మెక్సికో

మెక్సికో సంయుక్త రాష్ట్రాలు లేదా సాధారణనామం మెక్సికో, ఇది ఉత్తర అమెరికాలోని ఒక ఫెడరల్ రాజ్యాంగ ప్రజాతంత్రం; దీనికి ఎల్లలు ఉత్తరాన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం; ఆగ్నేయాన గౌతమాలా, బెలిజె, కరీబియన్ సముద్రం, తూర్పున మెక్సికో అఖాతం ఉన్నాయి.

దీనిలో 31 రాష్ట్రాలు, ఒక ఫెడరల్ జిల్లా గలదు. దీని రాజధాని మెక్సికో నగరం, ఇది ప్రపంచములోని అత్యధిక జనసాంద్రతగల నగరాలలో ఒకటి.

Estados Unidos Mexicanos
సంయుక్త మెక్సికన్ రాష్ట్రాలు
Flag of మెక్సికో మెక్సికో యొక్క Coat of arms
జాతీయగీతం
en:Himno Nacional Mexicano
మెక్సికో జాతీయగీతం
మెక్సికో యొక్క స్థానం
మెక్సికో యొక్క స్థానం
రాజధానిమెక్సికో నగరం
19°03′N 99°22′W / 19.050°N 99.367°W / 19.050; -99.367
అతి పెద్ద నగరం రాజధాని
en:National language/జాతీయ భాష లేదుస్పానిష్ భాష (en:de facto)1
ప్రజానామము Mexican
ప్రభుత్వం ఫెడరల్ రాష్ట్రపతి గణతంత్రం
 -  రాష్ట్రపతి en:Felipe Calderón
PAN పార్టీ
స్వాతంత్ర్యం స్పెయిన్ నుండి 
 -  ప్రకటింపబడినది సెప్టెంబరు 16 1810 
 -  గుర్తింపబడినది సెప్టెంబరు 27 1821 
 -  జలాలు (%) 2.5
జనాభా
 -  2007 అంచనా 108,700,891 (11th)
 -  2005 జన గణన 103,263,388 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $1.149 ట్రిలియన్ (12వ)
 -  తలసరి $11,249 (63వ)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $840.012 బిలియన్ (14వ)
 -  తలసరి $8,066 (55వ)
జినీ? (2006) 47.3 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.829 (high) (52వ)
కరెన్సీ en:Mexican peso/మెక్సికన్ పెసో (MXN)
కాలాంశం (UTC-8 to -6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mx
కాలింగ్ కోడ్ +52
1 See languages note (below):
మెక్సికో
Archaeological sites of Chichén-Itzá, one of the New Seven Wonders.

ప్రి - కొలంబియన్ ఒల్మెక్, టాల్టెక్, టియోటిహుయాకన్, జెపోటెక్, మాయా, అజ్టెక్ మొదలైన మెక్సికో పలు మెసొమెరికా నాగరికతలకు నిలయం. వీరికి మొదటి సారిగా యురేపియన్లతో సంబంధం ఏర్పడే వరకు ఈ నాగరికతలు ఇక్కడ విలసిల్లాయి. 1521లో స్పానిష్ సామ్రాజ్యం అజ్టెక్ ప్రాంతాన్ని ఆక్రమించి దానిని తమ వలసరాజ్యం చేసి దానికి వైశ్రాయిని పాలకునిగా నియమించి " న్యూ స్పెయిన్ " అని నామకరణం చేసారు. మూడు శతాబ్ధాల తరువాత ఈ ప్రాంతం మెక్సికో అయింది. 1821లో మెక్సికన్ స్వతంత్ర పోరాటం తరువాత దీనికి రాజ్యాంగపరమైన గుర్తింపు లభించింది. స్వాతంత్ర్యానంతర కాలంలో ఆర్థిక అస్థిరత, రాజకీయ మార్పులు సంభవించాయి. మెక్సికన్ అమెరికన్ యుద్ధం (1846 - 1848) ఉత్తర సరిహద్దులో భౌగోళిక మార్పులు సంభవించాయి. మెక్సికన్ భూభాగంలో మూడవ వంతు అమెరికా వశం అయింది. పాస్ట్రీ యుద్ధం, ఫ్రాంకో - మెక్సికన్ యుద్ధం, రిఫాం యుద్ధం (అంతర్యుద్ధం) జరిగాయి. తరువాత 19 వ ఎంపరర్ ఆఫ్ మెక్సికో, మెక్సికో అధ్యక్షులు పాలన కొనసాగింది. 1910లో మెక్సికన్ తిరుగుబాటు తరువాత నియంతృత్వపాలన త్రోసివేయబడింది. మెక్సికో ఆర్థికరం ఉత్తర అమెరికా ఫ్రీ ట్రేడ్ వాణిజ్య విధానాల మీద ఆధారపడి ఉంటుంది." ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో - ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " సభ్యత్వం పొందిన లాటిన్ అమెరికన్ దేశాలలో మెక్సికో ప్రథమ స్థానంలో (1994లో చేరింది) ఉంది.వరల్డ్ బ్యాంక్ మెక్సికోను అప్పర్ మిడిల్ ఇంకం కంట్రీ , కొత్తగా పారిశ్రామీకరణ చేయబడిన దేశంగాగా వర్గీకరించింది. 2050 నాటికి మెక్సికో ప్రపంచబేశాలలో 5 లేక 7 వ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. మెక్సికో ప్రాంతీయ శక్తి, మద్యశక్తిగా భావించబడుతుంది. అలాగే మెక్సికో అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ శక్తిగా భావించబడుతుంది. సుసంపన్నమైన చారిత్రక వైభవం, సాంస్కృతిక సంపద కలిగిన మెక్సికో దేశాన్ని అమెరికా ఖండంలో మొదటి స్థానంలోనూ ప్రపంచ దేశాలలో 7 వ స్థానంలోనూ ఉందని ప్రపంచవారసత్వ సంపదను గుర్తించే యునెస్కో వర్గీకరించింది. భౌగోళిక వైవిధ్యం కలిగిన ప్రపంచదేశాలలో మెక్సికో 4 వ స్థానంలో ఉంది. 2015లో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే దేశాలలో మెక్సికో 9 వ స్థానంలో ఉన్నట్లు వర్గీకరించబడింది. 2015 లో మెక్సికో 32.1 మిలియన్ల మంది విదేశీయులు సందర్శించారు. మెక్సికో ఐక్యరాజ్యసమితి, ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జి - 20, ది యునైటెడ్ ఫర్ కాంసెబ్సస్, పసిఫిక్ అలయంస్ లలో సభ్యత్వం కలిగి ఉంది.

చరిత్ర

కొలంబియా మెక్సికో ముందు కాలం

మెక్సికో 
View of the Pyramid of the Moon and entrance to the Quetzalpapálotl Palace. During its peak in the Classic era, Teotihuacan dominated the Valley of Mexico and exerted political and cultural influence in other areas, such as in the Petén Basin.

మెక్సికోలో లభించిన ఆరంభకాల మానవులు ఉపయోగించిన వస్తువులలో రాతి ఉపకరణాల ముక్కలు ప్రధానమైనవి. ఇవి మెక్సికోలోని లోయలో ఒక కేంపు ఫైర్ సమీపంలో లభించాయి. అంతేకాక 10,000 సంవత్సరాలకు ముందునాటి రేడియోకార్బన్ కూడా లభించింది. మెక్సికోలో మొక్కజొన్న, టొమాటోలు మొదటిసారిగా పండించబడ్డాయి. ఇవి వ్యవసాయ ఉపపంటలుగా పండించబడ్డాయి. వేటబృందాల గ్రామాలు క్రమంగా వ్యవసాయ బృందాలుగా మారడానికి ఇది ఆరంభంగా ఉంది. ఇది క్రీ.పూ 5,000 సంవత్సరాలకు ముందు ఆరంభం అయింది. తరువాత నిర్మాణాత్మకమైన శకాలలో మొక్కజొన్న పంట, పౌరాణిక, మతపరమైన విలక్షణాలు ఇంకా పలు విధానాలు మెక్సికన్ సంస్కృతి నుండి మెసోమెరికన్ ప్రాంతాలలో విస్తరించాయి. ఈ కాలంలోనే గ్రామప్రాంతాలు జసంఖ్య అభివృద్ధి కారణంగా జనసాంధ్రతతో నిండాయి. సాంఘిక అంతస్తులు, శిల్పకళ వంటి మార్పులతో చిన్న రాజ్యాలుగా విస్తరించాయి. పాలకులు రాజకీయంగా, మతపరంగా శక్తివంతులుగా ఉండేవారు. అలాగే పెద్ద సభావేదికలతో కూడిన నిర్మాణాలు నిర్మించబడ్డాయి. మెక్సికోలో ఆరంభకాల నాగరికతల మిశ్రమం " ఒల్మెక్ " సంస్కృతి. ఇది క్రీ.పూ. 1500 లలో గల్ఫ్ సముద్రతీరంలో విలసిల్లింది. ఒల్మెక్ సంస్కృతి మెక్సికో నుండి చియాపాస్, ఒయాక్సాకా, మెక్సికన్ లోయప్రాంతాలకు విస్తరించింది. తరువాతి కాలంలో ప్రత్యేక మతాలు, సింబాలిక్ సంప్రదాయాలు, కళలు, నిర్మాణసమూహాలు విలసిల్లాయి. తరువాతి కాలంలో ఆరు స్వతంత్ర నాగరికతలలో ఒకటిగా భావించబడుతున్న మెసొమెరికా నాగరికత రూపొందింది. తరువాత మెసిమెరికన్ కాలం, మాయానాగరికత, జపోటెక్ నాగరికతలు కలక్ముల్, మొంటే అల్బన్ లలో విలసిల్లాయి. ఈ సమయంలోనే ఎపి- ఒల్మెక్ సంస్కృతిలో మెసొమెరికన్ వ్రాత విధానం అభివృద్ధి చెందింది. మెసొమెరికన్ వ్రాత విధానం మాయా స్క్రిప్ట్ తయారీలో ఉన్నతస్థితికి చేరుకుంది. మద్య మెక్సికోలో క్లాసిక్ పీరియడ్ ఉన్నత స్థితిలో టియోటిహ్యూకన్ రాజ్యం స్థాపితమైంది. దక్షిణంలో మాయాప్రాంతం వరకు విస్తరించిన టియోటిహ్యూకన్ రాజ్యం సైన్యం రూపకల్పన, వాణిజ్యాభివృద్ధి చేసింది. టియోటిహ్యూకన్ రాజ్యంలో 1,50,000 మంది ప్రజలు నివసించారు. కొలబియన్ అమెరికా ముందుకాలంలో టియోటిహ్యూకన్ రాజ్యంలో పిరమిడును పోలిన నిర్మాణాలు నిర్మించబడ్డాయి. టియోటిహ్యూకన్ రాజ్యం క్రీ.పూ. 600 లలో పతనావస్థకు చేరుకుంది. మద్య మెక్సికోలో క్సోచికాల్కో, చొలులా వంటి రాజకీయ కేంద్రాల మద్య పోటీ వాతావరణం నెలకొన్నది.ఎపి- క్లాసిక్ కాలంలో, నహుయా ప్రజలు దక్షిణం వైపు తరలి వెళ్ళడం ఆరంభం అయింది. మెక్సొమెరికన్లు ఉత్తరం నుండి దక్షిణంవైపు విస్తరించి మద్య మెక్సికో ప్రాంతంలో ఆధిక్యత సాధిస్తూ ఓటో - మాంగుయన్ భాషాల ప్రజలను వెలుపలికి పంపారు.

క్లాసిక్ పీరియడ్ తరువాత కాలం (సా.శ.పూ.1000–1519 )

మెక్సికో 
Mural by Diego Rivera depicting the view from the Tlatelolco markets into Mexico-Tenochtitlan, one of the largest cities in the world at the time.

క్లాసిక్ కాలం ఆరంభంలో మద్యమెక్సికోలోని చిచెన్ ఇత్జా, మాయాపన్ ప్రాంతాలలో టాల్టెక్ సంస్కృతి, ఒయాక్సాకా సంస్కృతి (మిక్స్ టెక్), దిగువభూములలో మాయానాగరికత ఆధిక్యత చేసాయి.క్లాసిక్ పీరియడ్ ముగింపు కాలానికి మెక్సికా సంస్కృతి ఆధిక్యత సాధించింది.[విడమరచి రాయాలి]" అలెగ్జాండర్ వొన్ హంబోల్డ్త్" టెనొచ్తిత్లాన్ (మెక్సికన్ రాజ్యం), ఎక్సాన్ ట్లాహ్తోలోయాన్, ట్రిపుల్ అలయంస్‌లను కలిపి వ్యాపారం, అచారాలు,మతం, భాషాపరంగా సమైక్యంగా అజ్తక్ అని పేర్కొన్నాడు. 1843లో విలియం హెచ్. ప్రెస్కాట్ ఒక పబ్లికేషన్‌లో దీనిని ప్రపంచంలో చాలాప్రాంతాలు స్వీకరించాయని పేర్కొన్నాడు. 19వ శతాబ్దంపు పరిశోధకులు సహితం ప్రస్తుత మెక్సికన్లను ప్రీ- కాంక్వెస్ట్ మెక్సికన్ల నుండి ప్రత్యేకపరుస్తుందని తెలియజేసారు. దీనిని గురించి 20వ శతాబ్ధపు పరిశోధకులు కూడా చర్చించుకున్నారు.

అజ్తక్

అజ్తక్ సామ్రాజ్యం అనధికారిక ఆధిపత్య సామ్రాజ్యంగా ఉండేది. అది తాను జయించిన భూములమీద పూర్తిస్థాయి అధికారం చేయక సామంతులు ఇచ్చిన కప్పం మాత్రమే స్వీకరించి సంతృప్తి పడింది. జయించిన రాజ్యాలను సమైక్యపరచని కారణంగా అజ్తక్ సామ్రాజ్యం దీర్ఘకాలం కొనసాగలేదు. ఉదాహరణగా దక్షిణప్రాంతంలో ఉన్న సొకొనస్కొ ప్రాంతం కేంద్రంతో నేరుగా అనుసంధానింప బడలేదు. అజ్తక్ సామ్రాజ్యం ఆధిపత్యం గురించి సామంతరాజులు వివరించినప్పుడు మాత్రమే ప్రజలచేత గుర్తించబడింది. అజ్తక్ సామంతరాజుల నుండి కప్పం అందుతున్నంత కాలం వారి అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోలేదు. మద్య మెక్సికోలోని అజ్తక్ సామ్రాజ్యం సామంతరాజ్యాలతో కూడిన సామ్రాజ్యంగా మద్య మెక్సికో ప్రాంతమంతా విస్తరించింది. అజ్తక్ సామ్రాజ్యంలో నరబలి ఆచారం అత్యంత అధికంగా ఉండేది. అదేసమయంలో వారు వారి సమకాలీనులైన స్పెయినీయులకంటే యుద్ధభూమిలో శత్రువులను వధించడం అత్యంత అల్పంగా ఉండేది. యుద్ధభూమిలో శత్రువులను వధించడాన్ని వారు నివారించారు. స్పెయినీయులు యుద్ధభూమిలో వెనువెంటనే శత్రువులను హతమార్చేవారు. 16వ శతాబ్దంలో స్పెయిన్ ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత ఈప్రాంతంలో నరబలి ఇచ్చే ఆచారం ముగింపుకు వచ్చింది. తరువాత శతాబ్దంలో స్పెయిన్ పాలనలో మెక్సికన్ సంస్కృతులు అంర్భాగంగా ఉన్నాయి.

అజ్తక్ ట్రిపుల్ అలయంస్ విజయం (1519–1521)

మెక్సికో 
Hernán Cortés and La Malinche meet Moctezuma II. The image is from the Lienzo de Tlaxcala, created c. 1550 by the Tlaxcalans to remind the Spanish of their loyalty and the importance of Tlaxcala during the conquest.

1518లో " జుయాన్ డీ గ్రిజల్వా " అన్వేషణ కారణంగా మెక్సికో గురించి స్పెయిన్ వాసులు తెలుసుకున్నారు.స్థానికులు కొలుయా కొలుయా, మెక్సికో మెక్సికో అని పదేపదే చెపుతున్నా అన్వేషకులకు మొంటెజుమా గవర్నరును కలుసుకునే వరకు మెక్సికో, కొలుయా అంటే అర్ధం తెలియరాలేదు. : 33–36  1519 ఫిబ్రవరిలో హెర్నాన్ కోర్టెస్ 500 మంది సాహసవీరులతో వెరాక్రజ్ నౌకాశ్రయానికి చేరి ఈప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నారు. నగరాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆయన అజ్తక్ రాజధాని నగరానికి చేరుకున్నాడు. ఆయన బంగారం, ఇతర సంపదల కొరకు అన్వేషణ సాగిస్తున్న సమయంలో కోర్టెస్ అజ్తక్ సామ్రాజ్యాన్ని జయించాలని కోరుకున్నాడు.

