2023

1975 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

2023 నూతన సంవత్సరం ఆదివారంతో ప్రారంభం అవుతుంది. 2023 అనేది 3వ సహస్రాబ్ది, 21వ శతాబ్దపు 23వ సంవత్సరం. 2020 దశాబ్దపు సంవత్సరం.

సంఘటనలు

  • జనవరి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మహబూబాబాద్, కొత్తగూడెం పట్టణాలలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయాలు ప్రారంభించబడ్డాయి.
  • జనవరి 25: 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మందికి (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలు ప్రకటించబడ్డాయి.
  • ఫిబ్రవరి 1: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
  • ఫిబ్రవరి 3: తెలంగాణ శాసనసభ బడ్జెట్ (2023-24) సమావేశాలు ప్రారంభమై, ఫిబ్రవరి 12 వరకు కొనసాగాయి.
  • ఫిబ్రవరి 6: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
  • ఫిబ్రవరి 6 - ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 41,000 మందికి పైగా మరణించారు. 120,000 మందికిపైగా గాయపడ్డారు.
  • ఫిబ్రవరి 9: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌ హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌, లుంబినీ పార్క్‌ సమీపంలో ప్రారంభించబడింది.
  • ఫిబ్రవరి 11: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్‌ ఎరిక్‌ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమీ నిలిచారు.
  • ఫిబ్రవరి 15: కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి చేయడంకోసం 600 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.
  • ఫిబ్రవరి 24: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో బయో ఏషియా సదస్సు-2023 ప్రారంభమై, ఫిబ్రవరి 26న ముగిసింది.
  • ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.
  • ఏప్రిల్ 30: హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు.
  • మే 10: కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు ప్రకటించగా, 224 నియోజకవర్గాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 136 చోట్ల గెలుపొందింది. మే 20న కర్నాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశాడు.
  • జూన్ 2: ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 294 మంది మరణించారు. 1,175 మంది గాయపడ్డారు.
  • జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడి, జూన్ 22న ముగిసాయి.
  • జూన్ 4: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిర్మల్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నాగర్‌కర్నూల్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 6: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర: రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సన్ ప్రాంతంలోని నోవా కఖోవ్కా ఆనకట్ట ధ్వంసమైంది, ఈ ప్రాంతాన్ని వినాశకరమైన వరదలతో ముప్పుతిప్పలు పెట్టింది.
  • జూన్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మంచిర్యాల పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 11: మార్చిలో తైవాన్‌తో సంబంధాలను తెంచుకున్న తర్వాత హోండురాస్ తన మొదటి రాయబార కార్యాలయాన్ని చైనాలోని బీజింగ్‌లో ప్రారంభించింది.
  • జూన్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా గద్వాల పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూన్ 13: నైజీరియాలోని క్వారా స్టేట్‌లోని నైజర్ నదిపై పెళ్లి పడవ బోల్తా పడడంతో కనీసం 106 మంది మరణించారు.
  • జూన్ 14: స్పెర్మ్ లేదా గుడ్డు కణాల అవసరం లేకుండా స్టెమ్ సెల్స్ నుండి మొదటి కృత్రిమ మానవ పిండాన్ని సృష్టించినట్లు శాస్త్రవేత్తలు నివేదించారు.
  • జూన్ 14: పెలోపొన్నీస్ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 82 మంది మరణించారు, 500 గల్లంతయ్యారు.
  • జూన్ 16: ఉగాండాలో, జిహాదిస్ట్ గ్రూప్ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మ్పాండ్వేలోని ఒక పాఠశాలలో 42 మందిని చంపింది.
  • జూన్ 18: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడు: టైటానిక్ శిథిలాలను అన్వేషిస్తున్న లోతైన సముద్ర జలాంతర్గామి అయిన టైటాన్‌లోని ఐదుగురు సిబ్బంది, ఓడ విపత్తు పేలుడు కారణంగా మరణించారు.
  • జూన్ 20: హోండురాస్‌లోని తెగుసిగల్పా సమీపంలోని మహిళా జైలులో MS-13, బార్రియో 18 ముఠా సభ్యుల మధ్య జరిగిన అల్లర్లలో కనీసం 46 మంది మరణించారు.
  • జూన్ 21: అట్లాంటిక్‌లోని స్పానిష్ కానరీ దీవుల తీరంలో వలస డింగీ మునిగిపోవడంతో కనీసం 35 మంది మరణించారు.
  • జూన్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.
  • జూన్ 23: ఉక్రెయిన్‌పై రష్యా దాడి: యెవ్జెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నెర్ గ్రూప్, రష్యా సైన్యంతో సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించిన శాంతి ఒప్పందం తర్వాత, మరుసటి రోజు ఉపసంహరించుకునే ముందు రోస్టోవ్-ఆన్-డాన్ నగరాన్ని, వొరోనెజ్ ఒబ్లాస్ట్‌లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది.
  • జూన్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆసిఫాబాద్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • జూలై 20: 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 1గ్లోబల్ వార్మింగ్: ప్రపంచ మహాసముద్రాలు 2016లో మునుపటి రికార్డును అధిగమించి 20.96 °C యొక్క కొత్త రికార్డు అత్యధిక ఉష్ణోగ్రతను చేరుకున్నాయి. జూలై కూడా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు గణనీయమైన మార్జిన్‌తో నమోదు చేయబడిన అత్యంత వేడి నెలగా నిర్ధారించబడింది ( 0.3 °C).
  • ఆగస్టు 4: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై, ఆగస్టు 6న ముగిసాయి.
  • ఆగస్టు 20: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సూర్యాపేట పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • ఆగస్టు 23: భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.
  • ఆగస్టు 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మెదక్ పట్టణంలో కలెక్టరేట్‌ నూతన భవన (సమీకృత జిల్లా కార్యాలయాల) సముదాయం ప్రారంభించబడింది.
  • డిసెంబరు: తెలంగాణ శాసనసభ ఎన్నికలు

