వెంబడి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.దేశంలోని పది పెద్ద నగరాలు...

  1. డమాస్కస్
  2. అలెప్పొ
  3. హోమ్స్ లటా కియా
  4. హమా
  5. అల్ రక్కఫ్
  6. డీర్ ఎజ్జోర్
  7. అల్‌హసకా
  8. క్వామిష్లీ
  9. సయ్యిదా జన్సబ్‌

ప్రజలు - సంస్కృతి

దేశంలో 74 శాతం మంది ప్రజలు ముస్లిములు. వీరు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. లెవన్‌టైన్, ఖుర్దు, టుర్కుమెన్, సిర్కాసియన్, గ్రీకులు, జ్యూలు, ఆర్మేనియన్‌లు... ఇలా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అరబ్బీ, కుర్దెష్ భాషలు మాట్లాడుతారు.

వేషధారణ

సిరియా 
సిరియన్ మహిళలు, 1683

వివిధ తెగల వాళ్ళు వారివారి సాంప్రదాయరీతులలో వస్త్రధారణ చేస్తారు. ఇది ప్రాంతాలవారీగా ఉంటుంది. సాధారణంగా పురుషులు పొడవాటి గౌన్‌లను ధరిస్తారు. దీనిని కఫ్తాన్ అంటారు. స్త్రీలు పొడవాటి రోబ్‌లను ధరిస్తారు. కేవలం చేతులు, పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు తలలకు పాగాలు ధరిస్తారు. యువతీయువకులు మాత్రం ప్యాంటు, షర్టు, జీన్స్ ధరిస్తారు. అలంకరణ సామగ్రిని ఉపయోగిస్తారు. ధనిక కుటుంబాల మహిళలు మాత్రం కురచ దుస్తులు ధరిస్తారు. సాధారణంగా మహిళలు ఇంటి వ్యవహారాలు చూసుకుంటారు. గ్రామాలలో మహిళలు ఇంటిపనులతో పాటు పొలం పనులకు కూడా వెళతారు.

ఆహార అలవాట్లు

మాంసం, రొట్టెలు వీరి ప్రధాన ఆహారం. గోధుమ, మైదా పిండితో బన్, రొట్టె, బ్రెడ్డు లాంటి పదార్థాలు తయారుచేస్తారు. వీటితో పాటు సూప్‌లు, కూరలు ఉంటాయి. అన్నం, మాంసం కలిపి ముద్దలు చేస్తారు. వీటిని బ్రెడ్డుతో లేదా రొట్టెతో కలిపి తింటారు.

దర్శనీయ ప్రదేశాలు

డమాస్కస్

దేశ రాజధాని డమాస్కస్ నగరం కిక్కిరిసిన జనాభాతో నిండిన నగరం. నగరం నలుదిశలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. బైజాంటైన్ ఆర్కేడ్ అనేది జూపిటర్ దేవుని ఆలయం. దీనిని రోమన్ పరిపాలకులు నిర్మించారు. ఈ ఆర్కేడ్ సమీపంలోనే ఉమ్మాయ్యద్ మసీదు ఉంది. దీనినే గ్రాండ్ మాస్క్ అంటారు. దీనిని పూర్వం ఒకటవ కాన్‌స్టాంట్‌నోపుల్ అనే రోమన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ మసీదుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మసీదు లోపలి భాగంలో శిఖరం లోపలి భాగంలో ఇప్పటికీ సెయింట్ జాన్ తల భాగం నిలిచి ఉంది. మరో విశేషం 2001లో పోప్ జాన్ పాల్-2 ఈ మసీదును సందర్శించాడు.

ఇక డమాస్కస్ పాత నగరంలో పురాతన కట్టడాలు, ఇళ్ళు, ఇతర నిర్మాణాలు ఎన్నో దర్శనమిస్తాయి. అప్పటికాలంలో రోమన్‌లు, ముస్లింలు, క్యాథలిక్కులు, జ్యూలు నిర్మించిన కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నగరంలోని హేజాజ్ రైల్వేస్టేషన్ భవనాన్ని చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఒట్టోమాన్ రాజుల కాలంలో నిర్మించిన ఈ భవనం నేటికీ రైల్వేస్టేషన్ భవనంగా ఉపయోగపడుతోంది.