మెక్సికో 
Storming of the Teocalli by Cortez and his troops. Emanuel Leutze. Painting, 1848

స్పెయినీయులు ఈప్రాంతానికి చేరుకునే సమయంలో అజ్తక్ సామ్రాజ్యానికి పాలకునిగా ఉన్న రెండవ మొక్తెజుమా తరువాత మరణించాడు. ఆయన తరువాత అధికారపీఠం అధిరోహించిన ఆయన సహోదరుడు కుయిత్లాహుయాక్ అజ్తక్ సామ్రాజ్యంలో స్మాల్ ఫాక్స్ అంటురోగానికి బలైనవారిలో ప్రథముడుగా ఉన్నాడు. అతి త్వరలోనే స్మాల్ ఫాక్స్ ఈప్రాంతం అంతటా వ్యాపించింది. స్పెయిన్‌లో ఉన్న స్మాల్ ఫాక్స్ అనుకోకుండా స్పెయిన్ దాడిదారులద్వారా మెక్సికోలో ప్రవేశించి 1520లో మెసోమెరికాలో వలయం సృష్టించింది. అది 3 మిలియన్లకంటే అధికమైన ప్రజల ప్రాణాలను హరించింది.మెక్సికన్ల వద్ద దానిని నివారించే ఔషధం లేదు. ఇతర వనరుల ఆధారంగా అజ్తక్ మరణాల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుందని (మొత్తం జనసంఖ్య 30 మిలియన్లకంటే తక్కువ) అంచనావేసారు. తీవ్రంగా బలహీనపడిన అజ్తక్ సామ్రాజ్యాన్ని కోర్టెస్ సులువుగా ఓడించాయి. ఆయన ట్లాక్స్‌కాలా సాయంతో రెండవ తిరుగుబాటు సాగించాడు. ఆసమయంలో ట్లాక్స్‌కాలా జనసంఖ్య 3,00,000 ఉండేది. స్థానిక జనసంఖ్య 80%-90% క్షీణించి 1-2.5 మిలియన్లకు చేరుకుంది. ప్రీ - కొలంబియన్ జనసంఖ్య 8-12 మిలియన్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆధునిక రాజ్యాల జనసఖ్య వచ్చి చేరిందని భావిస్తున్నారు. స్మాల్ ఫాక్స్ అధికంగా అజ్తక్ ప్రజలను మరణానికి గురిచేసింది. స్పెయిన్ ప్రజలు అధికంగా ఈవ్యాధిబారిన పడలేదు.శతాబ్ధాల కాలంగా ఈవ్యాధి యురేపియన్లలో వ్యాపించి ఉన్న కారణంగా యురేపియన్లలో వ్యాధినిరోధకశక్తి అధికరించి ఉంటుందని భావిస్తున్నారు. స్మాల్ ఫాక్స్ కారణంగా సంభవించిన మరణాలు మెక్సికోలో క్రైస్తవమతం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి సాయపడిందని పరిశోధకుల భావన. ఆరంభంలో అంటువ్యాధి భగవంతుని ఆగ్రహం, దండన అని అజ్తక్ ప్రజలు భావించారు. తరువాత అది వారి దురదృష్టమని భావించి వారు స్పెయిన్ వారిని అడ్డుకోవడానికి అశక్తులు అయ్యారు. వ్యాధి నుండి తప్పించుకున్న అజ్తక్ ప్రజలు స్మాల్ ఫాక్స్ గొప్పశక్తివంటుడైన క్రైస్తవ దేవునికి సహకరించిందని విశ్వసించారు. అది వారిని క్రైస్తవమతం అంగీకరించడానికి అనుకూలంగా మారడమే కాక స్పెయిన్ పాలన ఈప్రాంతం అంతటా విస్తరించడానికి సహకరించింది. తరువాత ఈప్రాంతం అంతా న్యూ స్పెయిన్ పేరుతో స్పెయిన్ సామ్రాజ్యంలో భాగంగా మారింది.1521లో టెనోచ్తిట్లాన్ పతనం తరువాత కోర్టెస్ మెక్సికో నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు. మెక్సికో ప్రత్యేకలక్షణాలు, నిర్మాణశైలి 300 సంవత్సరాల యురేపియన్ పాలనలో రూపొందింది.

న్యూ స్పెయిన్ విజయం (1521–1821)

మెక్సికో 
Equestrian statue of Charles IV, Mexico City, Manuel Tolsá. The Spanish Monarch was the maximum authority in New Spain and ruled via a viceroy.

టెనోచ్తిట్లాన్ స్వాధీనం చేసుకుని 1521లో మెక్సికో నగరాన్ని తిరిగి స్థాపించడంతో " న్యువా ఎస్పానా " (న్యూ మెక్సికో) పేరుతో 300 సంవత్సరాల యురేపియన్ శకం ఆరంభం అయింది. న్యూ స్పెయిన్ రాజ్యం అజ్తక్ ఆధిపత్య సామ్రాజ్య అవశేషాల మీద నిర్మించబడింది. తరువాత తారస్కాన్ రాజ్యం జయించి న్యూస్పెయిన్ రాజ్యవిస్తరణ ఆరంభం అయింది. ఫలితంగా 1535లో న్యూస్పెయిన్ వైశ్రాయి నియమించబడ్డాడు. వైశ్రాయి న్యూస్పెయిన్ రాజ్యానికి ఆధునిక మెక్సికో, సెంట్రల్ అమెరికా, దక్షిణ ప్రాంతంలోని కోస్టారికా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ ప్రాంతాలు చేర్చి రాజ్యవిస్తరణ చేసాడు. వైస్రీగల్ రాజధాని మెక్సికో నగరం స్పెయినిస్ వెస్టిండీస్ (కరిబ్బీన్), ది స్పానిష్ ఈస్టిండీస్ (ఫిలిప్పైంస్), స్పానిష్ ఫ్లోరిడా పాలనాబాధ్యతలు నిర్వహించింది.

జనసంఖ్య

17వ శతాబ్దం నాటికి మెక్సికో జనసంఖ్య 5-10 మిలియన్లకు చేరుకోగా స్థానికప్రజల సంఖ్య మాత్రం 1-1.5 మిలియన్లు మాత్రమే ఉంది.స్మాల్ ఫాక్స్ వంటి అంటువ్యాధుల కారణంగా జనసంఖ్య క్షీణించింది. మెక్సికోలో స్మాల్ ఫాక్స్ కొలంబియన్ ఎక్సేంజ్ కాలంలో ప్రవేశించింది. 300 సంవత్సరాల కాలంలో దాదాపు 4.50,000 మంది యురేపియన్లు,లు 2,00,000 నుండి 2,50,000 ఆఫ్రికన్లు, 40,000 నుండి 1,20,000 మంది ఆసియన్లు మెక్సికోకు చేరుకున్నారు. 18వ శతాబ్దంలో మెస్టిజోస్ సంఖ్య అత్యధికంగా అభివృద్ధి చెందింది.

స్పెయిన్ పాలనతో కాలనీ చట్టం ప్రవేశపెట్టి దానికి స్థానిక న్యాయసంప్రదాయం (కాబిల్డో) జతచేయబడింది. ఉన్నతాధికారులు స్థానికులతో సన్నిహితంగా ఉండేవారు. స్పెయిన్ రిపబ్లికన్ల మద్య జాతిపరంగా విభజించి రాజ్యంగవిధానాలు రూపుదిద్దుకున్నాయి. అమెరిండియన్లు, కాస్టాస్, అటానిమస్, నేరుగా రాజుమీద ఆధారపడినవారు.

మెక్సికో 
Portrait of Sor Juana Ines de la Cruz, oil on canvas, 1772.

1524లో కౌంసిల్ ఆఫ్ ఇండీస్, ది మెండికెంట్ రిలీజియస్ ఆర్డర్స్ మెసొమెరికాను చేరాయి. స్పెయిన్ కొరకు రాజధాని నిర్మాణం, అమెరిండియన్ ప్రజలను కాథలిక్కులుగా మార్చడానికి కృషిచేయబడింది. 1531లో మద్య మెక్సికోలో మారియన్ అప్పరిషన్ నుండి సెయింట్ జుయాన్ డియాగో వరకు ఉన్న ప్రదేశానికి సౌదర్యశోభను అందించాలని ప్రేరణ కలిగించబడింది.క్రియోలో దేశభక్తికి " ది వర్జిన్ ఆఫ్ గుయాడల్పె " చిహ్నంగా మారింది. దీనిని తీవ్రవాదులు స్వాతంత్ర్య సమరంలో నినాదంగా ఉపయోగించుకున్నారు. కొతమంది క్రిప్టో - యూద కుటుంబాలు స్పానిష్ విచారణను ఎదుర్కొనడానికి మెక్సికో చేరుకున్నారు.

ఆర్ధికాభివృద్ధి

జకాటెకాస్, గుయానజుయాటో ప్రాంతాలలో అత్యధికంగా ఉన్న వెండి నిల్వల వెలికితీత న్యూ స్పెయిన్ ఆర్థికరంగంలో ఆధిక్యత చేసింది. వెండి ఉత్పత్తుల మీద విధించిన పన్ను స్పెయిన్ ప్రధాన ఆదాయవనరుగా మారింది. ఇతర పరిశ్రమలలో ఎంకోమిండియా, రిపార్టియంటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న హసియండాస్, మెర్కేంటైల్ పరిశ్రమలు ప్రధాననగరాలు, నౌకాశ్రయాలలో స్థాపించబడ్డాయి. కాలనీపాలనలో సృష్టించబడిన సంపద కారణంగా సరికొత్త స్పెయిన్ శిల్పకళాభివృద్ధికి సహకరించింది. ఆసియా, ఇతర అమెరికా, ఆఫ్రికా, ఐరోపా వాణిజ్యసంబంధాలు అధికరించినదానికి ఫలితంగా, వెండి ఉత్పత్తులు 16వ -18వ శతాబ్ధాలలో ప్రపణ్చవ్యాప్తంగా విక్రయించిన కారణంగా గ్లోబలైజ్ ఆర్థికసంపద కలిగిన మొదటి ప్రాంతంగా మెక్సికో అభివృద్ధి చెందింది. వాణిజ్యకూడలిలో ఉన్నందున మెక్సికో వాణిజ్యం, ప్రజలు, సంస్కృతి గుర్తింపు పొందిన కారణంగా మెక్సికో నగరం " ఫస్ట్ వరల్డ్ సిటీ "గా అవతరించింది. రెండున్నర శతాబ్దాలుగా నడుపబడుతున్న " నయో డీ చైనా " (మనిలా గాలియోంస్) న్యూస్పెయిన్‌ను ఆసియాతో అనుసంధానం చేసింది. వెరాక్రజ్ వస్తువులను అమెరికా , స్పెయిన్ లోని అట్లాంటిక్ నౌకాశ్రయాలకు చేర్చబడ్డాయి. యురేపియన్ వస్తువులు, వలస ప్రజలు , ఆఫ్రికన్ బానిసలు న్యూ స్పెయిన్ ప్రధానభూభాగానికి చేరడానికి వెరాక్రజ్ నౌకాశ్రయం ప్రధానద్వారంగా ఉంది. ది కామినో రియల్ డీ టియెర్రా అడెంట్రో మెక్సికో నగరాన్ని లోతట్టు ప్రాంతంలో ఉన్న న్యూస్పెయిన్‌తో అనుసంధానం చేసింది.

మెక్సికో 
Guanajuato City became the world's leading silver producer in the 18th century as a result of the veta madre.

న్యూ మెక్సికో ప్రత్యేకతలు

న్యూస్పెయిన్ ప్రాముఖ్యత అధికరించిన కాలంలో అమెరికాలో మొదటి ప్రింటింగ్ షాప్ (1539), మొదటి విశ్వవిద్యాలయం (1551) (రాయల్ అండ్ పొంటిఫికల్ యూనివర్శిటీ), మొదటి పబ్లిక్ పార్క్ (అల్మెడా సెంట్రల్) (1592) , బిబ్లియోటెకా పాలాఫాక్సియానా (1646) (మొదటి పబ్లిక్ లైబ్రరీ) స్థాపించినట్లు మెక్సికో సగర్వంగా ప్రకటించుకొన్నది. జుయాన్ రూయిజ్ డీ అలార్కాన్ , జుయానా ఇనెస్ డీ లా క్రజ్ వంటి రచయితలు, క్రిస్టోబల్ డీ విల్లాల్పాండో , మైగ్యుయల్ కాబ్రెరా వంటి చిత్రకారులమాన్యుయల్ టోల్సా (ఆర్కిటెక్ట్) , మొదలైన కళాకారులు కాలనీపాలనలో కీర్తిగడించారు.అంతేకాక మెక్సికోలో మొదటిసారిగా ది అకాడమీ ఆఫ్ శాన్ కార్లోస్ పాఠశాల , మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఇన్ అమెరికాస్ స్థాపించబడింది.మెక్సికన్ పరిశోధకుడు " అండ్రెస్ మాన్యుయల్ డెల్ రియో ఫెర్నాండెజ్ మొదటిసారిగా వానడియం ఎలిమెంటును కనుగొన్నాడు.

స్పెయిన్ సైన్యం

స్పెయిన్ సైన్యం కొన్నిమార్లు స్థానిక సంకీర్ణంతో దాడిచేసి భూభాగాలను జయించింది. అలాగే తిరుగుబాటుదారులను అరికట్టడానికి కాలనీ శకం అంతా కృషిచేసింది. ఉత్తర న్యూ స్పెయిన్‌లో జరిగిన అమెరిండియన్ తిరుగుబాటు, చిచిమెకా యుద్ధం (1576-1606), టెపెహుయాన్ తిరుగుబాటు (1616-1620), ప్యూబ్లో తిరుగుబాటు (1680) లలో అరికట్టగలిగినది. మెక్సికోను ఇంగ్లీష్, ఫ్రెంచ్, డచ్ సముద్రపు దొంగల నుండి రక్షించింది. విదేశీ వాణిజ్యం కొరకు రెండు నౌకాశ్రయాలను (అట్లాంటిక్ లోని వెరాక్రజ్, పసిఫిక్‌లో అకాపుల్కో) నిర్వహించి రాజ్యాధికారాన్ని కాపాడుకుంది. సముద్రపు దొంగల దాడిలో 1663 లో జరిగిన శాక్ ఆఫ్ కాంపెచే, 1683 లో జరిగిన అటాక్ ఆన్ వెరాక్రజ్ ప్రధానమైనవి. టేక్యుయిలా (16వ శతాబ్దం), చర్రెరియా (17వ శతాబ్దం), మరియాచి (18వ శతాబ్దం), మెక్సికన్ ఆహారసంస్కృతి మొదలైన మెక్సికన్ సంస్కృతులు కాలనీశకంలో అభివృద్ధి చెందాయి.

స్వాతంత్రసమరం (1810–1821)

మెక్సికో 
Depiction of the Abrazo de Acatempan between Agustin de Iturbide, left, and Vicente Guerrero.

1810 సెప్టెంబరు 16న జుంటా పాలనకు వ్యతిరేకంగా ప్రీస్టు " మైగ్యుయల్ హిడాల్గో కోస్టిల్లా " డోలోరెస్ అనే చిన్నపట్టణంలో " లాయలిస్ట్ రివోల్ట్ " ప్రకటించాడు. మొదటి తిరుగుబాటు బృందంలో హిడాల్గో, స్పెయిన్ వైరీగల్ ఆర్మీ కేప్టన్ " ఇగ్నాసియో అలెండే ", మిలిటియా కేప్టన్ జుయాన్ అల్డమా, లా కొర్రెగిడోరా " జోసెఫా ఆర్టిజ్ డీ డోమింక్యూజ్ " భాగస్వామ్యం వహించారు. హిడాల్గో కొంత మంది సైన్యంతో పట్టుబడి " ఫైరింగ్ స్క్వాడ్ " చేతిలో వచిహుయాహుయాలో 1811 జూలైలో వధించబడ్డారు. ఈ మరణం తరువాత ప్రీస్ట్ " జోస్ మరియా మొరెలోస్ " తిరుగుబాటు బృందానికి నాయకత్వం వహించి కీలకమైన దక్షిణనగరాలను స్వాధీనం చేసుకున్నాడు.1813 నవంబరు 6న చిపాంచింగో కాంగ్రెస్ సమావేశమై " సోలెమ్న్ యాక్ట్ ఆఫ్ ది ఇండిపెండెంస్ ఆఫ్ నార్తెన్ అమెరికా " మీద సంతకం చేసింది. 1815 డిసెంబరు 15న మొరెలోస్‌ను పట్టుకుని మరణశిక్ష విధించబడింది.

తరువాత కొన్ని సంవత్సరాల కాలం తిరుగుబాటు దాదాపు చల్లబడింది. అయినప్పటికీ 1820లో వైశ్రాయి " జుయాన్ డీ అపోడకా " క్రియోలో జనరల్ " అగస్టిన్ డీ ఇటర్బైడ్ నాయకత్వంలో విసెంటె గ్యుర్రెరో సైన్యానికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపాడు. ఇటర్బైడ్ గుర్రెరోను కలిసి తమతో కలవమని కోరాడు. 1821 స్పెయిన్ రాజప్రతినిధులు , ఇటర్బైడ్ " ట్రీటీ ఆఫ్ కొర్డోబా " , ది డిక్లరేషన్ ఆఫ్ ఇండిఒఎండెంస్ ఆఫ్ ది మెక్సికన్ ఎంపైర్ " మీద సంతకం చేసారు. దీనిని ప్లాన్ ఆఫ్ ఇగుయాలా షరతుల ఆధారంగా " ఇండిఒఎండెంస్ ఆఫ్ మెక్సికో "గా గుర్తించారు.

మెక్సికో స్వతంత్రసమరం తరువాత జరిగిన స్వల్పమైన అభివృద్ధి అంతర్యుద్ధం , 1850లో మొదలైన అస్థిరత కారణంగా కొంతకాలం ఆగిపోయింది. పొర్ఫిరియో డియాజ్ ప్రభుత్వం పరిస్థితులను చక్కబెట్టే వరకు కొనసాగిన ఆర్థికమాంధ్యం తరువాత అభివృద్ధిపధంలో కొనసాగింది. 1850 మద్య నుండి ఆరంభమైన సంఘర్షణలు దేశమంతటా వ్యాపించి గ్రామీణప్రాంతాలలో విభిన్నమైన సంప్రదాయప్రజలు, హసియండాస్ , రాజకీయ, రిపబ్లికన్లు, మొనార్చిస్టుల మద్య జాతి కలహాలుగా మారాయి.

మొదటి సామ్రాజ్యం , మొదటి రిపబ్లిక్ (1821–1846)

మెక్సికో 
The territorial evolution of Mexico after independence, noting the secession of Central America (purple), Chiapas annexed from Guatemala (blue), losses to the US (red, white and orange) and the reannexation of the Republic of Yucatan (red).

