వీరిలో స్త్రీనితల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హృదయంలో అని మనం అందరం తెలుసుకోవాలి .
పంచమాతలు
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !
రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త), కన్న తల్లి - వీరిని పంచమాతలుగా భావించవలెను అని కుమార శతకము నుండి పద్యము.
శంకర సూక్తి
ఆది శంకరుని దృష్టిలో తల్లి : "కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి" 'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.
తల్లిని బట్టి పిల్ల, విత్తునుబట్టి పంట, నూలును బట్టి గుడ్డ
తల్లి పాలు దూడ చెబుతుంది
తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట
తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్టదిక్కులేదు
తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
తల్లి పెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా?
తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది)
తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు
తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
తల్లిలేని పిల్ల, ఉల్లిలేని కూర
తల్లి విషం, పెళ్ళాం బెల్లం
తల్లి లేని పిల్లలు, అల్లులేని తీగలు
తల్లిలేని పిల్ల, దయ్యాలపాలు
తల్లీబిడ్డా ఒకటైనా, నోరూ కడుపూ వేరు
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు
This article uses material from the Wikipedia తెలుగు article అమ్మ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.