అలెప్పో నగరం

కనుచూపు మేర వరకు విస్తరించిన నగరం అలెప్పో. ఈ నగరం అన్ని రకాలుగానూ ఎంతో ధనవంతమైన నగరంగా కనబడుతుంది. కిక్కిరిసిన ఇళ్ళు, చారిత్రక కట్టడాలు, ప్రజల సంస్కృతులు... ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం అలెప్పో. నగరంలోని పురాతన కట్టడాలను ప్రభుత్వం సంరక్షిస్తుంది. సెయింట్ సిమియన్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ ఒకే ప్రదేశంలో నాలుగు చర్చి భవనాలు కలిసి ఒక శిలువ ఆకారంలో ఉంటాయి. మధ్యభాగంలో స్పైలైట్ స్తంభం ఉంది. ఆ కాలంలో ఆ స్తంభం మీద నిలబడి సెయింట్ జార్జ్ ప్రజలతో మాట్లాడేవారు. ఈ స్తంభం 25 మీటర్ల ఎత్తు ఉంది. నగరంలో మరో కట్టడం సిటాడెల్. ఇది యునెస్కో సంరక్షిత భవనంగా ఉంది. నగరంలో క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించిన ఆల్ కికన్ మాస్క్ నేటికీ అద్భుతంగా నిలిచి ఉంది.

సిటాడెల్ 165 అడుగుల ఎత్తు, 1476 అడుగుల పొడవు, 1066 అడుగుల వెడల్పుతో ఉంటుంది. శతాబ్దాలుగా ఎందరో రాజులను, చక్రవర్తులను చూసిన ఈ కట్టడం నేడు మౌనసాక్షిగా నిలబడి ఉంది.

హమాలో నీటి చక్రాలు

హమా ఒక పురాతన నగరం. ఇది ఓరోంటిస్ నదీతీరంలో ఉంది. మధ్యయుగం నాటి నుండి ఈ నగరం ఉందన్న చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు అధికం. బైజాంటియన్ రాజులు ఇక్కడ నీటి చక్రాలను మొట్టమొదట ఏర్పరిచారు. ఆ కాలంలో నదిలోని నీటిని తోడడానికి ఈ విశాలమైన నీటి చక్రాలను నిర్మించారు. చక్రాలను తిప్పుతూ ఉంటే నదిలోని నీళ్ళు చక్రాల చివరలలో ఉన్న డబ్బాలలో నిండి బయటికి వస్తాయి. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ఏర్పరచిన ఈ నీటిచక్రాలు నేటికీ పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం కేవలం 17 నీటిచక్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క చక్రం వ్యాసార్థం 66 ఫీట్లు ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ నీటి చక్రాలు ఆ కాలంనాటి నీటిపారుదుల తీరుకు అద్దం పడుతుంది.

బోస్రా

సిరియా 
రోమన్ చక్రవర్తులు నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్

సిరియా దేశంలో ఉన్నన్ని చారిత్రక ప్రదేశాలు మరే దేశంలోనూ కనబడవు. అందుకే విదేశీయులు సిరియా దేశాన్ని అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. బోస్రా ఒక పురాతన నగరం. రోమన్ చక్రవర్తులు నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. సందర్శకులను అది మంత్ర ముగ్ధులను చేస్తుంది. దీనిని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆనాటి కట్టడం నేటికీ ఏమాత్రం శిథిలం కాకుండా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బోస్రా నగరం రాజధాని డమాస్కస్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ నగరం ఆకాలంలో నభాషియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్‌లు, బైజాంటైన్‌లు, అరబ్ ముస్లిం రాజులు దీనిని పాలించారు. రోమన్‌లు నిర్మించిన ఆంఫిథియేటర్‌లో దాదాపు 18 వేల మంది కూర్చోగలిగే వీలు ఉంది. స్టేజి పొడవు 148 అడుగుల పొడవు, 26 అడుగుల లోతులో ఉంటుంది.

పాల్మీరా

సిరియా 
పాల్మీరా ప్రాంతానికి చెందిన పురాతన నగరం

పాల్మీరా కట్టడాలు ఒకటవ శతాబ్దానికి చెందినవి. ప్రజలు ఈ కట్టడాలను రెండు పేర్లతో పిలుస్తారు

1. ఎడారి పెళ్ళికూతురు- ఎందుకంటే ఈ ప్రదేశం ఎడారిలో ఉంది. ఇక్కడ ఒక ఒయాసిస్సు ఉంది. బాటసారులు ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి పాల్మీరా దగ్గర విడిది చేసేవారు.