మరణాలు

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రియా రెడ్డిముక్కుదేవుడుజామమహావీర్ జయంతిసౌర కుటుంబంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపంచభూతాలుసింగిరెడ్డి నారాయణరెడ్డిసమంతకులంతెలుగు అక్షరాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅమర్ సింగ్ చంకీలాఏప్రిల్ 21బుధుడు (జ్యోతిషం)రావణుడుదశావతారములురామప్ప దేవాలయంశ్రీదేవి (నటి)కోట శ్రీనివాసరావువిష్ణువు వేయి నామములు- 1-1000లలితా సహస్ర నామములు- 801-900అష్టకష్టాలురఘురామ కృష్ణంరాజుసాయిపల్లవిసరోజినీ నాయుడుతెలంగాణ గవర్నర్ల జాబితాఆర్యవైశ్య కుల జాబితాహారతిసప్తర్షులులలితా సహస్ర నామములు- 901-1000సన్ రైజర్స్ హైదరాబాద్జై శ్రీరామ్ (2013 సినిమా)తులారాశితంతిరంరాయలసీమషర్మిలారెడ్డిజాతీయములుశాంతిస్వరూప్పవన్ కళ్యాణ్లలితా సహస్ర నామములు- 401-500కర్కాటకరాశిశాతవాహనులుశ్రీ కృష్ణుడుమదర్ థెరీసాశ్రీ కృష్ణదేవ రాయలుసోరియాసిస్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశాసనసభ సభ్యుడుటెలివిజన్మెదడు వాపుపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)విష్ణువుపూర్వాషాఢ నక్షత్రమునిజాంపూర్వాభాద్ర నక్షత్రముపాడేరు శాసనసభ నియోజకవర్గంద్వారకా తిరుమలపూరీ జగన్నాథ్గుణింతంఅరటినెల్లూరుభాగ్యచక్రంభీమా (2024 సినిమా)అశ్వత్థామపూజా హెగ్డేచిరంజీవులుబౌద్ధ మతంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తెలుగుసెక్యులరిజంకజకస్తాన్మనుస్మృతివిరాట పర్వము ప్రథమాశ్వాసముభగవద్గీత🡆 More