1822లో అగస్టిన్ డీ ఇట్రూబైడ్ ఫస్ట్ మెక్సికన్ సామ్రాజ్య రాజ్యాంగానికి చక్రవర్తి అయ్యాడు. 1833లో చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఫస్ట్ మెక్సికన్ రిపబ్లిక్ స్థాపించబడింది. 1824లో రిపబ్లికన్ రాజ్యాంగం ఏర్పాటుచేయబడి గుయాడాల్పె విక్టోరియా కొత్తగా జనించిన దేశానికి అధ్యక్షుడయ్యాడు. చియాపాస్‌తో చేరిన మద్య అమెరికా యూనియన్ నుండి వెలుపలికి పోయింది. 1829లో అధ్యక్షుడు " విసెంటే గుయార్రెరో " మెక్సికోలో బానిసత్వాన్ని రద్దు చేసాడు.

ఆర్ధికం

స్వతంత్రం వచ్చిన తరువాత మొదటి దశాబ్ధాలలో ఆర్థికస్థితి పాస్ట్రీ యుద్ధానికి (1836) దారితీసింది. లిబరల్స్, ఫెడరల్ రిపబ్లిక్ మద్దతుదారులు , యూనిటరీ రాజ్యం ప్రతిపాదన చేసిన కంసర్వేటివ్స్ మద్య నిరంతరం కలహాలు కొనసాగాయి.[ఆధారం చూపాలి]ఈ సమయంలో సరిహద్దులలో ఉన్న భూభాగాలు మెక్సికో ప్రభుత్వం మద్య దూరం అధికమైంది. గుత్తపధ్యం కలిగిన ఆర్థికవిధానాలు ప్రజలను బాధించాయి. పరిమితమైన వ్యాపారం కారణంగా ప్రజలు పన్నులు కట్టడానికి కష్టపడ్డారు. ఫలితంగా కేంద్రప్రభుత్వం పన్నులు వసూలు చేస్తున్న విధానం మీద ప్రజలలో ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిఫోర్నియా , టెక్సాస్ మద్య విస్తరించింది. స్పెయిన్ కాలనీ నుండి వెళ్ళిన తరువాత మిషన్ విధానం , సైనిక విధానం పతనావస్థకు చేరుకుంది. ఆల్టా కలిఫోర్నియా , న్యూమెక్సికో గొప్ప అస్థిరత చోటుచేసుకుంది.క్రూరమైన స్థానిక అమెరికన్ల నుండి తమనుతాము రక్షించుకోవడానికి సరిహద్దుప్రాంతంలోని ప్రజలు ప్రాంతీయంగా సైన్యం ఏర్పాటుచేసుకున్నారు. దేశకేంద్రం నుండి ఈప్రాంతాలు ప్రత్యేకదిశలో అభివృద్ధి చెందాయి. సరిహద్దు ప్రాంతాలను క్రమబద్ధీకరణచేసి అభివృద్ధి చేయడానికి మెక్సికన్ ప్రభుత్వం ప్రస్తుత టెక్సస్ ప్రాంతానికి వలసపోవడానికి ప్రోత్సాహం అందించింది. అయినప్పటికీ వారు మద్య అమెరికా నుండి ప్రజలను టెక్సాస్ ప్రాంతానికి తరలివెళ్ళేలా ప్రజలకు నచ్చచెప్పడంలో అశక్తులయ్యారు. యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన ప్రొటెస్టెంట్ ఇంగ్లీష్ భాషా మాట్లాడే ప్రజలలో టెక్సాస్ తరలివెళ్ళిన వారికి ప్రోత్సాహకరంగా మతస్వేచ్ఛ కల్పించబడింది. కొద్ది సంవత్సరాలలో ఈప్రాంతంలోని టెజెనో ప్రాంతంలో ఇంగ్లీష్ ప్రజల సంఖ్య ఆధిక్యతలో ఉంది. స్వేచ్ఛామార్కెట్ విధానాల కారణంగా వ్యాపారులు ఒకప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులువుగా చేరుకోవడానికి సాధ్యం అయింది. టెజనో ప్రాంతం ప్రభుత్వానికి అతీతంగా అభివృద్ధి చెందింది. ఈప్రాంతం అలక్ష్యం చేసిన కారణంగా ఇగ్లీష్ మాట్లాడే అమెరికన్ల మద్దతుతో ఈ ప్రాంతానికి స్వతంత్రం కావాలని ఉద్యమం ఆరంభం అయింది. 1836లో జనరల్ " అంటోనియో లోపెజ్ డీ శాంటా అన్నా " (సెంట్రలిస్ట్ , రెండుమార్లు నియంత) సియాటే లేస్‌ను ఆమోదించాడు.తరువాత రిపలిక్ ఆఫ్ టెక్సాస్, రిపబ్లిక్ ఆఫ్ ది రియో గ్రాండే , రిపబ్లిక్ ఆఫ్ యుకేటన్ స్వాతంత్ర్యం ప్రకటించాయి.

రెండవ రిపబ్లిక్ , రెండవ సాంరాజ్యం (1846–1867)

మెక్సికో 
Benito Juárez, 26th President of Mexico

1846లో యునైటెడ్ స్టేట్స్ టెక్సాస్ రిపబ్లికన్‌ను విలీనం చేసుకుంది. తరువాత అమెరికన్ సైన్యం టెక్సాస్‌లో భాగంగా ఉన్న కొయాహులియా భూభాగం మీద ఆకస్మిక దాడి చేసింది. 1848లో " ట్రీటీ ఆఫ్ గుయాడాలుపే హిండాల్గో " ఒప్పందం ద్వారా యుద్ధం ముగింపుకు వచ్చింది. 1854లో మెక్సికో బలవంతంగా తన భూభాగంలోని మూడవ వంతుకంటే అధికంగా యు.ఎస్. ప్రభుత్వానికి అప్పగించింది. ఇందులో ఆల్టా కలిఫోర్నియా, శాంటా ఫె డీ న్యువో మెక్సికో , టెక్సాస్ ఆధీనంలో ఉన్న భూభాగం అంతర్భాగంగా ఉంది. బదులుగా ఆగ్నేయ న్యూ మెక్సికో , ప్రస్తుత దక్షిణ అరిజోనా ప్రాంతాలు మెక్సికోకు అప్పగించబడ్డాయి. ఆధునిక స్థానిక అమెరికన్ తిరుగుబాటులో ది కాస్టే వార్ ఆఫ్ యుకాటన్, ది మాయా తిరుగుబాటు 1847 ప్రధానమైనవిగా భావిస్తున్నారు. 1930 వరకు మాయా తిరుగుబాటు కొనసాగింది. శాంటా అన్నా తిరిగి అధికారానికి రావడం అసంతృప్తికి గురిచేసిన కారణంగా " లిబరల్ ప్లాన్ ఆఫ్ అయుట్లా " (లా రిఫార్మా) ఆరంభం కావడానికి దారితీసింది. 1857లో కొత్త రాజ్యాంగం మతాతీత దేశంగా ఫెడరల్ ప్రభుత్వం పలు స్వాతంత్ర్య ప్రతిపాదనలతో రూపుదిద్దబడింది.దీనిని కంసర్వేడర్స్ అంగీకరించలేదు. 1858లో సంస్కరణల యుద్ధం ఆరంభం అయింది.ఈ సమయంలో రెండు గ్రూపులకు వారి స్వంత ప్రభుత్వాలు ఏర్పాటుచేయబడ్డాయి.లిబరల్స్ విజయంతో 1961లో యుద్ధం ముగింపుకు వచ్చింది.లిబరల్స్‌కు జెపొటెక్ వర్గానికి చెందిన అధ్యక్షుడు " బెనిటో జుయారెజ్ నాయకత్వం వహించాడు.1860లో మెక్సికోను ఫ్రెంచ్ ఆక్రమించి హాబ్స్బర్గ్ పాలనలో " సెకండ్ మెక్సికన్ ఎంపైర్ " (రెండవ మెక్సికన్ సామ్రాజ్యం) స్థాపించింది.

పొర్ఫిరియాటో (1876–1911)

ఫ్రెంచ్ జోక్యం చేసుకున్న సమయంలో రిపబ్లికన్ జనరల్ " పోర్ఫిరియొ డియాజ్ " 1876లో 29వ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1880 ఎన్నికలలో మాన్యుయల్ గాంజలెజ్ ఫ్లోరెస్ విజయం సాధించాడు. 1884లో డియాజ్ తిరిగి విజయం సాధించి 1911 వరకు పాలన సాగించాడు. ఈకాలం ఆర్థికస్థిరత్వం, అభివృద్ధి, విదేశీపెట్టుబడులు, పలుకుబడి సాధించి పొర్ఫిరియాటో అని పేర్కొనబడింది. ఆర్ట్, సైన్సు రంగాలలో పెట్టుబడులు పెట్టబడ్డాయి. మెక్సికోలో రైలుమార్గాలు నిర్మాణం, టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చెందింది. ఈకాలంలో రాజకీయాల ఆధిక్యత, ఆర్థిక అసమానతలు అధికమయ్యాయి. వారువేదాంతం, భావుకతావాదాలను తిరస్కరించారు. దేశాభివృద్ధికి సైన్సు మాత్రమే సహకరిస్తుందని వారు విశ్వసించారు. డియాజ్ పాలనలోపలాకో డీ బెల్లాస్ ఆర్టెస్, పలాసియో డీ కొర్రియోస్ డీ మెక్సికో, మోన్యుమెంటో ఎ లా ఇండిపెండెంస్, పలాసియో లెగిస్లాటివో (అది మోన్యుమెంటో ఎ లా రివొల్యూసియన్ చేయబడింది) వంటి పలు ప్రముఖ భవనాలు, స్మారకచిహ్నాలు నిర్మించబడ్డాయి.

మెక్సికన్ విప్లవం , ఒకే పార్టీ పాలన (1910–2000)

మెక్సికో 
Francisco I. Madero with Emiliano Zapata, in Cuernavaca during the Mexican Revolution.

1908లో అధ్యక్షుడు డియాజ్ తాను 1911లో పదవీవిరమణ చేస్తానని ప్రకటించిన కారణంగా సరికొత్త సంకీర్ణాలు ఆరంభం అయ్యాయి. ఒక ప్రదర్శనలో యు.ఎస్. మద్దతుతో డియాజ్, విలియం హావర్డ్ టాఫ్ట్ 1909 అక్టోబరు 16న ఎల్ పాసో (టెక్సాస్), సియుడాడ్ జుయారెజ్ (మెక్సికో) లలో సమ్మిట్ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ చారిత్రాత్మక సంఘటన ద్వారా యు.ఎస్., మెక్సికోల మద్య మొదటి సమావేశం నిర్వహించబడడమేకాక మొదటిసారిగా అమెరికన్ అధ్యక్షుడు మొదటిసారిగా అమెరికన్ సరిహద్దులు దాటి మెక్సికోలో ప్రవేశించాడు. సమావేశంలో రెండు వర్గాలు వివాదాస్పదమైన చమిజాల్ స్ట్రిపి నుండి ఎల్ పాసో (టెక్సాస్), సియుడాడ్ జుయారెజ్ (మెక్సికో)ల మద్య ప్రాంతన్ని నేచురల్ టెర్రిటరీగా భావించాలని సమావేశం సమయంలో ఎటువంటి జాతీయపతాకాలు ఉండకూడదన్న నిర్ణయానికి అంగీకరించాయి.సమావేశం ఈభూవివాదంపై కేద్రీకరించినందున రక్షణ సమస్యలు, కాల్చివేత బెదిరింపులుబెదురయ్యాయి. సమావేశ సనయంలో ఫ్రెడరిక్ రుస్సెల్, ఎన్నిక చేయబడున స్కౌట్ బృందం, సి.ఆర్. మోర్ (టెక్సాస్ రేంజర్) ఎల్ పాసో చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం సమయంలో ప్రొసెషన్ మార్గంలో ఒక వ్యక్తి చేతితుపాకీతో మరుగున నిలిచి ఉండడం గమనించి ఆయనను నిరాయుధుడిని చేసారు. ఇది డియాజ్, టాఫ్ట్ నిలిచిఉన్న ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే జరిగింది. ఇద్దరు అధ్యక్షులు రక్షించబడ్డారు సమావేశం నిరాటకంగా జరిగింది.

అంతర్యుద్ధం

డియాజ్ 1910 ఎన్నికలలో తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అయినప్పటికీ ఎన్నికలలో జరిగిన మోసాలు ఆయనను ఫ్రాన్స్‌కు పారిపోయేలా చేసాయి. ఇది ఫ్రాంసిస్కో ఐ మాడిరో నాయకత్వంలో తిరుగుబాటు విప్లవం ఆరంభం అయింది.మాడిరో అధ్యక్షునిగా ఎన్నికై రెండు సంవత్సరాల తరువాత కంసర్వేటివ్ జనరల్ " విక్టోరియానో హ్యూర్టా " నాయకత్వంలో జరిగిన తిరుగుబాటులో హత్యచేయబడ్డాడు. ఈ సంఘటన తిరిగి అంతర్యుద్ధానికి దారితీసింది. అంతర్యుద్ధంలో భాగస్వామ్యం వహించిన ఫ్రాంసిస్కో, ఎమిలానో జపాటాలు వారి స్వంత సైన్యం రూపొందించారు. మూడవదిగా రాజ్యాంగం వెనుస్టియానో కర్రాంజా నాయకత్వంలో రూపొందించిన సైన్యం అంతర్యుద్ధాన్ని ముగింపుకు తీసుకువచ్చింది. 1857లో రూపొందించబడిన రాజ్యాంగచట్టాలు సాంఘిక ప్రాతిపదిక, విప్లవదారుల షరతుల ఆధారంగా " మెక్సికో రాజ్యాంగం (1917) " పేరిట దిద్దుబాటు చేయబడింది. అంతర్యుద్ధంలో 9,00,000 మంది మరణించారని అంచనా వేయబడింది.1920లో కర్రంజా తిరుగుబాటు నాయకుడయ్యాడు. ఒబ్రెగాన్ 1928లో తిరిగి ఎన్నికై ఆయన అధికారం స్వీకరించే లోపే హత్యచేయబడ్డాడు. ఇది తిరుగుబాటు సమయం అని భావించినా అధ్యక్షుడు డియాజో హత్యాప్రయత్నం నుండి తప్పించుకున్నప్పటి నుండి వెనుస్టియానో హత్య (1920), అల్వరో ఒబ్రెగాన్ (1928), మునుపటి తిరుగుబాటు నాయకుడు ఎమిలియాంజో జపాటా (1919), పాంచో విల్లా (1923) కాలం వరకూ అంతర్యుద్ధకాలంగా కూడా భావించబడింది.

ఒకే పార్టీ పాలన (1929–2000)

1929లో కాలెస్ " నేషనల్ రివల్యూషనరీ పార్టీ " స్త్యాపించాడు. తరువాత దీనికి " ఇంస్టిట్యూట్ రివల్యూషనరీ పార్టీ " అని పేరు మార్చబడింది. తరువాత జరిగిన ఎన్నికలలో విజయంసాధించిన " లజారో కాఎడెనాస్ " పలు సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అందులో మెక్సికన్ అయిల్ ఎక్స్ప్లొరేషన్ (1938) స్థాపించబడింది. దీనిని యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం - డచ్ మెక్సికన్ ఈగిల్ పెట్రోలియం కంపెనీ పేరుతో నేషనలైజ్డ్ చేసింది. ఫలితంగా దేశానికి స్వంతమైన " పెమెక్స్ " ఆయిల్ కంపెనీ స్త్యాపించబడింది.కార్డినెనాస్ విధానాల కారణంగావ్యాపారం కోల్పోయిన ఆయాదేశాలకు చెందిన పౌరుల వత్తిడి కారణంగా ఆయాదేశాల మద్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఈ కంపెనీ అప్పటి నుండి మెక్సికన్ ఆర్థికరంగంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

మెక్సికో 
Students in a burned bus during the protests of 1968.

1940, 1980 మద్య మెక్సికో బీద దేశంగా ఉండి పోయింది. తరువాత జరిగిన ఆర్థికాభివృద్ధి " మెక్సికన్ మిరాకిల్ "గా అభివర్ణించబడింది. ఆర్ధికాభివృద్ధి కొనసాగినప్పటికీ సాంఘిక అసమానత ప్రజలలో అసంతృప్తి కలిగించింది. అదనంగా పి.ఆర్.ఐ పాలన అధికారయుతంగా మారింది భారంగా కొనసాగిన కాలం " మెక్సికో డర్టీ వార్ "గా అభివర్ణించబడింది. తరువాత 1968లో జరిగిన ట్లాటెలొకొ నరమేధంలో 300 మంది నిరసనప్రదర్శకులు మరణించినట్లు కనసర్వేటివ్స్ అంగీకరించినా చాలామంది ప్రజలు 800 మంది మరణించారని భావించారు. లూయిస్ ఎచెవెర్రియా పాలనలో ఎన్నికల సంస్కరణలు , అయిల్ ధరలు అధికరించడం కొనసాగింది. ఆదాయనిర్వహణా లోపం ఆర్థికసంక్షోభానికి (1982) దారితీసింది. 1980లో ఆయిల్ ధరలు పతనమై వడ్డీరేట్లు అధికమై ప్రభుత్వానికి ఋణభారం అధికమైంది. అధ్యక్షుడు " మైగ్యుయేల్ డీ లా మాడ్రిడ్ " కరెంసీ విలివ తగ్గించిన కారణంగా ద్రవ్యోల్భణం మొదలైంది.1880లో పి.ఆర్.ఐ. ఏకచ్ఛత్రాధిఓత్యంలో మొదటిసారిగా బీటలు పడ్డాయి. బాజా కలిఫోర్నియాలో " ఎర్నెస్టో రుఫ్ఫో అప్పెల్ " గవర్నరుగా ఎన్నికయ్యాడు. 1988 అధ్యక్ష ఎన్నికలలో జరిగిన మోసం కారణంగా లెఫ్టిస్ట్ అభ్యర్థి " కుయాయుహ్తెమొక్ కార్డెనాస్ " విజయావకాశం కోల్పోయి " కార్లోస్ శాలినాస్ డీ గార్టరీ " అధ్యక్షుడవడం మెక్సికో నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తడానికి దారితీసింది.