2. తాడ్‌మోర్- ఆధిపత్యానికి ప్రతీక. ఏ రాజులు దీనిని ఆక్రమించినా వెంటనే దానిని వదిలేసి వెళ్ళిపోయేవారు. అది మళ్ళీ ఒంటరిగా నిలిచి ఉండేది. ఎడారి కావడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడే టెంపుల్ ఆఫ్ బాల్ నిర్మాణం ఉంది. పూర్వకాలంలో ప్రజలు ఈ దేవాలయాన్ని తమ కోర్కెలు తీరినపుడు జంతువులను బలి ఇవ్వడానికి ఎంచుకున్నారు. బైజాంటైన్ రాజులకాలంలో ఈ దేవాలయం మార్పు చెంది చివరికి ఒక మసీదుగా, ఆ తర్వాత రాజుల సైనికులకు విడిది ప్రదేశంగా మారిపోయింది. టూంబుల లోయ కూడా ఇక్కడే ఉంది. ఈ లోయలోని టూంబులు దాదాపు ఈజిప్టులోని పిరమిడ్ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ టూంబులలో ఆకాలపు రాజుల వారి కుటుంబ సభ్యుల మృత దేహలను భద్రపరిచే సమాధులు. నేటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడే మ్యూజియం, అరబ్ క్యాజిల్‌లు చూడదగిన కట్టడాలు.

వార్తలలో సిరియా

2013 రసాయనదాడి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో 2013 ఆగస్టు 21, బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి సాక్షాధారమైనది.

దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది.

ఆర్ధికరంగం

సిరియా 
Pre-civil war Syria Export Treemap (no longer accurately represents Syria's exports)

2015 గణాంకాలను అనుసరించి సిరియన్ ఆర్థికరంగం క్షీణిస్తున్న కస్టంస్ (దిగుమతి), ఆదాయం పన్ను, ఇరాన్ నుండి అందుతున్న సహాయం మీద ఆధారపడి ఉంది. సిరియా అంతర్యుద్ధం సమయంలో ఇరాన్ 6-20 బిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం చేస్తూ ఉంది. యుద్ధం కారణంగా సిరియన్ ఆర్థికరగం 60%, సిరియన్ పౌండ్ విలువలో 80% క్షీణించింది. అంతర్యుద్ధం కారణంగా సిరియాను వరల్డ్ బ్యాంక్ " లోవర్ మిడిల్ ఇంకం కంట్రీ "గా వర్గీకరించింది. 2010లో ఆర్థికరంగం సిరియా ఆయిల్, వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంది. ఆయిల్ రంగం నుండి 40% ఎగుమతుల ఆదాయం లభిస్తుంది. సిరియా, సైప్రస్ మద్య ఉన్న మధ్యధరా సీ ఫ్లోర్ ఆయిల్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. వ్యవసాయరంగం జి.డి.పి.లో 20% భాగస్వామ్యం వహిస్తుంది, ఉపాధి 20% భాగస్వామ్యం వహిస్తుంది.రాబోయే కలంలో ఆయిల్ నిలువలు క్షీణించి సిరియా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఒకటిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతర్యుద్ధం తరువాత సిరియా ఆర్థికరంగం 35% క్షీణించింది. సిరియా ప్రభుత్వం ఇరాన్,రష్యా, చైనా దేశాల నుండి లభిస్తున్న ఆదాయం మీద ఆధారపడుతుంది. ఆర్థికరంగాన్ని పూర్తిగా ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంది. ప్రభుత్వం రాయితీలను అధికరించడం, వాణిజ్య నియంత్రణ నిబంధనలను క్రమబద్ధీకరించడం విదేశీధనం నిల్వలను సరక్షించడం మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. విదేశీ వాణిజ్యం, క్షీణిస్తున్న ఆయిల్ ఉత్పత్తి, నిరుద్యోగసమస్య, బడ్జెట్ లోటు అధికరించడం, వ్యవసాయ రంగం అయధికంగా ఉపయోగిస్తున్న కారణంగా నీటిసరఫరా మీద పడుతున్న వత్తిడి, వేగవంతంగా అధికరిస్తున్న జనసంఖ్య, పారిశ్రామిక విస్తరణ, నీటి కాలుష్యం సిరియా ప్రజల పేదరికానికి కారణం ఔతున్నాయి. యు.ఎన్.డి.పి. 2005లో సిరియన్ ప్రజలలో 35% బీదరికంలో మగ్గుతున్నట్లు, 11.4% దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రకటించింది. 2001 నుండి సిరియా ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. 2000-2008 తలసరి జి.డి.పి. 2.5% మాత్రమే. నిరుద్యోగం 10%. దారిద్యం 2004 11% ఉండగా 2007 నాటికి 12.3% నికి చేరుకుంది.

ఎగుమతులు

2007లో సిరియన్ ప్రధాన క్రూడాయిల్, రిఫైండ్ ప్రొడక్టులు, ముడి పత్తి, వస్త్రాలు, పండ్లు, ధాన్యాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. సిరియా పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయ ఉపకరణాలు, భారీ యంత్రాలకు అవసరమైన ముడిసరుకును ఎగుమతి చేస్తూ ఉంది.