మెక్సికో 
NAFTA signing ceremony, October 1992. From left to right: (standing) president Carlos Salinas de Gortari, president George H. W. Bush (U.S.) and prime minister Brian Mulroney (Canada); (seated) Jaime Serra Puche, Carla Hills (U.S.) and Michael Wilson (Canada)

సాలినాస్ నియోలిబరల్ పేరిట సంస్కరణలు ఆరంభించాడు.అది ద్రవ్యమారకం ధరను నిర్ణయించిన కారణంగా ద్రవ్యోల్భణం నియంత్రించబడింది. అలాగే " నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ " ముగింపుకు తీసుకురాబడింది.అదే రోజు " జపటిస్టా ఆర్మీ ఆఫ్ నేషనల్ లిబరేషన్ " ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండువారాల సైనిక తిరుగుబాటు ఆరంభించింది. తరువాత నాంవయోలెంట్ ఉద్యమం నియోలిబరేషన్ , గ్లోబలైజేషన్‌కు వ్యతిరేకంగా ఆరంభం అయింది. 1994లో సాలినా తరువాత ఎఫ్నెస్టో జెడిల్లో అధికారానికి వచ్చిన తరువాత మెక్సికన్ పెసో క్రైసిస్ ఆరంభం అయింది. అధ్యక్షుడు జెడిల్లో మైక్రో ఎకనమిక్ సంస్కరణలు మొదలుపెట్టాడు. ఆర్థికరంగం వేగవంతంగా అభివృద్ధిపధంలో ముందుకు సాగింది. 1999 నాటికి 7% ఆర్థికరంగం అభివృద్ధి దశకు చేరుకుంది.

సమకాలీన మెక్సికో

2000లో 71 సంవత్సరాల పి.ఆర్.ఐ. అధ్యక్ష ఎన్నికలలో అపజయం పొంది నేషనల్ యాక్షన్ పార్టీ అభ్యర్థి " విసెంటే ఫాక్స్ " విజయం సాధించాడు. 2006లో అద్యక్ష ఎన్నికలలో లెఫ్టిస్టు అభ్యర్థి " ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రేడర్ " (పార్టీ ఆఫ్ ది డెమొక్రటిక్ రివల్యూషన్) కంటే అతిస్వల్ప మెజారిటీతో నేషనల్ యాక్షన్ పార్టీ అభ్యర్థి " ఫెలిపే కాల్డెరాన్ " విజయం సాధించాడు. లోపెజ్ ఒబ్రేడర్ ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ప్రతిఙ చేసాడు.2012 సంవత్సరాల తరువాత పి.ఆర్.ఐ. అద్యక్షేన్నికలలో విజయం సాధించింది. ఎన్నికలలో స్టేట్ ఆఫ్ మెక్సికో గవర్నర్ " ఎంరిక్యూ పెన నియాటో " (2005-2011) 38% ఆధిక్యతతో విజయం సాధించాడు. అయినప్పటికీ లెజిస్లేటివ్ ఆధఖ్యత మాత్రం సాధించలేదు.

భౌగోళికం

మెక్సికో 
Topographic map of Mexico.
మెక్సికో 
Mexico map of Köppen climate classification.

మెక్సికో ఉత్తర అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో 14 - 33 ఉత్తర అక్షాంశం , 86 - 119 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. [ఆధారం చూపాలి]మెక్సికో చాలావరకు ఉత్తర అమెరికా ఖండంలో ఉంది.మెక్సికోలోని బజ కలిఫోర్నియా పసిఫిక్ ద్వీపకల్పంలో , కొకోస్ ప్లేటులో ఉంది.కొంతమంది భౌగోళిక పరిశోధకులు మద్య అమెరికాలో తూర్పు భూభాగంలో ఉన్న " ఇస్త్మస్ ఆఫ్ టెహుయాంటెపెక్ " (మొత్తం భూభాగంలో 12%) ను మెక్సికోలో చేరుస్తుంటారు. మెక్సికో పూర్తిగా కెనడా , అమెరికా లతో కలిపి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నట్లు భౌగోళికులు పరిగణిస్తున్నారు. మెక్సికో మొత్తం వైశాల్యం 19,72,550 చదరపు మైళ్ళు.వైశాల్యపరంగా మెక్సికో ప్రపంచంలో 14వ స్థానంలో ఉంది.ఇందులో దూరంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గుయాడలుపే ద్వీపం, రెవిలగిజెడో ద్వీపం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరిబ్బీన్ , గల్ఫ్ ఆఫ్ కలిఫోర్నియా భూభాగాలు ఉన్నాయి.పొడవు 2000 మైళ్ళు.

మెక్సికో ఉత్తర సరిహద్దులో మెక్సికో యునైటెడ్ స్టేట్స్‌తో సరిహద్దును పంచుకుంటున్నది. దక్షిణ సరిహద్దులో 871 కి.మీ పొడవైన సరిహద్దును గౌతమాలా , 251 కి.మీ పొడవైన సరిహద్దును బెలిజె దేశాలతో పంచుకుంటున్నది.మక్సికోలో ఉత్తర దక్షిణాలుగా సియేరా మాడ్రె ఓరియంటల్ , సియేరా మాడ్రె ఆక్సిడెంటల్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇవి ఉత్తర అమెరికాలోని ఉత్తర భాగంలో ఉన్న రాకీ పర్వతశ్రేణులకు పొడగింపుగా ఉన్నాయి. మక్సికో మద్యభూభాగంలో తూర్పు పడమరలుగా " ట్రాంస్ - మెక్సికన్ వాల్కనిక్ బెల్ట్ (సియేరా నెవాడా)విస్తరించి ఉంది.నాలుగవ పర్వతశ్రేణి " సియేరా మాడ్రె డెల్ సర్ " మైకోయాకన్ నుండి ఆక్సాకా వరకు విస్తరించి ఉంది. మెక్సికోలో అత్యధిక భూభాగం సముద్రమట్టానికి ఎత్తుగా ఉంటుంది. ఇందులో ట్రాంస్ మెక్సికన్ వాల్కానిక్ బెల్టులో పికో డీ అరిజబా (5700 మీ ఎత్తు), పొపొకేటెపెట్ (5462 మీ ఎత్తు), జ్తక్సిహుయాట్ల్ (5286 మీ ఎత్తు), (నెవాడో డీ టొలుకా 4577 మీ ఎత్తు) మొదలైన శిఖరాలు ఉన్నాయి. ఈ నాలుగు శిఖరాల మద్య టొలుకా, గ్రేటర్ మెక్సికో నగరం, ప్యుబ్లా నగరాలు ఉన్నాయి.

వాతావరణం

" ది ట్రాపిక్ ఆఫ్ కాంసర్ " దేశాన్ని శక్తివంతంగా టెంపరేట్, ట్రాపికల్ భూభాగాలుగా విభజిస్తుంది. దక్షిణ ప్రాంతంలో ఇరు సముద్రతీరాలలో 24-28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చలికాలం వేసవి కాలం మద్య 5 చెంటీగ్రేడ్ డిగ్రీల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. మెక్సికన్ ఇరు దక్షిణ తీరాలలో బే ఆఫ్ చాంపెచే, బజా ప్రాంతాలు మినహాయింపుగా వేసవి, హేమంతకాలాలలో ట్రాపికల్ సైక్లోన్ లకు గురౌతూ ఉంటాయి. శీతాకాలంలో వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ మెక్సికోలో ఉన్న పలు పెద్ద నగరాలు సమీపప్రాంతాలు సముద్రమట్టానికి దాదాపు 2,000 మీటర్ల ఎత్తున ఉన్నాయి. అందువలన ఇక్కడ సంవత్సరం అంతటా 16-18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంతేకాక సంవత్సరం అంతా వాతావరణం శీతలంగా ఉంటుంది.ఉత్తర భూభాగంలోని పలుప్రాంతాలు పొడివాతావరణం చెదురుమదురు వర్షపాతం కలిగి ఉంటాయి. దక్షిణ ప్రాంతంలో దాదాపు 2,000 మి.మీ వర్షపాతం ఉంటుంది. ఉత్తరభూభాగంలో ఉన్న మాంటెర్రీ, హర్మొసిల్లో, మెక్సికలి నగరాలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సొనోరన్ ఎడారి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుతుంది.

పర్యావరణ వైవిద్యం

మెక్సికో 
A jaguar at the Chapultepec Zoo. The zoo is known for its success in breeding programs of threatened species.

ప్రయావరణపరంగా అత్యంత వైవిధ్యం కలిగిన 17 దేశాలలో మెక్సికో 4వ స్థానంలో ఉంది. మెక్సికోలో 2,00,000 కంటే అధికమైన జంతువులు ఉన్నాయి. వైవిధ్యం కలిగిన జీవ- వృక్షజాలంలో 10-12% మెక్సికోలో ఉన్నాయి. 707 సరీసృపాలను కలిగి ఉన్న మెక్సికో సరీసృపాల వైవిధ్యం కలిగిన దేశాలలో మొదటి స్థానంలో, 438 క్షీరదజాతులతో క్షీరదాలలో ద్వితీయస్థానం, 290 జాతులతో ఉభయచరాలలో 4వ స్థానం, 26,000 జాతుల వృక్షజాతితో వృక్షజాలంలో 4వ స్థానంలో ఉంది. పర్యావరణవైవిధ్యంలో మెక్సికో 2వ స్థానంలో మొత్తం జాతులతో జీవజాతులలో మెక్సికో 4వ స్త్యానంలో ఉంది. మెక్సికన్ లెజిస్లేటర్లు దాదాపు 2,500 జతుల జంతుజాలాన్ని సంరక్షిస్తూ ఉంది. క్షీణిస్తున్న అరణ్యాలు కలిగిన దేశాలలో ద్వీతీయస్థానంలో ఉంది. ప్రథమస్థానంలో బ్రెజిల్ ఉంది. 1990లో మెక్సికో లోని పర్యావరణ వైవిధ్యం గురించిన విఙానం ప్రజలలో అధికరించడానికి " కమీషన్ నేషనల్ పారా ఎల్ కొనోసిమియంటో వై యూసో డీ లా బయోడైవరిసిడాడ్ " స్థాపించింది.మెక్సికోలో 70,000 చ.కి.మీ. సంరక్షిత ప్రాంతాలుగా గుర్తించబడింది. ఇదులో 34 బయోస్ఫెరే రిజర్వులు, 67 నేషనల్ పార్కులు, 4 నేచురల్ పర్వతాలు, జంతు, వృక్షజాలం సంరక్షిస్తున్న 26 ప్రాంతాలు, 4 వనరుల సంరక్షిత ప్రాంతాలు, 17 అభయారణ్యాలు ఉన్నాయి. అమెరికన్ డిస్కవరీ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగంలో ఉన్న పంటలను, తినగలిగిన మొక్కలను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇందులో మెక్సికోలో ఆదరణలో ఉన్న చాక్లెట్, అవాకాడో, టొమాటో, మొక్కజొన్న, జామ, చయోటే, డైస్ఫానియా అంబ్రోసియోడెస్, చిలగడదుంప, జికామా, నోపాల్, జుచ్చిని, క్రాటాయెగస్ మెక్సికానా, అకోహే, సపోటా, మామే సపోటా, పలు రకాల బీంస్, విస్తృతశ్రేణిలో మిరపకాయలు (హబానెరో, జలపినో) ఉన్నాయి. వీటిలో చాలా పేర్లు " నహుయాత్ " వంటి స్థానిక భాషల నుండి జనించాయి.మెక్సికోలో నెలకొని ఉన్న జీవవైద్యం కారణంగా జీవశాస్త్ర పరిశోధకులు అనేకమందికి మెక్సికో గమ్యస్థానంగా మారింది. 1947లో మెక్సికోలో విజయవంతంగా కనిపెట్టిన " ట్యూబర్ బార్బాస్కో ", సింతటిక్ హార్మోంస్ (1950 -1960) ఈ పరిశోధన " కంబైండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ " కనిపెట్టడానికి దారితీసింది.

ఆర్ధికరంగం

మెక్సికో 
A proportional representation of Mexico's exports. The country has the most complex economy in Latin America.

మెక్సికో జి.డి.పి. ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. కొనుగోలు శక్తి 11వ స్థానంలో ఉంది. 1995 నుండి 2002 మద్య మెక్సికో జి.డి.పి. వార్షికంగా 5.1% ఉంది. 2005 మెక్సికో జి.డి.పి. కొనుగోలుశక్తి 22,602 బిలియన్లు, నామినల్ ఎక్చేంజ్ విలువ 13,673 ట్రిలియన్లు. మెక్సికో తలసరి జి.డి.పి. 18,714.05 అమెరికా డాలర్లు. నామినల్ ఎక్చేంజ్ విలువలో మెక్సికన్ నేషనల్ ఆదాయం లాటిన్ అమెరికన్ దేశాలలో ద్వితీయ స్థానంలో ఉందని 2009 ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలియజేస్తుంది.18,30,392 బిలియన్ల అమెరికా డాలర్లతో బ్రెజిల్ ప్రథమస్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో తలసరి జి.డి.పి. 14,400 అమెరికన్ డాలర్లు.

ఆధికాభివృద్ధి

ప్రస్తుతం మెక్సికో ఉన్నత మద్య ఆదాయ దేశంగా స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆర్థికసంక్షోభం తరువాత 2001 నుండి 4.2%, 3%, 4.8% అభివృద్ధి సాధించింది. 2008-2009 ఆర్థికమాంద్యం తరువాత 2010-2014 మద్య వార్షికంగా 3.32% అభివృద్ధి కొనసాగింది.1990 నుండి ప్రజలలో అత్యకమంది మద్యతరగతి స్థాయికి ఎదిగారు. 2004 - 2008 మద్య సగంకంటే తక్కువ ప్రజల సరాసరి ఆదాయం 17% నుండి 21% నికి అభివృద్ధి చెందింది. 2006-2010 మద్య పేదరికం 35% నుండి 46% నికి (52 మిలియన్లు) చేరుకుంది. ఒ.ఇ.సి.డి. దేశాల సరాసరి శిశుమరణాల కంటే మెక్సికో శిశుమరణాలు మూడురెట్లు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ 2050 నాటికి మెక్సికన్ ఆధికరంగం ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకుంది. ఒ.ఇ.సి.డి. దేశాలలో ఆర్థిక అసమానతలో (అత్యంత ధనవంతులు, అత్యంత పేదవారు) మెక్సికో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో చిలీ ఉంది. మెక్సికో పేదరిక నిర్మూలన కొరకు ఒ.ఇ.సి.డి. సరాసరికంటే మూడింట ఒక వంతు మాత్రమే వ్యయం చేస్తుంది.2008 మెక్సికో నగరప్రాంత సరాసరి ఆదాయం 26,654 డాలర్లు. గ్రామీణ సరాసరి ఆదాయం 8,403 డాలర్లు. వార్షికంగా మెక్సుకో చట్టపరంగా కనీస దినకూలీ నిర్ణయిస్తుంది. జోన్ ఏలో 67.29 డాలర్లు (5.13 అమెరికన్ డాలర్లు) జోన్ బి 63.77 డాలర్లు (4.86 అమెరికన్ డాలర్లు).

ఎలెక్ట్రానిక్స్

గత దశాబ్ధాలలో ఎలెక్ట్రానిక్ పరిశ్రమలో మెక్సికో అమోఘంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎలెక్ట్రానిక్ పరిశ్రమలు, ఉత్పత్తులలో మెక్సికో ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. మిగిలిన ఐదు స్థానాలలో చైనా,యునైటెడ్ స్టేట్స్,జపాన్,దక్షిణ కొరియా, తైవాన్ దేశాలున్నాయి.2011లో 71.4 బిలియన్ డాలర్ల ఎగుమతులతో యునైటెడ్ స్టేట్స్‌కు ఎలెక్ట్రానిక్స్‌ ఎగుమతి చేస్తున్న దేశాలలో మెక్సికో ద్వితీయస్థానంలో ఉంది. మెక్సికన్ ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులలో టెలివిజన్లు, కప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, సర్క్యూట్ బోర్డులు, సెమీకాండక్టర్లు, ఎలెక్ట్రానిక్ అప్లైయంసీస్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లు, ఎల్.సి.డి. మోడ్యూల్స్ ప్రాధాన్యత వహిస్తుంది. 2010, 2011 మద్యలో మెక్సికన్ ఎలెక్ట్రానిక్ పరిశ్రమ 20% అభివృద్ధి చెందింది. 2003, 2009 మద్య కాలంలో మెక్సికో ఎలెక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధి స్థిరంగా 17% ఉంది. ప్రస్తుతం మెక్సికో ఎగుమతులలో ఎలెక్ట్రానిక్స్ 30% భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఆటోమొబైల్స్

ఉత్తర అమెరికా దేశాలలో ఆటోమొబైల్స్ ఉత్పత్తిలో మెక్సికో ప్రథమస్థానంలో ఉంది. ఆటోమొబైల్ పరిశ్రమ సాంకేతిక వైవిధ్యమైన ఉత్పత్తులను చేస్తూ రీసెర్చ్, యాక్టివిటీ లకు ప్రోత్సాహం అందిస్తుంది. మెక్సికోలో జనరల్ మోటర్లు, ఫోర్డ్, క్రిస్లర్లు మొదలైన బృహత్తర పరిశ్రమలు 1930 నుండి పనిచేస్తున్నాయి. 1960లో నిస్సాన్, వోల్క్స్ వ్యాగన్ కంపెనీలు ఇక్కడ శాఖలను నిర్మించాయి. ప్యూబ్లాలో మాత్రమే వోల్క్స్ వ్యాగన్ సమీపప్రాంతాలలో 70 విడిభాగాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.2010లో నుండి ఆటోమొబైల్ రంగం వేగవంతంగా అభివృద్ధిచెందుతూ ఉంది. 2014లో ఈరంగానికి 10 బిలియన్లు పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2014 ఆగస్టులో కియా మోటర్స్ న్యూవో లియోన్ నగరంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కంపెనీ స్థాపించే ప్రణాళికను ప్రకటన చేసింది.అప్పటికే ప్యూబ్లా సమీపంలో మెర్సిడెజ్ బెంజ్, నిస్సాన్ 1.4 బిలియన్ల వ్యయంతో ప్లాంటు నిర్మించాయి. శాన్ లూయిస్ పోటోస్‌లో బి.ఎం.డబల్యూ 1 బిలియన్ వ్యయంతో ప్లాంటు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అదనంగా 2013 లోఆడీ ప్యూబ్లా సమీపంలో ఫ్యాక్టరీ నిర్మించడం ప్రారంభించింది.1962 నుండి డి.ఐ.ఎన్.ఎ. ఎస్.ఎ. ప్రాతినిధ్యంలో డొమెస్టిక్ కార్ ఇండస్ట్రీ బసులు, ట్రక్కులను నిర్మిస్తుంది. " ది న్యూ మాస్ట్రెట్టా " కంపెనీ హై - పర్ఫార్మెంస్ " మాస్ట్రెల్లా ఎం.ఎక్స్.టి " స్పోర్ట్స్ కారు నిర్మిస్తుంది.