సిరియా 
Al-Hamidiyah Souq in Damascus in 2010

సమస్యలు

రాజకీయ అస్థిరత ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. హింసాత్మక చర్యలు, ప్రభుత్వ అంక్షలు, ఆర్థికరంగ మంజూరు, అంతర్జాతీయంగా ఏకాంతం విదేశీపెట్టుబడులు దూరం కావడానికి కారణం అయింది. కేద్రీకృత ప్రభుత్వ అధికారం, ఆయిల్ ఉత్పత్తి క్షీణత, దేశఆర్ధిక ప్రణాళిక లోటు అధికరించడం, ద్రవ్యోల్భణం సిరియా ఆర్థికరంగం కుంటుబడడానికి కారణంగా మారింది.2011లో అంతర్యుద్ధానికి ముందుగా ప్రభుత్వం పర్యాటకరంగం, నేచురల్ గ్యాస్, సేవారంగం నుండి ఆదాయం పొదడానికి కృషిచేసింది. అలాగే ఆర్థికరంగ ఆదాయాన్ని వేరు రంగాల అభివృద్ధి ద్వారా సేకరించి ఆయిల్, వ్యవసాయం మీద ఆధారపడడం తగ్గించడానికి ప్రయత్నించింది.పలు మార్కెటులను స్వేచ్ఛయుతం చేసి ఆర్థికరంగ సంస్కరణకు తెరతీసింది. అయినప్పటికీ కలహం ఆరంభమైన కారణంగా సంస్కరణల వేగం తగ్గుముఖం పట్టాయి.

అంతర్యుద్ధప్రభావం

2012లో సిరియాలో ప్రారంభం అయిన అతర్యుద్ధం కారణంగా సిరియన్ ఎగుమతులు అన్నీ మూడింట రెండువంతులు పతనావస్థకు చేరుకున్నాయి. 2010లో ఎగుమతులు 12 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండగా 2012 నాటికి అవి 4 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2011 నాటికి జి.డి.పి. 3% నికి క్షీణించింది. 2012 నాటికి జి.డి.పి. అదనంగా 20%క్షీణిస్తుందని అంచనా వేసారు. 2012 నాటికి సిరియా ఆయిల్, పర్యాటకం పూర్తిగా క్షీణించింది. అంతర్యుద్ధం కారణంగా దాదాపు 5 బిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

అతర్యుద్ధం తరువాత పునరుద్ధరణ కార్యక్రమాలుగా చురుకుగా చేయవలసిన అవసరం ఏర్పడింది.పునరుద్ధరణకు 10 బిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని అంచనావేయబడింది. ప్రభుత్వం ఆర్థికపరిస్థితి కారణంగా నిధులను మంజూరు చేయడం సాధ్యపడలేదు. 2012లో అంతర్యుద్ధం కారణంగా యు.ఎస్., యురేపియన్ యూనియన్ ఆయిల్ దిగుమతులపై (మాసానికి 400 బిలియన్ల అమెరికన్ డాలర్లు) నిషేధం విధించింది. పర్యాటకం నుండి లభించే ఆదాయం క్షీణించింది. హోటెల్ ఆకుపెంసీ యుద్ధానికి ముందుకంటే 90% పతనం అయింది. పర్యాటకరంగంలో 40% మంది వారి ఉద్యోగాలను కోల్పోయారు.2015 మే మాసంలో ఐ.ఎస్.ఐ.ఎస్. సిరియా ఫాస్ఫేట్ గనులను స్వాధీనం చేసుకుంది. అస్సద్ పాలన ప్రధాన వనరుల ఆదాయం కోల్పోయింది. తరువాత మాసం ఐ.ఎస్.ఐ.ఎస్. డమాస్కస్ గ్యాస్ పైప్ లైనును (ఈ పైప్ లైను డమాస్కస్‌కు హీటింగ్, ఎలెక్ట్రిక్ సౌకర్యం కలిగిస్తుంది) తగలపెట్టింది. హయన్, జిహార్, ఎబ్లా ప్రాంతాలలో గ్యాస్ ఫీల్డును ఐ.ఎస్.ఐ.ఎస్. మూసివేసింది.

పెట్రోలియం పరిశ్రమ

సిరియా 
Oil refinery in Homs

సిరియా పెట్రోలియం పరిశ్రమ పతనావస్థకు చేరుకుంది. 2014 సెప్టెంబరులో ప్రభుత్వం కంటే ఐ.ఎస్.ఐ.ఎస్. అధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసింది.ఐ.ఎస్.ఐ.ఎస్. అదనంగా ఆయిల్ ఫీల్డును స్వాధీనం చేసుకున్న తరువాత ఆయిల్ ఉత్పత్తి మరింత దిగజారింది. సిరియన్ అంతర్యుద్ధం మూడవ సంవత్సరంలో డెఫ్యూటీ ఎకమమిక్ మినిస్టర్ సల్మాన్ హయన్ సిరియా రెండు ప్రధాన రిఫైనరీలు కెపాసిటీ కంటే 10% తక్కువగా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నాడు. 1960 నుండి సిరియా ఈశాన్యప్రాంతంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్ నుండి హెవీ- గ్రేడ్ ఆయిల్‌ను ఉతపత్తి చేస్తూ ఉండేది. 1980లో సిరియా తూర్పు ప్రాంతం లోని డియర్ ఎజ్-జర్ ప్రాంతంలో లో- గ్రేడ్ ఆయిల్, లో- సల్ఫర్ ఆయిల్ నిల్వలు కనుగొనబడింది. 1995 నుండి 2012నాటికి సిరియా ఆయిల్ ఉత్పత్తి అత్యధికంగా పతనం అయింది. 2012 నుండి 2014 నాటికి ఉత్పత్తి మరింత దిగజారింది.తిరుగుబాటుకు ముందు సిరియా ఆయిల్ ఉత్పత్తిలో 90% ఇ.యుకు ఎగుమతి చేయబడింది. మిగిలినది టర్కికి ఎగుమతి చేయబడింది. 2012లో ఆయిల్, గ్యాస్ ఆదాయం జి.డి.పిలో 20% ఉండేది.

సిరియా 
Expressway M5 Near Al-Rastan

రవాణాసౌకర్యాలు

సిరియాలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు (డమాస్కస్, అలెప్పో, లట్టకియా, కమిష్లీ) ఉన్నాయి. ఇవి సిరియన్ ఎయిర్ సర్వీసులకు సేవలు అందిస్తూ విదేశీరవాణాకు సేవలు అందిస్తాయి.

రైలు

సిరియన్ సరుకురవాణా అత్యధికంగా " చెమింస్ డీ ఫర్ సిరియన్ " (సొరియన్ రైల్వే కంపెనీ), ఇది ట్ర్కిష్ రైల్వేతో (టర్కిష్ కౌంటర్‌పార్ట్) అనుసంధానించబడింది. అభివృద్ధి చెందని దేశం అయిన సిరియా రైల్వేశాఖను మాత్రం సమర్ధవంతంగా నడుపుతూ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, ఆధునిక రైలు సర్వీసులు అందిస్తుంది.

రహదారి

సిరియా రహదారి మార్గం మొత్తం పొడవు 69,873 కి.మీ. ఇందులో ఎక్స్‌ప్రెస్ వే పొడవు 1,103 కి.మీ.

జలమార్గం

దేశంలో 900 కి.మీ. ప్రయాణానికి అనువైన జలమార్గాలు ఉన్నప్పటికీ వీటిలో ఆర్థికపరమైన రవాణాజరగడం లేదు.

నీటి సరఫరా

సిరియా జలవనరులు అరుదుగా ఉన్న సెమీ అరిడ్ దేశంగా వర్గీకరించబడింది. సిరియాలో అత్యధికంగా నీటిని వాడుకుంటున్న రంగం వ్యవసాయం. ప్రజావసరాలకు 9% నీరు మాత్రమే వాడబడుతూ ఉంది. జనసంఖ్యాభివృద్ధి, నగరప్రాంతాలు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం సిరియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటి. 2006లో సిరియా జనసంఖ్య 19.4 మిలియన్లు. అభివృద్ధి శాతం 2.7%.

గణాంకాలు

Historical populations (in thousands)
సంవత్సరంజనాభా±% p.a.
1960 45,65,000—    
1970 63,05,000+3.28%
1981 90,46,000+3.34%
1994 1,37,82,000+3.29%
2004 1,79,21,000+2.66%
2014 1,79,52,000+0.02%
Source: Central Bureau of Statistics of the Syrian Arab Republic, 2011