వాణిజ్యం

2006లో మెక్సికో ఎగుమతులను 50% యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాలు దిగుమతి చేసుకున్నాయి. అలాగే దిగుమతులలో 45% యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాల నుండి దిగుమతి చేసుకుంది. 2010 మొదటి మూడు మాసాల త్రైమాసిక ఫలితాలలో యునైటెడ్, మెక్సికో దేశాల వాణిజ్యంలో 46 బిలియన్ల లోటు ఏర్పడింది.2010 ఆగస్టులో యు.ఎస్. ఋణంలో మెక్సికో ఫ్రాంసును అధిగమించి 9వ స్థానానికి చేరుకుంది. వాణిజ్యపరంగా, ఆర్థికంగా మెక్సికో యు.ఎస్. మీద ఆధారపడడం ఆందోళనకరంగా మారింది. మెక్సిన్లు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తూ చేరవేస్తున్న విదేశీమారకం మెక్సికో జి.డి.పి.లో 0.2% భాగస్వామ్యం వహిస్తుంది.2004లో 20 బిలియన్ల అమెరికన్ డాలర్లు యు.ఎస్. నుండి విదేశీమారకం ఉద్యోగులద్వారా మెక్సికోకు చేరింది.ఇది మెక్సికో విదేశీమారక వనరులలో ఉద్యోగులద్వారా లభించే సొమ్ము 10వ స్థానానికి చేరుకుంది.మొదటి స్థానాలలో ఆయిల్, పారిశ్రామిక ఉత్పత్తులు, తయారీ వస్తువులు, ఎలెక్ట్రానిక్స్, హెవీ ఇండస్ట్రీ, ఆటోమొబైల్స్, కంస్ట్రక్షన్, ఆహారం, బ్యాంకింగ్, ఫైనాంషియల్ సర్వీసులు వహిస్తున్నాయి. 2008 మెక్సికో సెంట్రల్ బ్యాంక్ చెల్లింపులు 25 బిలియన్లకు చేరాయి. బృహత్తర స్పానిష్ మీడియా కంపెనీ స్పానిష్ - మాట్లాడే ప్రజల కొరకు ప్రసారాలను అందజేస్తున్న టెలేవిసా సంస్థ, టి.వి. అజ్తెకా మెక్సికో మాధ్యమరంగంలో ఆధిక్యత కలిగి ఉన్నాయి.

సమాచార రంగం

సమాచార రంగంలో ఆధిక్యత చేస్తున్న టెల్మెక్స్ (టెలిఫోన్ డీ మెక్సికో) 1990లో ప్రైవేటీకరణ చేయబడింది. 2006 నుండి టెలెమెక్స్ సేవలు కొలంబియా, పెరూ, చిలీ,అర్జెంటీనా,బ్రెజిల్,ఉరుగ్వే, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు విస్తరించబడ్డాయి.దేశీయంగా సేవలు అందిస్తున్న సంస్థలలో అక్స్టెక్స్, మాక్స్కం ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.మెక్సికో భౌగోళికంగా పర్వమయంగా ఉన్న కారణంగా లాటిన్ అమెరికన్ దేశాలతో పోల్చితే సరాసరి లైన్ ఫోంస్ తక్కువగా ఉన్నాయి. మెక్సికన్ ప్రజలలో 14 సంవత్సరాల కంటే అధిక వయసున్న వారిలో 82% మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారు. మొబైల్ ఫోంస్ తక్కువ వ్యయంతో అన్ని ప్రాంతాలకు సమాచారం చేరగలిన సామర్ధ్యం కలిగి ఉన్నాయి.లాండు ఫోన్ల కంటే మొబైల్ ఫోన్లు రెండురెట్లు అధికంగా (63 మిలియన్లు) ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ రంగాన్ని ప్రభుత్వం "కోఫెటెల్ (కమీషన్ ఫెడరల్ డీ కమ్యూనికేషంస్) " ద్వారా నియంత్రిస్తుంది. మెక్సికన్ డొనెస్టిక్ శాటిలైట్ సిస్టం 120 ఎర్త్ స్టేషన్లను నిర్వహిస్తుంది. మెక్సికోలో విస్తారమైన మైక్రోవేవ్ రేడియో నెట్ వర్క్, ఫైబర్ ఆప్టిక్, కోయాక్సికల్ కేబుల్ సేవలు అందిస్తున్నాయి. మెక్సికన్ శాటిలైట్లను " శాటిలైట్ మెక్సికనోస్ " (శాట్మెక్స్) అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుంది. లాటిన్ అమెరికాలో ఆధిక్యతలో ఉన్న ఈ సంస్థ ఉత్తర, దక్షిణ అమెరికాలలో కూడా సేవలు అందిస్తుంది. ఇది అమెరికా ఖండాలలో కెనడా, అర్జెంటీనా వరకు ఉన్న 37 దేశాలలో టెలిఫోన్, టెలికమ్యూనికేషంస్ సేవలు అందిస్తుంది. భాగస్వామ్య సంస్థల ద్వారా శాట్మెక్స్ సంస్థ ఉన్నత పాఠశాల కనెక్టివిటీ, డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసులు అందిస్తుంది. శాట్మెక్స్ సంస్థతనస్వంత శాటిలైట్లను మెక్సికోలోనే రూపకల్పన చేసి నిర్మిస్తుంది.మెక్సికోలో రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ అత్యధికంగా వాడుకలో ఉన్నాయి. దేశంలో దాదాపు 1,140 రేడియో స్టేషన్లు, 236 టెలివిజన్ స్టేషన్లు ఉన్నాయి. మాధ్యమప్రసారాలను అందిస్తున్న సంస్థలలో టెలివిసా స్పానిష్ - భాషా ప్రపంచం, టి.వి.అజ్తెకా అతిపెద్ద సంస్థగా గుర్తించబడుతుంది.—

ఆయిల్ , విద్యుత్తు

మెక్సికోలో స్టేట్‌కు స్వంతమైన " ఫెడరల్ కమీషన్ ఆఫ్ ఎలెక్ట్రిసిటీ ", " పెమెక్స్ ", ది కంపెనీలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రభుత్వ కంపెనీ పెమెక్స్ క్రూడాయిల్, సహజవాయువు అణ్వేషణ, ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ కార్యక్రమాలను అలాగే రిఫైనరీ, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇది ఆదాయంలో ప్రపంచంలోని బృహత్తర సంస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఈ సంస్థ విక్రయాలు వార్షికంగా 86 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తిలో మెక్సికో 6వ స్థానంలో ఉంది. సంస్థ దినసరి 3.7 మిలియన్ల బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తుంది.1980లో మెక్సికో ఎగుమతులలో 61.6% ఈ సంస్థనుండి ఎగుమతి చేయబడుతుంది. 2000 నాటికి అది 7.3% నికి పతనం అయింది.

జల విద్యుత్తు

మెక్సికోలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలలో గ్రిజల్వా నదిమీద నిర్మించబడిన 2,400 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేస్తున్న " చికోయాసెన్ ఆనకట్ట " అత్యంత బృహత్తరమైనదిగా గుర్తించబడుతుంది.ప్రపంచంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రాలలో ఇది 4వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.

సౌరశక్తి

సోలార్ విద్యుదుత్పత్తిలో మెక్సికో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో 1 మిలియన్ చ.మీ. సోలార్ ధర్మల్ పానెల్స్ ఉన్నాయి.2005లో 1,15,000 చ.మీ. సోలార్ పానెల్స్ ఉన్నాయి. 2012 నాటికి 1.8 మిలియన్ల చ.మీ. సోలార్ల పానెల్స్ స్థాపించబడతాయని భావించారు. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తు అంతా నేరుగా సి.ఎఫ్.ఇ.కి విక్రయించబడుతుంది.

సైన్స్ , టెక్నాలజీ

1910లో అధికారికంగా " ది నేషనల్ అటానిమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో " స్థాపించబడింది. మెక్సికోలో ఉన్నత విద్యాభ్యాసానికి ఈ విశ్వవిద్యాలయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. యు.ఎన్.ఎ.ఎం. విద్యార్థులకు సైన్సు, మెడిసిన్, ఇంజనీరింగ్ లలో అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తుంది. మెక్సికోలో " నేషనల్ పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్ ", (1936లో స్థాపించబడింది), మొదలైన విద్యాసంస్థలు 20వ శతాబ్దంలో మొదటి అర్ధభాగంలో స్త్యాపించబడ్డాయి.యు.ఎన్.ఎ.ఎం.లో పలు రీసెర్చి ఇంస్టిట్యూట్లు కొత్తగా స్త్యాపించబడ్డాయి. 1929, 1973 మద్య యు.ఎన్.ఎ.ఎం.లో 12 ఇంస్టిట్యూట్లు స్థాపించబడ్డాయి.1959లో స్త్యాపించబడిన " మెక్సికన్ అకాడమీ ఆఫ్ సైంస్ " అకాడమీలను అనుసంధానించడానికి కృషిచేస్తుంది.1995లో మెక్సికన్ రసాయనశాస్త్ర పరిశోధకుడు " మారియో జె.మొలినా " నోబుల్ బహుమతిని " పౌల్ జె.క్రుట్జెన్ "తో పంచుకున్నాడు. మొలినా యు.ఎన్.ఎ.ఎం. విద్యార్థికావడం ప్రత్యేకత. ఈ బహుమతి సాధించి మొదటి మెక్సికన్ నోబుల్ బహుమతి విజేతగా మొలినా గుర్తింపు పొందాడు. సమీపకాలంలో మెక్సికోలో అభివృద్ధిచేయబడిన అత్యంత పెద్దదైన సైటిఫిక్ ప్రాజెక్టు " లార్జ్ మిల్లీమీటర్ టెలిస్కోప్ " నిర్మించింది. ఇది ఫ్రీక్వెంసీ రేంజిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా , సెంసిటివ్ టెలిస్కోప్‌గా భావించబడుతుంది.

పర్యాటకం

మెక్సికో 
The Iglesia de Nuestra Señora de los Remedios atop the Great Pyramid of Cholula with Popocatépetl visible in the background has become an iconic image of Mexico.

మెక్సికో ప్రపంచ పర్యాటక ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా వరల్డ్ పర్యాటకం ఆర్గనైజేషన్ వర్గీకరించింది. అమెరికా ఖండాలలో పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న దేశాలలో మెక్సికో ద్వితీయ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ప్రథమస్థానంలో ఉంది.మెక్సికోలో పర్యాటక ఆకర్షణలలో మెసోమెరికన్ శిథిలాలు, సాంస్కృయిక ఉత్సవాలు, కాలనియల్ నగరాలు, ప్రకృతి సంరక్షిత ప్రాంతాలు , బీచ్ రిసార్టులు ప్రధానమైనవి.వైవిధ్యమైన వాతావరణం, యురేపియన్ మెసోమెరికన్ మిశ్రితమైన విభిన్న సంప్రదాయం మెక్సికోను ఆకర్షణీయమైన పర్యాటకకేంద్రంగా చేసింది. డిసెంబరు , వేసవి మద్య కాలం మెక్సికో పర్యాటక అనుకూల కాలంగా ఉంటుంది.ఈస్టర్‌కు ముందు ఒక వారం నుండి వసంతకాలం వరకు యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చే విద్యార్థులకు రిసార్టులు ప్రధాన పర్యాటక లక్ష్యాలుగా మారుతున్నాయి.2011లో పర్యాటకంద్వారా అధికంగా ఆదాయం పొందుతున్న దేశాలలో మెక్సికో 23వ స్థానంలో , లాటిన్ అమెరికాలో ప్రధాన స్థానంలో ఉంది. అత్యధికంగా మెక్సికోను సందర్శించే పర్యాటకులలో యునైటెడ్ స్టేట్స్ , కెనడా దేశాలు ప్రథమస్థానంలో ఉండగా తరువాత స్థానాలలో ఐరోపా , ఆసియా వాసులు ఉన్నారు. ఇతర లాటిన్ దేశాల నుండి స్వల్పసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.2011 " ట్రావెల్ అండ్ పర్యాటకం కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ " నివేదిక ఆధారంగా మెక్సికో ప్రపంచపర్యాటకంలో 43వ స్థానంలో ఉందని అలాగే అమెరికాఖండాలలో 4వ స్థానంలోనూ ఉందని తెలుస్తుంది.

మెక్సికో 
The Caribbean state of Quintana Roo is particularly known for beach tourism. Major destinations include Cancún, Cozumel and the Riviera Maya.

మెక్సికో సముద్రతీరాల వెంట ఉన్న పలు బీచులు సన్ బాత్ తీసుకునే పర్యాటకులను , ఇతరులను ఆకర్షిస్తున్నాయి. ఫెడరల్ లా ఆధారంగా సముద్రతీరం అంతా ప్రభుత్వానికి స్వంతమైనదిగా భావించబడుతుంది. యుకటాన్ ద్వీపకల్పంలో ప్రబలమైన బీచ్ టౌన్ కాంకన్ వసంతకాలంలో యూనివర్శిటీ విద్యార్థులను ఆకర్షిస్తూ ఉంది. ఇస్లా ద్వీపం, ఇస్లాహాల్ బాక్స్ ద్వీపం పర్యాటక ఆకర్షణలో భాగంగా ఉన్నాయి. దక్షిణ కంకన్‌లో రివేరా మాయా, ప్లేయా డీల్ కార్మెన్ బీచ్ టౌన్, క్సెల్- హా , క్సెకారెట్ వంటి ఎకలాజికల్ పార్కులు ఉన్నాయి. కంకన్‌కు ఒకరోజు పరూటనలో టులం చారిత్రక ప్రాంతాన్ని సందర్శించవచ్చు.అదనంగా టులం టౌనులో బీచులు , క్లిఫ్ సైడ్ మాయానగరికతకు చెందిన శిథిలాలు ఉన్నాయి.పసిఫిక్ సముద్రతీరంలో అకాపుల్కో ప్రబల పర్యాటక కేంద్రంగా ఉంది. ఇది సంపన్నులకు ఆకర్షణీయ పర్యాటక గమ్యంగా ఉంది.పర్యాటకులతో రద్దీగా ఉండే సముద్రతీరాలలో బహుళ అంతస్తుల హోటెల్స్ , షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.అకాపుల్కో క్లిఫ్ డ్రైవర్స్‌కు ఆకర్షణీయ గమ్యంగా ఉంది.బజ కలిఫోర్నియా ద్వీపకల్పం దక్షిణంలో రిసార్ట్ టౌన్ " కాబో శాన్ లుకాస్ " సముద్రతీరాలు , మార్లిన్ ఫిషింగ్ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. ఉత్తరభూభాగంలోని సీ ఆఫ్ కోర్టెస్‌లో బీచ్ టౌన్ బహియా కలిఫోర్నియా డీ లా కంసెప్షన్ క్రీడలు , ఫిషింగ్ మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.సమీపంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫెలిపె (బజ కలిఫోర్నియా) వారాంతపు పర్యటనలకు అనుకూలంగా ఉంటుంది.

రవాణాసౌకర్యాలు

మెక్సికో 
The Baluarte Bridge is the highest cable-stayed bridge in the world, the fifth-highest bridge overall and the highest bridge in the Americas.

మెక్సికో రహదారులతో చక్కగా అనుసంధానితమై ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మించబడి ఉన్నాయి. విస్తారమైన మెక్సికో రహదారుల మొత్తం పొడవు 3,66,095 కి.మీ. ఇందులో 1,16,802 కి.మీ పొడైన రహదారులకు పేవ్మెంటు నిర్మించబడి ఉంది. ఇది మెక్సికోను లాటిన్ అమెరికాదేశాలలో అత్యధికమైన పేవ్మెంటు చేసిన రహదారులు ఉన్న దేశంగా మార్చింది. ఇందులో 10,474 కి.మీ మల్టీ లైన్ ఎక్స్ప్రెస్ రహదారులు ఉన్నాయి. ఇందులో 9,544 కి.మీ. పొడవున నాలుగు లైన్ల రహదారులు మిగిలినది ఆరు లేక అదనపు లైనులు కలిగిన రహదారులు ఉన్నాయి.

రైలు మార్గాలు

రైల్వేలను అభివృద్ధి చేసిన లాటిన్ అమెరికన్ దేశాలలో మెక్సికో ఒకటి. రైలుమార్గాల మొత్తం పొడవు 30,952 కి.మీ. " ది సెక్రెటరీ ఆఫ్ కమ్యూనికేషంస్ అండ్ ట్రాంస్పోర్టేషన్ (మెక్సికో) " మెక్సిసో నగరం నుండి జలిస్కో వరకు ప్రయాణీకులను చేరవేయడానికి హై స్పీడ్ రైల్ లింకును ప్రతిపాదన చేసింది. ఈ రైలు మార్గం 300 కి.మీ పొడవున నిర్మించబడింది. ఇది ప్రయాణీకులను మెక్సికో నగరం నుండి గుయాడాలాజరా వరకు 2 గంటలసమయంలో చేరవేస్తుంది. మొత్తం ప్రాజెక్టు విలువ 240 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఈ ప్రజెక్టు వ్యయాన్ని ప్రాంతీయ బిలియనీర్ , మెక్సికో సంపన్నుడు కార్లోస్ స్లిం , మెక్సికో ప్రభుత్వం కలిసి భరించారు. యుకాటాన్ స్టేట్ ప్రభుత్వం కూడా కొజుమెల్ నుండి మెరిడా , కాంకన్‌లను అనుసంధానం చేసే హైస్పీడ్ రైలుమార్గం నిర్మాణవ్యయానికి నిధులు సమకూర్చింది.

వాయుమార్గాలు

మెక్సికోలో 233 విమానాశ్రయాలు (పేవ్డ్ రంవేలతో) ఉన్నాయి. వీటిలో 35 విమానాశ్రయాల నుండి 97% ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. " ది మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " విమానాశ్రయం లాటిన్ అమెరికన్ దేశాలలో అత్యంత బృహత్తరమైనదిగా గుర్తించబడుతుంది. అలాగే ప్రపంచంలో 44వ స్థానంలో ఉంది. ఇక్కడి నుండి సంవత్సరానికి 21 మిలియన్ల ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.

నీటిసరఫరా , మురుగునీటి వసతి

1990, 2010 మద్య నగరప్రాంతాలలో 88% నుండి 93% వరకు, గ్రామీణప్రాంతాలలో 50% నుండి 74% వరకు పైపుల ద్వారా నీటిసరఫరా చేయబడుతుంది. అలాగే 64% నుండి 85% మురుగునీటి కాలువలు నిర్మించబడ్డాయి.ఉత్తర భూభాగం, మద్య భూభాగంలో నీటి కొరత నీటిసరఫరా సేవలకు అంతరాయం కలిగిస్తుంది. బలహీనమైన ఆర్థిక, సాంకేతిక కారణంగా 2000 గణాంకాల ఆధారంగా 55% మెక్సికన్ ప్రజలతో అతరాయాలతో నీటిసరఫరా అందించబడుతుంది. 2003లో మురుగునీటి కాలువలు 36% మాత్రమే నిర్మించబడ్డాయి.గ్రామీణప్రాంతాలలో ఇప్పటికీ మురుగునీటి కాలువల వసతి కల్పించబడలేదు.

గణాంకాలు

2010 గణాంకాలు జనసంఖ్య 112,336,538.స్పానిష్ మాట్లాడే ప్రజల సాంధ్రత అత్యధికంగా ఉన్న దేశంగా మెక్సికో గుర్తించబడుతుంది.2005, 2010 మద్య మెక్సికన్ జనసంఖ్య వార్షికంగా 1.7% అభివృద్ధి చెందింది. 2000, 2005 మద్య మెక్సికన్ జనసంఖ్య 1.6% అభివృద్ధి చెందింది. 2015కు ముందుగా మెక్సికో తన పౌరుల స్థానికత, సంప్రదాయాల గురించి విచారించలేదు. గతంలో చివరిసారిగా 1921లో మాత్రమే సంప్రదాయపరంగా గణాంకాలు సేకరించబడ్డాయి. గణాంకాల ఆధారంగా 62 భాషాసంప్రదాయానికి చెందిన స్థానిక ప్రజలు ఒకరితో ఒకరు సంబంధాలు మెరుగుపరచుకొని జీవించారని భావిస్తున్నారు. 2010 గణాంకాలు ఆధారంగా 14.86% స్థానికజాతులకు చెందిన ప్రజలు ఉన్నారని అంచనా. అయినప్పటికీ 2015 ఇంటర్ - సెంసస్ అంచనాల ఆధారంగా ప్రభుత్వం సేకరించిన గణాంకాలలో 21.5% ప్రజలు వారి స్థానికత గురించి వివరించారు. వీరిలో ఆఫ్రో మెక్సికన్లు 1.2% ఉన్నారు. వీరిలో వీదేశాలలో జన్మించిన వారి సంఖ్య 1,007,063. వీరిలో యు.ఎస్. పౌరులు అధికసంఖ్యలో ఉన్నారు. విదేశాలలో అధికసంఖ్యలో నివసిస్తున్న అమెరికాపౌరులున్న దేశాలలో మెక్సికో ఒకటి. మరికన్ల తరువాత గౌతమాలా ప్రజలు, స్పెయిన్ ప్రజలు, కొలంబియా ప్రజలు ఉన్నారు. సంప్రదానుసారంగా స్థిరపడిన వలసప్రజలలో స్పెయిన్ తరువాత ఫ్రెంచ్, జర్మన్, లెబనాన్, చైనా దేశాలకు సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.యునైటెడ్ స్టేట్స్ నుండి వలసపోతున్న ప్రజలకు మెక్సికో ప్రధాన వనరుగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న ప్రజలలో 11.6 మిలియన్ల ప్రజలకు మెక్సికన్ పౌరసత్వం ఉంది.

జాతులు

De español e india, mestiza, 1763,
Miguel Cabrera
De español y negra, mulata, 1763,
Miguel Cabrera
De negro e india, zamba, 1763,
Miguel Cabrera
Depictions of the three main castas resulting from miscegenation of Europeans, Africans and indigenous Americans. Produced during the Age of Enlightenment, the pinturas de castas attempted to "rationally categorize" the racial diversity of Mexico, but some sets were also manifestations of early national self-pride. Wealth and order depicted through clothing, mercantile goods and religious symbols, challenged preconceived notions of New Spain in Europe.

మెక్సికో సంప్రదాయకంగా వైవిధ్యత కలిగిన ప్రజలు నివసిస్తున్న దేశం. శ్వేతజాతీయులు, ఆఫ్రో- సంతతికి చెందిన ప్రజలు, మెస్టిజోన్ ప్రజలు ఒకటిగా జీవిస్తున్నారు. మెక్సికో ప్రధాన జాతీయతలో యురేపియన్ సంప్రదాయం, మెస్టిజాజే సంప్రదాయం ప్రాధాన్యత వహిస్తుంది. జోస్ వాస్కాంసెలోస్, మాన్యుయల్ గమియో వంటి సంస్కరణ వాదులు, రాజకీయవాదులు మెస్టిజాజే ప్రతిపాదనతో మెక్సికన్ ప్రజల జాతీయ గుర్తింపును నిర్మించారు.

జాతివారీ గణాంకాలు

1810లో కాలనీశకం ముగిసే సమయానికి రెవిల్లజిగెడో గణాంకాల ఆధారంగా మెక్సికో జనసంఖ్య 6 మిలియన్లు. వీరిలో ఆఫ్రికన్లు 10,000 (బానిసలుగా ఉన్న వీరు 1829 నుండి చట్టబద్ధంగా విముక్తులు అయ్యారు), 15,000 మంది పెనింసులరెస్ (స్వతంత్రం వచ్చిన తరువాత తరిమివేయబడ్డారు), ఒక మిలియన్ కంటే అధికమైన యూరోమెస్టిజోలు (క్రియాలో ప్రజలు, యురేపియన్ సంతతికి చెందిన కాస్టిజోలు ఉన్నారు), 7,00,000 ఇండోమెస్టిజోలు (స్థానికజాతికి చెందిన ప్రజలు), 6,00,000 ఆఫ్రోమెస్టిజోలు ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు (ములాటో ప్రజలు), 3.7 మిలియన్ల స్థానిక ప్రజలు ఉన్నారు. స్వతంత్రం తరువాత మెక్సికో చట్టబద్ధంగా కులాల ఆధారిత గుర్తింపు విధానాన్ని తొలగించిన కారణంగా గణాంకాలలో కులాలగురించిన ప్రస్తావన లేదు.

మెస్టిజోలు

మెక్సికన్లలో అత్యధికంగా " మెస్టిజోలు " (ఎంసైక్లోపీడియా బ్రిటానికా ఆధారంగా 50% - 67%) ఉన్నారు. ఆధునిక మెక్సికోలో " మెస్టిజో " అనే పదం జాతిని సూనించడానికి బదులుగా సంస్కృతిని సూచించడానికి వాడుతున్నారు. మెక్సికన్ సంఘంలో ఈ పదం ఎక్కువగా వాడుకలో లేదు. మెక్సికన్ సాంఘిక గుర్తింపు గురించిన సాహిత్యంలో ఈ పదం తరచుగా వాడుకలో ఉంది. అయినప్పటికీ ఇది సాంఘిక - సాంస్కృతిక, ఆర్థిక, జాతి బయోలాజికల్ అర్ధాలను సూచిస్తుంది. మెక్సికన్ గణాంకాలలో విసర్జించబడిన సంప్రాదాయపరమైన వర్గీకరణకు ప్రతిగా సంప్రదాయ వైరుధ్యాన్ని సూచించడానికి ఈ పదం వాడుకలో ఉంది. జీవ వైవిధ్య సంబంధిత అధ్యయనాలు మెక్సికన్ ప్రజలు ఒకేవిధైన జీవసారూప్యత (జెనెటిక్ కాంపోజిషన్ )కు చెందిన వారు కాదని మెక్సికన్లలో ప్రాంతీయవారీగా జీవవైవిధ్యం ఉందని తెలియజేస్తున్నాయి. ఇంస్టిట్యూటో నాసినల్ జెనోమికా అధ్యయనాలు యురేపియన్ సంతతికి చెందిన మెస్టిజోలు అధికంగా ఉత్తర భూభాగంలో నివసిస్తున్నారని దక్షిణభూభాగంలో స్థానికజాతుల సంతతికి చెందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మెక్సికో మద్యప్రాంతంలో యురేపియన్, స్థానిక సంతతికి చెందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు నైరుతీ, వెరాక్రజ్ ప్రాంతాలలో నివసిస్తున్నారు.

ప్రాంతాలవారీగా మెస్టిజోలు

యుకాటన్ ద్వీపకల్పంలో మాయాభాషను మాట్లాడే ప్రజలను మెస్టిజోలు అని పేర్కొంటున్నారు. 19వ శతాబ్దంలో యుకాటన్ ప్రాంతంలో చెలరేగిన జాతికలవరంలో వీరు పాల్గొనలేదు. చైపాస్ ప్రాంతంలో మెస్టిజో పదం స్థానంలో " లాడినో " పదం వాడుకలో ఉంది. ఎంసైక్లో పీడియా బ్రిటానికా యురేపియన్ అంచనాల ఆధారంగా సంతతికి చెందిన మెస్టిజోల శాతం 10%-20% ఉంటుందని తెలియజేస్తున్నాయి. అధ్యయనానికి అధ్యయనానికి మద్య మెస్టిజోల సంఖ్య వేరుపడుతూ ఉంది. మెక్సికోలో శ్వేతజాతీయులు కొంతమందిని మెస్టిజోలు అని పేర్కొంటున్నారు. కాలనీ, స్వతంత్రపాలనలో మెక్సికోకు వలసవచ్చిన ప్రజలలో స్పానియన్లు అధికసంఖ్యలో ఉన్నారు.అయినప్పటికీ 19వ - 20వ శతాబ్ధాలలో ఇతర యురేపియన్ల రాక ఆరంభం అయింది.అయినప్పటికీ వీరి సంఖ్య 2%కి మించలేదు.1921 గణాంకాల ఆధారంగా మెక్సికన్ తిరుగుబాటు తరువాత యురేపియనేతర వలసప్రజలలో కొందరిని మెక్సికో వదిలి వెళ్ళాలని వత్తిడి తీసుకురాబడింది. ఉత్తరభూభాగంలో యురేపియన్లు అధికంగా ఉన్నారు.

శ్వేతజాతీయులు

మెక్సికోలోని ఏ రాష్ట్రం లోనూ శ్వేతజాతీయుల సంఖ్య అధికంగా లేదు. ఉత్తర భూభాగంలో ఉన్న రాష్ట్రాలలో మెస్టిజోలు అధికంగా ఉన్నారు. సొనోరా రాష్ట్రంలో మాత్రం మెస్టిజోలకంటే శ్వేతజాతీయులు అధికంగా ఉన్నారు.ఇక్కడ శ్వేతజాతీయులు 41.85%, మెస్టిజోలు 40.38% ఉన్నారు.2015 గణాంకాల ఆధారంగా స్థానికుల మొత్తం సంఖ్య 2,66,94,928. ఇది మిగిలిన ప్రజలకంటే నిదానంగా అభివృద్ధి చెందుతూ ఉంది.

స్థానికప్రజలు

మెక్సికో లోని మద్య, దక్షిణ రాష్ట్రాలలోని గ్రామీణప్రాంతాలలో స్థానిక జాతుల ప్రజలు అధికంగా ఉన్నారు. కొన్ని స్థానిక జాతులకు ఉన్న స్వయంనిర్ణయాధికారంతో వారివారి అంతర్గత వివాదాలు పరిష్కరించుకుంటున్నారు. " నేషనల్ కమీషన్ ఫర్ ది డెవెలెప్మెంటు ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ " ఆధారంగా మెక్సికో లోని స్థానిక ప్రజలలో మాయాప్రజలు అధికంగా యుకాటన్‌లో 59%, క్యుయింటానాలో 39%, కాంపెచెలో 27% ఉన్నారు. ఆక్సికాలో 48% ఉన్నారు. మిక్స్టెక్, జపోటెక్‌కు చెందిన పలు బృందాలలో చియాపాస్‌ 28%, ట్జెల్తల్, ట్జొత్జీ ఉన్నారు. హిడాల్గోలో ఉన్న 24% ప్రజలలో ఒటోమీ ప్రజలు అధికంగా ఉన్నారు. ప్యూబ్లోలో 19%, గుయెర్రెరో 17% ఉన్నారు. వీరిలో నహుయా ప్రజలు అధికంగా ఉన్నారు. శాన్ లూయిస్ పొటోసి, వెరక్రజ్ రాష్ట్రాలలో 15% స్థానిక ప్రజలు ఉన్నారు. వీరిలో అధికంగా టోటోనాక్, నహుయా, టీన్ హుయాస్టెక్ బృందాలు ఉన్నారు. స్థానికప్రజల సాంఘికజీవన స్థితిగతులు జాతీయ సరాసరి కంటే తక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాలలోని స్థానికప్రజలలో శిశుమరణాలు అధికంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో స్థానికేతర ప్రజలకంటే రెండు రెట్లు అధికంగా ఉంది. 6-14 వయసు లోబడిన ప్రజలలో అక్షరాస్యత శాతం 27% మాత్రమే ఉంది. శ్రామికులలో స్థానికప్రజలు అధికంగా ఉన్నారు. అతి చిన్నవయసులో ప్రారంభించి వయసుపైబడిన తరువాత కూడా దీర్ఘకాలం పని కొనసాగిస్తుంటారు. 55% స్థానిక ప్రజలకు కనీసవేతనం కంటే తక్కువ వేతనం అందుకుంటున్నారు.చాలా మంది జీతభత్యరహిత వ్యవసాయపు పనులు చేస్తున్నారు. స్థానిక ప్రజల ఆరోగ్యసంరక్షణ కూడా జాతీయసరాసరి కంటే తక్కువగా ఉంటుంది. వీరి నివాసాల స్థాయి కూడా తక్కువగా ఉంటుంది.

ఆఫ్రో - మెక్సికన్లు

ఆఫ్రో మెక్సికన్ల మొత్తం సంఖ్య 1,381,853. వీరిలో కాలనీశకంలో బానిసలుగా తీసుకురాబడిన వారి సంతతికి చెందిన వారు, సమీపకాలంలో మెక్సికోకు వలస వచ్చిన సబ్ - షరాన్ ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. కాలనీపాలనా కాలంలో బానిసవ్యాపారం చురుకుగా సాగింది. 17వ శతాబ్దంలో మెక్సికోకు దాదాపు 2,00,000 మంది బానిసలు తీసుకుని రాబడ్డారు.మెక్సికన్ తిరుగుబాటు తరువాత మెక్సికన్ గుర్తింపు సమయంలో స్థానికజాతులు, యురేపియన్లు మాత్రమే మెస్టిజోలుగా గుర్తించబడ్డారు. ఇందులో ఆఫ్రికన్ పూర్వీకం కలిగిన ప్రజలను తప్పించారు. తరువాత ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు మెస్టిజోలో (స్థానికజాతులు, యురేపియన్లు), స్థానికజాతి ప్రజలలో మిశ్రితం చేయబడ్డారు. ఈ దీర్ఘకాలచరిత్రకు సాక్ష్యంగా ఆఫ్రో అమెరికన్లు మెస్టిజో, స్థానికజాతుల మద్య వర్ణాంతర వివాహాలు సంభవించాయి. ఫలితంగా 2015 గణాంకాలు 64.9% (8,96,829) ఆఫ్రో - మెక్సికన్లు మెస్టిజోలుగా గుర్తించబడ్డారు. ఆఫ్రో మెక్సికన్ ప్రజలలో 9.3% స్థానిక భాషలను మాట్లాడుతున్నారు. రాష్ట్రవారి గణాంకాల ఆధారంగా గుయర్రెరోలో 65%, ఒయాక్సాకాలో 4.95%, వెరాక్రజ్‌లో 3.28% ఆఫ్రో - మెక్సికన్లు ఉన్నారని తెలియజేస్తున్నాయి. గుయర్రెరో కోస్టా చియా, ఒయాక్సాకా కోస్టా చికా ప్రాంతాలలో ఆఫ్రో - మెక్సికన్ సంస్కృతి బలీయంగా ఉంది.

ఇతర సంప్రదాయాలు

అల్పసంఖ్యాక సంప్రదాయాలకు చెందిన వారిలో ఆసియన్ మెక్సికన్లు (దక్షిణ, తూర్పు ఆసియన్లు) కాలనీశకం నుండి మెక్సికోలో నివసిస్తున్నారు. కాలనీశకంలో చినోలని పిలువబడిన ఆసియన్లు వ్యాపారులుగా, కళాకారులుగా, బానిసలుగా మెక్సికోకు చేరుకున్నారు. వీరిలో ఫిలిప్పీనియన్లు అధికంగా ఉన్నారు.మెక్సికోలో 2,00,000 మంది ఫిలిప్పీన్ మెక్సికన్లు ఫిలిప్పీన్ సంతతికి చెందినవారుగా గుర్తించబడ్డారు. 19వ - 20వ శతాబ్దం నుండి మెక్సికోకు ఆధునిక ఆసియన్ వలసప్రజలు రాక ఆరంభం అయింది. వీరిలో చైనీయులు రెండవస్థానంలో ఉంది. 20వ శతాబ్దం ఆరంభంలో గుర్తించతగిన సంఖ్యలో అరేబియన్ క్రైస్తవులు ఓట్టోమన్ అరాచకపాలన నుండి తప్పించుకుని మెక్సికోకు వలసగా రావడం ప్రారంభం అయింది. వీరిలో లెబనీయులు అధికంగా ఉన్నారు. మెక్సికోలో లెబనాన్ సంతతికి చెందిన వారి సంఖ్య 4,00,000.