అత్యధికంగా ప్రజలు సముద్రతీర మైదానం, యుఫ్రేట్స్ నదీలోయప్రాంతం, నివసిస్తున్నారు. సిరియా జనసాంధ్రత 99 చ.కి.మీ " 2008 వరల్డ్ రెఫ్యూజీ సర్వే " ఆధారంగా సిరియాలో ఆశ్రయం కోరినవారి సంఖ్య 18,52,300. వీరిలో అత్యధికులు ఇరాక్ ప్రజలు (13,00,000) ఉన్నారు. అదనంగా పాలస్తీనాకు చెందినవారు 5,43,400, సోమాలియాకు చెందిన వారు 5,200 మంది ఉన్నారు. ఐక్యరాజ్య సమితి " ది దిగ్గెస్ట్ హ్యూమనిటేరియన్ ఎమర్గెంసీ ఆఫ్ అవర్ ఎరా " అని సిరియాను అభివర్ణించింది. 9.5 మిలియన్ల సిరియన్లు 2011 మార్చిలో ఆరంభమైన అంతర్యుద్ధ సమయంలో దాదాపు సగం మంది సిరియన్ ప్రజలు తమతమ నివాసాలను వదిలి వేరు ప్రదేశాలకు తరలించబడ్డారు. 4 మిలియన్ల సిరియన్లు శరణార్ధులుగా దేశం వెలుపల నివసిస్తున్నారు.

సంప్రదాయ సమూహాలు

సిరియా 
Children in Aleppo
సిరియా 
Damascus, traditional clothing

సిరియన్లు అత్యధికంగా లెవంత్ స్థానికిసంతతికి చెందినవారై ఉన్నారు. వీరు లెబనీయులు, పాలస్తీనీయులు, ఇరాకీయులు, జోరాడానీయులు, మాల్టెసె ప్రజలకు సన్నిహిత సంబంధం కలిగినవారై ఉన్నారు. సిరియా జనసంఖ్య 1,70,64,854. పాలస్తీనియన్ అరేబియన్లతో చేర్చి సిరియన్ అరేబియన్ల సంఖ్య 6,00,000. వీరు దేశ సంఖ్యలో 74% నికి భాగస్వామ్యం వహిస్తున్నారు. స్థానిక క్రైస్తవులు (వెస్టర్ అరామిక్ ప్రజలు), అస్సిరియన్లు 4,00,000, వెస్ట్రన్ అరామిక్ ప్రజలు దేశంతటా విస్తరించి ఉన్నారు. వీరు ప్రత్యేకంగా ప్రధాన నగరప్తాంతాలలో విస్తరించి ఉన్నారు. అస్సిరియన్లు అధికంగా ఉత్తర, ఈశాన్యప్రాంతలో (హోమోలు, అలెప్పో, క్వామిషీ, హసకాహ్ ప్రాంతాలలో ) నివసిస్తున్నారు. పలు అస్సిరియన్ సమూహాలు ఇప్పటికీ నియో- అరామిక్ భాషలను మాట్లడడానికి, వ్రాయడానికి వాడుతుంటారు.మాలౌలా, జుబ్బాదిన్, అల్-సర్ఖా మొదలైన గ్రామీణ ప్రాంతాలలో వెస్టర్న్ అరామిక్ ఇప్పటికీ వాడుకలో ఉంది. సిరియాలో సంఖ్యాపరంగా ద్వితీయ స్థానంలో ఉన్న వారు కుర్దీలు. వీరి శాతం 9%-10%. వీరి సంఖ్య దాదాపు 1.6 మిలియన్లు (యజదీలు 40,000లతో చేర్చి).). కుర్దీలు అధికంగా ఈశాన్య సిరియాలో నివసిస్తుంటారు. వీరికి అధికంగా కుర్దిష్ భాషాకుటుంబానికి చెందిన కుర్మంజీ భాష వాడుకభాషగా ఉంది. మూడవ స్థానంలో టర్కీ ప్రజలు (సిరియన్ టర్కీ) ఉన్నారు.సంఖ్యాపరంగా వీరి శాతం 4-5%. అరబిజెద్ టర్కీ ప్రజలను చేర్చి వీరి శాతం గణనీయంగా ఉంది. వీరి సంఖ్య గురించి విశ్వసించతగిన ఆధారాలు లేనప్పటికీ వీరి సంఖ్య 3.మిలియన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. జనంఖ్యా పరంగా సిరియన్ అస్సిరియన్లు 4వ స్థానంలో ఉన్నారు. వీరి శాతం 4-4%. 5వ స్థానంలో సిర్కాసియన్లు ఉన్నారు. వీరి శాతం 1.5%. , ఆర్మేనియన్లు 6 వ స్థానంలో ఉన్నారు. వీరి శాతం 1%. వీరిలో అనేకమంది శరణార్ధుల సంతతికి చెందినవారు. ఆర్మేనియన్ జాతిహత్యల సమయంలో శరణార్ధులు అధికంగా సిరియా చేరుకున్నారు.సిరియాలో ఆర్మేనియన్ ఉపాధిదారులు అత్యధిక సంఖ్యలో (ప్రపంచంలో 7వ స్థానం) పనిచేస్తున్నారు. వీరు అధికంగా అలెప్పో, క్వామిష్లి, డమాస్కస్, కెసాబ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.

సిరియా 
The ethno-religious composition of Syria.