భాషలు

స్పానిష్ భాషాప్రజలు అధికంగా నివసిస్తున్న దేశాలలో మెక్సికో ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచంలో స్పానిష్ భాష వాడుకరులలో మూడవభాగం మెక్సికోలో ఉన్నారు. మెక్సికన్లలో 99.3% ప్రజలు స్పానిష్ మాట్లాడగలరు. తరువాత స్థానికభాషా వాడుకరుల శాతం 5.4%, వీటిలో అధికసంఖ్యలో ఉన్న నహుయాత్ల్ భాషావాడుకరుల సంఖ్య 1.45 మిలియన్లు. తరువాత స్థానంలో ఉన్న యుకాతక్ భాషావాడుకరుల సంఖ్య 7,50,000. మెక్సిటెక్ , జపొటెక్ ఒక్కొక భాషకు 4,00,00 మంది వాడుకరులు ఉన్నారు. " ది నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండిజినియస్ లాగ్వేజెస్ " 68 భాషలను, 364 వైవిధ్యమైన స్థానికభాషలను గుర్తించింది. 2003లో స్థానిక భాషా చట్టం ప్రకటించిన సమయంలో స్పానిష్ భాషతో సమానంగా ఈ భాషలకు సమానవిలువ ప్రకటించబడింది. అదనంగా జర్మన్ భాషా వాడుకరులు (మెక్సికోలో వీరిని మెన్నంటెస్ అని అంటార్) 80,000 మంది ఉన్నారు. చిపిలో వెనెటియన్ మాండలికం వాడుకరులు 5,000 మంది ఉన్నారు.అరబిక్ భాష కూడా మెక్సికోలో అధికంగా వాడుకలో ఉంది.

నగర ప్రాంతాలు

Here are the 20 largest urban areas in Mexico.

మతం

Religion in Mexico (2010 census)
Roman Catholicism
  
83%
Other Christian
  
10%
Other Religion
  
0.2%
No religion
  
5%
Unspecified
  
3%

2010 గణాంకాలు " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జాగ్రఫీ) నివేదికల ఆధారంగా రోమన్ కాథలిజం మెక్సికోలో ప్రధాన మతంగాఉంది. 83% ప్రజలు రోమన్ కథలిక్ మతాన్ని అనుసరిస్తున్నారు.10% (1,09,24,103) ఉన్న క్రైస్తవులలో ఎవాంజెలికల్స్ 5%, పెంటెకోస్టల్స్ 1.6%, ఇతర ప్రొటెస్టెంట్లు 0.7%, జెహోవాస్ విట్నెస్ 1.4%, సెవెంత్ డే అడ్వెంటిస్టులు 0.6% , ది చర్చి ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ - డే సెయింట్స్ 0.3% ఉన్నారు. 0.2% (1,72,891) క్రైస్తవేతరులు, నాస్థికులు 4.7% , మతం ప్రత్యేకంగా గుర్తించబడని వారు 2.7% ఉన్నారు.

మెక్సికో 
The Basilica of Our Lady of Guadalupe is a major Christian pilgrimage site, with some twenty million annual visitors.

92,924,489 కాథలిక్కుల సంఖ్యాబలంతో మెక్సికో ప్రపంచంలో కాథలిక్కులు అధికసంఖ్యలో ఉన్న దేశాలలో ద్వితీయస్థానంలో ఉంది.మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది. వీరిలో 47% వారాంతపు చర్చి సేవలలో భాగస్వామ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 12న నిర్వహించబడే అవర్ లేడీ ఆఫ్ గుయాడలుపే, ది పార్టన్ సెయింట్ ఆఫ్ మెక్సికో ఉత్సవాలకు అనేకమంది మెక్సికన్లు మతపరంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.ఇవి దేశ జాతీయ శలవు దినాలుగా గుర్తించబడ్డాయి.2010 గణాంకాల ఆధారంగా " చర్చి ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ - డే సెయింట్స్ " లో 3,14,932 సభ్యులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. 2009 లో చర్చి ఒక మిలియన్ కంటే అధికమైన నమోదుచేయబడిన సభ్యులు ఉన్నారని వెలువరించింది. దాదాపు 25% నమోదైన సభ్యులు వారాంతపు శాక్రిమెంటు సేవలకు హాజరౌతుంటారు.

ఇతర మతాలు

1521 నుండి మెక్సికోకు యూదుల ప్రవేశం ప్రారంభం అయింది.హెమన్ కోర్టెస్ అజ్టెక్స్ మీద విజయం సాధించిన సమయంలో ఆయన వెంట పలువురు కాంవర్సోలు మెక్సికోలో ప్రవేశించారు.2010 గణాంకాలు మెక్సికోలో నివసిస్తున్న యూదుల సంఖ్య 67,476. అని తెలియజేస్తున్నాయి. అరబ్ మెక్సికన్ల చేత ఇస్లాం మతం అనుసరించబడుతుంది." శాన్ క్రిస్టోబల్ డీ లాస్ క్లాస్ " సమీపంలో ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న స్థానిక ప్రజలు స్వల్పసంఖ్యలో ఉన్నారు. 2010లో గణాకాల ఆధారంగా మెక్సికోలో 18,185 తూర్పుప్రాంత మతానుయాయులు ఉన్నారని తెలియజేస్తున్నాయి. వీరిలో స్వల్పసంఖ్యలో బౌద్ధులు కూడా ఉన్నారు.

మహిళలు

20వ శతాబ్దం వరకు మెక్సికో గ్రామీణప్రాంతం ప్రాధాన్యత కలిగిన దేశంగా ఉంది. మహిళల అంతస్తు కుటుంబం, కమ్యూనిటీ వరకు పరిమితమై ఉంది. స్పెయిన్ వారు ఆజ్టెక్ సామ్రాజ్యం స్థాపించిన తరువాత నగరాలు అందించిన సాంఘిక, ఆర్థిక ప్రయోజనాలు గ్రామీణప్రాంతాల వరకూ చేరలేదు.రోమన్ కాథలిజం మెక్సికో మహిళల పాత్రను సరికొత్తగా కన్యమేరీ నమూనాగా తీసుకుని రూపుదిద్దింది. మరియానిజం మహిళలను పురుషస్వామ్య వ్యవస్థలో కుటుంబానికి పరిమితం చేసింది. 20వ శతాబ్దంలో మెక్సికన్ మహిళ చట్టబద్ధంగా, సాంఘికంగా సమానత్వం వైపు గొప్పగా అడుగులు వేసింది. 1953లో మెక్సికన్ మహిళకు ఎన్నికలలో ఓటు వేయడానికి హక్కు లభించింది. మెక్సికన్ మహిళ మెచిస్మో ప్రజల నుండి వివక్ష, హింస ఎదుర్కొన్నది. అయినప్పటికీ మహిళల స్థితి అభివృద్ధి చెందినప్పటికీ కుటుబానికి నాయకత్వం వహించడానికి సంప్రదాయపరమైన అడ్డంకులు ఉన్నాయి.పరిశోధకురాలు మార్గరిటా వాల్డెస్ తన పరిశోధనలో మెక్సికో చట్టపరిధిలో మహిళలపట్ల అసమానత, స్త్రీపురుష వివక్ష ఉన్నాయని వెలువరించింది. మెక్సిక సాంఘిక, సాస్కృతిక విధానాలు మెక్సికన్ మహిళకు కొంత పరిధులు నిర్ణయిస్తున్నాయి.2014 గణాంకాలు ఆధారంగా మహిళలకు వ్యతిరేకంగా గృహాంతర హత్యలలో (హోమీసైడ్) మెక్సికో ప్రపంచంలో 16వ స్థానంలో ఉందని తెలియజేస్తున్నాయి. మహిళలకు వ్యతిరేకంగా ప్రబలిపోతున్న హింసాత్మక చర్యల కారణం వివాహసంబంధాలలో 30% - 60% విభేదాలు తలెత్తుతున్నాయి. హింసకు బలైనవారు అంగవైకల్యానికి గురౌతున్నారు. 1997 అధ్యయనాలు మెక్సికన్ మహిళ పోషణ కొరకు తన జీవితభాగస్వామి మీద ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాయి. మహిళల హత్యకేసులో అధికంగా బాయ్ ఫ్రెండ్, మామగారు, మునుపటి భర్త లేక భర్త ఖైదుచేయబడడం, మరణశిక్ష విధించడం సంభవిస్తున్నాయి.

సంస్కృతి

మెక్సికో 
Frida Kahlo and Diego Rivera in 1932.

మెక్సికన్ సంస్కృతి మీద మెక్సికన్ చారిత్రక ప్రభావం ఉంది. 300 సంవత్సరాల స్పెయిన్ పాలన ప్రభావం మెక్సికన్ సంస్కృతి మీద తీవ్రమైన ప్రభావం చూపింది. సంస్కృతిలో స్థానిక ప్రజల సంస్కృతి, స్పెయిన్ సంస్కృతి మిశ్రితమై ఉంటుంది. ప్రత్యేకంగా ఉన్న విదేశీ సంస్కృతులు మెక్సికన్ సంస్కృతితో సమ్మిశ్రితం అయ్యాయి.19వ శతాబ్దం చివరి భాగం 20వ శతాబ్దం మొదటి దశాబ్ధాలలో మెక్సికోలో ఆర్థికాభివృద్ధి, శాంతి నెలకొన్నాయి.4 దశాబ్ధాల సాంఘిక అశాంతి, అంతర్యుద్ధం తరువాత మెక్సికో ఫిలాసఫీ, కళాలు అభివృద్ధి చెందాయి. అప్పటి నుండి మెక్సికన్ సాంస్కృతిక గుర్తింపు మెస్టిజాజెకు పునాది పడింది. దీనికి అమెరిండియన్ స్థానిక సంస్కృతి మూలాధారంగా ఉంది.

సాహిత్యం

మెక్సికన్ సాహిత్యం మెసొమెరికా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతో ప్రభావితమై ఉంది.హిస్పానిక్ పూర్వపు కాలంనాటి కవి " నెజయుయాత్కోయాట్ల్ " అత్యంత ప్రజాదరణ చూరగొన్నాడు.ఆధునిక మెక్సికన్ సాహిత్యం మెసొమెరికా, స్పెయిన్ కాలనీ ప్రజల జీవనవిధానంతో ప్రభావితమై ఉంది. కాలనీ రచయితలలో జుయాన్ రూయిజ్ డీ అలార్కాన్, జుయానా ఐనెస్ డీ లా క్రజ్ ప్రఖ్యాతి గడించారు.ఇతర రచయితలలో అల్ఫోంసా రేయెస్, జోస్ జొయాక్విన్ ఫెర్నాండెజ్ డీ లిజార్డి, ఇగ్నాషియో మాన్యుయెల్ అల్టామిరానో, కార్లోస్ ఫ్యూయెంటెస్, అక్టావియో పాజ్ (నోబెల్ పురస్కార గ్రహీత), రెనాటో లెడక్, కార్లోస్ మొంసివైస్, ఎలెనా పొనియాటోస్కా, మారియానో అజుయేలా (లాస్ డీ అబాజో), జుయాన్ రుల్ఫో (పెడ్రో పరామో) ప్రధానులు. బర్నో ట్రావెన్ " కనాస్టా డీ కుయెంటోస్ మెక్సికానోస్ " (మెక్సికన్ కథల పేటిక), " ఎల్ టెసొరొ డీ లా సియెరా మాడ్రె " (ట్రెషర్ ఆఫ్ ది సియెరా మాడ్రె) మొదలైన రచలను చేసాడు.

కళలు

మెక్సికో 
The Palacio de Bellas Artes is the preeminent arts museum in Mexico.

మెక్సికో తిరుగుబాటు తరువాత ప్రదర్శితమౌతున్న కళలలో ప్రఖ్యాత కళాకారులు " డేవిడ్ అల్ఫారో సిసిక్విరోస్", ఫెడెరికో కాంటూ గార్జా, ఫ్రిడా కహ్లో, జుయాన్ ఓ'గొర్మాన్, జోస్ క్లెమెంటే ఒరొజ్కొ, డియాగో రివెరా, రుఫినో తమయో ప్రదర్శనలు ప్రజాదరణ చూరగొన్నాయి.ప్రఖ్యాత కళాకారుడు డియాగో రివెరా న్యూయార్క్ నగరంలోని రాక్‌ఫెల్లర్ సెంటర్ వద్ద ఉన్న " మాన్ ఎట్ ది క్రాస్‌రోడ్స్ " చిత్రాన్ని చిత్రీకరించాడు. " మెసోమెరికన్ ఆర్కిటెక్చర్ " ఉపయోగించి పిరమిడ్ పిరమిడ్ నిర్మాణం జరిగిందని కొందరు విశ్వసిస్తున్నారు. .[ఆధారం చూపాలి] కొత్త పరిస్థితుల అవసరాలను అనుసరించి నిరాడంబరమైన, దృఢమైన నిర్మాణకళ అభివృద్ధి చెందింది. ఈ నిర్మాణాలలో స్పెయిన్ నుండి దిగుమతి చేయబడిన బారోక్యూ ఆర్నమెంటేషన్ ఉపయోగించబడింది..[ఆధారం చూపాలి] మెక్సికోలోని న్యూ స్పెయిన్ సెంటర్ వద్ద కొన్ని ప్రఖ్యాత భవనాలు ఈ శైలిలో నిర్మించబడ్డాయి.

చలన చిత్రాలు

మెక్సికో 
Actress Dolores del Río, Hollywood star in the 1920s and 1930s and prominent figure of the Golden Age of Mexican cinema in the 1940s and 1950s.

1940 - 1950 మద్యకాలంలో మెక్సికన్ చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగం కొనసాగింది. మెక్సికన్ చలనచిత్రాలు లాటిన్ అమెరికన్ చిత్రాలకు గొప్ప ఉదాహరణగా నిలిచాయి. మెక్సిక చలనచిత్ర రంగం ఒకప్పుడు హాలీవుడ్ చలనచిత్రరంగంతో పోటీగా నిలిచింది. మెక్సికన్ చలనచిత్రాలు లాటిన్ అమెరికన్ దేశాలన్నింటిలో, ఐరోపా‌లో ప్రదర్శించబడ్డాయి. ఎమిలో ఫెర్నాండెజ్ నిర్మించిన మరియా కాండెలరియా (1943), మొదటిసారిగా " కాన్నెస్ ఫిల్మ్‌ ఫెస్టివల్ " అవార్డు పొందింది.ఇది రెండవ ప్రపంచయుద్ధం తరువాత నిర్మించబడిన మొదటి చలనచిత్ర ఉత్సవం. ప్రముఖ స్పెయిన్ సంతతికి చెందిన ప్రముఖ దర్శకుడు " లూయిస్బుహుయెల్ " 1947 - 1965 మద్య " లాస్ ఒల్విడాడోస్ " (1949), " విరిడియానా " (1961) అద్భుత చిత్రాలతో ప్రాముఖ్యత సాధించాడు.ఈ సమయంలో మరియాఫెలిక్స్, పెడ్రో ఇంఫాంటే, డోలోరెస్ డెల్ రియో,జార్జి నెగ్రెటే, హాస్యనటుడు కాంటిన్‌ఫ్లాస్ వంటి నటీనటులు కీర్తిప్రతిష్ఠలు సాధించారు.

సమీపకాలంలో " లైక్ వాటర్ ఫర్ చాకొలేట్, (కొమొ అగుయా చాకొలేట్) (1992), కొరొనోస్ (1993), వై టూ మమా టంబియన్ (2001) , పాంస్ లాబిరింత్ (2006) మొదలైన చిత్రాలు విశ్వజనీన కథలతో సమకాలీన అంశాలతో చిత్రాలను రూపొందించడంలో విజయం సాధించాయి. ఇవి ప్రఖ్యాత కేంస్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై అంతర్జాతీయంగా గుర్తించబడ్డాయి. మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో గాంజలెజ్(నర్రిటు) దర్శకత్వంలో అమొరెస్ పెర్రోస్, బాబెల్, బిర్ద్మన్, ది రెవెనంత్ (2015) చిత్రాలు; అల్ఫోంసో కుయారన్ దర్శకత్వంలో చిల్డ్రెన్ ఆఫ్ మెన్ హార్రీ పాటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ ది అజ్కబన్, గ్రావిటీ చిత్రాలు;దర్శకులు గుయిల్లెమో డెల్ టొరొ, కార్లోస్ కర్రెరా చిత్రం ఎల్ క్రిమెన్ డెల్ పాడ్రె అంరో; వచనకర్త గుయిలెర్మొ అర్రియాగా , ఛాయాచిత్రకారుడు ఎమ్మాన్యుయేల్ ల్యుబెజ్కి ప్రస్తుత చిత్రరంగ నిపుణులలో ముఖ్యులు.

రామన్ నొవర్రో, డొలోరెస్ డెల్ రియో, ల్యూపె వెలెజ్, గిల్బర్ట్ రోలాండ్, ఆంథోనీ క్యుయిన్, కటీ జ్యురాడో, రికార్డో మాంటల్బన్ , సల్మా హేయక్ మొదలైన కొంతమంది మెక్సికన్ నటీనటులు హాలివుడ్ తారలుగా గుర్తింపు పొందారు.