అల్పసంఖ్యాకులు

సిరియాలో అల్బేనియన్లు, బోస్నియన్లు, జార్జియన్లు, గ్రీకులు, పర్షియన్లు, పాష్తన్లు, రష్యన్లు అల్పసంఖ్యలో నివసిస్తున్నారు. వీరిలో ముస్లిం మతవిశ్వాసం కలిగిన ప్రజలు అరేయన్లుగా వ్యవహరించబడుతున్నారు. సిరియాలో ఒకప్పుడు గణనీయమైన సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. వీరు పెద్ద సమూహాలుగా అలెప్పో, డమాస్కస్, క్వామిషి ప్రాంతాలలో నివసించేవారు.సిరియాలో హింసాత్మక చర్యలు అధికరించడం, ఇతర ఉపాధి అవకాశాల కొరకు వీరు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. 19వ శతాబ్దంలో యూదులు అధికంగా గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్ దేశాలకు వలసపోయారు. 1948లో ఇజ్రాయిల్ స్థాపించిన తరువా వలసప్రక్రియ ముగింపుకు వచ్చింది.అరబుకు వెలుపల నివసిస్తున్న సిరియన్లు అధికంగా బ్రెజిల్లో కేంద్రీకృతమై ఉన్నారు. ఇక్కడ మిలియన్ల మంది అరేనియన్లు, ఈస్టర్న్ పూర్వీకత కలిగిన ప్రజలు ఉన్నారు. అమెరికా ఖండాలలో సిరియన్ శరణార్ధులకు ఆశ్రయమిస్తున్న దేశాలలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది. అరబ్ అర్జెంటీనియన్లు అధికంగా సిరియా, లెబనాన్ పూర్వీకత కలిగి ఉన్నారు.

మతం

Religion in Syria (est. 2006)

  Islam (87%)
  Christianity (10%)
  Druzism (3%)
సిరియా 
Great Mosque of Aleppo, Aleppo

సిరియా ప్రజలలో సున్నీ ముస్లిములు 74% వీరిలో సున్ని అరేబియన్లు 59-60%, కుర్దీలు 8.5% ఉన్నారు., టర్కీలు 3% ఉన్నారు. 13% సిరియన్లు షియా ముస్లిం మతానికి చెందినవారై (అలావైట్, త్వెల్వర్లు, ఇస్మాయిల్స్, అరేబియన్లు, కుర్దీలు, టర్కోమన్లు) ఉన్నారు. క్రైస్తవులు 10% ఉన్నారు. వీరిలో అధికంగా అనియోచియన్ ఆర్ధడాక్స్ మిగిలినవారిలో గ్రీక్ కాథలిక్, అస్సిరియన్ చర్చి ఆఫ్ ది ఈస్ట్, ఆర్మేనియన్ ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్లు, ఇతరులు ఉన్నారు. డ్రూజులు 3% ఉన్నారు. డ్రూజులు 5,00,000 మంది ఉన్నారు. వీరు అధికంగా దక్షిణప్రాంతంలోని జబల్ అల్- డ్రూజ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అధ్యక్షుడు అల్-అస్సద్ కుటుంబం అలావైట్‌కు చెందినవారై ఉన్నారు. అలావైట్లు సిరియాలో ఆధిక్యత కలిగి ఉన్నారు. వీరు సైన్యంలో కీలకపదవులు వహిస్తున్నారు. 2013 మే మాసంలో " సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ " నివేదిక ఆధారంగా సిరియన్ అంతర్యుద్ధంలో 94,000 మంది మరణించారని భావిస్తున్నారు. వీరిలో 41,000 మంది అలావైట్లు ఉన్నారు.

క్రైస్తవులు

సిరియాలో ఉన్న 2.5 మిలియన్ల క్రైస్తవులలో పాలస్తీనాకు చెందిన శరణార్ధులు అధికంగా ఉన్నారు. వీరు పలు బృందాలుగా విడిపోయారు. వీరిలో చల్సిడోనియన్, అంటియోచియన్ ఆర్ధడాక్స్ 47% ఉన్నారు. కాథలిక్కులలో మెల్కిటే, చల్డీన్, లాటిన్ ప్రజలు 16.2% ఉన్నారు. అమెరికన్ అపొస్టోలిక్ చర్చి 10.9%, సిరియాక్ ఆర్ధడాక్స్ 22.4%, మిగిలిన వారు అస్సిరియన్, ఇతరులు ఉన్నారు.సిరియన్ క్రైస్తవులు ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతవర్గానికి చెందిన వారై ఉన్నారు.

భాషలు

సిరియాలో ఆధునిక స్థాయి అరబిక్ అధికారభాషగా ఉంది. పలు ఆధునిక అరబిక్ భాషాకుటుంబానికి చెందిన భాషలు ప్రజల దైనిందిక జీవితంలో వాడుకలో ఉన్నాయి. పశ్చిమప్రాంతంలో లెవంతినె అరబిక్, ఈశాన్యప్రాంతంలో మెసపటోనియన్ అరబిక్ భాషలు వాడుకలో ఉన్నాయి. సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలో కుర్దిష్ భాష (కుర్మంజీ రూపం) వాడుకలో ఉంది. సిరియన్ ఆర్మేనియన్, టర్కీ ప్రజలలో ఆర్మేనియన్, టర్కిష్ (సౌత్ అజ్రీ మాండలికం) వాడుకలో ఉన్నాయి.క్లాసికల్ అరబిక్ రూపొందడానికి ముందు అరామిక్ భాష ఈ ప్రాంతంలో వాడుకలో ఉండేది. అస్సిరియన్, సిరియాక్ ప్రజలు ఇది ఇప్పటికీ వ్యవహార భాషగా ఉంది. మలౌలా, పొరుగు గ్రామాలలో వెస్టర్న్ నియో- అరామిక్ భాష వాడుకలో ఉంది.ఇంగ్లీష్, ఫ్రెంచ్ దేశమంతటా ద్వితీయ భాషగా ఉంది. అయితే అధికంగా ఇంగ్లీష్ భాష వాడుకలో ఉంది.

సినిమారంగం

  1. సుజాన్ నజమ్ ఆల్డిన్: సిరియా చలనచిత్ర నటి.
  2. సులాఫ్ ఫవాకేర్జీ: సిరియా చలనచిత్ర, టెలివిజన్ నటి.
  3. హలా షాకత్: సిరియా నటి.

ఇవి కూడా చూడండి

వెలుపలి లింకులు

మూలాలు

Tags:

సిరియా నైసర్గిక స్వరూపముసిరియా చరిత్రసిరియా పరిపాలనసిరియా ప్రజలు - సంస్కృతిసిరియా వేషధారణసిరియా ఆహార అలవాట్లుసిరియా దర్శనీయ ప్రదేశాలుసిరియా వార్తలలో సిరియా ఆర్ధికరంగంసిరియా రవాణాసౌకర్యాలుసిరియా నీటి సరఫరాసిరియా గణాంకాలుసిరియా ఇవి కూడా చూడండిసిరియా వెలుపలి లింకులుసిరియా మూలాలుసిరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

రక్తపోటుపి.వెంక‌ట్రామి రెడ్డిభారతదేశంలో బ్రిటిషు పాలనసెక్స్ (అయోమయ నివృత్తి)ఇన్‌స్టాగ్రామ్ఎఱ్రాప్రగడభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 201-300పి.సుశీలవిద్యప్రియమణిరజినీకాంత్యమున (నటి)సలేశ్వరంనర్మదా నదిడి. కె. అరుణతిరువణ్ణామలైశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిఅక్కినేని నాగ చైతన్యఅమర్ సింగ్ చంకీలావెబ్‌సైటుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుయవలుభారతీయ స్టేట్ బ్యాంకుకంప్యూటరురఘుపతి రాఘవ రాజారామ్Aకామసూత్రశుక్రుడు జ్యోతిషంఆవుషర్మిలారెడ్డిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)శివుడుఛార్మీ కౌర్భారత జాతీయ కాంగ్రెస్పొంగూరు నారాయణప్రేమ (1989 సినిమా)సమాచారంచార్మినార్సమాచార హక్కుఉండి శాసనసభ నియోజకవర్గంఆరోగ్యంనవరసాలుభారతరత్నబ్రహ్మంగారి కాలజ్ఞానంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఛత్రపతి శివాజీముహమ్మద్ ప్రవక్తసింహంశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణఎస్. జానకిఅష్టదిగ్గజములుకూన రవికుమార్దాశరథి కృష్ణమాచార్యకృతి శెట్టిభారతీయ తపాలా వ్యవస్థభారతీయ సంస్కృతివేమన శతకమురష్మి గౌతమ్మహేశ్వరి (నటి)గోవిందుడు అందరివాడేలేరాజస్తాన్ రాయల్స్సాయి ధరమ్ తేజ్వడదెబ్బఇండియన్ ప్రీమియర్ లీగ్హిందూధర్మందీపక్ పరంబోల్పరిటాల రవివిష్ణుకుండినులుఆలీ (నటుడు)తమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసిద్ధు జొన్నలగడ్డజీమెయిల్యానాంపిఠాపురంఆంధ్రజ్యోతిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితా🡆 More