మాధ్యమం

మెక్సికోలో రెండుప్రధాన టెలువిజన్ కంపెనీలు ఉన్నాయి. అవి ప్రసారం చేస్తున్న 4 ప్రైమరీ నెట్వర్క్ ప్రసారాలు 75% ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. టెలీవిసాకు స్వతమైన ది చానెల్ డీ లాస్ ఎస్ట్రెల్లాస్ ", 5 నెట్వర్కులు ఉన్నాయి. అలాగే టి.వి అజ్టెకకు స్వంతగా అజ్టెకా7, అజ్టెక ట్రెస్ నెట్వర్క్ ఉన్నాయి. టెలివిసా స్పానిష్ ఆధారిత ప్రసారాలను పెద్ద ఎత్తున అందిస్తూ ఉంది. ఇది ప్రపంచంలో అతి పెద్ద స్పెయిన్ మాధ్యమంగా గుర్తించబడుతుంది. గ్రూపొ మల్టీ మీడియా మెక్సికో స్పానిష్ భాషా ప్రసారాలను సమీకృతం చేస్తూ మెక్సికో, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ వరకు ప్రసారాలను విస్తరించింది.అత్యంత సంప్రదాయబద్ధమైన టెలెనోవెలాస్ పలుభాషా ప్రసారాలను అందిస్తుంది.ఇక్కడ నుండి ప్రసారంచేయబడుతున్న వెరొనికా కాస్ట్రో, ల్యూసియా మెండెజ్, తలియా ప్రసారాలకు ప్రంపంచం అంతటా ప్రేక్షకులు ఉన్నారు.

సంగీతం

మెక్సికో 
Mariachi at the Festival del Mariachi, Charrería y Tequila in San Juan de los Lagos, Jalisco. Mariachi was inscribed in the UNESCO Intangible Cultural Heritage List in 2011.

మెక్సికన్ సంఘానికి పలు సంగీత బృందాలు సంగీతాన్ని అందించి ఆనందపరుస్తున్నాయి.ఇవి మెక్సికన్ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సంప్రదాయ సంగీతంలో మరియాచి, బండా సంగీతం, నార్టెనో, రాంచెరా, కొర్రిడో ప్రధానమైనవి. దినసరి సంగీత కార్యక్రమాలలో పాప్, రాక్ సంగీతాలను ఆగ్లం, స్పెయిన్ భాషలలో సంగీతాన్ని అందిస్తుంది. మెక్సికన్ మాధ్యమ పరిశ్రమ లాటిన్ అమెరికా దేశాలలో అతిపెద్ద సంగీత పరిశ్రమగా గుర్తించబడుతుంది. మెక్సికన్ సంగీతకళాకారులు మద్య, దక్షిణ అమెరికా, ఐరోపా (ప్రత్యేకంగా స్పెయిన్) లలో ప్రఖ్యాతి గడించారు.

మెక్సికన్ సంగీతకారులలో తాలియా, లూయిస్ మిగుయెల్, జుయాన్ గబ్రీ, అలెజాండ్రొ ఫెర్నాండెజ్, జూలియేటా వెనెగాస్, గ్లోరియా ట్రెవి, పౌలినా రుబియో ప్రాధాన్యత కలిగి ఉన్నారు. మెక్సికన్ సంప్రదాయ సంగీతకారులలో లీలా డౌంస్, సుసనా హార్ప్, జరమర్, జియో మెనెసెస్, అలెజెంద్రా రోబెల్స్ ప్రాధాన్యత కలిగి ఉన్నారు. ప్రబల సంగీతబృందాలలో కారే టాక్యుబా, కైఫానెస్, మొలోటొవ్, మన ప్రధానమైనవి. 2000 ఆరంభంలో మెక్సికన్ రాక్ దేశనంతా విస్తరించి దేశీయంగా, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందింది. .[ఆధారం చూపాలి]

సిస్టెమా నసియోనల్ డీ ఫొమెంటో మ్యూజికల్ ఫెడరల్ ఏజెంసీ అనుమతితో 120 - 140 యూత్ అర్కెస్ట్రా ఉన్నాయని అభిప్రాయపడుతున్నాడు.[ఆధారం చూపాలి] కొన్ని రాష్ట్రాలకు స్టేట్ ఏజెంసీస్ ఉన్నాయి. ప్రజలందరికీ కళలలో ప్రవేశించి కృషిచేయడానికి అవకాశం లభిస్తుంది. సంగీత కార్యక్రమాలకు మెక్సికో నగరం కేంద్రంగా ఉంది. ఇక్కడ వివిధ ఏజెంసీలకు చెందిన 12 ప్రొఫెషనల్ ఆర్కెస్ట్రా బృందాలు ఉన్నాయి. వీటికి నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ది సెక్రెటరీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ది ఫెడరల్ డిస్ట్రిక్, ది నేషనల్ యూనివర్శిటీ ది నేషనల్ పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్, డెలిగేషియన్ పొలిటికా అండ్ ప్రైవేట్ వెంచర్ సహకరిస్తున్నాయి.[ఆధారం చూపాలి]

ఆహారసంస్కృతి

మెక్సికన్ ఆహారసంస్కృతిలో విస్తారమైన, వైవిధ్యమైన రుచులు, వర్ణభరితమైన అలంకరణ, వివిధ మసాలాలతో సమ్మిళితమై ఉన్నాయి. ప్రస్తుత పలు మెక్సికన్ ఆహారాలు కొలబియన్ కాలానికి ముదుకాలానికి చెందిన అజ్టెక్, మాయా సంస్కృతికి చెందినవి ఉన్నాయి. వీటిలో నోరూరించే స్పెయిన్ కాలనీ ఆహారవిధానాలు కూడా ఉన్నాయి. చివరికి సాహసయాత్రీకులు వారిప్రవేశంతో దిగుమతి చేసిన బియ్యం, గొడ్డుమాంసం, పంది మాంసం, కోడిమాంసం, ద్రాక్షారసం (వైన్), తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు మొదలైన ఆహారపదార్ధాలు కొలంబియన్ ముదుకాలానికి చెందిన మొక్కజొన్న, టొమాటో, వెనిల్లా, అవాకాడో, జామ, బొప్పాయి, అనాస, మిరపకాయలు, చిక్కుళ్ళు, స్క్వాష్, చిలగడదుంప, బఠాణి, టర్కీకోడి మొదలైన ఆహారాలతో కలగలిసాయి.

వైవిధ్యం

మెక్సికన్ ఆహారం ప్రమ్ంతాలవారీగా, వాతావరణ వైవిధ్యం, భౌగోళిక వైవిధ్యం, సంప్రదాయ వైవిధ్యం కారణంగా వేరువేరు విధానాలను కలిగి ఉంటుంది. స్థానికప్రజల ఆహారవిధానాల మీద స్పెయిన్ ప్రజల ఆహారం ప్రభావితం చేసింది. ఉత్తర మెక్సికో బీఫ్, మేకమాంసం, నిప్పుకోడి ఉత్పత్తికి, మాంసాహార ఆహారాలకు ప్రసిద్ధిచెందింది. ప్రత్యేకంగా అర్రాచెరా కట్‌కు ఇది ప్రసిద్ధం.

మద్య మెక్సికో ఆహారం మీద దేశంలోని ఇతరప్రాంతాల ప్రభావం అధికంగా ఉంది. ఇది బార్బకోయా, పొజొలే, మెనుడొ, టమాలెస్, కార్నిటాస్ వంటి రుచికరమైన ఆహారాలకు ఇది ప్రసిద్ధం.

దక్షిణ మెక్సికో మాసాలాలతో కూడిన కోడిమాంసం సంబంధిత ఆహారం, శాకాహారభోజనాలకు ప్రసిద్ధిచెందింది.ఆగ్నేయ మెక్సికో ఆహారం మీద కరీబియన్ ఆహారప్రభావం ఉంది. యుకాటన్ ఆహారాలలో దూడ మాంసం (వీల్), ప్రధానమైంది. [ఆధారం చూపాలి]. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, పసిఫిక్ మహాసముద్ర తీర రాష్ట్రాలలో సముద్ర ఆహారాల ప్రభావం చూపుతున్నాయి. వెరాక్రజానా రాష్ట్రం చేపలతో చేసే ఆహారాలకు ప్రసిద్ధి.

ఆధునిక కాలంలో మెక్సికోలో అంతర్జాతీయవైవిధ్యం కలిగిన ఆహారాలు లభిస్తున్నాయి. వీటికి మెక్సికన్ ఆహారశైలి కలగలిపి సరికొత్త ఆహారాలు తయారుచేయబడుతున్నాయి. ఉదాహరణగా సుషి ఆహారం మామిడి, చింతపండు సాస్‌లను కలగలిపి వడ్డించబడుతుంది. దీనికి తరచుగా సెర్రానో మిరపకాయలు నూరి సోయాసాస్ కలిపి చేసిన సాస్‌తో వినిగర్, హబనెరొ, చిపోటిల్ పెప్పర్స్ చేర్చి వడ్డించబడుతుంది.

అంతర్జాతీయగుర్తింపు పొందిన ఆహారాలు

అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెక్సికన్ ఆహారాలలో చాక్‌లెట్, టాకోలు, క్యుసడిల్లాస్, ఎంచిలాడాస్, బర్రీటో, టమెలోస్, మోలే ఆహారాలు ప్రధానమైనవి. ప్రాంతాలవారీగా ప్యూబ్లా ప్రాంతం ఆహారాలలో మోలే, చిలెస్ ఎన్ నొగాడా, చలూపా; మాంటెర్రీ ప్రాంతంలో కబ్రిటో, మచాకా ఆహారాలు; యుకాటన్ ప్రాంతంలో కొచినిటా పిబిల్, ఆక్సాకా ప్రాంతంలో ట్లయుడా; బార్బకొయా, చిలాక్విలెస్, మిలానెసా ఇతర పలు ఆహారాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి.

క్రీడలు

మెక్సికో నగరం " 1968 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. లాటిన్ అమెరికా దేశాలలో ఈక్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా మెక్సికో గుర్తించబడుతుంది. అలాగే మెక్సికో " ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ " క్రీడలకు రెండుమార్లు (1970-1986) ఆతిథ్యం ఇచ్చింది. మెక్సికోలో అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందుతూ ఉంది.19వ శతాబ్ధం చివరలో కోమిష్ గనికార్మికులు ఫుట్‌బాల్ క్రీడను మెక్సికోలో ప్రవేశపెట్టారని విశ్వసిస్తున్నారు.1902 నాటికిఫైవ్ బ్రిటిష్ ప్రభావంతో ఫైవ్ - టీం లీగ్ రూపొందించబడింది. మెక్సికోలో " క్లబ్ అమెరికా " (12 చాంపియన్ షిప్పులు సాధించింది), క్లబ్ డిపోర్టివొ గుయాడలజరా (11 చాంపియన్ షిప్పులు సాధించింది) , డిపోర్టివో టొలుకా ఎఫ్.సి.ఐ టొలుకా " (చాంపియన్ షిప్పులు సాధించింది) వంటి క్రీడా క్లబ్బులు ఉన్నతస్థితిలో ఉన్నాయి. అంటోనియో కార్బజాల్ 5 వరల్డ్ కప్ క్రీడలలో పాల్గొన్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 20వ శతాబ్ధపు బెస్ట్ కాంకాకాఫ్ క్రీడాకారుడుగా " హుగో శాంచెజ్ "ను ఐ.ఎఫ్.ఎఫ్.హెచ్.ఎస్. గుర్తించింది.

మెక్సికో 
Game at the Estadio de Béisbol Monterrey. Baseball is most popular in the North (particularly Northwest) and Southeast of Mexico.

బేస్‌బాల్

మెక్సికన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ లీగ్ పేరు " లిగా మెక్సికానా డీ బెయిసిబోల్ ". ఇది యునైటెడ్ స్టేట్స్, కరీబియన్ దేశాలు , జపాన్ దేశాలంత శక్తివంతమైన టీం కానప్పటికీ బేస్‌బాల్ టీం పలు అంతర్జాతీయ బేస్‌బాల్ టైటిల్స్ సాధించింది.[ఆధారం చూపాలి] మెక్సికన్ టీంలు 9 మార్లు కరీబియన్ సిరీస్ సాధించింది. మెక్సికోలో ప్రధాన లీగ్ టీంలలో సంతకం చేసిన పలువురు క్రీడాకారులు ఉన్నారు. మెక్సికోలో ప్రఖ్యాతిగాంచిన బేస్‌బాల్ క్రీడాకారులలో డాడ్జర్ పిచర్ " ఫెర్నాండో వలెంజుయేలా " ఒకరు.

బాస్కెట్ బాల్

2013లో మెక్సికో బాస్కెట్ బాల్ టీం " అమెరికా బాస్కెట్ బాల్ చాంపియంషిప్ " సాధించి 2014 బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ క్రీడలలో పాల్గొనడానికి అర్హత సాధించి ప్లేఆఫ్ వరకు చేరుకుంది. ఈ సాధనల కారణంగా మెక్సికో " 2015 ఎఫ్.ఐ.బి.ఎ. అమెరికా చాంపియంషిప్ " క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అర్హత సాధించింది.

బుల్ ఫైటింగ్

మెక్సికోలో బుల్‌ఫైటింగ్ క్రీడకు ప్రాబల్యత అధికంగా ఉంది. దేశంలోని దాదాపు పెద్ద నగరాలన్నింటిలో బుల్ రింగులు ఉన్నాయి. మెక్సికో నగరంలో ఉన్న " ప్లాజా మెక్సికో " ప్రపంచంలో అతి పెద్ద బుల్‌రింగ్‌గా గుర్తించబడుతుంది.ఇక్కడ 55,000 మంది ప్రజలు క్రీడలను వీక్షించడానికి అవకాశం ఉంది.

బాక్సింగ్

మెక్సికో ప్రొఫెషనల్ బాక్సింగ్ " అంతర్జాతీయ శక్తిగా అభివృద్ధి చెందింది. మెక్సికో అమెచ్యూర్ స్థాయి నుండి మెక్సికో పలు ఒలింపిక్స్ పతకాలు సాధించింది. విచెంటే సాల్డివర్, రూబెన్ ఆలివర్స్, సాల్వృడర్ శాంచెజ్, జూలియో సీజర్ చావెజ్, రికార్డో లోపెజ్ నావా, ఎరిక్ మోరల్స్ మొదలైన మెక్సికో బాక్సింగ్ క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులుగా అంతర్జాతీయ ఖ్యాతి వహించారు.

అథ్లెట్స్

మెక్సికో అథ్లెట్లలో గోల్ఫ్ క్రీడాకారుడు లోరేనా ఆర్చొయా రిటైర్మెంటుకు ముందు ఎల్.పి.గి.ఎ.లో ప్రథమస్థానం సాధించాడు. ఆనా గుయేవరా గతంలో 400 మీ పోటీలో ప్రపంచ చాంపియన్ షిప్, 2004 ఒలింపిక్స్ (అథెంస్) సబ్ చాంపియన్ షిప్ సాధించాడు. ఫెర్నాండో ప్లేటాస్ 4 మార్లు ఒలింపిక్ మెడల్స్ సాంధించాడు. టిక్వోండో ఫైటర్ మరియా ఎస్పినోజా మెక్సికన్ మహిళాక్రీడాకారిణిగా ఖ్యాతిగడించింది.

బయటి లింకులు

ఇవి కూడ చూడండి

46 హెస్టియా

మూలాలు

Tags:

మెక్సికో చరిత్రమెక్సికో భౌగోళికంమెక్సికో వాతావరణంమెక్సికో పర్యావరణ వైవిద్యంమెక్సికో ఆర్ధికరంగంమెక్సికో సమాచార రంగంమెక్సికో ఆయిల్ , విద్యుత్తుమెక్సికో సైన్స్ , టెక్నాలజీమెక్సికో పర్యాటకంమెక్సికో రవాణాసౌకర్యాలుమెక్సికో నీటిసరఫరా , మురుగునీటి వసతిమెక్సికో గణాంకాలుమెక్సికో సంస్కృతిమెక్సికో బయటి లింకులుమెక్సికో ఇవి కూడ చూడండిమెక్సికో మూలాలుమెక్సికోఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఉత్తర అమెరికాగౌతమాలాపసిఫిక్ మహాసముద్రంప్రపంచముబెలిజె

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రవణ కుమారుడుసావిత్రిబాయి ఫూలేచెప్పవే చిరుగాలిరామావతారమురాకేష్ మాస్టర్అశోకుడుహార్దిక్ పాండ్యాయోనిచిలుకూరు బాలాజీ దేవాలయంమహాభారతంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాద్వారకా తిరుమలకుక్కతెలంగాణా బీసీ కులాల జాబితాకోల్‌కతా నైట్‌రైడర్స్దశదిశలుథామస్ జెఫర్సన్ఎనుముల రేవంత్ రెడ్డిమొఘల్ సామ్రాజ్యంనువ్వు నేనుసీతా రామంవిశ్వబ్రాహ్మణప్రేమలుజాషువాఆరుద్ర నక్షత్రముఆదిత్య హృదయంకార్తెభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమిథాలి రాజ్అశ్వని నక్షత్రమునందమూరి బాలకృష్ణఇండియన్ ప్రీమియర్ లీగ్శ్రీరామరాజ్యం (సినిమా)సూరిగాడుగరుత్మంతుడుగర్భంభారతీయ స్టేట్ బ్యాంకుప్రకటనచతుర్వేదాలుచెక్ (2021 సినిమా)పెళ్ళిఊరు పేరు భైరవకోననయన తారభారత రాష్ట్రపతిఓంతాటివిశ్వామిత్రుడుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఇజ్రాయిల్ఔరంగజేబురమణ మహర్షిగ్రామ పంచాయతీగోదావరిరమ్యకృష్ణజ్యేష్ట నక్షత్రంభారతదేశంలో మహిళలుమురుడేశ్వర ఆలయంకరక్కాయపాలపిట్టH (అక్షరం)సామెతల జాబితాభరతుడు (కురువంశం)నందమూరి తారక రామారావువంగవీటి రంగావ్యవసాయంమీనాభారత ప్రభుత్వంకన్యాదానంసప్తర్షులుసంధ్యావందనంజై శ్రీరామ్ (2013 సినిమా)రాశి (నటి)సినిమాత్రిష కృష్ణన్దానంసోరియాసిస్అన్నమయ్యదీపావళి🡆 More